Wednesday, February 26, 2020

Wishing one and all a very Happy MahaaSivaraatri 2020.... :)

శ్రీశైలశృంగే విబుధాతిసంగే తులాద్రితుంగేపి ముదావసంతమ్
తమర్జునం మల్లికాపూర్వ మేకం నమామి సంసారసముద్ర సేతుమ్...... 🙏

అంటూ ద్వాదశజ్యోతిర్లింగ స్తోత్రంలో శివయ్యను స్తుతిస్తాం కద.....

ఘొరమైన సంసారసాగరతరణానికి 
చక్కనైన సేతువైన ఆ శివుడికి అత్యంత ప్రీతికరమైన అభిషేకకైంకర్యంలో నిన్నటి శివరాత్రిపర్వదినంలో అందరు పాల్గొని ఆ పరమాత్మ యొక్క అనుగ్రహాన్ని పొంది తరించిఉంటారు......

అలంకారప్రియోర్విష్ణుః
అభిషేకప్రియః శివః
నమస్కారప్రియః సూర్యః

అని కద మన పెద్దలు, శాస్త్రాలు మనకు సనాతనంగా బోధిస్తూ వచ్చారు.......

అదివిని పాటిస్తూనే ఉన్నాం.....
కాని  ఎందుకని అలా అని అసలు ఎప్పుడైనా ఆలోచించారా...??

శ్రీచాగంటి సద్గురువులు ప్రవచనాంతర్గతంగా తత్సంబంధమైన చాల విషయాలు మనకు తెలిపినారు కద......

అందులో కొన్ని ముఖ్యమైనవి అందరికి తెలిసే ఉంటుంది.......

శివలింగం నిరంతరం అభిషేకించబడుతూ ఉంటే లోకంకూడా అట్లే చల్లగా ఉంటుంది అని.... ( పైన ధారాపాత్ర పెట్టేది అందుకే కదామరి....)

అసలు లయకారకుడికి ఎందుకని అలా అభిషేకం అంటే ఇష్టం....?

స్థితికారకుడికి ఎందుకని అలంకారం అంటే ఇష్టం....?

సూర్యుడికి ఎందుకని నమస్కారం అంటే ఇష్టం...?

అనే ప్రశ్నలు మన లౌకిక ప్రపంచంలోని.....

" నాకు గులాబ్ జామూన్ అంటే ఎందుకు ఇష్టం...? "

" నీకు కాజు బర్ఫి అంటే ఎందుకు ఇష్టం ....? "

మొదలైన ప్రశ్నలలాంటివైతే మనం పెద్దగా పట్టించుకోనవసరం లేదనుకోండి.......

కాని మన సనాతన శాస్త్ర వాజ్ఞ్మయం, అది ఆపోశనపట్టిన సద్గురువులు ఏది చెప్పినా దాని వెనక ఎంతో గహనమైన విజ్ఞ్యానం దాగుంటుందని ఎల్లరికి విదితమే....

ఎవరి స్వాధ్యాయం కొలది వారు అది తెలుసుకొని ఆచరించి తరిస్తుంటారు కొందరు......

ఇంకొందరు అవి పెద్దగా తెలియకపోయినా భక్తి శ్రద్ధలతో / ధార్మికులైన సద్వర్తనులైన పెద్దల ఎడల గౌరవవిశ్వాసాలతో వారు చెప్పినవి త్రికరణశుద్ధిగా నమ్మి ఆచరించి తరిస్తుంటారు.......

వృత్తి పరంగా ఒక సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా నా పరిధిలో ఉండే ప్రతి అంశాన్ని ఎంత సునిశితంగా పరిశీలించి పరిశోధించి అమలుచేస్తానో.....

ప్రవృత్తి పరంగా ఒక ఆధ్యాత్మిక పరిశోధకుడిగా ప్రతి అధ్యాత్మతత్వ ప్రతిపాదితమైన విషయాన్ని కూడా  అంతే నిశితంగా పరిశీలించి పరిశోధించి తదనుగుణంగా అన్వయం చేస్కుంటాను నేను.....

ఏదో తినాలి కాబట్టి తినెయ్యడం లేదుకద తిళ్ళు....
మనకు ఇష్టమైనవి మన శరీరతత్వానికి సరిపడేవి కఫవాతపిత్త దోషాలు కలిగించి ఆరోగ్యాన్ని హరించకుండా మంచిచేసేవి మాత్రమే ఏరికోరి మరి తింటాము......

అట్లే అధ్యాత్మ కృతువులను కూడా ఏదో చేసేయ్యాలి కాబట్టి చేసేయ్యడం కంటే వాటిని అమూలాగ్రం పరిశోధించి తద్ప్రతిపాదితమైన ఆ పరతత్వాన్ని గ్రహించే విధంగా వాటిని ఆచారించడoన్లోనే వాటియొక్క నిజమైన విలువ దాగుంటుందని నా వ్యక్తిగత అభిప్రాయం..........

సరే ఇక విషయానికి వస్తే.......

శివుడు / మహేశ్వరుడు / రుద్రుడు / శంభుడు / శర్వుడు / ఈశ్వరుడు / ఇట్లా చెప్కుంటూ పోతే ఆయనకు ఎన్నో పేర్లు.........

కాని లయకారుడు అనగానే ఆ అన్ని పేర్లలో ప్రతిపాదించబడే పరత్త్వం శివుడు అని ఇట్టే చెప్పేస్తాం కదా......

అంటే అన్ని తనలోకి కలిపేసుకుంటాడు కాబట్టి లాయకారకుడు అని అభిషేకించడమా.....?

లేదా అభిషేకించకపోతే అన్ని తనలోకి లాగేసుకుంటాడన...?

ఒకపక్క బ్రహ్మగారు చక్కగా స్థితి చేస్తుంటే, శ్రీమహావిష్ణువు స్థితికారుడై ఆ సృష్టిని సమ్రక్షిస్తుంటే ఈయన లయకారుడై వాటన్నిటిని తనలోకి లయించడం ఎందుకు.....? అట్లే ఉండనివచ్చుకదా.....

అనే ప్రశ్నలు రావడం పరిశోధాత్మక దృక్కోణం గలవారికి ఉదయించడం సహజమే......

మనం నిత్యం చూసేట్టుగా శివలింగాకృతిలోనే ఆ లయకారుడికి అభిషేకాలు చెయ్యడం.....

శివలింగం నిజానికి శక్తి సహితమైన త్రిమూర్త్యాత్మక పరబ్రహ్మ సూచకం..... 
లింగాకృతిలో ఉండే యావద్ విశ్వాన్ని మన ఎదురుగా ఉండే శివలింగంలో దర్శిస్తూ ఆ పరమాత్మకు ప్రణమిల్లడమే పూజా అనే కృతువులోని అంతరార్ధం.......

కంటికి కనిపించేవి మాత్రమే నమ్ముతాము అనే పాశ్చాత్య ప్రపంచ భౌతికశాస్త్రవేత్తలు కూడా  నాసా వారి వివిధ ఖగోళపరిశోధనల్లో భగాంగా ముక్తకంఠంతో అంగీకరించిన సత్యం, మన భూమండలం ఉన్న సౌరమండలం లానే కొన్ని కోటానుకోట్ల సౌరమండలాలు ఈ విశాలవిశ్వంలో ఎన్నో ఉన్నాయి అని...
" ఇన్ని లైటియర్స్ దూరంలో ఫలాన పేరుతో ఉన్న ఒక బృహత్ నక్షత్రం కేంద్రంగా ఒక సౌరమండలం ఉండి దాని యొక్క ప్రభావం మన భూమి ఉన్న సౌరమండలంపై ఏవిధంగా ఉంది అనే......అంశంపై ఎన్నో వెస్టర్న్ జర్నల్స్ వ్యసాలను ప్రచురిస్తే అబ్బా ఎంత బాగున్నాయి వీళ్ళ పరిశోధనలు అని అంటాము.......

కాని అదే సత్యాన్ని మన అధ్యాత్మ శాస్త్రాలు....

" ఉన్మేషనిమిషోత్పన్నవిపన్నభువనావళిః....

అనేకకోటిబ్రహ్మాండజననీ దివ్యవిగ్రహ...."

అనే బ్రహ్మాండపురాణాంతర్గతమైన, సాక్షాత్తు వాగ్దేవతలు వెలయించిన  లలితాసహస్రనామాలకు భాష్యంగా గొప్ప ఔపాసనిక బలం గల తత్త్వవేత్తలు చెబితే......

" హుమ్మ్ ఎంటో...వీళ్ళు వీళ్ళ చాదస్తం...."
 అని పెదవి విరిచే వారికి అవి ఎంత చెప్పినా అర్ధంకావు.....
ఎందుకంటే ఒకవైపు సనాతన ధర్మం / శాస్త్రం పై విశ్వాసలేమి మరోవైపు
కేవలం ఆధునిక భౌతిక శాస్త్రాలే తప్ప ఆధ్యాత్మికతపై 
కనీస అవగాహన కూడా లేని జీవితాలు కావడం వల్ల ఆ అమోఘమైన విజ్ఞ్యాన సారస్వతం వారికి ఎల్లప్పుడు అందని ద్రాక్షే....!

ఒక సద్గురువు యొక్క నిర్హేతుక కరుణను సముపార్జించుకుంటే ఆ వైశ్వికవిజ్ఞ్యానానికి కొంతలోకొంతైనా వారు దెగ్గరై వాటిని అర్ధంచేసుకునే  భాగ్యం కలుగుతుందేమో.....

సరే ఇక శివలింగమే విశ్వంగా భావించి సేవించి అభిషేకించే పేక్రియ గురించి వస్తే ఈ క్రింది విషయాల వల్ల అది ఈశ్వరుడికి ప్రీతిపాత్రమై మనకు సకల ఈప్సితసిద్ధితమై వర్ధిల్లడం అనేది ఆ అధ్యాత్మ సత్యం.....

1. అభిషేకం అనగా పైనుండి పదార్ధాన్ని ఈశ్వరుడిపై అనగా శివలింగంపై జాలువార్చడం.....

( శాస్త్రసమ్మతమైన 
శుద్ధజలం, బిల్వోదకం,పుష్పోదకం, 
శుద్ధమైనగోక్షీరం / ఆవుపాలు,

ఆ పాలు కాచి తోడుపెట్టగా వచ్చిన
గోదధి, ఆ పెరుగు నుండి తయారుచేయబడిన వెన్నను కరిగించగా వచ్చిన గోఘృతం,

చెరుకుగడలనుండి వచ్చిన బెల్లం తో తయారుచేయబడిన చక్కెర,

వివిధ పండ్లరసాలు ఇత్యాదిగా ప్రకృతి మనకు ప్రసాదించే సత్త్వగుణప్రధామైన పదార్ధాలు , 

తుదకు 

విభూతి / గంధ లేపనంతో ఆ క్రతువు పూర్తి అవ్వడం.......

అనేది సాధారణంగా మనము చేసే అభిషేకప్రక్రియ......

ఏఏ పదార్ధాల వల్ల ఏఏ ఫలితాలు లభిస్తాయి ఇత్యాదిగా కొందరు చెప్పే వాటిని కాసేపు పక్కనపెట్టి, ఈశ్వర ప్రీత్యర్ధమై
కావించిన పదార్ధ పరమాత్మ సమ్యోగమే అభిషేకం......

ఇక్కడ గమనిస్తే ఉపయోగించిన అన్ని పదార్థాలు కూడా జలతత్త్వభరితమైనవి......

1. గోధుమలు, నువ్వులు, ఇత్యాది అన్ని పదార్థాలు కూడా నువ్వే స్వామి అంటూ
"గోధూమాశ్చమే.....తిలాశ్చమే...."
అని ఒక వైపు శ్రీరుద్రనమకచమకం పఠిస్తున్నాసరే ఈశ్వరుడిపైన / శివలింగంపైన సమర్పించేది మాత్రం
జలతత్త్వసంవృద్ధిగల పదార్ధాలుమాత్రమే......
( చివరన ఉండే ఆ విభూతిలేపనం కూడా సజలవిభూదిలేపనమే కద...)

" తత్త్ త్వమసి " అనే వేదవాక్యంలా,

" తత్త్ జలాన్ " అంటూ ఈశ్వరుడిని వేదం నమస్కరిస్తుందని కద శ్రీచాగంటి సద్గురువులు మనకు విశదీకరించింది....

అంటే కేవలం జలం మాత్రమే ఈశ్వరుడు, యావద్ విశ్వవ్యాప్తమైన పంచభూతాల్లోని మిగతావి

అనగా,

ఆకాశం
వాయువు
అగ్ని
పృథ్వి

ఈశ్వరుడు కాదని ఇక్కడ అభిషేకంలోని పరమార్ధం అని చెప్తున్నావా నాయనా అని అనుకోకండి.....

పిండాండమైన మన ఎల్లరి శరీరాల్లో ఉన్నది అవే పంచభూతాలు.....

అనేకకోటి బ్రహ్మాండాల్లో ఉన్నది కూడా అచ్చం అవే 
పంచభూతాలు.......

కాని వాటిలో ఒక్క జలతత్త్వం మాత్రమే ఈశ్వరుడిని జీవుడిని ఏకీకృతంగావించి తన్మూలంగ జీవాత్మ పరమాత్మ సమ్యోగమనే యోగప్రక్రియను మనలోనే స్థిరీకరించి మన 
పాంచభౌతికమైన మృణ్మయం లోనే ఆ అవ్యక్తమైన చిన్మయాన్మి జాగృతపరిచి

"ఒహో ఇదన్నమాట ' పరమాత్మ ' అనే పేరుతో వ్యవహరించబడే ఆ నిర్గుణ నిరంజన నిర్వికార నిర్వికల్ప అవ్యక్త అగోచర అమేయ అద్వంద్వమైన 
బ్రహ్మానుభవ స్థితి అనగా....."

అనే ఎరుక,
(  ' ఆత్మానుభవం ' అనే నామంతో వ్యవహరించబడే దైవిక స్థితిని ) మనలో కలిగించి మనకు సకల శ్రేయస్సులను కలిగించడమే అభిషేకం అనే ప్రక్రియ లోని అంతరార్ధం.....

జలతత్త్వం కాకుండా, 

మీరు ఆకాశం తెచ్చి ఆయనమీద జాలువార్చగలరా...?

మీరు గాలిని తెచ్చి ఆయనమీద జాలువార్చగలరా...?

మీరు అగ్నిని తెచ్చి ఆయనమీద జాలువార్చగలరా...?

మీరు పృథ్విని తెచ్చి ఆయనమీద జాలువార్చగలరా...?

అలా మీరు తెచ్చి జాలువార్చగలిగినా తదంతర్గంతంగా మీకు అది ఎటువంటి జ్ఞ్యానసిద్ధి , అభివృద్ధి కలిగించలేదు.....

కేవలం జలతత్త్వభరిత పదార్ధాలకే ఆ శక్తి, సమర్ధత కలవు.....

మిగతా 4 పంచభూత తత్త్వ పదార్ధాలు పక్కనపెట్టగలరేమో కొద్దిసేపైనా, ఉదజని ప్రాణవాయువు 2:1 నిష్పత్తిలో ఉండే నీటిని విడిచి
అసలు ఏ ప్రాణి ఎక్కడా మనలేదు..... ISS  లొ ఉన్న వ్యోమగాములు సైతం అన్ని విడిచి ఉండగలరేమో కాని నీటిని తద్ అంతర్భాగమైన వాయుతత్వాన్ని

( ప్రాణాద్ వాయురజాయత......
 అని స్తుతించబడే పరమాత్మతత్త్వం ) 

విడిచి మనలేరు......

కాబట్టి కేవలం అటువంటి జలతత్వ పూర్వకంగా మాత్రమే పరబ్రహ్మతత్వాన్ని సంపూర్ణంగా మనకు లభ్యమయ్యేలా ఈశ్వరుడు ఈ సృష్టిని నిర్మించాడు కాబట్టి, అభిషేకం లో జలతత్త్వభరిత పదార్ధసమర్పణపూర్వకంగా మాత్రమే ఈశ్వరుడు మనవాడై,  నిర్మల భక్తి ప్రపత్తులతో మనవశమవుతాడు అనేది ఇక్కడి అధ్యాత్మ విషయవిశేషం......

ఇంకా సింపుల్ గా చెప్పాలంటే నీరే అన్ని శక్తులకు ఆధారం, ఆలవాలం కాబట్టి అని చెప్పొచ్చు....

పాత సినిమాలనుండి ఇప్పటి వరకు కూడా మీరు ఏ సినిమా చూసినా సరే పంచభూతాత్మకమైన ఈ ప్రకృతికి అతీతమైన ఆ పరమాత్మను 
" సాధించడం " కోసం తపస్సులు ఆచరించిన మహర్షులందరు వెంటబెట్టుకొని తిరిగేది కమండలాలను...... వారి తపోశక్తిని నిక్షిప్తంగావించేది అందులోని జలంలో.....

వారికి ఉన్న అత్యంత పదునైన, శక్తివంతమైన, తిరుగులేని, వజ్రాయుధం 
వారి అరచేతిలోకి ఒలికించబడిన ఆ కమండలజలం లోకి అభిమంత్రించబడిన వారి మహత్తర తపశ్శక్తి/ మంత్రబలం.....

కాబట్టే " తత్త్ జలాన్ " అని వేదం ఈశ్వరుడిని గ్రాహ్యరూపంగా ధృవపరిచింది.....😊

అటువంటి అన్ని జలరాశులకు అధిదేవత గంగమ్మ కనుక ఆవిడ పేరుతో ఈ వేదభూమి తరతరాలుగా 

" జిస్ దేశ్ మే గంగా బెహ్తీహై....."

అంటూ యావద్ ప్రపంచంచే నమస్కరించబడుతోంది.....🙏😊

ఇంటర్మీడీట్ నుండి అనగా గత 16 సంవత్సరాలుగా శివరాత్రిమహోత్సవంలో నా చేత అభిషేకం స్వీకరించి నన్ను అనుగ్రహిస్తూ చల్లగా కరుణిస్తున్న శ్రీబాలాత్రిపురసుందరీ సమేత శ్రీరామలింగేశ్వరస్వామి వారి ఆలయం యొక్క రాజగోపురం.....🙏😊..🙏😊

" నిన్న సాయంత్రమే పితకబడిన శుద్ధమైన దేశవాళి ఆవుపాలు ఎక్కడ దొరుకుతాయి....? " 

అని ఎంతో వెతుక్కుని జీవించవలసిన కలికాలం లోకి వచ్చిన మనజీవితాలు, ఫలాన చోట దొరుకుతాయంట అని ఎవ్వరైనా చెప్తే 
అక్కడికి వెతుక్కుంటూ వెళ్ళిన్నట్టుగా.....

" ఉదాత్త అనుదాత్త స్వరిత భరిత స్వరశుద్ధితో గావించే మంత్రపఠనంతో మూర్తిలోకి ఈశ్వరుడి సంపూర్ణ షోడషకళలను ఆవహింపజేసి వైదికస్వరశుద్ధితో ఈశ్వరుడు అంత ఘనంగా ప్రసన్నమయ్యే విధంగా అర్చనలు జరిగే ఆలయాలు ఎక్కడున్నాయి...? "

అని వెతుక్కేనంతగా మారిన ఈ కలికాలపు జీవితాల్లో, అంతటి స్వరశుద్ధి కలిగిన ఒక సత్బ్రాహ్మణోత్తముని దర్శనంకోసమే నేను ఆ శివరాత్రి అభిషేకానికి వెళ్తుంటాను అని అనడం కొంచెం విడ్డూరంగా ఉంటుందేమో కాని ఆ పవిత్ర మనసు గల స్వరమే నన్ను ఇన్ని సంవత్సరాలుగా శివరాత్రికి ఈ గుడికి లాగి నాకు నిజమైన శివజాగరణ ప్రసాదించింది.....

వృత్తిరీత్యా ఏదో నాగార్జునా కెమికల్స్ / ఫెర్టిలైసర్స్ లో ఒక ఉన్నతాధికారి అయిన వారి స్వరశుద్ధికి గల పవిత్రత, మహిమ్నత అటువంటిదనే నా విశ్వాసమే నాకు శివరాత్రి యొక్క లింగోద్భవకాల శివదర్శనం....😊

శివరాత్రి తర్వాత వచ్చే శ్రీ వికారి ఫాల్గుణ శుద్ధ తదియ యొక్క శివస్వరూపమైన చంద్రరేఖ..... 🌙

https://youtu.be/bZOBlBvKDvg.... 🌙

No comments:

Post a Comment