Tuesday, May 19, 2026

శ్రీ చాగంటి సద్గురువుల ప్రవచనామృతాన్ని ప్రత్యక్షంగా ఆలకించే సౌభాగ్యం విజ్ఞ్యులైన భాగ్యనగరవాసులకు లభించిన మరో సువర్ణావకాశం...ఆనాడు రాయలసీమలో వారు శ్రీమద్రామాయణాన్ని ప్రవచిస్తుండగా స్టోర్ రూం నుండి తిరునామాన్ని ధరించిన శ్రీఆంజనేయస్వామి వారు, (కొందరు ఒక పేద్ద వానరం అని అనుకోవచ్చు. అది వారి వారి బుద్ధి వైభవానికి సంబంధించిన అంశం)వారి కపిరూపం / నిజరూపంలో ప్రత్యక్షమై అక్కడ ఆసీనులై ఉన్న ఎందరో భక్తులకు దర్శనీయమైన రీతిలో అక్కడినుండి నడిచి వెళ్ళడం అనే సంఘటన గుర్తున్న భక్తుల్లెలరికీ, అటువంటి హనుమద్ స్వరూపం ఎట్లుండునో అని ఒకసారి దర్శించాలని ఉంటే, వివేకానందనగర్ లో కొలువైన శ్రీ పాంచరాత్ర ఆగమోక్త శ్రీ కార్యసిద్ధి హనుమద్ ఆలయాన్ని సందర్శించి తరించండి....

ఆనాడు రాయలసీమలో వారు శ్రీమద్రామాయణాన్ని ప్రవచిస్తుండగా స్టోర్ రూం నుండి తిరునామాన్ని ధరించిన శ్రీఆంజనేయస్వామి వారు, 
(కొందరు ఒక పేద్ద వానరం అని అనుకోవచ్చు. అది వారి వారి బుద్ధి వైభవానికి సంబంధించిన అంశం)
వారి కపిరూపం / నిజరూపంలో ప్రత్యక్షమై అక్కడ ఆసీనులై ఉన్న ఎందరో భక్తులకు దర్శనీయమైన రీతిలో అక్కడినుండి నడిచి వెళ్ళడం అనే సంఘటన గుర్తున్న భక్తుల్లెలరికీ, అటువంటి హనుమద్ స్వరూపం ఎట్లుండునో అని ఒకసారి దర్శించాలని ఉంటే, వివేకానందనగర్ లో కొలువైన 
శ్రీ పాంచరాత్ర ఆగమోక్త శ్రీ కార్యసిద్ధి హనుమద్ ఆలయాన్ని సందర్శించి తరించండి....

అధ్యాత్మసంప్రదాయంలో ఆంజనేయులవారిని ఆచార్యులకు ప్రతీకగా భావించెదరు...
ఎందుకంటే ప్రత్యక్ష పరమాత్మకు ప్రతీకగా ఆరాధింపబడే సూర్యపరమాత్మ నుండి సకల శాస్త్రాలను స్వాధీనపరుచుకున్న అనితరసాధ్య సాధకవరేణ్యులు ఆంజనేయులవారు....
అందుకే కద 6 కాండల అపురూప ఆదికావ్యమైన శ్రీమద్రామాయణ ఇతిహాస మహార్ణవంలో "సుందరకాండ" అనే కాండ మాత్రమే "సుందర" అనే నామవాచకంతో అలరారే ఎకైక శ్రీమద్రామాయణకాండగా శ్రీవాల్మీకి మహర్షి వారు లోకోత్తరప్రసిద్ధిని కల్పించారు....

సుందరే సుందరో రామః సుందరే సుందరీ కథా |
సుందరే సుందరీ సీతా సుందరే సుందరం వనమ్ ||
సుందరే సుందరం కావ్యం సుందరే సుందరం కపిః |
సుందరే సుందరం మంత్రం సుందరే కిం న సుందరమ్ ||

అనే శ్లోకం విజ్ఞ్యులచే అనాదిగా లోకంలో ప్రసిద్ధిని గడించింది...

ఇక్కడ "సుందరం" అనే పదానికి అర్ధం "యశోభరితమైన / "యశస్కరమైన" అని అన్వయం అవుతుంది.....

హనుమకు ఆ యశోవైభవం అంతా కూడా ప్రత్యక్షపరమాత్మగా అలరారే సూర్యపరమాత్మ యొక్క అనుగ్రహం....
అందుకే అమరులు కూడా అచ్చెరువొందే గాథలకు ఆలవాలమైన సుందరకాండలో హనుమ యొక్క వైభవం తారాస్థాయిలో ప్రకాశించును....

ఆచార్యులుగా లోకంలో వర్ధిల్లే విజ్ఞ్యుల పరంపరాగతమైన స్వాధ్యాయజ్ఞ్యానయజ్ఞ్యంలో సమిధలుగా వారి శ్రద్ధాభక్తిని సమర్పించే వారి వైభవం కూడా అట్లే తారాస్థాయిలో ప్రకాశించును....

యావద్ ప్రపంచంలోగల అసంఖ్యాక శ్రీచాగంటి సద్గురువుల ప్రవచనాశ్రోతల్లో, కొందరిలో కొందరికైనా శ్రీచాగంటి గారి ఈ క్రింది శ్రీలలితాంబికావైభవ వర్ణన గురించి గుర్తుండే ఉంటుంది...
"ఈ కీర్తి యశస్సు ఇత్యాదివన్నీ కూడా ఆ పరేశి యొక్క అనుగ్రహమే కదండి...ఎందుకంటే ఆవిడ "శర్మదా శర్మదాయిని" అని కదా స్తుతింపబడును.....

"ఓం తారాకాంతితిరస్కారినాసాభరణభాసురాయైనమః"
అని ఆవిడను స్తుతించిన భక్తుడికి ఫలితంగా ఆవిడే ఎంతో యశోవైభవాన్ని అనుగ్రహిస్తూ,
మరలా ఆవిడే 
"ఓం శర్మదాయై నమః"
"ఓం శర్మదాయిన్యై నమః"
అని స్తుతింపబడడం ఎంత ఆశ్చర్యకరమో కద ..... !

అమ్మవారి తాటంకములు, నయనములు,
సూర్యచంద్రమండలాలైతే అమ్మవారి ముక్కెర / నాసాభరణం తారామండలానికి ప్రతీక....

అనగా అసంఖ్యాక స్వప్రకాశకాంతిశక్తిపుంజములకు ఆలవాలమైన తారామండలంలోనే యావద్ నిత్యవికసిత ఖగోళరహస్యాలు దాగి ఉన్నవి అని ఆధునిక సైంటిస్ట్ల ఉవాచ కూడా...
[ NASA, ISRO, వాళ్ళు కూడా అన్ని రోదసి విజ్ఞ్యాన విషయాలను పబ్లిష్ చేయరు....వారు కూడా దాచేవి, దాచవలసినవి, కొన్ని ఉంటాయ్...ఎందుకంటే వాళ్ళు కూడా భగవంతుడి అమేయ సృష్టిని మనకంటే దెగ్గరినుండి పరికించే వారే కాబట్టి...]

విజ్ఞ్యులైన ఆరాధకులకు ఈ క్రింది దైనందిన శివార్చనకు సంబంధించిన 8 నామాలకు మరియు వాటి యొక్క పంచభూతాలకు / సూర్య / చంద్ర / జీవ మండలాలకు గల ప్రతీక గురించి తెలిసినదే కద....

1. ఓం భవాయ దేవాయ నమః (జలలింగం / నీటికి అధిపతి)

2. ఓం శర్వాయ దేవాయ నమః (పృథ్వీలింగం / భూమికి అధిపతి)

3. ఓం ఈశానాయ దేవాయ నమః (సూర్యలింగం / సూర్యమండలానికి అధిపతి)

4. ఓం పశుపతయే దేవాయ నమః (ఆత్మలింగం / సర్వజీవులకు అధిపతి)

5. ఓం రుద్రాయ దేవాయ నమః (అగ్నిలింగం / అగ్నికి అధిపతి)

6. ఓం ఉగ్రాయ దేవాయ నమః (వాయులింగం / గాలికి అధిపతి)

7. ఓం భీమాయ దేవాయ నమః (ఆకాశలింగం / ఖగోళానికి అధిపతి)

8. ఓం మహతే దేవాయ నమః (చంద్రలింగం / చంద్రమండలానికి అధిపతి)

శ్రీమాణిక్యాంబ / దక్షారామ శక్తిపీఠ మహాపుణ్యక్షేత్రాన్ని దర్శించే వారికి అక్కడి అంతర్నిహిత సప్తగోదావరి, 108 శివాలయాల భీమమండల ప్రాంతం, 108 నక్షత్రపాదాల్లో ఏ నక్షత్రపాదం వారు ఏ ఊర్లో కొలువైన ఏ శివాలయాన్ని దర్శించాలి, ఇత్యాదిగా తెలిసే ఉంటుంది కద....

"భీమమండలం" అనగా మన భౌగోళికపటంలో ఆ ఖగోళ స్థిత 108 నక్షత్రమండలాలకు ప్రతీకగా అలరారే శివశక్తి అని అర్ధం...
అట్టి ఖగోళసంబంధమైన శివశక్తినే "భీమ" శక్తి గా శైవాగమవైభవం స్తుతించును........

చిదంబర నటరాజ స్వామి వారి పంచభూత ఆకాశలింగ పుణ్యక్షేత్రం దర్శించే వారికి తెలిసినట్టుగా...
"ఏమి లేని ఒక సాధారణ గోడకు బిల్వదలమాలను అలంకరించి...ఇదిగో ఇదే చిదంబర రహస్య దర్శనం..." అని చెప్తుంటారు అని కొందరు అనుకుంటూఉంటారు.....
కాని చిదంబరరహస్యమంతా ఇక్కడే ఉంది...

ఎదురుగా కనిపించే ఆకాశంలో ఏం ఉన్నది....
అని ఒక 1వ తరగతి విద్యార్ధిని అడిగితే...
"ఆ ఏముంది అంతా ఖాళిగానే ఉంది కద...."
అని అనొచ్చు...

ఒక సైంటిస్ట్ ని అడిగితే...
"ఆకాశంలో సూర్యుడు, చంద్రుడు, అసంఖ్యాకమైన నక్షత్రాలు, సౌరమండలం, మనం నివసించే భూమి, ఇలా ప్రతీ ఒక్కటి ఉన్నది ఆకాశంలోనే...కాబట్టి ఆకాశంలో అన్నీ ఉన్నాయ్...అనగా ఆకాశం అమేయమైనది.... అనంతమైనది... ఆశ్చర్యకరమైనది..." అని సమాధానం ఇస్తారు...

1వ తరగతి విద్యార్ధి పరికించేది అదే ఆకాశం....
(ఏమి లేదు అని అనబడే ఆకాశం...)

ఒక సైంటిస్ట్ పరికించేది కూడా అదే ఆకాశం....
(అన్నీ ఉన్నాయ్ అని అనబడే ఆకాశం...)

కాబట్టి ఇక్కడ భేదం 1వ తరగతి విద్యార్ధి మరియు ఒక సైన్స్టిస్ట్ యొక్క జ్ఞ్యానస్థాయి మరియు దృక్పథంలో ఉన్నది అని అనబడును...

అచ్చం అదే విధంగా...
అధ్యాత్మ ఆకాశతత్త్వం కూడా....
అంబరంలో పరివ్యాప్తమై ఉండే చిదంబర రహస్యాలను జ్ఞ్యాననేత్రంతో పరికించాలంటే మనం "ఓం భీమాయ దేవాయ నమః" గా పరిఢవిల్లే ఈశ్వర తత్త్వాన్ని ధ్యానించాలి / ఆరాధించాలి...

ఆకాశం ఎంత ఆశ్చర్యకరమైన తత్త్వంతో అలరారునో...
సుందరకాండలో అపరరుద్రాంశ సంభూతుడైన హనుమ యొక్క లీలలు కూడ అంత ఆశ్చర్యకరమైవిగా భక్తులకు ఎరుకలోకి వచ్చి...ఔరా...సుందరకాండ ఎంత సుందరమైనది....
అని అనిపించును...

నూరుయోజనాల దక్షిణసముద్రాన్ని లంఘించి సీతమ్మ జాడను కనిపెట్టడానికి హనుమంతుల వారు చారణులు చరించే మార్గంలో ఆకాశయానం గావించి కాంచనలంక దిశగా ప్రయాణించడం...
అనే సంఘటనతో.....
ఈ క్రింది శ్లోకం తో ప్రారంభమయ్యే సుందరకాండ...

తతో రావణనీతాయాః సీతాయాః శత్రుకర్శనః.
ఇయేష పదమన్వేష్టుం చారణాచరితే పథి ৷৷5.1.1৷৷

శ్రీరాముడి గూర్చి చింతిస్తూ అశోకవనంలో ఉన్న సీతమ్మ నా యొక్క సుభాషితములతో ఊరడిల్లి శాంతించెను ....

అనే స్వస్తివాచకంతో సంపూర్ణమయ్యే 68 సర్గల సుందరకాండ ఆద్యంతమూ ఆశ్చర్యకరమైన వాయుపుత్రుడి వైభవగాథలకు ఆలవాలమైన సుందరాతిసుందరమైన కాండ.....

తతో మయా వాగ్భిరదీనభాషిణా శివాభిరిష్టాభిరభిప్రసాదితా.
జగామ శాన్తిం మమ మైథిలాత్మజా తవాపి శోకేన తదాభిపీడితా ৷৷5.68.29৷৷

ఇక్కడ కొన్ని ముఖ్యమైన విషయాలను పరికిద్దాం...

మహేంద్రగిరి పర్వతాన్ని భేదించి సముద్రాన్ని లంఘించినది మొదలు,
లంకిణిని భంజించి కాంచనలంకాప్రవేశం గావించిన పర్యంతం....హనుమ సాగించిన ఆకాశయానాన్ని దర్శించినది ఎవరు...?

మధ్యలో తారసపడిన నాగమాత సురస హనుమను దేవతల తరపున పరీక్షించుటకు ప్రత్యక్షమై హనుమ యొక్క యుక్తికి సమాధానం చెందడం,
రాక్షసుల తరపున అడ్డగించిన సిమ్హిక హనుమ యొక్క శక్తికి లయించడం, పర్వతాల్లో రెక్కలతో మిగిలిన ఒకే ఒక్క పర్వతమైన మైనాకుడు సముద్రం నుండి వెలుపలికి వచ్చి హనుమకు ఆతిథ్యమివ్వడం, 
అనే 3 సంఘటనలు కూడా లోకానికి
తెలియవచ్చిన రీతిని గమనించినట్లైతే, శ్రీవాల్మీకి మహర్షి గారికి ఇతిహాసకావ్యరచనకు ఆవశ్యకమైన
సత్యదర్శనవిభూతి అనే వరం బ్రహ్మగారి నుండి సంప్రాప్తమై ఉన్న కారణంగా, ఒక సంఘటనలోని వ్యక్తుల మనోసీమల్లో కూడా విహరించి వారిని వర్ణించగల సారస్వతశక్తిసంపన్నమైన మహర్షి యొక్క యోగదృష్టికి మాత్రమే యావద్
సుందరకాండ / శ్రీమద్రామాయణం భాసించి లోకానికి అనుగ్రహింపబడెను....

ఆ చతుర్ముఖ బ్రహ్మగారు ఉండేది సర్వోన్నతమైన సత్యలోకంలో....
అనగా ఆకాశం యొక్క / 14 భువనాల సముదాయంలో సర్వోన్నతమైన సీమల్లో అని అధ్యాత్మ అర్ధం....
అనగా "ఓం భీమాయ దేవాయ నమః" అనే అధ్యాత్మ వైభవం బ్రహ్మగారి నుండి శ్రీవాల్మీకి మహర్షి గారికి వరంగా సంప్రాప్తించినది...

కొన్ని అధ్యాత్మకారణాల రీత్యా / బ్రహ్మగారి సభామరియాద రీత్యా కావ్యరచనామరియాదను పాటించవలెను కాబట్టి, 
హనుమ కూడా శ్రీవాల్మీకి మహర్షి వారిలా ఒక గొప్ప మహర్షిగా వర్ధిల్లడం,
హనుమకు కూడా శ్రీవాల్మీకి మహర్షిగారిలా సత్యదర్శనవిభూతి అనే వరం ఉండడం,
హనుమ కూడా "శ్రీహనుమద్రామాయణం" పేరిట ఒక రామాయణాన్ని రచించుకోవడం....
ఇత్యాది వాటి గురించి ఎక్కువగా వివరింపబడడం వలదు కాన...

అధ్యాత్మసంప్రదాయంలో ఆచార్యులకు హనుమ ప్రతీక కాబట్టి.....
హనుమను ఆరాధించిన భక్తులకు ఎన్నో విభూతులు హనుమంతుల అనుగ్రహంగా అమరి తరించెదరు అని శాస్త్రవచనం....

శ్రీరాముడి పట్ల, శ్రీరాముడి అయనం పట్ల, ఆనాడు హనుమ ఎంత గౌరభరితంగా నడుచుకున్నారో...
అట్టి మహిమాన్వితమైన "సంపూర్ణ శ్రీమద్రామాయణ ప్రవచనాలు" అనే స్వాధ్యాయ అధ్యాత్మజ్ఞ్యానయజ్ఞ్యం లో ఆనాడు ఎంతో దీక్షాదక్షులై వర్ధిల్లి భక్తులకు శ్రీచాగంటి సద్గురువులు ప్రవచనాలను అనుగ్రహించారు కాబట్టి,
ఇప్పటికీ మరియు ఎప్పటికీ అ మధురసుజ్ఞ్యానామృత ప్రహృష్టవచనాలు యావద్ లోకంలో పరివ్యాప్తమై విజ్ఞ్యులను వివిధ రీతుల అనుగ్రహిస్తూ వర్ధిల్లుతున్నాయ్...

ఒక నిష్కామజ్ఞ్యానయోగిని దర్శించి నమస్కరించడం సహస్ర సత్సంకల్ప గంగాతీర్థస్నాన ఫలదాయక వైభవం అని అధ్యాత్మలోకవిశ్వాసం...

మరి అట్టి నిస్వార్ధవరిష్ఠ అధ్యాత్మవేత్తలైన శ్రీ చాగంటి సద్గురువులు, అట్టి నిస్వార్ధ శ్రీరామదాసుడైన హనుమ యొక్క వైభవోపేత ఆలయంలో "శ్రీ హనుమద్ వైభవం" అనే ప్రవచనంతో విజ్ఞ్యులను అనుగ్రహించడం, కూకట్పల్లి వివేకానందనగర్ పరిసరాల్లోని భాగ్యనగర విజ్ఞ్యుల భాగ్యపరిపాకమై వర్ధిల్లే సందర్భం....

ఇవ్వాళ్టి రోజుల్లో కొందరు రియల్ ఎస్టేట్ ఏజెంట్లు ఆధ్యాత్మిక వైభవాన్ని, అధ్యాత్మవేత్తల గౌరవాన్ని, వారి వ్యాపారాభివృద్ధి కార్యక్రమాలకు సాధనంగా వినియోగిస్తున్న సందర్భాల్లో...,
అటువంటి వ్యాపార పటాటోపాలకు, వ్యాపారవేత్తల ఆర్భాటాలకు దూరంగా ఉంటూ, కేవలం ఆలయం, భగవంతుడు, భక్తులు, పుణ్యం, సమాజసంస్కరణ, ఉజ్జ్వల భావిభారతనిర్మాణం, ఇత్యాది లోకోపకార కార్యక్రమాల నిమిత్తమై వర్ధిల్లుతున్న శ్రీశుకయోగీంద్ర సమాన అభినవ ఆధునిక అధ్యాత్మ భవ్యభారత నిర్మాణ యోగీశ్వరులైన శ్రీచాగంటి సద్గురువులను దర్శించి నమస్కరించడం ఎంతో పుణ్యప్రదమైన అంశం....

సర్వే సుజనాః సుఖినోభవంతు...💐

సర్వం శ్రీవీరాంజనేయ శ్రీచరణారవిందార్పణమస్తు...💐🙂🙏

One doesn't have to belittle the initial rung of a ladder while climbing further with diligence....

శ్రీకరమైన ఏదేని ఆలయానికి వెళ్ళినప్పుడు అక్కడ ప్రసాదంగా ఇచ్చే విభూతిని / కుంకుమను నుదుటిపై అలంకరించుకొని భగవంతుడుకి నమస్కరించడం ఒక సత్సంప్రదాయం...

ఒక ఆలయంలో ప్రసాదింపబడే విభూతిని / కుంకుమను అలంకరించుకోవడానికి ఇంతకు ముందు ధరించిన విభూతిని / కుంకుమను తొలగించి అలంకరించుకోవడం అనేది అంతగా వర్తించని అంశం....

అలా ఎన్ని సార్లు ఎన్ని కొత్త ఆలయాలను దర్శించి కొత్త విభూతి / కుంకుమ అలంకరించుకున్నా కూడా అది ఇంతకు ముందు అలంకరింపబడిన వాటిపై మరో అలంకరణగా ధరించడమే సంప్రదాయం..

గౌ || ముఖ్యమంత్రివర్యులు, శ్రీ ఎనుముల రేవంత్ రెడ్డి గారు, వారు అలంకరించిఉన్న ముఖ్యమంత్రి బాధ్యతకు అదనంగా,
మునిసిపల్ అడ్మినిస్ట్రేషన్ & అర్బన్ డెవలప్మెంట్, జెనెరల్ అడ్మినిస్ట్రేషన్, లా & ఆర్డర్, అనే మూడు ఇతర బాధ్యతలను కూడా అలంకరించి ఉన్నారు కదా...,
మీకెందుకులే వాటి భారం...మాకిచ్చేయండని... ఎవరైనా రాజకీయాలు చేస్తారా....?
లేక 
నాకు లభించే నివేదికల ప్రకారంగా సదరు వ్యక్తి యొక్క వైఖరి సరిగ్గాలేదు....కాబట్టి ఇప్పటినుండి వారి పోర్ట్ఫోలియో కూడా నేనే పర్యవేక్షిస్తాను అని ముఖ్యమంత్రివర్యులు అంటే ఎవరైనా "మీకెందుకు ఇన్ని పోర్ట్ఫోలియోలు అని రాజకీయాలు చేస్తారా.....?"

ఒక గౌ || "పద్మశ్రీ" కళాకారుల కీర్తికిరీటంలో, ఇప్పుడు కొత్తగా "పద్మభూషణ్", మరియు "పద్మవిభూషణ్" కూడా అమరినవి కదా అని....వారు వారి యొక్క పాత విభూతి అయిన "పద్మశ్రీ" ని పక్కన పెట్టేయడం, ఇచ్చేయడం, ఇత్యాదివి గావించరు కద....

కాబట్టి, దోపిడీ రాజకీయాలకు తావునిచ్చే చెప్పుడు మాటలను ప్రచారం చేసే వాళ్ళను, ఇతరుల గౌరవాన్ని ఉద్దేశ్యపూర్వకంగా కించపరిచేలా అనవసరమైన వదంతులను వ్యాప్తి గావించే ధూర్తులను, బ్యాంక్ లోన్ తీసుకొని ఒక రైతు ఎంతో కష్టపడి అభివృద్ధి చేసిన పంటచేనును పాడుచేసిందే కాక అనవసరంగా కల్పించుకొని మెక్కాలని చూసే గుంటనక్కల వైఖరిని, విజ్ఞ్యత గల సమాజం ఎంతగా చదివితే అంత మంచిది....

సర్వే సుజనాః సుఖినోభవంతు...

శ్రీ మలయప్పస్వామి వారు అరుదైన కనకపుష్యరాగమణి / యెల్లో సఫైర్ స్టోన్ తో అలంకరింపబడిన సువర్ణహారాన్ని ధరించి తిరువీధి ఉత్సవంలో ఊరెరిగింపుగా తన లోకోత్తరమైన శ్రీవైష్ణవఠీవిని భక్తులకు కన్నులపండువగా అనుగ్రహిస్తూ ముందుకుసాగుతున్న ఈ వీడియో ని బాగా దర్శించి మదిలోయల్లో పదిలపరుచుకోండి...

శ్రీ మలయప్పస్వామి వారు అరుదైన కనకపుష్యరాగమణి / యెల్లో సఫైర్ స్టోన్ తో అలంకరింపబడిన సువర్ణహారాన్ని ధరించి తిరువీధి ఉత్సవంలో ఊరెరిగింపుగా తన లోకోత్తరమైన శ్రీవైష్ణవఠీవిని భక్తులకు కన్నులపండువగా అనుగ్రహిస్తూ ముందుకుసాగుతున్న ఈ వీడియో ని బాగా దర్శించి మదిలోయల్లో పదిలపరుచుకోండి...

ఎందుకంటే అధ్యాత్మ శాస్త్రప్రకారం ఫలాన ఉత్సవంలో / తిరువీధివిహారంలో ఫలాన ఆభరణాన్ని / మణిని ధరించి శ్రీవేంకటేశ్వరస్వామి వారు ఊరెరిగింపునకు ఏతెంచినప్పుడు దర్శించిన భక్తులందరికీ ఫలాన విశేషమైన అనుగ్రహం లభించి తరించెందరు అని శాస్త్రవచనం...

అట్టి అధ్యాత్మవిశేషపరంపరలో శ్రీమలయప్పస్వామివారు అరుదైన కనకపుష్యరాగమణిభాసమయమై భక్తులకు దర్శనమిచ్చే ఈ దృశ్యమంజరిని కళ్ళారా దర్శించినవారికి బహువిశేషమైన గురుబలం సంప్రాప్తించును....

మీ దెగ్గర ఎన్నో రకాల పండ్లు ఉండడం / ఆరగించడం వేరు....
పండ్లలో రాజైన మామిడి పండు ఉండడం / ఆరగించడం వేరు....

అట్లే సూర్యపరమాత్మ చుట్టూ వారివారి నిర్దేశిత అంతరిక్షకక్ష్యలో పరిభ్రమించే నవగ్రహాల్లో అత్యంత ప్రభావవంతమైన గురుగ్రహం / జుపిటర్ యొక్క శక్తిని బహువిశేషంగా అనుగ్రహించే సాధానాల్లో కనకపుష్యరాగమణి ఒకటి....
గురుబలం మిక్కుటంగా అనుగ్రహింపబడి ఉన్నవారికి పట్టిందల్లాబంగారం అన్న చందంగా వారికి ఎనలేని ఈశ్వరానుగ్రహం నిత్యం సమకూరుతూఉండును...
ఎందుకంటే దేవేంద్రుడు కూడా నమస్కరించే బృహస్పతి వారి శాసనానికి అనుగుణంగా వర్ధిల్లే స్వర్గలోకంలో కూడా గురుబలం యొక్క ప్రభావం మెండైనదే....

ఆవులకు శెనగలను ఆహారంగా సమర్పించడం...
స్వఛ్చమైన దేశవాళీ అవునేతితో దీపారాధన గావించడం...
శ్రీ మేధాదక్షిణామూర్తిస్తోత్రాన్ని ఆలకించడం / పఠించడం...
శ్రీమద్రామాయణాన్ని / సంక్షేపరామాయణాన్ని పఠించడం...
శ్రీవిష్ణుసహస్రనామస్తోత్రాన్ని ఆలకించడం / పఠించడం...
ఇత్యాదివి గురుబలాన్ని విశేషంగా ప్రోదిగావించే సాధనములు...

శ్రీకృష్ణలీలల్లో అత్యంత ఆశ్చర్యచకితమైన కాళీయమర్దన లీలను వర్ణిస్తూ శ్రీతాళ్ళపాక అన్నమాచార్యులు ఈ క్రింది సంకీర్తనలో "కాళింగుని తలలపై కప్పిన పుష్యరాగము" అని వచించడం భక్తులకు ఎరుకే...

************** ************** **************

ముద్దుగారే యశోద ముంగిట ముత్యము వీడు
తిద్దరాని మహిమల దేవకీ సుతుడు

అంతనింత గొల్లెతల అరచేతి మాణిక్యము
పంతమాడే కంసుని పాలి వజ్రము
కాంతుల మూడు లోకాల గరుడ పచ్చ పూస
చెంతల మాలోనున్న చిన్ని కృష్నుడు

రతికేళి రుక్మిణికి రంగుమోవి పగడము
మితి గోవర్థనపు గోమేధికము
సతమై శంఖుచక్రాల సందుల వైఢూర్యము
గతియై మమ్ము గాచే(టి)కమలాక్షుడు

కాళింగుని తలలపై కప్పిన పుష్యరాగము
ఏలేటి శ్రీవేంకటాద్రి యింద్రనీలము
పాలజలనిధిలోన పాయని దివ్య రత్నము
బాలుని వలె తిరిగే పద్మనాభుడు

************** ************** **************

సర్వం శ్రీవేంకటకృష్ణార్పణమస్తు...💐🙂🙏


The world around us is full of unfathomable energies and wavelengths studied by various scientists in various ways.So is our inner world and the inner engineering scientists.


Approximation is to quantify a subject in the simplest terms...

Estimation is to quantify a subject to the best feasible accuracy....

Precision is to quantify a subject to the exact measurement...

For example...

Approximately 4 ml of mango juice is given.

An estimated 4.2 ml of mango juice is given.

Precisely 4.2607716 ml of mango juice is given.

Similarly,

Any concept in this world is assimilated by the prudent folks in 3 different levels.

Approximating the quantification of the subject being perceived to a generic standard...

Estimating the quantification of the subject being perceived to the best feasible accuracy....

Precising the quantification of the subject being perceived to the exact measurement...

This is essentially the derivative of the Bayes' theorem as mentioned below.

[
Bayes' theorem, a formula used in PTSP (Probability Theory and Stochastic Processes) to determine the conditional probability of an event, allowing the revision of existing beliefs (prior probabilities) based on new stats. It measures the probability of event (A) occurring given that event (B) has already occurred, often written as (P(A|B) = { P(B|A) x P(A) }
divided by { P(B) }
]

So, everything in this world essentially corresponds to a scientific study.
It's just that the names attributed to those various subjects of science vary based on various factors involved in perceiving those varied subjects of science from the vast nature around us.

The world around us is full of unfathomable energies and wavelengths studied by various scientists in various ways.
So is our inner world and the inner engineering scientists.

As known to those higher order wise spiritual veterans, the following 11th anuvaakam from the mighty "Shree Rudra Chamaka Prashna" is essentially the inspiration for the Bayes' theorem.

ఏకా॑ చ మే తి॒స్రశ్చ॑ మే॒
పంచ॑ చ మే స॒ప్త చ॑ మే॒
నవ॑ చ మ॒ ఏకా॑దశ చ మే॒
త్రయో॑దశ చ మే॒ పంచ॑దశ చ మే
స॒ప్తద॑శ చ మే॒ నవ॑దశ చ మ॒
ఏక॑విగ్ంశతిశ్చ మే॒ త్రయో॑విగ్ంశతిశ్చ మే॒
పంచ॑విగ్ంశతిశ్చ మే స॒ప్తవిగ్ం॑శతిశ్చ మే॒
నవ॑విగ్ంశతిశ్చ మ॒ ఏక॑త్రిగ్ంశచ్చ మే॒
త్రయ॑స్త్రిగ్ంశచ్చ మే॒ చత॑స్రశ్చ మే॒ఽష్టౌ చ॑ మే॒
ద్వాద॑శ చ మే॒ షోడ॑శ చ మే
విగ్ంశ॒తిశ్చ॑ మే॒ చతు॑ర్విగ్ంశతిశ్చ మే॒ఽష్టావిగ్ం॑శతిశ్చ మే॒
ద్వాత్రిగ్ం॑శచ్చ మే॒ షట్-త్రిగ్ం॑శచ్చ మే
చత్వారి॒గ్ం॒శచ్చ॑ మే॒ చతు॑శ్చత్వారిగ్ంశచ్చ మే॒ఽష్టాచ॑త్వారిగ్ంశచ్చ మే॒
వాజ॑శ్చ ప్రస॒వశ్చా॑పి॒జశ్చ॒
క్రతు॑శ్చ॒ సువ॑శ్చ మూ॒ర్ధా చ॒
వ్యశ్ని॑యశ్చాంత్యాయ॒నశ్చాంత్య॑శ్చ
భౌవ॒నశ్చ॒ భువ॑న॒శ్చాధి॑పతిశ్చ ॥ 11 ॥

శ్రీ ఆంజనేయస్వామి వారి 2026 జన్మదినోత్సవ శుభాభినందనలు...💐🙂(పూర్వాభాద్ర ప్రయుక్త వైశాఖ బహుళ దశమి)

(పూర్వాభాద్ర ప్రయుక్త వైశాఖ బహుళ దశమి) 

వశిష్ఠ మహర్షి
శక్తి మహర్షి
పరాశర మహర్షి
వ్యాస మహర్షి
శుక యోగీంద్రులు

అనే పంచఋషిపరంపరలో మధ్యలో ఉన్న శ్రీపరాశరమహర్షి వారిచే భక్తలోకానికి అనుగ్రహింపబడిన అత్యంత సాధికార హనుమద్వైభవవిశేషసంగ్రహసారంగా వినుతికెక్కిన పరాశరసమ్హిత ప్రకారంగా,

వైశాఖే మాసి కృష్ణాయాం దశమ్యాం మందవాసరే,
పూర్వాభాద్ర ప్రభూతాయ మంగళం శ్రీ హనూమతే

తాత్పర్యం: వైశాఖ మాసం, కృష్ణ పక్షం (బహుళ పక్షం), దశమి తిథి, శనివారం నాడు, పూర్వాభాద్ర నక్షత్రంలో శ్రీహనుమంతుడు జన్మించాడని పై శ్లోకం చెబుతోంది.

వ్యాసం వశిష్ఠ నప్తారం శక్తేః పౌత్రమకల్మషమ్ |
పరాశరాత్మజం వందే శుకతాతం తపోనిధిమ్ ||

వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే |
నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః ||

శ్లోక తాత్పర్యం: వశిష్ఠ మహర్షి యొక్క ముని మనవడు, శక్తి మహర్షి యొక్క మనుమడు, పరాశర మహర్షి యొక్క పుత్రుడు మరియు శుక మహర్షి యొక్క తండ్రి అయిన పవిత్రుడైన వేదవ్యాసునికి నేను నమస్కరిస్తున్నాను.
సాక్షాత్తూ విష్ణు స్వరూపుడైన వ్యాసునికి, వ్యాస స్వరూపుడైన విష్ణువునకు, జ్ఞాన నిధి అయిన ఆ వశిష్ఠ వంశస్తునికి పదే పదే నమస్కారములు.

శ్రీవిష్ణుసహస్రనామస్తోత్రం పూర్వ పీఠికలోని ఈ శ్లోకాలు భక్తులకు విదితమే...

మన సనాతన హైందవ సంప్రదాయ వైభవానికి అద్దం పట్టే ఎన్నో ఉత్సవాలు, పండగలు, సంప్రదాయాలు, జానపద / నైసర్గిక జాతరలు, అనాదిగా ఎన్నో...

వాటన్నిట్లోకెల్లా, శ్రీఆంజనేయస్వామి వారి ఆరాధన ఎంతో విశేషమైనది, మహత్తరమైనది, మరీ ముఖ్యంగా ఈ కలియుగంలో అత్యంత ప్రధానమైన శ్రేయోదాయక సాధనం అని శ్రీచాగంటి సద్గురువుల ప్రవచనాల్లో విజ్ఞ్యులు ఆలకించే
ఉంటారు....

కడురమణీయకాశ్మీరసీమలోయల ఆసేతు హిమాచలం నుండి కన్యాకుమారి వరకు, వివిధ పేర్లతో అనునిత్యం పరిఢవిల్లే ఎకైక దేవతారాధన శ్రీఆంజనేయస్వామి వారి ఆరాధన.....

ఎందుకంటే...

ఓం గంధమాదనశైలస్థాయ నమః అని ఉత్తరాన హిమసీమల్లో మొదలై...
ఓం లంకాపురవిదాహకాయ నమః అని దక్షిణాన కాంచనలంక వరకు...

ఇప్పటికీ శ్రీఆంజనేయస్వామి వారు సంచరించని చోటు, ఊరు, వాడా, పల్లె, పట్నం లేదంటే అతిశయోక్తి కానేరదు...

దుష్టమేఘనాథుడితో యుద్ధంలో అలసి మూర్ఛతో సౌమిత్రి పరిస్థితి విషమమైనప్పుడు సంజీవని, సంధానకరణి, సావర్ణకరణి, విశల్యకరణి, అనే నాలుగురకాల సిద్ధౌషధమూలికలతో అలరారే హిమసీమపర్వతాన్ని కాంచనలంకకు తీసుకొచ్చి మరీ శ్రీరామసేనలో గాయపడిన యోధులందరికీ ఆరోగ్యాన్ని అనుగ్రహించిన నిరుపమానధీరుడు వాయుపుత్రుడైన హనుమంతుడు...!

అట్టి సంజీవనీ సిద్ధౌషధమూలికాసేవనంతో మరలా సంపూర్ణారోగ్యవంతుడైన సౌమిత్రి మరియు హనుమ ఇరువురు కలిసి మేఘనాథుడిపై విజయం సాధించారు కాబట్టే, రామరావణయుద్ధంలో రావణుడు హతుడై ఆతదుపరి ధర్మాత్ముడైన విభీషణుడికి కాంచనలంకాధిపత్యం అనుగ్రహింపబడినది....
అనే శ్రీమద్రామాయణ ఇతిహాస వృత్తాంతంలోని తత్త్వపరమైన అంతరార్ధం ఏంటో తెలుసా....?

శ్రీమహవిష్ణువు యొక్క అవతారం గా ప్రభవించిన శ్రీరాముడు మనలోని పరమాత్మభాసకు ప్రతీక ....
పరమాత్మను నిత్యం అనుగమిస్తూ వర్ధిల్లిన ఆదిశేషావతారం గా ప్రభవించిన సౌమిత్రి మనకు అనగా మన శరీరాన్ని నడిపించే జీవాత్మకు ప్రతీక...
భరతశత్రుఘ్ణులు జీవుడి యొక్క రాగద్వేషములకు ప్రతీక...
అపర రుద్రాంశసంభూతుడైన హనుమ ఆచార్యులకు ప్రతీక...
భరతశత్రుఘ్ణులను విడిచి సౌమిత్రి దాశరథి కలిసి వనములకేగుట అనగా....
రాగద్వేషములను విడిచి జీవుడు పరమాత్మను అనుగమిస్తూ ఆంతర / అంతర్ముఖ ఆరాధనయందు భావాంబరవీధుల్లో
సంచరించుట...
మేఘనాథుడు సామాన్యంగా జయింపశక్యంకాని ప్రకృతిమాయకు ప్రతీక.. 

మన నయన మండలానికి సూర్యచంద్రులు అధిదేవతలు (సూర్య చంద్ర మండలాలు), మన హృదయకోశానికి యమపుత్రుడైన శనైశ్చరుడు అధిపతి.
సూర్యుడు, సంజ్ఞ్యాదేవి, ఛాయాదేవి, యముడు, శనైశ్చరుడు, యమి అనే సూర్యపరివారానికి,
రోదసిలో భూమికి దక్షిణ దిక్కుగా ఉండే యమలోకానికి,
మన హృదయమండలానికి, నేత్రమండలానికి ఒకానొక అధ్యాత్మ అవినాభావసంబంధం ఉండును. 
 
[
అసెంబ్లి వేరు, 
సెంట్రల్ జైల్ వేరు,
కోర్ట్ వేరు.
అట్లే 
పరిపాలకులు ఉండే స్వర్గం వేరు,
రాక్షసులుండే నరకం వేరు,
ధర్మదేవతలు ఉండే న్యాయస్థానం / కోర్ట్ / యమలోకం వేరు.
]
 
గరిమసిద్ధితో మహేంద్రగిరి పైనుండి లంఘించి దక్షిణదిక్కుగా హనుమ 100 యోజనముల సాగరాన్ని లంఘించడం అంటే...
భగవన్నామగుణగానవైభవంతో అమరే జ్ఞ్యానసిద్ధితో బాహ్య నయనాలు మూసి, ఆంతర నయనాన్ని విశేషంగా ఉపయోగించి అనంతమైన హృదయకోశంలోకి అంతర్ముఖత్వ ప్రయాణం గావించడం... 

దాశరథీ సౌమిత్రి ఎంతవెతికినా పరేశి సీతమ్మ జాడ కానరాకుండుట, ఆ తదుపరి కిష్కింధకాండలో కావ్యారంగేట్రం గావించే హనుమంతుడికి ప్రభువైన సుగ్రీవుడి సహాయంతో వానరసేన దక్షిణదిక్కుగా ప్రయాణించి, సంపాతి యొక్క సూచనతో హనుమంతుడు నూరుయోజనాల సముద్రాన్ని లంఘించి, మేఘనాథుడి మాయ గురించి బాగా తెలుసుకొని, సీతమ్మ జాడను కనిపెట్టి లంకనుదహించుట...

అనే వృత్తాంతంలో....

జీవాత్మ, పరమాత్మ కలిసి ఎన్నో జన్మలుగా జన్మాంతరప్రయాణం గావిస్తూనే ఉంటారు....
ఎక్సిబిషన్లో జాయంట్ వీల్ లా గిరగిరా సాగే ఆ జీవయాత్రకు తుదిమొదలంటూ ఏది ఉండదు....

ఎప్పుడైతే ఏదో ఒక సందర్భంలో, ఈశ్వరానుగ్రహంగా మన జీవాభ్యున్నతికై తారసపడే మహాపురుషులు మన జీవితాలకు అచార్యులై వర్ధిల్లుతూ, వారి సూర్యారాధనశక్తితో అనగా వారి నిత్యానుష్ఠాన ఔపాసనిక శక్తి తో మనకు దార్శనికులై వర్ధిల్లి,
సంపాతి లాంటి దూరదృష్టితో అనగా భవిష్యద్ శ్రేయస్సును దర్శించగల విశేషమైన ప్రజ్ఞ్యగల విజ్ఞ్యుల సలహాలు, సూచనలను గౌరవిస్తూ,
జీవుడు సేవించే పరమాత్మ యొక్క భాసకు ప్రతీకగా వర్ధిల్లే అంగుళీయకం (రింగ్) అనగా మన ఈశ్వరారాధన యొక్క ఆర్తి ఆచార్యుల అనుగ్రహంగా అనంతమైన దూరతీరాల్లో ఉండే పరేశి సీతమ్మకు అంది, అనగా ఆ మణిద్వీపనివాసిని అయిన శ్రీమాతకు చేరగా, అమ్మవారి అనుగ్రహంగా ఆచార్యుల ద్వారా అమ్మవారి చూడామణి అనగా అమ్మవారి జుత్తును అలంకరించి ఉండే ఆభరణం అనగా అన్ని రకాల అజ్ఞ్యానాలను సమూలంగా దహించివేసే ప్రజ్ఞ్యానశక్తిని దర్శించి, తత్ప్రయాసలో అన్ని రకాల రాక్షసప్రవృత్తులకు నిలయమైన కాంచనలంక లాంటి అరిషడ్వర్గసమూహప్రకోపం లయించగా...
"దృష్ట్వా సీతా..." అని హనుమ తిరిగివచ్చి వానరసేనతో వచించడం అనగా....
"పరేశి యొక్క జాడను దర్శించితిని" అనగా 
"మన హృదయకోశంలో నిత్యం దశదిశలా అమేయకాంతిపుంజాన్ని వెదజల్లుతూ ఉండే "త్రికోణాంతరదీపిక" ను దర్శించడం
అనే మన ఆంతరప్రయాణప్రయాసను  మన ఇంద్రియాలకు గ్రాహ్యంశంగా అవధరించిన ఆచార్యవాక్కు తెలియపరచుట....

ఇహములో నిమగ్నమై ఉన్నప్పుడు పరమును దర్శించలేము.....
పరము యొక్క ధ్యానంలో మనస్సును లయించి నిమగ్నమై పరధ్యానంలో ఉన్నప్పుడు ఐహిక లోకాన్ని దర్శించము.....

కాని ఇహము మరియు పరము రెండు కూడా
జీవాభ్యున్నతికై ఆవశ్యకమైన అనుగ్రహాలు....
అవి ఆ పరేశి ఏ భక్తుడుకి ఎప్పుడు ఎట్లా అనుగ్రహించునో కేవలం ఆ పరంధాముడైన శ్రీసీతారాములకు మాత్రమే తెలియును....

అందుకే మీరు గమనించి ఉండి ఉంటే,
భద్రమహర్షి గారి ప్రార్ధనమేరకు ఈ కలియుగంలో ప్రభవించిన శ్రీవైకుంఠరామనారాయణుడిగా శ్రీవరభద్రగిరీషుడిగా కొలువైన
శ్రీ భద్రాచల సీతారాముల దర్శనంలో,

శంఖం స్వామివారి కుడిచేతిలో అమరి ఉంటుంది...
అనగా శీఘ్రజ్ఞ్యానదాయక శ్రీవైష్ణవధృవమూర్తి...
మనకు దర్శనం ఇచ్చే సీతమ్మవారు ధరించిన ఒక కమలం ఇహమునకు ప్రతీక...
మనం సాధారణంగా దర్శించలేని ఇంకో కమలం పరమునకు ప్రతీక...(మూర్తికి ఆవలివైపు దర్శనీయమై ఉంటుంది....)

అర్హతగల ద్విజులకు అక్కడి ఆచార్యుల అనుగ్రహంగా శ్రీసీతారాముల మూర్తికి మరోవైపు కానవచ్చే ఇంకో కమలాన్ని దర్శించే వారికి అందరూ సాధారణంగా దర్శించే ఇటువైపు ఉండే కమలం దర్శనీయమై ఉండదు...
అనగా అంతటి అధ్యాత్మోన్నతస్థాయిని, అనుగ్రహాన్ని అందుకొని తరించే వారికి ఇహము గురించి పెద్దగా ఏ పట్టింపు ఉండదు అని అంతరార్ధం.....

అనగా అమ్మవారి అనుగ్రహంగా వారికి కావలసినంత ఐహిక అభ్యున్నతి అనుగ్రహింపబడి, ఆ తదుపరి వారిని పరము వైపు అనగా పరేశిపాదారవిందములచెంత అలరారే ప్రజ్ఞ్యానసాధనవైపు ఉపాసకుడి ఆంతర చక్షువు నిమగ్నమై ఉన్నది అని అందలి అంతరార్ధం...

చాలా సింపుల్ గా కనిపించే శ్రీభద్రాచలసీతారాముల దర్శనంలో ఎంత గొప్ప కాంప్లెక్స్ అధ్యాత్మ జ్ఞ్యానం ఇమిడిఉందో, మీకు ఈశ్వరానుగ్రహంగా ఇంద్రియగ్రాహ్యమై తరించాలంటే, ఆదివారం నాడు అపరాహ్ణవేళలో అక్కడ ప్రవహించే సిద్దగౌతమీ తీర్థంలో సంకల్పసహిత తీర్థస్నానం ఆచరించి, ఆలయోపరిభాగంలో కొలువైన, శ్రీరామదాసు గారికి గోదావరిలో
శ్రీవైకుంఠం నుండి అనుగ్రహింపబడిన
అనన్యసామన్యమైన శ్రీసుదర్శనచక్రాన్ని దర్శించి,
ఆ తదుపరి ఆలయంలో ఎంతో ఠీవితో మందస్మితులై కొలువైన సౌమిత్రి సమేత శ్రీసీతారాములను కళ్ళారా దర్శించి తరించండి....
(
అది భానువాసర సప్తమీ మరియు భానువాసర సప్తమీ ప్రయుక్త పునర్వసు అయినచో, మీరు ఎంతగానో మిక్కుటమైన భాగ్యవంతులైనట్టు అన్నమాట....🙂
ఎందుకంటే ఎన్నో చోట్ల విరివిగా లభించే ఎన్నో రకాల మామిడి పండ్ల అనుగ్రహం వేరు...
మరియు అక్కడక్కడా అప్పుడప్పుడూ లభించే కొబ్బరిమామిడి పండ్ల అనుగ్రహం వేరు...🙂
)

అటువంటి అరుదైన అమరవందిత శ్రీవరభద్రగిరీషుడి సన్నిధిలో
తన ఆరాధ్యదైవం యొక్క సన్నిధిలో, తను ఉండకుండా ఉండడం ఏంటి...అని అనుకున్నారేమో హనుమంతుల వారు...
అందుకే ఆలయ మహాగోపురానికి అభిముఖంగా కొలువై భక్తులను అనుగ్రహిస్తూ, ధ్వజస్తంభమంటపంలో
గరుత్మంతులతో సమానంగా ఒకేపీఠంపై కొలువై గర్భాలయంలో కొలువైన సుందర మందస్మితమూర్తులైన శ్రీసీతారాములను నిత్యం దర్శిస్తూ భక్తులను అనుగ్రహిస్తూ పరిఢవిల్లుతున్నారు...

శ్రీరాముడు ఎంతో సుకుమారుడు, ఎంతో శక్తిమంతుడు, ఎంతో శ్రీమంతుడు, ఎంతో సుందరుడు, ఎంతో కరుణామయుడు, ఎంతో ఆశ్చర్యవైభవంతో అలరారే కౌసల్యాదశరథ తనయుడు....

అందుకే శ్రీసద్గురుత్యాగరాయస్వామి వారు కూడా అంతే రమణీయమైన సంకీర్తనతో శ్రీరాముణ్ణి స్తుతించడానికి "పవమానసుతుడుబట్టు పాదారవిందములకు..." అని ప్రారంభించారు....

ఎందుకంటే... ఏ లోకంలోని ఎవ్వరికైనా వాయుసుతుడైన ఆంజనేయుడి మహిమలు అందరాని అచ్చెరువొందే అమరవందిత విశేషాలై ఉండును....
మరి అట్టి పవనసూతి నిత్యం సేవించే శ్రీరాముడి పాదపద్మములు ఎంత గొప్పవో కదా...

అందుకే కద....
ఆజానుబాహుడైన శ్రీరాముడి పాదపద్మముల స్పర్శకు...,
శ్రీరామనామవైభవానికి...,

జడరాశి అహల్య అయ్యింది....
జడము నీటిపై నిలిచింది....

జానకి సీతమ్మ అయ్యింది...
విభీషణుడు లంకాధిపతి అయ్యాడు...

సూగ్రీవుడు కిష్కింధాధిపతి అయ్యాడు...
శబరి ఉన్నతలోకాలను అందుకుంది...

హనుమంతుడు చిరంజీవి అయ్యాడు...
అయోధ్య మోక్షపురి అయ్యింది...

భద్రమహర్షి శ్రీభద్రాచలం అయ్యాడు...
విరజానది సిద్ధగౌతమి అయ్యింది...

బోయవాల్మీకి సిద్ధమహర్షి అయ్యాడు...
శ్రీమద్రామాయణం వేదోపబృహ్మణం అయ్యింది...

మీకు ఇది చదివిన మహాపుణ్యం లభించింది...
నాకు ఇది రచించిన మహాపుణ్యం లభించింది...

లోకాలన్నీ తరించాయి...
లోకులందరూ తరిస్తున్నారు...

తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామివారు అనుగ్రహించేది...

విశ్వరూపదర్శనమైనా,
లఘుదర్శనమైనా,
మహాలఘుదర్శనమైనా,

ఆ అనుగ్రహం చాలా గొప్పది.....

అట్లే

ఆదికావ్యం, ఇతిహాసం, సీతాయాశ్చరితమ్మహత్,
వేదోపబృహ్మణం గా వర్ధిల్లే శ్రీమద్రామాయణ సాహితీ వరివస్య...

సంపూర్ణంగా అయినా,
లఘువుగానైనా,
మహాలఘువుగానైనా,

ఆ అనుగ్రహం చాలా గొప్పది.....

శ్రీసంక్షేపరామాయణఫలశృతి కూడా ఇట్లే అనుగ్రహిస్తున్నది కద...

ఇదం పవిత్రం పాపఘ్నం పుణ్యం వేదైశ్చ సమ్మితమ్ ।
యః పఠేద్రామచరితం సర్వపాపైః ప్రముచ్యతే ॥ 98 ॥

ఏతదాఖ్యానమాయుష్యం పఠన్రామాయణం నరః ।
సపుత్రపౌత్రః సగణః ప్రేత్య స్వర్గే మహీయతే ॥ 99 ॥

పఠన్ ద్విజో వాగృషభత్వమీయాత్
స్యాత్ క్షత్రియో భూమిపతిత్వమీయాత్ ।
వణిగ్జనః పణ్యఫలత్వమీయాత్
జనశ్చ శూద్రోఽపి మహత్త్వమీయాత్ ॥ 100 ॥

ఇత్యార్షే శ్రీమద్రామాయణే వాల్మీకీయే ఆదికావ్యే బాలకాండే నారదవాక్యం నామ ప్రథమః సర్గః ॥
https://vignanam.org/telugu/sankshepa-ramayanam.html

https://thyagaraja-vaibhavam.blogspot.com/2007/05/thyagaraja-kriti-nee-naama-roopamulaku.html?m=1

ప. నీ నామ రూపములకు నిత్య జయ మంగళం

చ1. పవమాన సుతుడు పట్టు పాదారవిందములకు (నీ)

చ2. పంకజాక్షి నెలకొన్న అంగ యుగమునకు (నీ)

చ3. నవ ముక్తా హారములు నటియించేయురమునకు (నీ)

చ4. నళినారి కేరు చిరు నవ్వు గల మోమునకు (నీ)

చ5. ప్రహ్లాద నారదాది భక్తులు పొగడుచుండే (నీ)

చ6. రాజీవ నయన త్యాగరాజ వినుతమైన (నీ)

సర్వం శ్రీలక్ష్మీవేంకటేశ్వర సమేత శ్రీకొండగట్టువీరాంజనేయస్వామి శ్రీచరణారవిందార్పణమస్తు...

శ్రీసీతారామచంద్రపరబ్రహ్మణే నమః.....💐🙂🙏

శ్రీ కంచి పరమాచార్య వారి 132వ జయంత్యుత్సవ శుభాభినందనలు...💐🙂(వైశాఖ బహుళ తదియ (May-4-2026) అనురాధ నక్షత్రం)

(వైశాఖ బహుళ తదియ (May-4-2026) అనురాధ నక్షత్రం)

ఈ శతాబ్దపు నిజమైన సన్యాసవరేణ్యులుగా ఎందరో మాన్యులచే ఆరాధింపబడే మరో శ్రీఆదిశంకరాచార్యులు అని పరమాచార్యుల వైభవం గురించి శ్రీచాగంటి సద్గురువులు వచించడం విజ్ఞ్యులకు విదితమే....

మన భారతదేశ చరిత్రలో ఎందరో మహనీయులు వారివారి విద్యుక్త సన్యాసాశ్రమధర్మంలో భాగంగా ఎన్నో గొప్పగొప్ప లోకోద్ధారక కార్యక్రమాలను చేపట్టి తరించారు...
అట్టి మహనీయుల్లో చిరస్మరణీయులైన శ్రీకంచిమహాస్వామి వారు భక్తలోకానికి ఒనరించిన అనుగ్రహం బహువిశేషమైనదిగా ఎందరో విజ్ఞ్యుల ఉవాచ...

"నడయాడుందైవం" / "నడిచేదైవం"  గా భక్తలోకంచే నిత్యం నమస్కరింపబడే శ్రీకంచిపరమాచార్యుల అనుగ్రహం ఇప్పటికీ ఎందరో ఆర్తులను, భక్తులను కరుణిస్తూనే ఉన్నది....

మీకోసం మేము ఏమైనా ఇవ్వాలని అనుకుంటున్నాము పెరియవ అని భక్తులు ప్రేమతో ప్రార్ధిస్తే...
"మీ జీవితంలో ప్రతీరోజు ఓ 5 నిమిషాలు నా కోసం కేటాయించండి. ఆ సమయంలో శ్రీరామనామస్మరణతో తరించండి" అని వచించిన సాధువరేణ్యులు చాలాచాలా అరుదు....

తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి వారిని దర్శించి బయటకు వచ్చినప్పుడు అక్కడి పాత్రికేయులు అడిగిన,
"లోపల ఉన్నది ఏ దేవుడని మీరు అంటారు మహాస్వామి వారు.." అనే ప్రశ్నకు....
"లోపల ఉన్నది శ్రీవేంకటేశపరబ్రహ్మము...."
అని మందస్మితులై సమాధానం ఇచ్చిన బ్రహ్మవేత్తలు శ్రీకంచిమహాస్వామి వారు...

వారి సంపూర్ణ వందసంవత్సరాల జీవనయాత్రలో అనుగ్రహింపబడిన భక్తులు కోకొల్లలు...
ఇప్పటికీ ఒక్కొక్కరూ ఒక్కో విధంగా శ్రీకంచిమహాస్వామి వారి అనన్య సామాన్య అనుగ్రహ విశేషాల గురించి వివరిస్తూనే ఉంటారు....

గురువాయూర్ శ్రీకృష్ణదేవాలయంలో సంప్రదాయ కావ్యపఠనంగా వర్ధిల్లే "నారాయణీయం" లోని 

" అస్మిన్ పరాత్మన్ ననుపాదల్మకల్పే
త్వమిత్థముత్తాపితపద్మయోనిః
అనంతభూమామమరోగరాశిం
నిరుంథివాతాలయవాసవిష్ణోః " 

అనే మహత్తరమైన శ్లోకాన్ని అనుగ్రహించి ఎందరో భక్తులకు ఆరోగ్యసిరిని అనుగ్రహించిన వైదీశ్వరస్వరూపులు శ్రీమహాస్వామి వారు...!!!

శ్రీస్కందగిరిగా అలరారే సికింద్రాబాద్ లోని శ్రీసుబ్రహ్మణ్య ఆలయ వైభవం మరియు ఆ ఆలయంతో మహాస్వామివారి అనుబంధం విజ్ఞ్యులకు విదితమే...

కులమతవర్గవర్ణాది అన్ని రకాల అనివార్యమైన గుర్తింపులకు అతీతంగా విజ్ఞ్యులైన ఎందరో విదేశీయులను కూడా ఎంతగానో అనుగ్రహించిన అపార కరుణామయులు శ్రీకంచిమహాస్వామి వారు...!

విశ్వసించే వారికి అది సాక్షాత్తు సకలదేవతా స్వరూపమైన తులసిమొక్క...
ఇతరులకు అది సదరు ఇతర అన్ని మొక్కల్లో ఒక తిలసి మొక్క....

అట్లే...

విశ్వసించే వారికి అది సాక్షాత్తు సకలదేవతా స్వరూపమైన శ్రీకంచిమహాస్వామి వారి బృందావనం. ఎందుకంటే ఇప్పటికీ వారు ఆర్తిగల భక్తులకు శ్రీకంచిశ్రీమఠం నుండే పలుకుతారు కాబట్టి...

ఈ లోకంలో మంచి చెప్పే వారు ఎక్కువే ఉంటారు...
మంచిదే....
కాని మంచి చేసే వారు చాలా తక్కువగా ఉంటారు.....

అదే విధంగా 
ఈ లోకంలో మంచి అధ్యాత్మ అంశాల గురించి చెప్పే వారు ఎక్కువే ఉంటారు...
మంచిదే....
కాని ఎంతో గొప్ప మంచి చేసే వారు చాలా తక్కువగా ఉంటారు.....
అట్టి చిరస్మరణీయులైన మహనీయుల్లో శ్రీకంచిమహాస్వామి వారిది ఎల్లప్పుడూ భక్తుల హృదయాల్లో సదా సర్వోన్నతమైన సగౌరవస్థానం...

అట్టి శ్రీకంచిమహాస్వామి వారి శ్రీపాదపద్మములచెంత సవినయ సాష్టాంగ ప్రణామ ప్రయుక్త చిరు కవనసుమాంజలి.....💐🙏

The below mentioned very useful product is available on Amazon too.


https://www.happi-planet.com/products/copper-bronze-brass-cleaner-spray-500-ml

Just forget the regular Sabeena, Peetaambari and all else to clean those strong corrosive stains with rashes.

I have tried it on a small copper utensil / "aachamana paatra" and it's copper spoon that has been in our pooja shelf since more than three decades and now it looks just unbelievably new and clean from inside too..!

And also let me share a little bit of helpful information about metallurgy and the associated meta-physical traits of the same...

STEEL UTENSILS : Absorb the positive spiritual energy present in their surroundings and dissipate most of it into the air in no time.
Henceforth, isn't recommended by wise spiritual veterans for the purpose of pooja / worship.
[ What is the point in using a ricebag with a hole in it, to accumulate all the hard earned harvested paddy into the same...? ]

BRASS UTENSILS : Absorb the positive energy present in their surroundings and radiate the same. (albeit quite lower in the magnitudes)
Henceforth, considered normal by wise spiritual veterans for the purpose of pooja / worship.

COPPER UTENSILS : Absorb the positive energy present in their surroundings and radiate the same by containing them in that copper vessel's elements. (in medium magnitudes)
Henceforth, considered good by wise spiritual veterans for the purpose of pooja / worship..

[ However, please note that citric and lactic compounds are a strict no no for copper utensils because they shall become harmful substances, because of certain quick chemical reactions, if stored in copper vessels. Hence copper vessels are supposed to be used only to store water and other stuff like flowers, fruits, etc ]

SILVER UTENSILS : Absorb the positive energy present in their surroundings and radiate the same by containing them in that copper vessel's elements. (in higher magnitudes)
Henceforth, considered best by wise spiritual veterans for the purpose of pooja / worship and can be used to store any and every entity without any issues.

However, because of faster oxidisation factors involved, copper and silver vessels need thorough and frequent proper cleaning in order to make them usable / consumable.

Happy cleaning folks... !

శ్రీ తాళ్ళపాక అన్నమాచార్యుల 618వ జయంత్యుత్సవ శుభాభినందనలు....🙂💐


బిరుదు టెక్కెములుగా పెక్కుసంకీర్తనములు
హరిమీద విన్నవించె అన్నమయ్య
విరివిగలిగినట్టి వేదముల అర్ఠమెల్ల
అరసి తెలిపినాడు అన్నమయ్య ||

అని ఎంతో గొప్పగా నుడివారు శ్రీ తాళ్ళపాక అన్నమాచార్యుల మనవలైన శ్రీ చినతిరుమలాచార్యులు వారి ఈ క్రింది సంకీర్తనలో...

https://annamacharya-lyrics.blogspot.com/2007/09/302appani-varaprasadi.html?m=1

వారి తాత గారు తాళపత్రాలపై లిఖించిన వెలకట్టలేని శ్రీవేంకటముద్రాంకిత శ్రీశ్రీనివాససంకీర్తనాసారస్వతసుధామృతనిధిని ఎంతో గొప్ప మనసుతో భావితరాలకు అందిరావాలని రాగిరేకులపై వారి
పుత్రులైన శ్రీపెద్దతిరుమలాచార్యులు మరియు
పౌత్రులైన శ్రీచినతిరుమలాచార్యులు లిఖింపజేసి భద్రపరిచి, వారు కూడా కొన్ని గొప్ప సంకీర్తనలను శ్రీవేంకటేశ్వరపదాంకితం గావించి తరించారు అని పెద్దలు, చరిత్రకారుల వచనం....

(తాళవృక్షం అనగా విరివిగా ఊర్లల్లో పెరిగే తాటిచెట్టు నుండి గైకొని తయారుగావింపబడిన పత్రాలను తాళపత్రములు అని అందురు....అప్పట్లో ఇప్పుడు మనకు లభ్యమయ్యే పేజెస్ / కాగితం ఇంకా కనుక్కోబడలేదు...)

మీరెప్పుడైనా బాగా చదువుకొని ఎన్నో ప్రైజెస్ బహూకరింపబడిన వారి ఇంటికి ఎప్పుడైనా వెళ్ళిఉండి ఉంటే.....

వారికి గౌరవార్ధమై లభించిన ఆ సోవనీర్స్ / మొమెంటోస్ / కప్స్ / ట్రోఫీస్ / వారి హాల్ రూం లో షోసెల్ఫ్ లో అందంగా అమర్చబడిఉండి, ఇంటికి వచ్చిన వారికి వారి ఇంట్లోని వారు...

ఇది మా వాడికి 2వ తరగతిలో క్లాస్ టాపర్ గా వచ్చినందుకు యాన్యువల్ డే లో వాళ్ళ క్లాస్ టీచర్ మిసెస్ రొఫీనా మ్యాడం బహూకరించిన రోల్డ్ గోల్డ్ మెడల్...

అది మా వాడికి 5వ తరగతిలో క్లాస్ టాపర్ గా నిలిచినందుకు వాళ్ళ తెలుగు టీచర్ శ్రీమతి నాగసూర్యకళ గారిచే బహూకరింపబడిన మొమెంటో...

ఇదిగో చూసారా...మా వాడికి 7వ తరగతిలో జీవా సంస్థవారు నాగార్జున మోడెల్ స్కూల్ లో నిర్వహించిన ఇంటర్ స్కూల్ క్విజ్ కాంపిటిషన్లో రెండో బహుమతి వచ్చినప్పుడు బహూకరింపబడిన మొమెంటో ఇది....

అదిగో చూసారా...మా వాడు 10వ తరగతిలో స్కూల్ టాపర్ గా నిలిచినందుకు శ్రీహరిహరాకళాభవన్లో హైదరాబాద్ స్కూల్స్ అస్సొసియేషన్ వారిచే బహూకరింపబడిన మొమెంటో అది...

ఇలా వారివారికి లభించిన ఆ కాలం నాటి మధుర జ్ఞ్యాపికలను జ్ఞ్యాపకాలను జ్ఞ్యప్తికి వచ్చేలా ఇతర మాన్యులతో నెమరువేసుకుంటూ ఉండడం గురించి విజ్ఞ్యులకు విదితమే...

కేవలం ఒక వ్యక్తికి లభించిన లౌకిక మధురస్మృతులను వారు అంత గొప్పగా భద్రపరుచుకొని లోకానికి చాటి చెప్తూ ఉంటారే....
మరి యావద్ లోకాభ్యున్నతికై కంకణబద్ధులై శ్రీహరి నందకఖడ్గాంశలో ప్రభవించిన శ్రీతాళ్ళపాక అన్నమాచార్యులు అనుగ్రహించిన అమరవందిత శ్రీహరిసంకీర్తనాసారస్వతాన్ని ఈ లోకంలోని భక్తులు, విజ్ఞ్యులు, పండితులు, భాషాకోవిదులు, చరిత్రకారులు, అధ్యాత్మవేత్తలు, ఇత్యాది మాన్యులు ఎంత గొప్పగా లోకానికి చాటి చెప్పాలి....?

అందుకే శ్రీపెదతిరుమలాచార్యులు, మరియు శ్రీచినతిరుమలాచార్యులు వారి ఆచార్యులు కూడా అయిన శ్రీతాళ్ళపాక అన్నమార్యుల శ్రీహరిసంకీర్తనాసంపుటిని రాగిరేకుల ద్వారా లోకంలో ప్రచరింపజేసి ధన్యులైయ్యారు....

దుష్టులకు దూరంగా ఉండవలెను అనే నానుడిని మా తెలుగు టీచర్ శ్రీమతి నాగసూర్యకళ గారు బోర్ద్ మీద తరచుగా రాస్తూ ఉండేవారు...
బహుషహా అలాంటి కొందరి దుష్టుల కంటపడి కనుమరుగైపోకుండా ఉండేలా నాలుగు శతాబ్దాలుగా అన్నమాచార్య భాండాగారంలో శ్రీయోగనారసిమ్హుడి యోగశక్తితో, శ్రీభాష్యకారుల తపోశక్తితో, రక్షింపబడుతూ గత 5 దశాబ్దాల్లో మన దేశం విజ్ఞ్యులతో కూడిన అభివృద్ధిచెందుతున్న దేశంగా పరిణమించిన తదుపరి శ్రీవేంకటేశ్వరుడి విశేషానుగ్రహంతో ఈ శ్రీహరిసంకీర్తనాసంపుటి 
వివిధ భాషాకారులచే పరిష్కరింపబడుతూ తగురీతిలో
సుస్వర శ్రీవేంకటహరిసంకీర్తనలుగా వివిధ సుప్రసిద్ధ గాయకగాయనీమణులచే భక్తలోకానికి అందివచ్చి ఎల్లరూ
ఆలకించి ఆలపించి తరించడం అనే ప్రక్రియ గురించి విజ్ఞ్యులకు విదితమే....

"వేదానాం సామవేదోస్మి" అని సెలవిచ్చాడు శ్రీకృష్ణపరమాత్మ గీతాచార్యుడిగా.....

ఎందుకంటే సామవేదానికి అనాదిగా ఎంతో మిక్కుటమైన లోకోపకారశక్తి, జనరంజకశక్తి, జనహితకరయుక్తి, అనేది గౌణంగా భాసిల్లే అంశం...

కలియుగప్రభావం రీత్యా వేదం పట్ల గౌరవమరియాదలు, వైదికధర్మంపట్ల గౌరవాభిమానములు,
వేదవిదుల, వేదపాఠశాలల సంఖ్య,
తగ్గుముఖం పడుతూ సమాజం ఒక అనివార్యమైన ఆధునిక సంకరసమూహంగా పరిణమిస్తూ
మేడిపండుచూడ మేలిమైఉండు అన్నచందంగా ఏ పుష్టితుష్టి,
ప్రయోజనం, ప్రాభవం, శ్రేయోప్రభావం లేని 
ఆధునికవ్యాపకాలతో కల్లోలకడలికెరటంలా ఆంతరశాంతిసౌఖ్యాలను స్థాపించలేని ఎండమావిలోనీటిభాసలా రభసకారక రసహీన వ్యాపకాలే ఇక్కాలమునందు ఎక్కువ ....

అందుకే ఆ పరమాత్మ తనకు ఎంతో ఇష్టమైన సామవేదానికి ఉపవేదమైన గంధర్వవేదమైన గాంధర్వం / గంధర్వశాస్త్రం  /  సంగీతశాస్త్రం తో దైవత్వాన్ని లోకంలో మిక్కుటంగా, రసయుక్తంగా, రాగతాళభరితంగా, రంజకత్వంతో, రమణీయమధురాలాపనతో, శ్రోతలను ఇట్టే ఆకట్టుకునే విధంగా ఉండే శబ్దసౌందర్యంతో శోభిల్లే సంకీర్తనలను వివిధ మహానుభావుల, పుణ్యమూర్తుల, కారణజన్ముల, కోవిదుల, మాన్యులచే లోకానికి
అనుగ్రహింపజేసి యావద్ ప్రపంచాన్ని శ్రేయోదాయక భక్తిరసడోలికల్లో విహరింపజేయిస్తూ సంతసిస్తున్నాడు...

ఎందుకంటే.....

నాహంవసామివైకుంఠే నయోగిహృదయేరవౌ
యత్రమద్భక్తాఃమమగాయంతి తత్రతిష్ఠామ్యహం నారదా

అని శ్రీనారదమహర్షి వారికి భగవంతుడు సెలవిచ్చాడు కాబట్టి...,

శ్రీచాగంటి సద్గురువుల ప్రవచనాల్లో నారదమహర్షి వారి పేరుకి గల అర్ధం గురించి విజ్ఞ్యులు వినే ఉంటారు కద....
"నారం దదాతి ఇతి నారదః" అనే వ్యుత్పత్తి ప్రకారంగా నారము అనగా జ్ఞ్యానము....అట్టి జ్ఞ్యానాన్ని అనుగ్రహించే వారే శ్రీనారదమహర్షి వారు...

అట్టి శ్రీనారదమహర్షి వారికే భగవంతుడు చెప్పిన వచనం...
నా భక్తులు నన్ను ఎక్కడెక్కడ గానం చేస్తూ ఉంటారో.....
అక్కడక్కడ నేను ఉంటూఉంటానోయ్...
అని...

మరి అట్టి భగవద్ప్రీతికరమైన సంగీతసారస్వతసమ్మిళిత భగవద్గుణగౌణగానం ప్రసాదించే సర్వోన్నతమైన సుజ్ఞ్యానం ఎట్టిదో విజ్ఞ్యులకు ఎరుకే...

పరమాత్మను, పరతత్త్వాన్ని ప్రస్ఫుటంగా ఎరుకపరిచి అనుసంధానింపజేసి తరింపజేసే అట్టి సర్వోన్నతమైన సుజ్ఞ్యాన సాధనమే శ్రీహరిసంకీర్తనం అని...
శ్రీతాళ్ళపాక అన్నమాచార్యులవారు ఈ క్రింది పంక్తుల్లో ఎంతో గొప్పగా సెలవిచ్చారు...

హరి యనురెండక్షరములు నుడివిన నఖిలవేదములు మంత్రములు 
గరిమ ధర్మశాస్త్రపురాణాదులు క్రమమున జదివినపుణ్యములు
పరమతపోయోగంబులు మొదలగుబహుసాధనములసారంబు 
పరిపక్వంబై ఫలియించగా బట్టబయలు వెదకనేలా

https://annamacharya-lyrics.blogspot.com/2007/11/336-trikaranasuddhiga-jesinapanulaku.html?m=1

అంతగా పరిచయం లేని వారికి ఒక బ్రహ్మవిద్యగా అనిపించే సంగీతశాస్త్రం అవగతమవకున్నా కూడా భక్తితో విన్నంత మాత్రాన, చదివినంతమాత్రాన, ఆలపించినంత మాత్రాన, అందలి ప్రతిపాదిత పరతత్త్వవిశేషగ్రాహ్యతచే భక్తోద్ధరణగావింపబడే విధంగా రచింపబడినట్టి శ్రీతాళ్ళపాక వారి శ్రీవేంకట ముద్రాంకిత శ్రీహరిసంకీర్తనలు
ఈ నవయుగ భక్తలోకానికి అందివచ్చిన కామధేనువులు, కల్పవృక్షాలు, చింతామణులు, చిరంతన అక్షయామరద్యుతిప్రకటిత శ్రీహరిసాలగ్రామ గుళికలు....

కామధేనువును ఎవ్వరైనా అపహరించుకొని వెళ్ళొచ్చు...
కల్పవృక్షం రోజుకు ఒక్క ధర్మేప్సితాన్ని మాత్రమే అనుగ్రహించును....
నిరంతర బాహ్యాంతరశౌచంతో మాత్రమే చింతామణి ఈప్సితములను ఈడేర్చును....
అయిననూ ఇవన్నీ భూలోకస్థిత వాసులకు అలభ్యమై ఉన్నవి...
శ్రీహరిసాలగ్రామాలను ఆరాధించాలంటే ఎంతో నియమభరిత నిత్యారాధనావిధానం సువ్యవస్థీకరింపబడి ఉండాలి....

కాని శ్రీహరిసంకీర్తన అనే సరళమైన సర్వజనశ్రేయోదాయకమైన
సర్వలోకహితకరమైన సారససారస్వతసంపత్తు అనేది....
కరమున ఇమిడిన కైనిధివంటిది...
గంగాజలంలా, తులసిమొక్కలా, అగ్నితప్తస్వఛ్చమైన స్వర్ణమంజూషాంతరస్థిత మాధవపదార్ధంలా....
సర్వకాలసర్వావస్థల్లోనూ పరమపవిత్రమైన, పరమశక్తివంతమైన, పరమశ్రేయోదాయకమైన,
పరతత్త్వసాధనం.....!

ప|| ఇదిగాక సౌభాగ్యమిదిగాక తపము మరి | యిదిగాక వైభవం బికనొకటి కలదా ||

చ|| అతివ జన్మము సఫలమై పరమ యోగివలె | 
నితర మోహాపేక్షలిన్నియును విడచె
సతి కోరికలు మహాశాంతమై యిదెచూడ | 
సతత విజ్ఞాన వాసన వోలె నుండె ||

చ|| తరుణి హౄదయము కౄతార్థతబొంది విభుమీది | పరవశానంద సంపదకు నిరవాయి
సరసిజాసన మనోజయమంది యింతలో | 
సరి లేక మనసు నిశ్చల భావమాయ ||

చ|| శ్రీవేంకటేశ్వరుని జింతించి పరతత్త్వ | 
భావంబు నిజము గాబట్టి జెలియాత్మ |
దేవోత్తముని కౄపాధీనురాలై యిపుడు | 
లావణ్యవతికి నుల్లంబు తిరుమాయ ||

https://annamacharya-lyrics.blogspot.com/2007/08/294-idigaka-saubagyamidigaka.html?m=1

అందుకే శ్రీతాళ్ళపాక అన్నమాచార్యులు అమితమైన ప్రేమతో తమనుతాము నాయికగా, శ్రీవారిని నాయకుడిగా భావిస్తూ పైకి శృంగారసస్ఫోరక సంకీర్తనగా అనిపించేలా రచించి...
నిధిధ్యాసనావస్థలో పరమాత్మపట్ల అంకురించే మిక్కుటమైన ప్రేమతో పరవశిస్తూ ఉండే జీవాత్మపరమాత్మానుసంధానభావలహరిలో ఆద్యంతరహితమైన పరతత్త్వ చింతనతో మాత్రమే
పట్టుబడే పరతత్త్వ వైభవాన్ని
"దేవోత్తముని కౄపాధీనురాలై" 
అని ఎంతో చమత్కరిస్తూ వర్ణించారు.....

"కృపాధీనురాలై"
అనే వచనాన్ని మనం గమనిస్తే...
అధీనం అంటే స్వాధీన పరచుకొనుట అని సమాన్యార్ధం....

కృపతో స్వాధీనపరుచుకోవడం అని అనడం చాల వింతైన విశేషం.....

ఇక్కడ అసలైన అర్ధం ఏంటంటే....
స్వామివారి భక్తిలహరుల్లో విహరించే జీవుడు తత్ భక్తిజనిత
సర్వస్యశరణాగతితో స్వామివారితో మమేకమై ఉన్నప్పుడు స్వామివారిచే వర్షింపబడే అమేయకృపకు దాసులై అనగా తమంత తాముగా అధీనులై ఉండి పరత్తత్వవైభవం గురించిన ఎరుకతో వర్ధిల్లడం.....

మనం నిత్యం పఠించే శ్రీలలితాసహస్రనామాల్లో ఈ క్రింది నామం గురించిన సామ్యముతో మనం యోచించినచో ఎల్లప్పుడు శివ వైభవానికి స్వాధీనమై ఉండే శివ వల్లభియే శివా... 
అని ఒక వ్యాఖ్యానం... 

"శివా స్వాధీన వల్లభా"

అనగా ప్రకృతి ఎల్లపుడూ పమాత్మయొక్క వైభవానికి, కృపకు, అనుగ్రహానికి స్వాధీనమై వర్ధిల్లును అని ఆంతరాత్ధం....

జీవుడు / భక్తుడు ప్రకృతికి సంకేతమైతే....
జీవేశ్వరుడైన పరమాత్మ శ్రీవేంకటేశ్వరుడిగా కొలువై తనను మిక్కుటముగా ఆరాధించే భక్తులను అత్యంతకృపతో అనుగ్రహిస్తూ వారికీ వల్లభుడై, శ్రీవేంకటాచలవల్లభుడై వర్ధిల్లుతున్నాడు అని శ్రీతాళ్ళపాక అన్నమాచార్యులు ఎంతో రసరమ్యంగా పరతత్త్వప్రతిపాదనను తమ సుందరమైన శృతిశోభిత పదాల్లో రక్తికట్టించారు.....

శ్రీభూ సమేత శ్రీవేంకటశైలవల్లభుడు సదా తన భక్తులకు స్వాధీనవల్లభుడై పరిఢవిల్లాలని అభిలషిస్తూ,
సర్వం శ్రీ తాళ్ళపాక అన్నమార్యనుత అమరవందిత ఆనందనిలయస్థిత అనంతశయన శ్రీచరణారవిందార్పణమస్తు....🙂💐🙏

శ్రీపరాభవ 2026 వైశాఖ పౌర్ణమి పర్వసమయ ప్రయుక్త శ్రీకూర్మనారాయణ జయంతి శుభాభినందనలు.


శ్రీ చాగంటి సద్గురువుల శ్రీమద్భాగవతకర్ణామృతప్రవచనాలను శ్రద్ధాభక్తితో ఆలకించిన భక్తులకు / విజ్ఞ్యులకు తెలిసినట్టుగా,
అంబరీషోపాఖ్యానాంతర్గతమైన సంఘటనలో భాగంగా లోకసమ్రక్షణార్ధమై శ్రీహరి స్వీకరించిన దశావతారవర్ణన గురించిన ఆఖ్యానాలను, వ్యాఖ్యానాలను, ఇతిహాసఘట్టాలను, నెమరువేసుకోవడం కూడా ఎంతో పుణ్యప్రదమైన స్వాధ్యాయ తపస్సు....

ఎందుకంటే మనమున్న ప్రస్తుత కలియుగలక్షణం రీత్యా, 
కృత, త్రేత, ద్వాపర యుగాల్లో మునులు, మహర్షులు, యోగులు, రాజులు, చక్రవర్తులు గావించిన రీతిలో అగ్రశ్రేణి తపస్సును ఆచరించడం చాలా కఠినమైన అంశం....

ఎందుకంటే 
అందుకు తగిన విధంగా...
దేవతలుప్రసన్నమయ్యేలా ఉండే పరిసరశౌచం,
దేవతలనుప్రసన్నం గావించుకునేందుకు కావలసిన
సదాచారశౌచం, మంత్రసిద్ధి, యోగశక్తి, వేదవిజ్ఞ్యానంతో వర్ధిల్లుతూ తరించడం ఈ కలియుగంలో అంతగా అన్నివేళలా కుదరని అంశం...

కావాలంటే మీరు గమనించండి...

"రాబోయే దశాబ్దాల్లో భారత అంతరిక్ష విజ్ఞ్యాన కౌశలం  ఎవ్విధంగా ఉండబోతోంది...?"

అనే ప్రశ్నను మీరు అడిగితే...

ఒక ఎంజినీరింగ్ కాలెజ్ విద్యార్థి మొదలుకొని ఒక అగ్రశ్రేణి సైంటిస్ట్, ఐ.ఏ.ఎస్ ఆఫీసర్ గారి వరకు ఠక్కున వారివారి సైంటిఫిక్ స్టడీస్ కి తగ్గట్టుగా ఇవ్విధంగా సమాధానం ఇస్తారు.....

ఒక ఎంజినీరింగ్ కాలెజ్ విద్యార్థి యొక్క సమాధానం.....

"ఇప్పుడున్న స్థూల ట్రాన్సీవర్స్ కంటే ఎన్నో రెట్లు మెరుగైన, శక్తివంతమైన సూక్ష్మ ట్రాన్సీవర్స్ యొక్క సమూహంతో బిగించిఉండే అత్యాధునిక సాంకేతిక వ్యవస్థను కలిగి ఉండి, నిర్దేశిత డౌన్లింక్ ఫ్రీక్వెన్సి లో భూమికి నిరంతరం కొన్ని వేల గీగాబైట్స్ సమాచారాన్ని చేరవేస్తు ఈ భూప్రపంచంలో ఎక్కడ ఏ మూలన ఏ ఇంటిపై అమర్చనడిన ఏ సోలార్ పరికరం
ఏ కంపెని వారు తయారు చేసారో చెప్పగలిగేంతటి స్థాయిలో రాబోయే నవయుగ నవభారత అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞ్యానశాసిత భారత అంతరిక్ష సంచార సాంకేతిక వ్యవస్థ ఉండబోతోంది..."

మరియు ఒక అగ్రశ్రేణి సైంటిస్ట్, ఐ.ఏ.ఎస్ ఆఫీసర్ గారి సమాధానం.....

"సోలార్ పవర్డ్ ఎనర్జి మోడ్యూల్స్తో భూమిచుట్టూ పరిభ్రమించే ఇప్పుడున్న స్టేటిక్ పేలోడ్ సిస్టంస్ కంటే ఎన్నో రెట్లు మెరుగైన, శక్తివంతమైన ఏ.ఐ ప్రొపెల్డ్ డైనమిక్ పేలోడ్ సిస్టెంస్ తో ఆకాశంలో ఒక ఆకాశహర్మ్యంలా నిర్మించబడిన సమ్యుక్త అంతర్జాతీయ అంతరిక్ష పరిశోధనా వ్యవస్థతో ఎప్పుడుకావాలంటే అప్పుడు అనుసంధానమౌతూ,
ఒక నిర్దేశిత ఉపగ్రహం నిర్దేశిత పౌనహ్పున్యం లో నిర్దేశిత లక్ష్యసాధన మాత్రమే కాకుండా, తనకు ఉపయుక్తమైన "అప్డేట్స్ ఆన్ ది ఫ్లై" అనే కాన్సెప్ట్ తో అప్పటికప్పుడు ఒక సరికొత్త ఉపగ్రహంగా తనను తాను వ్యవస్థీకరించుకునే శక్తితో పరిఢవిల్లే అత్యాధునిక నానోటెక్నాలజి సెన్సర్స్ బేస్డ్ డైనమిక్ రిక్యాలిబ్రేషన్ & రి అలైన్మెంట్ సిస్టెంస్తో ప్రత్యర్ధి దేశాల ఉపగ్రహవ్యవస్థలకు అంతుచిక్కని అల్గోరిదంస్ తో వర్ధిల్లెలా రాబోయే నవయుగ నవభారత అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞ్యానశాసిత భారత అంతరిక్ష సంచార సాంకేతిక వ్యవస్థ ఉండబోతోంది....ఇప్పటికే అమెరిక, రష్యా, ఈ టెక్నాలజిని సమర్ధవంతంగా పరీక్షించి అంతరిక్షంలో వాటి పైచేయిని వ్యవస్థీకరించుకునే దిశగా ఎన్నో రహస్య ప్రాజెక్ట్లను మరియు వాటికోసం తగిన లాంచ్ వెహికిల్స్ ని కూడా నిర్మించుకుంటున్నారు...."

అని చెప్పబడుతుంది....

కొన్ని శతాబ్దాల క్రితం కేరళ దేశంలో కాలటి అగ్రహారంలో ప్రభవించిన శ్రీ ఆదిశంకరాచార్యులు అనుగ్రహించిన "శ్రీస్తవం" లో వర్ణింపబడిన శ్రీమహాలక్ష్మీదేవి యొక్క వైభవం మరియు ఆనాడు క్షీరసాగరమథనంలో శ్రీకూర్మనారాయణుని అనుగ్రహంగా, వాసుకి అల్లెత్రాడుగా, మేరుపర్వతం కవ్వంగా, దేవదానవుల పరస్పర పరిశ్రమగా ప్రభవించిన
కల్పవృక్షం, కామధేనువు, ఉచ్ఛైశ్రవం, ఐరావతం, చంద్రుడు, శ్రీమహాలక్ష్మి, అమృతకలశం తో శ్రీధన్వంతరీ నారాయణమూర్తి, అనే దైవికవస్తుతత్త్వాల్లో,
అక్కడున్న దేవతలందరూ అప్పుడు ప్రభవించిన శ్రీమహాలక్ష్మీదేవిని స్తుతించిన
"సర్వదేవకృతశ్రీలక్ష్మీస్తవం" లో వర్ణింపబడిన శ్రీమహాలక్ష్మీదేవి యొక్క వైభవం గురించి మీరు కొంచెం వివరించగలరా...?

అనే ప్రశ్నను మీరు అడిగితే...

ఒక కాలేజ్ విద్యార్థి అయినా....
ఒక ఐ.ఏ.ఎస్ ఆఫీసర్ గారైనా...
ఒక సైంటిస్ట్ గారైనా...
మరే ఇతర విజ్ఞ్యులైనా...

"ఆ...అంటే....అది...మీరు అడిగిన సనాతనభారతీయ వైభవానికి సంబంధించిన సదరు అధ్యాత్మ అంశం ఏ సినిమాలోను చూసినట్టుగా కాని, ఎక్కడా విన్నట్టుగా చదివినట్టుగా కాని, అంతగా గుర్తులేదండి..."

అనే సమాధానమే ఎక్కువగా ఎక్కువమందినుండి వచ్చేది...
ఎందుకంటే....
ఈ కలియుగంలో జెట్ స్పీడ్లో దూసుకుపోతున్న సైన్స్ విజ్ఞ్యానాన్ని అందించేందుకు వేలల్లో, లక్షల్లో, కాలేజీలు, విశ్వవిద్యాలయాలు, ఉన్నాయేమో కాని...
మనకు చెందిన, మనకు మాత్రమే సొంతమైన, సనాతన భారతీయ ఆర్ష విజ్ఞ్యానానికి చెందిన గొప్పగొప్ప మహిమాన్వితమైన అంశాల గురించి,
భారతీయ సనాతన ధర్మవైభవం గురించి, సాధారణ జనబాహుళ్యానికి విశదీకరించే ప్రాచీనశాస్త్రీయవిజ్ఞ్యానకోవిదులు వందల్లో కూడా లేకపోవడం
ఈ కలియుగ వైచిత్రికి నిదర్శనం....
ఉన్నాకూడా చాలామంది, మంచి విషయాలను చెప్పే వారిని 
ఓర్వని ఈ సమాజం గురించి, సమాజాభ్యున్నతి గురించి
మనకెందుకు తలనొప్పి.....
మన స్వాధ్యాయమేదో, మనపనేదో మనం చేసుకుంటే సరిపోద్ది కద.....అని సమాజంలో సగటు సాధారణ వ్యక్తుల్లా ఉండే అసాధారణ మాన్యుల గౌరవాభిమానాలకు పాత్రతను సంతరింపజేసుకోలేని ఆధునికసమాజభరిత అవనియవనిక గురించి విజ్ఞ్యులకు విదితమే....

మరి ఇలాంటి యుగంలో, ఇలాంటి ఆధునికసమాజంలో, మంచిమంచి మహిమాన్విత అధ్యాత్మ అంశాలు, మంచి హృదయం గలవారికి ఎట్లు అందివచ్చి వారు తరించి ఇతర మాన్యులను తరింపజేయడం...?
అని ఎవరైనా యోచిస్తే....అందుకు సమాధానమే 
కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీవేంకటేశ్వరస్వామి వారు...!

పార్థాయ తత్-సదృశ సారధినా త్వయైవ
యౌ దర్శితౌ స్వచరణౌ శరణం వ్రజేతి ।
భూయోఽపి మహ్య మిహ తౌ కరదర్శితౌ తే
శ్రీవేంకటేశ చరణౌ శరణం ప్రపద్యే ॥ 11 ॥

"ఓ శ్రీవేంకటేశ్వరా! పూర్వం అర్జునుడికి (పార్థుడికి) తగిన సారథివై ఉండి, 'నా పాదాలనే శరణు వేడుకో' (మామేకం శరణం వ్రజ) అని ఏ చరణాలనైతే చూపించావో, అవే చరణాలను ఇప్పుడు ఇక్కడ నీ హస్తకమలంతో చూపిస్తున్నావు. అటువంటి నీ శ్రీచరణాలను నేను శరణు వేడుకుంటున్నాను."

ఆనాడు కురుక్షేత్రసంగ్రామంలో ఎంతో అలజడితో ఏం చేయాలో అర్ధంకాక, విహితకర్తవ్యాచరణగురించి వివిధరీతుల వికలుడై, రణభూమిలో కృంగిన రథచక్రంలా మనోభారంతో మథనపడుతున్న అర్జునుడి మనస్సును అర్ధంజేసుకున్న అంతర్యామిగా, శ్రీకృష్ణపరమాత్మ గీతాచార్యుడిగా భగవద్గీతను బోధించి, అర్జునుడిని తన విహితకర్తవ్యంపట్ల కార్యోణ్ముఖుడిగా నిలబెట్టినాడు....
తదనంతరం చక్రిగా చెయ్యాల్సిందంతా చేసి అర్జునుడికి
హస్తినాపురి సిమ్హాసనాన్ని అందించి అనుగ్రహించాడు....

ఇదంతా శ్రీకృష్ణుడు ఎందుకు చేసాడంటే...
ఒకరోజు...
దుర్యోధనుడు / కౌరవులు,
మరియు
ధర్మరాజు, అర్జునుడు / పంచపాండవులు,
సభలో ఉండగా...
అతిధిగా విచ్చేసిన శ్రీకృష్ణుడు....
"అంతా కుశలమేకద కురుయోధులారా.....
మీకు ఏం కావాలో అడగండి...."
అని వచించినప్పుడు.....
"మొదటగా అడిగేందుకు అనుమతించినందుకు దుర్యోధనుడి నమస్సులు యదుకులతిలకా....." అని
వచించి...
మంచి సమయం దొరికింది కదా అని అనుకొని....
"మీ యొక్క సకల లౌకిక వీర సంపత్తి నావైపు ఉండేలా అనుగ్రహించు రుక్మిణీపతి..."
అని వెంటనే దుర్యోధనుడు తన దురాశను, దుర్బుద్ధిని వ్యక్తపరిచాడు....
శ్రీకృష్ణుడు చిరునవ్వు నవ్వి తధాస్తు దుర్యోధన...
అని వచించాడు.....

ఆ తదుపరి అర్జునుడి, పాండవుల వంతు వచ్చేసరికి....
"అడగడానికి ఇంకేం ఉంది శ్రీకృష్ణా...నీదంతా మొదట అడిగిన వాళ్ళకే ఇచ్చావ్ కదా బావా..." అని అర్జునుడు అనలేదు సరికదా....
"నువ్వు నా వెంటే ఉంటే, మా వెంట అన్నీ ఉన్నట్టే కదా బావా..."
అని వచించాడు.....
అప్పుడు కూడా శ్రీకృష్ణుడు అదే చిరునవ్వు నవ్వి తధాస్తు అర్జున...
అని వచించాడు....

అందుకే...
అటు నూర్గురు కౌరవుల సేన వైపు,
మిక్కుటమైన రథ గజ తురగ పదాతి దళాలు,
భీష్మ, ద్రోణ, అశ్వత్థామ, కర్ణ, కృప, ఇత్యాది అరితేరిన అగ్రశ్రేణి వీరులు ఉన్నాకూడా....
ఇటు పాండవుల వైపు, అర్జునుడి వెంటే పార్ధసారధిగా ఉన్న శ్రీకృష్ణుడి శ్రీవైష్ణవభాసకు కౌరవుల సర్వస్వం స్వాహా అయ్యింది...

ఎవ్విధంగా....
దేవతలప్రార్ధనమేరకు...
పరమేశ్వరుడు లోకకంటకమైన హాలహలాన్ని స్వీకరించి గరళకంఠుడైన తదుపరి,మరలా దేవతలప్రార్ధనమేరకు క్షీరసాగరమథనానికి ఆలంబనగా శ్రీకూర్మనారాయణమూర్తిగా శ్రీమహావిష్ణువు వర్ధిల్లి, అందునుండి అమృతం ప్రభవించిన తదుపరి లోకోత్తరమైన సౌందర్యమూర్తిగా మోహినీ అవతారాన్ని దాల్చి దానవులను మోహింపజేసి, దేవతలకు అమృతాన్ని అందించి లోకాన్ని అనుగ్రహించాడో....

అవ్విధంగానే...
పరమేశ్వరుడి నుండి పాశుపతాస్త్రం అర్జునుడికి అనుగ్రహింపజేసి,
అత్యంత సంక్లిష్టమైన సైంధవవధను సాధ్యంకావింపజేసి,
మరెన్నో రీతుల అర్జునుడికి హితోపదేశం గావిస్తూ,
రథసారధ్యాన్ని వహిస్తూ,
తుదకు రణభూమిలో విజేతగా నిలిపి విజయుణ్ణి హస్తినాపుర చక్రవర్తిగా అనుగ్రహించాడు శ్రీకృష్ణుడు...

మీరు ఎప్పుడైనా జూ లేక ఇతర ప్రదేశాల్లో ఎప్పుడైనా తాబేలును గమనించి ఉండి ఉంటే....

1. గమ్యం పట్ల నిశితమైన చూపు.
2. గమ్యం దిశగా నిర్విరామ పరిశ్రమ / పయనం.
3. పరిసరాల్లో ఉండే ప్రతికూలతను అధిగమించడానికి
దుర్భేద్యమైన కవచంలా ఉండే ఉపరితల మూపురం / డొప్ప.
4. నెమ్మదిగా స్వీకరింపబడే శ్వాసతో సుదీర్ఘ ఆయువు.
5. మీన దృక్కులకు సమానంగా ఉండే శక్తివంతమైన కూర్మ దృక్కులతో తమ సంతతిని అభివృద్ధిపరచడం.

శ్రీకూర్మనారాయణ వృతాంతాన్ని శ్రద్ధాభక్తితో ఆలకించే వారికి,
శ్రీకూర్మనారాయణుణ్ణి ఆరాధించేవారికి,
ఇవ్విధమైన అధ్యాత్మ సిద్ధి / ఈశ్వరానుగ్రహం లభించి వారివారి జీవనప్రయాణాల్లో, పరిశ్రమలో, గమ్యాల్లో, సత్ఫలితాలు లభించి తరించెదరు అని ఆర్యోక్తి....

సకల దేవతాస్వరూపుడైన శ్రీవేంకటేశ్వరుడి ఎన్నో మధురమైన సంకీర్తనల్లో...
శ్రీకూర్మనారాయణ వైభవాన్ని శ్రీతాళ్ళపాక అన్నమాచార్యుల వారు ఎంతో ఘనంగా కీర్తించారు....

************ ************ ************ ************

https://annamacharya-lyrics.blogspot.com/2006/11/59indariki-abhayambulichchu-cheyi.html?m=1

ఇందరికి నభయంబులిచ్చు చేయి
కందువగు మంచి బంగారు చేయి॥

వెలలేని వేదములు వెదకి తెచ్చినచేయి
చిలుకు గుబ్బలి కింద చేర్చు చేయి
కలికి యగు భూకాంత కౌగిలించినచేయి
వలనైన కొనగోళ్ళ వాడి చేయి ॥

తనివోక బలిచేత దానమడిగిన చేయి
ఒనరంగ భూదాన మొసగు చేయి
మొనసి జలనిధి యమ్ముమొనకు దెచ్చిన చేయి
ఎనయ నాగేలు ధరియించు చేయి ॥

పురసతుల మానములు పొల్లసేసినచేయి
తురగంబు బరపెడి దొడ్డచేయి
తిరువేంకటాచలాదీశుడై మోక్షంబు
తెరవు ప్రాణుల కెల్ల తెలిపెడి చేయి॥

************ ************ ************ ************

https://annamacharya-lyrics.blogspot.com/2007/03/150machcha-kurma-varaha.html?m=1

మచ్చ కూర్మ వరాహ మనుష్య సింహ వామనా
యిచ్చ రామ రామ రామ హిత బుధ్ధ కలికీ

నన్నుగావు కేశవ నారాయణ మాధవ
మన్నించు గోవింద విష్ణు మధుసూదన
వన్నెల త్రివిక్రమ వామనా శ్రీధరా
సన్నుతించే హృషికేశ సారకు పద్మనాభ

కంటిమి దామోదర సంకర్షణ వాసుదేవ
అంటేజాలు ప్రద్యుమ్నుడా అనిరుధ్ధుడా
తొంటే పురుషోత్తమ అథోక్షజా నారసింహమా
జంటవాయుకు మచ్యుత జనార్దన

మొక్కేము వుపేంద్ర హరి మోహన శ్రీకృష్ణరాయ
యెక్కితి శ్రీవేంకట మిందిరానాథ
యిక్కువ నీ నామములు యివియే నా జపములు
చక్కగా నీ దాసులము సర్వేశ అనంత

************ ************ ************ ************

https://annamacharya-lyrics.blogspot.com/2006/10/39dolayamchaladolayam.html?m=1

డోలాయాం చల డోలాయాం హరే డోలాయాం ॥పల్లవి॥

మీనకూర్మ వరాహా మృగపతిఅవతారా
దానవారే గుణశౌరే ధరణిధర మరుజనక ॥డోలా॥

వామన రామ రామ వరకృష్ణ అవతారా
శ్యామలాంగా రంగ రంగా సామజవరద మురహరణ ॥డోలా॥

దారుణ బుద్ద కలికి దశవిధఅవతారా
శీరపాణే గోసమాణే శ్రీ వేంకటగిరికూటనిలయ 2 ॥డోలా॥

************ ************ ************ ************

సర్వం శ్రీశ్రీనివాస శ్రీచరణారవిందార్పణమస్తు...💐🙏🙂

Wednesday, May 13, 2026

To all those that are too exhausted because of the scorching summer heat waves, please consider the below tips for good health.


1. Have a few nuts (almonds, walnuts, dates, pumpkin seeds etc) soaked overnight and grind them into fine paste by adding a little bit of water. 
Mix this paste into a glass of boiled milk with a pinch of turmeric and little organic sugar as per the requirement. This will immediately restore / balance the energy levels and thus peace of mind. 

2. Add a few mint leaves / pudina into regular drinking water stored in a pot to make it slightly alkaline and drink the same frequently for natural body cooling effects. 

3. Continue having one groundnut laddu and / or sesame laddu to maintain proper energy levels.

4. Be under the sun only when you can peacefully view the complete sun's sphere in its typical orange color during sunrise or sunset for proper vitamin D absorption. 

5. Regular proper intake of green leafy vegetables in various ways and sugarcane juice, curd, buttermilk,
will go a long way in sustaining good health.
(Paalakoora for iron and strength, Gangavallikoora for minerals and natural cooling, Ponnagantikoora for vitamin A, Goangoora for Iron and vitamin C, Chukkakoora for vitamin C and antioxidants, etc)

Wisdom always supersedes knowledge...

"To live in a kaleidoscopic world full of unfathomable and immeasurable varied stuff, by maintaining the required sensibility and prudence in  being selective in order to be at peace with ourselves and thus with nature and the world around..."
shall be the quintessential driving principle for one and all .....

When someone goes to a vegetable / fruit mart, 
it can be observed that there isn't anything labelled as absolutely good or indefinitely bad by the sellers or suppliers.
It is by the virtue of the knowledge garnered and wisdom gained by the buyer, that he/she selects a few vegetables and fruits that they believe are good for them and their folks for that point in time for a given reason and requirement inorder to live a healthy life in their respective best capacities.

That decisive selection can neither be a dictated theory nor a forced doctrine by someone for all obvious reasons. Because the choice we make for our respective well-being may or may not be in line with someone else's assumptions or aspirations because it is mostly a choice based on a sensible suggestion by an equally good hearted personality or an option we pick from the available vegetables / fruits in the mart based on our knowledge base.

For example,
During a peak summer season, let us suppose that I have purchased 2 kilos of mangoes and 1 kilo of cucumbers, it implies that I like mangoes for all the super good healthy nutrients, vitamins, minerals, anti-oxidants and it also implies that I know how to neutralize the side effects of consuming mangoes during summer season (i.e., their typical excessive heat effects) by consuming cucumbers along with mangoes.

Quite similarly, our life too is built on such sensible and prudent choices, options, decisions, and requirements to live healthy and peaceful with each progressive day.

i.e.,

Some known or unknown person can't say or dictate or force or assume the mangoes of varied breeds to be bought by us.
Because, though the mart is filled with several varieties of mangoes, as a wise consumer, the onus of our health is on us and not on those business makers for all obvious reasons.

At a certain point in time, a place that a person wants to go to in order to have a sacred river bath is a matter of his / her personal choice based on various factors involved
It implies though Ganga, Godavari, Krishnaveni, Kaveri, Narmada etc are all great rivers to have a sacred river bath, the river and place a person wants to visit is based on his feasibility and preference criteria and isn't a topic for someone's business agenda.

i.e., when Saraswati river pushkaraalu festival is being held at multiple places in India, and someone wants to visit ShreeKaaleshwara Mukteeshwara Temple and the associated Triveni Sangamam for a sacred river bath...,
It does not and can not mean that PrayagRaj's Triveni Sangamam or Maana village's Saraswathi river flow isn't being respected..... 
It's just that due to various socio-economic and health factors, they considered the former for their sacred river bath at that point in time...

Not even a hon'ble CM or PM would say anything to their citizens on any such personal well calibrated decisions because they are very well aware of the facts about...
what constitutes public service and what doesn't...
what is dictation and what is suggestion....
what is a good advice and what isn't...
and above all 
what is the threshold of giving and receiving the respect and what isn't.....

Knowledge and Education, no matter how elite they are, might present someone with a few degrees and certificates. However, they may or may not equip someone with the required prudence and efficacy to properly maintain / handle an object, a situation, a requirement, a belief and so on....
Wisdom does....!

శ్రీభగవద్రామానుజాచార్య 2026 జయంత్యుత్సవ శుభాభినందనలు..


శ్రీఆదిశంకరాచార్యులు ప్రచరింపజేసిన అద్వైత సిద్ధాంతాన్ని ఆచరితమార్గంలో జీవితానికి మరింత దెగ్గరగా ఆపాదించి అన్వయించుకొని విశేషంగా తరించే తత్త్వ సంప్రదాయంగా విశిష్టాద్వైతాన్ని ప్రభవింపజేసి ప్రచరించి పాటించిన మహానీయులు శ్రీభగవద్రామానుజులు...

సత్సంప్రదాయము, భగవంతుడు, భగవంతుడి ఆలయం, ఆరాధనా విధానము / మంత్రపఠనము, ప్రసాదము, వైభవము అనేది ఈ లోకంలో కుల మత వర్ణ వర్గాది అన్ని రకాల అనివార్య గుర్తింపులకు అతీతమైన దైవికాంశంగా రూఢపరచి విశిష్టాద్వైతాన్ని లోకానికి / విజ్ఞ్యులకు అందిచి తరించి తరింపజేసిన తపోనిష్టాగరిష్టులు శ్రీభగవద్రామానుజులు...

శ్రీరామానుజాచార్యుల శ్రీకరమైన వైభవాన్ని కీర్తించి గౌరవించినది మీ లాంటి మాన్యులు, నా లాంటి సామాన్యులే కాదు...
పదకవితాపితామహులైన శ్రీ తాళ్ళపాక అన్నమాచార్యుల వంటి అగ్రశ్రేణి కవికోవిదులు కూడా ..

https://annamacharya-lyrics.blogspot.com/2006/12/in-english-gatulanni-khilamaina.html?m=1

************ ************ ************

గతులన్ని ఖిలమైన కలియుగమందును
గతి ఈతడే చూపె ఘన గురుదైవము

ఈతని కరుణనేకా ఇలవైష్ణవుల మైతి
మీతని వల్లనే కంటి మీ తిరుమణి
ఈతడే ఉపదేశమిచ్చెను అష్టాక్షరి మంత్రము
ఈతడే రామానుజులు ఇహపర దైవము

వెలయించె నీతడేకా వేదపు రహస్యములు
చలిమి నీతడే చూపె శరణాగతి
నిలిపినాడీతడే కా నిజముద్రా ధారణము
మలసి రామానుజులు మాటలాడే దైవము

నియమములు ఈతడేకా నిలిపె ప్రపన్నులకు
దయతో మోక్షము చూపె తగనీతడు
నయమై శ్రీవేంకటేశు నగమెక్కె వాకిటను
దయచూచి మమ్మునిట్టే తల్లిదండ్రిదైవము

************ ************ ************

అందుకే శ్రీభగవద్రామానుజుల కీర్తిగౌరవప్రభలు
శ్రీతిరుమలేశుడి గురువుగారిగా ఆచంద్రతారార్కమై వర్ధిల్లేలా  తిరుమల ఆనందనిలయంలో ఉత్తర ఈశాన్య భాగంలో శ్రీభాష్యకార్లసన్నిధి పేరిట సాక్షాత్తు శ్రీవేంకటేశ్వరస్వామి వారే వ్యవస్థీకరించి భక్తులను అనుగ్రహించిన వైనాన్ని విజ్ఞ్యులు శ్రీచాగంటి సద్గురువుల ప్రవచనాల్లో ఆలకించే ఉంటారు...

కొందరు విజ్ఞ్యులకు తెలిసినట్టుగా,

తిరుమలేశుడి ఆనందనిలయ దర్శనపుణ్యఫలం సంపూర్ణంగా సంప్రాప్తించాలంటే...,
ధర్మార్జితమైన కాసైనను ఉత్తరభాగంలో ఉండే కొప్పెర / హుండి లో సమర్పించి,
అక్కడ కొలువై ఉండే శ్రీమహాలక్ష్మీ దేవికి, శ్రీభగవద్రామానుజాచార్యులకు,
శ్రీయోగనారసిమ్హస్వామి వారికి,
నమస్కరించవలెను....

ఎందుకంటే, అప్రాకృతమైన తిరుమల మహాపుణ్యక్షేత్రం అనేది...

శ్రీక్షేత్రం,
శ్రీవైష్ణవదివ్యదేశాల్లో సర్వోన్నతమైన పుష్పమండప క్షేత్రం,
మహాయోగకారక క్షేత్రం,
మహాభోగకారక క్షేత్రం,
మహదైశ్వర్యప్రదాయక క్షేత్రం...

అట్టి శ్రీవైష్ణవసాలగ్రామశిలాన్విత మహాపుణ్యక్షేత్రాన్ని వారి మోకాళ్ళతో అధిరోహించి, భవిష్యద్ తరాలన్నీ కూడా శ్రీతిరుమలేశుడి శ్రీవైభవానుగ్రహన్ని అందుకొని తరించేందుకు తగ్గట్టుగా, వారు శ్రీపాంచరాత్రాగమప్రవర్తకులైననూ, దైవాజ్ఞ్య ప్రకారంగా తిరుమల శ్రీవైఖానస ఆచార వైభవానికి లవలేశమైననూ అసంబద్దమైన ఎట్టి అంశముచే ఎవ్విధంగానూ అనాచారదోషం సంక్రమించకుండా అత్యంత కట్టుదిట్టమైన శ్రీశ్రీనివాస ఆరాధనావ్యవస్థను అనుగ్రహించిన ఆచార్యశిఖామణులు శ్రీభగవద్రామానుజులు...!

అందుకే స్వామివారు శ్రీభగవద్రామానుజాచార్యులను వారి హృదయమండలానికి సమానంగా కొలువై ఉండేలా వ్యవస్థీకరించారు...
అనగా సరిగ్గా గమనిస్తే, కులశేఖరపడికి ఆవల కొలువైన మూలవర్ / స్వామివారి తిరుమేని యొక్క శ్రీవత్సచిహ్నభూషిత విశాలవక్షసీమ యొక్క హైట్ కి సమానంగా, స్వామివారికి ఎంతో ప్రీతికరమైన శ్రీమహాలక్షి ఆవాస స్థానమైన హుండి కి ఎదురుగా, శ్రీభాష్యకార్ల సన్నిధి కొలువై ఉంటుంది....
అని శ్రీచాగంటి సద్గురువులు నుడివినారు....
[
సాధారణంగా లోకంలో కూడా మనకు చాలా ఇష్టమైన వారి గురించిన ప్రస్తావన వచ్చినప్పుడు...
"ఓహ్ వారా...వారు ఎల్లప్పుడూ నా హృదయంలో ఉంటారండి..."  అనే పలికేది....

"నా హృదయంలో నిదురించే చెలి...
నీ హృదయంలో చోటిస్తావ మరి...
పల్లవిగా నను అల్లుకునే పాటే నీవైనావే..."
అనే ఒక సినిమా పాట కూడా వినే ఉంటారు కద....

ఇక్కడ చెలి అంటే కేవలం ఫ్రెండ్, లవర్, ఇత్యాది లౌకిక అర్ధాలే కాకుండా అత్యంత ఇష్టమైన వారు అనే అర్ధం కూడా అన్వయమౌను....
]

కలియుగప్రత్యక్షదైవమైన శ్రీశ్రీనివాసుణ్ణి ఎల్లరి భగవంతుడిగా, ఎల్లరికీ ఆరాధిత భగవణ్మూర్తిగా సువ్యవస్థీకరించి అనుగ్రహించిన అపర శ్రీఆదిశేషావతారులైన శ్రీభగవద్రామానుజుల అధ్యాత్మదీప్తి, సామాజికస్ఫూర్తి, విశిష్టాద్వైతతత్త్వద్యుతి, చిరంతనంగా వర్ధిల్లుతూ చిరస్మరణీయులైన వారి అనుగ్రహం విజ్ఞ్యులెల్లరి జీవితాలను సదా అనుగ్రహిస్తూ పరిఢవిల్లాలని
అభిలషిస్తూ....

ఆచార్య తిరువడిగలే శరణం...😊🙏💐

ఓం నమో భగవతేవాసుదేవాయ...
ఓం నమో నారాయణాయ...
ఓం నమో వేంకటేశాయ....

సర్వం శ్రీశ్రీనివాస శ్రీచరణారవిందార్పణమస్తు...🙏💐

Happy Birthday to you CBN sir. Stay happy and blessed...

1. A clean and green environment conscious dignitary that has created many mini urban forests via various "Janmabhoomi" initiatives during first and second term chief ministerial service to the then united AP.

[ During our school days, dedicated sapling plantation drives were held as a part of the "Janmabhoomi" initiative, and those plants are now huge trees in the children's park / play area near our Rajadhani School premises. ]

2. A visionary leader that has transformed the global image of Hyderabad from a cosmopolitan city to an internationally revered global city with the initiative of "Hyderabad Information Technology and Engineering Consultancy City" / "HITEC" city project that has subsequently made several MNC's to queue up with their IDC units in cyberabad creating several direct and indirect employment opportunities for the global Indian citizens.

[ During our school days, "HITEC city project" by my classmate Pala Naveen Kumar and his team 
won the first prize and "Nagarjuna Sagar Dam & it's Hydro Electric Power generation" project by Aitha Vinay Kumar and my team won the second prize  for the best creative artifacts in the science fair held ]

3. An executive statesman of the Indian polity who knows the value and importance of maintaining cordial equations with multiple global teams and prudent peers to sustain and improve the well being of the state and that of the citizens.

4. A balanced professional and prudent industrialist who knows the difference between growth and development and adjusts the executary knob towards the latter for everyone's well-being with the consensus of the prudent stakeholders and other able executives.

5. An achieved leader with many successful signature executions who is now resiliently focused on the development of "Amaravati", the budding capital city of Andhrapradesh and a stable icon for it's identity of respect and dignity of governance, in the fourth term chief ministerial service to the present demerged AP, in-order to efficiently collaborate with several elite cities of India to foster various global development and local growth equations.
Our Hyderabad and Telangana too shall have their own benevolent equations intrinsic to the development of Amaravati right from improved faster national connectivity to increased and economic availability of various imported goods and services via AP ports besides many other projects of well being that shall greatly benefit Hyderabad in a positive way.

Wishing a very happy and accomplished birthday to hon'ble chief minister of Andhrapradesh, Shree Nara Chandrababu Naidu gaaru...😊💐
May God bless you with much more strength and good health for a brighter journey ahead...

Happy Birthday to you CBN sir. 
Stay happy and blessed...!

ShreeParaabhava 2026 upcoming Vaishaakha Pournami / Shree Taallapaaka Annamaachaarya's 618th Jayantyutsawam wishes to all one and all... 😊💐


Shree Taallapaaka Annamaachaarya padakavitaa saahityam has revolutionized the modern day bhakti movement with an elite form of worship for that some of the most pristine and celebrated rare spiritual philosophical gems are studded in the mighty exquisite Sankeertanams of lord Shree Venkateswara of thirumala and the study / recital of the same has been considered as "vividha yagnya phala daayaka aaraadhana visheasham" in this highly materialistic kaliyugam by considering ShreeHari sankeertanam as the 5th vedam blessed to the Kaliyugam that can be studied / recited by any and every prudent person...

ప|| చాలదా మాజన్మము నీ- | పాలింటివారమై బ్రదుకగగలిగె ||

చ|| కమలాసనాదులుగాననినీపై | మమకారముసేయ మార్గము గలిగె |
అమరేంద్రాదులకందరానినీ- | కొమరైన నామము కొనియాడగలిగె ||

చ|| సనకాదులును గానజాలనినిన్ను | తనివోవ మతిలొన దలపోయగలిగె |
ఘనమునీంద్రులకు నగమ్యమైవున్న- | నిను సంతతమును వర్ణింపగలిగె ||

చ|| పరమమై భవ్యమై పరగిననీ- | యిరవిట్టిదని మాకు నెర్కుగంగగలిగె |
తిరువేంకటాచలాధిప నిన్ను యీ- | ధరమీద బలుమారు దరిసింపగలిగె ||

https://annamacharya-lyrics.blogspot.com/2007/03/146chalada-majanmamu.html?m=1

The above pristine Sankeertana highlights the magnanimity of lord Venkateshwara and that of the devotees who live by considering themselves as "Lord Shree Venkateshwara's parivaaram..."

Jaya and Vijaya, the security guards of lord Shree MahaaVishnu in the holy abodes of ShreeVaikuntham don't easily allow anyone to visit the SheshatalpaShayana ShreeMaahaVishnu without lord's pre-consent for various celestial reasons..

Even lord chaturmukhaBrahma gaaru does his daily worship of lord Shree Venkateshwara after the ekanta seva gets completed in the Thirumala AnanandaNilayam considering it as a great merit that isn't available regularly in the holy abodes of Shree Vaikuntham....
and that holy water is sometimes distributed to the devotees of the succeeding day's Suprabhata Seva Arjita ticket holders in the name of Brahmateertham...

Several lords always eagerly await the darshanam of lord Shree MahaaVishnu in the holy abodes of Shree Vaikuntham to extoll him with various mighty prayers in-order to receive the blessings of the lord and to revive their merit quotient significantly....
Such a mighty lord is available to all the devotees who sing the glory of Govinda naamam in ecstasy time and again....

Even the mightiest of the Brahamavettaas in this universe, the 4 Brahma maanasa putras namely,
Sanaka, Sanandana, Sanatkumaara, Sanatsujaata, were once denied to have the darshan of lord Shree MahaaVishnu by the dwaarapaalakas Jaya and Vijaya...
Such a mighty lord is available to all the devotees to sing the glory of his Govinda naamam with ecstasy and devotion time and again....

[ There is a great magnanimous Gnyaanaprada theertham named "SanakaSanandana Teertham" en route Tumburu kona, that blesses all the devotees, who savour it with faith and respect, with great supreme knowledge of the parabrahmatattwam.... ]

Several maharshis perform staunch penance to have a darshan of lord Shree MahaaVishnu to be blessed by him for the universal well-being...
Such a mighty lord is available to all the devotees to extol his meritorious glory time and again....

The highest and the mightiest realms of spirituality has donned the name and form of lord Shree Venkateshwara....
Such a pristine god of ShreeVenkatagiri blesses his darshanam multiple times to umpteen devotees with kindness towards their sincere devotion and staunch love of Govinda naamam....

May the devotional world swing in jubilance and bliss by chanting the names and glories of lord Shree Venkateshwara on the occasion of 
Shree Taallapaaka Annamaachaarya's 618th Jayantyutsawam celebrations being held all over the world....💐😊

ఒసగితివి అమరులు కూడా అచ్చెరువొందే శ్రీశ్రీనివాస దర్శనమంజరులను శ్రీవారిసేవగా భక్తభాగవతులతో అమరి 2 వారాలు నిను సేవించిన పుణ్యమును నీవే ఒసగి....

ఒనరించితివి శ్రీ తాళ్ళపాక అన్నమార్యుల అమరవందిత సంకీర్తనాసారస్వతామృతసుధానిధి అను జ్ఞ్యానప్రసాదమును, నీ ఆనందనిలయమునకు ప్రదక్షిణగా పొరలి నిను కీర్తించిన పుణ్యమును నీవే ఒసగి....

అనునయించితివి అనుంగుసఖునివలె అనయము నా తోడునీడవై, నా పురాకృత అఘములు నావారిగా ఉండి గావించిన నానాయాగితో నిద్ర కూడా కరువై కన్నీటిపర్యంతమై కూలిననాడు, నిను అనునయించిన ఫలమును నీవే అందించి....

అనుగ్రహించితివి కలనైనా కానని కడుమంచి ఇహపరసాధనములను, నీ దాసానుదాసులను ఆదరించుటకు, నిను సేవించుటకు, నేను తరించుటకు, నీ అనుగ్రహదొంతరలను నీవే నా యందు కటాక్షించి...

ఇక మిగిలింది నీ సేవాకైంకర్యడోలికల్లో విహరిస్తూ తరించే భక్తభాగవతోత్తములందరికీ శ్రేయస్సుని కూర్చే నీ శ్రీపాదసేవాభిజ్ఞ్యానానందసరముల అల్లిక.....
మరియు మేటి అధ్యాత్మవేత్తల / వాగ్గేయకారుల హృదిలో మెరిసిన నీ శ్రీతత్త్వవైభవవర్ణనాసరముల అల్లిక...

అనుగ్రహించి అందించవే శ్రీకైవల్యతీరాంచిత సుమధుర శ్రీతత్త్వభావవీచిక...
ఓ అద్భుత అమరవంద్య శ్రీవేంకటాచలస్థిత ఆశ్రితపారిజాతమల్లిక...

సర్వం వక్షస్థల శ్రీవ్యూహలక్ష్మీదేవి సమేత శ్రీతిరుమలేశ శ్రీచరణారవిందార్పణమస్తు...

ఓం నమో వేంకటేశాయ...
OmNamoVenkatesaaya...😊💐🙏