Sunday, July 6, 2025

శ్రీ విశ్వావసు 2025 ఆషాఢ శుద్ధ ఏకాదశి / దేవశయన ఏకాదశి / తొలి ఏకాదశి నైమిత్తిక తిథి పురస్కృత పర్వసమయ శుభాభినందనలు...🙂💐


"తొలిసంధ్యవేళలో.. తొలిపొద్దుపొడుపులో....
తెలవారే తూరుపులో వినిపించే రాగం భూపాలం...
ఎగిరొచ్చే కెరటం హిందోళం...."
అనే సినిమాపాటలో " తొలిసంధ్య"  అంటే ఏంటి...?

"నేతొలిసారిగా కలగన్నదీనిన్నేకదా....ఆ
నాకళ్ళెదురుగా నిలుచున్నదీ నువ్వేకదా...ఆ"
అనే సినిమాపాటలో "నేతొలిసారిగా"  అంటే ఏంటి...?

"తొలిప్రేమా...నీ గుండెలో గాయమా...
తొలిప్రేమా...నా వల్లె అనకుమా..."
అనే సినిమాపాటలో "తొలిప్రేమ"  అంటే ఏంటి...?

ఆ రోజుయొక్క మొట్టమొదటి సంధ్య...అని
ఆ జీవితంలో మొట్టమొదటిసారి కలగన్న వ్యక్తి...అని
ఆ జీవితపయనంలో అంకురించిన మొట్టమొదటి ప్రేమ అనే భావన...అని..
అర్ధం....

మరి ఇట్టి భావనలో తొలిఏకాదశి ఎవ్విధంగా మొట్టమొదటి ఏకాదశి అవుతుంది అనే ధర్మసందేహం కొందరు విజ్ఞ్యులకైనా ఎప్పుడో ఒకప్పుడు రాకమానదుకద...

అటు చైత్ర శుద్ధ ఏకాదశి కాదు...
ఇటు ఆశ్వయిజ శుద్ధ ఏకాదశి కూడా కాదు..
మరి ఆషాఢ శుద్ధ ఏకాదశి తొలి ఏకాదశి గా భావింపబడడంలోని అధ్యాత్మ ఆంతర్యమేమి...??
అనే ఆధ్యాత్మిక విశేషాన్ని శ్రీవేంకటేశ్వరస్వామివారు అనుగ్రహించినమేర అవలోకిద్దాం....

సంవత్సరం అనే నిర్దిష్టమైన కాలం యొక్క మేయంలో....

లిప్త కాలం నుండి మొదలుకొని
క్షణం
నిమిషం
ఘడియ
హోర
జాము
సంధ్య
పగలు
రేయి
వాసరం
వారం
పక్షం
మాసం
ఋతువు
అయనం

అనే విభాగంలో అన్నిటికంటే పెద్దదైనది అయనం...

ఉత్తరాయణం మరియు దక్షిణాయాణం 
అనే రెండు అయనాల సమ్మిళితస్వరూపంగా ఒక సంవత్సర కాలం పేర్కొనబడును....

భూమికి / భూలోకవాసులకు ఎంతో ముఖ్యమైన మేఘమండలాన్ని శాసించే సూర్యమండలంలో పయనించే సూర్యపరమాత్మ యొక్క ఏకచక్రరథగమనంపై ఆధారితమైనవి ఈ  ఉత్తరాయణం మరియు దక్షిణాయాణం అనే రెండు అయనాలు...

రామాయణం అనగా రాముడి అయనం...
అనగా రాముడి జీవిత పయనం...అని అర్ధం....
అవ్విధంగానే...
ఉత్తరాయణం అనగా ఉత్తరదిక్కుగా సూర్యపరమాత్మ యొక్క రథపయనం ఉండే కాలం...
దక్షిణాయణం అనగా దక్షిణదిక్కుగా సూర్యపరమాత్మ యొక్క రథపయనం ఉండే కాలం...

సైంటిఫిక్ గా చెప్పాలంటే...
భూమి సూర్యుడికి దూరంగా భ్రమణం గావించే సమయాన్ని దక్షిణాయణం అని....
భూమి సూర్యుడికి దెగ్గరా భ్రమణం గావించే సమయాన్ని ఉత్తరాయణం అని....
వచించెదరు...

మన స్కూల్ డేస్ లో "ద జంగల్ బుక్" అనే వీక్లి కార్టూన్ షో గుర్తున్నవారికి తెలిసినట్టుగా అందులో "మోగ్లి" అనే ఆర్టిస్ట్ విసిరే ఒకానొక చిన్నపాటి చెక్కతో చేసిన వలయఖడ్గం లాంటి శస్త్రం యొక్క ఆకాశమార్గ పయనం కొందరికైనా గుర్తుండే ఉంటుంది కద...

మన భూగ్రహం కూడా అచ్చం అవ్విధంగానే రోదసిలో తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యపరమాత్మ చుట్టూ అంతటి వేగంతో, అట్టి ప్రొలాంగ్డ్ ఎలిప్టికల్ పాత్ లో తన నిర్దేశిత అంతరిక్షకక్ష్యలో ఇతర గ్రహాలతో సంబంధంలేకుండా తనమార్గంలో తను తిరుగురూ ఉండును......

ఈ తొలి ఏకాదశి / దేవశయన ఏకాదశి అనే పర్వసమయం,
క్షీరసాగరశయనుడై పరిఢవిల్లే శ్రీమహావిష్ణువైన శ్రీమన్నారాయణుడు తన చాతుర్మాస్యయోగనిద్రకి ఉపక్రమించే సమయం, అని అధ్యాత్మవేత్తలు వచించడంలోని ఆంతర్యం ఏమనగా...

"నారాయణ" అనే పదానికి సంస్కృతంలో "నర" అంటే "నీరు" లేదా "మానవులు" మరియు "అయన" అంటే "నివాసం" లేదా "ఆధారం" అని అర్థం. కాబట్టి, నారాయణ అంటే "నీటిలో నివసించేవాడు" లేదా "మానవులందరికీ ఆధారమైనవాడు" అని అర్థం. ఇది విష్ణువు యొక్క పర్యాయపదంగా కూడా ఉపయోగిస్తారు.

అనగా పరమాత్మశక్తిగా నరులందరిలోనూ ఉండే ఆ వైశ్విక 
విష్ణు చైతన్యమైన శ్రీమన్నారాయణచైతన్యశక్తి 
సూర్యపరమాత్మ అనుగ్రహమైన  ఆత్మశక్తిగా పరిఢవిల్లుతూ ఉండే అధ్యాత్మ అంశం...

అధ్యాత్మపరంగా సూర్యచైతన్యం భూమికి దూరంగా జరుగుతున్నా...
సైంటిఫిక్ గా భూమి సూర్యుడికి దూరంగా జరుగుతున్నా...
భూలోకవాసులైన మానవుల ఆంతరచైతన్యశక్తి / ఆత్మశక్తి
సన్నగిల్లే సమయం ఈ దక్షిణాయణసమయం...

ఇట్టి సమయంలో శ్రీమన్నారాయణుడు యోగనిద్రకు ఉపక్రమించడం అంటే...
యోగదృష్టితో యావద్ విశ్వాన్ని మరింత క్షుణ్ణంగా పరికించడం అనే ప్రక్రియే ఈ చాతుర్మాస్య పర్వసమయం....
జగద్గురువులు కూడా ఈ సమయానికి
వారు ఏ ప్రాంతంలో విజయంచేసి ఉంటే అక్కడే ఈ 4 మాసాలు కూడా (ఆషాఢ శుద్ధ ఏకాదశి నుండి కార్తీక శుద్ధ ఏకాదశి వరకు)
చాతుర్మాస్యదీక్షాధారులై వర్ధిల్లడం విజ్ఞ్యులకు విదితమే...
అనగా ఈ భూలోకంలో పరమాత్మకు ప్రతీకలుగా ఆరాధింపబడే జగద్గురువులు కూడా వారివారి సాధనా / ఉపాసనా బలాన్ని వృద్ధిగావించుకుంటూనే...లోకకళ్యాణకారకమైన క్రతువులకు వారి శక్తియుక్తులను ఎవ్విధంగా అనుగ్రహించవలెను అని ఆంతరవీక్షణంలో స్థిరంగాకొలువైఉండే సమయానికి శ్రీకారమైన పర్వసమయమే ఈ తొలి ఏకాదశి / దేవశయన ఏకాదశి పర్వసమయం....

శ్రీకంచి పరమాచార్యుల వారు ఎక్కడో విడిది చేసి ఉన్నా కూడా....కొన్నివేలమైళ్ళ దూరంలో ఉన్న భక్తులకు దారిచూపడం / మార్గనిర్దేశనం గావించడం / సందేహాలను నివృత్తి గావించడం / ఏదో ఒక రూపంలో ఏతెంచి సహాయం చేయడం...గురించిన ఇతిహాసాలు ఎందరో విజ్ఞ్యులు ఎన్నోసార్లు చదివి / విని / తెలుసుకునే ఉంటారు...

ఈ లోకకళ్యాణకారక భగవద్కర్తవ్యాన్ని నిర్వర్తించే మహనీయులకు, ఈ ఆషాఢ శుద్ధ ఏకాదశే ఎందుకు తొలి ఏకాదశి అవుతుంది అనే అధ్యాత్మ అంశం విదితమైనదే....

చిరంతనమైన అమేయకాలప్రవాహంలో సంభవించే విశేషమైన సంధిసమయాల్లో ఏతెంచే ఏకాదశి తిథులకు ఎంతో ప్రాశస్త్యం ఉండును......
ఎందుకంటే.....
మురాసురుడితో శ్రీమహావిష్ణువు పోరాడుతూ అలసిఉన్న సమయంలో, శ్రీమహావిష్ణువుయొక్క దైవికదేహం నుండి ఉద్భవించిన దేవతాస్త్రీమూర్తికి శ్రీమహావిష్ణువు అనుగ్రహించిన వరంకారణంగా, కాలపట్టికలో శాశ్వతమైన విశేషమైన తిథిగా భూలోకంలో కొలువైన తిథే ఏకాదశి..!

ఎవ్విధంగా అయితే భారతీయ గంగిగోవు ప్రాకృతిక / లౌకిక / బ్రహ్మసృష్టి కి సంబంధించిన ప్రాణి కాదో...
అవ్విధంగానే ఏకాదశి అనే తిథి ప్రాకృతిక / లౌకిక / బ్రహ్మసృష్టి కి సంబంధించిన తిథి కాదు...
అందుకే సనాతనభారతీయులకు అనాదిగా...
గంగిగోవు సకల దేవతలకు ప్రీతికరమైన / ఆలవాలమైన దైవికప్రాణి...
మరియు
ఏకాదశి తిథి సకల దేవతలకు ప్రీతికరమైన / విశేషదేవతానుగ్రహదాయకమైన తిథి...

చాల సింపుల్ గా లౌకిక ఎగ్సాంపుల్ తో చెప్పాలంటే...
ఒక కార్ ఇసుకలో / మట్టి రోడ్డులో మామూలుగా వెళ్తున్నప్పుడు పెద్దగా దుమ్ము, ధూళి ఎక్కువగా ఉండదు..
కాని ఆ కార్ సడెన్ U టర్న్ తీసుకుంటే ఒక్కసారిగా రేగే దుమ్ము, ధూళి అధికంగా ఉండును...
అచ్చం అదేవిధంగా రోదసి లో గ్రహాల పయనం మరియు వాటివాటి దీర్ఘవృత్తాకారకక్ష్యలో తీసుకునే U టర్న్ లో రేగే "సమయధూళి" కూడా...
మామూలు లౌకిక ధూళి కళ్ళకు కనిపిస్తుంది కాబట్టి స్పెక్టకిల్స్ ధరిస్తాము.....
రోదసిలో రేగే అలౌకిక "సమయధూళి" కళ్ళకు కనిపించదు కాబట్టి చాతుర్మాస్య దీక్షను ధరిస్తారు.....

శ్రీచాగంటి సద్గురువుల ప్రవచనాల్లో....
వినతా / కద్రువ, గుర్రం తోక నలుపా తెలుపా, కద్రువ కపటం / 
వినత దాస్యం / సూర్యరథసారధిగా అనూరుడు / 
తన తమ్ముడైన వైనతేయుడు గరుత్మంతుడిగా శ్రీమహావిష్ణువు యొక్క సారధిగా కొలువై ఉండడం...
గురించిన ఇతిహాసాల గురించి విజ్ఞ్యులు ఆలకించే ఉంటారు...

అట్టి చాతుర్మాస్య దీక్షాధారణకు శ్రీకారంగా భావింపబడే ఈ తొలి ఏకాదశి / దేవశయన ఏకాదశి / భక్తుల జీవితాలను నూతన భగవద్దీప్తితో పరిఢవిల్లజేయాలని ఆకాంక్షిస్తూ...
ఎల్లరికీ తొలి ఏకాదశి పర్వసమయ శుభాభినందనలు...🙂💐

No comments:

Post a Comment