" శ్రీరామజయం.....! "
అని మన పెద్దలు ఉత్తరాలు వ్రాసేముందు మొదటగా వ్రాయడం.....
మరియు ఇతరత్ర వ్రాతప్రతుల యందుకూడా ఉండడం చాలామందికి గుర్తుండే ఉంటుంది........
మరియు ఇతరత్ర వ్రాతప్రతుల యందుకూడా ఉండడం చాలామందికి గుర్తుండే ఉంటుంది........
25 పైసలకు ఒక పోస్ట్ కార్డ్ లభించే మా స్కూల్ రోజుల్లో
మా తాత, పితామహులు కీ.శే శ్రీ అయిత హనుమయ్య గారు ప్రతినెల కొడుకులకు యోగక్షేమాలు విచారిస్తు ఉత్తరాలు వ్రాసే ఆ రోజుల్లో మా తాత కూడా
" శ్రీరామజయం " అని మొదలుపెట్టి మిగతా అన్ని సంగతులు వివరంగా వ్రాసే ఆ శైలినే నేను కూడా అవలంబించి కొందరు ఫ్రెండ్స్ కు / చుట్టాలకు అదేవిధంగా వ్రాసేవాడిని......😊

************************
శ్రీరామజయం
కొడుకు శ్రీవేంకటేశ్వరులకు దీవేనలతో నీ నాన్న వ్రాయునది.....
ఇక్కడ అంతా క్షేమము.....మీరు కూడా క్షేమమేని భావిస్తున్నాను.... ఈ నెల నీ 200 రూపాయల మని యార్డర్ కొంచెం ఆలస్యంగా చేరినది.....
మీ అమ్మ నాగమ్మకు కొన్ని మందులు ఎక్కువ కొనడం వల్ల ఈ నెల ఖర్చులు కొంచెం ఎక్కువైనవి......కాబట్టి వచ్చేనెల అందరు కూడా ఇంకో 50 రూపాయలు ఎక్కువ పంపించగలరు.....
ప్రత్యేకమైన ఆయుర్వేదవనమూలికలతో గుమ్మడిహల్వా తయారు చేసి రోజు మీ అమ్మ నేను తీసుకుంటున్నాము....కావలసినవారు వచ్చి తీస్కెళ్ళవచ్చు......
.
.
.
.
************************
అంటూ అలా అన్ని సంగతులు కూడా విపులంగా రాసే మా తాత శైలిలోనే నేను కూడా కొత్తగుడెంలో ఉండే మా అమ్మమ్మ వాళ్ళింటికి, చుట్టు ఉండే ఇతర ఫ్రెండ్స్ కి ఉత్తరాలు రాసే వాడిని.....😊

ఇంటర్ 1స్ట్ ఇయర్ వరకు కూడా మాది ఒక చిన్న రెండు రేకుల రూముల బీద బస్తీలోని ఇల్లు..... మా ఇంట్లో మరియు ఇతర చుట్టుపక్కల అన్నిరకాల తీగలు / కూరగాయలమొక్కలు చూసాను కాని గుమ్మడితీగను మాత్రం ఎక్కువగా ఎక్కడా చూడలేదు......
అది తినడానికి కూరగాయల్లో కూడా ఎప్పుడు మాఇంట్లో వాడలేదు కాబట్టి గుమ్మడి కేవలం ఇంటిముందు వేలాడదీయడానికి తప్ప మరెందుకు ఉపయోగించబడనిది అని అనుకున్న నాకు, జమ్మికుంటలోని మా నానమ్మ ఇంటికి వెళ్ళినప్పుడల్లా అక్కడ తాత తయారుచేసే ఆ బూడిదగుమ్మడిహల్వా నాకు ఎప్పుడు ఒక వింతగానే అనిపించేది.....

తాత నానమ్మల ఇంటివెనకాలే ఉండే పెద్ద పెద్దనాన, ఆనందం పెద్దనాన్న వాళ్ళింటికి వెళ్ళి అక్కడ ఉండే భాగ్యక్కని కూడా అడిగే వాడిని.....
"అక్క.....తాత ఏదో గుమ్మడికాయి హల్వ చేసి పైన ఉట్టిలో అందకుండా దాచిపెట్టాడు....నీకు అది తయారు చేయడం ఎమైనా వచ్చా....?" అని....
పొదుపుపథకాల భాగంలో
వస్త్రాలు నేసేందుకు వాడే దారం తయారి మిషన్లు గవర్నమెంట్ అందరికి ఇవ్వగా... ఇంటిపనులు పూర్తి అవ్వగానే అందరు వాటిని తిప్పుతూ బిజీగా ఉండేవారు.......
వస్త్రాలు నేసేందుకు వాడే దారం తయారి మిషన్లు గవర్నమెంట్ అందరికి ఇవ్వగా... ఇంటిపనులు పూర్తి అవ్వగానే అందరు వాటిని తిప్పుతూ బిజీగా ఉండేవారు.......
భాగ్యక్క కూడా....
" ఏమోరా విన్నిగా......మాకు ఈ దారం మిషన్లతోనే టయిం మొత్తం సరిపోతది..... ఆ కొత్తరకం హల్వాలు నేను ఎప్పుడు చేయలేదుర....
పెద్దనాన్న తెచ్చిన బన్నులు, బిస్కెట్లు అక్కడున్నాయి.....కావాలంటే అవి తిను కాని తాత కనిపెట్టే ఆ కొత్తరకం హల్వాలు తయార్ చేయమని అనకురా....." అంటూ నవ్వేది.....😁

తాత బయటికి వెళ్ళినప్పుడు అక్కడుండే బల్లఒకటి వేసి దానిపైన పీటలు వేసి పైకెక్కి ఉట్టిలో మా తాత దాచిపెట్టిన ఆ గుమ్మడిహల్వాను రెండు గుప్పిట్ల వరకు లాగించి ఏమి తెలియనట్టు మూత పెట్టేసి......
తాత వచ్చాక......
" నానమ్మ చెప్పింది..... ఆ పైన ఉట్టిలో ఏదో తినే హల్వా తయారు చేసి దాచావని......కొంచెం పెట్టరాదు తాత......" అని అడిగేవాడిని.....😂
"ఒహ్ చెప్పేసిందా మీ నానమ్మ.....
హుమ్మ్.....ఐతే ఇగొ తీస్కొ..... "
అని కేవలం ఒక స్పూన్ మాత్రమే హల్వా పెట్టగా అది తిని బాగ నవ్వుకునేవాడిని......
హుమ్మ్.....ఐతే ఇగొ తీస్కొ..... "
అని కేవలం ఒక స్పూన్ మాత్రమే హల్వా పెట్టగా అది తిని బాగ నవ్వుకునేవాడిని......
మా తాత 70 పైచిలుకు వసంతాలవరకు గుండ్రాయిలా దృఢంగాఉండడానికి అందులోని పొషకవిలువలు ఎంతటి ఘనమైనవో అప్పుడుతెలియదు.....
తెలిస్తే నెలకొక జాడి హల్వా తెప్పించుకొని తినుండేవాడిని......😁
తెలిస్తే నెలకొక జాడి హల్వా తెప్పించుకొని తినుండేవాడిని......😁
సరే ఇంతకి ఇక్కడ నేను చెప్పదలచుకుంది ఏంటంటే అలా మన పెద్దలు " శ్రీరామజయం " అని ముఖ్యమైన పనులన్నీ మొదలుపెట్టడంలో కేవలం దైవనామస్మరణ మాత్రమే ఉన్నదా లేక.....అందులో విశేషమైన అధ్యాత్మతత్వచింతన ఇమిడిఉన్నదా అని వివేచనగావించిన ఎవ్వరికైనా ఈ క్రింది తత్త్వసమన్వయం సమకూరడం సహజమే.....
శ్రీచాగంటి సద్గురువుల శ్రీమద్రామాయణ
( సంపూర్ణరామాయణం ) ప్రవచనాలు శ్రద్ధాసక్తులతో ఆలకించినవారికి గుర్తున్నట్టుగా, నవవిధ భక్తిమార్గాల్లో దాస్య భక్తికి ప్రతీకగా ఉదహరించబడే హనుమంతుల వారికి సాటిరాగల శక్తి మరోకటి ఉండడం అసంభవం..... ఈ విశ్వంలోని ఏ శక్తినైనా సరే తనలోకి లయించి వేసే అపర రుద్రాంశసంభూతుడు హనుమంతులవారు......

" ఓం కబలీకృతమార్తాండమండలాయ నమః...." అని కదా మనం హనుమను అర్చించేది......
సూర్యుడిని మధురఫలంగా భావించి ఆరగించే క్రమంలో నింగికెగసిన బాలాంజనేయస్వామిని ఇంద్రుడు తన వజ్రాయుధప్రహారం తో హనువును
( దక్షిణ దవడను ) గాయపరచగా
" హనుమ " అనే పేరుతో పాటుగా
అసలు ఆంజనేయుడిని కట్టడి చేయగల శస్త్రాస్తములు ఈ విశ్వంలోనే ఉండజాలవని సకలదేవతలు వాయుదేవునకు ఆనతివ్వగా.....ఆనాడే హనుమంతులవారు అప్రతిహత శక్తిపుంజంగా వినుతికెక్కారు.....

ఆ శక్తియుక్తులను శ్రీరామ భక్తికై,
సీతారాములను ఒక్కటిచేయుటకై తన జీవితాన్నే అర్పించుకున్నందుకు చిరంజీవివై వర్ధిల్లమని శ్రీరాముడు ఆనాడు అయోధ్యలో వరమివ్వగా ఇక ఆనాడే సప్తచిరంజీవులలో కెల్ల అత్యంత శక్తిమంతుడై, శాశ్వతమైన శక్తియుక్తులకు భక్తిప్రపత్తులకు నెలవై హనుమంతులవారు కోరి కొలిచినవారికి కొంగుబంగారమై వర్ధిల్లుతున్నారు.......

హనుమ యొక్క అప్రతిహత శక్తియుక్తులు
శ్రీమద్రామాయణంలో ఎన్నో చోట్ల మనకు విశదీకరింపబడింది.....
శ్రీమద్రామాయణంలో ఎన్నో చోట్ల మనకు విశదీకరింపబడింది.....
శ్రీచాగంటి సద్గురువులు ఎంతో గంభీరంగా వివరించిన
" అక్షకుమారవధ " వృత్తాంతాం విన్న ఎవ్వారైనాసరే
" అక్షకుమారవధ " వృత్తాంతాం విన్న ఎవ్వారైనాసరే
" వామ్మో......హనుమంతులవారి అరివీరభయంకర పరాక్రమం ఇలా ఉంటుందా......అని ఆశ్చర్యపోవలసిందే........
ఎప్పుడైనా నుమాయిష్ కి వెళ్ళినవారు, అక్కడుండే పేద్ద మెర్రిగోరౌండ్ ఎక్కినప్పుడు అది గిరా గిరా తిరిగే వేగానికి ఒళ్ళు ఏవిధంగా జలధరించి, కిందకి దిగినతర్వాత కూడా ఓ 5 నిమిషాలవరకు మన చుట్టూ ఉన్న లోకం మొత్తం ఇంకా అలా స్పీడ్గా తిరుగుతూనే ఉన్నట్టుగా అనిపిస్తుందో......
అచ్చం అదేవిధంగా పొగరుతో మిడిసిపడుతు హనుమను నిందించిన ఆ రావణకుమారుడిని........
పాదములురెండు గట్టిగా ఒడిసిపట్టి గాల్లోకి అంతెత్తున అమాంతం ఎగిరి అక్షకుమారుడిని ఈడ్చి కొన్ని వేల ఋఫంస్ వేగంతో గిరగిరగిర తిరగడంతో మొదట వాడి తల ఎగిరిపోవడం, ఆ తర్వాత వాడి బాహువులు రెండు ఎగిరిపోవడం , ఆ తర్వాత వాడి నాభి ఉపరితలం మొత్తం ఎగిరిపోవడం, ఆ తర్వాత వాడి తొడలు ఎగిరిపోవడం, ఆ తర్వాత వాడి పిక్కలు ఊడిపోయి చివరికి మిగిలిన 2 పాదములను అలా అవతల పడేసిన తర్వాత హనుమంతులవారు కిందికి దిగిరావడం.....!!
అంతటి భయానకమైన అక్షకుమారవధ గురించి తెలిసిన రావాణాసురుడికి జీవితంలో అసలు భయమంటే ఎంటో పరిచయం చేసిన హముమంతుల వారి అంతటి శక్తిపరాక్రమాలకు అసలు ఏంటి కారణం అని అధ్యాత్మవేత్తలు ఎవరైనా హనుమంతులవారిని ధ్యానం
గావించి ప్రార్ధిస్తే తెలిసేఉంటుంది ఆ తత్వరహస్యం....
గావించి ప్రార్ధిస్తే తెలిసేఉంటుంది ఆ తత్వరహస్యం....
అంతటి మహోన్నతమైన శౌర్యానికి ఆలావాలమై ఎదిరించి నిలిచి గెలిచే వారే లేని హనుమంతులవారు నిరంతరం
హ్రీంబీజగర్భితమైన దుర్భేద్య మంత్రశక్తివలయాన్ని తమ చుట్టు ఏర్పరచి
"శ్రీరామ జయరామ జయజయరామ....."
అనే శ్లోకమంత్రాన్ని నిరంతరం జపిస్తూ ఉండడం వల్లే.....!
చతుర్దశభువనాలను తన క్రీగంటిచూపులతో సమ్రక్శించే ఆదిపరాశక్తియొక్క శ్రీభువనేశ్వరిస్వరూప బీజాక్షరం - హ్రీం.....
శ్రీ - శ కార, ర కార, ఈ కార, శక్తిసంఘాతమైన శాక్తేయప్రణవం శ్రీకారం.....
రా - అగ్ని బీజం
మ - అమృతబీజం ( శ్రీమహవిష్ణువుయొక్క శక్తికి ప్రతిరూపం )
3 సార్లు జయ వాచకం - సర్వకాలసర్వావస్థల్లోనూ సత్యంగా సకల జయములకు సూచకం.....
పై శ్లోకంలో జాగ్రతగా గమనించగలిగితే, పంచభూత తత్వాలు / వాటిని సృజించే పరమాత్మ తత్త్వంకూడా నిఘూడంగా అందులో గర్భితమై ఉన్నది.....
అందుకే అది సకల శక్తులకు ఆలవాలమైన హనుమ సాగించే స్మరణమయ్యింది.....!!!
ఆకాశ తత్త్వం, వాయు తత్త్వం / పరమాత్మ తత్త్వం - శ్రీ కారం లో
అగ్ని తత్త్వం - రా బీజాక్షరంలో
జల తత్త్వం - మ బీజాక్షరంలో
పృథ్వి తత్త్వం - జయ వాచకం లో
అందుకే అసలు హనుమంతులవారి ముందు నిలిచి గెలిచే శక్తి ఈ 14 భువనాల్లోనూ ఎక్కడా ఉండజాలదు.....!
"అంజనానందనంవీరంజానకీశోకనాశనం
కపీశమక్షహంతారంవందేలంకాభయంకరం...."
కపీశమక్షహంతారంవందేలంకాభయంకరం...."
అని అందుకే హనుమంతులవారిని శ్రీమద్రామాయణం నమస్కరించింది......! 🙏
హనుమంతులవారు సకలశక్తులుసమ్మేళనం గావించబడిన భక్తభాగవతోత్తమభగవంతుడని అందుకే అన్నమాచార్యులవారు ఎంతో రమ్యంగా తమ ఈ క్రింది సంకీర్తనలో కృతిపరిచారు......
************************ ************************
108.okkaDE EkAMga viiruDurviki - ఒక్కడే ఏకాంగ వీరుడుర్వికి
Audio link :G.BalaKrishnaPrasad
Archive link :
Archive link :
ఒక్కడే ఏకాంగ వీరుడుర్వికి దైవమౌనా
యెక్కడా హనుమంతుని కెదురా లోకము
యెక్కడా హనుమంతుని కెదురా లోకము
ముందట నేలెడి పట్టమునకు బ్రహ్మయినాడు
అందరు దైత్యులచంపి హరిపేరైనాడు
అంది రుద్రవీర్యము తానై హరుడైనాడు
యెందునా హనుమంతుని కెదురా లోకము
అందరు దైత్యులచంపి హరిపేరైనాడు
అంది రుద్రవీర్యము తానై హరుడైనాడు
యెందునా హనుమంతుని కెదురా లోకము
చుక్కలు మోవ పెరిగి సూర్యుడు తానైనాడు
చిక్కు పాతాళము దూరి శేషుడైనాడు
గక్కన వాయుజుడై జగత్ప్రాణుడైనాడు
ఎక్కువ హనుమంతుని కెదురా లోకము
చిక్కు పాతాళము దూరి శేషుడైనాడు
గక్కన వాయుజుడై జగత్ప్రాణుడైనాడు
ఎక్కువ హనుమంతుని కెదురా లోకము
జలధి పుటమెగసి చంద్రుడు తానైనాడు
మలసి మేరుపుపొంత సింహమైనాడు
బలిమి శ్రీవేంకటేశు బంటై మంగాంబుధి
ఇల ఈ హనుమంతుని కెదురా లోకము
మలసి మేరుపుపొంత సింహమైనాడు
బలిమి శ్రీవేంకటేశు బంటై మంగాంబుధి
ఇల ఈ హనుమంతుని కెదురా లోకము
************************
************************
************************
No comments:
Post a Comment