శ్రీ చాగంటి సద్గురువులు మనకు బోధించినట్టుగా మన చాంద్రమాన తిథుల్లో అత్యంత ప్రశస్తమైన 11వ తిథి గా " ఏకదశి " అనే తిథి, మురాసుర వధలో అలసిన శ్రీమహావిష్ణు యొక్క దివ్యదేహం నుండి బయల్వడిన ఒక స్త్రీశక్తి కి ఇవ్వబడిన వరం కారణంగా ప్రభవించడం......ఒక సంవత్సరకాంలో 12 శుక్లపక్ష ఏకాదశులు + 12 బహుళపక్ష ఏకాదశులు = మొత్తం 24 ఏకాదశులు ఉండడం, వాటిల్లో ప్రత్యేకించి ఆషాఢ శుద్ధ ఏకాదశి / తొలి ఏకాదశి ని దేవశయన ఏకాదశి గా, కార్తీక శుద్ధ ఏకాదశి ని దేవోత్థాన ఏకాదశి అనే పండుగలుగా జరుపుకోవడం సిరా, సేమియా పాయసం, పులిహోర, ఇత్యాదివి దేవుడికి నివేదించి మనమే ఆరగించి సంతోషించడం ఇవన్నీ ఎల్లరికి విదితమైన అంశాలే కద....😊
నా పాతపోస్ట్లో ఇదివరకే దేవోత్థాన ఏకాదశి, ముక్కోటి / వైకుంఠ ఏకాదశి అనే పర్వదినముల ప్రత్యేకత గురించి వివరించి ఉన్నాను కద......
ఇక ఇప్పుడు ఈ దేవశయన ఏకాదశి యొక్క ప్రత్యేకత గురించి చర్చిద్దాం.....
ఈ పదం విన్న వారు ఎవరైనా సరే దేవతలందరు నిద్రకు ఉపక్రమించే సమయానికి సూచికగా, దక్షిణాయణ పుణ్యకాల ప్రారంభానికి సూచికగా,
ఇది దేవశయన ఏకాదశి అని పిలుస్తారు అనే ఇట్టే చెప్పడం కద్దు....కద.....
అసలు దేవతలు శయనించడం ఏంటి...?
దేవతాసార్వభౌముడైన ఆ శ్రీమహావిష్ణువు యోగ నిద్రలోకి వెళ్ళడం ఏంటి....ఎందుకు....??
ఇత్యాది అధ్యాత్మ విషయ విశేషాలను పరికిద్దాం.....
మనతో పాటుగా అనగా మనుష్యులతో పాటుగా ఈ భూప్రపంచంపై ఆధారపడి బ్రతికే ప్రాణికోటి సమస్తానికి ఎన్నోవిధములైన ద్వంద్వములు అనేవి సహజం......
పగలు రాత్రి, వెలుగు చీకటి, సుఖం దుఖం, ఇత్యాదిగా ఎనెన్నో ద్వంద్వముల మధ్యన ప్రతి ఒక్కరి జీవితం ఉండడం మనకి విదితమే కద.......
ఈ ద్వందాలతో మమేకమై జీవించడం
సర్వసాధారణం.....
వాటికి అతీతంగా జీవించగలగడమే ప్రత్యేకత.... కద....
మనం గమనిస్తే మన చుట్టు ఉండే సమాజంలోనే మన ఇంట్లో, మన బంధువుల్లో, మన దోస్తుల్లో, మన పరిచయస్తుల్లో, ఇలా మనకు తెలిసిన
వారందరిలో రెండు రకాలైన వారు ఉండడం మనం చూస్తుంటాం......
మన మంచి కోరే వారు...
మన ఉన్నతికి తోడ్పాటు అందించే వారు....
మనం బావుంటే సంతోషించే వారు....
ఇలా ఒక వర్గం మొత్తం ఎల్లవేళలా మన మంచి కోరుకునే మిత్ర వర్గం......
మరో వైపు
మనకు మంచి జరిగితే ఓర్వలేని వారు...
మన ఉన్నతికి కావలని అడ్డుపడే వారు....
మనం బావుంటే దుఖించే వారు....
మనం ప్రశాంత జీవింతంలో వారి అసూయాజనిత కుంపట్లు రగిలించే వారు.....
ఇలా ఒక వర్గం మొత్తం ఎల్లవేళలా మనం బావుంటే భరించలేని దుష్టవర్గం......
ఎవ్వరు ఔనన్నా కాదన్నా ఇది లోక సహజమైన రీతి...
ఈ వర్గద్వయంలో మన శ్రేయోభిలాషులు ఎవరో గమనించి వారితో జీవితాన్ని సుసంపన్నం గావించుకోవడం, మరియు
మనను ఓర్వలేని వారికి ఎప్పుడు ఎక్కడ ఎలా అడ్డుకట్ట వేయాలో అలా వేసి, వారిని కట్టడి గావించి మనకు వారు కలిగించే అవరోధాలనే మన విజయ సోపానలుగా మలిచి జీవిత ప్రాయాణం సాగించడమే ఎల్లరికి విహిత ధర్మం.....
శ్రీ చాగంటి సద్గురువులు మనకు బోధించినట్టుగా ఈ పాంచభౌతికమైన ప్రపంచం అనగా పంచభూతాలు మరియు వాటి గుణకంగా ప్రభవించిన ప్రాణికోటి.....
ఇంకా సరిగ్గా చెప్పాలంటే
" ప్రపంచం " అనగా పంచవిధమైన
లక్షణములతో అలరారే పాంచభౌతిక మాయ....!
1. పుట్టుట
2. పెరుగుట
3. మార్పుచెందుట
4. తరుగుట
5. గిట్టుట
ఈ ప్రపంచంలోని ఏ పాంచభౌతిక వస్తువు / ప్రాణి అయినా సరే ఈ ఐదు దశలలోనే తన ప్రయాణం గావించడం వినా మరో మార్గం ఉండదు....
రాజ్యాలను ఏలేటి రాజాధిరాజులైనా,
దైనిక జీవితంకోసం కష్టించే కూలివారైన సరే.....
అద్దాల షాప్లో కొనుకున్న బాగ కాస్ట్లి చెప్పులైనా సరే.....
రోడ్డుమీద కొనుకున్న వందరూపాయల స్లిప్పర్లైనా సరే.....
ఈ 5 దశల్లోనే ప్రయాణం గావించి తుదకు లయించిపోవడమే ఈ మర్త్యలోకం యొక్క రివాజ్.....
ఇక్కడ గమనిస్తే, ఈ 5 దశల్లో మొదటి రెండు మరియు చివరి రెండు దశలు కూడా అంతగా ఎవరు పట్టించుకోని దశలు......
కాబట్టి ఎల్లరి తాపత్రయమంతా కూడా
" మార్పు చెందుట " అనబడే అ మధ్యదశ గురించే....
అవునా....కాదా....??
అవును....ఎందుకంటే మిగతా 4 దశలు మన అధీనంలో ఉండని దశలు......
కేవలం "మారు చెందుట" మాత్రమే మన అధీనంలో ఉండే దశ.....
ఇక్కడ " మార్పు చెందుట " అనగా అది ఆంతరము / బాహ్యము అనే ఇరువిధాల ఉండే దశ......
" ఏరా.....అప్పుడు 5 ఏళ్ళ క్రితం సరైన తిండి లేక ఎడారిప్రాంతవాసుల లాగా బక్కపర్సనాలిటి గా ఉండేవాడివి.....
ఇప్పుడు బాగా నిగనిగలాడుతున్నావ్......."
అని ఎవరైనా అన్నప్పుడు ఇక్కడ బాహ్య శరీరం యొక్క మార్పు గురించి మనం వచించినట్టు.....
ఇది ఎల్లరికీ దృగ్గోచరమయ్యే మార్పు...
" ఏరా.....అప్పుడు 10 ఏళ్ళ క్రితం ఒక చక్కని సొంతిల్లు కూడా లేనివాడివి, ఇప్పుడు రాజాకీయాల్లోకి వచ్చి వందల కోట్లు పోగేసావంట..... నీకు ఊరికో ఇల్లంట.....లెక్కలేనన్ని బినామి బిసినెస్లంట.....నీ 100 తరాల వారు నీలా బ్రతికినా కరిగిపోని సిరిసంపదలంటా.......పదేళ్ళలో బానే కూడబెట్టావ్రోయ్......"
అని ఎవరైనా అన్నప్పుడు ఇక్కడి ఆ సదరు ప్రాణి యొక్క మార్పు కొంతమేరకు దృగ్గోచరం కొంత మేర అగోచరం........
" ఏరా.....అప్పుడు 10 ఏళ్ళ క్రితం
ఒక్క అక్షరం ముక్క కూడా సరిగ్గా రానివాడివి......
ఇవ్వాళా గోదావరి ప్రవాహాంలా నీ సారస్వత ఝరి దూసుకెళ్తుంది......
నీలో ఎంత గొప్ప మార్పురా......
నీకు విద్యనందించి ఇంత ఘనమైన మార్పు అనుగ్రహించిన నీ గురువులకి ఎన్ని దండాలు పెట్టాలో కద......"
అని ఎవరైనా అన్నప్పుడు ఇక్కడ ఆ సదరు ప్రాణి యొక్క మార్పు కేవల శారీరకం / భౌతికం కాదు కాబట్టి అది దృగ్గోచరం కానేరదు......
ఇప్పుడు ఇక్కడ మనం మాట్లాడుకునే మార్పు అనేది
ఒక చోట / ఒక స్థ్యాయిలో గోచరం
ఒక చోట / ఒక స్థ్యాయిలో ఒకింత గోచరం.....
ఒక చోట / ఒక స్థ్యాయిలో అగోచరం.....
కాని అన్ని చోట్ల " మార్పు చెందడం "
అనే ప్రక్రియ మాత్రం జరిగింది......
వారి వారి జ్ఞ్యాన పరిణతి కి అనుగుణంగా
ఒక్కొకరికి ఒక్కోలా ఒక్కో స్థాయిలో ఆ మార్పు అనేది గ్రాహ్యమవ్వడం ఇక్కడ మనం గమనించగలిగే సత్యం....అవునా..?
అచ్చం ఇదే రీతిలో, ఒక సైద్ధాంతిక కర్మసూత్రానికి లోబడి ఉండే ఆ పరమాత్మ శాసనం కూడా సదరు జీవుడి ప్రార్ధన, సాధన, ఆర్తికి అనుగుణంగా
" మార్పు చెందడం " అనే ఒక దైవిక జీవప్రక్రియ ఈ తొలి ఏకాదశి తిథితో మొదలై కార్తీక శుద్ధ ఏకాదశి వరకు సాగడం, ఈ " జీవజనితమైన కర్మసిద్ధాంతర్గతమైన మార్పు " ను
ఈ దక్షిణాయణ పుణ్య కాలంలో తన "యోగ నిద్రలో" ఆ పరమాత్మ కావించడమే ఈ చాతుర్మాస్య విశేషం......
శ్రీ చాగంటి సద్గురువుల ప్రవచనాల్లో మనం విన్నట్టుగా,
ఫలాన మహానుభావులు / పీఠాదిపతులు / చాతుర్మాస్యానికి ఫలాన చోట తమ బసకు ఏర్పాట్లు చేస్కున్నారు అని అన్నప్పుడు దాని అర్ధం వారి దేశాటనం అనే ప్రక్రియకు ఒ 4 నెలలు సెలవు ఇచ్చి ఒకే చోట స్థిరంగా ఉండి సాధన సాగించడం అని.....కద.....
అటువంటి మహానుభావుల చే / పీఠాదిపతులచే నిరంతరం సేవించబడే పరమాత్మ కూడా తన చాతుర్మాస్యాన్ని అనగా స్థిరంగా తన వైశ్విక శక్తులన్నింటిని తనలోకి లీనంగావించుకొని అసంఖ్యాకమైన కోట్లకొలది బ్రహ్మాండాంతర్గత జీవుల హృదయ కుహరాల్లో ఉన్న తన
" అంతర్యామి " స్వరూపంతో మిగతా 4 స్వరూపాలుగా ఉండే పరమాత్మ అనుసంధానం చెంది వారి ఉద్ధరణకు కర్మగతమైన బాటలను వేసే వైనమే ఈ శ్రీమహావిష్ణువు యొక్క యోగనిద్రా రహస్యం......
( పర, వ్యూహ, విభవ, అర్చ, అంతర్యామి, అనేవి శాస్త్రం మనకు బోధించిన పరమాత్మ యొక్క పంచవిధమైన ఉనికికి ప్రతిరూపాలు....)
ఇంకా సింపుల్ గా చెప్పలంటే మన సాఫ్ట్వేర్ ప్రపంచంలొ మనం పిలుచుకునే "డౌన్ టైం" అని ఈ పరమాత్మ యొక్క యోగనిద్రను మనం భావించవచ్చు....
"డౌన్ టైం" అంటే "షట్ డౌన్" అని కాదు కద.....
' A "Down Time " refers to that time period when all the systems / applications / production instances are temporarily made unavailable to the larger global audience so that their maintenance / patching / upgrade and other vital operations can be executed so that the system on the whole gets updated to a new level of seamless razor sharp executional realm......'
where as a " Shut down " refers to that process where in all of the infrastructure gets switched off thus making it unavailable, for what so ever reasons, until it is brought back up.......
'డౌన్ టైం' లో జరిగిన చాలా మార్పులను, ఆ తదుపరి కాలంలో మనం గమనించవచ్చు......
కాని 'షట్ డౌన్ లో ఏ విధమైనా మార్పులు కూడా జరగవు......
ఇదన్నమాట క్లుప్తంగా పరమాత్మ యొక్క యోగనిద్రకు సంబంధించిన మన ఆధునిక సాఫ్ట్వేర్ ప్రపంచం లోని సామ్యము.....😊
ఆకాశం, భూమి, రెండు కూడా పూర్ణత్వం కలిగిన పరమాత్మ సామ్యములు కాబట్టి మిగతా మూడింటిని ఇక్కడ పరికిద్దాం....
1. వాయువు
2. అగ్ని
3. జలం
మీరు ప్రకృతిని గమనిస్తే
ఈ మూడు కూడా తమ తమ సహజ స్వాభావిక లక్షణం తో మనల్ని అనుగ్రహిస్తున్నాయి.......
మరియు వాటిని తమ అధీనంలోకి తెచ్చుకున్న మానవుడు శాసించిన విధంగా ప్రవర్తించి కూడా మనల్ని అనుగ్రహిస్తున్నాయి.......
1. వాయువు
సహజంగా ఎటుపడితే అటు గాలివీస్తుంది.....కాబట్టి మీరు భూమిపై ఎక్కడున్నా సరే గాలిలోని ప్రాణవాయువును పీల్చి తన్మూలంగా అనుగ్రహం పొందుతున్నారు......అవునా...
మరియు ఆ వాయువును తన అధీనంలోకి తీసుకున్న మానవుడు ఆక్సిజెన్ సిలిండర్లో దాన్ని బంధించి ఎవరి ఊపిరితిత్తులకు ఎంత ప్రాణవాయువు అవసరమో అంత లభించేలా వాయివు మీద తన పట్టును సాధించాడు.....అవునా....
2. అగ్ని
సహజంగా ఊర్ధ్వ దిశలో మాత్రమే
అగ్ని జ్వలిస్తుంది.......
ఇంట్లో పొయ్యి దెగ్గరి నుండి గుళ్ళోని హోమగుండంలో
" ఓం ***** జ్వాలా నరసిమ్హాయా స్వాహా......" అని హవిస్సు సమర్పించినప్పుడు జ్వలించే యాగాగ్ని వరకు, ఊర్ధ్వముఖంగా జ్వలించే అగ్ని మనకు ఎంతో సహాయం చేస్తోంది...కద.....
మరియు
కేవలం ఊర్ధ్వముఖంగా జ్వలించే అగ్నిని తన అధీనంలోకి తెచ్చుకొని క్రయోజెనిక్ ఇంజన్లో అధోముఖంగా జ్వలింపజేసి రాకెట్ ని నింగిలోకి దూసుకెళ్ళెలా చేసి అందున్న సాటిలైట్ ని నిర్దేశిత కక్ష్యలోకి ప్రవేశబెట్టి తనకు తగురీతిలో అందుబాటులో ఉండే పౌనహ్పున్యంతో యావద్ ప్రపంచంతో సంభాషించే అత్యాధునిక సాంకేతిక వ్యవస్థను ఏర్పాటుచేసుకొని అగ్నివల్ల అనుగ్రహాన్ని పొందుతున్నడు మానవుడు.....
3. జలం
సహజంగా పల్లం వైపు ప్రయాణించడం నీటి యొక్క సహజ స్వాభావిక లక్షణం.....
కాబట్టి గ్రావిటి క్యనాల్స్ ద్వారా నదీజలాలను రిసర్వాయర్లకు తరలించడం, ఎక్కడ ఆనకట్ట కట్టాలో అక్కడ కట్టి జలప్రవాహన్ని కట్టడి గావించి తనకు ఉపయుక్తమైన రీతిలో ఆ నీటిని హైడ్రొ ఎలెక్ట్రిసిటి ని ఉత్పత్తి చేయడానికి ఉపయోగించడం, ఇత్యాదిగా నీటిని తన సహజమైన వాలుకు అనుగుణంగా ప్రయాణింపజేసి మేలును పొందడమే కాకుండా.....
భారి బాహుబలి మోటార్ల ద్వారా అత్యాధునిక సాంకేతిక వ్యవస్థను ఉపయోగించి నీటిని తనకు కావలసిన రీతిలో కావలసిన దిశలో ప్రయాణింపజేసి నీటిపై తన ఆధిపత్యంతో మేలును పొందుతున్నాడు మానవుడు......
ఇవ్విధంగా వివిధ ద్వంద్వముల తో జీవిస్తు, ఆయ ద్వంద్వాలకు అతీతంగా పలువిధాలుగా ఆయా ద్వంద్వములను తన అధీనంలోకి తీసుకునేంతగా, ఈ పాంచభౌతిక ప్రపంచం మనిష్యుడికి అంత అనుగ్రహాన్ని అనగా అంతటి మేధోసంపత్తిని అనుగ్రహించడానికి కారణం కేవలం పరమాత్మ యొక్క అనుగ్రహం......
ఈ బృహత్ వ్యవస్థ మొత్తం
" మార్పు చెందడం " అనే రెండు పదాల్లోకి ఇమిడిపోతుంది......
కాబట్టి మనకు అనుభవయోగ్యమైన ఎన్ని మార్పులకైనా సరే ఆ శ్రీమహావిష్ణువు యొక్క యోగనిద్రలోని అనుగ్రహమే మూలకారణం.....
ఇటువంటి ఎన్నెన్నో సూక్ష్మ, స్థూల, భౌతిక/లౌకిక, అలౌకిక, స్థాయిలో మార్పులకు శ్రీకారం ఆ శ్రీనివాసుని యోగనిద్ర.....
కొన్ని సాధారాణ మానవ గ్రాహ్యములు.....మరికొన్ని ఎంతో గురువానుగ్రహభరితమైన సాధనతో మాత్రమే మానవగ్రాహ్యములు......
శ్రీ చాగంటి సద్గురువులు పరమాత్మ యొక్క లయ ప్రక్రియ గురించి చెప్పినప్పుడు, అనగా మన రోజువారి నిద్ర అనే "స్వల్పకాలిక లయం" గురించిన విశేషాలు మనకు తెలిపినారు కద.....
ఆ నిద్రలో మన
ఇంద్రియాలు మనసులోకి,
మనసు బుద్ధిలోకి,
బుద్ధి ఆత్మలోకి,
ఆత్మ సుషుప్తి అనే అచేతనావస్థలోకి
వెళ్ళడం.....
అనే ప్రక్రియలో ఒక్క రాత్రి మన శరీరంలో ఎన్ని బాహ్యాంతర మార్పులు జరుగుతాయో, ఒక రాత్రి నిద్ర దూరమైన వారికి మాత్రమే అది తెలిసివస్తుంది......
అచ్చం అదే విధంగా ఒక్క దక్షిణాయణ కాలంలో ఈ చాతుర్మాస్య కాలంలో పరమాత్మ తన యోగనిద్రలో ఈ పాంచభౌతిక ప్రపంచగతమైన మన ఇహ పర జీవితాలకు సంబంధించిన ఎన్నెన్ని మార్పులు గావిస్తాడో ఆయా యోగ స్థాయిలో తమ చిత్తాలను సంపూర్ణ చేతనంతో లయించివేసే యోగులకు మాత్రమే అది గ్రాహ్యము.....!
అన్యులకు అది కేవలం దేవశయన ఏకాదశి, దేవోత్థాన ఏకాదశి, అనబడే రెండు పండగల మధ్య ఉండే ఒక సామాన్యమైన కాలం....😊
ఆత్మ శక్తి కారకుడైన సూర్యుడి ఏక చక్ర రథాన్ని అనూరుడు భూమికి దూరంగా దక్షిణం వైపునకు తోలడం ప్రారంభించబోతున్నాడు కాబట్టి,
ఆ శ్రీమన్నారాయణ పరమాత్మ యోగనిద్రలో ఉండే ఈ సమయంలో భక్తులెల్లరికి బాగ జీవశక్తిని అనుగ్రహించేలా తన అభిన్నమైన శక్త్యాంశగా, తన సహోదరిగా కాలము యొక్క పగ్గాలను అందుకొని జీవులను శాసించే నారాయణి గా ఉండే ఆదిపరాశక్తి భక్తుల్లెలరిని ఈ దక్షిణాయణంలో విశేషంగా అనుగ్రహించి రక్షించు గాక.....😊
అందుకే అన్నమాచార్యుల వారు తమ సంకీర్తనల్లో ఎన్నెన్నో విధాలా చిత్రవిచిత్రమైన పదబంధనాలతో ఆ పరమాత్ముడిని స్తుతించినవైనంలో,
'మంగళం గోవిందునకు' అనే ఒక చక్కని సంకీర్తనలో,
" కాత్యాయనీనుతునకు
పంకజాసనవరదునకు
భవపంకవిచ్ఛేదునకు
భవునకు
విశ్వమూర్తికి "
అనే పదబంధనాలతో ఆ పరమాత్మను ఎంతో ఘనంగా స్తుతించారు......
"కాత్యాయనాయ విద్మహే కన్యకుమారి ధీమహి తన్నః దుర్గిః ప్రచోదయాత్ స్వాహా......" అని మనచే హవిస్సులను స్వీకరించబడే ఆ కాత్యాయన మహర్షి యొక్క తనయ గా అవతరించిన ఆదిపరాశక్తిచే నుతింపబడే ఆ శ్రీశ్రీనివాస పరదైవం యొక్క పరమాత్మ తత్త్వం ఎంత సులభమైనదో అంతే గంభీరమైనది కూడాను.....
అది ధ్యానగమ్యమే కాని వాక్కులకు సంపూర్ణంగా అందేది కాదు....😊
********************************
ప: మంగళము గోవిందునకు జయమంగళము గరుడధ్వజునకును
మంగళము సర్వాత్మునకు ధర్మస్వరూపునకూ, జయజయ
చ: ఆదికినినాదైనదేవున కచ్యుతున కంభోజణాభున-
కాదికూర్మంబై నజగదాధారమూర్తికిని
వేదరక్షకునకును సంతతవేదమార్గ విహారునకు బలి-
భేదికిని సామాదిగానప్రియవిహారునకు
చ: హరికి బరమేశ్వరునకును శ్రీధరునకును గాలాంతకునకును
పరమపురుషోత్తమునకును బహుబంధదూరునకు
సురమునిస్తోత్రునకు దేవాసురగణశ్రేష్ఠునకు కరుణా-
కరునకును గాత్యాయనీనుతకలితనామునకు
చ: పంకజాసనవరదునకు భవపంకవిచ్ఛేదునకు భవునకు
శంకరున కవ్యక్తునకు నాశ్చర్యరూపునకు
వేంకటాచలవల్లభునకుమ విశ్వమూర్తికి నీశ్వరునకును
పంకజాకుచకుంభకుంకుమ పంకలోలునకు
No comments:
Post a Comment