Wednesday, June 12, 2019

Happy Birthday 2019 to Telangana Tiger Harish Rao anna ...:)

My friend Nagraj with one of the most admired leader of Telangana polity,
Shree Harish Rao gaaru, who has a great charisma in line to that of the yester years' people friendly politicians like Shree Aale Narendra ( well known as Tiger Narendra ), Shree Vaddepalli Narsing Rao ( fondly known as VNR, the founder Trustee of VivekanandaNagar SriVenkateshwara, SaiBaba, Ayyappa Temples), Shree P.Janardhan Reddy ( fondly known as PJR, the founder Trustee of Jubilee Hills' Peddamma Temple ) etc.....
శ్రీ హరీశ్ రావ్ గారిని ఒక నాయకుడి కంటే ఒక నేతగా చాలామంది అభిమానించడం మనం చూడొచ్చు.......ఆ రెంటికి చిన్న వ్యత్యాసం ఉంది...
" నయతి ఇతి నాయకః " అనే వ్యుత్పత్తి ప్రకారంగా నడిపించువాడు నాయకుడు... అని భావించినట్లైతే.....
ఆ నాయకుడు తన అనుచరగణమందరు కూడా తనను అనుగమించేలా దిశానిర్దేశంగావించి తన ప్రయాణాన్ని కొనసాగిస్తాడు...
అలా సాగే తన రాజకీయ ప్రస్థానంలో ఆ నాయకుడు ఒక్కోసారి, కేవలం తనయొక్క ఇష్టాలకనుగుణంగా రూపుదిద్దుకున్న తన మార్గాన్ని ఇతరులు గుర్తించడంలో వైఫల్యం చెందినా, లేదా అది అవలంబించడంలో తడబడినా, సదరు అనుచరులను వ్యక్తిగతకారణాల పేర దూరంపెట్టడమో లేదా పట్టించుకోకపోవడంతో కేవలం ఒక మంచి దిశానిర్దేశకుడిగా / శాసకుడిగా మాత్రమే ప్రజలు గుర్తుపెట్టుకుంటారు...
కాని ఒక నేత మాత్రం ఇంకో అడుగు ముందుకువేసి, తన నియోజకవర్గం / అనుచరగణం / ప్రజల యొక్క సకల శ్రేయస్సుకు తాను ఎల్లప్పుడు నేతృత్వం వహించి, ఒకవేళ ఎదైన కారణాంతరాలవల్ల తనవారితో అభిప్రాయభేదాలు వస్తే అవి ఏమిటో
ఎందుకో సరిగ్గ తెలుసుకొని సమీక్షించి పరిస్థితులను చక్కదిద్ది, ఇన్నాళ్ళు తనవారిగా ఉన్నవారిని ఒక్కసారిగా ఏవో అభిప్రాయభేదాలు అంటూ పక్కనపెట్టకుండా, తనదైన శైలిలో
సరిచేసి తనదారికి తెచ్చుకొని వారిని ఎప్పటిలాగే తనవారిగా తన విజయానికి కారకులుగా భావించి
ప్రజల మనసుల్లో మంచిస్థానాన్ని సంపాదించి చిరకీర్తిని ఆర్జిస్తూ తన ప్రస్థానం కొనసాగించే వాడు...
అటువంటి కోవకు చెందిన ఈకాలపు నేతల్లో ఒకరైన శ్రీ హరీశ్ రావ్ గారికి, ప్రజలతో మమేకమై ఉండే ప్రజానేతగా పేరుగడించిన మీ ప్రస్థానం సదా దిగ్విజయభరితమై కొనసాగాలని అభిలషిస్తూ, హార్దిక జన్మదిన శుభాభినందనలు...👏😊
Nagaraj Ponnala
Happy Birthday to Telangana Tiger Harish Rao anna

No comments:

Post a Comment