"థైరాయిడ్" / "థైరాయిడ్ సమస్య"
అనే పదం ఈ కాలంలో తరచుగా సమాజంలో ఎక్కువగా వినిపించే మాట / సమస్య....
స్త్రీలు / పురుషులు అనే భేదం లేకుండా అందరినీ తన అధీనంలోకి తీసుకుంటున్న ఈ థైరాయిడ్ రుగ్మత గురించి కొన్ని అపోహలు, కొన్ని వాస్తవాలు, కొన్ని చిట్కాలు, కొన్ని ఔషధాలు, కొన్ని వ్యాయామాలు, ఇలా ఒక్కొక్కరూ / ఒక్కో విజ్ఞ్యులు ఒక్కో విధంగా సూచించడం ఎల్లరికీ విదితమే....
డాక్టర్ దేవికా భట్నాగర్ [ https://youtube.com/@devikabhatnagar ] గారి ఈ అత్యంత ఉపయుక్తమైన వీడియోలో, సైడ్ ఎఫెక్ట్స్ లేని విధంగా మన ప్రాచీన యోగ / ప్రాణాయామ / ముద్రల అధారంగా థైరాయిడ్ సమస్యని ఎట్లు అధిగమించాలో చాలా చక్కగా వివరింపబడినది...
ఆరోజుల్లో శ్రీ రామకృష్ణ మఠం, (లోయర్ ట్యాంక్‌బండ్, దోమల్గుడ) ప్రతి శని,ఆదివారాంతపు / వీకెండ్ తరగతుల్లో మాకు ప్రాథమిక కర్ణాటకశాస్త్రీయసంగీత విద్యను బోధించిన శ్రీమతి హేమారావ్ మేడం గారు, ఈ థైరాయిడ్ సమస్య వల్ల లావుగా అవ్వడం / బరువెక్కడం, మరియు ఇతర సమస్యల వల్ల ఎంతగా ఇబ్బందికి గురైయ్యారో చెప్పారు...
అప్పటి నుండి నేను బయట పానిపూరి, నూడుల్స్, ఫ్రైడ్ రైస్ ఇత్యాదిగా ఫ్రెండ్స్ ఇప్పించే చిరుతిండ్లను పూర్తిగా మానేసాను...
మీకు థైరాయిడ్ గ్రంథి / సమస్య గురించి, చక్కని అవగాహన కావాలన్నా, థైరాయిడ్ టెస్ట్ రిపోర్ట్ లోని అంశాలను ఎట్లా అర్ధం చేసుకోవాలో తెలియాలన్నా, ప్రముఖ సూపర్ స్పెషాలిటి సర్జికల్
గాస్ట్రోఎంటెరాలజిస్ట్, డాక్టర్ శ్రీ రవికాంత్ కొంగర గారు అందించిన థైరాయిడ్ సమస్య గురించిన వీడియో ని చూడండి..@ [ https://youtu.be/NrQRBLz_sQg?si=acgX5tMNpc-4CA5U ]
సర్వే సుజనాః సుఖినోభవంతు..💐