శ్రీ తనికెళ్ళ భరణి గారికి లోక్ నాయక్ ఫౌండేషన్ వారి సాహితీ పురస్కారం....
"ఆటగదరా శివ....ఆటగద కేశవ..."
అంటూ భావోద్వేగభరితంగా రచించి ఆలపించినా.....
" నాలోన శివుడు గలడు....
నీలోన శివుడు గలడు....
నాలోన గల శివుడు.....
నీలోన గల శివుడు... ఒక కన్ను తెరవగలడు....
వద్దంటే రెంటినీ మూయగలడు...."
అంటూ భావగాంభీర్యం ఉట్టిపడేలా రచించి ఆలపించినా....
" అన్నా నువ్వు గట్ల డిసైడ్ జేసినావే...."
అని వ్యగ్యంగా హాస్యం పండించేలా డైలాగ్స్ చెప్పినా.........
"అతడు" సినిమాలో, పొలంలో కంచె వేయడం గురించి సుపర్ స్టార్ మహేష్ అన్న సీరియస్ గా అడిగినప్పుడు నాయుడిగారి పాత్రలో ఛలోక్తులతో సమాధానం ఇచ్చేలా డైలాగ్స్ చెప్పినా....
"ఆడు మగాడ్రా బుజ్జి....." అంటూ ప్రత్యర్ధి పార్థు రోల్ ని తనవారిదెగ్గరే పొగిడేలా వచించినా....
ఆ రచనల్లో...ఆ వచనాల్లో...ఆ కవనాల్లో...
ఆ ఉల్లేఖనాల్లో...గల...వారి ప్రత్యేక శైలి ఎప్పటికీ నిత్యనూతనమే....
అంతటి బహు కోణాత్మక భావుకత గల వ్యక్తిత్వంతో వెండితెరపై తమదైన ముద్రతో ప్రేక్షకులను అలరించే భరణిగారి సాహిత్య, సినీ ప్రస్థానం యశోభరితంగా కొనసాగాలని ఆశిస్తూ వారికి శుభాభినందనానమస్సులు... 😊💐🙏👍🍕🍨
No comments:
Post a Comment