1. అధికారంలో ఉన్నది ఏ పార్టీ అయినా ప్రజలు ఆశించేది మెరుగైన పారదర్శకమైన ప్రజారంజకమైన పరిపాలనను.
వారి వారి నియోజకవర్గాల్లోని అభివృద్ధి అట్లే కొనసాగేలా పాలకపక్ష ప్రతిపక్ష విపక్ష సమన్వయ భరిత సమీక్షాపూర్వక సార్వజనీన శ్రేయస్సు...
2. ఓడినవారు ఆత్మవిమర్శ గావిస్తూ, గెలిచినవారు అణకువతో అధికారసద్వినియోగాన్ని గావిస్తూ వారికివ్వబడిన మరియాదను నిలుపుకునేలా సాగే ప్రజాసేవాప్రస్థానం
ఎల్లరికీ హుందాకరమైన విహితధర్మం..
3. ఎంతోమంది ప్రజాప్రతినిధిలు నాడు ఉన్న పార్టీలో నిన్న లేరు..నిన్న ఉన్న పార్టీలో నేడు లేరు...ఇప్పుడున్న పార్టీలో రేపు ఉంటారో లేదో తెలియదు.. ఎప్పుడు ఎవరు ఎందుకు వారివారి వ్యక్తిగత ఆకాంక్షల మేరకు ఏ పార్టీలోకి వెళ్తారో తెలియదు....ఇది ఈనాటి నవయుగ ప్రజాస్వామ్యంగా పేర్గాంచిన దేశరాజకీయ శైలి.
కాబట్టి నిజం చెప్పాలంటే ఒక సామాన్యుడికి ఏ పార్టీతోను విభేదం ఉండదు...ఏ పార్టీకూడా ఎక్కువ తక్కువ కావు.... కేవలం వారు విశ్వసించిన అభ్యర్ధుల గెలుపుతో వారి వారి నియోజకవర్గాభివృద్ధిని తద్వారా యావద్ రాష్ట్రాభివృద్ధిని కాంక్షించడమే సదరు సామాన్య వోటరుకు తెలిసిన రాజనీతి...
4. ప్రతీ పౌరుడు అలోచించేది వారివారి నియోజకవర్గంలోని జీవనప్రమాణాలు, మౌలికవసతులు, ప్రశాంతజీవనం, పరస్పరసామరస్యం అట్లే కొనసాగాలని...మరియు అంతకంటే మెరుగైనవిధంగా ఉండాలని...ఏ పార్టి అధికారంలోకి వచ్చినా కూడా ఒక సామాన్యుడు ఆశించే మానిఫెస్టో ఎల్లప్పుడు ఇదే...
కాబట్టి అధికారులు మరియు ప్రజాప్రతినిధులు కొత్తవారైనా, పాతవారైన, ఒక సామాన్య పౌరుడు ఆశించేది, ద్రవ్యోల్బనం అదుపులో ఉండడం, ఉద్యోగ, వ్యాపారావకాశాలు మెరుగైనవిధంగా ఉండడం, ప్రజాప్రతినిధులు, పాలకులు వారికి ఎల్లవేళలా అందుబాటులో ఉండడం, పారదర్శకమైన ప్రజాశ్రేయోభరితమైన పరిపాలనావిధివిధానాలుండడం...
5. దశాబ్దకాలంగా తెలంగాణ జాతిపితగా పేర్గాంచి, రాష్ట్రానికి సేవలందించిన మాన్యశ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్రావ్ గారికి మరియు వారి సచివబృందానికి ధన్యవాదాలు....🙏💐
తెలంగాణ రాష్ట్ర రెండవ ముఖ్యమంత్రిగా, రాజ్యాంగబద్ధమైన సుపరిపాలనను అందించేందుకు శక్తివంచన లేకుండా కృషిచేస్తు ప్రజాసేవకుడిగా పరిఢవిల్లుతానని ప్రమాణస్వీకారం చేయబోయే మాన్యశ్రీ ఎనుముల రేవంత్ రెడ్డి గారికి మరియు ఎంతో వివేచనతో వారు ఎన్నుకుబోయే రాష్ట్ర నూతన సచివబృందానికి శుభాభినందనలు....🙏💐
ఇట్లు...
భారతరాజ్యాంగరూపకర్త, మాన్యశ్రీ అంబేడ్కర్ గారి వర్ధంతి సందర్భంగా సదరు సామాన్య పౌరుడి అంతరంగం మరియు అభిలాష.....
No comments:
Post a Comment