Saturday, February 24, 2024

శ్రీ పి.వి.నరసిమ్హారావ్ గారి 9వ వర్ధంతి సంస్మరణ సందర్భంగా వారి స్మృత్యర్ధం చిరు కవనకుసుమాంజలి....A sincere tribute to Shree P.V.Narasimha Rao gaaru, hon'ble ex-(9th) Prime Minister of India, on his 19th vardhanti....💐💐💐💐💐💐💐💐💐

ఎందుకంటే వారు దక్షిణభారత దేశం నుండి ప్రభవించిన భారత 9వ ప్రధానమంత్రి అయినందుకో, లేక బహుభాషాకోవిదులైనందుకో కాదు....

వారి మేధోకౌశలం తో భారతదేశ ఆర్ధికవికసన యజ్ఞ్యానికి ఎంతో క్లిష్టమైన సమయంలో కడు కష్టతరమైన స్వీయవర్గ ఒత్తిడిలో కూడా ఎంతో పదునైన చాణక్యంతో పరిణతగల పెద్దమనిషిగా వ్యవహరించి వారు అలంకరించిన పదివికి నూటికినూరుపాళ్ళు న్యాయాన్ని చేసిన ధర్మతత్పరులైన రాజనీతిజ్ఞ్యులైనందుకు.....
తద్వారా దేశభక్తి అంటే కేవలం సంవత్సరానికి రెండురోజులు జాతీయపతాకానికి సెల్యుట్ కొట్టి మిగతా 363 రోజులు దేశప్రగతి గురించి కాకుండా కేవలం కుక్షింభరత్వం గురించే బ్రతికేవారైతే మిగతా ఎందరో సాధరణ రాజకీయవేత్తలుగా పి.వి గారు కూడా కేవలం మరొక ఇతర సామాన్య రాజకీయవేత్తగా ఈ దేశచరిత్రపుటల్లో ఉండేవారు...

మనం ఎంచుకున్న మార్గాల్లో మన ప్రగతికి మరియు మన కర్తవ్యనిర్వహణకు అవరోధాలు కలిగించే వారు పరాయివారైతే వాటిని అధిగమిస్తూ ముందుకుసాగడం ఒకింత మామూలే....
కాని స్వవర్గంలోనే శకుని తో కూడిన శల్యులు ఎక్కువగా ఉంటే వారిని త్రోసిరాజని మున్ముందుకు సాగడం ఒకింత సాహసోపేతమైన పయనం...
అటువంటి క్లిష్ట పరిస్థితుల్లో ఈ దేశపగ్గాలను చేబూనిన అనన్యసామాన్య ప్రతిభావంతుడిగా,
తమ్ముడు తమ్ముడే **ఆట **ఆటే అన్నట్టుగా, సొంతవర్గంగా ఉన్నవారిని సమ్యమనంతో సమాధానపరుస్తూనే ఈ దేశాభివృద్ధికై వారు కనబరిచిన రాజనీతిచతురత అనన్యసామన్యమైనది అని ఆనాటి వారి సమకాలీన రాజకీయకోవిదులకు బాగా తెలిసిన సత్యం....

భారతదేశ 9వ ప్రధానమంత్రిగా ఆనాటి అనిశ్చిత అయోమయపరిస్థితుల్లో దేశాన్ని సమర్ధవంతంగా ముందుకునడిపించే కుర్చిలో కూర్చున్నప్పటి నుండి, ఈ కుర్చి శాశ్వతం కాదు మరియు ఈ లోకంలో ఇట్లే ఉండిపోవడం కూడా శాశ్వతం కాదు అనే అంతర్లీన బౌద్ధికపరిణతతో, 
ఈ అత్యున్నత కుర్చిలో ఉన్నంతవరకు ఎంతవీలైతే అంత ఒక సామాన్యుడు కూడా ఎప్పటికీ స్మరించయోగ్యమైన వ్యక్తిత్త్వంగా చరిత్రలో నిలిచిఉండేలా, ఈ దేశగతిని ఒక సువ్యవస్థీకృత శ్రేయోమార్గంలో పయనించేలా చేసి, అనతికాలంలోనే వారి హయాంలో రూపుదిద్దుకున్న సంస్కరణలు భావిభారత ఉజ్జ్వల భవిష్యత్తుకు వేయబడిన పునాదిరాళ్ళుగా కీర్తింపబడే ఒక సురాజనీతిజ్ఞ్యప్రస్థానాన్ని అవలంబించిన రాజనీతిచాణక్యులు పి.వి గారు....

కూరగాయలు, పప్పుదినుసులు ఇంట్లో ఉండడం ఒకెత్తు...
వాటిని వంటగా రూపాంతరంగావించగల శక్తి ఒంట్లో ఉండడం ఒకెత్తు......
చక్కని మేధోవైభవంతో, హృదయస్వఛ్చతతో వాటిని ఒక అమృతమయమైన భోజనంగా రూపాంతరం గావించడం ఒకెత్తు...

ఇదే విధంగా...

చేతిలో గొప్ప అధికారం, అనుచరగణం ఉండడం ఒకెత్తు...
వాటిని గొప్పగా ఉపయోగించుకోగల సమర్ధత ఉండడం ఒకెత్తు....
చక్కని మేధోవైభవంతో, హృదయస్వఛ్చతతో వాటిని ఒక సామాన్యుడు కూడా మెచ్చే రీతిలో ఉండే రాజనీతిశాస్త్ర విహితకర్తవ్యనిర్వహణ గా రూపాంతరం గావించడం ఒకెత్తు...

ఇవ్విధమైన శ్రేయోకారక పాండిత్యంలో అందెవేసిన చెయ్యిగల అపరబృహస్పతిగా జీవించి అమరులైన కారణంగా, శ్రీ పి.వి.నరసిమ్హారావ్ గారిని ఈ భారతావని, మరీ ముఖ్యంగా వారు జన్మించిన ఈ తెలుగునేల ఎప్పటికీ మరవదు, మరవలేదు, మరవకూడదు...
వారి దేశభక్తితత్త్పరతకు, నిజాయితికి,
'భారతరత్న పురస్కారం ' ఎంతో సమంజసమైన మరియాదే అవుతుంది అని అనడం అతిశయోక్తి కానేరదు అని నా అభిప్రాయం... 

అట్టి కోవిదులైన, శ్రీ పి.వి.నరసిమ్హారావ్ గారి 9వ వర్ధంతి సంస్మరణ సందర్భంగా వారి స్మృత్యర్ధం చిరు కవనకుసుమాంజలి....
A sincere tribute to Shree P.V.Narasimha Rao gaaru, hon'ble ex-(9th) Prime Minister of India, on his 19th vardhanti....💐💐💐💐💐💐💐💐💐


No comments:

Post a Comment