శ్రీచాగంటి సద్గురువుల శ్రీలలితాసహస్రనామస్తోత్ర ప్రవచనాలు శ్రద్ధగా వినే భాగ్యం ఎంత మందికి లభించిందో తెలియదు కాని.....
ఎంతో శక్తివంతమైన ఈ నామాల్లో కనీసం ఒక్క నామం యొక్క అర్ధం గ్రాహ్యమై మనో న్యాసమైన నాడు లభించే శ్రీమాత యొక్క అనుగ్రహం అనన్యసామాన్యమైనది.....
ఇది సాక్షాత్తు శ్రీమన్నారాయణుడు హయగ్రీవుడిగా ఉండి అగస్త్య మహర్షితో సంభాషించిన సర్వోత్కృష్టమైన ధర్మార్ధకామ్యమోక్షదాయక స్తోత్రరత్నం.....
కాని కొంచెం జాగ్రత్తగా శ్రద్ధతో, తప్పులుదొర్లకుండా పారాయణ చేయవలసిన స్తోత్రం......
ఎందుకంటే సరైన ఉచ్ఛారణ లోపించిన నాడు నామం యొక్క అర్ధమే మారిపోతుంది....
ఒక్కోసారి వ్యతిరేకార్ధం కూడా సంభవించవచ్చును .......
కాబట్టి స్పీడ్ కంటే సెన్సిబిలిటి & అటెంటివిటి ఎక్కువగా ఉండవలసిన పారాయణ ఇది......
నన్ను నమ్మండి.....
ఈ లోకం మొత్తం మీకు ప్రతికూలంగా ఉన్నా.....
నావారు అని అనుకున్న మీవారే మీకు భారమైన రీతిలో, బాధాకరమైన రీతిలో, ప్రవర్తించే పరిస్థితుల్లో ఉన్నా...
కేవలం ఒక్క బెల్లం ముక్క / శుద్ధోదకం/మంచినీళ్లు నైవేద్యంగా సమర్పించినా సరే, తెలిసితెలియని అపరిపక్వ భక్తికి కూడా ఆ పరాంబిక నవ్వుతూ అనుగ్రహిస్తుంది....!
ఎంతగా అంటే...
భూమాత/భూదేవి లోని సహనం, గోమాతా/గోవు లోని వాత్సల్యం, మాత/అమ్మ లోని బాధ్యత కలగలిసిన నాడు ఆ పరిపూర్ణ పరతత్త్వానికి "శ్రీమాతా" అని పేరు...
అందుకే వాగ్దేవతలు
" శ్రీమాత " అంటూనే అందుకున్నారు అమరులచే పూజింపబడే శ్రీచరణాలతో భాసిల్లే అమ్మవారి మహామహిమాన్విత శ్రీలలితా సహస్రనామావళిని....
దారిద్ర్యాన్ని నిర్మూలించి....,
మహిమాన్వితమైన శ్రీహరిభక్తిని అనుగ్రహించి....
అనన్యసామాన్యమైన శివజ్ఞ్యానాన్ని ప్రసాదించి.....,
అర్ధింపబడే ధర్మార్ధకామ్యమోక్ష
ఈప్సితములను ఈడేర్చి.....
పరమేశ్వర పాదపద్మముల చెంత దృఢమైన భక్తిప్రపత్తులను కలిగించే......
స్తోత్రరత్నం ఏదైనా ఉందా అంటే అది కేవలం శ్రీలలితాసహస్రనామమే...
ఇది కేవలం స్త్రీలకో, బ్రాహ్మణోత్తములకో,
లేక ఇంకొందరికో మాత్రమే కాదు......
అన్ని ఆశ్రమాల్లోని వారికి,
అన్ని ధర్మాల్లోని వారికి.....
కూడా అనుగ్రహింపబడిన అత్యత్భుతమైన స్తోత్రం......
మహాశక్తివంతమైన ఆశ్వయుజదుర్గాశరన్నవరాత్రులు రాబోతున్నాయి.....
చంద్రుడు అశ్విని నక్షత్రంతో కూడి ఉండే ఆశ్వయుజపౌర్ణమికి ముందు వచ్చే నవమి రోజు శ్రీలలితాసహస్రనామ పారాయణ కావించిన వారికి లభించే ఫలితం / అనుగ్రహం అంతని / ఇంతని వర్ణించలేము......
ఫలశృతిలో చెప్పబడినట్టుగా......
నవమి, చతుర్దశి, శుక్రవారం, పౌర్ణమి రోజుల్లో ఈ పారాయణ అనంతశక్తి ప్రదమైనది........
అలా చేయగా చేయగా ఏదోఒకనాడు అమ్మవారే స్వయంగా బాలాత్రిపురసుందరి దేవి గా మీ ఇంట్లోకి మీ బాల గా వచ్చినా ఆశ్చర్యంలేదు......
అంతటి శక్తి స్వరూపిణి ఆ
"తాటంకయుగళీభూత తపనోడుపమండలాయై నమః ..."
"తారాకాంతితిరస్కారి నాసాభరణభాసురాయై నమః"
గా భక్తులచే నిత్యం పూజింపబడే, అర్చింపబడే, ధ్యానింపబడే ఆ దరహాసోజ్జ్వలన్ముఖి.....!
ఇక మన ఇంట్లోనే అమ్మవారు బాలగా తిరుగాడుతుంటే.......
మన ఇల్లే అవుతుంది ఒక చింతామణి గృహం......
మన సంకల్పాలే అవుతాయి శివసంకల్పాలు......
మన లోగిళ్ళే అవుతాయి
ఆ
గంగ భవాని గాయత్రి కాళి లక్ష్మి సరస్వతి
రాజరాజేశ్వరి బాలా శ్యామల లలిత
అనే దశ మహిమాన్వితమైన నామాలతో అర్చింపబడే పరాశక్తి యొక్క మణిద్వీపం......!!!!!
అపురూపమైన వైభవంతో వర్ధిల్లిన కాకతీయ మహాసామ్రాజ్యాధిపతుల కరకమలాలతో
నిత్యం అర్చింపబడిన చరణకమలాలతో భాసిల్లే
శ్రీవరభద్రకాళికి నమస్కరిస్తూ,
శ్రీమాత్రే నమః.....
🙏🙏🙏🙏🙏
😊🎇💐🍕🍦🍨🍧🎂✨
https://m.facebook.com/story.php?story_fbid=pfbid02wrrkivaaHP2SgoUjULJGC4MVXy1rYLEKi3JWVWiuYkQRUwjUvSco4UKV3xk4VmW2l&id=1033694038
No comments:
Post a Comment