శ్రీమద్భాగవత ప్రవచనాంతర్గత క్షీరసాగరమథన ఘట్టాంతర్గతమైన శ్రీలక్షీ ఆవిర్భావ సమయంలో సకలదేవతలు కలిసి ఆ సముద్రతనయను స్తుతించిన మహాశక్తివంతమైన మహిమాన్వితమైన స్తోత్రరత్నం....
శ్రీచాగంటి సద్గురువుల ప్రవచనాలను తమ లైఫ్ టైం R&D సబ్జెక్ట్ గా స్వీకరించి శ్రమించిన లక్షలాది మంది శిష్యుల జీవితాలను ఎంతో ఘనంగా ఉద్ధరించిన ఘనత ఈ స్తోత్రరత్నం సొంతం....
చిన్నదే కదా అనుకొని చిన్నచూపు చూడకండి..... ఎన్నెన్నో మహాశక్తివంతమైన బీజాక్షరముల / మంత్రాక్షరముల సంఘాతమై ఒప్పారే ఈ స్తోత్రం యొక్క శక్తి అనంతం.....
అది రీసర్చ్ చేసి అందుకున్నవారికి అందుకున్నంత అనుగ్రహం....
ఒక గ్రనేడ్ లోని శక్తిని సంక్షిప్తం చేసిన ఒక సన్నని పిన్ను ముక్క కూడా చిన్నదే.....
కాని అది తీసి ప్రత్యర్ధులపై విసిరిన తదుపరి జరిగే విస్ఫోటనం తర్వాత ఆ చిన్న సన్నపాటి పిన్ను ముక్క ఎంతటి శక్తిని తన అధీనంలో బంధించిందో మనకు తెలిసి వచ్చినట్టుగా.....
కొన్ని శక్తివంతమైన స్తోత్రాలు కూడా అంతే...
అవి భక్తితో అనుసంధించిన తదుపరి వర్షించే ఈశ్వరానుగ్రహం అందుకున్న వారికి మాత్రమే వాటి మహిమ్నత గోచరమౌతుంది....
అన్నింటిని మించి గురువాక్యము నందు ఎనలేని విశ్వాసం / భక్తి కలిగిఉండి దేవతా ప్రీత్యర్ధమై సంధించబడే స్తోత్రములు ప్రసాదించే అనుగ్రహం అమేయం.....😊
https://youtu.be/IeNxTPF3i_k
No comments:
Post a Comment