భూలోక వాసులైన మనుష్యులకు
హేమంత ఋతువు / మార్గశిర /పుష్య మాసం గజ గజ వణికించే చలికాలం.....
శ్వెట్టర్లు, బ్లాంకెట్ల కొనుగోలు దెగ్గర, మిర్చి బజ్జీల బండ్లదెగ్గర, అందరు వేచి ఉండే కాలం.....
భూభ్రమణానికి అతీతమైన కాలమానం గల వివిధ ద్యులోక వాసులైన దేవతలకు ఇది ఉషోదయ కాలం...
ఇంకా సింపుల్ గా చెప్పాలంటే....
మన చాంద్రమాన కాల గణన ప్రకారంగా ఏర్పడే
వసంత
గ్రీష్మ
వర్ష
శరద్
హేమంత
శిశిర
ఋతువుల్లో ఉండే చైత్రం మొదలు ఫాల్గుణం వరకు గల 12 మాసాల ఒక సంవత్సర కాలం దేవతలకు ఒక రోజు గా భావిస్తే.....
మార్గశిర మాసం 4 - 6 AM
పుష్య మాసం 6 - 8 AM
మాఘ మాసం 8 - 10 AM
ఫాల్గుణ మాసం 10 AM - 12 PM
చైత్ర మాసం 12 PM - 2 PM
వైశాఖ మాసం 2 - 4 PM
జ్యేష్ఠ మాసం 4 - 6 PM
ఆషాఢ మాసం 6 - 8 PM
శ్రావణ మాసం 8 - 10 PM
భాద్రపద మాసం 10 - 12 PM
ఆశ్వయుజ మాసం 12 PM - 2 AM
కార్తీక మాసం 2 - 4 AM
సో పైన ఇవ్వబడిన దేవతల టైంటేబుల్ ప్రకారంగా
ఆషాఢ శుద్ధ ఏకాదశి / తొలి ఏకాదశి / దేవ శయన ఏకాదశి నాడు అనగా రమారమి 7 - 7.30 PM ఆ టయింకి రాత్రి ఆరగింపు అయ్యాక " యోగనిద్ర " లోకి జారుకునే పరమాత్మ, కార్తీక శుద్ధ ఏకాదశి / దేవోత్థాన ఏకాదశి కి అనగా రమారమి 3 AM కి అలా వారి బ్రాహ్మీ ముహుర్తంలో మెల్ల మెల్లగా నిద్ర మేల్కొని మార్గశిర మాసం లో స్నానాదికాలు ముగించి రంగు రంగుల పట్టుపీతాంబరాలు ధరించి, కస్తూరి తిలకం దిద్దుకొని, ముచ్చటైన సుమసరాలను తులసీ మాలికలను అలకరించుకొని పుష్య శుద్ధ ఏకాదశి / వైకుంఠ ఏకాదశి / ముక్కోటి ఏకాదశి కి సర్వాలంకార శోభితుడై నయనమనోహరమైన తన దివ్య మంగళ సందర్శనాభాగ్యాన్ని శ్రీవైకుంఠ ప్రాకారాల్లో వేచి ఉండే ముక్కోటి దేవతాసమూహానికి అనుగ్రహించే రోజు......
అందుకే అది వైకుంఠ / ముక్కోటి ఏకాదశి గా పిలవబడింది.....
శ్రీ చాగంటి సద్గురువుల వివిధ ప్రవచనాలను సమన్వయం గావిస్తూ అంతర్ వివేచన సాగించే వారికి
ఈ " యోగనిద్ర" అంటే ఏంటో.....
ఈ " మేల్కోవడాలు" ఏంటో.....
ఈ " 33 కోట్ల దేవతలకు ఆ సకల దేవతాసార్వభౌముడు కొత్తగా "దర్శనం" ఇవ్వడమేమిటో
అనే అధ్యాత్మ తత్వసందేశం లభించే ఉంటుంది.....
అది సంక్షిప్తంగా ఈ క్రింది దేవకార్య సరళి అని భావించవచ్చు....
షడూర్ములు లేని తైజసాత్మిక దేహులైన దేవతలకు అసలు ఆకలి దప్పికలు ఉండి ఆరగింపులు స్వీకరించి నిద్రపోవడమేంటి...?
అసలు కనురెప్పలే వేయని అనిమేశులైన దేవతలు, దేవతా సార్వభౌముడైన శ్రీమహావిష్ణువు తిని తొంగోవడమేంటి...??
అనునిత్యము ధగ ధగ మెరిసే పరిమళభరితమైన, అసలు చెమటపట్టని దివ్యదేహులైన దేవతలు స్నానాదికాలు ముగించి మళ్ళీ లేచి కొత్త బట్టలు కట్టుకొని పౌడర్ సెంట్లు పూసుకొని తయారయ్యి దర్శనాలు ఇవ్వడమేంటి....??
ఇత్యాది విశేషాలను కొంచెం ఆధ్యాత్మిక దృక్కోణంలో తర్కించి చూస్తే, దేవకార్యాలకు ప్రతీకలుగా చెప్పబడే వాటి వెనక ఉన్న నిజమైన అసలు తత్వాన్ని మనం దర్శించగలం అనేది ఇక్కడి ఆంతరాధ్యాత్మిక సత్యం.....
అగ్జ్యానం 60 రకాలు విజ్ఞ్యానం ఒకే రకం అనే సామెత లా మనకు ఆహారం 60 రకాలుగా ఉండొచ్చు....
అన్నం, పప్పులు, కూరలు, రొట్టెలు, పండ్లు, వడియాలు, స్వీట్లు, ...........
అలా లిస్ట్ చెప్తూ పోతే అది తిరుమల సర్వదర్శనం లైన్ లా సాగుతూనే ఉంటుంది....
కాని దేవతలకు ఆహారం కేవలం ఒకే రకం.....
అది అగ్ని లో సమర్పించే యజ్ఞ్య హవిస్సు మాత్రమే.....
అదికూడా అందులో మనం పదార్ధం
( చెరువు) ఆవు నెయ్యితో ఇచ్చినందుకు కాదు......
ఆ పదార్ధానికి సుస్వర వేద స్వాహాకార రూపంలో మంత్ర శక్తి జతైన తదుపరి అది ఉద్దేశ్యించబడిన దేవతా ప్రీత్యర్ధమై వారికి అందివ్వబడి మనకు అనుగ్రహాన్ని ప్రసాదిస్తుంది....
స్వరం తెలిసిన సద్బ్రాహ్మనోత్తముల ద్వారా మనుష్యులకు మాత్రమే అలా చెయ్యగల అదృష్టం ఇచ్చాడు ఆ పరమాత్మ..... అందుకే వారిని భూసురులు అని గౌరవించేది....
ఎందుకంటే వారి స్వరంవినా అది దేవతా భోక్తం కానేరదు కాబట్టి..... మనం స్నానాదికాలు చేసి పట్టు పంచెలు కట్టి బొట్ట్లు పెట్టుకొని యజ్ఞ్యవేదిలోకి పదార్ధం నెయ్యితో కలిపి వేసినా అది దేవతలకు చేరదు....స్వరం జతకూడలేదు కాబట్టి....
మన ఇంట్లో 5 మంది భోజనం చేయాలంటే 5 కంచాలు కావాలి....
కాని దేవతలకు ఒకే యజ్ఞ్యవేది చాలు....
అదే సృక్కు అదే సృవం తో అదే నెయ్యి / అదే పదార్ధం అందులో వేసినా సరే, ఎవరిని స్వాహాకారంతో స్వాగతించి ఆ హవిస్సు సమర్పించబడిందో ఆ దేవతా శక్తికి అది సమర్పించబడి వారు అనుగ్రహం ప్రసాదించడం జరిగేది....
అక్కడెక్కడో ద్యులోకాల్లో ఉండే దేవతలకు ఇక్కడ మనం ఇచ్చే హవిస్సు అంత దూరం వెళ్ళి వాళ్ళ ఆకలి తీర్చి మనకు కావలసిన అనుగ్రహాన్ని ప్రసాదించడమా.....ఎంత విడ్డూరం ఇది....? అని నోరు వెళ్ళబెట్టవలసిన అవసరం లేకుండా ఒక చిన్న లౌకిక ఉదాహరణ ద్వార ఆ ప్రక్రియ వివరిస్తాను......
మీ కాలనిలో ఉండే ఒక చిన్న ఏటీయం లో ఎవరు ఏ బ్యాంకు కార్డు తీసుకెళ్ళినా వారి ఖాతలోని డబ్బులు వారు తీసుకుంటున్నారు కద....
ఎంత మంది ఎన్ని రకాల బ్యాంకు కార్డులు తెచ్చినా అక్కడి ఉన్నది ఒకటే ఏటీయం....
కాని ఆ నియమిత అంతర్జాల వ్యవస్థ ద్వార ఏ కార్డు ఏ బ్యాంకు కి చెందినదో ఆ బ్యాంకు ఖాతాలోనుండి ఆ వ్యక్తి కి సంబంధించిన ఏకౌంట్ నుండి మాత్రమే డబ్బులు జారి చెయ్యబడుతునాయి.......
అది కూడా ఆ కార్డుకు సంబంధించిన పిన్ నంబర్ ఎంటర్ చేసిన తరువాత మాత్రమే సదరు అకౌంట్ నుండి డబ్బులు అనే అనుగ్రహం పొందడం జరిగేది....
అంటే దీని అర్ధం అక్కడెక్కడో కొన్ని వందల వేలకిలోమీటర్ల దూరంలో ఉన్న బ్యాంకు సర్వర్ కి కన్నెక్ట్ అయ్యి ఆ బ్యాంకు బీర్వాల్లోని డబ్బులు మనకు ఇవ్వబడుతున్నాయా....??
కాదు కద...
కార్డు లోని evm చిప్ ని ఆ కంప్యుటర్ చదివిన తదుపరి అక్కడెక్కడో ఉన్న బ్యాంకు సర్వర్ కి కన్నెక్ట్ అయిన మాటనిజమే, కాని డబ్బులు మాత్రం మన ఎదుట ఉన్న మిషిన్ లోనుండే జారిచెయ్యబడుతునాయి....
ఆచ్చం ఇదేవిధంగా అక్కడెక్కడో ఊర్ధ్వలోకాల్లో ఉన్న దేవతాశక్తి తో స్వరం తో మనo కన్నెక్ట్ అయిన మాటనిజమే......కాని మనకు కావలసిన అనుగ్రహన్ని మన చుట్టూ ఉండే ప్రకృతి నుండే, మనము కోరుకున్న, మనకు శ్రేయస్కరమైన అనుగ్రహన్ని మన మేధో మండలాన్ని చదివే దేవతలు ప్రసాదించేది.......
మరి దేవతలు మనం స్వాహాకారంతో వేసే లౌకిక ఆహారాన్ని అంటే నెయ్యి / చెరువు ఇత్యాది పదార్ధాలను కేవలం చూడడమే తప్ప తినడం ఉండనప్పుడు అవి వేయడం ఎందుకోసము....?
అనే ప్రశ్న రావడం సహజమే....
అది ఎందుకు అంటే వాటిలో నిఘూడంగా
దాగున్న అమృతశక్తి ఆ పరిసరాల్లో వ్యాప్తి కావించబడి దాని వల్ల ప్రకృతి, ఆ ప్రకృతి వల్ల ప్రాణికోటికి వివిధ అగోచర మేలు జరగాలి కాబట్టి.....
"మాకు స్తోత్రాలు సిద్ధాంతాలు కాదు నాయన సైంటిఫిక్ గా చెప్పు..." అంటారా......అయితే వినండి......
సూర్యుడి నుండి స్రవించబడే అగోచరమైన అమృతశక్తిని తన శరీరంలో కొలువైఉండే సూర్యనాడి ద్వారా గ్రహించి అది తన పాల ద్వార స్రవించ గలిగే ఎకైక ప్రాణి గోవు......అందుకే పెద్దలు అన్నారు
" గావః విశ్వస్య మాతరః....." అని...
ఆ పాలు పెరుగుగా, పెరుగు వెన్నగా, వెన్న నెయ్యి గా మారినప్పుడు మాత్రమే ఆ పసుప్పచ్చని అమృతశక్తి మానవుల కంటికి కనిపించడం జరిగేది.......
మరియు అట్లే పౌర్ణమి చంద్రుడు తన షోడశకళలతో వినువీధిలో దేదీప్యమానంగా ప్రకాశించేటప్పుడు మాత్రమే స్రవించబడే అమృతశక్తిని ఒడిసిపట్టి తమలో ఓషధీ శక్తిగా నిక్షిప్తం చేసుకునేవి హవిస్సుకు మనం ఉపయోగించే ధాన్యములు మరియు నదీ జలములు......
సూర్య శక్తి ఆత్మ శక్తి, తన్మూలంగా ఆరోగ్య / బుద్ధి శక్తి కారకము......
చంద్రశక్తి మనః శక్తి కారకము.....
కాబట్టి సూర్య శక్తిని ఒడిసి పట్టిన ఆవు నెయ్యిని, చంద్ర శక్తిని ఒడిసి పట్టిన ధాన్యములను హవిస్సుకు చెరువుగా వాడి వాటి కలయికవల్ల ప్రభవించే సాటికేని అమృతశక్తి అటు దేవతా ప్రీత్యర్ధమై ఇటు సకల ప్రాణికోటికి శ్రేయస్కరమై వర్ధిల్లడం జరిగేది కేవలం యజ్ఞ్యం అనే వైదిక క్రతువులో మాత్రమే.......
ఇలాంటి ప్రక్రియకు సాటి రాగల సయిన్స్ / టెక్నాలజి మరొకటి లేదు....
ఉన్నా కూడా అక్కడ ఉదాత్త అనుదాత్త స్వరిత భరిత వైదిక స్వర శక్తి జతైనప్పుడు మాత్రమే దేవతాశక్తిని భూలోకానికి ప్రసరింపజేయడమనే ప్రక్రియ సంభవమయ్యేది .....
ఇది దేవతల ఆహారం వెనక ఉన్న అసలు విశేషం.......
ఇక దేవతల నిద్ర అనే సంగతికి వస్తే మనలా వారు గుర్రు పెట్టి నిద్రించి పక్కవారిని ఇబ్బంది పెట్టే రకం కాదు.....
వారి దేవతా స్వరూపం యొక్క గతి శక్తి , స్థితి శక్తిగా మారడమే దేవతలకు నిద్ర అనే ప్రక్రియ .....
అంటే their kinetic energy has been transformed into a special kind of potential energy that is temporarily shielded from being available in the usual form for a specific cosmic purpose....
( ప్రతి ఒక్క జీవుడి స్థితిగతులను క్షుణ్ణంగా అధ్యయనం చేయబడే ఆ cosmic process గురించి తర్వాత వేరే పోస్ట్లో రాస్తాను.....)
ఇక దేవతల నిద్రాహారాలు పూర్తి అయ్యాక మళ్ళి వారు స్నానాదికాలు ముగించి పౌడర్లు సెంట్లు రాస్కొని ఉత్తరాయణంలో అందరికి దర్శనాలుఇవ్వడం అంటే.....
సూర్యుడి చుట్టూ భూమి యొక్క గమనం వల్లే మనకు ఋతువులు ఏర్పడుతునాయి అనే సత్యం అందరికి తెలిసిందే.....
షడృతువుల కాలం పూర్తయ్యి మళ్ళీ కొత్తగా అదే సీసనల్ సైకిల్ మొదలవ్వడంలో మానవ శరీరం ఏవిధంగా వివిధ మార్పులకు లోనయ్యి రూపాంతరం చెందుతుందో.....
అట్లే దేవతల దేహాలైన శక్తివలయాలు కూడా కొన్ని మార్పులు చెంది వారి ఆరల్ మాగ్నిట్యూడ్ ( Aural Magnitude)..... ( each and every Aura around any entity in this Universe has a certain magnitude that keeps changing based on the various cosmic phenomenon it is subjected to ) లో ఏర్పడిన మార్పులను ఆ సంవత్సరపు దైనందిన కాల చక్రంలోకి స్వాగతించడం అన్నమాట.....
ఇదీ క్లుప్తంగా దేవతల యొక్క నిద్రాహారాలంకారాల గురించిన అధ్యాత్మ విషయవిశ్లేషణ.....😊
మరో కొత్త మకర సంక్రమణానికి సూర్యుడు పయనం అవుతుండగా, సకల లోకపాలకుడైన శ్రీమహావిష్ణువు తన నూతన వైశ్విక శక్తియుక్తులను ఈ ముక్కోటి ఏకాదశి / ద్వాదశి మహాపర్వ సమయంలో ఆ సూర్యభగవానుడికి ప్రసాదించి అందరికి అన్ని శ్రేయస్సులు కలుగజేయుగాక....😊
( ఏకాదశి అనగా ఆదేశమగుట.....
మురాసుర వధసమయంలో శ్రీమహావిష్ణువు యొక్క దివ్యదేహం నుండి ప్రభవించి ఒక ప్రశస్తమైన తిథి గా శాశ్వతంగా కొలువైఉండేలా వరాన్ని పొందిన ఏకాదశి
మన చాంద్రమాన పంచాంగంలోకి అత్యంత విశేషమైన 11 వ తిథిగా వచ్చి చేరిన ఆ వృత్తాంతం అందరికి తెలిసిందే కద...... )
కలియుగ వైకుంఠమైన శ్రీవేంకటాచలంపై కొలువైన స్వామి పుష్కరిణీ తీర్థరాజానికి ముక్కోటి తీర్థాలు వాటి యొక్క సూక్ష్మ శరీరాలతో వచ్చి చేరే తీర్థముక్కోటి ఉత్సవం మరియు నా చాంద్రమాన జన్మదినోత్సవం కూడా కావడం ఇవ్వాళ్టి ముక్కోటి ద్వాదశి పర్వ ప్రత్యేకం......😊
ఆ ముక్కోటి దేవతాగణములు భక్తభాగవతులెల్లరిని చల్లగా అనుగ్రహించి సదా కరుణించుగాక....
*********************************
శ్రీ వైకుంఠ విరక్తాయ స్వామిపుష్కరిణీ తటే
రమయా రమమాణాయ వేంకటేశాయ మంగళమ్.
శ్రీమత్సుదరజామాతృ మునిమానస వాసినే
సర్వలోక నివాసాయ శ్రీనివాసాయ మంగళమ్.
నమ శ్శ్రీవేంకటేశాయ శుద్ధజ్ఞాన స్వరూపిణే
వాసుదేవాయ శాంతాయ వేంకటేశాయ మంగళమ్.
మంగళా శాసన పరై ర్మదాచార్య పురోగమైః
సర్వైశ్చ పూర్వై రాచార్యై స్సత్కృపాయాస్తు మంగళమ్..... 🙏🙏🙏🙏🙏
*********************************
ఆ స్వామి పుష్కరిణీ తీర్థరాజ వైభవాన్ని అన్నమాచార్యుల వారు తమ ఈ క్రింది సంకీర్తనలో ఎంత ఘనంగా పొందుపరచారో కదా... 😊
ప|| కంటి నఖిలాండ (తతి) కర్తనధికుని గంటి | కంటి నఘములు వీడుకొంటి నిజమూర్తి గంటి ||
చ|| మహనీయ ఘన ఫణామణుల శైలము గంటి | బహు విభవముల మంటపములు గంటి |
సహజ నవరత్న కాంచన వేదికలు గంటి |
రహి వహించిన గోపురములవె కంటి ||
చ|| పావనంబైన పాపవినాశము గంటి |
కైవశంబగు గగన గంగ గంటి |
దైవికపు పుణ్యతీర్థములెల్ల బొడగంటి |
కోవిదులు గొనియాడు కోనేరు గంటి ||
చ|| పరమ యోగీంద్రులకు భావగోచరమైన |
సరిలేని పాదాంబుజముల గంటి |
తిరమైన గిరిచూపు దివ్యహస్తము గంటి |
తిరు వేంకటాచలాధిపు జూడగంటి ||
No comments:
Post a Comment