Wednesday, November 13, 2019

శ్రీ వెంకయ్యనాయుడి గారి ఈ చిరు వ్యాసం ,భాషాభారతికి బహుచక్కని బహుమానం... :)

Vinay Kumar Aitha
53 mins
శ్రీయుతమై సకల శ్రేయోదాయకమై వర్ధిల్లే మాతృభాషా ప్రాముఖ్యతనూ, ప్రాభవాన్ని, ఎంతో పరిణతి గల పదసంపదతో పొందుపరిచిన భారత ఉపరాష్ట్రపతి, భారతదేశ రాజకీయ ప్రస్థానంలో మచ్చలేని మాన్యులైన నేతల్లో ఒకరైన రాజనీతిజ్ఞ్యులుగా, అనర్గళ వక్తగా, దేశభక్తి మెండుగా గల భరతమాతబిడ్డడిగా, 'సెక్యులరిజం' అనే భావజాలాన్ని సరైన రీతిలో సమన్వయపరచగల సాధికారవ్యక్తిత్వసంపన్నులుగా పేర్గాంచిన
గౌ|| శ్రీ వెంకయ్యనాయుడి గారి
ఈ చిరు వ్యాసం నిజంగా
కడు రమణీయం.....
బహుభంగిమల సందేశాత్మకం.....
భాషాభారతికి బహుచక్కని బహుమానం ఈ భవ్యభావనాత్మకమైన భాషాభావజాల ఉల్లేఖనం.....🙏😊👏
TWITTER.COM
“తెలుగు మాధ్యమంలో విద్యాబోధన అవసరం, దాని గొప్పదనంపై *'అందరికోసం అమ్మభాష'* పేరిట ఇవాళ్టి ఈనాడు దినపత్రికలో ప్రచు....

శ్రీచాగంటి సద్గురుదంపతులకు పల్లకీఉత్సవానంతరం జీవనసాఫల్య పురస్కారం, "ధార్మికవరేణ్య" బిరుదుప్రదానం మరియు స్వర్ణకంకణాలంకరణ on Nov-03-2019 :)....

శ్రీచాగంటి సద్గురుదంపతులకు,
శ్రీ వికారి కార్తీక శుద్ధసప్తమి భానువాసర సాయంసంధ్యానంతరం జరిగిన పల్లకీఉత్సవానంతరం జీవనసాఫల్య పురస్కారం, "ధార్మికవరేణ్య" బిరుదుప్రదానం మరియు స్వర్ణకంకణాలంకరణ.....
ఇది 2019-నవంబర్-03 నాడు నాంపల్లి
తెలుగు లలితకళాతోరణంలో ఆస్తికులెల్లరికి అమితమైన ఆనందాన్ని ప్రసాదించిన ఆధ్యాత్మిక కార్యక్రమం......😊
ఈ కార్యక్రమానికి ముఖ్య ఆహ్వానితులుగా విచ్చేసి మరింత ప్రత్యేకతను జోడించిన
మాన్యులైన ఆధ్యాత్మికవేత్తలు, ఆధ్యాత్మిక వక్తలు, ఐ.ఏ.ఎస్ ఆఫిసర్స్, రాష్ట్ర ఆర్ధికశాఖామాత్యులు,
(
శ్రీ జొన్నవిత్తుల గారు,
శ్రీ కే.వి. రమణాచారి గారు,
శ్రీ ఎల్.వి. సుబ్రహ్మణ్యం గారు,
శ్రీ వరప్రసాద్ రెడ్డి గారు,
శ్రీ హరీష్ రావ్ గారు,
.
.
......)
ఇత్యాది గా విచ్చేసిన ఎందరో ప్రముఖులతో / మరియు ఇతర పెద్దలతో అక్కడికి తరలివచ్చిన ఆధ్యాత్మిక జిజ్ఞ్యాసులెల్లరికి కార్క్యక్రమం ఆసాంతం కన్నులపండువగా కొనసాగింది..... 😊
బాహ్యార్ధంలో పైన చెప్పిన విధంగా అది సద్గురువులకు గౌరవవందనావిష్కరణగా జరిగిన ఒక ఆధ్యాత్మిక కార్యక్రమం......
ఆ బిరుదులను, సత్కారాలను గురువుగారు మరునాడు సంధ్యవార్చే సమయంలో వారి అర్ఘ్యపాత్రలోని గంగలో నీటిబిందువులలా భావించి వాటిని ఈశ్వరార్పణం గావించి యథావిధిగా వారి ప్రవచనాప్రస్థానంలో సాగిపోతుంటారు అనేది అందరికి విదితమైన సత్యమే....
కాని అక్కడికి విచ్చేసిన వారి శిష్యపరమాణువులందరికి కూడా అది ఎంతో ఘనమైన ఉత్సవం.......
ఇంకా చెప్పాలంటే అది వారి శిష్యబృందానికి జరిగిన సత్కారమే...! 😁
ఒక మేఘం తనలో దాచుకున్న జలసిరిని అందరిపై వర్షించి వెళ్ళడం ఆ మేఘం యొక్క గొప్పతనమే..... కాని ఎవరి మీద ఆ ఆకాశ గంగ వర్షించబడిందో వారందరికి అది ఉత్సవమే కద.....
ఒక మల్లె చెట్టో, విరజాజి చెట్టో, విరబూసిన విరులపరిమళాలతో హరితధవళసమ్మిళితవర్ణరంజితమై శోభిల్లే సమయంలో అటుగా నడిచి వెళ్తున్నవారందరికి అది ఆహ్లాదం అయాచితంగానే పంచుతుంది......
వారి కళ్ళు ఆ సుమసిరిని చూసి ఆనందించడం, ఆ విరుల పరిమళాలను వారి ముక్కు ఆఘ్రానించడం, తద్వార ఆ వ్యక్తి ఆనందించడం అనేది ఏ ఒక్క వ్యక్తికోసమో కాకుండా అటుగా వెళ్తున్నవారందరికి అయాచితంగనే లభించే సౌభాగ్యం.....
ఎవరో ఒకరు చూసి ఆఘ్రానించినంత మాత్రాన వాటి వైభవం తగ్గడం లేదా ఎవరో చూడనంత మాత్రాన వాటి వైభవం పెరగడం అనేది అక్కడ అన్వయం కాని విషయం.....
విరబూసి పరిమళాలను వెదజల్లడం
ఆ లత యొక్క స్వాభావికమైన సాత్విక లక్షణం.....
వాటిని స్వీకరించి ఆనందించడం అనేది సదరు వ్యక్తి యొక్క స్వాభావికమైన సాత్విక లక్షణం.....
ఇక్కడ గమనించవలసిన ముఖ్యమైన విషయం ఒకటుంది.....
" ఆనందించడం " అనే ప్రక్రియకు కారణం చూస్తున్న వ్యక్తికి సంబంధించినదా...?
లేదా
చూడబడుతున్న లతకు సంబంధించినదా...?
అని అడిగితే,
ఆ ఇరువురికి అనుసంధానకర్తగా వ్యవహరించిన చైతన్య శక్తిసంఘాతానికి సంబంధించినది అని సమాధానం చెప్పవలసి ఉంటుంది.....
ఆ చెట్టు యొక్క మూలము నుండి ఆ లత విరబూసిన కుసుమకేసరాలపర్యంతం వ్యాపించిన
ప్రకృతియొక్క అదే చైతన్య శక్తి,
ఆ వ్యక్తి శరీరరంలో ఆపాదతలమస్తకం కొలువైఉండి తన యొక్క నయనఘ్రాణేంద్రియాలను ఆధారంగా చేసుకొని తన మనసు ద్వార ప్రకటితమై, అక్కడ వ్యాప్తిగావించబడి ఉన్న ఆ చైతన్య శక్తితో అనుసంధానం అవ్వడంతో " ఆనందించడం " అనే ప్రక్రియకు కారణం అయ్యింది కద.....
అంటే ఇక్కడి,
కర్త కు ( విరబూసిన లత, దరిచేరిన వ్యక్తి),
క్రియ కు ( లత విరబూయడం, వ్యక్తి తిలకించి ఆఘ్రాణించడం ),
కర్మ కు ( వెల్లివిరిసిన ఆనందం ),
మూల కారణం అత్యంత ఉన్నత స్థాయిలో వాటిలో అంతర్లీనంగా పరివ్యాప్తమై ఉండి ప్రకటితమవుతున్న ఆ ప్రకృతి యొక్క చైతన్య శక్తియే...!
ఈ సత్యాన్ని గుర్తించ గలిగిన వారికి మరియు ఇతరులకు, భేదం కేవలం వారి యొక్క దృక్కోణం మరియు దృక్పథమే......!
( అంటే అటుగా ఒక 50 మంది వరకు నడిచి వెళ్ళుండొచ్చు......కాని కేవలం 5గురు మాత్రమే ఆ లత విరబూసిన సుమసిరి వైపుగా తమ చింతనను కొనసాగించి పైన చెప్పిన విధంగా " ఆనందం " అనే ప్రక్రియకు సాక్షి గా తమను తాము
నిలుపుకున్నారు.....)
అచ్చం ఇదే విధంగా "ఆధ్యాత్మిక అమృతరసాస్వాదన" అనే ఆనంద ప్రక్రియ ఒక సద్గురువు యొక్క వాగ్సుమాలకు, వాటిని శ్రవణేంద్రియంతో పూర్తి జాగరూకతతో మనస్పూర్తిగా తనలోకి స్వీకరించిన సదరు శిష్యుడి ఆధ్యాత్మిక తృష్ణకు సంబంధించినది....!
ఒక్కరి కోసం మాత్రమే అని ప్రత్యేకంగా మేఘం వర్షించలేదు......
ఒక్కరి కోసం మాత్రమే అని మల్లే తీగ విరబూయలేదు....
మేఘం నాకోసమే వర్షించింది అని భావించి ఆనందించడంలోనే ప్రతి ఒక్కరికి వారి వారి వ్యక్తిగతమైన ఆనందం దాగుంటుంది.....
మల్లే తీగ నాకోసమే విరబూసిందని భావించి ఆనందించడంలోనే ప్రతి ఒక్కరికి వారి వారి వ్యక్తిగతమైన ఆనందం దాగుంటుంది.....
అట్లే, ఒక సద్గురువుల బోధామృతం కూడా నాకోసమే అనుగ్రహించబడింది అని భావించి ఆనందించడంలోనే ప్రతి ఒక్కరికి వారి వారి వ్యక్తిగతమైన ఆధ్యాత్మిక ఉన్నతి / ఆనందం దాగుంటుంది.....
మేఘం వేరెవరికోసమో వర్షించిందని భావించడం, మల్లే తీగ వేరెవరికోసమో విరబూసిందని భావించడం, మన యొక్క భావబేలతనానికి ప్రతీకే అవుతుంది తప్ప, విజ్ఞ్యానం అనిపించుకోదు.....
అట్లే ఒక సద్గురువులచే నుడువబడిన అధ్యాత్మబోధామృతము వేరెవరికోసమో అనుగ్రహించబడింది అని భావించడం మన
భావబేలతనానికి ప్రతీకే అవుతుంది తప్ప, సుజ్ఞ్యానం అనిపించుకోదు..... అది మన స్వోద్ధరణ కోసమే అని భావించి స్వీకరించి తరించడంలోనే ప్రజ్ఞ్యానం దాగుంటుంది......!!
సద్గురువాక్కుల ప్రతి అనుగ్రహ బిందువును ఒడిసిపట్టి వాటిని మన దైనందిన జీవితానికి అపాదించుకొని అన్వయించుకొని అంతర్వివేచన కొనసాగించిన నాడు అవి మనలోనే ఒక అవ్యాజమైన అవ్యక్తమైన అనిర్వచనీయమైన అగోచరమైన అతీంద్రియమైన ఆధ్యాత్మిక అమృతరసాన్ని ప్రభవింపజేసి మన జీవితాన్ని శాశ్వత ఆనందానికి ఆవాసంగా గావించి జీవనసాఫల్యత అనే అమృతఫలాన్ని అనుగ్రహఫలంగా అందిస్తాయి...!
అలా కాకుండా కేవలం వినడమో లేదా కేవలం వింటే సరిపోతుందనుకోవడమో అనే ధోరణిలో ఆధ్యాత్మికతను ఆలకించిననాడు అది ఇవ్వగల సంపూర్ణ ఆనందానికి చాలా దూరంలోనే ఉండిపోతాం....
ఎలా అంటే, ఒక తేనేటీగ ఎన్నో వేల పువ్వులనుండి మకరందాన్ని స్వీకరిస్తుంది ( పువ్వుకు ఏమాత్రం ఇబ్బంది కలగని రీతిలో అది మకరందం స్వీకరించే శైలిలోనే ఒక శిష్యుడు కూడా తేనేటీగ లా మారి సద్గురువుల పాదపద్మములకు ప్రణమిల్లి, వారికి ఏమాత్రం ఇబ్బంది కలగని రీతిలో ఆధ్యాత్మిక అనుగ్రహన్ని స్వీకరించగలగాలి.....)
చాల మందికి తెలియని విషయం ఏంటంటే పువ్వు లో నుండి స్వీకరించబడిన మకరందం మనం షాప్లో కొనుక్కొని తాగే తేనె లా తియ్యగా ఉండదు.... అది చేదు వగరు రుచుల మిశ్రమమైన ఒక విధమైన ఆంలము ( అసిడిక్ ) గా ఉంటుంది.....
మనుష్యులకు రుచించని రీతిలో ఉండే ఆ మకరందాన్ని తియ్యని మధువుగా మార్చే కళ కేవలం ఆ తేనేటీగకు మాత్రమే కలదు.....అన్యులకు అది అసాధ్యం......అందుకే ఇంత ఆధునిక యుగంలోకి వచ్చినాసరే, ఆకాశంలోకి రయ్యిన ఎగిరి చంద్రుడితో పాటుగా పక్క గ్రహాలపైకి కూడ వెళ్ళి ఆవాసాలు ఏర్పాటుచేసుకునేందుకు కావలసిన నీటివనరులు ఉన్నాయో లేదో కనుక్కునేంతగా రాకెట్ సైన్స్ అభివృద్ధి చెందిందేమో కాని పక్కనే ఉన్న చెట్టు పై ఉన్న పూలనుండి డైరెక్ట్ గా తేనేను పిండుకొని తాగే టెక్నాలజి కనిపెట్టడం మానవులకు సాధ్యపడలేదు.
ఏపియరీస్ లో అత్యాధునిక హనీబీ / హనీ కోంబ్ మ్యానేజ్మెంట్ టెక్నిక్స్ తో అధిక తేనెరాబడి తేగలిగేవరకు మాత్రమే వెళ్ళగలిగారు..... )
అచ్చం ఇదేవిధంగా, కొన్ని వందల వేల గ్రంథాల్లోని సారస్వతాన్ని తమలోకి ఆకళింపుచేకున్న సద్గురువులు దేశకాలానుగుణంగా నుడివే సద్వక్కులద్వార మనం గ్రహించే అధ్యాత్మవస్తువిషయసామాగ్రి అనే సారస్వత మకరందం, సురుచిర అధ్యాత్మమధువుగా మారడం అనేది సదరు శిష్యుడి స్మరణ మనన నిధిధ్యాసనములు అనే కళపై ఆధారపడి, సాటిలేని భగవత్తత్వ రసామృతంగా పరిణమించి పరిఢవిల్లేది.....
లౌకిక మకరందాన్ని తియ్యని తేనేగా మార్చిన తేనెటీగను ఏమార్చి అది మరెవ్వరైనా స్వీకరించగలరేమో.....పైగా తాగిన కొద్ది తరిగిపోయేది ఈ కమ్మని లౌకిక మధువు......
కాని అధ్యాత్మమధువు అలాకాకుండా, అది సమకూర్చుకున్నవారు కరుణించి పంచితేనే ఇతరులకు అందేది......
పైగా పంచే కొద్ది పెరిగేదే కాని ఎన్నటికి తరగనిది ఈ కడుచక్కనైన అలౌకిక అధ్యాత్మమధువు.....
ఒక చెట్టుపై పెద్ద పెద్ద తేనెపట్ట్లు తేనెతో నిండుగాఉన్నప్పుడు అహా ఎంత తేనె ఉందో లోపల, కొద్ది సేపు ఈ తేనెటీగలన్నీ వెళ్ళిపోతే మొత్తం పిండుకొని తాగేయొచ్చు అని అనుకుంటాం కద...... శ్రీచాగంటి సద్గురువుల శ్రీమద్రామాయణంలో హనుమ సీతమ్మ జాడను కనుక్కొని లంకనుండి ఉత్తరంగా నింగికెగసి భారతదక్షిణతీరానికి వస్తూ
" దృష్ట్వా సీతా....." అని తియ్యని కబురు తీసుకువచ్చినందుకు సుగ్రీవుడు సంతసించి తన ఉద్యానవనంలోని తేనెపట్లనుండి హాయిగా తేనె తాగి అక్కడి పళ్ళను ఆగరించి విందు చేసుకోండని చెప్పగా వానరసైన్యం బాగ తేనెతాగి మత్తెక్కి అక్కడే నిద్రపోయినట్టుగా.....
( ఇంజనీరింగ్ రోజుల్లో మెదక్ నర్సాపూర్ లోని మా బీ.వీ.ఆర్.ఐ.టి కాలేజ్ కి రోజూ ప్రయాణించే దారిలో గుమ్మడిదల గ్రామం దాటిన తర్వాత ఒక 20 నిమిషాలపాటు మెదక్ రిసర్వ్ ఫారెస్ట్ రేంజ్ లోని దట్టమైన అటవీప్రాతంలో ఉండే పెద్ద పెద్ద చెట్లపై అలాంటి తేనెపట్లను చూసినప్పుడల్లా నాకు
" దార్లో ఉన్న లంబాడి తండాల్లో ( కొండాపూర్ స్టాప్లో ) బస్సు కొంచెం సేపు ఏదో రిపేర్ వచ్చి ఆగిపోతే బావుణ్ణు.....హాయిగా ఎదైనా చెట్లపై తేనెటీగలు లేని వాటిలో ఉన్న తేనెని పిండుకొని తీస్కెళ్ళొచ్చు......" అని అనుకునే వాణ్ణి.....😁 )
అలాంటి అధ్యాత్మమధువును తమలో నిక్షిప్తంచేసుకున్న ఆస్తికులైన ఎందరో పెద్దల, ధర్మప్రచారకుల, అధ్యాత్మ తత్వచింతనాపరుల, సమక్షంలో శ్రీ చాగంటి సద్గురువులకు, శ్రీశంకరభగవద్పాదుల వారి అనుగ్రహంగా అవిచ్ఛిన్న గురుపరంపరాగతంగా ప్రపంచానికి ధర్మబోధను అందించే శృంగేరి పీఠస్థిత శ్రీ శారదా చంద్రమౌళీశ్వర ఆరాధకులైన జగద్గురువుల అనుగ్రహాశీర్వచనంగా జరిగిన పల్లకీ సేవలో గురుదంపతులు ఆసీనులైన పల్లకిని వహించి జన్మనుతరింపజేసుకోవడం, ఆ తదనంతరం వారికి ప్రసాదించబడిన " ధార్మికవరేణ్య " బిరుదుప్రదానం మరియు స్వర్ణకంకణాలంకృతులైన సద్గురువులను దర్శించి తరించడం జీవితంలో ఎన్నటికి తరగని అధ్యాత్మ అమృతానందరసపానభరిత మధురజ్ఞ్యాపకాల మధువును గ్రోలి ఇంటితిరిగిరావడం ఒక అవ్యక్తమైన చిరకాల పులకాంకిత మధురస్మృతి..... 😊
శ్రీగురుభ్యో నమః.....
నమో నమః....... శ్రీగురుపాదుకాభ్యాం.....🙏🙏🙏🙏🙏

" మతంగ పర్వతము మాల్యవంతము నడుమ " keertana audio is available at annamayyaanandalahari.webly.com ...

YouTube lo normal ga search chaystay dorakani konni rare Annamaachaarya keertanalu ee krindi page lo download ki andubaaTulo unnai.....😊
Annamaachaaryulu tama sankeertanalloa
" VenkaTa " anea vaari mudranu saadhaaranamgaa chivari paadamloa vestaaru.....Kaani ee krindi Sankeertanaloa Sree kaaram toa kalipi 4 saarlu vacchealaa rachinchaDam vishesham....
😊
483.mataMga parvatamu mAlyavaMtamu - మతంగ పర్వతము మాల్యవంతము నడుమ
మతంగ పర్వతము మాల్యవంతము నడుమ
సతమై శ్రీవేంకటేశ్వరుడున్నవాడు
కొలిచినవారకెల్లా కోరినవరములిచ్చి
తలచినవారినెల్లా ధన్యులజేసి
పొలుపుమిగుల మంచి పువ్వులతోటలనీడ
విలసిల్లీనదివో శ్రీవేంకటేశ్వరుడు
శరణన్నవారికి చనవిచ్చి రక్షించి
గరిమ పూజించువారి కరుణ జూచి
పరిపూర్ణమగు తుంగభద్రాతటామునందు
విరివిగొన్నాడు శ్రీవేంకటేశ్వరుడు
తనునమ్మినవారికి తగినసంపదలిచ్చి
కనినుతించేవారికి కామధేనువై
కనకమయములైన ఘనమైనమేడలలో
వినుతికెక్కెను శ్రీవేంకటేశ్వరుడు
About This Website
SVANANDABHATTAR.WEEBLY.COM
annamayyaanadalahari.weebly.com

శ్రీనివాస్ సార్ ( ఇంజనీరింగ్లో మెఫా ( Managerial Economics and Financial Analysis - MEFA ) సబ్కెక్ట్ ఫాకల్టి ) .. :)

శ్రీనివాస్ సార్ అని మాకు ఇంజనీరింగ్లో మెఫా ( Managerial Economics and Financial Analysis - MEFA ) అనే సబ్కెక్ట్ కి ఫాకల్టి గా వచ్చేవారు....
ఈ వీడియోలో ఉన్న పెద్దాయన ఎవరో కాని అచ్చం మా సార్ లాంటి వాగ్ధాటి, వాక్యనిర్మాణచాతుర్యం, హాస్యం, అన్నిటినీ రంగరించి రచించే సంభాషణాసరళితో సాగే వారి డిస్కషన్, అనాటి మా బి.వి.అర్.ఐ.టి కాలేజ్ డేస్ ని గుర్తుకుతెప్పించింది....😊
మెఫా సార్ క్లాస్లోకి వస్తునారనగానే క్లాస్లో నవ్వుల నదీనదములు ఉప్పొంగేవి.....
సుద్దముక్క అందుకొని ఆ సార్ రాయడం మొదలుపెట్టారంటే గ్రీన్ కలర్లో ఉండే గ్లాస్ కోటెడ్ బోర్డ్ మొత్తం ఆ సార్ యొక్క మాటలకంటే కూడా స్పీడుగా నిండిపోయి గోడలపైకి కూడా అక్షరాలు చక చకా సన్నజాజి మల్లేతీగలా పాకి పెద్ద పెద్ద అక్షరాలతో నిండిపోయేవి...!!!
ఇంజనీరింగ్ మొత్తం అన్ని సెంస్ లో ఉండే సబ్జెక్ట్లలోకెల్లా అత్యంత బోరింగ్ సబ్జెక్ట్ ఏంటి అని అడిగితే ఎవ్వరైనా సరే mefa అని ఇట్టేచెప్పేస్తారు.....
కాని ఆ సార్ ఎంత కామెడిగా క్లాస్ ని మరియు సబ్జెక్ట్ ని హ్యాండిల్ చేసేవారంటే, సింపుల్ గా చెప్పాలంటే సిని హాస్యనటులు బ్రహ్మానందంగారిలా ఉండేది వారి అనుపమాన బోధనాశైలి......
పుస్తకం అందుకొని మా సార్ మాట్లాడడం మొదలు పెట్టారంటే కుంభకర్ణుడు కూడా లేచి కూర్చుని వినవలసిందే...!! 😁
నిర్దేశిత సమయం అయ్యాక బయట డోర్ దెగ్గర నెక్స్ట్ క్లాస్ చెప్పవలసిన ఫాకల్టి వచ్చి వేట్ చేస్తున్నాకూడా,
బోర్డుపై రాస్తూనే ఒక్క సెకండ్ వారి వైపు చూసి
" అయిపొవచ్చిందండి....ఎంత....జస్ట్ 5 మినెట్స్ అంతే...ప్లీజ్..... "
అని చెప్పి అలా మాట్లాడుతూ రాస్తూనే ఉండే వారు బోర్డుపై.....!!
విచిత్రం ఏంటంటే అంత స్పీడుగానే విద్యార్ధులందరు కూడా వారి వారి నోట్బుక్లో రాస్కుంటున్నారనుకొని వెంటనే
టైప్రైటర్లో ఒకలైన్ టైప్ చేయగానే ఎంటర్ కొట్టి ఆ పరికరాన్ని ఒక హ్యాండిల్ తో మళ్ళీ
ఎడమవైపుకి ఫాస్ట్ గా లాగి టైప్ చేయడం మొదలుపెట్టినట్టుగా...
మా సార్ కూడా మరో చేతిలో పట్టుకున్న డస్టర్ తో బోర్డ్ ని క్షణాల్లో క్లీంచేసి మళ్ళీ రాయాడం మొదలు పెట్టేవారు......😅
స్లోగారాసే కొందరు తలెత్తి బోర్డ్ వైపు చూడగానే స్క్రీన్ రిఫ్రెష్ ఐనట్టు వేరే కంటెంట్ ఉండడం చూసి ఖంగుతినేవారు......
" సార్....అదేంటి సార్....! మేము ఇంకా రాయకముందే క్లీన్ చేసేసారు......" అని అనడం.....
అలా క్లాస్ మొత్తం కూడా ఒక కామెడి మూవి లాగ ఉండేది...!!!
ఒక 15 నిమిషాల నుండి ఆ బయట నిల్చొని ఉన్న నెక్స్ట్ క్లాస్ ఫ్యాకల్టి సర్ ఉండబట్టలేక
" సార్....మేము కూడా క్లాస్ చెప్పాలి కద.....ఇంకెంతసేపండి...."
అంటూ ఒకింత అసహనంతో అంటున్నాసరే.....
మా సార్ మాత్రం మళ్ళి
"అయిపొవచ్చిందండి....ఎంత....జస్ట్ 5 మినెట్స్ అంతే...ప్లీజ్..... " అనే
వారి డైలాగ్ రిపీట్ చేయడంతో ఘొల్లున అందరు పగలబడి నవ్వేవారు....!!! 😂
కొందరైతే " మా క్లాస్ కూడా ఇంక మీరే చెప్పుకోండి......ఇంక మేము వెళ్తున్నాం....." అని అనడంతో......
" ఓహ్ ఇస్ ఇట్......సరే సరే......వచ్చేస్తున్న......"
అని చెప్పి.....
" బోర్డ్ మాత్రం ఒక 10 నిమిషాలు అలా ఉండనివ్వండి.....పాపం పిల్లలు స్లోగా రాస్కుంటున్నారు...."
అని అనేసి మా సార్ వెళ్ళేటప్పుడు అవతలి ఫ్యాకల్టి వారు ఇచ్చే ఎక్ష్ప్రెషన్ కి అసలు మా నవ్వులకు అంతనేదే లేకపోయేది.......!! 🤣
చూడ్డానికి ఆ సార్ అలా చాలా కామెడి పర్సన్ లా ఉంటారు కాని, సబ్జెకట్ పై వారికున్న పట్టు అసాధారణం...! అత్యంత క్లిష్టమైన అర్థశాస్త్ర ఆంతరాళను సైతం అరచేతిలో అరటిపండులా ఒలిచిపెట్టగల దిట్ట వారు...!
మాట గట్టిగా ఉన్నా సరే వారి మనసు మాత్రం వెన్నపూస......
మెఫ ఇంటర్నల్ ఎగ్సాంస్ లో అసలు మా క్లాస్లో ఎవ్వరికికూడా 15/20 కి తగ్గవు.... క్లాస్లో కామెడి చేస్తూనే సైగలతో మొత్తం రాబోయే కొశ్చెన్ పేపర్ గురించి డిస్కస్ చేసేవారి వారి శైలి అద్భుతం....😊
ఒక్కోసారి కొందరు....
"అదేంటి సార్ అంత ఉదారంగా అన్నీ ప్రశ్నలు ముందుగానే చెప్పకనే చెప్పేస్తున్నారు...." అని అంటే....
ఎక్స్టర్నల్లో ఈ సబ్జెక్ట్లో బాగా మార్కులు రావాలంటే ఎలాగో వాళ్ళు చాలా కష్టపడాలి....కనీసం ఇంటర్నల్స్ లోనైనా బాగా సాధించాం అనే సంతోషం వారికి,
సాధింపజేసాననే తృప్తి నాకు ఉంటాయి కదండి.... " అని చెప్పే మా మెఫ సార్ విద్యార్ధులందరికి కలకాలం గుర్తుండిపోయే ఫ్యాకల్టిలో ఒకరు...!! 😊
P. S
క్రింద ఉన్న వీడియో లో చర్చించబడిన అంశాలకు గాని, అందు వ్యక్తపరచబడిన భావాలకు గాని, రాజకీయ సంబంధమైన విషయాలకు గాని, మరియు నాకు / నా ఈ పోస్ట్ కి ఎటువంటి సంబంధంలేదు......
ఏదో కాకతాళీయంగా సర్ఫ్ చేస్తుంటే దొరికిన వీడియో అని చదువరులకు నా మనవి .....😊
About This Website
YOUTUBE.COM
ఆర్టీసీ సమ్మె వెనుకాల సంచలన నిజాలు || CA Nagarjuna Reddy about TSRTC Employees Strike