ఒక అడవిలో ఒక ఏనుగు, 'నేను కొంతకాలం కేవలం లైట్ వేట్ లొ ఫ్యాట్ వెజిటేబుల్స్ అండ్ ఫ్రూట్స్ ని మాత్రమే భుజిస్తాను, బాగా బలిసిన అడవిదుంపలను, కొవ్వెక్కిన పామాయిల్ పండ్లను, ఇతర హై ఫ్యాట్ ఫూడ్స్ ని కొంతకాలం వరకు ఆరగించను...కొంతకాలం తర్వాత మళ్ళీ నా విశ్వరూపంతో విజృంభిస్తూ అన్నీ భుజిస్తాను...'
అని అంటే....
దాని అర్ధం ఆ ఏనుగుకు ఏదో అయిపోయిందని అనుకొని ఎవరికి తోచినట్టుగా వారు వ్యాసాలను ప్రచురించడం మానుకొని, ఆ ఏనుగు కొన్ని కారణాల రీత్య ఒకానొక మానసిక దీక్షలో ఉన్నట్టుగా భావించడంలో ఔన్నత్యముండును....
ఎంతసేపు ఇతరులు ఎలా జీవించాలి అనే అంశం గురించి కాకుండా,
ఇతరుల జీవితాలను మీరు ధరించే సంకుచితత్త్వం అనే కళ్ళజోడుతో కాకుండా,
ఇతరుల జీవితాల్లోకి చొరబడకుండా, ఇబ్బంది పెట్టకుండా, మనం ఎంతటి ఔన్నత్యంతో జీవిస్తున్నాము అనే అంశంపై స్వాధ్యాయం గావిస్తూ, జీవించడంలో అర్ధం పరమార్ధం ఉండును...
ఒక మడుగులో, కొన్ని పందులు బొర్లుతూ ఉంటాయి మరియు కొన్ని కమలాలు తేలుతూ ఉంటాయి....
మడుగులో ఉన్న బురదను గంధంగా పూసుకుంటూ జీవించడం, ఆ మడుగులో బొర్లే పందులకు సామాన్యధర్మం....
మడుగులో ఉన్న బురదను అంటకుండా తమ సుగంధాన్ని వెదజల్లుతూ జీవించడం, ఆ మడుగులో వికసించే పద్మాలకు విశేషధర్మం....
బురదలో బొర్లే పందుల వల్ల, మడుగులోని పద్మాలు తమ విలువను కోల్పోవు....
బురద అంటకుండా వికసించే పద్మాల వల్ల, మడుగులోని పందులు ఏ విలువా సంతరించుకోవు...
ఎందుకంటే...
పద్మాల చూపు, ధ్యాస ఎల్లప్పుడూ కూడా ఈశ్వరసేవలో తరించడంకోసం గొప్పగా వికసించడానికై తూర్పున ఉదయించే సూర్యుడికోసం.....
బురదలో బొర్లే పందుల గురించి పద్మాలకు పెద్దగా ఏ పట్టింపూ ఉండదు....
మరియు
పందుల చూపు, ధ్యాస ఎల్లప్పుడూ కూడా పందిలా బురదలో బొర్లడం గురించి మాత్రమే....
బురద అంటకుండా ఎంతో గొప్పగా వికసించే పద్మాలగురించి పందులకు పెద్దగా ఏ పట్టింపూ ఉండదు....
కాబట్టి,
నిత్యం శ్రీలక్ష్మికి ఆవాసంగా ఉండే మడుగులోని పద్మాల గురించి,
మరియు
నిత్యం అలక్ష్మికి ఆవాసంగా ఉండే మడుగులో బొర్లే పందుల గురించి,
తగినంతగా అవగాహన లేనివారు, వారి కళానైపుణ్యాలను వారివారి జీవితాలను ఉద్ధరించుకోవడానికి వినియోగించడం మంచిది....
కొత్తకొత్తగా మార్షియల్ ఆర్ట్స్ లో జాయిన్ అయిన ఒక బంటిగాడు వెళ్ళి బ్రూస్ లీ కి, జాకి చాన్ కి, అక్షయ్ కుమార్ కి, మోహన్ లాల్ కి, మార్షియల్ ఆర్ట్స్ నేర్పిస్తా అని అన్నడంటా...
అనే సామెతలా కొందరి వెర్రి ఏంటో ఎంతకీ అర్ధంకాదు....
ఉన్నతమైన జీవితబాట గురించి బాగా క్లారిటీ ఉన్న విజ్ఞ్యుల నుండి మూర్ఖులకు ఏనాడు కూడా ఎవ్విధమైన క్లారిటీ లభించదు...
ఎందుకంటే, విజ్ఞ్యులు ఒక పిచ్చోడి చేతికి రత్నాలను చూడ్డానికి కూడా ఇవ్వరు కాబట్టి....
No comments:
Post a Comment