Sunday, August 13, 2023

శ్రీకరమైన శుభకార్యములకు త్యజనీయమైన తిథి / వార / నక్షత్ర కూటములు.....

అది చదివిన లేక ఇంకా సరిగ్గా చదవని వివిధ మనుషుల్లోనే 
తారతమ్యములు...తద్వరా భేషజాలు....

వివాహం, అన్నప్రాశనం, అక్షరాభ్యాసం, ఇత్యాది వివిధ శుభకార్యములకు ఎల్లరూ సామాన్యంగా సంప్రదించే పంచాంగ ముహుర్తాలకు, వారివారి వ్యక్తిగత జాతకరీత్యా సరిపోయే సామాన్య, మధ్యస్థ, ఉత్తమ ముహూర్తాలే కాకుండా ఈ పోస్టుకు జతపరచబడిన పట్టిక ప్రకారంగా సదరు తిథి / వార / నక్షత్ర / ప్రకారంగా, ఒక్కోసారి ఒక్కో ముహూర్తం కాలానుగుణంగా త్యజనీయమై ఉంటుందని గుర్తించవలె...

ఫర్ ఎగ్సాంపుల్,

మందినిముంచి బ్రతికేవారెవరో సూచిస్తున్నారు కదా అని,
మీరు ఏదో ఒక శుభకార్యానికి, ఏకాదశి బానే ఉంటుంది అని అనుకొని...
మీ జాతకానికి ఫలానా శుభకార్యానికి ఫలాన ఏకాదశి బానే ఉందా అండి అని మీరు ఎవరో ఒకరిని, అడిగితే......
" ఏకాదశి కద...బానే ఉంటుంది..."
అని వారు ఏదో క్యాజువల్ గా అనేయ్యొచ్చు.....

కాని ఏకాదశి ఆదివారం నాడు వస్తే అది ముహూర్తములకు ఖచ్చితంగా త్యజనీయమైన తిథి అని గమనించి వేరే సామాన్య / మధ్యస్త ముహూర్తములైనను స్వీకరించవచ్చును అని విజ్ఞ్యులు గ్రహింపవలె....

శాస్త్రం పై సరైన గౌరవం / అవగాహన లేని వారు ఎన్నైనా చెప్తారు....
కాబట్టి, కనీసం పంచాంగంలోని 5 అంగములు ఏంటో కూడా సరిగ్గా తెలియని ఎవరో చెప్తున్నరనో.... 
లేక ఎవరో కొందరు మెట్టవేదాంతులు చెప్పిన్రనో...
మూర్ఖత్వంతో శాస్త్రం యొక్క లోతుపాతులను విస్మరించకుండా...
ఉదారులైన విజ్ఞ్యులనైనా సంప్రదించాలి...
లేక భగవంతుడిని ఆశ్రయించి నాకు ఫలానా శాస్త్రానికి సంబంధించిన సారస్వతం భాసింపజేయి ఈశ్వరా అని ఆలయానికి వెళ్ళి త్రికరణశుద్ధిగా ప్రార్ధించాలి...

కొందరి ఉద్ద్యేశ్యంలో సాంబార్, ఇడ్లీ, కొబ్బరిచట్నీ కాంబినేషన్ బానే ఉందని అనిపించవచ్చు.....
కాని అందులో వంట నూనేకు బదులుగా పొరపాటున ఏవో హానికరమైన రసాయన నూనెలు కలిసాయని తెలిస్తే తింటారా...??
 
అదే విధంగా ఆదివారం పునర్వసు ఏకాదశి బానే ఉంది కదా అని కొందరికి అనిపించవచ్చు....
కాని అది ఖచ్చితంగా త్యజింపవలసిన ముహూర్తం అని మీకు ఈ విధంగా శాస్త్రాన్ని సాక్షరంగా చూపినా త్యజించరా....?
[ ఎందుకంటే...
ఏదేని ఆదివారం నాడు 
ప్రతిపత్, షష్ఠి, ఏకాదశి, తిథులు ఉన్నా, 
అనూరాధ నక్షత్రం ఉన్నా...,
అది మృత్యుయోగం అవుతుంది కాబట్టి...

మరియు

ఏదేని ఆదివారం నాడు 
ద్వాదశి తిథి ఉన్నా, 
భరణి, విశాఖ నక్షత్రాలు ఉన్నా అది దగ్ధయోగం / ఉత్పాతయోగం అవుతుంది కాబట్టి.... 

ఇదే విధంగా మిగతా ఇతర 6 రోజులకు కూడా వర్తించే ఆయా మృత్యుయోగ/దగ్ధయోగ కారక ముహూర్తములను ముఖ్యమైన శుభకార్యాములకు ఖచ్చితంగా త్యజింపవలెను...! ]

ఎవరో ఏదో ఒకటి సూచించడం కాదు...
ఏం సూచిస్తున్నారు..? అది వారికి ఎవరు చెప్తున్నారు..?
ఆ చెప్పే వారు ఎంత నమ్మదగినవారు..? ఎంతటి విజ్ఞ్యులు..? 
అసలు వారు మన మంచిని, అభివృద్ధిని కాంక్షించే వారేనా..?
ఇత్యాదిగా కూడా అలోచింపవలె....

.
.
.
******* ******* ******* ******* ******* *******
ఎట్టి పరిస్థితుల్లోను ఈ క్రింది మృత్యుయోగ కారక కాలమును శుభకార్య ముహూర్తములకు స్వీకరించకూడదు అని విజ్ఞ్యులు గమనించవలె...

ఆదివారం నాడు
అనూరాధ నక్షత్రం
ప్రతిపత్, షష్ఠి, ఏకాదశి, తిథులు

సోమవారం నాడు
ఉత్తరాషాఢ నక్షత్రం
విదియ, సప్తమి, ద్వాదశి తిథులు

మంగళవారం నాడు
శతభిష నక్షత్రం
ప్రతిపత్, షష్ఠి, ఏకాదశి, తిథులు

బుధవారం నాడు
అశ్విని నక్షత్రం
తృతీయ, అష్టమి, త్రయోదశి, తిథులు

గురువారం నాడు
మృగశిర నక్షత్రం
చతుర్థి, నవమి, చతుర్దశి, తిథులు

శుక్రవారం నాడు
ఆశ్లేష నక్షత్రం
విదిత, సప్తమి, ద్వాదశి, తిథులు

శనివారం నాడు
హస్త నక్షత్రం
పంచమి, దశమి, పౌర్ణమి/అమావాస్య, తిథులు
******* ******* ******* ******* ******* *******
.
.
.

వీలైనంతవరకు ఈ క్రింది దగ్ధయోగ / యమకంటకయోగ / ఉత్పాతయోగ కారక కాలమును శుభకార్య ముహూర్తములకు స్వీకరించకూడదు అని విజ్ఞ్యులు గమనించవలె...

1. ఆదివారం నాడు :
దగ్ధయోగం :: భరణి నక్షత్రం, ద్వాదశి తిథి 
యమకంటకయోగం :: మఘ నక్షత్రం
ఉత్పాతయోగం :: కృత్తిక, విశాఖ, నక్షత్రం

2. సోమవారం నాడు :
దగ్ధయోగం :: భరణి నక్షత్రం, ఏకాదశి తిథి 
యమకంటకయోగం ::  విశాఖ నక్షత్రం
ఉత్పాతయోగం ::  పూర్వాషాఢ నక్షత్రం

3. మంగళవారం నాడు :
దగ్ధయోగం :: ఉత్తరాషాఢ నక్షత్రం, పంచమి తిథి 
యమకంటకయోగం :: ఆర్ద్ర నక్షత్రం
ఉత్పాతయోగం :: ధనిష్ఠ నక్షత్రం

4. బుధవారం నాడు :
దగ్ధయోగం :: ధనిష్ఠ నక్షత్రం, తృతీయ తిథి 
యమకంటకయోగం :: మూల నక్షత్రం
ఉత్పాతయోగం :: రేవతి నక్షత్రం

5. గురువారం నాడు :
దగ్ధయోగం :: ఉత్తరఫల్గుణి నక్షత్రం, షష్ఠి తిథి 
యమకంటకయోగం :: కృత్తిక నక్షత్రం
ఉత్పాతయోగం :: రోహిణి నక్షత్రం

6. శుక్రవారం నాడు :
దగ్ధయోగం :: జ్యేష్ఠ నక్షత్రం, అష్టమి తిథి 
యమకంటకయోగం :: పుష్యమి నక్షత్రం
ఉత్పాతయోగం :: పుష్యమి నక్షత్రం

7. శనివారం నాడు :
దగ్ధయోగం :: రేవతి నక్షత్రం, నవమి తిథి 
యమకంటకయోగం :: హస్త నక్షత్రం
ఉత్పాతయోగం :: ఉత్తరఫల్గుణి నక్షత్రం
******* ******* ******* ******* ******* *******

No comments:

Post a Comment