శ్రీకృష్ణదేవరాయల వారు ఆనాడు
"దేశభాషలందు తెలుగు లెస్స..."
అని తెలుగు భాష యొక్క వైభవాన్ని జగద్ప్రసిద్ధి గావించిన విషయం ఈనాటికి కూడా మన స్కూల్లోని పాఠ్యాంశాల్లో లభ్యమవ్వడం మన సౌభాగ్యం...
ప్రపంచీకరణ మూలంగా ఆంగ్లము యావద్ ప్రపంచంలో ఎంతో విస్తృతంగా అన్ని రంగాల్లోకి పెనవేసుకుంటూపోవడంతో ఆంగ్ల భాషపై పట్టును సాధించి తీరితేనే ఈ ఆధునిక లోకంలో మనుజులకు అభివృద్ధి బాటలో ప్రయాణించేందుకు వీలుకలదు అన్న రీతిలో ఈనాడు ప్రతీచోటా ఆంగ్ల భాషయొక్క ఆర్భాటం అంతా ఇంతా కాదు....
ఆధునికత రీత్యా ఆంగ్లము తప్పనిసరి అయినా, అనాదిగా ఆంధ్రము తన వైభవాన్ని నలుచెరగులా వ్యాప్తిగావిస్తూ చక్కని హృదయం గల భాషగా, చల్లని మనసు గల భాషగా, చిక్కని మహత్తుతో, చెక్కు చెదరని ప్రాభవంతో యావద్ ప్రపంచంలో తెలుగు వారిచే ఆరాధింపబడుతూ ఆదరింపబడుతూ తరతరాలుగా తెలుగు భాషయొక్క తియ్యందనాన్ని ఆస్వాదించే వారెల్లరికీ పంచుతూనే ఉంది...ఉంటుంది...
అన్నం పెట్టే భాష ఆంగ్లము అయితే..
ఆత్మీయత, అనురాగాన్ని మేళవించి ఆనందమయ జీవితానికి అవధిలేని ఆశలహరివిల్లును అందిస్తూ ఆకాశపు అంచుల్లో విహరించేంతటి అనంతమైన మనోస్వాంతనను అందించే అమరభాష తెలుగు...
అర్ధవంతమైన జీవితపు ప్రయాణం సాగే దారిలోని విద్యుత్ దీపాల కాంతి ఆంగ్లము అయితే..
ఆ జీవితానికి పరమార్ధాన్ని ఎరుకపరిచే ఈశ్వర పూజామందిరంలోని స్వచ్ఛమైన ఆవు నేతిదీపాల వెలుగుజిలుగులు తెనుగు ప్రభలు....
వృత్తిపనుల్లో నిమగ్నమై ఎంతటి అలసటలో ఉన్నాసరే ఒక చక్కని సాహిత్యంతో అల్లుకున్న సంగీత మంజరిని ఆలకించగానే లభించే ఆనందం వర్ణించలేనిది...
అది భగవద్సంబంధమైన సంగీతసాహిత్యమైతే మరింత మెండైన ఆనందోత్సాహం తో ఎంతటి అలసటైనా చిటికెలో మాయమైపోవాల్సిందే కదా... అంతటి మేధోస్వాంతనకారక నుడికారవైభవం కలదు కనుకనే...
శ్రీతాళ్ళపాక అన్నమాచార్యులు,
శ్రీ సద్గురు త్యాగరాయులవారు,
(శ్రీ భద్రాచల రామదాసు / కంచర్ల గోపన్న
గారిది పూర్తిగా తెలుగుమయమైన జీవితం కాబట్టి వారికి ద్రావిడ స్పర్శ ఆపాదించబడదు...)
ద్రావిడం కన్ననూ తెనుగునే తమ దైవకార్యాలకు సర్వోచితమైన భాషగా స్వీకరించి అజరామరమైన రచనా వైదుష్యంతో గావించిన సంకీర్తనలు ఇన్ని సంవత్సరాలైనా సరే తమ దివ్యదైవిక ప్రభలను వెదజల్లుతూ ఆరాధించినవారెల్లరినీ అనుగ్రహిస్తూనే ఉన్నాయి...ఉంటాయి...
వామావర్తలిపిగా ప్రత్యేకతను సంతరించుకున్న కారణంగా తెనుగు భాషలో గావించబడిన / అనువదించబడిన సాహిత్యానికి గల శక్తి అనన్యసామాన్యమైనది....
అందుకే " అలవైకుంఠపురములో... " అని ఆనాడు శ్రీపోతనామాత్యుల వారి సహజకవనంలోని శ్రీమద్భాగవతపద్యంగా ఒలికినా సరే....
ఈనాడు వెండితెరపై స్టైలిష్ స్టార్ బన్ని సినిమా టైటిల్ గా నిలిచినాసరే...
కోట్లమందిప్రజల యొక్క మనసులను గెలుచుకొని, మన్ననలను అందుకున్న భాషాప్రయోగాలుగా ఖ్యాతి గడించాయి.....
శ్రీ చాగంటి సద్గురువుల వంటి మహనీయుల రసనపై కొలువైన వాగ్దేవి అనుగ్రహంగా ఈ ఆధునిక కాలంలో కూడా తెలుగు భాషయొక్క అంతర్జాతీయ ప్రాభవం ఎట్టిదో విజ్ఞులెల్లరికీ ఎరుకే....
అటువంటి మహోన్నతమైన తెలుగు భాషకు గౌరవసూచకంగా తెలుగు భాషాదినోత్సవంగా ఒక రోజును పురస్కరించుకొని గౌరవనీరాజనాలను అర్పించి యథాశక్తి నమస్కరించడం ప్రతి తెలుగు వారి ఆత్మాభిమానానికి మరింత శోభను సమకూర్చే అంశం...
తెలుగు కళామతల్లికి వన్నెలలదే వైభవహారానికి ఎన్నో మణిపూసలవంటి సాహితీ గుళికలను అందించి తరించిన...
ఎందరో మహానుభావులు...
అందరికీ వందనములు...
🙏💐🍕🍨😊
https://www.news18.com/news/lifestyle/telugu-language-day-2021-history-significance-and-all-you-need-to-know-4140461.html
( తెలుగు భాషావైభవం గురించిన నా పాత పోస్ట్లు ఈ క్రింది పుటల్లో కలవు...
https://m.facebook.com/story.php?story_fbid=10218945296516755&id=1033694038
https://shreeguravenamah-aithavk.blogspot.com/2021/02/wishing-one-and-all-very-happy.html?m=1
https://shreeguravenamah-aithavk.blogspot.com/2019/02/blog-post_23.html?m=1
https://shreeguravenamah-aithavk.blogspot.com/2020/06/blog-post_1.html?m=1
https://shreeguravenamah-aithavk.blogspot.com/2019/06/blog-post.html?m=1
https://shreeguravenamah-aithavk.blogspot.com/2019/01/2019_27.html?m=1 )
No comments:
Post a Comment