ఎందుకంటే తినితాగితిరిగినిద్రించడం లోనే వాటి జీవితం మొత్తం గడిచిపోతుంది.....
అందుకే పశువులకు గౌరవమరియాదలు అనే పదం అంతగా వర్తించదు....
కేవలం మనుషులకు మాత్రమే దేవుళ్ళు, పండుగలు, ఉత్సవాలు, ఆచారాలు, సంప్రదాయాలు....
ఎందుకంటే....
మూర్ఖత్వం తో జీవించే మరో పశువే అయితే మనిషి కూడా నడిచే జంతువుతో సమానం కాబట్టి, గౌరవప్రదంగా బ్రతకని, మసులుకోని మనుషులకు గౌరవమరియాదలు అనే పదం అంతగా వర్తించదు....
మంచి మనిషిగా బ్రతకడానికి కావలసిన శక్తియుక్తులను అందించేందుకు దోహదమయ్యే సామాజిక సంస్కరణలే మన సనాతనహైందవసంప్రదాయ పండగలు.....
భగవంతుడి అనుగ్రహసముపార్జనే అర్ధవంతమైన జీవితం అనే అంతరార్ధం తెలుసుకోకుండా ఎన్ని దసరా పండగలు జరుపుకున్నా, ఎన్ని దీపావళి పండగలు జరుపుకున్నా, మనిషికి ఏ విలువా సంతరింపబడదు...
మంచిగంధం అలదే వారున్నా కూడా బురదలోపందిలా బ్రతకడమే బ్రతుకు అని అనుకునేవారికి...
ఎన్ని దసరా పండుగలు వచ్చినా అది అర్ధంలేని వృధా ప్రయాస....
కూరగాయలు విక్రయించే (సంత, అంగడి) ప్రదేశానికి వెళ్ళి వందరూపాయలు వెచ్చించి ఒకవారానికి సరిపడే ఆరోగ్యకరమైన కూరగాయలు కొనుక్కొని, వండుకొని భుజిస్తే ఆరోగ్యమయమైన జీవితం లభించును...
ఎక్కడ అన్నిరకాల కూరగాయలు కొలువై విక్రయింపబడునో అక్కడికి, ఆ సంత/అంగడికి వినియోగదారుడు వెళ్ళవలసి ఉంటుంది....అంతేకాని వినియోగదారుడి దెగ్గరికి అంగడి నడిచిరాదు....
అనేది ఎంత నిజమో....
భగవంతుడు, భక్తభాగవతులు ఎక్కడ కొలువైఉంటే (ఆలయాలు, మందిరాలు) భక్తులు అక్కడికి వారానికొక్కసారైనా వెళ్ళి ప్రదక్షిణ నమస్కారం ఒనరిస్తే అది ఈశ్వరుడికి గావింపబడిన నమస్కారం గా పరిగణింపబడి పుణ్యంగా రూపాంతరం చెందును....
ఈ కలియుగానికి తిరుమలేశుడైన శ్రీశ్రీనివాసుడే ఎల్లరికీ కూడా ప్రత్యక్ష నిత్య ఆరాధ్య దైవం...
ఎక్కడ ఆ సర్వదేవతావంద్యుడు కొలువైఉంటే అక్కడికి భక్తులు వెళ్ళవలసి ఉంటుంది....అంతేకాని భక్తుడి దెగ్గరికి దేవాలయం నడిచిరాదు....
అనేది కూడా అంతే నిజం....
వారివారి ఆరోగ్యాభివృద్ధికై,
ఒకరు హాస్పటల్ కి వెళ్ళకపోతే, వెళ్ళాలనే ఉత్సుకత లేకపోతే, వెళ్ళగలిగే భాగ్యం లేకపోతే
అది వారి కర్మ...
అదే వారి కర్మ...
(అనగా ఆరోగ్యాన్ని సముపార్జించే వీలులేని దారిద్యస్థితిలోనే ఉండవలసిన అగత్యం)
దానికి ఇతరులు ఎవ్విధంగానూ కారణం కారు.....
వారివారి జీవనాభివృద్ధికై,
ఒకరు స్కూల్ కి వెళ్ళకపోతే, వెళ్ళాలనే ఉత్సుకత లేకపోతే, వెళ్ళగలిగే భాగ్యం లేకపోతే
అది వారి కర్మ...
అదే వారి కర్మ...
(అనగా విద్యను సముపార్జించే వీలులేని దారిద్యస్థితిలోనే ఉండవలసిన అగత్యం)
దానికి ఇతరులు ఎవ్విధంగానూ కారణం కారు.....
వారివారి జీవితాభివృద్ధికై,
ఒకరు దేవాలయానికి వెళ్ళకపోతే, వెళ్ళాలనే ఉత్సుకత లేకపోతే, వెళ్ళగలిగే భాగ్యం లేకపోతే
అది వారి కర్మ...
అదే వారి కర్మ...
(అనగా పుణ్యాన్ని సముపార్జించే వీలులేని దారిద్యస్థితిలోనే ఉండవలసిన అగత్యం)
దానికి ఇతరులు ఎవ్విధంగానూ కారణం కారు.....
నీ పుట్టుపూర్వోత్తరాలతో సంబంధంలేకుండా...
హాస్పటల్ కి వెళ్ళి చక్కని వైద్యాన్ని అందుకొని, ఆరోగ్యాన్ని సముపార్జించి తరించడం నీ, నీవారి బాధ్యత....
స్కూల్ కి వెళ్ళి చక్కని విద్యను అందుకొని, జ్ఞ్యానాన్ని సముపార్జించి తరించడం నీ, నీవారి బాధ్యత....
దేవాలయానికి కి వెళ్ళి చక్కని ఈశ్వరానుగ్రహాన్ని అందుకొని, పుణ్యాన్ని సముపార్జించి తరించడం నీ, నీవారి బాధ్యత....
అందుకే ప్రైవేట్ వారు అందించినా, అందించకున్నా....
తమవంతు విహితకర్తవ్యంగా విజ్ఞ్యతగల ప్రతీ ప్రభుత్వం కూడా వారి ప్రజలకు సర్కార్ బడుల్లో ఉచిత విద్యను, సర్కార్ ఆస్పత్రుల్లో ఉచిత వైద్యాన్ని, ప్రభుత్వ పర్యవేక్షణలోని,
దేవాదాయాధర్మాదాయశాఖ ఆధ్వర్యంలోని దేవాలయాల్లో ఉచిత దైవదర్శనాన్ని అందించేది......
శ్రీమద్రామాయణంలోని ఒక సంఘటన గురించి శ్రీచాగంటి సద్గురువుల ప్రవచనాల్లో విన్నప్పుడు నేను ఎంతో ఆశ్చర్యానికిలోనై...
"ఔరా...మన శ్రీమద్రామాయణం ఎంతటి గొప్ప ఆదికావ్యం...!" అని ఇప్పటికీ కొన్ని సంఘటనలను
నెమరువేసుకుంటూఉంటాను....
సీతమ్మ రావణాసురునితో ఇవ్విధంగా అనడం.....
" ఒరె రావణా...లంకలో నీకు మంచి చెప్పేవారు లేరా...లేక చెప్పేవారున్నా కూడా నువ్వు వినవా ??"
అనే గొప్ప మాట ఎంతమంది జీవితాలను ప్రభావితం చేసిందో....
రాక్షసులు అంటే బహుషా అంతటి కఠినులు, మూర్ఖులు, జడులు, కావచ్చు....
అందుకే శ్రీపోతనామాత్యులవారు ఆదిపరాశక్తిని,
***** ***** ***** ***** ***** *****
అమ్మలఁ గన్నయమ్మ, ముగురమ్మలమూలపుటమ్మ, చాలఁ బె
ద్దమ్మ, సురారులమ్మ కడు పాఱడి పుచ్చిన యమ్మ, తన్ను లో
నమ్మిన వేల్పుటమ్మల మనమ్ముల నుండెడి యమ్మ, దుర్గ, మా
యమ్మ, కృపాబ్ధి యిచ్చుత మహత్త్వకవిత్వ పటుత్వ సంపదల్.
భా-1-10-ఉ.
తాత్పర్యం :
దుర్గాదేవి తల్లు లందరికి తల్లి; సప్తమాతృకలను కన్నతల్లి; ముల్లోకాలకు మూలమైన లక్ష్మి సరస్వతి పార్వతులకు మూలమైన తల్లి; అందరు అమ్మల కన్నా అధికురాలైన గొప్పతల్లి; దైత్యులను నాశనము చేసి వారి తల్లియైన దితి కడుపులో దుఃఖము చేకూర్చిన తల్లి; నమ్ముకున్న దేవతామతల్లుల నిండు మనసులలో నివసించే తల్లి; అయిన మా అమ్మ దయాసముద్రి అయి ఈ మహాభాగవత తెలుగు ప్రణీత మందు కవిత్వంలో మహత్వము, పటుత్వములను సమృద్ధిగా ప్రసాదించు గాక.
***** ***** ***** ***** ***** *****
నిత్యం తనను నమ్మి ఆరాధించే భక్తుల, దేవతల యొక్క శత్రువుల / రాక్షసుల భార్యల కంఠసీమలోని మంగళసూత్రాలను హరించే ఆ ఆదిపరాశక్తి....,
నా జీవితాన్ని, ఆరోగ్యాన్ని, మనఃశాంతిని కావాలని ఎంతగానో ఇబ్బందిపెడుతున్న రాక్షసుల భార్యల కంఠసీమలోని మంగళసూత్రాలను ఆ ఆదిపరాశక్తి హరించివేయుగాక అని
ఓరుగల్లు భద్రకాళిని, ఉజ్జైని మహంకాళిని, బెజవాడ కనకదుర్గమ్మను ప్రార్ధిస్తూ....
అందరికీ 2024 దసర, దశహర, పండగ శుభాభినందనలు....💐
***** దుర్గా సూక్తం *****
ఓమ్ ॥ జా॒తవే॑దసే సునవామ॒ సోమ॑ మరాతీయ॒తో నిద॑హాతి॒ వేదః॑ ।
స నః॑ పర్-ష॒దతి॑ దు॒ర్గాణి॒ విశ్వా॑ నా॒వేవ॒ సింధుం॑ దురి॒తాఽత్య॒గ్నిః ॥
తామ॒గ్నివ॑ర్ణాం॒ తప॑సా జ్వలం॒తీం-వైఀ ॑రోచ॒నీం క॑ర్మఫ॒లేషు॒ జుష్టా᳚మ్ ।
దు॒ర్గాం దే॒వీగ్ం శర॑ణమ॒హం ప్రప॑ద్యే సు॒తర॑సి తరసే॒ నమః॑ ॥
అగ్నే॒ త్వం పా॑రయా॒ నవ్యో॑ అ॒స్మాంథ్స్వ॒స్తిభి॒రతి॑ దు॒ర్గాణి॒ విశ్వా᳚ ।
పూశ్చ॑ పృ॒థ్వీ బ॑హు॒లా న॑ ఉ॒ర్వీ భవా॑ తో॒కాయ॒ తన॑యాయ॒ శంయోఀః ॥
విశ్వా॑ని నో దు॒ర్గహా॑ జాతవేదః॒ సింధు॒న్న నా॒వా దు॑రి॒తాఽతి॑పర్-షి ।
అగ్నే॑ అత్రి॒వన్మన॑సా గృణా॒నో᳚ఽస్మాకం॑ బోధ్యవి॒తా త॒నూనా᳚మ్ ॥
పృ॒త॒నా॒ జిత॒గ్ం॒ సహ॑మానము॒గ్రమ॒గ్నిగ్ం హు॑వేమ పర॒మాథ్స॒ధస్థా᳚త్ ।
స నః॑ పర్-ష॒దతి॑ దు॒ర్గాణి॒ విశ్వా॒ క్షామ॑ద్దే॒వో అతి॑ దురి॒తాఽత్య॒గ్నిః ॥
ప్ర॒త్నోషి॑ క॒మీడ్యో॑ అధ్వ॒రేషు॑ స॒నాచ్చ॒ హోతా॒ నవ్య॑శ్చ॒ సత్సి॑ ।
స్వాంచా᳚ఽగ్నే త॒నువం॑ పి॒ప్రయ॑స్వా॒స్మభ్యం॑ చ॒ సౌభ॑గ॒మాయ॑జస్వ ॥
గోభి॒ర్జుష్ట॑మయుజో॒ నిషి॑క్తం॒ తవేం᳚ద్ర విష్ణో॒రను॒సంచ॑రేమ ।
నాక॑స్య పృ॒ష్ఠమ॒భి సం॒వఀసా॑నో॒ వైష్ణ॑వీం-లోఀ॒క ఇ॒హ మా॑దయంతామ్ ॥
ఓం కా॒త్యా॒య॒నాయ॑ వి॒ద్మహే॑ కన్యకు॒మారి॑ ధీమహి । తన్నో॑ దుర్గిః ప్రచో॒దయా᳚త్ ॥
ఓం శాంతిః॒ శాంతిః॒ శాంతిః॑ ॥
No comments:
Post a Comment