Sunday, July 6, 2025

శ్రీ విశ్వావసు 2025 ఆషాఢ శుద్ధ ఏకాదశి / దేవశయన ఏకాదశి / తొలి ఏకాదశి నైమిత్తిక తిథి పురస్కృత పర్వసమయ శుభాభినందనలు...🙂💐


"తొలిసంధ్యవేళలో.. తొలిపొద్దుపొడుపులో....
తెలవారే తూరుపులో వినిపించే రాగం భూపాలం...
ఎగిరొచ్చే కెరటం హిందోళం...."
అనే సినిమాపాటలో " తొలిసంధ్య"  అంటే ఏంటి...?

"నేతొలిసారిగా కలగన్నదీనిన్నేకదా....ఆ
నాకళ్ళెదురుగా నిలుచున్నదీ నువ్వేకదా...ఆ"
అనే సినిమాపాటలో "నేతొలిసారిగా"  అంటే ఏంటి...?

"తొలిప్రేమా...నీ గుండెలో గాయమా...
తొలిప్రేమా...నా వల్లె అనకుమా..."
అనే సినిమాపాటలో "తొలిప్రేమ"  అంటే ఏంటి...?

ఆ రోజుయొక్క మొట్టమొదటి సంధ్య...అని
ఆ జీవితంలో మొట్టమొదటిసారి కలగన్న వ్యక్తి...అని
ఆ జీవితపయనంలో అంకురించిన మొట్టమొదటి ప్రేమ అనే భావన...అని..
అర్ధం....

మరి ఇట్టి భావనలో తొలిఏకాదశి ఎవ్విధంగా మొట్టమొదటి ఏకాదశి అవుతుంది అనే ధర్మసందేహం కొందరు విజ్ఞ్యులకైనా ఎప్పుడో ఒకప్పుడు రాకమానదుకద...

అటు చైత్ర శుద్ధ ఏకాదశి కాదు...
ఇటు ఆశ్వయిజ శుద్ధ ఏకాదశి కూడా కాదు..
మరి ఆషాఢ శుద్ధ ఏకాదశి తొలి ఏకాదశి గా భావింపబడడంలోని అధ్యాత్మ ఆంతర్యమేమి...??
అనే ఆధ్యాత్మిక విశేషాన్ని శ్రీవేంకటేశ్వరస్వామివారు అనుగ్రహించినమేర అవలోకిద్దాం....

సంవత్సరం అనే నిర్దిష్టమైన కాలం యొక్క మేయంలో....

లిప్త కాలం నుండి మొదలుకొని
క్షణం
నిమిషం
ఘడియ
హోర
జాము
సంధ్య
పగలు
రేయి
వాసరం
వారం
పక్షం
మాసం
ఋతువు
అయనం

అనే విభాగంలో అన్నిటికంటే పెద్దదైనది అయనం...

ఉత్తరాయణం మరియు దక్షిణాయాణం 
అనే రెండు అయనాల సమ్మిళితస్వరూపంగా ఒక సంవత్సర కాలం పేర్కొనబడును....

భూమికి / భూలోకవాసులకు ఎంతో ముఖ్యమైన మేఘమండలాన్ని శాసించే సూర్యమండలంలో పయనించే సూర్యపరమాత్మ యొక్క ఏకచక్రరథగమనంపై ఆధారితమైనవి ఈ  ఉత్తరాయణం మరియు దక్షిణాయాణం అనే రెండు అయనాలు...

రామాయణం అనగా రాముడి అయనం...
అనగా రాముడి జీవిత పయనం...అని అర్ధం....
అవ్విధంగానే...
ఉత్తరాయణం అనగా ఉత్తరదిక్కుగా సూర్యపరమాత్మ యొక్క రథపయనం ఉండే కాలం...
దక్షిణాయణం అనగా దక్షిణదిక్కుగా సూర్యపరమాత్మ యొక్క రథపయనం ఉండే కాలం...

సైంటిఫిక్ గా చెప్పాలంటే...
భూమి సూర్యుడికి దూరంగా భ్రమణం గావించే సమయాన్ని దక్షిణాయణం అని....
భూమి సూర్యుడికి దెగ్గరా భ్రమణం గావించే సమయాన్ని ఉత్తరాయణం అని....
వచించెదరు...

మన స్కూల్ డేస్ లో "ద జంగల్ బుక్" అనే వీక్లి కార్టూన్ షో గుర్తున్నవారికి తెలిసినట్టుగా అందులో "మోగ్లి" అనే ఆర్టిస్ట్ విసిరే ఒకానొక చిన్నపాటి చెక్కతో చేసిన వలయఖడ్గం లాంటి శస్త్రం యొక్క ఆకాశమార్గ పయనం కొందరికైనా గుర్తుండే ఉంటుంది కద...

మన భూగ్రహం కూడా అచ్చం అవ్విధంగానే రోదసిలో తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యపరమాత్మ చుట్టూ అంతటి వేగంతో, అట్టి ప్రొలాంగ్డ్ ఎలిప్టికల్ పాత్ లో తన నిర్దేశిత అంతరిక్షకక్ష్యలో ఇతర గ్రహాలతో సంబంధంలేకుండా తనమార్గంలో తను తిరుగురూ ఉండును......

ఈ తొలి ఏకాదశి / దేవశయన ఏకాదశి అనే పర్వసమయం,
క్షీరసాగరశయనుడై పరిఢవిల్లే శ్రీమహావిష్ణువైన శ్రీమన్నారాయణుడు తన చాతుర్మాస్యయోగనిద్రకి ఉపక్రమించే సమయం, అని అధ్యాత్మవేత్తలు వచించడంలోని ఆంతర్యం ఏమనగా...

"నారాయణ" అనే పదానికి సంస్కృతంలో "నర" అంటే "నీరు" లేదా "మానవులు" మరియు "అయన" అంటే "నివాసం" లేదా "ఆధారం" అని అర్థం. కాబట్టి, నారాయణ అంటే "నీటిలో నివసించేవాడు" లేదా "మానవులందరికీ ఆధారమైనవాడు" అని అర్థం. ఇది విష్ణువు యొక్క పర్యాయపదంగా కూడా ఉపయోగిస్తారు.

అనగా పరమాత్మశక్తిగా నరులందరిలోనూ ఉండే ఆ వైశ్విక 
విష్ణు చైతన్యమైన శ్రీమన్నారాయణచైతన్యశక్తి 
సూర్యపరమాత్మ అనుగ్రహమైన  ఆత్మశక్తిగా పరిఢవిల్లుతూ ఉండే అధ్యాత్మ అంశం...

అధ్యాత్మపరంగా సూర్యచైతన్యం భూమికి దూరంగా జరుగుతున్నా...
సైంటిఫిక్ గా భూమి సూర్యుడికి దూరంగా జరుగుతున్నా...
భూలోకవాసులైన మానవుల ఆంతరచైతన్యశక్తి / ఆత్మశక్తి
సన్నగిల్లే సమయం ఈ దక్షిణాయణసమయం...

ఇట్టి సమయంలో శ్రీమన్నారాయణుడు యోగనిద్రకు ఉపక్రమించడం అంటే...
యోగదృష్టితో యావద్ విశ్వాన్ని మరింత క్షుణ్ణంగా పరికించడం అనే ప్రక్రియే ఈ చాతుర్మాస్య పర్వసమయం....
జగద్గురువులు కూడా ఈ సమయానికి
వారు ఏ ప్రాంతంలో విజయంచేసి ఉంటే అక్కడే ఈ 4 మాసాలు కూడా (ఆషాఢ శుద్ధ ఏకాదశి నుండి కార్తీక శుద్ధ ఏకాదశి వరకు)
చాతుర్మాస్యదీక్షాధారులై వర్ధిల్లడం విజ్ఞ్యులకు విదితమే...
అనగా ఈ భూలోకంలో పరమాత్మకు ప్రతీకలుగా ఆరాధింపబడే జగద్గురువులు కూడా వారివారి సాధనా / ఉపాసనా బలాన్ని వృద్ధిగావించుకుంటూనే...లోకకళ్యాణకారకమైన క్రతువులకు వారి శక్తియుక్తులను ఎవ్విధంగా అనుగ్రహించవలెను అని ఆంతరవీక్షణంలో స్థిరంగాకొలువైఉండే సమయానికి శ్రీకారమైన పర్వసమయమే ఈ తొలి ఏకాదశి / దేవశయన ఏకాదశి పర్వసమయం....

శ్రీకంచి పరమాచార్యుల వారు ఎక్కడో విడిది చేసి ఉన్నా కూడా....కొన్నివేలమైళ్ళ దూరంలో ఉన్న భక్తులకు దారిచూపడం / మార్గనిర్దేశనం గావించడం / సందేహాలను నివృత్తి గావించడం / ఏదో ఒక రూపంలో ఏతెంచి సహాయం చేయడం...గురించిన ఇతిహాసాలు ఎందరో విజ్ఞ్యులు ఎన్నోసార్లు చదివి / విని / తెలుసుకునే ఉంటారు...

ఈ లోకకళ్యాణకారక భగవద్కర్తవ్యాన్ని నిర్వర్తించే మహనీయులకు, ఈ ఆషాఢ శుద్ధ ఏకాదశే ఎందుకు తొలి ఏకాదశి అవుతుంది అనే అధ్యాత్మ అంశం విదితమైనదే....

చిరంతనమైన అమేయకాలప్రవాహంలో సంభవించే విశేషమైన సంధిసమయాల్లో ఏతెంచే ఏకాదశి తిథులకు ఎంతో ప్రాశస్త్యం ఉండును......
ఎందుకంటే.....
మురాసురుడితో శ్రీమహావిష్ణువు పోరాడుతూ అలసిఉన్న సమయంలో, శ్రీమహావిష్ణువుయొక్క దైవికదేహం నుండి ఉద్భవించిన దేవతాస్త్రీమూర్తికి శ్రీమహావిష్ణువు అనుగ్రహించిన వరంకారణంగా, కాలపట్టికలో శాశ్వతమైన విశేషమైన తిథిగా భూలోకంలో కొలువైన తిథే ఏకాదశి..!

ఎవ్విధంగా అయితే భారతీయ గంగిగోవు ప్రాకృతిక / లౌకిక / బ్రహ్మసృష్టి కి సంబంధించిన ప్రాణి కాదో...
అవ్విధంగానే ఏకాదశి అనే తిథి ప్రాకృతిక / లౌకిక / బ్రహ్మసృష్టి కి సంబంధించిన తిథి కాదు...
అందుకే సనాతనభారతీయులకు అనాదిగా...
గంగిగోవు సకల దేవతలకు ప్రీతికరమైన / ఆలవాలమైన దైవికప్రాణి...
మరియు
ఏకాదశి తిథి సకల దేవతలకు ప్రీతికరమైన / విశేషదేవతానుగ్రహదాయకమైన తిథి...

చాల సింపుల్ గా లౌకిక ఎగ్సాంపుల్ తో చెప్పాలంటే...
ఒక కార్ ఇసుకలో / మట్టి రోడ్డులో మామూలుగా వెళ్తున్నప్పుడు పెద్దగా దుమ్ము, ధూళి ఎక్కువగా ఉండదు..
కాని ఆ కార్ సడెన్ U టర్న్ తీసుకుంటే ఒక్కసారిగా రేగే దుమ్ము, ధూళి అధికంగా ఉండును...
అచ్చం అదేవిధంగా రోదసి లో గ్రహాల పయనం మరియు వాటివాటి దీర్ఘవృత్తాకారకక్ష్యలో తీసుకునే U టర్న్ లో రేగే "సమయధూళి" కూడా...
మామూలు లౌకిక ధూళి కళ్ళకు కనిపిస్తుంది కాబట్టి స్పెక్టకిల్స్ ధరిస్తాము.....
రోదసిలో రేగే అలౌకిక "సమయధూళి" కళ్ళకు కనిపించదు కాబట్టి చాతుర్మాస్య దీక్షను ధరిస్తారు.....

శ్రీచాగంటి సద్గురువుల ప్రవచనాల్లో....
వినతా / కద్రువ, గుర్రం తోక నలుపా తెలుపా, కద్రువ కపటం / 
వినత దాస్యం / సూర్యరథసారధిగా అనూరుడు / 
తన తమ్ముడైన వైనతేయుడు గరుత్మంతుడిగా శ్రీమహావిష్ణువు యొక్క సారధిగా కొలువై ఉండడం...
గురించిన ఇతిహాసాల గురించి విజ్ఞ్యులు ఆలకించే ఉంటారు...

అట్టి చాతుర్మాస్య దీక్షాధారణకు శ్రీకారంగా భావింపబడే ఈ తొలి ఏకాదశి / దేవశయన ఏకాదశి / భక్తుల జీవితాలను నూతన భగవద్దీప్తితో పరిఢవిల్లజేయాలని ఆకాంక్షిస్తూ...
ఎల్లరికీ తొలి ఏకాదశి పర్వసమయ శుభాభినందనలు...🙂💐

శ్రీ విశ్వావసు 2025 ఆషాఢ శుద్ధ నవమి ప్రయుక్త శ్రీచాగంటి సద్గురువుల జన్మదినోత్సవ శుభాభినందనానమస్సులు...🙏🙂💐

🙂💐🙏

ఇవ్వాళ్టి ఆధునిక సమాజంలో శ్రీచాగంటి సద్గురువుల ప్రవచనాల ప్రభావం ఎక్కడివరకు ఉందంటే, ఏనాడు వారి ప్రవచనాన్ని శ్రద్ధాభక్తితో ఒక గంటసేపు కూడా ఆలకించని వారు, "ప్రవచనం" / "ప్రహృష్ట వచనం" అంటే ఏంటో, ఎందుకో కూడా సరిగ్గా తెలియని వారు కూడా, యు ట్యూబ్ లో వారికి నచ్చిన ఒక స్వల్పనిడివిగల శ్రీచాగంటి సద్గురువుల ప్రవచనం యొక్క క్లిప్పింగ్ ని కోట్ చెస్తూ...
"ఇదిగో చూసారా....శ్రీచాగంటి గారు ఇలా చెప్పారు.....అందుకే నేను కూడా ఇలా అంటున్నా......"
అని చెప్తూ వారికి కావలసినవి సాధించుకునేందుకు మాధ్యమంగా శ్రీచాగంటి సద్గురువుల ప్రవచనాలను భావించడం వరకు...
అట్టి వారి నుండి...
"శ్రీచాగంటి సద్గురువులు ఆ వచనం ఏ ప్రవచనంలో ఎవరిని, ఎట్టివారిని, ఏ సందర్భంలో, పరోక్షంగా ఉద్దేశిస్తూ వచించారో తెలుసా...?
అని అంటే సమాధానం ఉండదు...
"శ్రీచాగంటి సద్గురువులు ఆ వచనం చెప్పిన ప్రవచనంలోనే ఇంకో వచనం కూడా చెప్పారు తెలుసా...?
అని అంటే సమాధానం ఉండదు...
ఇవ్విధంగా ఇవ్వాళ్టి సమాజంలో కొందరు ధూర్తులు వారి "మందిని ముంచుతూ బ్రతకడం అనే అడ్డమైన వ్యాపకానికి, "బిజినెస్" అనే అందమైన పేరును ఆపాదించి, అందుకు శ్రీచాగంటి గారి పేరును వాడుకోవడం వరకు...

శ్రీచాగంటి సద్గురువులవంటి మహనీయుల బోధలు స్వోద్ధరణకు, ఆత్మోద్ధరణకు, స్వీయవ్యక్తిత్వవికాసానికి, స్వయంకృషిభరితజీవితవైభవనిర్మాణానికి, భగవద్భక్తిజ్ఞ్యానసముపార్జనకు,
తద్వారా భగవదనుగ్రహప్రోదికి, మాధ్యమంగా లోకానికి అందివచ్చిన సుజ్ఞ్యానామృతగుళికలు....

ఒకసారి శ్రీచాగంటి సద్గురువులు వారి ప్రవచనాయజ్ఞ్యంలో ఉండగా,
ఢిల్లీ నుండి వారి సోదరీమణి చాలాకాలంతర్వాత విచ్చేసినందుకు, కొద్ది క్షణాలు వారి ప్రవచనాన్ని ఆపిమరీ సోదరిని కుశలప్రశ్నలు అడిగిన సందర్భం నుండి ఈ సమాజం నేర్చుకోవలసింది ఏంటంటే..
"మనకు వీలైనంత సోదరీమణులకు, ఆడబిడ్డలకు, అడబిడ్డల బిడ్డలకు, ఆడపిల్లలకు గౌరవమరియాదలు, కానుకలు, దీవెనలు ఇవ్వవలెను..."
అంతే కాని ఆడపిల్లల సొమ్ము ఎట్ల దోచుకోవాలా...
దోచుకున్న వారి సొమ్ముతోనే ఎట్ల బిజినెస్ చేసి ఖజానా నింపుకోవాలా...అని కాదు...

ఒకసారి శ్రీచాగంటి సద్గురువులు వారి ప్రవచనంలో ఉటంకించిన ఉదాహరణలో చెప్పబడినట్టుగా...
"బ్యాంక్ లోన్ తీసుకొని మరీ కొడుకును ఫారిన్ చదువులకు పంపించి, విదేశాల్లో కొడుకు గొప్పవాడౌతుంటే ఎంతో సంతోషిస్తూ,
నా కొడుకు ఫారిన్లో చదువుకొని ప్రయోజకుడై, మంచి ఇల్లు కొనుక్కున్నాడంటా, పెద్ద కారు కొనుక్కున్నాడంటా, పిల్లాపాపలతో సంతోషంగా ఉన్నాడంటా..."
అని కొడుకు యొక్క అభివృద్ధి గురించి నలుగురికి గొప్పగా చెప్పుకొని మురిసే తండ్రి నుండి ఈ సమాజం
నేర్చుకోవలసింది ఏంటంటే...
"కన్నబిడ్డలు ప్రయోజకులవ్వడానికి తల్లితండ్రులు కారణం అవ్వాలి కాని...కన్నబిడ్డల ఉన్నతిని ఓర్వలేని కౄరత్వాన్ని పెంచిపోషించే ధూర్తుల / దూరపుబంధువుల / పరిచయస్థుల మాటలు వింటూ కన్నబిడ్డల దుఃఖానికి కారణం కాకూడదు..." అని...

రోడ్డు మీద దార్లో కొలువైన ఒక పెద్ద మామిడిచెట్టు అందించే ఫలాలను....
1. అందుకొని ఈశ్వరుడికి నివేదించి ప్రసాదంగా స్వీకరించి ఆరోగ్యంతో, ప్రజ్ఞ్యానంతో, ప్రశాంతతతో, జీవించే విజ్ఞ్యులు కొందరు....
2. అందుకొని ఇతరులపైకి విసురుతూ, ఇబ్బందిపెడుతూ, బాధిస్తూ, మూర్ఖత్వంతో, అజ్ఞానంతో, అల్లరితో, జీవించే ధూర్తులు కొందరు....
3. పెద్దగా ఏమి పట్టించుకోకుండా వారిదార్లో వారు సాగేవారు ఇంకొందరు....
ఈ మూడు క్యాటగిరీల్లో ఉండే వ్యక్తులెవ్వరూ కూడా 
ఇతరులకు సర్టిఫికేట్లు ఇవ్వాలని కాని....
ఇతరులనుండి సర్టిఫికేట్లు కొనుక్కోవాలని కాని....
ఇతరులను సర్టిఫై చేయాలని కాని...
అనుకోరు...
ఎందుకంటే....
ఎవరి పరిశ్రమ వారిది...
ఎవరి మూర్ఖత్వం వరిది...
ఎవరి దారివారిది...

కాని ఇక్కడ గమనించవలసిన ముఖ్యమైన అంశం ఏంటంటే ఆ మామిడిచెట్టుకు మాత్రం...
1. కొందరు విజ్ఞ్యులు తన ఫలాలను అందుకొని అభివృద్ధిచెందుతున్నందుకు వారి మీద ఓర్వలేనితనం ప్రదర్శించడం కాని...
2. కొందరు మూర్ఖులు తన ఫలాలను అందుకొని నానా అల్లరి చేస్తున్నందుకు శోకించడం కాని...
3. కొందరు సామాన్యులు తన ఫలాల గురించి పెద్దగా ఏమి పట్టించుకోనందుకు వ్యాకులత చెందడం కాని....
వర్తించదు....
ఎందుకంటే ఉన్నతంగా కొలువై, ఉత్తమఫలాలను అందిస్తూండడమే తన విహితకర్తవ్యంగా జీవించడం ఆ మామిడిచెట్టుకు తెలిసిన మంచితనం....

అచ్చం అదేవిధంగా,
శ్రీచాగంటి సద్గురువుల వంటి మహనీయులు కూడా....
ఎంతో సమ్మున్నతమైన స్థాయిలో కొలువై, ఉత్తమోత్తమమైన బ్రహ్మజ్ఞ్యానఫలాలను ప్రసాదిస్తూ, విజ్ఞ్యులెల్లరినీ అనుగ్రహించడమే విహితకర్తవ్యంగా జీవించడం అట్టి బ్రహ్మవేత్తలకు తెలిసిన మంచితనం....
అనగా...
1. కొందరు విజ్ఞ్యులు వారి బ్రహ్మజ్ఞ్యానఫలాలను అందుకొని అభివృద్ధిచెందుతున్నందుకు వారి మీద ఓర్వలేనితనం ప్రదర్శించడం కాని...
2. కొందరు మూర్ఖులు వారి బ్రహ్మజ్ఞ్యానఫలాలను అందుకొని నానా అల్లరి చేస్తున్నందుకు శోకించడం కాని...
3. కొందరు సామాన్యులు వారి బ్రహ్మజ్ఞ్యానఫలాల గురించి పెద్దగా ఏమి పట్టించుకోనందుకు వ్యాకులత చెందడం కాని....
శ్రీచాగంటి సద్గురువుల వంటి మహనీయులకు వర్తించదు....

ఈ మూడు క్యాటగిరీల్లో ఉండే వ్యక్తులెవ్వరూ కూడా 
ఇతరులకు సర్టిఫికేట్లు ఇవ్వాలని కాని....
ఇతరులనుండి సర్టిఫికేట్లు అందుకోవాలని కాని....
ఇతరులను సర్టిఫై చేయాలని కాని...
అనుకోరు...
ఎందుకంటే....
ఎవరి జిజ్ఞ్యాస, పరిశ్రమ, శ్రద్ధ, భక్తి, జ్ఞ్యానం, భగవదనుగ్రహం వారిది...
ఎవరి మూర్ఖత్వం వరిది...
ఎవరి దారివారిది...

శ్రీచాగంటి సద్గురువుల ప్రహృష్టవచనాలు ఈ లోకంలో మరెందరో విజ్ఞ్యుల జీవితాల్లో దైవికస్పృహను కలిగిస్తూ, 
భగవదనుగ్రహదీప్తితో పరిఢవిల్లే విజ్ఞ్యతను అనుగ్రహిస్తూ, జీవితాన్ని సార్ధకపరుచుకునే వివేకాన్ని ప్రోదిగావిస్తూ,
సర్వేసుజనాః సుఖినోభవంతు అనే ఆర్షవాక్కును అనునయిస్తూ, లౌక్యాన్ని అనుసరిస్తూ జీవించే మాన్యులకు మార్గదర్శకత్వాన్ని ప్రసాదిస్తూ, పరిఢవిల్లాలని మనసారా ఆకాంక్షిస్తూ....

ఇంతటి హితకరకారుణ్యమూర్తిని లోకానికి అనుగ్రహించిన గురువుగారి మాతాపితరులైన
కీ.శే || శ్రీ సుశీలమ్మ సుందరశివ గార్ల శ్రీచరణాలకు, 
మరియు...
ఇంతటి ప్రజ్ఞ్యానదాయక సంఘసంస్కర్తను సమాజానికి అందిస్తున్న గురువుగారి సహధర్మచరులైన
శ్రీమతి సుబ్రహ్మణ్యేశ్వరి గారి శ్రీచరణాలకు,
ప్రణమిల్లుతూ.....

శ్రీగురుచరణారవిందములచెంత వారి 66వ జన్మదినోత్సవ సందర్భంగా చిరు సవినయ సాంజలిబంధక సాష్టాంగప్రణామపూర్వక కవనకుసుమాంజలి....💐☘️

ఓం శ్రీగురవేనమః.... 🙏🙂💐

Shree Vishwaawasu naama (July-10-2025) samvatsara AashaaDhaPournami / GuruPournami / VyaasaPournami wishes to one and all... 💐🙂

శ్రీ విశ్వావసు (July-10-2025) ఆషాఢపౌర్ణమి / గురుపౌర్ణమి / వ్యాసపౌర్ణమి నైమిత్తిక తిథి పురస్కృత పర్వసమయంలో, ఈ ఆధునిక కాలంలో కూడా వ్యాసశక్తిని నిరంతరం లోకానికి అనుగ్రహిస్తూ వర్ధిల్లే శ్రీచాగంటి సద్గురువుల శ్రీపాదపద్మములకు, మరియు వారిచే నమస్కరింపబడే యావద్ సనాతన గురుపరంపరకు, గురుపరంపరాద్యులైన శ్రీమన్నారాయణమూర్తికి / శ్రీదక్షిణామూర్తికి, నా సవినయ సాక్షర సాష్టాంగనమస్సుమాంజలి...🙂🙏💐


If you have ever observed how a creeper, say Jasmine or Ridge-gourd or Bottle-gourd or some other creeper blooms in its full swing and yields a bountiful crop when it is given a proper supporting mechanism...? 
i.e., for a Jasmine creeper that supporting mechanism can a tree situated beside it or for a Ridge-gourd or Bottle-gourd that supporting mechanism can be a simple pole or a mesh on a wall... 

The supporting mechanism has to be either established near the creeper by someone or the creeper itself has to find one nearby its surroundings in order to bloom in full swing.

Quite similarly, an intellectual has to find a good supporting mechanism in order to unleash his/her full potential to bloom in full swing of the requisite wisdom or has to be shown one. 

That established supporting mechanism is respected as a Guru by the spiritual science for all the magnanimity a Guru brings into the life of a disciple that has vested his/her faith in their respective Gurus.

This GuruShishya Parampara has been the core driving principle in the eternal greatness of SanaatanaDharmam and it's every allied subject that have made India a supreme ancient nation since times before times.

The below pious Slokas are recited by every intellectual in-order to humbly respect the lineage of the GuruShishyaParampara....

SadaaShivaSamaarambhaam
VyaasaShankaraMadhyamaam
AsmadaachaaryaParyantaam
Vanday GuruParamparaam

and

LakshmiNaathaSamaarambhaam
NaathayaamunaMadhyamaam
AsmadaachaaryaParyantaam
Vanday GuruParamparaam

When the moon is in conjunction with either the 20th or 21st star/constellation referred to as Poorvaashaadha or Uttaraashaadha on a full moon day, it is known as Aashaadha Maasam as per the lunar calendar predominantly followed all over India and such a full moon day has been designated as VyaasaPournami / Gurupournami festivel to earmark and respect the lineage of the established 
GuruShishyaParampara.
Gurupournami is also known to bestow significant blessings of deva guru Bruhaspati by the virtue of the latter being the Guru of all the gods that are worshipped by all the intellectuals all over the universe for everyone's well-being.

The speciality of the combination of an established supporting mechanism and a creeper crawling on it is that there shall be no limit to the creeper's ability to crawl and weave in every given direction as long as its supporting mechanism too is spread across accordingly. 
Similarly, the speciality of the combination of an established Guru and a humble Shishya is that there shall be no limit to the disciple's ability to spread their wings of wisdom in every given aspect as long as their Gurus continue to spread the knowledge pertaining to every given subject and thus the Indian spiritual diaspora continues to herald and celebrate the significance and greatness of such a mighty GuruShishyaParampara and its meritorious effects on the universal well-being and peace of mind for every sensible being.

Right from a small sparrow that weaves an awe inspiring nest using simple light weight natural plant yarns and sticks...,
to an established intellectual who wholeheartedly and selflessly propagates the rich treasure of knowledge spread across umpteen subjects and their propounded wisdom for the universal well-being of every sensible person on the planet, 
the role of a Guru is donned by any and every wonderful creation of God in this mighty nature.

Amongst many such wonderful creations of God in this mighty nature, a human being that can use his/her vocal cords to speak out in a sober, prudent and above all 'a wide spread positive impact creating manner', is considered as a precious gift to the mankind from God for the upliftment of all the diligent persons. Thus, a Guru in the form of a human being is given the utmost respect by considering them akin to Gods/Goddess for all the great intellectual charity work carried out by them for the betterment of the society around inorder to make this world a much better place for everyone to thrive and excel in their respective lives.

We are now living in ultra modern times where a few people consider the food delivered by a robo in a robo assisted restaurant as something great and special over the similar food that we cook ourselves at our respective homes...because of the widespread technological embrace in every sphere of our life without understanding the true essence of technology and its usage for the betterment of mankind. Technology essentially is a service enabling factor whereas happiness is an index factor corresponding to our inner contentment and bliss.

Thus, in this highly materialistic and technological modern times too, God continues to be the eternal source of that inner contentment and bliss without which any and everything shall be not much helpful for a fruitful life filled with health, happiness and peace of mind.

Those subjects that authoritatively talk about Gods/Goddesses and their greatness are the 4 cardinal Vedas and 18 Puraanams and Itihaasams and only a very few noble souls master this spiritual path of gaining the wisdom propounded by them and amongst such noble souls, only a very few spread that knowledge and wisdom to the intellectual society around for the wider universal well-being and happiness.

Amongst such noble souls, sathguru Shree Chaaganti gaaru has been one of the most humble, renowned and revered personalities this generation has been blessed with for all the selfless yeoman spiritual intellectual charity service being rendered by him since the past 2 decades.

On this pious occasion of Gurupournami / VyaasaPournami festivel, l humbly prostrate to the lotus feet of Shree Chaganti gaaru and the Vyaasa Shakti exuded by guruvugaaru and offer the below small essay as a tribute to his holy feet as a savinaya saaShtaanga Pranaamakavanasumaanjali..... 
💐🙂🙏

I don't know how the 18 Puraanaas were written by sage Shree Vyaasa maharshi, however I have listened to sathguru Shree Chaaganti gaari pious discourses.....

I don't know how the ShreemadRaamaayana was written by sage Shree Vaalmiki, however I have listened to sathguru Shree Chaaganti gaari pious discourses...

I don't know how her highness AadiparaaShakti has blessed an innocent MookaShankara with a pinch of taamboolam her vadanamandalam is decorated with (Taamboolapooritamukhi daaDimikusumaprabha) that made the latter bless the world with the highly meritorious 'MookapanchaShati' saaaraswatam, however I have listened to sathguru Shree Chaaganti gaari pious discourses....

I don't know how Shree Shukayoageendra has blessed this world with the highly esteemed and unparalleled "ShreemadBhaagawatam" via Pareekshit maharaaja, however I have listened to sathguru Shree Chaaganti gaari pious discourses...

I don't know how the most rejoiced lord Shree Krushna of DwaaparaYugam has become lord Shree Venkateshwara of this KaliYugam...,
however I have listened to sathguru Shree Chaaganti gaari pious discourses...

I don't know how Shree Aadishankaraachaarya has propagated the Bhagawadtattwam and has become Shanmathasthaapanaachaarya and blessed the mankind with all that he has graced the world with,
however I have listened to sathguru Shree Chaaganti gaari pious discourses...

and I have made all of them my best friends and mentors of life and they continue to illumine my life with their eternal divine light and grace...🙂💐

ఓం శ్రీగురవేనమః...🙏💐🙂



శ్రీ విశ్వావసు 2025 ఆషాఢమాస పురస్కృత అమ్మవారి విశేష ఆరాధనా వైభవ ప్రారంభ సమయమైన ఈ దక్షిణాయణ పుణ్యకాలం ఆషాఢ శుద్ధ ఏకాదశి / తొలి ఏకాదశి తో ప్రారంభమయ్యే విశేషమైన ఉపాసనా సమయం...


దక్షిణాయణ పుణ్యకాలం ఎందుకు ఉపాసనా కాలంగా విశేషమైన అధ్యాత్మ ఖ్యాతి గడించిందో శ్రీచాగంటి సద్గురువుల ప్రవచనాలు విన్నవారికి గుర్తుండే ఉంటుంది.

ఆషాఢ అంబిక
శ్రావణ శ్రీలక్ష్మి
భాద్రపద శ్రీవినాయక
ఆశ్వయుజ దుర్గాదేవి
కార్తీక కుమారస్వామి / అయ్యప్పస్వామి
మార్గశిర గోదాదేవి

భగవదారాధనలతో ఈ దక్షిణాయణపుణ్యకాల సమయం ఎందరో విజ్ఞ్యులైన భక్తులకు విశేషమైన ఉపాసనాకాలం...

"ఎవ్విధంగా ఒక కోడి తన గుడ్డును పొదుగుతున్నప్పుడు ఎంతో జాగ్రత్తగా తన రెక్కలను విప్పార్చి, తను అధివసించి ఉన్న కోడిగుడ్డు కోడిపిల్లగా రూపాంతరం చెందడానికి ఎంత ఉష్ణం అవసరమో అంత ఉష్ణం మాత్రమే అందేలా ఒక కోడి వ్యక్తపరిచే ఆ యూనివర్సల్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ లో అమ్మవారి అంబికా తత్త్వం గోచరించును..."
అని
శ్రీచాగంటి సద్గురువుల ప్రవచనాల్లో, కుక్కుటవైభవంలో గోచరించే అంబికాతత్త్వం గురించిన వివరణ విన్న వారికి గుర్తున్నట్టుగా...

" అంబికా అనాదినిధనా హరిబ్రహ్మేంద్రసేవిత "

అని వాగ్దేవతలచే నిత్యం కీర్తింపబడే ఆదిపరాశక్తి యొక్క
విశేషమైన ఆరాధనకు ఈ దక్షిణాయణం పెట్టిందిపేరుగా అనాదిగా ఒక సనాతనధర్మవైభవ విశేషం..!

ఆ పరాశక్తి అనుగ్రహించిన మేరకు, ఒక చిన్న ఎగ్సాంపుల్ ద్వారా ఈ విశేషాన్ని వివరించెదను..

చలికాలం బయట వాతావరణం చాలా చల్లగా ఉంటూ, ఉదయం ఉష్ణోగ్రతలు కూడా తక్కువగా నమోదౌతూ ఉండడం ఎల్లరికీ తెలిసిన ప్రాకృతిక అంశమే....
అందుకే మనం శ్వెట్టర్ అనే ప్రత్యేక ఉన్ని వస్త్రాన్ని ధరిస్తూ వెచ్చగా / వేడిగా ఉండేలా మన ఆహార్యంలో తగిన మార్పుచేర్పులను గావించి జీవిస్తుంటాము కద...

చాలా మందికి తెలియని సైంటిఫిక్ అంశం ఏంటంటే అలా శ్వెట్టర్ అనే ఉన్నివస్త్రాన్ని ధరించినప్పుడు ఉండే వెచ్చదనం / వేడి అనేది ఎక్కడో బయటినుండి రాదు...
మనశరీరం నుండి నిత్యం వినిర్ముక్తమౌతూ ఉండే వెచ్చదనం / వేడి మనం ధరించే ఆ శ్వెట్టర్ అనే ఉన్నివస్త్రం యొక్క ప్రత్యేకత కారణంగా, బాహ్యప్రపంచంలోకి లయించకుండా ఆ వస్త్రాన్ని అలుముకొని ఉంటుంది కాబట్టే మనం శ్వెట్టర్ ధరించినప్పుడు ఎంతో వెచ్చగా / వేడిగా ఫీల్ అవుతూ ఉంటాం....

అచ్చం అదే విధంగా చాలామందికి తెలియని సైంటిఫిక్ అంశం ఏంటంటే,
ఆదిపరాశక్తి ఎక్కడో మణిద్వీపంలో మాత్రమే ఉండును అని కొందరు అనుకుంటారేమో....
కాని
ఆదిపరాశక్తి ఈ జగత్తు యొక్క అణువణువులోనూ నిండినిబిడీకృతమై ఉండును అని సకల వేదశాస్త్రపురాణైతిహాసికకావ్యాలు లెక్కించలేని సమయం నుండి సనాతనంగా బోధిస్తూనే ఉన్నవి అనే అధ్యాత్మ సత్యం విజ్ఞ్యులైన భక్తులకు, శ్రీవిద్యోపాసకులకు, విదితమైన వైజ్ఞానిక అంశమే...

అట్టి సర్వేసర్వత్రా పరివ్యాప్తమై ఉండే ఆదిపరాశక్తి వైభవం అనేది వారివారి భక్తి యొక్క గొప్పదనంపై పరిఢవిల్లే అంశం...

సదరు వ్యక్తి ఇంట్లో ఒక అగ్గిపెట్టె ఉన్నది....
అని కొందరి వచనం అయినచో....
సదరు వ్యక్తి ఇంట్లో ఒక అగ్నిపర్వతమే ఉన్నది....
అని ఇంకొందరి వచనం అయినచో....
ఈ రెండు వచనాలు కూడా స్థూలస్థాయిలో అంతగా పొంతనలేని వచనాలలా అనిపించవచ్చు....
కాని సూక్ష్మస్థాయిలో దర్శించగా,
"ఆ ఒక అగ్గిపెట్టె పక్కన ఒక ఫ్రీడం రిఫైండ్ సన్ ఫ్లవర్ ఆయిల్ డబ్బా కూడా ఉన్నది..." అనే విషయం తెలిసిన విజ్ఞ్యులకు, 
ఒక అగ్గిపెట్టె ఒక అగ్నిపర్వతాన్ని సృజించడం అనేది ఎంతో సాధారణమైన సైన్స్ అనే అంశం తెలియును...

అదే విధంగా ఫలాన చోట అమ్మవారు ఆదిపరాశక్తిగా వెలసి ఉన్నారు.....అనే అంశం...
ఫలాన చోట అగ్గిపెట్టె ఉన్నది అనే వచనానికి సామ్యము...

అమ్మవారిగా వెలసిఉన్న ఆదిపరాశక్తిని అణువునుండి విజృంభించే అగ్నిపర్వతమంతటి శక్తిగా మార్చే ఇంధనం మన భక్తి...

ఒకరి కిచెన్లో ఎన్ని అగ్గిపెట్టెలు ఉన్నై మరియు,
ఎన్ని లీటర్ల రిఫైండ్ సన్ ఫ్లవర్ ఆయిల్ ఉందో మీరు మేయపరచగలరేమో.....
కాని వాటి సమ్మేళనంతో ఎంతటి అగ్నిపర్వతాన్ని సృజించవచ్చో అనేది ఎవ్వరూ మేయపరచలేని అంశం....
ఎందుకంటే అది మ్యాగ్నిట్యూడ్ అండ్ డెన్సిటి ఆఫ్ ది కండక్టింగ్ మీడియం పై ఆధారపడి ఉండే అంశం...

అచ్చం అదే విధంగా, ఒక ప్రదేశంలో ఎన్ని దేవాలయాలు ఉన్నాయో మరియు ఎందరు భక్తులు ఉన్నారో మనం మేయపరచగలమేమో...
కాని
ఆ భగవద్ శక్తి మరియు భక్తుల భక్తిప్రపత్తి యొక్క సమ్మేళనం ఎంతటి దైవత్వాన్ని / దైవికశక్తిని సృజించగలదో అనే అంశాన్ని మనం మేయపరచలేం...
ఎందుకంటే....అది మ్యాగ్నిట్యూడ్ అండ్ డెన్సిటి ఆఫ్ ది డివోషన్ పై ఆధారపడి ఉండే అంశం...

అట్టి మ్యాగ్నిట్యూడ్ అండ్ డెన్సిటి ఆఫ్ ది డివోషన్ అనే అంశం ఈ దక్షిణాయణపుణ్యకాలంలో ఎంతో ఘనమైన ఉపాసనా ఫలితాలను అనుగ్రహించడం అనేది ఒక గహనమైన అధ్యాత్మ అంశం...

ఆ గహమైన అధ్యాత్మతత్త్వం గురించిన అవగాహన అనేది, పలు శాస్త్రాల సమ్మిళిత సమాహార శ్రీవిద్యగా విజ్ఞ్యులకు అందివచ్చే అంశం...

ఈ క్రింది 27 నక్షత్రాల్లో....

అశ్విని
భరణి
కృత్తిక
రోహిణి
మృగశిర
ఆర్ద్ర
పునర్వసు
పుష్యమి
ఆశ్లేష
మఖ
పుబ్బ (పూర్వఫల్గుణి)
ఉత్తర (ఉత్తరఫల్గుణి)
హస్త
చిత్త
స్వాతి
విశాఖ
అనూరాధ
జ్యేష్ఠ
మూల
పూర్వాషాఢ
ఉత్తరాషాఢ
శ్రవణ
ధనిష్ఠ
శతభిష
పూర్వాభాద్ర
ఉత్తరాభాద్ర
రేవతి

దక్షిణాయణపుణ్యకాలం యొక్క ఖగోళవిస్తారం అనేది ఈ క్రింది 8 నక్షత్రమండలాల్లో వ్యాప్తిచెంది ఉండడం అనేది దక్షిణాయణం యొక్క విశేషం...
పూర్వాషాఢ/ఉత్తరాషాఢ, శ్రవణ, పూర్వాభాద్ర/
ఉత్తరాభాద్ర,  అశ్విని, కృత్తిక, మృగశిర

అనగా ఉత్తరాయణంలో చంద్రుడు 
పుష్యమి, మఖ, పూర్వఫల్గుణి/ఉత్తరఫల్గుణి,
చిత్త, విశాఖ, జ్యేష్ఠ
అనే 7 నక్షత్ర మండలాలతో కూడి ప్రకాశించే ఖగోళ సమయం...
కన్నా....
దక్షిణాయణంలో చంద్రుడు 
పూర్వాషాఢ/ఉత్తరాషాఢ, శ్రవణం, 
పూర్వాభాద్ర/ఉత్తరాభాద్ర, అశ్విని, కృత్తిక, మృగశిర
అనే 8 నక్షత్ర మండలాలతో కూడి ప్రకాశించే ఖగోళ సమయం 2 పక్షాలు అధిక సమయం....

పూర్వ/ఉత్తర అనే రెండు భాగాలుగా ఉండే జంటనక్షత్రమండలాల్లో మన భూలోకంలో ఏదేని ఒక నక్షత్రమండలంతో మాత్రమే చంద్రుడు కూడి ప్రకాశించినా,
ఖగోళసమయతలంలో మాత్రం కొన్ని కారణాల రీత్యా,
అది జంటనక్షత్రమండలాల్లో చంద్రుడి విస్తారంగా పరిగణింపబడే నక్షత్ర జ్యోతిషశాస్త్ర అంశం...
అనగా మనకు భూలోకంలో రమారమి 6 మాసాల ఉత్తరాయణం, 6 మాసాల దక్షిణాయణంగా చంద్రుడి నక్షత్రమండలకూడిక ఉన్నా, ఖగోళంలో 15 నక్షత్రమండలకూడికగా నక్షత్రజ్యోతిష శాస్త్రం పరిగణించును...
అనగా మనకు...
ఆషాఢ మాసం అంటే పూర్వాషాఢ / ఉత్తరాషాఢ అనే 
జంటనక్షత్రాల్లో ఏ నక్షత్రంతో చంద్రుడు కూడినా అది ఆషాఢ మాసమే అనబడును.
భాద్రపద మాసం అంటే పూర్వాభాద్ర / ఉత్తరాభాద్ర అనే 
జంటనక్షత్రాల్లో ఏ నక్షత్రంతో చంద్రుడు కూడినా అది భాద్రపద మాసమే అనబడును....
ఫాల్గుణ మాసం అంటే పుబ్బ / ఉత్తర అనే జంటనక్షత్రాల్లో ఏ నక్షత్రంతో చంద్రుడు కూడినా అది ఫాల్గుణ మాసమే అనబడును....
కాని ఖగోళంలో చంద్రుడు ఎప్పటికీ పూర్ణచంద్రుడే...
కాబట్టి మన భూలోకవాసులకు కనిపించని చంద్రతలం గురించి చెప్పాలంటే, ధృవుడైనా చెప్పాలి, చంద్రుడైనా చెప్పాలి, పరమేశ్వరుడైనా చెప్పాలి, అంబిక అయినా చెప్పాలి, వినాయకుడైనా చెప్పాలి... శ్రీవిద్యోపాసకులైనా చెప్పాలి..

ఎందుకంటే అమ్మవారు ఈ క్రింది విధంగా స్తుతింపబడే త్రయంబిక గా అలరారే విశేషం కాబట్టి...

శ్రీవిద్యాం శివవామభాగనిలయాం హ్రీంకారమంత్రోజ్జ్వలాం
శ్రీచక్రాంకితబిందుమధ్యవసతిం శ్రీమత్సభానాయకీమ్ ।
శ్రీమత్షణ్ముఖవిఘ్నరాజజననీం శ్రీమజ్జగన్మోహినీం
మీనాక్షీం ప్రణతోఽస్మి సంతతమహం కారుణ్యవారాంనిధిమ్ ॥

(పూర్ణచంద్రుడికి, శ్రీచక్రానికి /
చంద్రకళలకు, నవావరణదేవతలకు /
మీనాక్షిదేవికి, నక్షత్రమండలాలకు /
ఏంటి సంబంధం అనే అంశం మరో గహనమైన నక్షత్రజ్యోతిషశాస్త్రాంశం...)

అనగా మీరు ఆకాశంలో ధృవమండలానికి సమీపంగా నిల్చొని, ఒక తక్కెడలో అటు ఉత్తరాయణపుణ్యకాలం మరియు ఇటు దక్షిణాయణపుణ్యకాలం వేసి, త్రాసు ఎటుగా వాలుతుంది అంటే దక్షిణాయణం దిశగా అనేది విజ్ఞ్యులకు విదితమైన అంశమే....

ఇట్టి సెలేటియల్ డ్రిఫ్ట్ ఆఫ్ మూన్స్ టైం ప్లేన్ అనేది, సాధారణ మనుష్యులకు పెద్దగా ముఖ్యమైన అంశం కాకపోవచ్చు....
కాని చంద్రుణ్ణి ఆధారంగా గావించి పరిఢవిల్లే జ్యోతిష మండలానికి ఈ ఖగోళసమయతలం యొక్క వాలు అనేది ఎంతో ముఖ్యమైన అంశం...

అది ఎందుకు, ఏంటి, ఎట్లా అనే వివిధ అధ్యాత్మశాస్త్ర సందేహాలు అనేవి మీరు అడిగితే ఆ ధృవమండలాధీశుడైన ధృవుణ్ణి అడగవలెను....లేక జ్యోతిషశాస్త్ర విద్వణ్మూర్తులను, 
ఖగోళశాస్త్ర వైజ్ఞ్యానికులను, శ్రీవిద్యోపాసకులను, ఇత్యాది మాన్యులను అడగవలెను...

ఆషాఢ శుద్ధ ఏకాదశి / తొలి ఏకాదశి / దేవశయన ఏకాదశి నుండి మొదలుకొని,
కార్తీక శుద్ధ ఏకాదశి / దేవోత్థాన ఏకాదశి వరకు పరివ్యాప్తమై ఉండే అత్యంత పుణ్యదాయకమైన సాధనా / ఉపాసనా కాలంలో భగవంతుడి ఆరాధనను విజ్ఞ్యులవచనానుసారంగా గావించి విశేషమైన ఈశ్వరానుగ్రహంతో తరించడమే అందుకు తగిన మార్గం...

"ద్వాదశి నాడు, సినివాలి (అమావాస్య) నాడు, పౌర్ణమి నాడు, దినక్షయము నందు, ఇత్యాది విశేషపుణ్యసమయాల్లో శ్రీమద్భాగవతాంతర్గతమైన సంపూర్ణ ధృవోపాఖ్యానం శ్రద్ధాభక్తులతో ఆలకిస్తే అజ్ఞ్యానం సమూలంగా దహింపబడును...."
అని సద్గురువులు విశేషంగా ప్రవచించడం విజ్ఞ్యులకు ఎరుకే....

ఏకాదశి ఉపావాస తిథి, మరియు
ద్వాదశి పారణ తిథి అని అనడంలో అసలైన అధ్యాత్మాంతరార్థం ఏంటో తెలుసా....?

ఉపే వాసః అనగా భగవద్ చింతనకు దెగ్గరగా ఉండడం...
పారణ అనగా, ఏది భుజించి తీరవలెనో అది ద్వాదశి ఘడియలు ఉండగానే భుజించవలెను....

అనగా పంచకర్మేంద్రియాలు, పంచజ్ఞ్యానేంద్రియాలు, మనసు, బుద్ధి అనే ద్వాదశ తత్త్వసంఘాతంతో పరిఢవిల్లే మన శరీరంలోనే పరమాత్మగా కొలువై ఉండే ఆత్మతత్త్వాన్ని ఎరుకలోకి తెచ్చుకునేందుకు ఆవశ్యకమై ఉండే అధ్యాత్మజ్ఞ్యానాన్ని విశేషంగా అనుగ్రహించే తిథి ద్వాదశి అనేది ఆధ్యాత్మిక అంతరార్ధం...

ఎంతో విశేషమైన రీతిలో భగవద్ ఆరాధనలు గావించడం అందరికీ నిత్యం వీలుండకపోవచ్చు.....
కాస్త హరిద్రాకుంకుమను సమర్పించి, త్రికరణశుద్ధిగా ప్రార్ధించి నమస్కరించగా ఎంతో కరుణామయురాలైన అమ్మవారు ఎంతో శీఘ్రంగా ఘనంగా అనుగ్రహించును కావున....
అమ్మవారి ఆరాధన ఈ ఆషాఢమాసంతో విశేషంగా ప్రారంభమై దక్షిణాయణం మొత్తం కొనసాగడం ఈశ్వరానుగ్రహమైన మన సౌభాగ్యవిశేషం....

"సర్వదా సర్వదేశేషు పాతుః త్వాం భువనేశ్వరి
మహామాయా జగద్ధాత్రి సత్ చిత్ ఆనంద రూపిణీం

అనే శ్లోకంతో హ్రీం బీజాధిదేవతైన చతుర్దశభువనపాలిని శ్రీభువనేశ్వరిదేవిని ప్రార్ధించడం ఎంతో ఘనమైన భగవదనుగ్రహదయకం...."

అని శ్రీచాగంటి సద్గురువులు వచించడం కొందరు విజ్ఞులకైనా గుర్తుండే ఉంటుంది....

హనుమంతుడు కూడా ఈ హ్రీం బీజగర్భితమైన శ్రీరామోపాసన గావిస్తూ ఉండడం, ఆంజనేయుడి అప్రతిహత శక్తికి కారణం అనేది శ్రీవిద్యోపాసకులకు విదితమైన అంశం...

అణుశక్తిని జాగ్రత్తగా హ్యాండిల్ చేయడం అందరికీ అన్ని వేళలా కుదరదు కాబట్టి...
అత్యంతశక్తివంతమైన బీజాక్షర ఆరాధన కాకుండా, అందరూ గావించగల సమాన్య శ్లోకసారస్వతం ద్వారా అమ్మవారిని హరిద్రాకుంకుమతో ఆరాధించి తరించడం భక్తుల భాగ్యకారక విశేషం...💐🙂

యాదేవి సర్వభూతేషు శక్తి రూపేణ సంస్థిత ....
నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమో నమః....🙏

***** మీనాక్షీ పంచరత్న స్తోత్రం *****

ఉద్యద్భానుసహస్రకోటిసదృశాం కేయూరహారోజ్జ్వలాం
బింబోష్ఠీం స్మితదంతపంక్తిరుచిరాం పీతాంబరాలంకృతామ్ ।
విష్ణుబ్రహ్మసురేంద్రసేవితపదాం తత్త్వస్వరూపాం శివాం
మీనాక్షీం ప్రణతోఽస్మి సంతతమహం కారుణ్యవారాంనిధిమ్ ॥ 1 ॥

ముక్తాహారలసత్కిరీటరుచిరాం పూర్ణేందువక్త్రప్రభాం
శింజన్నూపురకింకిణీమణిధరాం పద్మప్రభాభాసురామ్ ।
సర్వాభీష్టఫలప్రదాం గిరిసుతాం వాణీరమాసేవితాం
మీనాక్షీం ప్రణతోఽస్మి సంతతమహం కారుణ్యవారాంనిధిమ్ ॥ 2 ॥

శ్రీవిద్యాం శివవామభాగనిలయాం హ్రీంకారమంత్రోజ్జ్వలాం
శ్రీచక్రాంకితబిందుమధ్యవసతిం శ్రీమత్సభానాయకీమ్ ।
శ్రీమత్షణ్ముఖవిఘ్నరాజజననీం శ్రీమజ్జగన్మోహినీం
మీనాక్షీం ప్రణతోఽస్మి సంతతమహం కారుణ్యవారాంనిధిమ్ ॥ 3 ॥

శ్రీమత్సుందరనాయికాం భయహరాం జ్ఞానప్రదాం నిర్మలాం
శ్యామాభాం కమలాసనార్చితపదాం నారాయణస్యానుజామ్ ।
వీణావేణుమృదంగవాద్యరసికాం నానావిధామంబికాం
మీనాక్షీం ప్రణతోఽస్మి సంతతమహం కారుణ్యవారాంనిధిమ్ ॥ 4 ॥

నానాయోగిమునీంద్రహృత్సువసతీం నానార్థసిద్ధిప్రదాం
నానాపుష్పవిరాజితాంఘ్రియుగళాం నారాయణేనార్చితామ్ ।
నాదబ్రహ్మమయీం పరాత్పరతరాం నానార్థతత్వాత్మికాం
మీనాక్షీం ప్రణతోఽస్మి సంతతమహం కారుణ్యవారాంనిధిమ్ ॥ 5 ॥

https://vignanam.org/telugu/meenakshi-pancha-ratna-stotram.html