శ్రీశార్వరి శ్రావణమాస /శ్రావణలక్ష్మీ వైభవం....!
ఈ క్రింది నా పాత పోస్ట్లో శ్రీవరలక్ష్మీ వైభవాన్ని అమ్మవారి దయతో కొంతమేర విశదీకరించడం జరిగింది కద....
https://m.facebook.com/story.php?story_fbid=10217623845321301&id=1033694038
ఇప్పుడు ఈ శ్రావణమాసవిశేషాన్ని
మరికొంత చర్చిద్దాం.....
శ్రీమన్ ! కృపాజలనిధే ! కృతసర్వలోక !
సర్వఙ్ఞ ! శక్త ! నతవత్సల ! సర్వశేషిన్ !
స్వామిన్ ! సుశీల ! సులభాశ్రిత పారిజాత !
శ్రీ వేంకటేశ చరణౌ శరణం ప్రపద్యే.
అని మనం సుప్రభాతంలో పఠించినట్టుగా
" కృపాజలనిధే " అయినందువల్లె ఆ భగవంతుడిని మనం ప్రార్ధిస్తున్నాం అనేది లోకవిదితమైన సత్యం.....
మన పెద్దలు చెప్పినట్టుగా, శ్రీ చాగంటి సద్గురువులు తమ ప్రవచనాల్లో పలుమారు ఉటంకించినట్టుగా ఈశ్వరుడు నిర్హేతుక దయాస్వరూపుడు..... ఆ అమేయమైన దయకు పాత్రతను సముపార్జించి ఈశ్వరకృపతో జీవితాన్ని తరింపజేసుకోవడమే జీవనసాఫల్యత అనబడుతుంది....
ఆ ఈశ్వరుడి కృపాచిహ్నంగా భాసించుచు, ఒక నిర్దిష్టమైన గుర్తుగా మనకు గ్రాహ్యమయ్యేలా అందుబాటులో ఉండి మన ప్రార్ధనలన్నిటిని ఈశ్వరుడికి విన్నవించి జీవులను అనుగ్రహించు శ్రీవిష్ణుస్వరూపం యొక్క అనుసంధాయక శక్తియే శ్రీలక్ష్మీ...
"లక్ష్మ్యతే ఇతి లక్ష్మి...." అనే వ్యుత్పత్తి ప్రకారంగా మనకు ఒక గుర్తుగా భాసించునదే శ్రీలక్ష్మి....
ఆ గుర్తు ఎక్కడ ఉంటుంది.....?
ఎలా గుర్తు పట్టాలి.....?
గుర్తుపట్టినపిదప ఏవిధంగా ఆ గుర్తును గురితో అందుకోవాలి......?
అనే శాస్త్రవిహితమైన విజ్ఞ్యానాన్ని అనుగ్రహించేది గురువులు.....
అధ్యాత్మవిద్యానుసారంగా గురువు కూడ ఒక తత్త్వ సూచికయే కాబట్టి గురువు కూడా లక్ష్మియే....!
అందుకే కద....
" అబ్బో ఆయనకు శాస్త్రసంబంధిత విషయవిజ్ఞ్యానంపై కూడా ఎంత పట్టో తెలుసా....ఎంతటి గురుకటాక్ష సంపన్నుడో....."
అనేలా లోకంలో అనడం మనం వింటుంటాం......
ఇక్కడ ఆ గురుకటాక్షమే విద్యాలక్ష్మీ కటాక్షం కాబట్టి గురువు అనే తత్త్వ సూచిక కూడా ఒక గుర్తుగా అనగా లక్ష్మి గా పరిగణించబడుతుంది......
గురువును, గురువాక్యాన్ని శిష్యుడు ఏవిధంగా ఐతే తన గుండెల్లో పదిలపరుచుకుంటాడో.......
ఈశ్వరుడు కూడా తన శక్తి ని తన గుండెల్లో నిక్షిప్తం గావించుకుంటాడు.....
ఇక్కడ గుండెల్లో అనగా భౌతికమైన గుండె అనే అత్యంతకీలకమైన శరీరభాగం అని కాదు.....
గుండెల్లో పెట్టుకోవడం అనగా చాలా జాగ్రత్తా పదిలపరుచుకోవడం.......
ఎప్పుడు కావాలంటే అప్పుడు ఆ పదిలపరుచున్న శక్తిని ఉత్తరక్షణం ఉపయోగించగలిగేలా సమ్రక్షించబడడం......
బ్రహ్మదేవుడు తనకు అభిన్నమైన తన వైరించి శక్తిని ఎల్లవేళలా మనకు తన చతుర్ముఖాలతో గావించబడే వేదశాస్త్రపఠనం తో వ్యక్తపరచడం లో ఆ పదిలపరుచుకున్న విధానం మనకు జ్యోతకమౌతుంది కద.....
రుద్రుడు తన రౌద్రి శక్తిని తన త్రినేత్రంలో పదిలపరుచుకోవడం అవసరమైనప్పుడు ఆ త్రినేత్రాన్ని బహిర్వ్యక్తమయ్యేలా జేసి ఆ త్రినేత్రజ్వాలను నిర్దేశించబడిన దేవకార్యాలకు ఉపయోగించడం.....
( శ్రీ చాగంటి సద్గురువులు మనకు వివరించినట్టుగా శివుడి భ్రుకుటి యందుండే త్రినేత్రం సినిమాల్లో, ఫొటోల్లో, ఇతరత్రా చోట్ల చూపబడినట్టుగా అలా ఎల్లప్పుడు బయటికి కనిపిస్తూనే ఉండదు.....
ఇతర దేవతాస్వరూపాల మాదిరిగా
శివుడు కూడా సాధారణంగా తన రెండుకళ్ళతోనే చూడచక్కని వదనంతో ఉంటాడు....
అవసరమైనప్పుడు మాత్రమే భ్రుకుటిమధ్యలో నిలువుగా కొలువైఉండే ఆ మూడో కన్ను ప్రత్యక్షమై తన పని తాను ముగించి తిరిగి అంతర్నిహితమౌతుంది....
( కందర్ప భస్మీపటలం....ఇత్యాది కార్యాలు...)
మరియు అర్థనారీశ్వరుడిగా తన దివ్యదేహంలోని సగభాగం తన శక్తికి కేటాయించి మనకు దర్శనమివ్వడం మనం గమనించవచ్చు...
శ్రీశైల గర్భాలయ దర్శనానంతరం మనం లైన్లో బయటకు వచ్చేటప్పుడు పంచపాండవ ప్రతిష్ఠిత పంచలింగాల దర్శనానికి వెళ్ళేటప్పుడు మనం ఈ అర్థనారీశ్వరాలయాన్ని దర్శించుకోవడం ఎల్లరికి విదితమే కద......
ఇక శ్రీమహావిష్ణువు నిజంగానే తన శక్తిని హృదయసీమ పై కొలువైఉండేలా
చేసుకోవడం ఎల్లరికి విదితమే కద....
భృగుమహర్షి పాదతాడనంతో తన నివాసస్థానం అపవిత్రమైనందున అలిగి కొల్హాపురం వెళ్ళి స్థిరపడిన ఆ వీరలక్ష్మిని మనకోసం భూలోకం చేరి శ్రీశుకపురంలో 12 సంవత్సరములు తపమాచరించి ప్రసన్నం చేసుకొని శ్రీమదలర్మేల్మంగాపద్మావతీ గా ఆవిడను ప్రసన్నం చేసుకొని అటు తిరుచానూరు శ్రీస్వతంత్రవీరలక్ష్మీ / శ్రీపద్మావతిదేవిగా ఇటు తన హృదయసీమపై శ్రీవ్యూహలక్ష్మి గా తన లక్ష్మీ స్థానంలో తన శక్తి మరలా కొలువైఉండేలా చేసి మనల్ని
శ్రీ కి నివాసం గా గలవాడిగా శ్రీనివాసుడిగా శ్రీమదలర్మేల్మంగాపద్మావతీ సమేత శ్రీవేంకటేశ్వరుడిగా తన భక్తకోటిని అనుగ్రహిస్తున్నాడు కలియుగ ప్రత్యక్ష పరమాత్మ గా.....
మిగతా దైవస్వరూపాలు ప్రత్యక్షంగా మానవ గ్రాహ్యములు కావు కాని.....
శ్రీవేంకటేశ్వరస్వామి వారు మనకు కళ్ళముందు కదలాడే ప్రత్యక్షదైవస్వరూపం కాబట్టి తిరుమలలో స్వామి వారి సందర్శనాభాగ్యం లభించినవారెల్లరికి ఇది మానవ దృగ్గోచరమయ్యే ప్రత్యక్ష సత్యమే కద....
స్వామి వారి విశాలవక్షసీమ పై కుడిభాగంలో శ్రీవత్స చిహ్నం, ఆ త్రికోణాకార గుర్తుకి ఎడమభాగంలో శ్రీమహాలక్ష్మీ అమ్మవారు శ్రీవ్యూహలక్ష్మీ అమ్మవారిగా స్వామివారి దివ్యసజీవసాలిగ్రామతిరుమేనిలోనే అంతర్భగామై ఉండడం.....
వాటిపై స్వర్ణాభరణాల రూపంలో
తన హృదయసీమపై శ్రీ భూ లక్ష్మీహారాలుగా తన ఇరుదేవేరులు వేంచేసి ఉండడం భక్తులెల్లరికి విదితమే కద....!
కాబట్టి ఇక్కడ స్పష్టంగా మనకు దృగ్గోచరమయ్యే విధంగా ఉండడం వల్ల, మనకు సదా మాంసనేత్రానికి కనిపించే గుర్తు.....
కాబట్టి ఎవ్వరైనా ఇట్టే గుర్తుపట్టడం సంభవం......
కాని అధ్యాత్మశాస్త్రప్రకారంగా, శ్రీ చాగంటి సద్గురువులు మనకు బోధించినట్టుగా ఆవిడ పురుషకారిణి.....
జీవుడిని దేవుడితో అనుసంధానం గావించేందుకు గుర్తుగా సదా భాసించే ఆ శ్రీరమణి లోకంలో తన లౌకిక గుర్తులుగా కొన్నిటిని ప్రత్యేకంగా సూచించి అందున వసించడం మనకు విదితమే కద.....
1. గోపృష్ఠం / గోమయం
2. గజవదనం
3. పద్మం
4. సువాసిని పాపిటస్థానాలంకృత సిందూరం
5. ఎర్రని పుష్పాలు
ఈ లౌకిక గుర్తులుగా ఉండే లక్ష్మీవైభవం తో పాటుగా
గురుబోధాంతర్గతంగా మాత్రమే గోచరమయ్యే అధ్యాత్మలక్ష్మి గురించి కొంత చర్చిద్దాం......
క్షీరసాగరమథనం లో జనించిన వివిధ దైవిక వస్తువులు మరియు దైవశక్తుల్లో భాగంగా క్షీరసాగరతనయగా శ్రీలక్ష్మి జన్మించడం, అక్కడున్న వారందరిలో ఏరికోరి స్థితికారుడైన శ్రీమహావిష్ణువుని వరించి తన హృదయదేవేరి గా అప్పటినుండి లోకంలో శ్రీలక్ష్మి ప్రసిద్ధినొందడం ఎల్లరికి విదితమే కద......
సకల ఐహిక సిరిసంపదలకే కాకుండా సకల అధ్యాత్మ విద్యలకు సిద్ధులకు కూడా ఆ శ్రీలక్ష్మి అధిదేవత...... ( సిద్ధలక్ష్మి గా / విద్యాలక్ష్మి గా సూచించబడే తాత్త్విక సమన్వయంలో... )
లౌకిక వస్తుజాలంలో మనకు గుర్తులు మాంసనేత్రద్వయానికి సదా గోచరమై ఉండి భాసించగలవు....
కాని పరతత్త్వ అధ్యాత్మ విద్యా సూచికలుగా ఉండే ఆ పారమార్ధిక గుర్తులు కేవలం మనోబుద్ధులకు ధ్యానగ్రాహ్యములు
దివ్యనయనేంద్రియగోచరములు....
కాబట్టి వాటిని అందుకోవడం కేవలం గురుబోధాంతర్గతంగా మాత్రమే సాధ్యం..... అందుకే గురువు అనే తత్త్వసూచికను కూడా శ్రీలక్ష్మి గా సూచించి గురుబోధ అనే కటాక్షాన్ని శ్రీలక్ష్మీకటాక్షంగా అభివర్నించడం......
ఆ శ్రీగురుకటాక్షం ఏవిధంగా ఆ పరతత్త్వ అధ్యాత్మ లక్ష్మీకటాక్షాన్ని మనకు అత్యంత మహోన్నతమైన రీతిలో గ్రాహ్యమయ్యేలా అనుగ్రహిస్తుందో సామాన్య లౌకిక ఉదాహరణలతో సింపుల్ గా చెప్పే ప్రయత్నం గావిస్తాను.
1. మొట్టమొదట బుద్ధిగత ప్రాణులకు అత్యంత పెద్ద సమస్య / అడ్డంకి అజ్ఞ్యానమనే జీవాంతర్గత జడరాశి.
అది కేవల మానుష ప్రయత్నంగా నిర్మూలించబడేదే అయితే లోకంలో సహజసిద్ధంగానే ప్రతిఒక్కరు యోగులు, మునులు, ఋషులు ఇత్యాది ఉన్నతమైన మనోబుద్ధిబలసంపన్నమైన జీవధారులుగా ఇట్టే మారగలరు....
అలా కానిది కాబట్టే, గురుకటాక్షం అనే ప్రత్యేకమైన అనుగ్రహసముపార్జన పిదప మాత్రమే ఆ మనోబుద్ధికుశలత దివ్యమైన యోగ్యతలను సమకూర్చుకొని ఆయా నిర్దేశిత ఆధ్యాత్మిక తత్వసూచికలకు అణుగుణంగా తన ప్రయాణాన్ని సువ్యవస్థీకరించుకుంటూ సాగగలుగుతుంది...
ఆ జీవజనితమైన అజ్ఞ్యానం అనేది అనునిత్యం జీవుడిని మాయాలో పరిభ్రమింపజేసే ఒక అనివార్యమైన విచిత్రమైన బాధాకారకం.....
రోజువారి వ్యవసాయ పనులకు పొలాలగట్ల వెంబడి నడిచివెళ్ళే వారికి పల్లేరుకాయల ముళ్ళు, తుమ్మ ముళ్ళు, రక్కసి ముళ్ళు, ఇత్యాది వివిధరకాలైన ముళ్ళతో కలిగే దైనందిన బాధలా అన్నమాట.....
ముల్లును ముల్లుతోనే తీయాలి అనె సామెత వినే ఉంటారు.....
ఏ విధంగానైతే ఈ లౌకిక ముళ్ళను ఆ ముళ్ళలాంటి పదునైన పరికరం, శ్రావణం తో ఒడుపుగా జాగ్రత్త పట్టి
మన శరీరమునుండి పెకిలించివేసి ఆ బాధకు కారణమైన ముల్లు తొలగిన పిదప స్వస్థత చేకూరేలా వ్యవహరిస్తామో.....
అచ్చం అదేవిధంగా గురుకటాక్షం అనే
అనుగ్రహం మన మనసుని బుద్ధిని శ్రావణం అనే పరికరం యొక్క రెండు పదునైన కొసలుగా మార్చి మనలోనే అంతర్నిహితమై ఉండే ఆ జీవజనితమైన అజ్ఞ్యానాన్ని తొలగించి మనకు అధ్యాత్మ స్వస్థత కలిగిస్తుంది....
2. జ్ఞ్యాన సముపార్జనకు మూలఘాతిగా ఉండే ఆ అజ్ఞ్యానం తొలగింది కాబట్టి ఇప్పుడు ఆ జీవుడికి మనోబుద్ధిబలసంపన్నత కలిగించడంలో ఆ గురుకటాక్షం ఏవిధంగా దోహదపడుతుందో చెప్తాను.....
మనం రోజు వెలిగించే దీపమే ఉదాహరణగా తీస్కుందాం.....
ఒక చక్కని ప్రమిదలో నేతిని / తైలాన్ని పోసి త్రివర్తి సమ్యుక్తంగా వెలిగించిన దీపంలో
ఆ వత్తిని ఆధారంగా చేసుకొని దేదీప్యమానంగా వెలిగే దీపశిఖ మన బుద్ధికుశలతకు ప్రతీక......
ఆ వత్తికి, మరియు దీప శిఖకు కూడా
ప్రాణదాయకం నెయ్యి / తైలం.....
ఎందుకంటే తైలం లేనిదే దీపం వెలగదు....
కేవలం ప్రమిద లో వత్తి వేసి వెలిగిస్తే ఆ వత్తి కొద్దిసేపు మండి బూడిదవ్వడమే తప్ప చాలాసమయం ఒక పద్ధతి ప్రకారంగా చూడచక్కని రీతిలో దేదీప్యమానంగా వెలగడం కుదరనిపని....
నెయ్యి / తైలం యొక్క శక్తివల్లే ఆ దీపం అనేది చాలాసమయం వరకు అలా వెలగడం, వెలుగునివ్వడం, మరెన్నో అటువంటి దీపాలను వెలిగించగలగడం, సాధ్యమయ్యేది.....
అచ్చం ఇదేవిధంగా ఆధ్యాత్మిక ఆదిభౌతిక ఆదిదైవిక తాపత్రయ నివారణకై మనం నిత్యం సాగించే జ్ఞ్యానయజ్ఞ్యంలో మన సంకల్ప వికల్ప సమూహమైన మనసనే వత్తిని ఆధారంగా చేసుకొని ఉండే బుద్ధికుశలతను అత్యంత తేజోవంతంగా ప్రకాశించేలా అనగా to shine with a razor sharp intellect,
గురుకటాక్షమనే అనుగ్రహం / తైలం తప్పనిసరి...!
నేతిని / తైలాన్ని పోసి వెలిగించిన దీపం, అనగా ఆ ప్రమిదలో వత్తి ఎంతవరకు ప్రమిద లోపల ఉండాలి ఎంత వరకు ప్రమిద కొసను దాటి బయటకి ఉండాలి ఏ విధంగా ఉంటే ఎంత వెలుగు ఆ దీపం ప్రసరిస్తుంది ఇత్యాది వాటిని ఆ తైలన్ని సమర్పించిన వ్యక్తి జాగ్రత్తగా సరిచూసి సరిచేసి నట్టుగా....
గురుకటాక్షం అనే తైలాన్ని అందించి
మనకు ఎనలేని మనోబుద్ధి బలాలను సమకూర్చిన గురువులు, వారి నిరంతర గురుబోధతో ఎప్పుడు ఎక్కడ ఏమేర ఎంతవరకు బుద్ధిబలం ఎట్లు వాడవలెను....
దానికి తాగు రీతిలో ఉండేలా ఎంతమేర మనోబలాన్ని ఆపాదించి ఆ బుద్ధిబలంతో సాధించబడవలసినవి సాధింపజేయడం అనే అత్యంత ముఖ్యమైన విషయాన్ని మనకు సరిచేసి చూపడమే ఆ గురుబోధలోని ముఖ్య ఉద్దేశ్యం....
తైలం చాలా ఉంది... వత్తి కొంచమే ఉంది....అప్పుడు వత్తిని కొంచెం చిన్నగా వెలిగేలా చేసి ఎక్కువసేపు
వెలిగించడంలోనే విజ్ఞ్యత ఉంటుంది..కద....
అదే విధంగా మన మనోబలానికి అనుగుణంగా మన బుద్ధిబలాన్ని సువ్యవస్థీరకరించేలా మనకు నిత్యం గురుబోధ సహకరిస్తూ ఉంటుంది....
ఎప్పుడైనా జాగ్రత్తగా పరికించారో లేదో......
ఒక దీపాన్ని వెలిగించినప్పుడు అందులో
మూడు వర్ణాల్లో అగ్ని జ్వలిస్తూ ఉంటుంది....
1. నీలవర్ణంలో
2. ఎరుపువర్ణంలో
3. బంగారువర్ణంలో
ఈ మూడు వర్ణాలు నిత్యం సమ్మిళితమై ఉండి జ్వలిస్తుంటాయి కాబట్టి వాటిని
అభిన్నమైనవిగానే భావించవలసి ఉంటుంది....
అట్లే ఆ దీపశిఖలా వెలిగే మన బుద్ధికుశలత కూడా నిత్యం మూడు స్థాయిల్లో దేదీప్యమానంగా జ్వలిస్తూ ఉంటుంది.....
1. స్థూలస్థాయి
2. సూక్ష్మస్థాయి
3. జీవ/ఆత్మ స్థాయి
ఈ స్థాయీత్రయం నిత్యం సమ్మిళితమై ఉంటాయి కాని దేని ప్రత్యేకత దానిదే....
వాటి యొక్క విశేషమైన శక్తులు కేవల వివిధ గురోక్త యోగమార్గగ్రాహ్యములు......
ఒక శ్రేయస్కర పరిధిలో వివరించాలంటే,
దేదీప్యమానంగా జ్వలిస్తున్న ఒక
దీపశిఖ,
1. తన పరిధిలోని చీకటిని ( రాత్రి వేళ ) పారద్రోలుతుంది....
( చీకటి అజ్ఞ్యానానికి, భయానికి, అవిద్యకు, అలక్ష్మికి ఇత్యాది వాటికి సూచకం....వాటిని నివారించి మనకు
మార్గాన్ని దర్శింపజేయడం అనేది ఇక్కడి ముఖ్య ఉద్దేశ్యం......ఇది ఆధ్యాత్మిక స్థాయీ సూచకం...
2. మన లౌకిక పనులకు కావలసిన కాంతిని ప్రసాదిస్తుంది....
అనగా ఆ దేదీప్యమైన దీపశిఖకు దెగ్గరగా ఉన్నప్పుడు మాత్రమే సాధింపబడే పనులకు ఉపయుక్తంగా ఉండడం.....ఇది ఆదిదైవిక స్థాయీ సూచకం...
3.ఉష్ణశక్తిని అందించడం....
స్థిరంగా వెలిగే ఒక చక్కని దీపశిఖ యొక్క కొసకు ఒక్కో దూరంలో ఒక్కో స్థాయిలో అది ఉష్ణశక్తిని
అందిస్తుంది.
పాపడాలు అప్పడాల తయారి పరిశ్రమ
వారికి ఆ పాకెట్లను సీల్ చేయడానికి ఒక్క 5 సెకన్ల పాటు ఆ దీపశిఖకు కార్డ్ స్వైప్ లా ప్యాకెట్ను స్వైప్ చేసి సీల్ వేస్తారు...
( ఎక్కువసేపు దెగ్గరగా పెడితే పాకెట్ కాలిపోతుంది....తక్కువసేపు పెడితే సీల్ సరిగ్గా పడదు....ఎంత సేపటికి చుట్టూ ఉన్న గాలి లోపలికి వెళ్ళకుండా సీల్ పడుతుందో అంతసేపు మాత్రమే ఆ ప్యాకెట్ను అగ్నికి దెగ్గరగా స్వైప్ చేయడం గమనించే ఉంటారు....)
చలిలో ఒంటికి వేడి తగిలేలా ఆ దీప శిఖకు ఎంత దూరంలో చేతులను ఆడిస్తు ఆ ఉష్ణశక్తిని గ్రహించాలో అలా చేయడం గమనించే ఉంటారు....
ఎక్కువ దెగ్గరగా పెడితే చేతులు కాలడం....ఎక్కువ దూరంలో పెడితే వేడి అందకపోవడం మనకు తెలిసిందే ...
ఇలా వివిధ రీతుల భౌతిక స్థాయిలో మనం ఏ విధంగానైతే ఉష్ణశక్తిని దీపం నుండి గ్రహిస్తామో
అదే విధంగా ఇది ఆదిభౌతిక స్థాయీ సూచకం...
ఇవ్విధంగా మన మనోశక్తిని ఆధారంగా చేసుకొని జ్వలించే బుద్ధికుశలత బలసంపన్నత లో సమ్మిలితమై ఉండే మన మనోబుద్ధిశక్తులు కూడా గురోక్త అధ్యాత్మవిద్యాగ్రాహ్యంలో అలా 3 స్థాయిల్లో సంచరించి మనకు కావలసినవి సాధించిపెట్టడం కూడా పైన చెప్పిన విధంగా మనం సామ్యాన్ని గమనించవచ్చు....
కాకపోతే లౌకిక దీపం, దీపశిఖ,
దీపాన్ని ఆధారంగా చేసుకొని సాగే వివిధ కార్యక్రమాలు మనకు దృగ్గోచరములు...
కాని మన హృదయకుహరంలో నిత్యం వెలిగే ఆ ఆత్మజ్యోతికి ఉద్దీపనం కలిగించే గురుబోధ, గురుబోధాంతర్గతమైన ఆ అధ్యాత్మ వస్తు విషయ విజ్ఞ్యాన సామాగ్రి కేవలం మన జ్ఞ్యానేంద్రియ గ్రాహ్యము.....
మన అధ్యాత్మ యోగసాధనా బలానికి అనుగుణంగా అవి వివిధ ఉన్నతమైన స్థాయిల్లో చరించునప్పుడు వాటి శక్తి కేవలం ఆత్మానుభవము మాత్రమే అని చెప్పవలసిఉంటుంది.
మనం వెలిగించుకున్న ఒక లౌకిక దీపం యొక్క శక్తితో ఏ ఏ కార్యాలు సాధించుకుంటామన్నది మన యొక్క విచక్షణకు విజ్ఞ్యానానికి సంబంధించిన విషయం....
ఒక్కో కార్యానికి ఒక్కోలా దీపంలోని తైలం ఖర్చవ్వడం అనేది సత్యం....
కాబట్టి జాగ్రత్తగా మనం ఆ శక్తిని
అవసరమైన ముఖ్యమైన పనులకు మాత్రమే వాడుకున్నట్టుగా....
అధ్యాత్మ విద్యాజనిత వివిధ యోగసాధనాబలాలను కూడా అట్లే ముఖ్యమైన పనులకు మాత్రమే వెచ్చించబడడం అనేది ఇక్కడి సామ్యము...
అక్కడ తైలం ఖర్చవ్వడం ఎట్లో ఇక్కడ ఆ ఉపాసనాబలం అనే జీవాంతర్గతమైన యోగశక్తి ఖర్చవ్వడం కూడా అట్లే....
అక్కడ దీపంలో తైలం నిండుకుంటే మనకు మనమే గమనించి ఇంకొంచెం అందులో పోసి ఆ దీపం అట్లే స్థిరంగా జ్వలించేలా చేయడం ఎట్లో....
ఇక్కడ గురుబోధాంతర్గతంగా గురువానుగ్రహంగా సమకూరే జ్ఞ్యానయోగశక్తిని నిరంతరం అందిస్తు
ఆ ఆత్మశక్తి దేదీప్యమానంగా నిరంతరం జ్వలించేలా చేయడం సదరు సాధకుడి స్వాధ్యాయ మనన స్మరణ నిధిధ్యాసన అంగన్యాస కరన్యాస మనోన్యాస బుద్ధిన్యాసమనబడే అష్టవిధ జ్ఞ్యానదిగ్బంధనం అనే ప్రక్రియపై ఆధారపడి ఉంటుంది....
వీటన్నికి గురుబోధలో భాసించే అధ్యాత్మ సూచికలే మూలకారణం కాబట్టి గురువును, గురుబోధను గుర్తుగా / సూచికగా అనగా అధ్యాత్మ లక్ష్మి గా పరిగణించబడం...
కాబట్టి ఒక సద్గురువు / సద్గురువాగ్బలం లభించడమే ఎవ్వరి జీవితానికైనా సరే లభించే అమూల్యమైన వరం....!!
ఆ సద్గురువాగ్బలం అనే మహత్తరమైన వరంతో ఇతరములైన ఎన్నెన్నో వరాలను మనం సముపార్జించుకోగలం కాబట్టే, ఆషాఢపౌర్ణమి / గురుపౌర్ణమి తరువాత వచ్చే శ్రావణపౌర్ణమికి ముందు ఉండే శుక్రవారాన్ని శ్రీవరలక్ష్మీవ్రతపర్వదినంగా ఆ శ్రీలక్ష్మి ఇలలో చారుమతి స్వప్నవృత్తాంతం ద్వారా తన వైభవాన్ని ఎల్లరికి అందించి తరించేలా అనుగ్రహించింది....😊
ఎల్లరు ఆ శ్రీవరమహాలక్ష్మి అనుగ్రహంతో తమ తమ జీవితాలను గురువానుగ్రహంతో వరాలవెల్లువగా మార్చుకొని తరించెందరు గాక...😊
శ్రీతాళ్ళపాక అన్నమాచార్యుల వారు
తమ
"జయలక్ష్మి వరలక్ష్మి...."
అనే కీర్తనలో
"నీలవర్ణునురముపై నిండిన నిధానమవై
ఏలేవు లోకములు మమ్మేలవమ్మ...."
అని చమత్కరించడంలో శ్రీశ్రీనివాసుని విశాలవక్షసీమపై శ్రీవ్యూహలక్ష్మి గా కొలువైన అమ్మవారినే వరలక్ష్మిగా కీర్తిస్తు,
ఎల్ల లోకాలను ఏలే ఆ శ్రీవరలక్ష్మి అమ్మవారిని మన జీవితలను కూడా చల్లగా ఏలి అనుగ్రహించమని స్తుతించారు....😊
http://annamacharya-lyrics.blogspot.com/2007/11/352jayalakshmi-varalakshmi.html?m=1