సూర్యోదయ సమయానికి గల కృత్తికా నక్షత్రంతో కూడి ఉన్న పౌర్ణమి తిథి తో సమ్మిళితమైన రెండవ సోమవారం కావడంతో ఈ సంవత్సర కార్తీక పౌర్ణమి పర్వసమయం ఎంతో విశేషమైన అరుదైన పర్వం...☺️
కార్తీక మాసం అంతా కూడా ఎంతో ఆధ్యాత్మిక శోభతో వర్ధిల్లుతూ ఉండడాన్ని ఎల్లరూ గమనించే ఉంటారు...
హరిహరసుతుడైన అయ్యప్పస్వామి వారి మాలధారణలు / పదునెట్టాంపడి పూజలు / సోమవారాల్లో శివాలయ శోభ /
దేవోత్థాన ఏకాదశి / కైశిక ద్వాదశి ప్రయుక్త
విష్ణ్వాలయ వైభవం / దక్షిణాయనం లో కూడా మంచి ముహూర్తాలతో కళకళలాడే కార్తీక మాసం పెళ్ళిళ్ళు మరియు ఇతర ఫంక్షన్లు / ఇత్యాదిగా ఈ కార్తీకమాసమంతా
కూడా విశేషమైన ప్రాభవం తో ఉండే సమయం అని విజ్ఞ్యులెల్లరికీ తెలిసిందే...
కార్తీకపౌర్ణమికి, యావద్ బ్రహ్మాండంలోని ముక్కోటి తీర్థాలు, ఆర్ మోర్ ప్రిసైసిలి, తీర్థాధిదేవతలు, తిరుపతి శ్రీకపిలేశ్వరస్వామి వారి ఆలయపరిసరాల్లో ఉండే కపిలతీర్థం లోకి సూక్ష్మరూపాల్లో వచ్చి నెలకొనిఉండడం గురించి శ్రీచాగంటి సద్గురువులు వారి ప్రవచనాల్లో వివరించడం చాలామంది విజ్ఞ్యులకు తెలిసేఉంటుంది...
కొన్ని సంవత్సరాల క్రితం నాటి కార్తీకపౌర్ణమి తీర్థపర్వమున, గురువుగారు కూడా శ్రీకపిలతీర్థంలో తీర్థస్నానమాచరించడానికి రావడం...
ప్రత్యక్షంగా గురువుగారిని దర్శిస్తూ, గురోక్తసంకల్ప సహితంగా నేను కూడా మిట్ట మధ్యాహ్నం అభిజిత్ లగ్నంలో కపిలతీర్థస్నానం ఆచరించి తరించడం నా జన్మాంతరసౌభాగ్యం....☺️
కొన్ని చుక్కల ఒక పవర్ఫుల్ స్టెరాయిడ్ ఎంతో ఇబ్బంది పెట్టే వ్యాధిని నిర్మూలించగలదా అని అంటే...
రైనోసైనసైటిస్ అనే ఎంతో ఇబ్బందికరమైన రుగ్మతతో బాధపడే ఒక వ్యక్తికి, ఒక నిష్ణాతుడైన డాక్టర్ గారు ప్రెస్క్రైబ్ చేసిన పవర్ఫుల్ నేసల్ స్ప్రే వాడిన తర్వాత గలిగిన ఉపశమనం, ఆ ఓషధీశక్తికి నిదర్శనం అని అనవలసి ఉంటుంది......
అదేవిధంగా కొన్ని చుక్కల తీర్థం, సంప్రోక్షణైనా సరే, దేశకాలానుగుణంగా ఎంతో గొప్ప పుణ్యాన్ని కటాక్షించగలదు అని అంటే అది ఆ విశేషాన్ని పురాణేతిహాసప్రవచనాంతర్గతంగా వచించిన అధ్యాత్మ మాన్యుల యొక్క వచనాలపై గల విశ్వాసం యొక్క మాహాత్మ్యం అని అనవలసిఉంటుంది...
గోదావరి పుష్కరాలు....
కృష్ణా పుష్కరాలు....
గంగా పుష్కరాలు....
ప్రయాగ త్రివేణి సంగమంలో కుంభమేళా తీర్థపర్వోత్సవం...
కార్తీక పౌర్ణమి నాటి కపిలతీర్థముక్కోటి...
వైకుంఠద్వాదశి నాటి తిరుమల స్వామిపుష్కరిణి తీర్థముక్కోటి...
ఫాల్గుణ పౌర్ణమి నాటి తిరుమల అభయారణ్య స్థిత తుంబురుతీర్థ తీర్థముక్కోటి...
పర్వసమయాల్లో ఆయా తీర్థజలాల్లో ఉండే అధ్యాత్మశక్తిని ప్రత్యక్షంగా వాలిడేట్ చేసుకున్న ఒక స్పిరిట్యుయల్ సైంటిస్ట్ గా నేను ఈ అధ్యాత్మ సత్యాన్ని నూటికి నూరుపాళ్ళు
రూఢపరచగలను....
ఇది జలసంబంధమైన అధ్యాత్మ శక్తి యొక్క వైభవం...
అదే విధంగా...
అగ్ని సంబంధంగా ఉండే ఆధ్యాత్మ శక్తి...
ఈ కార్తీకమాసం లోని కార్తీక దీపారాధనగా, కార్తీక దామోదర / కార్తీక త్రయంబక దేవతారాధనా శక్తిగా.....
ఆరాధకులకు అందివచ్చే మాహాత్మ్యం అనేది అంతే సత్యం...
అరుణాచల అగ్నిలింగ క్షేత్రంలోని కృత్తికా దీపోత్సవానికి ఎంతటి ప్రాధాన్యతకలదో భక్తులెల్లరికీ తెలిసిందే....
As a matter of fact, అరుణాచల గిరిప్రదక్షిణ కూడా అగ్నిసంబంధమైన అధ్యాత్మ శక్తిని / కార్తికేయశక్తిని అనుగ్రహించి భక్తులను తరింపజేస్తున్నది అనేది అధ్యాత్మ
విశేషం....
భౌతికంగా, పంచభూతాల్లో కేవలం అగ్నికి మాత్రమే ఎంతో వేగంగా అప్రతిహతవ్యాపక శక్తితో విజృంభించే లక్షణం కలదు...అందుకే
"స్మరణాత్ అరుణాచలే.." అని అన్నారు...అనగ స్మరణమాత్రం చేతనే అంతటి వేగవంతంగా అనుగ్రాన్ని వర్షించే సాధనం అరుణాచల స్మరణం / అరుణాచల గిరిప్రదక్షిణం...
ఒక పుణ్యక్షేత్రాన్ని సందర్శించినప్పుడు, ఈశ్వరుడు పృథ్వితత్త్వంతో అలరారే శర్వుడిగా అనుగ్రహాన్ని, పుణ్యాన్ని ప్రసాదిస్తాడు....
ఒక తీర్థాన్ని / తీర్థక్షేత్రాన్ని సందర్శించినప్పుడు, ఈశ్వరుడు జలతత్త్వంతో అలరారే భవుడిగా అనుగ్రహాన్ని, పుణ్యాన్ని ప్రసాదిస్తాడు....
దీపారాధన, కార్తీక దీపోత్సవం, అరుణాచలగిరి ప్రదక్షిణం, ఇత్యాది అగ్నిసంబంధ అధ్యాత్మ క్రతువుల ఫలితాన్ని, ఈశ్వరుడు అగ్నితత్త్వంతో అలరారే రుద్రుడిగా అనుగ్రహాన్ని, పుణ్యాన్ని ప్రసాదిస్తాడు....
ఓం ఉగ్రాయ దేవాయ నమః తో ప్రతిపాదింపబడే
వాయుతత్త్వ అధ్యాత్మ శక్తి,
ఓం భీమాయ దేవాయ నమః తో ప్రతిపాదింపబడే
అకాశతత్త్వ అధ్యాత్మ శక్తి, సాధారణంగా ఈ భూలోకవాసులకు లభ్యం కాని అధ్యాత్మ విశేషం....
ఎందుకంటే అది కేవలం ఉన్నతశ్రేణి యోగులకు, భువరాది ఊర్ధ్వలోకవాసులకు, ఆకాశయానం గావించే సిద్ధచారణగణములకు, అశ్వినిదేవతలకు, ఇత్యాది ఉన్నతమైన పుణ్యార్జితజీవులకు లభించే అధ్యాత్మ శక్తి విశేషం....
మన భాషలో కొంచెం సింపుల్ గా మాట్లాడుకోవాలంటే,
సైకిల్, బైక్, ఇప్పటి కాలంలో కార్లు, అనేవి పృథ్వి, జల, అగ్ని తత్త్వ అధ్యాత్మ శక్తి శ్రేణికి సంబంధించిన సామ్యములైతే....
హెలికాప్టర్, ఏరోప్లేన్, ఇత్యాదివి వాయు మరియు ఆకాశ తత్త్వ అధ్యాత్మ శక్తి శ్రేణికి సంబంధించిన సామ్యములుగా భావించవచ్చును...
అవి ఉన్నత / సంపన్న శ్రేణికి సంబంధించిన వాయు / ఆకాశ గమన మాధ్యములు / సాధనములు...
అవి కొనాలన్నా, మేన్టేన్ చెయాలన్నా ఖర్చు ఎక్కువ....
అదే విధంగా పుణ్యం చాలా ఎక్కువగా ఉంటేనే /
పుణ్యం చాలా ఎక్కువగా ఖర్చు చేయగలిగితేనే
ఓం ఉగ్రాయ దేవాయ నమః (హెలికాప్టర్)
/ ఓం భీమాయ దేవాయ నమః (ఏరోప్లేన్) తో ప్రతిపాదింపబడే వాయుతత్త్వ / అకాశత్తత్వ అధ్యాత్మ శక్తి లభ్యమయ్యే అధ్యాత్మ విశేషం....
" శ్రీకార్తీకపురాణ మాహాత్మ్యం" అనే పేరుతో మనపెద్దలు ఈ కార్తీకమాసంలో రోజుకో అధ్యాయం పేరుతో 30 అధ్యాయాల కార్తీకపురాణ శ్రవణం అనే సత్సంప్రదాయాన్ని అందించడం చాలమంది భక్తులకు విదితమే....
ఈ కార్తీకపురాణమంతా కూడా దీపారాధన యొక్క వైభవం, కృత్తికా నక్షత్రంతో చంద్రుడు కూడి ఉండే కార్తీక మాసంలో
హరిహరుల ఆరాధనా మాహాత్మ్యం,
శ్రీహరిసంకీర్తనా మాహాత్మ్యం....,
కార్తీక సోమవార ఆరాధనా మాహాత్మ్యం
గురించిన గాథలతో ఉండడం పాఠకులకు విదితమే....
ఇవ్విధంగా శ్రీకార్తీకమాసవైభవం అనాదిగా భారతదేశ సనాతన ఆధ్యాత్మిక ద్యుతికి పెట్టిందిపేరుగా అలరారే విశేషం....
కార్తీక మాస దీపారాధన ఈ పోస్ట్ కు జతపరచబడిన శ్లోకంతో గావించడం మరింతఫలదాయకం అని విజ్ఞ్యుల ఉవాచ...
🙂🇮🇳🍿🍧🍨💐🌻🍇🍒🌾🎂🥧
🪔🪔🪔🪔🪔🪔🪔🪔🪔🪔🪔🪔🪔🪔🪔🪔