Vinay Kumar Aitha's Personal blog. :)
Viewers may feel free to read thru / copy from / comment on any of my posts as I draft/save them for universal peace.. :)
Wednesday, February 26, 2020
Wishing one and all a very Happy MahaaSivaraatri 2020.... :)
Monday, February 17, 2020
" శ్రీరామజయం.....! " :)
మరియు ఇతరత్ర వ్రాతప్రతుల యందుకూడా ఉండడం చాలామందికి గుర్తుండే ఉంటుంది........
మా తాత, పితామహులు కీ.శే శ్రీ అయిత హనుమయ్య గారు ప్రతినెల కొడుకులకు యోగక్షేమాలు విచారిస్తు ఉత్తరాలు వ్రాసే ఆ రోజుల్లో మా తాత కూడా
" శ్రీరామజయం " అని మొదలుపెట్టి మిగతా అన్ని సంగతులు వివరంగా వ్రాసే ఆ శైలినే నేను కూడా అవలంబించి కొందరు ఫ్రెండ్స్ కు / చుట్టాలకు అదేవిధంగా వ్రాసేవాడిని......😊
ఇక్కడ అంతా క్షేమము.....మీరు కూడా క్షేమమేని భావిస్తున్నాను.... ఈ నెల నీ 200 రూపాయల మని యార్డర్ కొంచెం ఆలస్యంగా చేరినది.....
మీ అమ్మ నాగమ్మకు కొన్ని మందులు ఎక్కువ కొనడం వల్ల ఈ నెల ఖర్చులు కొంచెం ఎక్కువైనవి......కాబట్టి వచ్చేనెల అందరు కూడా ఇంకో 50 రూపాయలు ఎక్కువ పంపించగలరు.....
ప్రత్యేకమైన ఆయుర్వేదవనమూలికలతో గుమ్మడిహల్వా తయారు చేసి రోజు మీ అమ్మ నేను తీసుకుంటున్నాము....కావలసినవారు వచ్చి తీస్కెళ్ళవచ్చు......
.
.
.
.
************************
అంటూ అలా అన్ని సంగతులు కూడా విపులంగా రాసే మా తాత శైలిలోనే నేను కూడా కొత్తగుడెంలో ఉండే మా అమ్మమ్మ వాళ్ళింటికి, చుట్టు ఉండే ఇతర ఫ్రెండ్స్ కి ఉత్తరాలు రాసే వాడిని.....😊
అది తినడానికి కూరగాయల్లో కూడా ఎప్పుడు మాఇంట్లో వాడలేదు కాబట్టి గుమ్మడి కేవలం ఇంటిముందు వేలాడదీయడానికి తప్ప మరెందుకు ఉపయోగించబడనిది అని అనుకున్న నాకు, జమ్మికుంటలోని మా నానమ్మ ఇంటికి వెళ్ళినప్పుడల్లా అక్కడ తాత తయారుచేసే ఆ బూడిదగుమ్మడిహల్వా నాకు ఎప్పుడు ఒక వింతగానే అనిపించేది.....
వస్త్రాలు నేసేందుకు వాడే దారం తయారి మిషన్లు గవర్నమెంట్ అందరికి ఇవ్వగా... ఇంటిపనులు పూర్తి అవ్వగానే అందరు వాటిని తిప్పుతూ బిజీగా ఉండేవారు.......
" ఏమోరా విన్నిగా......మాకు ఈ దారం మిషన్లతోనే టయిం మొత్తం సరిపోతది..... ఆ కొత్తరకం హల్వాలు నేను ఎప్పుడు చేయలేదుర....
పెద్దనాన్న తెచ్చిన బన్నులు, బిస్కెట్లు అక్కడున్నాయి.....కావాలంటే అవి తిను కాని తాత కనిపెట్టే ఆ కొత్తరకం హల్వాలు తయార్ చేయమని అనకురా....." అంటూ నవ్వేది.....😁
హుమ్మ్.....ఐతే ఇగొ తీస్కొ..... "
అని కేవలం ఒక స్పూన్ మాత్రమే హల్వా పెట్టగా అది తిని బాగ నవ్వుకునేవాడిని......
తెలిస్తే నెలకొక జాడి హల్వా తెప్పించుకొని తినుండేవాడిని......😁
( సంపూర్ణరామాయణం ) ప్రవచనాలు శ్రద్ధాసక్తులతో ఆలకించినవారికి గుర్తున్నట్టుగా, నవవిధ భక్తిమార్గాల్లో దాస్య భక్తికి ప్రతీకగా ఉదహరించబడే హనుమంతుల వారికి సాటిరాగల శక్తి మరోకటి ఉండడం అసంభవం..... ఈ విశ్వంలోని ఏ శక్తినైనా సరే తనలోకి లయించి వేసే అపర రుద్రాంశసంభూతుడు హనుమంతులవారు......
( దక్షిణ దవడను ) గాయపరచగా
" హనుమ " అనే పేరుతో పాటుగా
అసలు ఆంజనేయుడిని కట్టడి చేయగల శస్త్రాస్తములు ఈ విశ్వంలోనే ఉండజాలవని సకలదేవతలు వాయుదేవునకు ఆనతివ్వగా.....ఆనాడే హనుమంతులవారు అప్రతిహత శక్తిపుంజంగా వినుతికెక్కారు.....
సీతారాములను ఒక్కటిచేయుటకై తన జీవితాన్నే అర్పించుకున్నందుకు చిరంజీవివై వర్ధిల్లమని శ్రీరాముడు ఆనాడు అయోధ్యలో వరమివ్వగా ఇక ఆనాడే సప్తచిరంజీవులలో కెల్ల అత్యంత శక్తిమంతుడై, శాశ్వతమైన శక్తియుక్తులకు భక్తిప్రపత్తులకు నెలవై హనుమంతులవారు కోరి కొలిచినవారికి కొంగుబంగారమై వర్ధిల్లుతున్నారు.......
శ్రీమద్రామాయణంలో ఎన్నో చోట్ల మనకు విశదీకరింపబడింది.....
" అక్షకుమారవధ " వృత్తాంతాం విన్న ఎవ్వారైనాసరే
గావించి ప్రార్ధిస్తే తెలిసేఉంటుంది ఆ తత్వరహస్యం....
కపీశమక్షహంతారంవందేలంకాభయంకరం...."
Archive link :
యెక్కడా హనుమంతుని కెదురా లోకము
అందరు దైత్యులచంపి హరిపేరైనాడు
అంది రుద్రవీర్యము తానై హరుడైనాడు
యెందునా హనుమంతుని కెదురా లోకము
చిక్కు పాతాళము దూరి శేషుడైనాడు
గక్కన వాయుజుడై జగత్ప్రాణుడైనాడు
ఎక్కువ హనుమంతుని కెదురా లోకము
మలసి మేరుపుపొంత సింహమైనాడు
బలిమి శ్రీవేంకటేశు బంటై మంగాంబుధి
ఇల ఈ హనుమంతుని కెదురా లోకము
************************
Many Happy Returns of the Day to Shree KCR, hon'ble Chief Minister..... :)
గౌ|| మాననీయ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు, మరెన్నో వసంతాలు జన్మదినవేడుకలు ఆయురారోగ్యైశ్వర్యాలతో జరుపుకుంటూ రాష్ట్రం అన్ని రంగాల్లోనూ ప్రగతిపథంవైపు పురోగమించి, ఈ దేశంలో సర్వోతోముఖాభివృద్ధితో వర్ధిల్లే రాష్ట్రాల్లోకెల్లా తెలంగాణ ఒక తలమాణిక రాష్ట్రంగా వెలిగేలా పరిపాలనను వ్యవస్థీకరించి, ఈ క్రిందపేర్కొనబడిన వాటిపై మరింత శ్రద్ధతో కట్టుదిట్టమైన చర్యలను తీసుకొని పౌరులందరికి అలనాటి శ్రీరామరాజ్యం లో ఉన్నవిధంగా రాజనీతిభరిత సుపరిపాలనను అందించి తరతరాలకు తరగని పేరుప్రఖ్యాతలతో చిరయశోభరితులై వర్ధిల్లాలని కోరుకుంటూ ఒక పౌరుడి హార్దిక జన్మదినశుభాభినందనాపూర్వక నమస్సులు....🙏👍👏🍨🍧🍕🍦😊
మరీముఖ్యంగా చిన్న/సన్నకారు/కౌలు రైతులకు, ఆర్థికంగా బడుగుబలహీనవర్గాలకొరకై ఉద్దేశ్యించబడిన పథకాల సొమ్ము ఆయా లబ్ధిదారులకు నేరుగా లభించేలా టెక్నాలజి ని విస్త్రుతంగా ఉపయోగించి అవినీతిని వీలైనంత ఎక్కువగా అరికట్టడం.....
( కరెంట్ కష్టాలు తీర్చినట్టే వీటిపై కూడా ప్రత్యేక శ్రద్ధచూపినచో ప్రజలందరికి బహులాభదాయకముగా ఉండును....)
మరీ ముఖ్యంగా వివిధ తప్పనిసరి ఫీజులపేరుతో హద్దెరగని రీతిలో దోచుకుంటున్న ప్రభుత్వేతర పాఠశాలలు / జూనియర్ కళాశాలలు
అన్నీకూడా ఒక నియమిత ప్రభుత్వనియంత్రిత వ్యవస్థకు లోబడి ఒక సమంజసమైన హద్దుదాటకుండా ఫీజులు తీసుకునేలా కఠినచర్యలను తీసుకొని విద్యార్ధుల భవితకు అండగా ఉండేలా విద్యావ్యవస్థను తీర్చిదిద్దడం......
ఈ రాష్ట్రం మీ త్యాగఫలం
ఈ అభివృద్ధి మీ ధక్షతకు నిదర్శణం
ఈ నేలకు మీరే శ్రీరామ రక్ష
తెలంగాణ జాతిపిత శ్రీ కేసిఆర్ గారు శతవసంతాలు చూడాలని మనసారా కోరుకుంటూ.. జన్మదిన శుభాకాంక్షలు
Friday, February 7, 2020
శ్రీహరి " అల వైకుంఠపురములో...."అసలు ఏం చేస్తూ ఉంటాడు.......??
శ్రీహరి " అల వైకుంఠపురములో...."
అసలు ఏం చేస్తూ ఉంటాడు.......??
శ్రీమహాలక్ష్మీ అమ్మవారు పాదసంవాహనం చేస్తుండగా, తన సహస్రఫణిమండలం తో స్వామి వారికి ఛత్రమై, చామరమై, పానుపై, పదపీఠమై, సేవించే ఆదిశేషుడి తో పాటుగా గరుడాళ్వార్ళు, విశ్వక్సేనులవారు ఇత్యాదిగా ఉండే నిత్యసూరులతో అలరారే ఆ అప్రాకృత దివ్యదేవపురమైన శ్రీవైకుంఠనగరిలో ఉండే స్వామివారి వైభవాన్ని సహజకవి శ్రీపోతనామాత్యులవారు తెనిగించిన శ్రీమద్భాగవతంలో సర్వస్యశరణాగతి గావించిన గజేంద్రుణ్ణి సమ్రక్షించుటకై తరలి వచ్చిన వైనాన్ని వివరిస్తూ రచింపబడిన ఈ క్రింది పద్యంలో చెప్పబడిందికద....
( శ్రీచాగంటి సద్గురువులు శ్రీమద్భాగవత ప్రవచనంలో చెప్పినట్టుగా అది సాక్షాత్ శ్రీరామచంద్రుడు ఘంటాన్ని చేబూని రచించిన పద్యం అని......
పోతనమాత్యుల పుత్రిక కు ఆ శ్రీరామచంద్రులవారు పోతన గారి
రూపంలో వచ్చి దర్శనం ఇచ్చిన సంఘటన అందరికి గుర్తే ఉండి ఉంటుంది.....
"శ్రీవ్యాస మహర్షి ప్రణీతమైన సంస్కృతమూలంలో గజేంద్రుడి మొరనాలకించి స్వామి వారు వచ్చి మకరిని సమ్హరించి కరిని కాపాడినట్టు మాత్రమే ఉన్న ఆ ఘట్టాన్ని ఏవిధంగా తెనిగించాలి అనే ఆలోచనలో ఉండగా ఏమి అర్ధంకాక అలా వెళ్ళి సంధ్యవార్చి వస్తానమ్మ అని వారి పుత్రికకు చెప్పి బయటికి వెళ్ళగా.....
అప్పుడు శ్రీరామచంద్రులవారే పోతనగారిలా కామరూపంధరించి వచ్చి, తను శ్రీవైకుంఠపురం నుండి గజేంద్రుడి ఆర్తికి పరుగుపరుగున కదలి వచ్చిన వైనాన్ని ఈ పద్యంలో రచించి వెళ్ళారు..... " అని తరతరాలుగా మన పెద్దలు చెప్పే అధ్యాత్మ సత్యాన్ని అవధరించిన వారెల్లరికి ఆ శ్రీహరి యొక్క భక్తవాత్సల్యం ఎంతటి ఘనమైనదో
తెలిసే ఉంటుంది.........
******** ******** ********
8-95-మ.
అల వైకుంఠపురంబులో నగరిలో నా మూల సౌధంబు దా
పల మందారవనాంతరామృత సరః ప్రాంతేందు కాంతోపలో
త్పల పర్యంక రమావినోది యగు నాపన్నప్రసన్నుండు వి
హ్వల నాగేంద్రము "పాహిపాహి" యనఁ గుయ్యాలించి సంరంభియై.
భావము:
ఆపదలలో చిక్కుకున్న వారిని కాపాడే ఆ భగవంతుడు ఆ సమయంలో వైకుంఠంలో ఉన్నాడు. అక్కడ అంతఃపురంలో ఒక పక్కన ఉండే మేడకు సమీపంలో ఒక అమృత సరస్సుంది. దానికి దగ్గరలో చంద్రకాంతశిలల అరుగుమీద కలువపూల పాన్పుపై లక్ష్మీదేవితో వినోదిస్తున్నాడు. అప్పుడు భయంతో స్వాధీనం తప్పిన గజేంద్రుడు కాపాడమని పెట్టే మొర విన్నాడు. గజరాజుని కాపాడడానికి వేగిరపడ్డాడు.
******** ******** ********
అసలు అలా శేషపర్యంక శయనుడై ఆదిశేషుణ్ణి పానుపుగా చేసుకొని పవ్వళించిఉండడం కేవలం ఏదో చల్లగా ఉన్న తెల్లని పరుపు పై పడుకోవడం మాత్రమేనా...??
లేదా అందులో మహోన్నతమైన అధ్యాత్మ తత్వసందేశం ఇమిడిఉన్నదా ?? అనే తత్వ చింతన గావించే వారికి బోధపడినట్టుగా.....
బ్రహ్మ విష్ణు మహేశ్వరులైన త్రిమూర్తులకు వారి వారి కర్తవ్యాలైన సృష్టి స్థితి లయ
అనే జగద్పరిపాలనా వ్యవస్థని విభాగించి అప్పగించిన ఆ ఆదిపరాశక్తి తననుండి వారికి కావలసిన శక్తి స్వారూపాలను సృజించి, అనగా
బ్రహ్మకు బ్రాహ్మి / శ్రీసరస్వతీ గా...
విష్ణువుకు శ్రీలక్ష్మి గా.....
మహేశ్వరునకు శ్రీపార్వతి గా....
ఇవ్విధంగా శక్త్యాంశలను సమకూర్చి తుదిమొదలు లేని ఈ కాలచక్రంలో నిరంతరం కొనసాగే విశ్వపరిపాలనను
వ్యవస్థీకరించడం అందరికి తెలిసే ఉంటుంది......
అందునా వీరిలో ఒకే శక్తికి ఇరు కేంద్రాలుగా ఉండే అన్నచెళ్ళెల్ల వ్యవస్థను శ్రీ చాగంటి సద్గురువులు తమ ప్రవచనంలో విశదీకరించడం కొందరికైనా గుర్తుండే ఉంటుంది.....
నల్లని విష్ణువు , పార్వతీ అన్నచెళ్ళెల్లు....
తెల్లని శివుడు, సరస్వతీ అన్నచెళ్ళెల్లు....
ఎర్రని బ్రహ్మ, లక్ష్మీ అన్నచెళ్ళెల్లు.....
అదేంటి బ్రహ్మ గారు శ్రీమహావిష్ణువు యొక్క నాభికమలమునుండి ఉద్భవించినందుకు ఆయన్ని శ్రీమహావిష్ణువు యొక్క కొడుకుగా, సరస్వతీ మాతను కోడలుగా చెప్తుంటారుకదా.....
మరి పైన చెప్పిన చుట్టరికంప్రకారంగా బావాబామ్మర్దులు తండ్రీకొడులు అవ్వడం ఏంటి....?
అత్తాకోడళ్ళు వదినామరదలు అవ్వడం ఏంటి...?
ఇదంతా బాగ కంఫ్యూసింగ్ గా ఉంది అని
అనుకుంటారేమో.......
ఇదంతా బాగ కంఫ్యూసింగ్ గా ఉంది అని
అనుకుంటారేమో......
లౌకిక ప్రపంచంలో ఉన్నట్టుగా మన లౌకిక సంపదలను మాత్రమే పరిగణనలోకి తీసుకొని గౌరవించే బంధుత్వాలలా దేవతలవి కూడా అట్లే అనుకుంటే అలా కన్ ఫ్యూస్ అవ్వడం సహజమే......
నేను ఇదివరకే ఒక పోస్ట్లో దేవతలు అనగా వివిధ ప్రత్యేకతలు కలిగిన శక్తివలయాలు అని వారి గురించి వివరించాను......
అట్లే ఈ బంధుత్వాలు కూడా......
స్థితికారుడైన శ్రీమహావిష్ణువుకు
పార్వతీ అమ్మవారు చెల్లెలు అనగా.....
దాని అర్ధం ఆవిడ కూడా స్థితికారిణి అని.......
" స్థితికారకులు " అనే అధికారకేంద్రానికి ఉండే రెండు పరిపాలనా / నియంత్రణా / శక్తికేంద్రాలు......ఈ అన్నచెళ్ళెల్లు....
( ఇంకా సింపుల్ గా చెప్పలంటే మన లౌకిక ప్రపంచంలో
ప్రెసిడెంట్ / వైస్ ప్రెసిడెంట్
సీ.ఎం / డిప్యూటి సీ.ఎం
అని ఏవిధంగా ఐతే మనము ఒకేఅధికార కేంద్రాన్ని ఇద్దరు వ్యక్తులవద్ద ఉండేలా విభాగించామో....
అచ్చం అదేవిధంగా ఈ విశ్వాన్ని పరిపాలించే స్థితికారకశక్తి
పుం రూపంలో ఆరాధించబడినప్పుడు శ్రీమహావిష్ణువు / శ్రీమన్నారాయణుడిగా, స్త్రీమూర్తి రూపంలో ఆరాధించబడినప్పుడు పార్వతీ / నారాయణి గా ఉంటుంది....
అదే విధంగా సృష్టికారకులు, లయకారకులు గా ఉండే శక్తిస్వరూపాలుకూడా......
బ్రహ్మగారు / శ్రీమహాలక్ష్మీ గా,
సృష్టి ని సాగించడం....
శివుడు / సరస్వతిగా లయనుగావించడం.....
" అదేంటి బ్రహ్మగారు మాత్రమే సృష్టి ని రచించేది అని విన్నాము....
అందులో శ్రీమహాలక్ష్మీ అమ్మవారి పాత్ర కూడ ఉందని ఎక్కడ వినలేదే......" అని అంటారేమో....
శ్రీచాగంటి సద్గురువులు ప్రవచనంలో ఒకచోట చెప్పారు ఆ విషయాన్ని.....
పుర్రెలపై నుదుటి రాత రాసేటప్పుడు
బ్రహ్మగారు అడుగుతారు శ్రీమహాలక్ష్మీ అమ్మవారిని .....
"ఈ జీవుడికి లక్ష్మీ కటాక్షం ఎంత రాయాలి....? " అని
అప్పుడు అమ్మవారు......
" ఓహ్.....ఆ జీవుడా..... ఎందరో భక్తభాగవతులకు, సాధుసత్పురుషులకు దానధర్మాలు చేస్తు బ్రతికిన జీవితం.....
ఈ జన్మలో నా కటాక్షం అంతకు వంద రెట్లు వేసి......
అపరకుబేరుడై వర్ధిల్లే లా రచించు వాడి లలాటలిఖితాన్ని....."
అని ప్రసన్నంగా జవాబివ్వడం....
లేదా.....
" ఓహ్.....ఆ జీవుడా.......వాడికున్న ఐశ్వర్యంలో వీసమెత్తైనను పాత్రతనెరిగి దానధర్మాలు చేయకుండా, భక్తభాగవతులను ఆదరించకుండా, తిని ఊరిమీదపడితిరగడం కోసం మాత్రమే వాడి ఐశ్వర్యం ఉపయోగించుకున్నాడు......
కాబట్టి లవలేశమైనను శ్రీకటాక్షం దరిచేరని దౌర్భాగ్యజీవితమే వారికి తగును...."
అని తన భ్రుకుటి ముడిపడేలా చూస్తుందంట......
అవ్విధంగా శ్రీమహాలక్ష్మీ అమ్మవారు సదరు జీవుడి ఐహిక స్థితిగతులను రచించినట్టే కదా మరి......
అందుకే ఈ లోకంలో ఒక సామెత.....
" పెట్టిపుట్టాడండి....అందుకే అంతటి సిరిగలవారింట్లో సంపన్నమైన జీవితం వారిది......."
అచ్చం అదేవిధంగా లయకారకులైన శివుడు , సరస్వతీ అమ్మవారు.....
" అదేంటి రుద్రుడిగా శివుణ్ణి లయకారకుడిగా విన్నాం కాని......
సదరు జీవుడి యొక్క సరస్వతీ కటాక్షాన్ని శాసించే ఆ విరించి యొక్క సతీమణి లయకారిని గా ఉండడం ఎక్కడా వినలేదే......." ?
అని అంటారేమో.....
జ్ఞ్యాన దాయకులైన శివుడు, సరస్వతీ అమ్మవారు ఇరువురు కూడా జీవుల మేధోమండలానికి అధిదేవతలు......
"శివాజ్ఞ్య లేనిదే చీమైనా కుట్టదు...." అనే సామెత ఇందుకే....
ఒక చీమకు కుట్టాలి అనే తలపు రావలంటే అసలు దాని బుర్ర పనిచేసి....
"మనకు హానికలిగించడానికి ఎవరో మీదికివస్తునారు......కాబట్టి వారిని కుట్టి మనం జాగ్రత్త పడాలి...." అనే ఆలోచన వచ్చినపిదప ఒకరిని కుట్టేది కద......
అనగా చీమ స్థాయిలో అది ఆ సదరు జీవుడి యొక్క లయప్రక్రియకు కారణం ఆ ఆలోచన కలిగించిన శివానుగ్రహం.....
అసలు శివానుగ్రహంలేనిదే ఒక్క అక్షరం ముక్కకూడ రాయలేము, పలకలేము........
అందుకే పిల్లలకు అక్షరాభ్యాసం జరిగేటప్పుడు అర్చకులు వారితో.....
" ఓం నమః శివాయ సిద్ధం నమః....."
అని తొలిపలుకులు దిద్దించేది..... అది బాసర సరస్వతీ ( వాసర పీఠం ) ఆలయంలోనైనాసరే రాయించేది మాత్రం అదే శ్లోకం......!
అసలు లయం అనగా ఏమిటి....?
అనే ప్రశ్నకు సరిగ్గా సమాధానం అర్ధమైననాడు ఆ సరస్వతీ మాత కూడా లయకారిణి ఎట్లైనది అనే ప్రశ్నకు సమాధానం అర్ధమైనట్టే....
లయం అనగా ఏమి ఉండని స్థితి.....
అనగా అన్నీ లుప్తమైన శూన్య స్థితి...
లేదా అన్నీ జీర్ణమైన పూర్ణస్థితి....
అనగా ఏమి తెలియని అజ్ఞ్యాన స్థితిలో జీవించడం శూన్యమైన స్థితిలో బ్రతకడం తో సమానం......అనగా ఆ జీవితం లయమైన జీవనంతో సమానం.....
మరియు ఏమి తెలియవలసిన / తెలుసుకోవలసిన అవసరంలేని జ్ఞ్యానాజ్ఞ్యానవిరహితమైన పూర్ణస్థితిలో జీవించడం కూడా లయమైన జీవనంతో సమానం.....
మొదటిది జ్ఞ్యానలేమి వల్ల సంభవించిన అచేతనాత్మక లయం...
రెండవది పరిపూర్ణజ్ఞ్యాన భరితమైన జీవనం తదుపరి సమకూరిన జ్ఞ్యానాజ్ఞ్యానవిరహితమైన
సంపూర్ణచేతనాత్మక లయం......
( శ్రీ అరుణాచల రమణులు ఉండే తురీయ స్థితిలా..... )
సదరు జీవుడి యొక్క ఈ రెండు స్థితులను శాసించేది
జ్ఞ్యానదాయకులైన శివ / శ్రీవాణీ
కాబట్టి ఆ ఇరువురు కూడా లయకారకులే......!
సృష్టి / లయం ఈ రెండు సాధారణంగా ఎవ్వరు పెద్దగా పట్టించుకోని స్థితులు.......
సృష్టి ----- జరిగింది కాబట్టి అక్కడ జీవుడికి ఉన్న పని ఏమిలేదు...... ఉన్నది ఉన్నట్టుగా అంగీకరించడం మినహ......
లయం ----- జరిగిపోయింది కాబట్టి.... ఇక్కడ కూడా జీవుడికి ఉన్న పని ఏమిలేదు...... ఉండకుండాపోయినది / లేనిది
లేనట్టుగా అంగీకరించడం మినహ......
ఇక అందరి గోల మిగిలిన " స్థితి " అనే ప్రక్రియ గురించే.......
అందుకే కదా మరి నారాయణ / నారాయణి ఇద్దరు అన్ని అవతారలు ఎత్తి స్థితికారులై అందరి యోగక్షేమాలు చూస్తు అన్ని పనులు చక్కబెట్టేది....!
అంటే శేషపర్యంకశయనుడై అలా ఆలోచిస్తూ ఉండడమో / లేదా యోగనిద్రలో ఉండడం మాత్రమే శ్రీమహావిష్ణువు యొక్క స్థితికారకత్వానికి సూచికయా...?
అని కాదు......
ఆయన ఆలోచించేది నాలాంటి ఒక సదరు వ్యక్తి లా......
" ఈసారి ఏ మామిడి కాయలు బాగా తిందాం....
కొబ్బరిమామిడికాయలు ఏ సంతలో దొరుకుతాయి....." వంటి విషయాలగురించి మాత్రమే అనుకుంటే అది పెద్ద విశేషమేమి కాదు.....
కాని ఆయన నిరంతరం సమాలోచనగావించేది యావద్ విశ్వపరిపాలన గురించి.....
ఆయన యోగనిద్రలోకి వెళ్ళేది ఏ జీవుడి ఆర్తికి తగినట్టుగా ఆ జీవుడిని ఉన్నతమైన దైవికమార్గంలోకి నడిపించి, వారి జీవితాలను సర్వతోముఖాభివృద్ధితో పరిపూర్ణంగావించడానికి తగు రీతిలో వారి స్థితిని ఉద్ధరించడానికి భక్తభాగవతుల సమాశ్రయణం గావించడం కొరకు.....
ఆదిపరాశక్తిచే ఆయనకు ఒసగబడిన విహితధర్మం అది....
అంటే మనం కూడా అలా చల్లగా ఉండే తెల్లని హంసతూలికా శయ్యలపై
పరుండి ఆలోచిస్తే అది కూడా విశ్వపరిపాలనం గురించే..... అనొచ్చా...... అని అడిగితే.....
స్థితికారుడిగా ఒక రాష్ట్రాన్ని చక్కబెట్టే ముఖ్యమంత్రి మరియు ఇతర అమాత్యులు వారి వివిధ విహితధర్మాలైన కార్యాచరణకొరకు వారి ఆఫిస్లో ఏర్పాటుచేసుకున్న పోష్ కుర్చీలు తెచ్చుకొని వాటిపై కూర్చున్నంతమాత్రాన మనం వారైపోము కద......
వారి మర్యాద కొద్ది మనల్ని ఆహ్వానించి వారి సీట్లో మనల్ని వారే కొద్దిసేపు కూర్చొమ్మన్నాసరే
మనము వారిలా ఆలోచించి రాష్ట్రాన్ని నడిపిస్తున్నాము అని కాదుకద అర్ధం......
విద్యా, లౌకిక ధనం, ఇత్యాదివి మనకు మనమే సముపార్జించుకునే సంపదలు....
కాని " అధికారం " అనేది నీ పై అధికారులు నీకు కట్టబేట్టే లౌకిక సంపద.....
కాదు కుదరదు....నాకు నేనే తురుంఖాన్, తీస్మార్ఖాన్, తోప్,
అని అనుకుంటే నీకు నువ్వుగా యజమాని అయిన ప్రాంతంలో అనగా నీ ఇంట్లో, నీ దోస్తుల మధ్య కాలర్ ఏగరేసి జీవించు......
అంతే కాని నేనుచెప్పినట్టే నా పైఅధికారులు వినాలి అని అనడం, అనుకోవడం మూర్ఖత్వమవుతుంది......
అయినాసరే నేను మూర్ఖుడను అంటూ నీ కింద ఉండే కార్యకర్తలను బాధిస్తు, నీ పైన ఉండే అధికారులను బాధిస్తు, నేనే సీ.ఎం, నేనే పీ.ఎం లా ఉండి వినని వారిని బాధిస్తాను అంటే అది నీ హద్దెరగని గర్వానికి, నీ స్వయంప్రకటిత అధికారదాహానికి, నీ బుద్ధిలేమికి కొలబద్ద అవుతుందికాని మర్యాద అనిపించుకోదు......
గవర్నర్, సీ.ఏం గౌ || శ్రీ కే.సీ.అర్, గారు మరియు మిగతా సచివులు ఇత్యాదిగా ఉండే అధికార/పరిపాలక విభాగ గణమందరు వ్యవస్థ ఇలా ఒకలా ఉండాలి అని తీర్మానం చేస్తుంటే.... నువ్వు కొత్తగా మధ్యలో దూరి నేను చెప్పినట్టే మీరందరు వినాలి అని గోల చేస్తే....
ముందు మర్యాదగా చెప్తారు...
" నీ పై ఉన్న అధికారులు వాళ్ళ పని వాళ్ళు చేస్తున్నారు....వాళ్ళు నీకు చెప్పిన పని నువ్వు చేసి సంస్థ యొక్క ఆశయాలకు అనుగుణంగా నీ వైఖరి ఉండేలా నిన్ను నువ్వు సరిదిద్దుకో....." అని.....
ఆ తర్వాత ....
" నేనే బాసును..నేనే అన్నిటికి హెడ్డు....."
అని నీకు చెప్పబడని, నీకు ఇవ్వబడిన స్థాయికి తగని రీతిలో నువ్వు ఇతరులను ఇబ్బంది పెట్టేలా నీ సొంత దుకాణం పెట్కొని నడుపుతా అంటే.....
పార్టీలో ఉండి, పార్టి యొక్క ఆశయాలకు, మ్యానిఫెస్టొకు, అధికారగణానికి, విరుద్ధంగా ఉండి అందరిపైకి అరుస్తూ ఉంటాను అంటే..... "వెళ్ళి నీ సొంతదుకాణం పెట్టుకొని అక్కడ అందరిపై అరువుపో....."
అని జవాబిస్తారు.....
" Power never shouts on others.....
It only makes a firm statement ( when it is really required ) , that needs to be adhered to by everyone who belongs to that segment being lead by that power.........."
నలుగురిలో నువ్వు గొప్ప అవ్వాలి అంటే నీ పైఅధికారులు నువ్వు గొప్పోడివి అనేలా నీ కార్యాచరణ ఉండాలి....
అంతేగాని నీకు అధికారం కావాలి కాబట్టి అందుకోసం అందరిపైకి అరిచి సాధిస్తా అంటే నువ్వు హిట్లర్ అవుతావుతప్ప, లీడర్ కాలేవు.....
అనువుగానిచోట అధికులమనరాదు....
అనే సామెతను గౌరవించి, నువ్వున్న దేశకాలమానములను గుర్తించి మసలుకోవడంలో నీకు గౌరవం లభిస్తుంది కాని......
అందరిపైకి అరుస్తూ ఉంటే నిన్ను అధికారి అనరు.....
అధికప్రేలాపి అనిమాత్రమే అంటారు.......
నువ్వు పనిచేస్తున్న సంస్థలో కష్టించి అందరి మన్ననలను పొందుతూ ఒక గొప్పస్థాయిలో ఉండాలని ఆశించు.....అది ఆత్మవిశ్వాసం అనిపించుకుంటుంది....మరియు అది జవాబుదారిగా ఉండడం అని అంటారు....
కాని ఆ సంస్థను / సంస్థలోని బృందసభ్యులను కేవలం నీ అధికారదాహం తీర్చే ఒక ఊటబావిగా భావించి వారిని ఎంతోకఠినంగా పరుషపదజాలంతో దూషించి, అది తీరకపొయేసరికి నీ ప్రయాస ఎండమావి లోని జలపానంలా మారగా ఆ అక్కసు చుట్టూ ఉన్నవారిపై వెళ్ళగక్కడం విజ్ఞ్యత అనిపించుకుంటుందా....?
లేదా అనవసరంగా వివాదాలను కలిగించి అందరి మనఃశాంతిని హరించే మూర్ఖత్వం అనిపించుకుంటుందా....?
"నేను వయసులో నీకంటే ఇంత పెద్ద తెలుసా...."
అని అనడంలో పెద్దరికముండదు......
ఆ వయసుకు తగ్గట్టు బుద్ధిబలాన్ని / లౌక్యాన్ని ఆర్జించి, వయసుతో నిమిత్తం లేకుండా నీ చుట్టూ ఉండే అన్నివయసులవారితో, అందరితో కూడా ఆప్యాయతతో వ్యవహరించి పనులుచక్కబెట్టుకోవడంలోనే అసలైన పెద్దరికం దాగుంటుంది.....
అని తెలుసుకోవడమే అసలైన పెద్దరికం......
అలా మసలుకోగలిగిననాడు గౌరవం తనంతట తానే ఎరుపు రంగు గులాబి పువ్వుపై వచ్చివాలిన రంగురంగుల సీతాకోకచిలుకలా....,
దోరగాఉన్న గున్నమావిపై వచ్చి వాలిన పంచవన్నెల రామచిలుకలా......,
వచ్చిచేరి మీకీర్తిని మరింతగా ఇనుమడింపజేస్తుంది.....
మొన్న నేను, హరిత " అల వైకుంఠపురములో...."
సినిమా కి వెళ్ళినప్పుడు, మాస్ & క్లాస్ అందరిని సమంగా అలరించే అల్లు అర్జున్ పేక్యులియర్ యాక్టింగ్ తో పాటుగా, బన్ని ఇచ్చిన బంపర్ మెస్సేజ్ బినీత్ ద స్టోరీ లైన్ కి 'వాహ్ రె వాహ్' అని అనుకున్నాము....
అంతటి సంపన్నమైన రామచంద్రగారు
తన నిజమైన తండ్రని తెలిసినా,
సిరిగలవారింట్లో ఉండి సకల రాజభోగాలు అనుభవించవలసిన తన స్థానంలో తనకు ద్రోహంచేసిన డ్రామ తండ్రి యొక్క కొడుకు ఉన్నాసరే, ఆ సత్యాన్ని తనలోనే దాచుకొని, అటు ఇరుకుటుంబాల శాంతికి ఏమాత్రం భంగం కలగకుండా ఇటు తన అసలైన తండ్రికి కావలసిన సమ్రక్షణను తనదైన శైలిలో ఇచ్చేలా ప్రవర్తించి పనులు చక్కబెట్టుకోవడంలోనే విజ్ఞ్యత ఉంటుంది.....అని, అందుకు తగ్గటుగా తన కార్యాచరణ రూపొందించాడే తప్ప.....
అక్కడున్న ఎవరిపై కూడా ఇసమంతైనను తన ఆవేదనచ్ఛాయలు ప్రసరించనీయలేదు.....
( అంటే ఆ స్టోరి వ్రైటర్ కే అనుకొండి అసలైన క్రెడిట్ వెళ్ళేది..... )
అందుకే అన్నమాచార్యులవారు కూడా ఆ అప్రాకృతశ్రీవైకుంఠంలో తణుకులీనే శ్రీవైష్ణవదివ్యప్రభలను, సర్వవ్యాపకుడిగాఉండి కూడా సగుణసాకారపరబ్రహ్మంగా కొలువైఉండే ఆ స్థితికారక బ్రహ్మపదార్ధాన్ని ఎంతో వైభవంగా.....
" అణురేణుపరిపూర్ణమైనారూపము......"
అని కొనియాడిన సంకీర్తనలో ఆ సాటిలేని శ్రీవైకుంఠనగరిలో మెరిసే పరతత్వమే శ్రీవేంకటగిరిపై కొలువై మనందరికి ప్రత్యక్షదైవమై అలరారుతుందని బహుచక్కగా వర్ణించారు కదా...... 😊
**************************************
అణురేణు పరిపూర్ణమైన రూపము
అణిమాదిసిరి అంజనాద్రిమీది రూపము
వేదాంతవేత్తలెల్ల వెదకేటిరూపము
ఆదినంత్యము లేని యారూపము
పాదుగ యోగీంద్రులు భావించురూపము
యీదెస నిదివో కోనేటిదరి రూపము
పాలజలనిధిలోన (బవళించేరూపము
కాలపు సూర్యచంద్రాగ్నిగల రూపము
మేలిమి వైకుంఠాన మెరసిన రూపము
కీలైనదిదె శేషగిరిమీదిరూపము
ముంచినబ్రహ్మాదులకు మూలమైనరూపము
కొంచని మఱ్ఱాకుమీది కొనరూపము
మంచి పరబ్రహ్మమై మమ్మునేలిన రూపము
యెంచగ శ్రీవేంకటాద్రి నిదె రూపము
**************************************
http://annamacharya-lyrics.blogspot.com/2007/04/197anurenu-paripurnamaina.html?m=1