Tuesday, November 2, 2021

శ్రీప్లవనామ సంవత్సర 2021 దీపావళి పర్వసమయ శుభాభినందనలు....😊💐🍕🍨

ఒక బావా బామ్మర్ది జోడి కలిసి ఎంత ఘోరంగా ఎందరి జీవితాలను బాధించగలరో,
మరియు ఇంకొక బావా బామ్మర్ది కలిసి ఎంతమందినైనా నిలువరించగల రీతిలో ధార్మిక పోరాటం సాగించి భగవద్గీత లాంటి మహిమాన్వితమైన బోధను లోకానికి అందించగలరో మనకు మహాభారతం ఎంతో గంభీరమైన రీతిలో బోధిస్తుంది....

ఇటు ధర్మ పక్షంలో సుభద్ర/అర్జునుడు, శ్రీకృష్ణపరమాత్మ...
వారి వారి జీవన ఔన్నత్యంచే
ఈ ముగ్గురూ, ఈనాటికి కూడా అందరిచే ఆరాధింపబడుతున్నారు..

మరియు

అటు అధర్మ పక్షంలో
దుశ్షల/సైంధవుడు, దుర్యోధనుడు....
వారి వారి రాక్షస ప్రవృత్తిచే
ఈ ముగ్గురూ, ఈనాటికి కూడా
దూషింపబడుతున్నారు...

శ్రీచాగంటి సద్గురువుల ప్రవచనాల్లో సైంధవ వధ గురించి విన్నవారికి గుర్తున్నట్టుగా,
అర్జునుడు వ్యక్తిగతంగా ఎవ్వరినీ కూడా ఇబ్బంది పెట్టకుండా గౌరవప్రదమైన జీవనం తో ఎందరికో ఆదర్శప్రాయమైన రీతిలో జీవించే ఉన్నతమైన క్షత్రియ యోధుడు....

శ్రీచాగంటి సద్గురువులు వివరించినట్టుగా,
అర్జునుడి గాండీవ టంకారానికే కొన్ని వందల మంది నేలకూలగలరు.....

అంతటి సుక్షత్రియుడైన అర్జునుడు శ్రీకృష్ణ పరమాత్మ యొక్క రక్షణలో ఉండగా,
అర్జునుడి ఖ్యాతిని ఓర్వలేని ఆ నికృష్ట బద్మాష్ బాడ్ఖావ్ ఎంతగా పాండవపక్షం వారిని అడుగడుగునా
ఇబ్బందులకు గురిచేసి వేధించాడో
ఎల్లరికీ తెలిసిందే...
ఇప్పటికీ లోకంలో అలా ఎవరైనా ఓర్వలేనితనంతో, కుళ్ళుతో, అసూయతో, ఇతరులను ఇబ్బందులకు గురిచేసి జీవించే వారిని ఉద్దేశ్యించి అనబడే డైలాగ్స్ కొన్ని సినిమాల్లో వినేఉంటారు....

" ఆ వెనకలైన్లో ఉండే వాడి బామ్మర్ది (భార్య కి అన్న), ఎందుకురా సైంధవుడిలా ఇతరులను ఇబ్బంది పెడుతూ జీవిస్తుంటాడు...." అనేలా ఉండే డైలాగ్స్ సినిమాల్లో వినే ఉంటారు....

కాబట్టి ఇక్కడ గమనించ గలిగితే ఇందరి వ్యక్తుల్లోని వైవిధ్యాల్లో, వారి ప్రవర్తనలో, వారి కార్యాచరణసరళిలో, వారు వారు గమించిన జీవన మార్గాల్లో.... ముఖ్యమైన భేదం ఎక్కడ కానవస్తుంది...??

అని అడిగితే... అది వారి వారి జ్ఞ్యాన స్థాయిలో అని చెప్పవలసిఉంటుంది....

ఇంకా జూం చేసి చూడగలిగితే అది వారి వారి చిత్తశుద్ధిలో ఉండే భేదం....

గూగుల్ మ్యాప్స్ ని అందరూ ఎప్పుడో ఒకప్పుడు వాడేఉంటారు కద.....

ఒక దేశం యొక్క భౌగోళిక రూపు...
ఇంకొంచెం జూం చేస్తే అందలి రాష్ట్రాల భౌగోళిక రూపు...
ఇంకొంచెం జూం చేస్తే అందలి జిల్లాల భౌగోళిక రూపు...
ఇంకొంచెం జూం చేస్తే అందలి పట్టణాల భౌగోళిక రూపు...
ఇంకొంచెం జూం చేస్తే అందలి వీధుల భౌగోళిక రూపు...
ఇంకొంచెం జూం చేస్తే అందలి ఇళ్ళ/కట్టడాల భౌగోళిక రూపు...

ఇవ్విధంగా మనం జూం చేస్తున్నా కొద్ది మన టార్గెట్ / డెస్టినేషన్ గురించిన క్లారిటి మెరుగ్గా కానవస్తు
ఫైనల్ జూం లేవెల్ లో మన టార్గెట్ / డెస్టినేషన్ ని స్పష్టంగా దర్శించవచ్చు....

కదా...

అత్యంత స్థూలస్థాయిలోని ప్రపంచం/దేశం యొక్క భౌగోళిక స్థాయి నుండి అత్యంత సూక్ష్మస్థాయిలోని ఒక గల్లి లోని వీధులు / ఇళ్ళ వరకు మనం దర్శించినా....

ఈ మ్యాప్ మొత్తం మన అరచేతిలో ఇమిడిఉండే 6 అంగుళాల మొబైల్ ఫోన్ తెరపైనే సాక్షాత్కరించడం అనేది ఎల్లరికీ తెలిసిందే....

అంతటి స్థూల స్థాయి నుండి సూక్ష్మస్థాయికి చేరుకోవడమనేది మన జూమింగ్ + నావిగేషన్ లెవెల్స్ పై ఆధారపడి ఉండే విషయం....

అచ్చం ఇదే విధంగా,

ఒక వ్యక్తి కి అత్యంత ఉన్నతమైన స్థాయినుండి అత్యంత సామాన్య స్థాయివరకు వివిధ లెవెల్స్ లో వివిధ రీతుల ఉండవలసిన కార్యాచరణ దీక్షాదక్షతలో అత్యంత ముఖ్యమైనది వారి వారి
జ్ఞ్యానం+చిత్తశుద్ధి(వివేకం) యొక్క లెవెల్స్ అనేది నిర్వివాదాంశం...

అందుకే ప్రాచ్య సద్గురువులు ఎంతో గంభీరంగా
" జ్ఞానాత్ ఏవతు కైవల్యం..."
అనే ఆర్ష వాక్కు నుడివినారు....

దీపావళి పర్వ సమయ ప్రాశస్త్యం గురించి శ్రీచాగంటి సద్గురువులు వారి ప్రవచనాల్లో మరియు ఇతర ఆధ్యాత్మికవేత్తలు టీవీల్లోని వివిధ కార్యక్రమాల్లో వారి వారి అమూల్య సందేశాలను మనకు అందించడం ఎల్లరికీ విదితమే....

కాబట్టి తత్త్వతః దీపావళి లో ఉండే సందేశాన్ని ఇక్కడ మరికొంత తెలుసుకుందాం.....

భూలోకంలో అత్యంత ప్రాచీనమైన ప్రదేశం భరతభూమి...

కాశి/వారణసి, తిరుమల, అరుణాచలం, హిమాలయాలు/కైలాసగిరి, శ్రీశైలం ఇత్యాదిగా భరతభూమిపై పరిఢవిల్లే ఎన్నో పవిత్ర ప్రదేశాలు ఎప్పటినుండి ఇక్కడ ఉన్నవి అని పరిశోధనలు గావించిన పశ్చిమ దేశాల సైంటిస్ట్లు ఇవి కొన్ని కోటానుకోట్ల సంవతారాల క్రితం నుండి ఉన్న పురాతనమైన ప్రదేశాలు అని వారి వారి కార్బన్ డేటింగ్ పరిశోధనల్లో తేల్చి చెప్పబడిన సత్యాలు.....

భా అనగా వెలుగు / కాంతి / ద్యుతి / వర్చస్సు / తేజస్సు / జ్ఞ్యానం / ఐశ్వర్యం ఇత్యాదిగా ఎన్నో సమన్వయాలు కలవు....

ఈ విభూతులన్నీ కూడా భరతభూమిపై మెండుగా కలవు కాబట్టే మన భూమిని భరతభూమి అని అనాదిగా పిలవడం సదాచారం....
( భరతుడు అనే మహారాజు పరిపాలించకముందు కూడా ఈ నేలపై చెప్పబడే సంకల్పంలో " భారతవర్షే భరతఖండే గంగాగోదావరియోమధ్యప్రదేశే శ్రీశైలస్య --- దిగ్భాగే..." అనే సంకల్పమే మన సనాతన మహర్షులు అనుసంధించేవారు....)

ఇటువంటి మహోన్నతమైన ఈ వేదభూమి
పై దీపారాధనకు అనాదిగా ఎంతో ప్రాశస్త్యం కలదు అనేది జగద్విఖ్యాతమైన సత్యం...

"దీపం ప్రజ్వాల్యా.... " అనే వచనం
కేవలం ఏదో చీకటి గా ఉందనో, లేదా వెలుతురు ఎక్కువగా ఉంటుందనో కాదు...

దీపంజ్యోతిపరబ్రహ్మ...
దీపంజ్యోతిర్జనార్ధన...
దీపోమేహరతుపాపం / దీపేనసాధ్యతేసర్వం
దీపజ్యోతిర్నమోస్తుతే...

సాజ్యం త్రివర్తిసమ్యుక్తం
వహ్నినా యోజితంప్రియం
గృహానాం మంగళందీపం
త్రైలోక్య తిమిరాపహం

ఇత్యాది దీపారధన శ్లోకాల్లో మన సనాతన పెద్దలచే ఉటంకించబడినట్టుగా, దీపారాధన యొక్క ప్రశస్తి అనంతమైనది...అమేయమైనది....

ఇలా అంటున్నందుకు ఎవరికైనా ఇబ్బందిగా అనిపించి ఉంటే నేను మన్నింపబడెదను గాక...
కాని ఇది ముమ్మాటికి నిజం...

" ఇవాళ్టి రోజుల్లో లోకంలో ఈతిబాధలు, దరిద్రం, క్షామం, అనారోగ్యం, ఇత్యాది సకల విధమైన అనర్ధాలకు మూలకారణం సశాస్త్రీయ దీపారాధన అనే సత్సాంప్రదాయం మరుగైపోవడం...
తద్వారా దేవతానుగ్రహం లుప్తమవ్వడం...
తద్వారా సకల విధమైన అసురప్రవృత్తి విజృంభించడం...."

శ్రీ సిరివెన్నెల గారి కవనం నుండి జాలువారిన
"నీ స్నేహం" అనే సినిమాలోని ఈ క్రింది
"చినుకు తడికి చిగురు తొడుగు పూవమ్మా...."
పాటలో కూడా దీపారధన యొక్క ప్రాశస్త్యం మనకు చెప్పబడింది కద....

{
వరములన్నీ నిను వెంట బెట్టుకొని
ఎవరి ఇంట దీపాలు పెట్టమని
అడుగుతున్నవే కుందనాల బొమ్మ

సిరుల రాణి నీ చేయి పట్టి
శ్రీహరిగా మారునని రాసిపెట్టి
ఏ వరుని జాతకం వేచి ఉన్నదమ్మా

అన్నమయ్య శృంగార కీర్తనల
వర్ణనలకు ఆకారమైన బంగారు చిలకవమ్మా
ఆ...రాముని సుమ శరమా
}

అటువంటి ఎన్నెన్నో దీపముల ఆవళి....
అనగా వరుసగా దీపాలను వెలిగించే సంప్రదాయం / పర్వం / ఉత్సవం అనేది బాహ్యంలో దీపావళి పండగ యొక్క అర్ధం....

ఆశ్వయుజ / కార్తీక మాస సంధి సమయంలో వచ్చే ఈ దీపావళి పండగకు కావించబడే విశేషదీపారాధన మరింతగా ప్రశస్తమైనది....

తైలమునుండి (నువ్వులనూనే మాత్రమే తైలము అనబడుతుంది..మిగతా నూనెల గురించి ఇక్కడ ప్రస్తావించబడడం లేదు) దీపశిఖ ద్వారా
ఒకవిధమైన ఓషధీ శక్తి ఏవిధంగా ప్రాణులకు అంది ఈ చలికాలంలో విజృభించే గుండే / రక్తనాళాలకు సంబంధించిన రుగ్మతలకు విరుగుడుగా పనిచెస్తుందో అనేది మన ప్రాచ్య ఋషులు కనిపెట్టి, ఈ కార్తీక మాసం మొత్తం దీపారాధనలు కావించడం, ఉసిరిచెట్టును పూజించడం, ఇత్యాదిగా ఉండే సదాచారాలను మనకు అందించి తరించమని దీవించినారు....

దీపము భక్తి దాయకము....
దీపము జ్ఞ్యాన దాయకము....
దీపము భుక్తి దాయకము....
దీపము ఆరోగ్య దాయకము....
దీపము ఐశ్వర్య దాయకము....
దీపము యశో దాయకము....
దీపము బుద్ధి దాయకము....
దీపము సిద్ధి  దాయకము....
దీపము యోగ దాయకము....
దీపము క్షేమ దాయకము....

ఇలా ఒకటా రెండా....ఒక్కవాక్యంలో చెప్పాలంటే
దీపము సకలశ్రేయో దాయకము....

అతి పిన్న వయసులోనే శ్రీహరి కృపకు పాత్రుడై,
యావద్ విశ్వం తనను ఆధారంగా చేసుకొని భ్రమణం సాగించేంతటి మహత్తరమైన, ఎవ్వరూ సాధించలేని ధృవపదమును వరంగా గైకొని శాశ్వతంగా వినువీధుల్లో మెరిసే ధృవుడి వృత్తాంతం గురించి ఎంతో గంభీరంగా ఆశ్చర్యకరమైన రీతిలో అనుగ్రహించిన శ్రీ చాగంటి సద్గురువుల "ధృవోపాఖ్యానం" ప్రవచనం ద్వాదశి నాటి అసురసంధ్య వేళలో విన్నవారికి దీపారాధన యొక్క ప్రాశస్త్యం స్వప్రకాశకమై గోచరిస్తుందనేది నా వ్యక్తిగత విశ్వాసం....

మనుష్యుడికి సకల విధమైన అనుగ్రహమును తద్వారా జీవుడికి సకల విధమైన స్వాతంత్ర్యమును సాధించిపెట్టే దీపారాధన యొక్క వైభవం ఎంతో గంభీరమైనది..

లక్ష్యం ధృవపదమైనా సరే ధనస్సునుండి వినిర్ముక్తమైన మరుక్షణం కాంతివేగంతో దూసుకుపోవడమే.... అన్నచందంగా ఎంతో గంభీరంగా ఎక్కుపెట్టబడిఉన్న.... శ్రీరామ కోదండ సంధిత శరమా లేక అర్జున గాండీవ సంధిత శరమా అనట్టుగా ఉన్న RRR (Rise Roar Revolt) ఈ సినిమా పోస్టర్ ఉన్నట్టుగా, స్వాంతంత్ర్య సంగ్రామ నేపథ్యంతో తెరకెక్కనున్న మన మెగాపవర్ స్టార్ రాంచరణ్ యొక్క మల్టి స్టారర్ సినిమా ఎంత పవర్ఫుల్ గా ఉంటదో అంతటి పవర్ఫుల్ అనుగ్రహం ఈ దీపావళి మరియు కార్తీక మాస దీపారాధన ఎల్లరికీ అనుగ్రహించు గాక....
( Looking forward towards a grand successful release of RRR to bring in yet another patriotic theme based action packed thriller to lit up the Indian Cinema Diaspora with it's vibrant screenplay and meticulous direction to enthral the targeted audience....😊 )

దీపావళి పర్వప్రాభవానికి మరియు ఈ
RRR (Rise Roar Revolt) మూవి పోస్టర్ కి ఏంటి సమన్వయం అంటే....

దీపారాధన యొక్క అనుగ్రహంతోనే జీవితంలో ఎదగడం.....!

దీపారాధన యొక్క అనుగ్రహంతోనే జీవనగమనంలో సిమ్హం లా గర్జించడం.....!!

దీపారాధన యొక్క అనుగ్రహంతోనే జీవితంలో ఎదురయ్యే ఎదురుగాలులను ప్రతిఘటించడం.....!!!

తద్వారా జీవితాన్ని ఒక చక్కని దేదీప్యమానమైన దివ్వెలా వెలుగుతూ ఉండేలా తీర్చిదిద్దుకోవడం అనేది జీవనసాఫల్యకారకసత్యం.... !!!!

ఇది ఆకళింపు జేసుకొని ఎల్లరూ ఈ దీపావళి పండగను సుఖసంతోశాలతో జరుపుకొని  శ్రీమదలర్మేల్మంగాసమేతశ్రీవ్యూహలక్ష్మీసహిత
శ్రీవేంకటేశ్వరస్వామి వారి అనుగ్రహంతో ఆయురారోగ్యైశ్వర్యాలతో వర్ధిల్లెదరు గాక అని వచిస్తూ ఎల్లరికీ దీపావళి పండగ శుభాభినందనలు....
🍨🍕😊

No comments:

Post a Comment