శ్రీచాగంటి సద్గురుదంపతులకు,
శ్రీ వికారి కార్తీక శుద్ధసప్తమి భానువాసర సాయంసంధ్యానంతరం జరిగిన పల్లకీఉత్సవానంతరం జీవనసాఫల్య పురస్కారం, "ధార్మికవరేణ్య" బిరుదుప్రదానం మరియు స్వర్ణకంకణాలంకరణ.....
శ్రీ వికారి కార్తీక శుద్ధసప్తమి భానువాసర సాయంసంధ్యానంతరం జరిగిన పల్లకీఉత్సవానంతరం జీవనసాఫల్య పురస్కారం, "ధార్మికవరేణ్య" బిరుదుప్రదానం మరియు స్వర్ణకంకణాలంకరణ.....
ఇది 2019-నవంబర్-03 నాడు నాంపల్లి
తెలుగు లలితకళాతోరణంలో ఆస్తికులెల్లరికి అమితమైన ఆనందాన్ని ప్రసాదించిన ఆధ్యాత్మిక కార్యక్రమం......😊
తెలుగు లలితకళాతోరణంలో ఆస్తికులెల్లరికి అమితమైన ఆనందాన్ని ప్రసాదించిన ఆధ్యాత్మిక కార్యక్రమం......😊
ఈ కార్యక్రమానికి ముఖ్య ఆహ్వానితులుగా విచ్చేసి మరింత ప్రత్యేకతను జోడించిన
మాన్యులైన ఆధ్యాత్మికవేత్తలు, ఆధ్యాత్మిక వక్తలు, ఐ.ఏ.ఎస్ ఆఫిసర్స్, రాష్ట్ర ఆర్ధికశాఖామాత్యులు,
(
శ్రీ జొన్నవిత్తుల గారు,
శ్రీ కే.వి. రమణాచారి గారు,
శ్రీ ఎల్.వి. సుబ్రహ్మణ్యం గారు,
శ్రీ వరప్రసాద్ రెడ్డి గారు,
శ్రీ హరీష్ రావ్ గారు,
.
.
......)
(
శ్రీ జొన్నవిత్తుల గారు,
శ్రీ కే.వి. రమణాచారి గారు,
శ్రీ ఎల్.వి. సుబ్రహ్మణ్యం గారు,
శ్రీ వరప్రసాద్ రెడ్డి గారు,
శ్రీ హరీష్ రావ్ గారు,
.
.
......)
ఇత్యాది గా విచ్చేసిన ఎందరో ప్రముఖులతో / మరియు ఇతర పెద్దలతో అక్కడికి తరలివచ్చిన ఆధ్యాత్మిక జిజ్ఞ్యాసులెల్లరికి కార్క్యక్రమం ఆసాంతం కన్నులపండువగా కొనసాగింది..... 😊
బాహ్యార్ధంలో పైన చెప్పిన విధంగా అది సద్గురువులకు గౌరవవందనావిష్కరణగా జరిగిన ఒక ఆధ్యాత్మిక కార్యక్రమం......
ఆ బిరుదులను, సత్కారాలను గురువుగారు మరునాడు సంధ్యవార్చే సమయంలో వారి అర్ఘ్యపాత్రలోని గంగలో నీటిబిందువులలా భావించి వాటిని ఈశ్వరార్పణం గావించి యథావిధిగా వారి ప్రవచనాప్రస్థానంలో సాగిపోతుంటారు అనేది అందరికి విదితమైన సత్యమే....

కాని అక్కడికి విచ్చేసిన వారి శిష్యపరమాణువులందరికి కూడా అది ఎంతో ఘనమైన ఉత్సవం.......
ఇంకా చెప్పాలంటే అది వారి శిష్యబృందానికి జరిగిన సత్కారమే...! 😁
ఒక మేఘం తనలో దాచుకున్న జలసిరిని అందరిపై వర్షించి వెళ్ళడం ఆ మేఘం యొక్క గొప్పతనమే..... కాని ఎవరి మీద ఆ ఆకాశ గంగ వర్షించబడిందో వారందరికి అది ఉత్సవమే కద.....
ఒక మల్లె చెట్టో, విరజాజి చెట్టో, విరబూసిన విరులపరిమళాలతో హరితధవళసమ్మిళితవర్ణరంజితమై శోభిల్లే సమయంలో అటుగా నడిచి వెళ్తున్నవారందరికి అది ఆహ్లాదం అయాచితంగానే పంచుతుంది......
వారి కళ్ళు ఆ సుమసిరిని చూసి ఆనందించడం, ఆ విరుల పరిమళాలను వారి ముక్కు ఆఘ్రానించడం, తద్వార ఆ వ్యక్తి ఆనందించడం అనేది ఏ ఒక్క వ్యక్తికోసమో కాకుండా అటుగా వెళ్తున్నవారందరికి అయాచితంగనే లభించే సౌభాగ్యం.....
ఎవరో ఒకరు చూసి ఆఘ్రానించినంత మాత్రాన వాటి వైభవం తగ్గడం లేదా ఎవరో చూడనంత మాత్రాన వాటి వైభవం పెరగడం అనేది అక్కడ అన్వయం కాని విషయం.....
విరబూసి పరిమళాలను వెదజల్లడం
ఆ లత యొక్క స్వాభావికమైన సాత్విక లక్షణం.....
ఆ లత యొక్క స్వాభావికమైన సాత్విక లక్షణం.....
వాటిని స్వీకరించి ఆనందించడం అనేది సదరు వ్యక్తి యొక్క స్వాభావికమైన సాత్విక లక్షణం.....
ఇక్కడ గమనించవలసిన ముఖ్యమైన విషయం ఒకటుంది.....
" ఆనందించడం " అనే ప్రక్రియకు కారణం చూస్తున్న వ్యక్తికి సంబంధించినదా...?
లేదా
చూడబడుతున్న లతకు సంబంధించినదా...?
అని అడిగితే,
ఆ ఇరువురికి అనుసంధానకర్తగా వ్యవహరించిన చైతన్య శక్తిసంఘాతానికి సంబంధించినది అని సమాధానం చెప్పవలసి ఉంటుంది.....
ఆ ఇరువురికి అనుసంధానకర్తగా వ్యవహరించిన చైతన్య శక్తిసంఘాతానికి సంబంధించినది అని సమాధానం చెప్పవలసి ఉంటుంది.....
ఆ చెట్టు యొక్క మూలము నుండి ఆ లత విరబూసిన కుసుమకేసరాలపర్యంతం వ్యాపించిన
ప్రకృతియొక్క అదే చైతన్య శక్తి,
ప్రకృతియొక్క అదే చైతన్య శక్తి,
ఆ వ్యక్తి శరీరరంలో ఆపాదతలమస్తకం కొలువైఉండి తన యొక్క నయనఘ్రాణేంద్రియాలను ఆధారంగా చేసుకొని తన మనసు ద్వార ప్రకటితమై, అక్కడ వ్యాప్తిగావించబడి ఉన్న ఆ చైతన్య శక్తితో అనుసంధానం అవ్వడంతో " ఆనందించడం " అనే ప్రక్రియకు కారణం అయ్యింది కద.....
అంటే ఇక్కడి,
కర్త కు ( విరబూసిన లత, దరిచేరిన వ్యక్తి),
క్రియ కు ( లత విరబూయడం, వ్యక్తి తిలకించి ఆఘ్రాణించడం ),
కర్మ కు ( వెల్లివిరిసిన ఆనందం ),
మూల కారణం అత్యంత ఉన్నత స్థాయిలో వాటిలో అంతర్లీనంగా పరివ్యాప్తమై ఉండి ప్రకటితమవుతున్న ఆ ప్రకృతి యొక్క చైతన్య శక్తియే...!
ఈ సత్యాన్ని గుర్తించ గలిగిన వారికి మరియు ఇతరులకు, భేదం కేవలం వారి యొక్క దృక్కోణం మరియు దృక్పథమే......!
( అంటే అటుగా ఒక 50 మంది వరకు నడిచి వెళ్ళుండొచ్చు......కాని కేవలం 5గురు మాత్రమే ఆ లత విరబూసిన సుమసిరి వైపుగా తమ చింతనను కొనసాగించి పైన చెప్పిన విధంగా " ఆనందం " అనే ప్రక్రియకు సాక్షి గా తమను తాము
నిలుపుకున్నారు.....)
నిలుపుకున్నారు.....)
అచ్చం ఇదే విధంగా "ఆధ్యాత్మిక అమృతరసాస్వాదన" అనే ఆనంద ప్రక్రియ ఒక సద్గురువు యొక్క వాగ్సుమాలకు, వాటిని శ్రవణేంద్రియంతో పూర్తి జాగరూకతతో మనస్పూర్తిగా తనలోకి స్వీకరించిన సదరు శిష్యుడి ఆధ్యాత్మిక తృష్ణకు సంబంధించినది....!
ఒక్కరి కోసం మాత్రమే అని ప్రత్యేకంగా మేఘం వర్షించలేదు......
ఒక్కరి కోసం మాత్రమే అని మల్లే తీగ విరబూయలేదు....
మేఘం నాకోసమే వర్షించింది అని భావించి ఆనందించడంలోనే ప్రతి ఒక్కరికి వారి వారి వ్యక్తిగతమైన ఆనందం దాగుంటుంది.....
మల్లే తీగ నాకోసమే విరబూసిందని భావించి ఆనందించడంలోనే ప్రతి ఒక్కరికి వారి వారి వ్యక్తిగతమైన ఆనందం దాగుంటుంది.....
అట్లే, ఒక సద్గురువుల బోధామృతం కూడా నాకోసమే అనుగ్రహించబడింది అని భావించి ఆనందించడంలోనే ప్రతి ఒక్కరికి వారి వారి వ్యక్తిగతమైన ఆధ్యాత్మిక ఉన్నతి / ఆనందం దాగుంటుంది.....
మేఘం వేరెవరికోసమో వర్షించిందని భావించడం, మల్లే తీగ వేరెవరికోసమో విరబూసిందని భావించడం, మన యొక్క భావబేలతనానికి ప్రతీకే అవుతుంది తప్ప, విజ్ఞ్యానం అనిపించుకోదు.....
అట్లే ఒక సద్గురువులచే నుడువబడిన అధ్యాత్మబోధామృతము వేరెవరికోసమో అనుగ్రహించబడింది అని భావించడం మన
భావబేలతనానికి ప్రతీకే అవుతుంది తప్ప, సుజ్ఞ్యానం అనిపించుకోదు..... అది మన స్వోద్ధరణ కోసమే అని భావించి స్వీకరించి తరించడంలోనే ప్రజ్ఞ్యానం దాగుంటుంది......!!
భావబేలతనానికి ప్రతీకే అవుతుంది తప్ప, సుజ్ఞ్యానం అనిపించుకోదు..... అది మన స్వోద్ధరణ కోసమే అని భావించి స్వీకరించి తరించడంలోనే ప్రజ్ఞ్యానం దాగుంటుంది......!!
సద్గురువాక్కుల ప్రతి అనుగ్రహ బిందువును ఒడిసిపట్టి వాటిని మన దైనందిన జీవితానికి అపాదించుకొని అన్వయించుకొని అంతర్వివేచన కొనసాగించిన నాడు అవి మనలోనే ఒక అవ్యాజమైన అవ్యక్తమైన అనిర్వచనీయమైన అగోచరమైన అతీంద్రియమైన ఆధ్యాత్మిక అమృతరసాన్ని ప్రభవింపజేసి మన జీవితాన్ని శాశ్వత ఆనందానికి ఆవాసంగా గావించి జీవనసాఫల్యత అనే అమృతఫలాన్ని అనుగ్రహఫలంగా అందిస్తాయి...!
అలా కాకుండా కేవలం వినడమో లేదా కేవలం వింటే సరిపోతుందనుకోవడమో అనే ధోరణిలో ఆధ్యాత్మికతను ఆలకించిననాడు అది ఇవ్వగల సంపూర్ణ ఆనందానికి చాలా దూరంలోనే ఉండిపోతాం....
ఎలా అంటే, ఒక తేనేటీగ ఎన్నో వేల పువ్వులనుండి మకరందాన్ని స్వీకరిస్తుంది ( పువ్వుకు ఏమాత్రం ఇబ్బంది కలగని రీతిలో అది మకరందం స్వీకరించే శైలిలోనే ఒక శిష్యుడు కూడా తేనేటీగ లా మారి సద్గురువుల పాదపద్మములకు ప్రణమిల్లి, వారికి ఏమాత్రం ఇబ్బంది కలగని రీతిలో ఆధ్యాత్మిక అనుగ్రహన్ని స్వీకరించగలగాలి.....)
చాల మందికి తెలియని విషయం ఏంటంటే పువ్వు లో నుండి స్వీకరించబడిన మకరందం మనం షాప్లో కొనుక్కొని తాగే తేనె లా తియ్యగా ఉండదు.... అది చేదు వగరు రుచుల మిశ్రమమైన ఒక విధమైన ఆంలము ( అసిడిక్ ) గా ఉంటుంది.....
మనుష్యులకు రుచించని రీతిలో ఉండే ఆ మకరందాన్ని తియ్యని మధువుగా మార్చే కళ కేవలం ఆ తేనేటీగకు మాత్రమే కలదు.....అన్యులకు అది అసాధ్యం......అందుకే ఇంత ఆధునిక యుగంలోకి వచ్చినాసరే, ఆకాశంలోకి రయ్యిన ఎగిరి చంద్రుడితో పాటుగా పక్క గ్రహాలపైకి కూడ వెళ్ళి ఆవాసాలు ఏర్పాటుచేసుకునేందుకు కావలసిన నీటివనరులు ఉన్నాయో లేదో కనుక్కునేంతగా రాకెట్ సైన్స్ అభివృద్ధి చెందిందేమో కాని పక్కనే ఉన్న చెట్టు పై ఉన్న పూలనుండి డైరెక్ట్ గా తేనేను పిండుకొని తాగే టెక్నాలజి కనిపెట్టడం మానవులకు సాధ్యపడలేదు.

ఏపియరీస్ లో అత్యాధునిక హనీబీ / హనీ కోంబ్ మ్యానేజ్మెంట్ టెక్నిక్స్ తో అధిక తేనెరాబడి తేగలిగేవరకు మాత్రమే వెళ్ళగలిగారు..... )
అచ్చం ఇదేవిధంగా, కొన్ని వందల వేల గ్రంథాల్లోని సారస్వతాన్ని తమలోకి ఆకళింపుచేకున్న సద్గురువులు దేశకాలానుగుణంగా నుడివే సద్వక్కులద్వార మనం గ్రహించే అధ్యాత్మవస్తువిషయసామాగ్రి అనే సారస్వత మకరందం, సురుచిర అధ్యాత్మమధువుగా మారడం అనేది సదరు శిష్యుడి స్మరణ మనన నిధిధ్యాసనములు అనే కళపై ఆధారపడి, సాటిలేని భగవత్తత్వ రసామృతంగా పరిణమించి పరిఢవిల్లేది.....
లౌకిక మకరందాన్ని తియ్యని తేనేగా మార్చిన తేనెటీగను ఏమార్చి అది మరెవ్వరైనా స్వీకరించగలరేమో.....పైగా తాగిన కొద్ది తరిగిపోయేది ఈ కమ్మని లౌకిక మధువు......
కాని అధ్యాత్మమధువు అలాకాకుండా, అది సమకూర్చుకున్నవారు కరుణించి పంచితేనే ఇతరులకు అందేది......
పైగా పంచే కొద్ది పెరిగేదే కాని ఎన్నటికి తరగనిది ఈ కడుచక్కనైన అలౌకిక అధ్యాత్మమధువు.....
పైగా పంచే కొద్ది పెరిగేదే కాని ఎన్నటికి తరగనిది ఈ కడుచక్కనైన అలౌకిక అధ్యాత్మమధువు.....
ఒక చెట్టుపై పెద్ద పెద్ద తేనెపట్ట్లు తేనెతో నిండుగాఉన్నప్పుడు అహా ఎంత తేనె ఉందో లోపల, కొద్ది సేపు ఈ తేనెటీగలన్నీ వెళ్ళిపోతే మొత్తం పిండుకొని తాగేయొచ్చు అని అనుకుంటాం కద...... శ్రీచాగంటి సద్గురువుల శ్రీమద్రామాయణంలో హనుమ సీతమ్మ జాడను కనుక్కొని లంకనుండి ఉత్తరంగా నింగికెగసి భారతదక్షిణతీరానికి వస్తూ
" దృష్ట్వా సీతా....." అని తియ్యని కబురు తీసుకువచ్చినందుకు సుగ్రీవుడు సంతసించి తన ఉద్యానవనంలోని తేనెపట్లనుండి హాయిగా తేనె తాగి అక్కడి పళ్ళను ఆగరించి విందు చేసుకోండని చెప్పగా వానరసైన్యం బాగ తేనెతాగి మత్తెక్కి అక్కడే నిద్రపోయినట్టుగా.....

( ఇంజనీరింగ్ రోజుల్లో మెదక్ నర్సాపూర్ లోని మా బీ.వీ.ఆర్.ఐ.టి కాలేజ్ కి రోజూ ప్రయాణించే దారిలో గుమ్మడిదల గ్రామం దాటిన తర్వాత ఒక 20 నిమిషాలపాటు మెదక్ రిసర్వ్ ఫారెస్ట్ రేంజ్ లోని దట్టమైన అటవీప్రాతంలో ఉండే పెద్ద పెద్ద చెట్లపై అలాంటి తేనెపట్లను చూసినప్పుడల్లా నాకు
" దార్లో ఉన్న లంబాడి తండాల్లో ( కొండాపూర్ స్టాప్లో ) బస్సు కొంచెం సేపు ఏదో రిపేర్ వచ్చి ఆగిపోతే బావుణ్ణు.....హాయిగా ఎదైనా చెట్లపై తేనెటీగలు లేని వాటిలో ఉన్న తేనెని పిండుకొని తీస్కెళ్ళొచ్చు......" అని అనుకునే వాణ్ణి.....😁 )

అలాంటి అధ్యాత్మమధువును తమలో నిక్షిప్తంచేసుకున్న ఆస్తికులైన ఎందరో పెద్దల, ధర్మప్రచారకుల, అధ్యాత్మ తత్వచింతనాపరుల, సమక్షంలో శ్రీ చాగంటి సద్గురువులకు, శ్రీశంకరభగవద్పాదుల వారి అనుగ్రహంగా అవిచ్ఛిన్న గురుపరంపరాగతంగా ప్రపంచానికి ధర్మబోధను అందించే శృంగేరి పీఠస్థిత శ్రీ శారదా చంద్రమౌళీశ్వర ఆరాధకులైన జగద్గురువుల అనుగ్రహాశీర్వచనంగా జరిగిన పల్లకీ సేవలో గురుదంపతులు ఆసీనులైన పల్లకిని వహించి జన్మనుతరింపజేసుకోవడం, ఆ తదనంతరం వారికి ప్రసాదించబడిన " ధార్మికవరేణ్య " బిరుదుప్రదానం మరియు స్వర్ణకంకణాలంకృతులైన సద్గురువులను దర్శించి తరించడం జీవితంలో ఎన్నటికి తరగని అధ్యాత్మ అమృతానందరసపానభరిత మధురజ్ఞ్యాపకాల మధువును గ్రోలి ఇంటితిరిగిరావడం ఒక అవ్యక్తమైన చిరకాల పులకాంకిత మధురస్మృతి..... 😊
శ్రీగురుభ్యో నమః.....
నమో నమః....... శ్రీగురుపాదుకాభ్యాం.....🙏🙏🙏🙏🙏
నమో నమః....... శ్రీగురుపాదుకాభ్యాం.....🙏🙏🙏🙏🙏
No comments:
Post a Comment