కార్యక్రమాలు, గోబ్రాహ్మణ గౌరవార్ధమై సాగే కార్యక్రమాలను గౌరవించి ఆదరించడమే నిజమైన ఆధ్యాత్మికత....
ఎందుకంటే....
శ్రీచాగంటి సద్గురువుల సంపూర్ణరామాయణ ప్రవచనాలు విన్నవారికి గుర్తున్నట్టుగా...
దిలీపుడు చేసుకున్న విశేషమైన గోసేవ జనిత పుణ్యం వల్లే శ్రీమహావిష్ణువు తన శ్రీరామావతారానికి రఘువంశాన్ని ఎన్నుకొని మానవుడిగా జన్మించి, రఘురాముడిగా శాశ్వత కీర్తిని గడించాడు....
త్రేతాయుగం నాటి శ్రీరామావతార కాలంలోని కొన్ని సంఘటనలే, ద్వాపర యుగంలో శ్రీకృష్ణావతారానికి కారణమైనవి.....
ద్వాపరయుగం నాటి శ్రీకృష్ణావతార కాలంలోని కొన్ని సంఘటనలే, ఈ కలియుగం లో శ్రీవేంకటేశ్వర అవతారమునకు కారణమైనవి.....
కాబట్టి, ఇప్పుడు మన కాలంలో, తిరుమల, చిల్కూర్, ద్వారకా తిరుమల, ఇత్యాది స్వయంభూ పుణ్యక్షేత్రాలలో, మరియు ఎన్నో ఇతర ఆలయాల్లో
వెలసిన కలియుగప్రత్యక్ష దైవమైన శ్రీవేంకటేశ్వర స్వామి వారి అనుగ్రహంతో ఈనాడు మనం జీవించడానికి ఆనాటి దిలీపుడి గోసేవే కారణం......
చక్కని దేహదారుఢ్యానికి ఎటువంటి సైడ్ఎఫ్ఫెక్ట్స్ లేకుండా పుష్టిని కలిగించేది పెరుగు......
తద్వరా లభించే వెన్న, మరియు నెయ్యి మరింతగా ఆరోగ్యాన్ని ప్రసాదించే పదార్ధాలు......
అమేయమైన మేధా శక్తికి, జ్ఞ్యాన శక్తికి, తద్వరా వివిధ ప్రతిభాపాటవాలకు అత్యంత ఉపయుక్తమైన దైవిక పదార్ధం అమృతతుల్యమైన శుద్ధమైన దేశవాళి ఆవు నెయ్యి.....
ఒక మనిషికి మనం దానం చేసిన సొమ్ముతో, వాడు తాగుబోతు / తిరుగుబోతు / పొగరుబోతు /
ఉన్నతమైన వ్యక్తులతో / వ్యక్తిత్త్వాలతో మరియాదగా ఎట్ల ప్రవర్తించాలో తెలియని లోఫర్, ఎంత చెప్పినా ఇతరులను ప్రశాంతంగా జీవించనివ్వని ఔలగాడిలా, సంస్కారహీనుడిగా, భూమికి భారంగా బ్రతికి ఛస్తాడేమో.....
(తద్వారా మన దానం చేసినది మొత్తం బూడిదలో పోసిన పన్నీరులా వ్యర్ధమైనట్టే....)
కాని ఒక గోవుకు / గోసేవకు మనం దానం చేసే సొమ్ముతో జీవించే ఆ గోవు తన జీవితకాలం మొత్తం సమాజానికి / లోకానికి ఎన్నోవిధాలా హితకరమైన
గోమయం, గోపంచకం, గోక్షీరం, గోనవనీతం, గోఘృతం, అందించి ప్రత్యక్ష పరోక్షంగా ఎంత సేవ చేస్తుందో మనం గమనించవచ్చు....
కాబటి ఒక మనిషికి గావించిన అపాత్రదానం తో వాడు బాధ్యతారాహిత్యంతో సిగ్గుశరం లేకుండా సమాజానికి బరువుగా బ్రతికే హీనుడు అవుతాడేమో కాని....
ఒక గోవుకు / గోసేవకు గావించే ఎట్టి దానమైనను ఎప్పటికీ సత్ఫలితాన్నే ఇచ్చి తీరుతుంది......
తద్వార మన దానం ఎప్పటికీ పుణ్యదాయకమై పరిణమిస్తుంది.....
శ్రీచాగంటి సద్గురువులు వివరించినట్టుగా.....
" గోబ్రాహ్మణేభ్యో శుభమస్తు నిత్యం...లోకాస్సమస్తాః సుఖినోభవంతు......"
అని అనడంలో వారి వల్ల లోకం మొత్తం క్షేమంగా ఉంటుంది అనేది అంతరార్ధం కాబట్టి మన పెద్దలు స్తోత్ర సారస్వతాన్ని అలా అనుగ్రహించారు.....
" సహస్రాపరమాదేవి శతమూలాశతాంకురా
సర్వగుమ్హరతుమేపాపం దూర్వాదుస్స్వప్ననాశినీం "
అంటూ స్తుతింపబడే, గణపతికి అత్యంత ప్రీతిపాత్రమైన, శక్తివంతమైన గరికను / ఇతర గ్రాసాన్ని ఆహారంగా స్వీకరించి, లోకానికి అమృతతుల్యమైన పాలను అందించే దైవిక జీవి ఆవు....
గోసమ్రక్షణ తో ఈ దేశం/లోకం క్షేమంగా ఉండడానికి గోవు భారత జాతీయ ప్రాణిగా ప్రకటింపబడి గౌరవింపబడడం ఎంతైనా అత్యావశ్యకమైన అంశం...
ఇదేదో మతపరమైన / రాజకీయపరమైన అంశంగా భావించకుండా.....
దేశానికి సుభిక్షమైన స్థితికారక అంశంగా
ఏ మహానుభావులు సుప్రీం కోర్టులో ఈ అంశంపై గోసేవకు అనుకూలంగా వాదిస్తారో...
ఏ న్యాయమూర్తి "గోవును భారత జాతీయ ప్రాణి" గా ప్రకటించి పుణ్యాన్ని మూటకట్టుకుంటారో అని ఇంకెన్నాళ్ళు వేచిచూడాలో ఏమో.....
No comments:
Post a Comment