Wednesday, October 30, 2024

శ్రీ క్రోధి నామ 2024 సంవత్సర [ ఆశ్వయుజ బహుళ త్రయోదశి / ధనత్రయోదశి, బహుళ చతుర్దశి / నరకచతుర్దశి, దీపావళి అమావాస్య, కార్తీక శుద్ధ పాడ్యమి / బలిపాడ్యమి, శుద్ధ విదియ / యమద్వితీయ / భాయ్ దూజ్ / భగినీహస్తభోజనం, ] అనే 5 రోజుల అత్యంత వైభవభరితమైన సనాతనభారతీయ సంప్రదాయ పర్వసమయ శుభాభినందనలు...🙂💐

శ్రీ క్రోధి నామ 2024 సంవత్సర [ ఆశ్వయుజ బహుళ త్రయోదశి / ధనత్రయోదశి, బహుళ చతుర్దశి / నరకచతుర్దశి, దీపావళి అమావాస్య, కార్తీక శుద్ధ పాడ్యమి / బలిపాడ్యమి, శుద్ధ విదియ / యమద్వితీయ / భాయ్ దూజ్ / భగినీహస్తభోజనం, ] అనే 5 రోజుల అత్యంత వైభవభరితమైన సనాతనభారతీయ సంప్రదాయ పర్వసమయ శుభాభినందనలు...🙂💐

దీపావళి పండగ అనగానే ఒక్కొక్కరు ఒక్కోస్థాయిలో, వారివారి జ్ఞ్యానకౌశలానికి తగ్గట్టుగా ఆ పర్వసమయాన్ని ఒక మధురస్మృతిగా మలుచుకుంటారు...

చిన్నపిల్లలకు దీపావళి అంటే కొత్తబట్టలు, టపాసులు, స్వీట్లు...
పెద్దవాళ్ళకు దీపావళి అంటే వారివారి ఉద్యోగవ్యాపారవ్యవసాయ జీవనమార్గాల్లో ఆచరించే విశేషమైన శ్రీలక్ష్మీ ఆరాధన...

దీపోమేహరతుపాపం దీపజ్యోతిర్నమోస్తుతే....

దీపంసర్వతమోహరం దీపజ్యోతిర్నమోస్తుతే....

దీపేనసాధ్యతేసర్వం దీపజ్యోతిర్నమోస్తుతే....

అనే వివిధ శ్లోకాలతో ఉండే ప్రార్ధనలతో శుభారంభమయ్యే నిత్యపూజాసంప్రదాయాన్ని ఆచారించే విజ్ఞ్యులకు తెలిసినట్టుగా, దీపజ్యోతిప్రజ్వాలన తరువాతే మనం నిత్యపూజ అనే దైనందిన యజ్ఞ్యాన్ని కొనసాగించి, వివిధ ఉపచారాలానంతరం చివరగా కర్పూరమంగళహారతితో సంపూర్ణం గావిస్తాము....

అగ్నితో మొదలై, అగ్నితో సంపూర్ణమయ్యే మన దైనందిన అగ్ని ఆరాధన సంప్రదాయం అనేది భారతీయ సనాతనధర్మవైభవానికి ఉనికిపట్టు....
అనగా అగ్ని ఆరాధన అనేది మన సనాతనధర్మసంప్రదాయసంస్కృతీవైభవానికి జీవగర్ర అనేది అనాదిగా విజ్ఞ్యులైన మన పెద్దల ఉవాచ...

భౌతికపరంగా, మానసికపరంగా, ఆధ్యాత్మికపరంగా, దీపారాధన యొక్క మహత్తు, ఫలితం, పుణ్యం అనేది చాలా విశేషమైనది....
దేశకాలానుగుణంగా వచ్చే పండగ సమయాల్లోని నైమిత్తికారాధనలో ఈ దీపారాధన యొక్క మహత్తు మరింత మెండైనది...
ఇక దీపారాధనే / దీపముల ఆవళి యొక్క ఆరాధనే పండగ అయినప్పుడు, అట్టి దీపావళి పర్వసమయ దీపారాధన యొక్క మహత్తు, ఫలితం, పుణ్యం అనేది అమేయం....

శ్రీచాగంటి సద్గురువులవంటి అగ్రశ్రేణి సంప్రదాయజ్ఞ్యులు వారి ప్రవచనాల్లో నుడివినట్టుగా,

"తైలే లక్ష్మీ, జలే గంగా దీపావళి తిథౌ వసేత్
అలక్ష్మీ పరిహారార్ధం తైలాభ్యంగో విధీయతే.."

అనగా, మొత్తం సంవత్సరకాలంలోని మిగతా 364 రోజుల్లో మనం ప్రార్ధిస్తే జలంలోకి ఆవాహితమయ్యే గంగ యొక్క శక్తి, మనం ప్రార్ధించినా కూడా తైలంలోకి ఆవాహితం కాని
శ్రీలక్ష్మీ శక్తి, కేవలం దీపావళి అమావాస్య నాటి పర్వసమయంలో మాత్రమే మనం ప్రార్ధించినా, ప్రార్ధించకున్నా 
తైలంలో లక్ష్మీశక్తి, జలంలో గంగాశక్తి కొలువైఉండడం అనేది నిర్హేతుక ఈశ్వరానుగ్రహ వైభవం....

[ తిలలు అనగా నువ్వులు..
తైలము అనగా తిలలనుండి సంగ్రహింపబడినది అనగా నువ్వులనూనే.. అని అర్ధం...
కాబట్టి ఎన్ని రకాల నూనెలు మార్కెట్లో అందుబాటులో ఉన్నా కూడా, కేవలం స్వచ్ఛమైన నువ్వులనూనెతో మాత్రమే దీపావళి అభ్యంగనం మరియు దీపారాధన గావించడం ఉత్తమం...
అని విజ్ఞులైన పెద్దల మాట..]

రోడ్డుమీద అలా క్యాజువల్ గా నడుచుకుంటూ వెళ్ళేటప్పుడు, విరబూసిన పొన్నచెట్ల పూలపరిమళాన్ని (పున్నాగపుష్పాలు, కొండమల్లెలు, పొన్నాయిపువ్వులు) కేవలం అలా గాలికివదిలేస్తామా లేక ఆ పూలనుసేకరించి ఈశ్వరసేవలో వినియోగించి అమేయమైన పుణ్యాన్ని సముపార్జిస్తామా అనేది, వారి వారి విజ్ఞతకు సంబంధించిన అంశం...

గొప్పపరిమళభరిత పుష్పాలతో గావించే శ్రీలలితాసహస్రనామపారాయణాంతర్గత పరదేవతారాధన యొక్క ఫలితం అనన్యసామాన్యమైనదిగా
వాగ్దేవతలు ఫలశృతిలో నుడివినారు....

శ్రీహయగ్రీవ, అగస్త్యమహర్షి యొక్క సంవాదమైన శ్రీలలితాసహస్రనామావళి అనుసంధానం యొక్క అనుగ్రహాన్ని వివిధ భక్తులు, వివిధ విజ్ఞానులు, వివిధ ఉపాసకులు 
వారివారి భక్తి జ్ఞ్యాన ఉపాసన యొక్క స్థాయికి తగ్గట్టుగా అందుకొని తరిస్తూ ఉంటారు....
అట్టి సర్వోన్నతమై దేవతానుగ్రహం యొక్క మహత్తు కేవలం 
" ఓం ఇచ్ఛాశక్తి జ్ఞ్యానశక్తి క్రియాశక్తి స్వరూపిణ్యై నమః "
గా ఆరాధింపబడే ఆదిపరాశక్తికి మాత్రమే ఎరుక...

అవ్విధముగనే, నిరంతర భ్రమణంగా సాగే కాలంతర్గత ప్రయాణంలో, ఏడాదికి ఒక్కసారి మాత్రమే సంభవించే ఆశ్వయుజ దీపావళి పర్వసమయంలోని దీపారాధన యొక్క అనుగ్రహం కూడా అటువంటి మహత్తరమైన అనుగ్రహం ...

మీరు గమనించి ఉండి ఉంటే, ఊరూవాడాపల్లేపట్నం మొత్తం కూడా దీపావళి పర్వసమయం అనగానే, రోడ్లమీద కూడా చాలాచోట్ల మట్టితో తయారు చేయబడిన దీపప్రమిదలను విక్రయిస్తూ ఉంటారు....

అనగా దీపావళి పండక్కి ప్రతీఇంట్లో కూడా ఒక్క రెండు దివ్వెలైనా దేదీప్యమానంగా వెలిగేలా మన ఆర్షసంప్రదాయ పెద్దలు అలా విస్తారంగా దివ్వెలవిక్రయాన్ని అనాదిగా ప్రోత్సహిస్తూవస్తున్నారు...

మన హాల్ రూం మొత్తం శుభ్రంగా ఊడ్చారు...
మన కిచెన్ రూం మొత్తం శుభ్రంగా ఊడ్చారు...
మన బెడ్ రూంస్ మొత్తం శుభ్రంగా ఊడ్చారు...
మన బాల్కని మొత్తం శుభ్రంగా ఊడ్చారు...

ఇప్పుడు మన ఇల్లంతా కూడా అలక్ష్మి తొలగి శ్రీలక్ష్మీ వైభవంతో వర్ధిల్లే ఆవాసం అవుతుంది కదా..

అచ్చం అదేవిధంగా..
దీపావళి పర్వసమయం నాడు..
మన ఊరు మొత్తం దీపారాధనతో లక్ష్మీప్రదంగా ఉన్నది...
మన ఇరుగు పొరుగు ఊర్లు మొత్తం దీపారాధనతో లక్ష్మీప్రదంగా ఉన్నవి...
మన పల్లె పట్నం మొత్తం దీపారాధనతో లక్ష్మీప్రదంగా ఉన్నవి...
మన దేశం మొత్తం దీపారాధనతో లక్ష్మీప్రదంగా ఉన్నది...
మన ప్రపంచం మొత్తం మొత్తం దీపారాధనతో లక్ష్మీప్రదంగా ఉన్నది...
ఇప్పుడు మన లోకమంతా కూడా అలక్ష్మి తొలగి శ్రీలక్ష్మీ వైభవంతో వర్ధిల్లే ఆవాసం అవుతుంది కదా...

ఇక్కడ గమనించవలసిన ముఖ్యమైన విషయం ఏంటంటే లక్ష్మి వేరు, శ్రీలక్ష్మీ అనుగ్రహం వేరు...

ధర్మము, భక్తిజ్ఞ్యానము, పరిశ్రమ, ఉన్నచోట ఈశ్వరానుగ్రహంతో లక్ష్మి శ్రీలక్ష్మీ అనుగ్రహంగా రూపాంతరం చెందును...
అవి లుప్తమైన చోట ఈశ్వరానుగ్రహం లేని కారణంగా లక్ష్మి అలక్ష్మిగా రూపాంతరం చెందును...

ఫర్ ఎగ్సాంపుల్....

భూమి / ఇల్లు / పొలం లక్ష్మి....

ధర్మం, భక్తిజ్ఞ్యానం, పరిశ్రమ తో కూడిన ఈశ్వరానుగ్రహం తో సముపార్జింపబడిన భూమి / ఇల్లు / పొలం శ్రీలక్ష్మీ అనుగ్రహమై వర్ధిల్లును...
ఈశ్వరానుగ్రహం లేని భూమి / ఇల్లు / పొలం ఉన్నదంతా ఊడ్చేసే అలక్ష్మిగా రూపాంతరం చెందును...

ధనం లక్ష్మి....

ధర్మం, భక్తిజ్ఞ్యానం, పరిశ్రమ తో కూడిన ఈశ్వరానుగ్రహం తో సముపార్జింపబడిన ధనం శ్రీలక్ష్మీ అనుగ్రహమై వర్ధిల్లును...
ఈశ్వరానుగ్రహం లేని ధనం ఉన్నదంతా ఊడ్చేసే అలక్ష్మిగా రూపాంతరం చెందును...

అధికారం లక్ష్మి...

ధర్మం, భక్తిజ్ఞ్యానం, పరిశ్రమ తో కూడిన ఈశ్వరానుగ్రహం తో సమ్మిళితమైఉండే అధికారం శ్రీలక్ష్మీ అనుగ్రహమై వర్ధిల్లును...
ఈశ్వరానుగ్రహం లేని అధికారం ఉన్నదంతా ఊడ్చేసే అలక్ష్మిగా రూపాంతరం చెందును...

ఇవ్విధముగా ఈ లోకంలో ఉండే ప్రతి విభూతి కూడా లక్ష్మి యే...
కాని ఆ విభూతి
ధర్మం, భక్తిజ్ఞ్యానం, పరిశ్రమ తో కూడిన ఈశ్వరానుగ్రహం తో సమ్మిళితమై ఉన్నప్పుడే శ్రీలక్ష్మీ అనుగ్రహమై వర్ధిల్లును...
ఈశ్వరానుగ్రహం లేని విభూతి ఉన్నదంతా ఊడ్చేసే అలక్ష్మిగా రూపాంతరం చెందును...

అట్టి సర్వోన్నతమైన
ధర్మం, భక్తిజ్ఞ్యానం, పరిశ్రమ అనేవి ఈశ్వరానుగ్రహంగా వృద్ధిచెందాలంటే, అందుకు ఉపయుక్తమైన మేధస్సు అనేది దీపారాధన ద్వారా విశేషంగా సముపార్జింపబడే విభూతి...

అందులో ఆర్డర్ ఆఫ్ ప్రిసిడెన్స్ ప్రకారంగా,
ధర్మం, భక్తిజ్ఞ్యానం, పరిశ్రమ అనేవి వాటివాటి విశేషం తో అలరారే అంశాలు...

అనగా

ఎంతగా పరిశ్రమించినా కూడా భక్తిజ్ఞ్యానములతో సమ్మిళితం కాని నాడు ఆ పరిశ్రమకు అంతగా ఫలితం ఉండదు...

ఎంతో భక్తిజ్ఞ్యానములతో సమ్మిళితమైన పరిశ్రమే అయినా కూడా ధర్మంతో ముడిపడని పరిశ్రమకు అంతగా ఫలితం ఉండదు....

అనేది ఇక్కడ గమనించవల్సిన ధర్మసూక్ష్మ వైభవం....

ఇట్టి ధర్మసూక్ష్మాల జ్ఞ్యానభూమికే ప్రజ్ఞ్యానం అని అనబడును. అట్టి ప్రజ్ఞ్యానం ఆచరణాత్మక చిత్తశుద్దితో సమ్మిళితమైనప్పుడు పరజ్ఞ్యానం / బ్రహ్మజ్ఞ్యానం గా రూపాంతరం చెందును.

దీపం వెలిగించబడిన తదుపరి వత్తి మొదట్లో ఉండే సూదిమొన అంతటి పరిమాణం లో ఉండే లైట్ ఆరంజిష్ యెల్లో డాట్ నుండి ప్రారంభమయ్యే బ్లూ కలర్ ఫ్లేం నుండి మల్లీ అదే కలర్లో పెద్ద ఆరంజిష్ యెల్లో కలర్ దీపశిఖ వెలుగుతూ ఉంటుంది...
మీరెప్పుడైనా దీప ప్రజ్వాలన తరువాత ఏదో సింపుల్ గా ఒక దండం పెట్టి...ఓం గంగణపతయే...అని పూజ ప్రారంభించేయడం కాకుండా...ఆ దీప శిఖని దర్శిస్తూ కొంతసేపు ధ్యానం చేయండి....
అప్పుడు దీపం నుండి బ్రహ్మజ్ఞ్యానం ఎట్లు లభించునో స్వప్రకాశక తత్త్వం గా జ్యోతకమౌతుంది.....

అట్టి సర్వోన్నతమైన బ్రహ్మజ్ఞ్యాన భూమికలో ఓలలాడే జీవుడుకి ఈ యావద్ విశ్వం అంతా కూడా ఒక వెలుగుతున్న పెద్ద దీపశిఖలా గోచరించును.....

ఆ వైశ్విక దీపశిఖయే పరబ్రహ్మంగా గా భాసించును ...
ఆ పరబ్రహ్మభాసలో యావద్ ప్రపంచం గోచరించును....

అందుకే అన్నారు పెద్దలు...

గోచరంబగు జగములోపల
గోప్యమైనది రామ నామము...
రామ నామము రామ నామము
రమ్యమైనది శ్రీరామ నామము..

పండువెన్నెల కాంతి కలిగిన
బ్రహ్మనాదము రామ నామము...
రామ నామము రామ నామము
రమ్యమైనది శ్రీరామ నామము..

ఇత్యాదిగా శ్రీరామతారక మంత్రమును కీర్తిస్తూ....

మనం పున్నమి చంద్రుణ్ణే సరిగ్గా చూడమాయే...
ఇక పండువెన్నెలకాంతితో వినిర్ముక్తమయ్యే బ్రహ్మనాదము గురించి అలోచించేంతటి తీరిక ఎక్కడిది మనకు..

సరే...ఇక మన అసల్ టాపిక్ కి వస్తే...

దీపం యొక్క ప్రమిద మన శరీరానికి ప్రతీక...
దీపం యొక్క త్రివర్తిసమ్యుక్తమైన వత్తి మన అవస్థాత్రయానికి ప్రతీక...
[ జాగ్రత్, స్వప్న, సుషుప్తి అనే మూడు అవస్థల్లోనే సాధారణంగా లోకంలోని అందరి చిత్తమూ ఉండేది...
యోగులు ఉండే తురీయావస్థ గురించి కాసేపు పక్కనపెట్టండి....
]
దీపం దేదీప్యమానంగా వెలగడానికి కారణమైన ఆజ్యం మనం మన శరీరానికి అందించే సత్త్వగుణభరిత పిండాండబ్రహ్మాండ సమన్వయకారక తత్త్వానికి ప్రతీక..
[ దీపానికి అందించే ఆజ్యానికి అనుగుణంగా ఆ దీపశిఖ యొక్క ద్యుతిలో, వాసనలో, వెలుగుతున్న దీపం ప్రసరించే శక్తి యొక్క తత్త్వంలో వివిధ భేదాలు ఉండును.
అనగా...
నేతితో వెలిగించే దీపానికి, నువ్వులనూనేతో వెలిగించే దీపానికి, కొబ్బరినూనేతో వెలిగించే దీపానికి, ఆముదం నూనేతో వెలిగించే దీపానికి, సంఫ్లవరాయిల్ తో వెలిగించే దీపానికి,
అనగా ఆ దీపారాధనతో ప్రకృతిలో కలిగే మార్పుల్లో ఎన్నో భేదాలుండును....
వాటిని మరియు వాటి యొక్క ఫలితాలను సూక్ష్మ అధ్యాత్మజ్ఞ్యానంతో మాత్రమే దర్శించడం సాధ్యం....

అట్లే మనం మన శరీరానికి అందించే పదార్ధాలకు అనుగుణంగా, అనగా మనం భుజించే పదార్ధం వేటితో తయ్యారయ్యింది, ఎవరు తయ్యారు చేసారు, ఎవ్విధంగా తయ్యారు చేసారు, ఇత్యాదిగా ఉండే వివిధ అంశాలకు అనుగుణంగా భుజించిన పదార్ధాల్లో ఆరోవంతు మన మనస్సుగా రూపాంతరం చెందును...
అందుకే భుజింపబడేది ఏ పదార్ధమైననూ పరమాత్మ యొక్క స్మరణతో ప్రార్ధనతో అనుసంధానించుకొని, గాయత్రితో అభిమంత్రించుకొని భుజింపబడినప్పుడు అందలి దోషములన్నీ లయించి ఈశ్వరానుగ్రహంతో అది ప్రసాదంగా అయ్యి మన మనస్సును ఈశ్వరస్మరణపై స్థిరంగా ఉండే సాధనంగా అనుగ్రహించును.... ]

దేదీప్యమానంగా వెలుగుతున్న దీపశిఖయొక్క ప్రారంభస్థానంలో, అనగా ఎక్కడ వత్తి మరియు దీపశిఖ కలిసిఉండునో, అక్కడ ఒక లేత ఎర్రని చుక్కలా ఉండే భాస జీవాత్మకు ప్రతీక...

ఆ జీవాత్మ నుండి, వత్తి ఏమేరకు ప్రమిదనుండి బయటకు వచ్చి ఊర్ధ్వముఖంగా కొలువైఉన్నదో అనేదానికి అనుగుణంగా వెలిగే జ్వాల పరమాత్మకు, పరతత్త్వానికి ప్రతీక....

అనగా, ఎల్లప్పుడూ మడుగులో బొర్లే పందుల్లా, బావిలో బెకబెక అని అరిచే కప్పల్లా కాకుండా, ఈ లోకం నుండి బయటకు వచ్చి ఊర్ధ్వముఖంగా మన చిత్తాన్ని నిలిపినప్పుడు, అనగా
సర్వసాధారణమైన ప్రాపంచిక లంపటాల్లోనే నిత్యం ఉండిపోకుండా, మన చుట్టూ ఉండే ప్రపంచాన్ని కాసేపైనా పక్కనపడేసి, ప్రశాంతంగా, మౌనంగా, తదేక
ఏకాగ్రచిత్తంతో దీపశిఖను ధ్యానిస్తూ ఉంటే, ఈ ప్రపంచానికి ఆవల ఉండే ఊర్ధ్వలోకాల ఆశ్చర్యకరమైన అంశాలు, అనుగ్రహాలు, అనుభవాలు, మనకు అందివచ్చి...,
మనిషిజన్మ యొక్క విహిత కర్తవ్యం,
దేవుడు, పాపపుణ్యాలు, భక్తిప్రపత్తులు, ప్రజ్ఞ్యానం నుండి జనించే బ్రహ్మజ్ఞ్యానం, మహర్షుల ఆర్షవాంగ్మయ ప్రతిపాదిత పరతత్త్వ విశేషాలు, ఇత్యాదిగా అసంఖ్యాకమైన అనిర్వచనీయమైన అగోచరమైన ఉన్నతమైన అంశాల దిశగా మన జీవితం అభివృద్ధిచెంది ఎన్నో గొప్పగొప్ప అంశాలను ఎరుకపరిచి మానవజీవితాన్ని సార్ధకపరిచే సాధనంగా మన పూజ, ఆరాధన, అనే దైనందిన యజ్ఞ్యం వర్ధిల్లును....

ఊరిమీదపడి గంటలతరబడి అడ్డమైన సొల్లువాగుడుకు టైం ఉండే మనిషికి, రోజులో కనీసం ఒక్క 10 నిమిషాలు పద్ధతిగా, శుచిగా ఉండి దీపారాధనలో భాగంగా ఒక్క రెండు పుష్పాలనైనా దేవుడి పాదాల వద్ద సమర్పించి భక్తితో శిరస్సువంచి రెండుచేతులు జోడించి నమస్కరించడానికి టైం లేదనడం ఎంతటి హాస్యాస్పదమో కదా...

కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీమదలర్మేల్మంగాపద్మావతీ సహిత శ్రీశ్రీనివాసుడి  అనుగ్రహంగా, ఈ దీపావళి పండగ విజ్ఞ్యుల జీవితాల్లోని సకలవిధమైన అలక్ష్మిని పరిహరించి శ్రీలక్ష్మీ అనుగ్రహంతో పరిడవిల్లే విధంగా జీవితాలను అభివృద్ధిపరిచే పర్వసమయమై అలరారుగాక...!

***** ***** ***** ***** ***** ***** ***** ***** ***** 
హరికిం బట్టపుదేవి, పున్నెముల ప్రో వర్థంపుఁ బెన్నిక్క, చం
దురు తోఁబుట్టువు, భారతీ గిరిసుతల్ తో నాడు పూఁబోఁడి, తా
మరలం దుండెడి ముద్దరాలు, జగముల్ మన్నించు నిల్లాలు, భా
సురతన్ లేములు వాపు తల్లి, సిరి యిచ్చున్ నిత్యకల్యాణముల్.

భావము:
దేవాదిదేవు డైన శ్రీహరి పట్టపుదేవి శ్రీదేవి; రాశి పోసిన పుణ్యాలు రూపుగట్టిన పుణ్యవతి; సిరిసంపదలకు పెన్నిధి; చందమామకు గారాల చెల్లెలు; వాణితోను పార్వతీదేవితోను క్రీడించే పూబోణి; అరవిందాలు మందిరంగా గల జవరాలు; అఖిలలోకాలకు ఆరాధ్యురాలైన అన్నులమిన్న; చల్లని చూపులతో భక్తుల దారిద్ర్యాన్ని పటాపంచలు చేసే బంగారు తల్లి; ఆ శ్రీమహాలక్ష్మి నిత్యకల్యాణాలు అనుగ్రహించు గాక.

https://telugubhagavatam.org/?tebha&Skanda=1&Ghatta=1&Padyam=11.0
***** ***** ***** ***** ***** ***** ***** ***** *****

సంప్రదాయం తెలిసిన విజ్ఞ్యులకు తెలిసినట్టుగా, దీపావళి పర్వసమయంలో శ్రీసూక్త పఠనం ఎంతో మహత్త్వకారకమైనది....

 
***** శ్రీ సూక్తం *****

ఓమ్ ॥ హిర॑ణ్యవర్ణాం॒ హరి॑ణీం సు॒వర్ణ॑రజ॒తస్ర॑జామ్ ।
చం॒ద్రాం హి॒రణ్మ॑యీం-లఀ॒క్ష్మీం జాత॑వేదో మ॒మావ॑హ ॥

తాం మ॒ ఆవ॑హ॒ జాత॑వేదో ల॒క్ష్మీమన॑పగా॒మినీ᳚మ్ ।
యస్యాం॒ హిర॑ణ్యం-విఀం॒దేయం॒ గామశ్వం॒ పురు॑షాన॒హమ్ ॥

అ॒శ్వ॒పూ॒ర్వాం ర॑థమ॒ధ్యాం హ॒స్తినా॑ద-ప్ర॒బోధి॑నీమ్ ।
శ్రియం॑ దే॒వీముప॑హ్వయే॒ శ్రీర్మా॑ దే॒వీర్జు॑షతామ్ ॥

కాం॒సో᳚స్మి॒ తాం హిర॑ణ్యప్రా॒కారా॑మా॒ర్ద్రాం జ్వలం॑తీం తృ॒ప్తాం త॒ర్పయం॑తీమ్ ।
ప॒ద్మే॒ స్థి॒తాం ప॒ద్మవ॑ర్ణాం॒ తామి॒హోప॑హ్వయే॒ శ్రియమ్ ॥

చం॒ద్రాం ప్ర॑భా॒సాం-యఀ॒శసా॒ జ్వలం॑తీం॒ శ్రియం॑-లోఀ॒కే దే॒వజు॑ష్టాముదా॒రామ్ ।
తాం ప॒ద్మినీ॑మీం॒ శర॑ణమ॒హం ప్రప॑ద్యేఽల॒క్ష్మీర్మే॑ నశ్యతాం॒ త్వాం-వృఀ ॑ణే ॥

ఆ॒ది॒త్యవ॑ర్ణే॒ తప॒సోఽధి॑జా॒తో వన॒స్పతి॒స్తవ॑ వృ॒క్షోఽథ॑ బి॒ల్వః ।
తస్య॒ ఫలా॑ని॒ తప॒సాను॑దంతు మా॒యాంత॑రా॒యాశ్చ॑ బా॒హ్యా అ॑ల॒క్ష్మీః ॥

ఉపై॑తు॒ మాం దే॑వస॒ఖః కీ॒ర్తిశ్చ॒ మణి॑నా స॒హ ।
ప్రా॒దు॒ర్భూ॒తోఽస్మి॑ రాష్ట్రే॒ఽస్మిన్ కీ॒ర్తి॒మృ॑ద్ధిం ద॒దాతు॑ మే ॥

క్షు॒త్పి॒పా॒సామ॑లాం జ్యే॒ష్ఠామ॒ల॒క్షీ-ర్నా॑శయా॒మ్యహమ్ ।
అభూ॑తి॒మస॑మృద్ధిం॒ చ స॒ర్వాం॒ నిర్ణు॑ద మే॒ గృహాత్ ॥

గం॒ధ॒ద్వా॒రాం దు॑రాధ॒ర్​షాం॒ ని॒త్యపు॑ష్టాం కరీ॒షిణీ᳚మ్ ।
ఈ॒శ్వరీగ్ం॑ సర్వ॑భూతా॒నాం॒ తామి॒హోప॑హ్వయే॒ శ్రియమ్ ॥

శ్రీ᳚ర్మే భ॒జతు । అల॒క్షీ᳚ర్మే న॒శ్యతు ।

మన॑సః॒ కామ॒మాకూ॑తిం-వాఀ॒చః స॒త్యమ॑శీమహి ।
ప॒శూ॒నాగ్ం రూ॒పమన్య॑స్య॒ మయి॒ శ్రీః శ్ర॑యతాం॒-యఀశః॑ ॥

క॒ర్దమే॑న ప్ర॑జాభూ॒తా॒ మ॒యి॒ సంభ॑వ క॒ర్దమ ।
శ్రియం॑-వాఀ॒సయ॑ మే కు॒లే॒ మా॒తరం॑ పద్మ॒మాలి॑నీమ్ ॥

ఆపః॑ సృ॒జంతు॑ స్ని॒గ్ధా॒ని॒ చి॒క్లీ॒త వ॑స మే॒ గృహే ।
ని చ॑ దే॒వీం మా॒తరం॒ శ్రియం॑-వాఀ॒సయ॑ మే కు॒లే ॥

ఆ॒ర్ద్రాం పు॒ష్కరి॑ణీం పు॒ష్టిం॒ పిం॒గ॒ళాం ప॑ద్మమా॒లినీమ్ ।
చం॒ద్రాం హి॒రణ్మ॑యీం-లఀ॒క్ష్మీం జాత॑వేదో మ॒మావ॑హ ॥

ఆ॒ర్ద్రాం-యఀః॒ కరి॑ణీం-యఀ॒ష్టిం॒ సు॒వ॒ర్ణాం హే॑మమా॒లినీమ్ ।
సూ॒ర్యాం హి॒రణ్మ॑యీం-లఀ॒క్ష్మీం॒ జాత॑వేదో మ॒మావ॑హ ॥

తాం మ॒ ఆవ॑హ॒ జాత॑వేదో ల॒క్షీమన॑పగా॒మినీ᳚మ్ ।
యస్యాం॒ హిర॑ణ్యం॒ ప్రభూ॑తం॒ గావో॑ దా॒స్యోఽశ్వా᳚న్, విం॒దేయం॒ పురు॑షాన॒హమ్ ॥

యశ్శుచిః॑ ప్రయతో భూ॒త్వా॒ జు॒హుయా॑-దాజ్య॒-మన్వ॑హమ్ ।
శ్రియః॑ పం॒చద॑శర్చం చ శ్రీ॒కామ॑స్సత॒తం॒ జ॑పేత్ ॥

ఆనందః కర్ద॑మశ్చై॒వ చిక్లీ॒త ఇ॑తి వి॒శ్రుతాః ।
ఋష॑య॒స్తే త్ర॑యః పుత్రాః స్వ॒యం॒ శ్రీరే॑వ దే॒వతా ॥

పద్మాననే ప॑ద్మ ఊ॒రూ॒ ప॒ద్మాక్షీ ప॑ద్మసం॒భవే ।
త్వం మాం᳚ భ॒జస్వ॑ పద్మా॒క్షీ యే॒న సౌఖ్యం॑-లఀభా॒మ్యహమ్ ॥

అ॒శ్వదా॑యీ చ గోదా॒యీ॒ ధ॒నదా॑యీ మ॒హాధ॑నే ।
ధనం॑ మే॒ జుష॑తాం దే॒వీ స॒ర్వకా॑మార్థ॒ సిద్ధ॑యే ॥

పుత్రపౌత్ర ధనం ధాన్యం హస్త్యశ్వాజావిగో రథమ్ ।
ప్రజానాం భవసి మాతా ఆయుష్మంతం కరోతు మామ్ ॥

చంద్రాభాం-లఀక్ష్మీమీశానాం సూర్యాభాం᳚ శ్రియమీశ్వరీమ్ ।
చంద్ర సూర్యాగ్ని సర్వాభాం శ్రీ మహాలక్ష్మీ-ముపాస్మహే ॥

ధన-మగ్ని-ర్ధనం-వాఀయు-ర్ధనం సూర్యో॑ ధనం-వఀసుః ।
ధనమింద్రో బృహస్పతి-ర్వరు॑ణం ధనమ॑శ్నుతే ॥

వైనతేయ సోమం పిబ సోమం॑ పిబతు వృత్రహా ।
సోమం॒ ధనస్య సోమినో॒ మహ్యం॑ దదాతు సోమినీ॑ ॥

న క్రోధో న చ మాత్స॒ర్యం న లోభో॑ నాశుభా మతిః ।
భవంతి కృత పుణ్యానాం భ॒క్తానాం శ్రీ సూ᳚క్తం జపేత్సదా ॥

వర్​షం᳚తు॒ తే వి॑భావ॒రి॒ ది॒వో అభ్రస్య విద్యు॑తః ।
రోహం᳚తు సర్వ॑బీజాన్యవ బ్రహ్మ ద్వి॒షో᳚ జ॑హి ॥

పద్మప్రియే పద్మిని పద్మహస్తే పద్మాలయే పద్మ-దళాయతాక్షీ ।
విశ్వప్రియే విష్ణు మనోనుకూలే త్వత్పాదపద్మం మయి సన్నిధత్స్వ ॥

యా సా పద్మాసనస్థా విపులకటితటీ పద్మపత్రాయతాక్షీ ।
గంభీరా వర్తనాభిః స్తనభరనమితా శుభ్ర వస్తోత్తరీయా ॥

లక్ష్మీ-ర్దివ్యై-ర్గజేంద్రై-ర్మణిగణ ఖచితై-స్స్నాపితా హేమకుంభైః ।
నిత్యం సా పద్మహస్తా మమ వసతు గృహే సర్వ మాంగళ్యయుక్తా ॥

లక్ష్మీం క్షీర సముద్ర రాజతనయాం శ్రీరంగ ధామేశ్వరీమ్ ।
దాసీభూత సమస్త దేవ వనితాం-లోఀకైక దీపాంకురామ్ ।
శ్రీమన్మంద కటాక్ష లబ్ధ విభవ బ్రహ్మేంద్ర గంగాధరామ్ ।
త్వాం త్రైలోక్య కుటుంబినీం సరసిజాం-వంఀదే ముకుందప్రియామ్ ॥

సిద్ధలక్ష్మీ-ర్మోక్షలక్ష్మీ-ర్జయలక్ష్మీ-స్సరస్వతీ ।
శ్రీలక్ష్మీ-ర్వరలక్ష్మీశ్చ ప్రసన్నా మమ సర్వదా ॥

వరాంకుశౌ పాశమభీతి ముద్రామ్ ।
కరైర్వహంతీం కమలాసనస్థామ్ ।
బాలార్కకోటి ప్రతిభాం త్రినేత్రామ్ ।
భజేఽహమంబాం జగదీశ్వరీం తామ్ ॥

సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే ।
శరణ్యే త్య్రంబకే దేవీ నారాయణి నమోస్తుతే ॥

ఓం మ॒హా॒దే॒వ్యై చ॑ వి॒ద్మహే॑ విష్ణుప॒త్నీ చ॑ ధీమహి ।
తన్నో॑ లక్ష్మీః ప్రచో॒దయా᳚త్ ॥

శ్రీ-ర్వర్చ॑స్వ॒-మాయు॑ష్య॒-మారో᳚గ్య॒-మావీ॑ధా॒త్-శోభ॑మానం మహీ॒యతే᳚ ।
ధా॒న్యం ధ॒నం ప॒శుం బ॒హుపు॑త్రలా॒భం శ॒తసం᳚​వఀత్స॒రం దీ॒ర్ఘమాయుః॑ ॥

ఓం శాంతిః॒ శాంతిః॒ శాంతిః॑

మంచి మనిషిగా బ్రతకడానికి కావలసిన శక్తియుక్తులను అందించేందుకు దోహదమయ్యే సామాజిక సంస్కరణలే మన సనాతనహైందవసంప్రదాయ పండగలు.....

ఎందుకంటే తినితాగితిరిగినిద్రించడం లోనే వాటి జీవితం మొత్తం గడిచిపోతుంది.....
అందుకే పశువులకు గౌరవమరియాదలు అనే పదం అంతగా వర్తించదు....

కేవలం మనుషులకు మాత్రమే దేవుళ్ళు, పండుగలు, ఉత్సవాలు, ఆచారాలు, సంప్రదాయాలు....
ఎందుకంటే....
మూర్ఖత్వం తో జీవించే మరో పశువే అయితే మనిషి కూడా నడిచే జంతువుతో సమానం కాబట్టి, గౌరవప్రదంగా బ్రతకని, మసులుకోని మనుషులకు గౌరవమరియాదలు అనే పదం అంతగా వర్తించదు....

మంచి మనిషిగా బ్రతకడానికి కావలసిన శక్తియుక్తులను అందించేందుకు దోహదమయ్యే సామాజిక సంస్కరణలే మన సనాతనహైందవసంప్రదాయ పండగలు.....

భగవంతుడి అనుగ్రహసముపార్జనే అర్ధవంతమైన జీవితం అనే అంతరార్ధం తెలుసుకోకుండా ఎన్ని దసరా పండగలు జరుపుకున్నా, ఎన్ని దీపావళి పండగలు జరుపుకున్నా, మనిషికి ఏ విలువా సంతరింపబడదు...

మంచిగంధం అలదే వారున్నా కూడా బురదలోపందిలా బ్రతకడమే బ్రతుకు అని అనుకునేవారికి...
ఎన్ని దసరా పండుగలు వచ్చినా అది అర్ధంలేని వృధా ప్రయాస....

కూరగాయలు విక్రయించే (సంత, అంగడి) ప్రదేశానికి వెళ్ళి వందరూపాయలు వెచ్చించి ఒకవారానికి సరిపడే ఆరోగ్యకరమైన కూరగాయలు కొనుక్కొని, వండుకొని భుజిస్తే ఆరోగ్యమయమైన జీవితం లభించును...
ఎక్కడ అన్నిరకాల కూరగాయలు కొలువై విక్రయింపబడునో అక్కడికి, ఆ సంత/అంగడికి వినియోగదారుడు వెళ్ళవలసి ఉంటుంది....అంతేకాని వినియోగదారుడి దెగ్గరికి అంగడి నడిచిరాదు....
అనేది ఎంత నిజమో....

భగవంతుడు, భక్తభాగవతులు ఎక్కడ కొలువైఉంటే (ఆలయాలు, మందిరాలు) భక్తులు అక్కడికి వారానికొక్కసారైనా వెళ్ళి ప్రదక్షిణ నమస్కారం ఒనరిస్తే అది ఈశ్వరుడికి గావింపబడిన నమస్కారం గా పరిగణింపబడి పుణ్యంగా రూపాంతరం చెందును....
ఈ కలియుగానికి తిరుమలేశుడైన శ్రీశ్రీనివాసుడే ఎల్లరికీ కూడా ప్రత్యక్ష నిత్య ఆరాధ్య దైవం...
ఎక్కడ ఆ సర్వదేవతావంద్యుడు కొలువైఉంటే అక్కడికి భక్తులు వెళ్ళవలసి ఉంటుంది....అంతేకాని భక్తుడి దెగ్గరికి దేవాలయం నడిచిరాదు....
అనేది కూడా అంతే నిజం....

వారివారి ఆరోగ్యాభివృద్ధికై,
ఒకరు హాస్పటల్ కి వెళ్ళకపోతే, వెళ్ళాలనే ఉత్సుకత లేకపోతే, వెళ్ళగలిగే భాగ్యం లేకపోతే
అది వారి కర్మ...
అదే వారి కర్మ...
(అనగా ఆరోగ్యాన్ని సముపార్జించే వీలులేని దారిద్యస్థితిలోనే ఉండవలసిన అగత్యం)
దానికి ఇతరులు ఎవ్విధంగానూ కారణం కారు.....

వారివారి జీవనాభివృద్ధికై,
ఒకరు స్కూల్ కి వెళ్ళకపోతే, వెళ్ళాలనే ఉత్సుకత లేకపోతే, వెళ్ళగలిగే భాగ్యం లేకపోతే
అది వారి కర్మ...
అదే వారి కర్మ...
(అనగా విద్యను సముపార్జించే వీలులేని దారిద్యస్థితిలోనే ఉండవలసిన అగత్యం)
దానికి ఇతరులు ఎవ్విధంగానూ కారణం కారు.....

వారివారి జీవితాభివృద్ధికై,
ఒకరు దేవాలయానికి వెళ్ళకపోతే, వెళ్ళాలనే ఉత్సుకత లేకపోతే, వెళ్ళగలిగే భాగ్యం లేకపోతే
అది వారి కర్మ...
అదే వారి కర్మ...
(అనగా పుణ్యాన్ని సముపార్జించే వీలులేని దారిద్యస్థితిలోనే ఉండవలసిన అగత్యం)
దానికి ఇతరులు ఎవ్విధంగానూ కారణం కారు.....

నీ పుట్టుపూర్వోత్తరాలతో సంబంధంలేకుండా...

హాస్పటల్ కి వెళ్ళి చక్కని వైద్యాన్ని అందుకొని, ఆరోగ్యాన్ని సముపార్జించి తరించడం నీ, నీవారి బాధ్యత....

స్కూల్ కి వెళ్ళి చక్కని విద్యను అందుకొని, జ్ఞ్యానాన్ని సముపార్జించి తరించడం నీ, నీవారి బాధ్యత....

దేవాలయానికి కి వెళ్ళి చక్కని ఈశ్వరానుగ్రహాన్ని అందుకొని, పుణ్యాన్ని సముపార్జించి తరించడం నీ, నీవారి బాధ్యత....

అందుకే ప్రైవేట్ వారు అందించినా, అందించకున్నా....
తమవంతు విహితకర్తవ్యంగా విజ్ఞ్యతగల ప్రతీ ప్రభుత్వం కూడా వారి ప్రజలకు సర్కార్ బడుల్లో ఉచిత విద్యను, సర్కార్ ఆస్పత్రుల్లో ఉచిత వైద్యాన్ని, ప్రభుత్వ పర్యవేక్షణలోని,
దేవాదాయాధర్మాదాయశాఖ ఆధ్వర్యంలోని దేవాలయాల్లో ఉచిత దైవదర్శనాన్ని అందించేది......

శ్రీమద్రామాయణంలోని ఒక సంఘటన గురించి శ్రీచాగంటి సద్గురువుల ప్రవచనాల్లో విన్నప్పుడు నేను ఎంతో ఆశ్చర్యానికిలోనై...
"ఔరా...మన శ్రీమద్రామాయణం ఎంతటి గొప్ప ఆదికావ్యం...!" అని ఇప్పటికీ కొన్ని సంఘటనలను
నెమరువేసుకుంటూఉంటాను....

సీతమ్మ రావణాసురునితో ఇవ్విధంగా అనడం.....
" ఒరె రావణా...లంకలో నీకు మంచి చెప్పేవారు లేరా...లేక చెప్పేవారున్నా కూడా నువ్వు వినవా ??"
అనే గొప్ప మాట ఎంతమంది జీవితాలను ప్రభావితం చేసిందో....

రాక్షసులు అంటే బహుషా అంతటి కఠినులు, మూర్ఖులు, జడులు, కావచ్చు....
అందుకే శ్రీపోతనామాత్యులవారు ఆదిపరాశక్తిని,

***** ***** ***** ***** ***** *****

అమ్మలఁ గన్నయమ్మ, ముగురమ్మలమూలపుటమ్మ, చాలఁ బె
ద్దమ్మ, సురారులమ్మ కడు పాఱడి పుచ్చిన యమ్మ, తన్ను లో
నమ్మిన వేల్పుటమ్మల మనమ్ముల నుండెడి యమ్మ, దుర్గ, మా
యమ్మ, కృపాబ్ధి యిచ్చుత మహత్త్వకవిత్వ పటుత్వ సంపదల్.
భా-1-10-ఉ.

తాత్పర్యం :

దుర్గాదేవి తల్లు లందరికి తల్లి; సప్తమాతృకలను కన్నతల్లి; ముల్లోకాలకు మూలమైన లక్ష్మి సరస్వతి పార్వతులకు మూలమైన తల్లి; అందరు అమ్మల కన్నా అధికురాలైన గొప్పతల్లి; దైత్యులను నాశనము చేసి వారి తల్లియైన దితి కడుపులో దుఃఖము చేకూర్చిన తల్లి; నమ్ముకున్న దేవతామతల్లుల నిండు మనసులలో నివసించే తల్లి; అయిన మా అమ్మ దయాసముద్రి అయి ఈ మహాభాగవత తెలుగు ప్రణీత మందు కవిత్వంలో మహత్వము, పటుత్వములను సమృద్ధిగా ప్రసాదించు గాక.
***** ***** ***** ***** ***** ***** 

నిత్యం తనను నమ్మి ఆరాధించే భక్తుల, దేవతల యొక్క శత్రువుల / రాక్షసుల భార్యల కంఠసీమలోని మంగళసూత్రాలను హరించే ఆ ఆదిపరాశక్తి....,
నా జీవితాన్ని, ఆరోగ్యాన్ని, మనఃశాంతిని కావాలని ఎంతగానో ఇబ్బందిపెడుతున్న రాక్షసుల భార్యల కంఠసీమలోని మంగళసూత్రాలను ఆ ఆదిపరాశక్తి హరించివేయుగాక అని 
ఓరుగల్లు భద్రకాళిని, ఉజ్జైని మహంకాళిని, బెజవాడ కనకదుర్గమ్మను ప్రార్ధిస్తూ....
అందరికీ 2024 దసర, దశహర, పండగ శుభాభినందనలు....💐

***** దుర్గా సూక్తం *****

ఓమ్ ॥ జా॒తవే॑దసే సునవామ॒ సోమ॑ మరాతీయ॒తో నిద॑హాతి॒ వేదః॑ ।
స నః॑ పర్-ష॒దతి॑ దు॒ర్గాణి॒ విశ్వా॑ నా॒వేవ॒ సింధుం॑ దురి॒తాఽత్య॒గ్నిః ॥

తామ॒గ్నివ॑ర్ణాం॒ తప॑సా జ్వలం॒తీం-వైఀ ॑రోచ॒నీం క॑ర్మఫ॒లేషు॒ జుష్టా᳚మ్ ।
దు॒ర్గాం దే॒వీగ్ం శర॑ణమ॒హం ప్రప॑ద్యే సు॒తర॑సి తరసే॒ నమః॑ ॥

అగ్నే॒ త్వం పా॑రయా॒ నవ్యో॑ అ॒స్మాంథ్​స్వ॒స్తిభి॒రతి॑ దు॒ర్గాణి॒ విశ్వా᳚ ।
పూశ్చ॑ పృ॒థ్వీ బ॑హు॒లా న॑ ఉ॒ర్వీ భవా॑ తో॒కాయ॒ తన॑యాయ॒ శం​యోఀః ॥

విశ్వా॑ని నో దు॒ర్గహా॑ జాతవేదః॒ సింధు॒న్న నా॒వా దు॑రి॒తాఽతి॑పర్-షి ।
అగ్నే॑ అత్రి॒వన్మన॑సా గృణా॒నో᳚ఽస్మాకం॑ బోధ్యవి॒తా త॒నూనా᳚మ్ ॥

పృ॒త॒నా॒ జిత॒గ్ం॒ సహ॑మానము॒గ్రమ॒గ్నిగ్ం హు॑వేమ పర॒మాథ్స॒ధస్థా᳚త్ ।
స నః॑ పర్-ష॒దతి॑ దు॒ర్గాణి॒ విశ్వా॒ క్షామ॑ద్దే॒వో అతి॑ దురి॒తాఽత్య॒గ్నిః ॥

ప్ర॒త్నోషి॑ క॒మీడ్యో॑ అధ్వ॒రేషు॑ స॒నాచ్చ॒ హోతా॒ నవ్య॑శ్చ॒ సత్సి॑ ।
స్వాంచా᳚ఽగ్నే త॒నువం॑ పి॒ప్రయ॑స్వా॒స్మభ్యం॑ చ॒ సౌభ॑గ॒మాయ॑జస్వ ॥

గోభి॒ర్జుష్ట॑మయుజో॒ నిషి॑క్తం॒ తవేం᳚ద్ర విష్ణో॒రను॒సంచ॑రేమ ।
నాక॑స్య పృ॒ష్ఠమ॒భి సం॒​వఀసా॑నో॒ వైష్ణ॑వీం-లోఀ॒క ఇ॒హ మా॑దయంతామ్ ॥

ఓం కా॒త్యా॒య॒నాయ॑ వి॒ద్మహే॑ కన్యకు॒మారి॑ ధీమహి । తన్నో॑ దుర్గిః ప్రచో॒దయా᳚త్ ॥

ఓం శాంతిః॒ శాంతిః॒ శాంతిః॑ ॥

ఉన్నతమైన జీవితబాట గురించి బాగా క్లారిటీ ఉన్న విజ్ఞ్యుల నుండి మూర్ఖులకు ఏనాడు కూడా ఎవ్విధమైన క్లారిటీ లభించదు...ఎందుకంటే, విజ్ఞ్యులు ఒక పిచ్చోడి చేతికి రత్నాలను చూడ్డానికి కూడా ఇవ్వరు కాబట్టి....

ఒక అడవిలో ఒక ఏనుగు, 'నేను కొంతకాలం కేవలం లైట్ వేట్ లొ ఫ్యాట్ వెజిటేబుల్స్ అండ్ ఫ్రూట్స్ ని మాత్రమే భుజిస్తాను, బాగా బలిసిన అడవిదుంపలను, కొవ్వెక్కిన పామాయిల్ పండ్లను, ఇతర హై ఫ్యాట్ ఫూడ్స్ ని కొంతకాలం వరకు ఆరగించను...కొంతకాలం తర్వాత మళ్ళీ నా విశ్వరూపంతో విజృంభిస్తూ అన్నీ భుజిస్తాను...'
అని అంటే....

దాని అర్ధం ఆ ఏనుగుకు ఏదో అయిపోయిందని అనుకొని ఎవరికి తోచినట్టుగా వారు వ్యాసాలను ప్రచురించడం మానుకొని, ఆ ఏనుగు కొన్ని కారణాల రీత్య ఒకానొక మానసిక దీక్షలో ఉన్నట్టుగా భావించడంలో ఔన్నత్యముండును....

ఎంతసేపు ఇతరులు ఎలా జీవించాలి అనే అంశం గురించి కాకుండా, 
ఇతరుల జీవితాలను మీరు ధరించే సంకుచితత్త్వం అనే కళ్ళజోడుతో కాకుండా,
ఇతరుల జీవితాల్లోకి చొరబడకుండా, ఇబ్బంది పెట్టకుండా, మనం ఎంతటి ఔన్నత్యంతో జీవిస్తున్నాము అనే అంశంపై స్వాధ్యాయం గావిస్తూ, జీవించడంలో అర్ధం పరమార్ధం ఉండును...

ఒక మడుగులో, కొన్ని పందులు బొర్లుతూ ఉంటాయి మరియు కొన్ని కమలాలు తేలుతూ ఉంటాయి....
మడుగులో ఉన్న బురదను గంధంగా పూసుకుంటూ జీవించడం, ఆ మడుగులో బొర్లే పందులకు సామాన్యధర్మం....
మడుగులో ఉన్న బురదను అంటకుండా తమ సుగంధాన్ని వెదజల్లుతూ జీవించడం, ఆ మడుగులో వికసించే పద్మాలకు విశేషధర్మం....

బురదలో బొర్లే పందుల వల్ల, మడుగులోని పద్మాలు తమ విలువను కోల్పోవు....
బురద అంటకుండా వికసించే పద్మాల వల్ల, మడుగులోని పందులు ఏ విలువా సంతరించుకోవు...

ఎందుకంటే...
పద్మాల చూపు, ధ్యాస ఎల్లప్పుడూ కూడా ఈశ్వరసేవలో తరించడంకోసం గొప్పగా వికసించడానికై తూర్పున ఉదయించే సూర్యుడికోసం.....
బురదలో బొర్లే పందుల గురించి పద్మాలకు పెద్దగా ఏ పట్టింపూ ఉండదు....
మరియు
పందుల చూపు, ధ్యాస ఎల్లప్పుడూ కూడా పందిలా బురదలో బొర్లడం గురించి మాత్రమే....
బురద అంటకుండా ఎంతో గొప్పగా వికసించే పద్మాలగురించి పందులకు పెద్దగా ఏ పట్టింపూ ఉండదు....

కాబట్టి,

నిత్యం శ్రీలక్ష్మికి ఆవాసంగా ఉండే మడుగులోని పద్మాల గురించి,
మరియు
నిత్యం అలక్ష్మికి ఆవాసంగా ఉండే మడుగులో బొర్లే పందుల గురించి,
తగినంతగా అవగాహన లేనివారు, వారి కళానైపుణ్యాలను వారివారి జీవితాలను ఉద్ధరించుకోవడానికి వినియోగించడం మంచిది....

కొత్తకొత్తగా మార్షియల్ ఆర్ట్స్ లో జాయిన్ అయిన ఒక బంటిగాడు వెళ్ళి బ్రూస్ లీ కి, జాకి చాన్ కి, అక్షయ్ కుమార్ కి, మోహన్ లాల్ కి, మార్షియల్ ఆర్ట్స్ నేర్పిస్తా అని అన్నడంటా...
అనే సామెతలా కొందరి వెర్రి ఏంటో ఎంతకీ అర్ధంకాదు....

ఉన్నతమైన జీవితబాట గురించి బాగా క్లారిటీ ఉన్న విజ్ఞ్యుల నుండి మూర్ఖులకు ఏనాడు కూడా ఎవ్విధమైన క్లారిటీ లభించదు...
ఎందుకంటే, విజ్ఞ్యులు ఒక పిచ్చోడి చేతికి రత్నాలను చూడ్డానికి కూడా ఇవ్వరు కాబట్టి....