Monday, February 17, 2020

Many Happy Returns of the Day to Shree KCR, hon'ble Chief Minister..... :)

శ్రీకల్వకుంట్లచంద్రశేఖర్రావ్ గారు,
గౌ|| మాననీయ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు, మరెన్నో వసంతాలు జన్మదినవేడుకలు ఆయురారోగ్యైశ్వర్యాలతో జరుపుకుంటూ రాష్ట్రం అన్ని రంగాల్లోనూ ప్రగతిపథంవైపు పురోగమించి, ఈ దేశంలో సర్వోతోముఖాభివృద్ధితో వర్ధిల్లే రాష్ట్రాల్లోకెల్లా తెలంగాణ ఒక తలమాణిక రాష్ట్రంగా వెలిగేలా పరిపాలనను వ్యవస్థీకరించి, ఈ క్రిందపేర్కొనబడిన వాటిపై మరింత శ్రద్ధతో కట్టుదిట్టమైన చర్యలను తీసుకొని పౌరులందరికి అలనాటి శ్రీరామరాజ్యం లో ఉన్నవిధంగా రాజనీతిభరిత సుపరిపాలనను అందించి తరతరాలకు తరగని పేరుప్రఖ్యాతలతో చిరయశోభరితులై వర్ధిల్లాలని కోరుకుంటూ ఒక పౌరుడి హార్దిక జన్మదినశుభాభినందనాపూర్వక నమస్సులు....🙏👍👏🍨🍧🍕🍦😊
1. అన్ని రంగాలలోను వీలైనంతవరకు దళారివ్యవస్థను తగ్గించేదిశగా తగుచర్యలకు శ్రీకారం గావించి,
మరీముఖ్యంగా చిన్న/సన్నకారు/కౌలు రైతులకు, ఆర్థికంగా బడుగుబలహీనవర్గాలకొరకై ఉద్దేశ్యించబడిన పథకాల సొమ్ము ఆయా లబ్ధిదారులకు నేరుగా లభించేలా టెక్నాలజి ని విస్త్రుతంగా ఉపయోగించి అవినీతిని వీలైనంత ఎక్కువగా అరికట్టడం.....
( ఆధార్ అండ్ బయోమెట్రిక్ బేస్డ్ ఆటోమేటెడ్ ఎండ్ యూజర్ ఓరియెంటెడ్ గవర్న్మెంట్ స్కీం మ్యానేజ్మెంట్ సిస్టెంస్ )
2. పట్నంతోపాటుగా ప్రతిఊరికి మెరుగైన రవాణ మరియు త్రాగునీటి వ్యవస్థ....
( కరెంట్ కష్టాలు తీర్చినట్టే వీటిపై కూడా ప్రత్యేక శ్రద్ధచూపినచో ప్రజలందరికి బహులాభదాయకముగా ఉండును....)
3. విద్యావ్యవస్థ ఒక పెద్దవ్యాపారంగా మారడాన్ని అరికట్టేందుకు, రాష్ట్రం మొత్తం సరళీకృత విద్యావిధానాన్ని అవలంబించడం.......
మరీ ముఖ్యంగా వివిధ తప్పనిసరి ఫీజులపేరుతో హద్దెరగని రీతిలో దోచుకుంటున్న ప్రభుత్వేతర పాఠశాలలు / జూనియర్ కళాశాలలు
అన్నీకూడా ఒక నియమిత ప్రభుత్వనియంత్రిత వ్యవస్థకు లోబడి ఒక సమంజసమైన హద్దుదాటకుండా ఫీజులు తీసుకునేలా కఠినచర్యలను తీసుకొని విద్యార్ధుల భవితకు అండగా ఉండేలా విద్యావ్యవస్థను తీర్చిదిద్దడం......
4. రెవెన్యూ విభగాంతో సహా వివిధ ప్రభుత్వ విభాగా సేవలన్నీకూడా టెక్నాలజి ఆధారిత / అనుసంధానిత ఆన్లయిన్ ఏకీకృతవ్యవస్థగా తీర్చిదిద్ది, అటు ప్రజలకు త్వరితగతిన సేవలు అందేలా, ఇటు ప్రభుత్వానికి " ఇంప్లిమెంటేషన్ ఒవర్ హెడ్ " తగ్గేలా తగు మార్పులను స్వాగతించడం.......
5. సనాతన / హైందవ ధర్మాన్ని పరిరక్షించే విధంగా ఆలయాల మనుగడకు / అభివృద్ధికి తగు రీతిలో ప్రత్యేక బడ్జెట్ ని కేటాయించి ఇతర ధర్మాల్లోని ప్రార్ధనా మందిరాలకు ఇవ్వబడినట్టుగా ఆలయాలకు కూడా కొంతైనా సరే స్వయంప్రతిపత్తి ఉండేలాచూసి ఆలయాల ద్వారా ఆర్జింపబడిన ధనం కేవలం ఆలయాలకోసమే వెచ్చింపబడేలా, ఆ నిధులను ఇతర వ్యవస్థలకు మళ్ళించకుండా ఉండేలా కట్టుదిట్టమైన చర్యలను తీసుకొని సనాతన ధర్మదేవతకు తగు రీతిలో సేవను ఒనరించడం......
ఇవ్విధముగా మీహయాంలో రాష్ట్ర పరిపాలన మరింత శోభాయామానంగా దినదినాభివృద్ధి చెందాలని ఆకాంక్షిస్తూ, once again a very happy birthday to one of the most dynamic chief ministers of the Indian Polity who made a genuine difference to the lives of many by ensuring that government is indeed better recognized as a service rendering entity rather than being a mere authority establishing entity for it's citizens....😊
Harish Rao Thanneeru
7 hrs
తెలంగాణ మీ స్వప్నం
ఈ రాష్ట్రం మీ త్యాగఫలం
ఈ అభివృద్ధి మీ ధక్షతకు నిదర్శణం
ఈ నేలకు మీరే శ్రీరామ రక్ష
తెలంగాణ జాతిపిత శ్రీ కేసిఆర్ గారు శతవసంతాలు చూడాలని మనసారా కోరుకుంటూ.. జన్మదిన శుభాకాంక్షలు

No comments:

Post a Comment