శ్రీచాగంటి సద్గురువుల ప్రవచనాల్లో శ్రీమద్భాగవతాంతర్గతంగా శ్రీవామనోపాఖ్యానం ఆలకించిన భక్తులకు తెలిసినట్టుగా, అత్యంత మహాత్య్మభరిత వామానవృత్తాంతాన్ని లఘువుగానైనా వినడం, స్మరించడం ఎంతో పుణ్యదాయకం...
1.గ్లుకోండి పౌడర్ కలిపిన నీళ్ళు,
2.చెరుకురసం,
3.కొబ్బరిబోండంనీళ్ళు,
4.పల్లీపట్టీలు,
5.నువ్వుండలు,
6.కొబ్బరిలడ్లు,
7.సున్నుండలు,
8.రాగిలడ్లు,
ఇత్యాది కొన్ని విశేషమైన పదార్ధాలు తిన్నవెంటనే ఎంతో శక్తిని అనుగ్రహించే సాధనములై ఒప్పరాడం అనే విశేషం ప్రాపంచిక విజ్ఞ్యులకు తెలిసిన అంశమే....
అచ్చం అదేవిధంగా,
1.గజేంద్రోపాఖ్యానం,
2.శ్రీకృష్ణలీలలు,
3.గంగావతరణం,
4.ప్రహ్లాదోపాఖ్యానం,
5.కపిలగీత,
6.ధృవోపాఖ్యానం,
7.క్షీరసాగరమథనం,
8.వామనోపాఖ్యానం,
ఇత్యాది కొన్ని విశేషమైన శ్రీమద్భాగవత ఆఖ్యానాలు, ఆలకించినంతమాత్రాన ఎంతో తపోశక్తిని / పుణ్యాన్ని అనుగ్రహించే సాధనములై ఒప్పరాడం అనే విశేషం అధ్యాత్మ విజ్ఞ్యులకు తెలిసిన అంశమే....
మీలో చాలమంది విజ్ఞ్యులకు రాగులు
అనే ఎంతో విశేషమైన చిరుధాన్యాలతో తయారుచేసే
రాగిలడ్లు / రాగిజావ / రాగిసంకటి / రాగి అటుకులు / రాగి ఉప్మ / రాగి దోశ / రాగి ఇడ్లి ఇత్యాదివాటి గురించి విదితమే కద...
ఎంతో వేడిని, ఎంతో చలువను, ఎంతో శక్తిని, ఎంతో నిస్సత్తువను, కలిగించగల విచిత్రమైన పదార్ధం రాగులు / రాగులతో వివిధరీతుల్లో తయారయ్యే వివిధ వంటకాలు...
రాగుల యొక్క ఈ విచిత్రమైన తత్త్వం ఎట్టిదో, వామనోపాఖ్యానం కూడా అట్టి విచిత్రమైన మహత్తును ప్రసాదించే విశేషమైన శ్రీమద్భాగతాఖ్యానం...!
ఈశ్వరానుగ్రహంగా,
కొందరు చాలాబాగా వ్రాయడంలో దిట్టలు....
కొందరు చాలాబాగా చదవడంలో దిట్టలు....
కొందరు చాలాబాగా పాడడంలో దిట్టలు....
కొందరు చాలాబాగా వ్యాఖ్యానించడంలో దిట్టలు....
కొందరు చాలాబాగా సమన్వయపరచడంలో దిట్టలు....
ఇత్యాదిగా ఒక్కొక్కరి ఈశ్వరానుగ్రహం ఒక్కోవిభూతి యొక్క ప్రస్ఫుటప్రకటనశక్తిగా ఒప్పారేవిశేషం...
ఈశ్వరానుగ్రహంగా,
శ్రీచాగంటిసద్గురువుల వంటి మహనీయుల వాగ్వైభవంలో శ్రీవామనావతారవైభవం శ్రద్ధాభక్తితో వినడం ఎంతో విశేషకరవైభవం...
అట్టి వైభవానికి నోచుకున్న తపోధనులకు తెలిసిన విధంగా,
ఈ కలియుగంలో "శృణ్వన్ తపః" అని ఎందుకు విజ్ఞ్యులు అంటారో ఎరుకలో ఉన్న సత్యమే కద...
అట్టి శ్రీమద్భాగవతపురాణవైభవశ్రవణమాధ్యమంగా, విజ్ఞ్యులెల్లరూ శ్రీవామనావతారవైభవాన్ని ఆలకించి తరించగలరని ఆకాంక్షిస్తూ, ఎల్లరికీ వామన జయంతి పర్వసమయశుభాభినందనలు..💐
గజేంద్రవరదుడు గంగాజనకుడై వర్ధిల్లిన ఇట్టి పర్వసమయాన ఈ క్రింది శ్రీమద్భాగవతపద్యాలు ఒకసారి చదువుకున్నా కూడా ఎంతో ఈశ్వరానుగ్రహకారకం...
https://telugubhagavatam.org/?tebha&Skanda=8&Ghatta=79
8-622-శా.
ఇంతింతై, వటుఁడింతయై మఱియుఁ దా నింతై నభోవీథిపై
నంతై తోయదమండలాగ్రమున కల్లంతై ప్రభారాశిపై
నంతై చంద్రుని కంతయై ధ్రువునిపై నంతై మహర్వాటిపై
నంతై సత్యపదోన్నతుం డగుచు బ్రహ్మాండాంత సంవర్ధియై.
8-623-మ.
రవిబింబం బుపమింపఁ బాత్రమగు ఛత్రంబై శిరోరత్నమై
శ్రవణాలంకృతియై గళాభరణమై సౌవర్ణకేయూరమై
ఛవిమత్కంకణమై కటిస్థలి నుదంచద్ఘంటయై నూపుర
ప్రవరంబై పదపీఠమై వటుఁడు దా బ్రహ్మాండమున్ నిండుచోన్.
No comments:
Post a Comment