శ్రీసుశీలమ్మ గారిని వరించిన పద్మభూషణ్ అవార్డ్ కి ఒక హుందాతనం లభించగా, ఆ హుందాతనం నాక్కూడా త్వరలో లభిస్తే ఎంత బావుణ్ణు అని పద్మవిభూషణ్ & భారతరత్న అవార్డ్లు ఎదురుచూసేంతటి హుందాకరమైన గాయనీమణి సుశీలమ్మ గారు....
తెలుగు వెలుగులను తరతరాలు అందుకొని తరించేలా సంగీత సాహిత్య స్రష్టలను ఆదరరించి గౌరవించిన శ్రీకృష్ణదేవరాయల విజయనగరసామ్రాజ్యా ఠీవిని తమ కంఠంలో ఆసాంతం నింపుకున్న తెలుగు సినీ సంగీత సామ్రాజ్ఞిగా సుశీలమ్మ గారు గత 60 వసంతాలుగా కోట్లమంది శ్రోతల హృదయాల్లో కొలువైన ఒకానొక అపురూప గంధర్వ గాయనీమణి....
ప్రాణాయామ శక్తితో అక్షరశక్తిని
సమ్మిళితంగావించి సంగీత స్వరాత్మక లహరుల్లో సాహిత్య పదగుళికలను ఎక్కడ ఎలా ఎంతవరకు తేలియాడేలా ఆలపించాలో అలా ఆలాపించే అత్యంత అరుదైన వారిలో సుశీలమ్మ గారిది అగ్రస్థానం అనేది సినీ ఇండస్ట్రీలో ఎల్లరికీ తెలిసిన సత్యం....
ఒక్క చిన్న హం కూడా వినపడకుండా ఏకబిగిన అతిమంద్ర స్థాయి నుండి తారా స్థాయి వరకు కర్ణపేయమైన శృతిలో ఆలపించగలగడం ఎలా సాధ్యం....?
అంతటి ప్రౌఢ గంధర్వకళ మనుష్యులకు ఎలా సంభవం...??
అనేలా సంభ్రమాశ్చర్య జనకంగా ఉన్నదంటే అది సుశీలమ్మ గానం అని అనడం అతిశయోక్తికానేరదు...!
వారి వేలకొలది పాటల్లో ఉండే గాత్రవైవిధ్యాన్ని ఒక్క పాటలోని ఆలాపనలోనే ఆకళింపుజేసుకోవాలంటే.....
ప్రపంచంలో ఎంతోమంది ఇప్పటికీ మరియు ఎప్పటికీ వింటూ సేదతీరే...
"లాలి లాలి...." అనే జోలపాటలో...
( స్వాతిముత్యం (1986) సినిమా లో శ్రీమద్భాగవతాంతర్గత భగవద్ తత్త్వాన్ని ఒడిసిపట్టిన సాహితీ స్రష్టలైన సింగిరెడ్దినారాయణరెడ్డి గారి కలం నుండి జాలువారిన కవనానికి, స్వర స్రష్టలైన ఇళయరాజ గారి సంగీతంలో జీవంపోసుకున్న అజరామరమైన జోలపాటలో....)
" అలమేలుపతికి అన్నమయ్యలాలి...
కోదండరామునికి గోపయ్యలాలి...
శ్యామలాంగునికి శ్యామయ్యలాలి....
ఆగమనుతునికి త్యాగయ్యలాలి....
లాలి లాలి లాలి లాలి.....
వటపత్రశాయికి వరహాలలాలి..... "
అనే ఆలాపనను శ్రద్ధగా ఆలకిస్తే
వారు ఔపోసనపట్టిన గాంధర్వగాయత్రి ఎంతటి ఘనమైనదో విజ్ఞ్యులకు అవగతమౌతుంది అనేది జగమెరిగిన సత్యం...
మధురమైన గానం వేరు...
గాత్రధర్మానికి జీవాన్ని సమకూర్చి గానాన్ని అమరగానం గావించడంవేరు....
ఆ అమరగానం శ్రోతల హృదయసీమలను సదా రంజింపజేసేవిధంగా అమరగానానికి గాంధర్వామృతాన్ని అలదడం వేరు.....
అలా తమ అమర ఆలాపనలకు గాంధర్వామృతాన్ని అలదడంలో సుశీలమ్మ గారిది ఆరితేరిన ప్రజ్ఞ్య అనేది ఎన్నో పాటల్లో ఎల్లరూ గమనించగల విశేషం.....
అందుకు " స్వర్ణకమలం " సినిమాలోని.....
" అలుపెరుగని ఆటలాడు వసంతాలు వలదంటె విరివనముల పరమళముల విలువేముందీ... విలువేముందీ....
ఘల్లు ఘల్లు ఘల్లుమంటు మెరుపల్లే తుళ్ళు
ఝల్లు ఝల్లు ఝల్లున ఉప్పొంగు నింగి వొళ్ళు."
అనే వారి ఆలాపన ఒక మచ్చుతునక...
తెలుగు లోగిళ్ళలో సంగీతాభిమానుల సవ్వడులు ఘల్లు ఘల్లు మంటూ ఉన్నంత కాలం....
సుశీలమ్మ గారి గాత్రం ఎల్లరి హృదయడోలికల్లో
'ఝుమ్మ్ అంది నాదం...' అంటూ ఝంకారం గావిస్తూ.....
" ఈ అడవి దాగిపోనా హా ఎటులైనా ఇచటనే ఆగిపోనా... ఆకులో ఆకునై పువ్వులో పువ్వునై
కొమ్మలో కొమ్మనై నును లేతరెమ్మనై...."
అంటూ వారి అజరామరమైన గానం శ్రోతలను సదా రంజిపజేస్తూనే ఉంటుంది.....
త్వరలోనే మన తెలుగు సారసస్వరసామ్రాజ్ఞి గారిని పద్మవిభూషణ్ & భారతరత్న పురస్కారం కూడా వరించాలని కోరుకుంటూ,
పద్మభూషణ్ అవార్డ్ గ్రహీతలైన సుశీలమ్మగారికి సవినయ నమస్సుమాంజలి ఘటిస్తూ, వారి 86వ జన్మదినోత్సవ సందర్భంగా శుభాభినందనావందనములు...🙏😊💐🍕🍨🌸
No comments:
Post a Comment