శ్రీ విశ్వావసు 2025 ఆషాఢ శుద్ధ నవమి ప్రయుక్త శ్రీచాగంటి సద్గురువుల జన్మదినోత్సవ శుభాభినందనానమస్సులు...
🙂💐🙏
ఇవ్వాళ్టి ఆధునిక సమాజంలో శ్రీచాగంటి సద్గురువుల ప్రవచనాల ప్రభావం ఎక్కడివరకు ఉందంటే, ఏనాడు వారి ప్రవచనాన్ని శ్రద్ధాభక్తితో ఒక గంటసేపు కూడా ఆలకించని వారు, "ప్రవచనం" / "ప్రహృష్ట వచనం" అంటే ఏంటో, ఎందుకో కూడా సరిగ్గా తెలియని వారు కూడా, యు ట్యూబ్ లో వారికి నచ్చిన ఒక స్వల్పనిడివిగల శ్రీచాగంటి సద్గురువుల ప్రవచనం యొక్క క్లిప్పింగ్ ని కోట్ చెస్తూ...
"ఇదిగో చూసారా....శ్రీచాగంటి గారు ఇలా చెప్పారు.....అందుకే నేను కూడా ఇలా అంటున్నా......"
అని చెప్తూ వారికి కావలసినవి సాధించుకునేందుకు మాధ్యమంగా శ్రీచాగంటి సద్గురువుల ప్రవచనాలను భావించడం వరకు...
అట్టి వారి నుండి...
"శ్రీచాగంటి సద్గురువులు ఆ వచనం ఏ ప్రవచనంలో ఎవరిని, ఎట్టివారిని, ఏ సందర్భంలో, పరోక్షంగా ఉద్దేశిస్తూ వచించారో తెలుసా...?
అని అంటే సమాధానం ఉండదు...
"శ్రీచాగంటి సద్గురువులు ఆ వచనం చెప్పిన ప్రవచనంలోనే ఇంకో వచనం కూడా చెప్పారు తెలుసా...?
అని అంటే సమాధానం ఉండదు...
ఇవ్విధంగా ఇవ్వాళ్టి సమాజంలో కొందరు ధూర్తులు వారి "మందిని ముంచుతూ బ్రతకడం అనే అడ్డమైన వ్యాపకానికి, "బిజినెస్" అనే అందమైన పేరును ఆపాదించి, అందుకు శ్రీచాగంటి గారి పేరును వాడుకోవడం వరకు...
శ్రీచాగంటి సద్గురువులవంటి మహనీయుల బోధలు స్వోద్ధరణకు, ఆత్మోద్ధరణకు, స్వీయవ్యక్తిత్వవికాసానికి, స్వయంకృషిభరితజీవితవైభవనిర్మాణానికి, భగవద్భక్తిజ్ఞ్యానసముపార్జనకు,
తద్వారా భగవదనుగ్రహప్రోదికి, మాధ్యమంగా లోకానికి అందివచ్చిన సుజ్ఞ్యానామృతగుళికలు....
ఒకసారి శ్రీచాగంటి సద్గురువులు వారి ప్రవచనాయజ్ఞ్యంలో ఉండగా,
ఢిల్లీ నుండి వారి సోదరీమణి చాలాకాలంతర్వాత విచ్చేసినందుకు, కొద్ది క్షణాలు వారి ప్రవచనాన్ని ఆపిమరీ సోదరిని కుశలప్రశ్నలు అడిగిన సందర్భం నుండి ఈ సమాజం నేర్చుకోవలసింది ఏంటంటే..
"మనకు వీలైనంత సోదరీమణులకు, ఆడబిడ్డలకు, అడబిడ్డల బిడ్డలకు, ఆడపిల్లలకు గౌరవమరియాదలు, కానుకలు, దీవెనలు ఇవ్వవలెను..."
అంతే కాని ఆడపిల్లల సొమ్ము ఎట్ల దోచుకోవాలా...
దోచుకున్న వారి సొమ్ముతోనే ఎట్ల బిజినెస్ చేసి ఖజానా నింపుకోవాలా...అని కాదు...
ఒకసారి శ్రీచాగంటి సద్గురువులు వారి ప్రవచనంలో ఉటంకించిన ఉదాహరణలో చెప్పబడినట్టుగా...
"బ్యాంక్ లోన్ తీసుకొని మరీ కొడుకును ఫారిన్ చదువులకు పంపించి, విదేశాల్లో కొడుకు గొప్పవాడౌతుంటే ఎంతో సంతోషిస్తూ,
నా కొడుకు ఫారిన్లో చదువుకొని ప్రయోజకుడై, మంచి ఇల్లు కొనుక్కున్నాడంటా, పెద్ద కారు కొనుక్కున్నాడంటా, పిల్లాపాపలతో సంతోషంగా ఉన్నాడంటా..."
అని కొడుకు యొక్క అభివృద్ధి గురించి నలుగురికి గొప్పగా చెప్పుకొని మురిసే తండ్రి నుండి ఈ సమాజం
నేర్చుకోవలసింది ఏంటంటే...
"కన్నబిడ్డలు ప్రయోజకులవ్వడానికి తల్లితండ్రులు కారణం అవ్వాలి కాని...కన్నబిడ్డల ఉన్నతిని ఓర్వలేని కౄరత్వాన్ని పెంచిపోషించే ధూర్తుల / దూరపుబంధువుల / పరిచయస్థుల మాటలు వింటూ కన్నబిడ్డల దుఃఖానికి కారణం కాకూడదు..." అని...
రోడ్డు మీద దార్లో కొలువైన ఒక పెద్ద మామిడిచెట్టు అందించే ఫలాలను....
1. అందుకొని ఈశ్వరుడికి నివేదించి ప్రసాదంగా స్వీకరించి ఆరోగ్యంతో, ప్రజ్ఞ్యానంతో, ప్రశాంతతతో, జీవించే విజ్ఞ్యులు కొందరు....
2. అందుకొని ఇతరులపైకి విసురుతూ, ఇబ్బందిపెడుతూ, బాధిస్తూ, మూర్ఖత్వంతో, అజ్ఞానంతో, అల్లరితో, జీవించే ధూర్తులు కొందరు....
3. పెద్దగా ఏమి పట్టించుకోకుండా వారిదార్లో వారు సాగేవారు ఇంకొందరు....
ఈ మూడు క్యాటగిరీల్లో ఉండే వ్యక్తులెవ్వరూ కూడా
ఇతరులకు సర్టిఫికేట్లు ఇవ్వాలని కాని....
ఇతరులనుండి సర్టిఫికేట్లు కొనుక్కోవాలని కాని....
ఇతరులను సర్టిఫై చేయాలని కాని...
అనుకోరు...
ఎందుకంటే....
ఎవరి పరిశ్రమ వారిది...
ఎవరి మూర్ఖత్వం వరిది...
ఎవరి దారివారిది...
కాని ఇక్కడ గమనించవలసిన ముఖ్యమైన అంశం ఏంటంటే ఆ మామిడిచెట్టుకు మాత్రం...
1. కొందరు విజ్ఞ్యులు తన ఫలాలను అందుకొని అభివృద్ధిచెందుతున్నందుకు వారి మీద ఓర్వలేనితనం ప్రదర్శించడం కాని...
2. కొందరు మూర్ఖులు తన ఫలాలను అందుకొని నానా అల్లరి చేస్తున్నందుకు శోకించడం కాని...
3. కొందరు సామాన్యులు తన ఫలాల గురించి పెద్దగా ఏమి పట్టించుకోనందుకు వ్యాకులత చెందడం కాని....
వర్తించదు....
ఎందుకంటే ఉన్నతంగా కొలువై, ఉత్తమఫలాలను అందిస్తూండడమే తన విహితకర్తవ్యంగా జీవించడం ఆ మామిడిచెట్టుకు తెలిసిన మంచితనం....
అచ్చం అదేవిధంగా,
శ్రీచాగంటి సద్గురువుల వంటి మహనీయులు కూడా....
ఎంతో సమ్మున్నతమైన స్థాయిలో కొలువై, ఉత్తమోత్తమమైన బ్రహ్మజ్ఞ్యానఫలాలను ప్రసాదిస్తూ, విజ్ఞ్యులెల్లరినీ అనుగ్రహించడమే విహితకర్తవ్యంగా జీవించడం అట్టి బ్రహ్మవేత్తలకు తెలిసిన మంచితనం....
అనగా...
1. కొందరు విజ్ఞ్యులు వారి బ్రహ్మజ్ఞ్యానఫలాలను అందుకొని అభివృద్ధిచెందుతున్నందుకు వారి మీద ఓర్వలేనితనం ప్రదర్శించడం కాని...
2. కొందరు మూర్ఖులు వారి బ్రహ్మజ్ఞ్యానఫలాలను అందుకొని నానా అల్లరి చేస్తున్నందుకు శోకించడం కాని...
3. కొందరు సామాన్యులు వారి బ్రహ్మజ్ఞ్యానఫలాల గురించి పెద్దగా ఏమి పట్టించుకోనందుకు వ్యాకులత చెందడం కాని....
శ్రీచాగంటి సద్గురువుల వంటి మహనీయులకు వర్తించదు....
ఈ మూడు క్యాటగిరీల్లో ఉండే వ్యక్తులెవ్వరూ కూడా
ఇతరులకు సర్టిఫికేట్లు ఇవ్వాలని కాని....
ఇతరులనుండి సర్టిఫికేట్లు అందుకోవాలని కాని....
ఇతరులను సర్టిఫై చేయాలని కాని...
అనుకోరు...
ఎందుకంటే....
ఎవరి జిజ్ఞ్యాస, పరిశ్రమ, శ్రద్ధ, భక్తి, జ్ఞ్యానం, భగవదనుగ్రహం వారిది...
ఎవరి మూర్ఖత్వం వరిది...
ఎవరి దారివారిది...
శ్రీచాగంటి సద్గురువుల ప్రహృష్టవచనాలు ఈ లోకంలో మరెందరో విజ్ఞ్యుల జీవితాల్లో దైవికస్పృహను కలిగిస్తూ,
భగవదనుగ్రహదీప్తితో పరిఢవిల్లే విజ్ఞ్యతను అనుగ్రహిస్తూ, జీవితాన్ని సార్ధకపరుచుకునే వివేకాన్ని ప్రోదిగావిస్తూ,
సర్వేసుజనాః సుఖినోభవంతు అనే ఆర్షవాక్కును అనునయిస్తూ, లౌక్యాన్ని అనుసరిస్తూ జీవించే మాన్యులకు మార్గదర్శకత్వాన్ని ప్రసాదిస్తూ, పరిఢవిల్లాలని మనసారా ఆకాంక్షిస్తూ....
ఇంతటి హితకరకారుణ్యమూర్తిని లోకానికి అనుగ్రహించిన గురువుగారి మాతాపితరులైన
కీ.శే || శ్రీ సుశీలమ్మ సుందరశివ గార్ల శ్రీచరణాలకు,
మరియు...
ఇంతటి ప్రజ్ఞ్యానదాయక సంఘసంస్కర్తను సమాజానికి అందిస్తున్న గురువుగారి సహధర్మచరులైన
శ్రీమతి సుబ్రహ్మణ్యేశ్వరి గారి శ్రీచరణాలకు,
ప్రణమిల్లుతూ.....
శ్రీగురుచరణారవిందములచెంత వారి 66వ జన్మదినోత్సవ సందర్భంగా చిరు సవినయ సాంజలిబంధక సాష్టాంగప్రణామపూర్వక కవనకుసుమాంజలి....💐☘️
ఓం శ్రీగురవేనమః.... 🙏🙂💐
No comments:
Post a Comment