Thursday, December 22, 2022

దేశకాలములను, ఉచితానుచితములను, మనస్తత్త్వాలను, ఎంతో క్షుణ్ణంగా బేరీజు వేసుకుంటూ స్వాభిమానంతో బ్రతికే వారికి గౌరవమరియాదలు ఎల్లప్పుడు రెండాకులు ఎక్కువే లభిస్తాయి అని అనడం అతిసయోక్తి కానేరదు.....

నువ్వు అందరినీ బానే గౌరవిస్తావ్ కాని ఎవరితో నువ్వు ఉండాలని అనుకుంటావ్ తాతా అని ఎవరైన అడిగితే.....
ఆ జ్ఞ్యానవృద్ధుడు ఏమని సమాధానం ఇవ్వాలి......?

"నా సొమ్ము తింటూ నా కాలర్ పట్టుకొని నన్ను ఓర్వని వారితో కలిసి నాపైకే నోరూ, చెయ్యి లేపేంతటి బాధ్యతారాహిత్యం తో బ్రతికే కృతఘ్నులతో"....
అని అంటాడా.....?
లేక.....
"నా ఆరోగ్యాన్ని చక్కదిద్ది నాకు మంచి ఆహారాన్ని అందిచే వారితో.... " అని అంటాడా....?
అనేది లోకవిదితమైన అంశం.....

అదే విధంగా నువ్వు ఎటువంటి చదువులను చదివి ఉన్నతిని సాధించాలనుకుంటున్నావు......?
అని ఏవరైనా ఒక కోవిదుడిని అడిగితే.....
ఏ చదువు చదివితే అన్ని చదువుల్లోని సారమంతా కూడా చదివిన ఫలితం లభించి, మరే చదువు కూడా చదవవలసిన ఆవశ్యకత ఉండదో అట్టి చదువును చదివెద.... అని అంటారు.....

శ్రీతాళ్ళపాక అన్నమాచార్యుల వారి మాటల్లో చెప్పాలంటే..... 
" చదివి బ్రతుకరో సర్వజనులు మీరు....
కదిసి నారాయణాష్టాక్షరమిదియే...."
అనే వారి సంకీర్తన యొక్క సారం అన్నమాట...... 

పరమాత్మ తో అనుబంధం అనేది చాలా విచిత్రమైన విశేషానుగ్రహం........

ఒక 25 సంవత్సరాలవరకు, పిల్లలకు ఏ కష్టం కూడా కలగకుండా వారికి ఉపయుక్తమైన అన్నిటిని సమకూర్చి వారిని ప్రయోజకులుగా తీర్చిదిద్దినప్పుడు, ఆ తరువాత ఓ 75 సంవత్సరాల వరకు తల్లితండ్రులకు వారి ప్రశాంత విశ్రాంత జీవితానికి ఎటువంటి ఇబ్బంది కూడా లేకుండా వారి నిర్యాణం వరకూ కూడా పిల్లలు వారిని సమ్రక్షిస్తారు......

ఫర్ ఎగ్సాంపుల్...,
20 సంవత్సరాలుగా, పన్నుకు తగిలిన గాయం మెల్లమెల్లగా ముదురుతూ  "అప్పర్ జా ఆల్వియోలార్  బోన్ క్యాన్సర్" గా పరిణమించే దశకు చేరుకొని పిల్లగాడు రోజురోజుకి పీక్కపోతున్నా సరే అది గుర్తించి చక్కని వైద్యం అందించాలనే స్పృహకూడా లేనంతటి బాధ్యతారాహిత్యంతో బ్రతికే ఔలగాడిని పెద్దయ్యాక వారి పిల్లలు మనస్పూర్తిగా ఎట్లు గౌరవించగలరు.....?

పెద్దలు కష్టపడి చదివించినప్పుడు చక్కగా చదువుకొని, ఆర్ధిక స్వావలంబన సాధించని బాధ్యతారాహిత్యంతో బ్రతికే పిల్లలను, విజ్ఞ్యులు 
మనస్పూర్తిగా ఎట్లు గౌరవించగలరు.....?

అదే విధంగా, భగవద్ భక్తి అనే ఆలంబనతో ఈశ్వరుడుకి దెగ్గరై, అనగా " దేవుడు మెచ్చి....లోకం మెచ్చే...." రీతిలో బ్రతకగలిగే జీవితం ఆశించే వారు, 
మొదట్లో ఈశ్వరుడి కోసం భక్తభాగవతుల సహాయసహకారంతో శ్రమిస్తే, ఆ తరువాత వారి జీవితం ఈశ్వరుడి పరికరంగా మారి ఎంతో మంది భాగవతులకు ఆలంబనను అందించే రీతిలో ఆ భగవంతుడే తీర్చిదిద్దుతాడు అనేది భక్తలోకానికి విదితమయ్యే అంశం.......

ఈశ్వరుడికి శ్రీగంధం, విభూతి విలేపనం యొక్క గొప్పదనం గురించి తెలుసుకోవాలంటే ఒక భగవద్ భక్తుడిని అడిగితే తెలుస్తుందేమో కాని ఒక తాగుబోతు బాడ్ఖావ్ కి అది తెలుస్తుందని అనుకొని వాడిని అడగడం మన మూర్ఖత్వమే అవుతుంది......

అదే విధంగా, బాధ్యత అనే చాలా గొప్ప పదానికి నిజమైన నిర్వచనం కావాలంటే, అది జీవితంలో ఒక  అంతర్భాగమైన వారిని అడిగితే బావుంటుందేమో కాని, బాధ్యతాయుతమైన వ్యక్తులపైకే బరితెగించి బ్రతికే బాడ్ఖావ్లను అడిగితే ఏం బావుంటది......

కాబట్టి దేశకాలములను, ఉచితానుచితములను, మనస్తత్త్వాలను, ఎంతో క్షుణ్ణంగా బేరీజు వేసుకుంటూ స్వాభిమానంతో బ్రతికే వారికి గౌరవమరియాదలు ఎల్లప్పుడు రెండాకులు ఎక్కువే లభిస్తాయి అని అనడం అతిసయోక్తి కానేరదు.....

శ్రీగోదారంగనాథధనుర్మాసవైభవం....😊🍨🍇🍧🍎🍦💐🍓🎇🍕

🍨🍇🍧🍎🍦💐🍓🎇🍕

"శ్రీరామజయరామజయజయరామ"
అనే త్రయోదశాక్షరి (13) మహామంత్రం హనుమంతుల వారిచే నిత్యం జపింపబడే తీరుని, మరియు అందులో నిక్షిప్తమై ఉన్న 

శాక్తేయప్రణవమైన శ్రీం బీజాక్షరం
+
ర అనే అగ్నిబీజాక్షరం
+
మ అనే విష్ణుశక్తి సూచిత లక్ష్మీ బీజాక్షరం
+
జయ వాచకంతో సూచింపబడే 
పాంచభౌతిక జగత్తుకు సూచికయైన జ,య అనే బీజాక్షరముల సంఘాతం...
=
మహాశక్తివంతమైన త్రయోదశాక్షరి మహామంత్రం గా జగద్ప్రసిద్ధినొందిన వైనాన్ని నేను ఒక పాత పోస్టులో వివరించి ఉన్నాను...

అటువంటి త్రయోదశాక్షరి మహమంత్రాధిష్ఠాన దైవమైన శ్రీరాముడు ఈ పాంచభౌతిక జగత్తులో అర్చించిన పరదైవం శ్రీరంగనాథస్వామి....

శ్రీరాముడు యుద్ధంలో విజయం సాధించిన తదుపరి సీతా, లక్ష్మణ, సమేతంగా  కాంచనలంక నుండి  పుష్పకవిమానంలో ఏతెంచి 500 నదీజలములతో కోసలమహాసామ్రాజ్య చక్రవర్తిగా పట్టాభిషేకం గావింపబడిన శుభసందర్భంలో,
అందరికి వివిధ కానుకలు ఇచ్చే సమయంలో, విభీషణుడికి ఏకంగా తమ సూర్యవంశ చక్రవర్తులచే తరతరాలుగా ఆరాధింపబడే శ్రీరంగనాథుడి మూర్తిని కానుకగా ఇవ్వడం గురించి.....
మరియు అంతటి శక్తివంతమైన దేవతామూర్తి భారతదేశం/సముద్రం దాటి వెళ్ళడం ఇష్టం లేని గణపతి ఒక చిన్న నాటకం ఆడి ఆ మూర్తి దక్షిణ దిశగా ఇప్పుడు మనం దర్శించే శ్రీరంగం క్షేత్రంలో కొలువైయ్యేలా చేసిన వృత్తాంతం గురించి శ్రీచాగంటి సద్గురువులచే వివరింపబడినట్టుగా.... 

ఇప్పుడు భక్తులచే దర్శింపబడే శ్రీరంగనాథుడు  ఏనాటి దైవమో చెప్పలేనంతటి పురాతన దైవం....

ఆ రంగనాథుడినే శ్రీకృష్ణుడిగా భావించి, శ్రీవ్రతం అనే నోముతో మార్గశిర మాసంలో స్వామివారిని 30 పాశురాలతో సేవించి అర్చించి తుదకు భోగినాడు శ్రీరంగడిలో తననుతాను ఐక్యం గావించుకొని  జీవార్జిత అసలైన భోగభాగ్యాన్ని గడించి తరించిన భూగత దేవతాంశ అవతార మూర్తి పన్నిద్దరాళ్వారులలో ఒకరిగా ఆరాధింపబడే శ్రీఆండాళ్ అమ్మవారు.....

ద్రావిడ భాష చక్కగా పలికే ఒక బాలికతో ఒక్కొక్క పాశురము పఠియింపజేయిస్తూ, వాటి యొక్క సామాన్యార్ధము మరియు అందు నిక్షిప్తమై ఉండే వైశేషికపరతత్త్వసమన్వయమును 
" తిరుప్పావై " ప్రవచనాల్లో శ్రీచాగంటి సద్గురువులు బోధించడం చాలా మందికి గుర్తుండే ఉంటుంది.......

పరమాత్మను నాయకుడిగా భావిస్తూ, నాయికా భావంతో జీవుడు పరమాత్మను పొందే ఆధ్యాత్మిక తత్త్వసరళిని అనుసరిస్తూ సాగే శ్రీవ్రతం / తిరుప్పావై లోని పాశురాలను మనం గమనిస్తే....
అందులో ఆండాళ్ అమ్మవారి భావగాంభీర్య మధుర భక్తి యొక్క మహత్తు మన మనోనేత్రానికి గోచరమౌతుంది..... 

మొదటి పాశురంలో, 
నందగోపుడి కుమారుడిగా,
యశోదమ్మ గారాలపట్టిగా, కన్నయ్యను అభివర్ణిస్తూ....
నీలమేఘశ్యాముడైన ఆ నారాయణుడే ఈతడు అనే పరతత్వాన్ని రూఢపరుస్తూ....

రెండో పాశురంలో, ఈ ధనుర్మాసంలో నెయ్యిని, పాలను మనము స్వీకరించకుండా మొత్తం పరమాత్మకే సమర్పించవలే అనే భావనను వ్యక్తపరుస్తుంది.... 

అధ్యాత్మ చింతనా పరులకు ఇక్కడ ఒక సందేహం రావాలి...
నెయ్యిని, పాలను ఉటంకిస్తూ అవి పతమాత్మకే సమర్పణం అనే భావనలో వెన్న గురించిన ప్రస్తావన ఏది..?

మామూలుగా టక టకా చదివితే 
"నెయ్యుణ్ణోం పాలుణ్ణోం" అనగానే
లౌకికమైన నెయ్యిని, పాలను మనం ఆరగించకుండా పరమాత్మకు సమర్పించేద్దాం...
అనే అర్ధం స్ఫురించును.....

ఇక్కడ ఉటంకింపబడినది పరతత్త్వం అనే ఘృతం....
భక్తి అనే క్షీరం....
వీటిని అనుసంధానించే అధ్యాత్మజిగ్ఞ్యాస అనే నవనీతం గురించి భక్తులను అలోచింపజేయడమే ఇక్కడి పాశురంలో గోదమ్మ యొక్క సాహితీ చమత్కారం.....

ఆ భగవద్ప్రీతికరమైన అధ్యాత్మజిగ్ఞ్యాస అనే నవనీతం నుండి సృజనాత్మకమైన సాహితీ సరాలను అల్లుతూ, శ్రీరంగడినే శ్రీకృష్ణుడిగా భావిస్తూ పరిపరి విధాల స్తుతిస్తూ సాగిన 30 పాశురాల్లో, ఆఖరి రెండు ముఖ్యమైన పాశురాల్లో గోవింద నామంతో ఆనాటి ద్వాపరంలో నందవ్రజ వాసుల హృదయాల్లో,
మరియు ఈనాటి కలియుగంలో శ్రీవేంకటేశ్వరుడిగా పునః వ్యక్తమై గోవిందుడిగా పట్టాభిషిక్తుడై తిరుమలలో కొలువైన పరతత్త్వాన్ని ఇహపరాల్లోనూ సార్ధక్యాన్ని ప్రసాదించే పరమాత్మగా స్థిరీకరిస్తూ కీర్తించడం భక్తులకు విదితమే..... 

శ్రీతులసీవనంలో విష్ణుచిత్తులవారికి అయోనిజగా ప్రసాదింపబడి,
పెరియాళ్వారుల ప్రియసుతగా పేర్గాంచి....
12 ఆళ్వారుల్లో ఎకైక స్త్రీమూర్తిగా భక్తలోకంచే
ఆరాధింపబడే గోదమ్మవారు....,
సకల ఐహిక సంపదలను, భగవద్భక్తిని, విశేషంగా అనుగ్రహించే వరదైవంగా శ్రీవైష్ణవాచార్యులచే భక్తలోకానికి అందివ్వబడి, శ్రీవిళ్ళిపుత్తూరు వాసురాలిగా, 
( ఆనాడు తనచే అలంకృతమైన పుష్పమాలికను అద్దంలో చూసుకొని మురిసిపోయి, అదే మాలికను ఆలయంలోని స్వామివారి శ్రీపుష్పకైంకర్యానికి సమర్పించిన మధురభక్తి వృత్తాంతానికి సూచికగా.... )
భక్తుల్లెల్లరికి ఆరాధ్యదైవమై అలరారే ఆండాళ్ అమ్మవారి ఆలయము నుండి, నాటి నుండి నేటి వరకు కూడా  తిరుమల స్వామివారికి కొనసాగుతున్న పుష్పమాలికా సమర్పణ సంప్రదాయ మహత్తు ఈనాటికి కూడా భక్తులకు దర్శనీయమై ఉండడం మన భాగ్యవిశేషం.....

శ్రీవైష్ణవసంప్రదాయంలో  పెరియతిరువడి / సిరియతిరువడి గా శ్రీగరుడాళ్వార్, మరియు శ్రీహనుమంతులవారి ఆరాధనకు ఎంతటి ప్రాముఖ్యతో.....
12 ఆళ్వారుల ఆరాధనకు, ప్రత్యేకించి శ్రీఆండాళ్ / కోదై / గోద అమ్మవారి ఆరాధనకు అంతటి ప్రాముఖ్యత.....

ఇంకా గట్టిగా చెప్పాలంటే శ్రీఆండాళ్ అమ్మవారు  కొలువైఉంటేనే అది పరిపూర్ణమైన శ్రీవైష్ణవక్షేత్రం గా పెద్దలు, విజ్ఞ్యులు పరిగణిస్తారు.....

ఆండాళ్ అమ్మవారి ఆరాధనకు అంతటి ప్రాముఖ్యత కాబట్టే, తిరుమల అలిపిరి కాలిబాటలోని శ్రీవారి స్వయంవ్యక్త శ్రీపాదాలమండపానికి సమీపంలో ఉండే శ్రీలక్ష్మీనారాయణ ఆలయంలో ప్రత్యేకంగా కొలువైన శ్రీఆండాళ్ అమ్మవారి సన్నిధి మరియు తిరుపతిలోని శ్రీగోవిందరాజ ఆలయంలో ప్రత్యేకంగా కొలువైన శ్రీఆండాళ్ అమ్మవారి సన్నిధిని భక్తులు గమనించవచ్చు.....

(చాలామంది భక్తులు పెద్దగా పట్టించుకోరు కాని.....
తిరుమల అలిపిరి కాలిబాటలోని శ్రీవారి స్వయంవ్యక్త శ్రీపాదాలమండపానికి సమీపంలో ఉండే శ్రీలక్ష్మీనారాయణ ఆలయంలో కొలువైన శ్రీఆండాళ్ అమ్మవారి సన్నిధిలో భక్తులందరికి ప్రసాదింపబడే గంధం చాలా శక్తివంతమైన ప్రసాదం...)

ఆండాళ్ దివ్య తిరువడిఘళే శరణం.... 
ఆచార్య దివ్య తిరువడిఘళే శరణం.... 
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

శ్రీకరమైన భాషాత్మక కళానైపుణ్యం....

శ్రీకరమైన భాషాత్మక కళానైపుణ్యంలో ఆరితేరిన జ్ఞ్యాన కోవిదులు మాట్లాడకుండానే ఎన్నెన్నో విశదీకరించడం అనేది ఉత్తములకు గల ప్రజ్ఞ్య..... 

ఫర్ ఎగ్సాంపుల్, 

"ఒక పని మీద ఫలాన ఊరుకు ప్రయాణిస్తున్నాను....
తూర్పు దిశగా సాగడానికి ఎటు వైపు వెళ్ళాలి..."
అని కొత్తగా కనిపించే ఒక సామాన్యుడు / అపరిచితుడు పద్ధతిగా వినయంతో అడిగినప్పుడు...,
ఆ ఊర్లోని ఒక్కొక్కరు ఒక్కోలా సమాధానం ఇస్తారు.....

బాగా బలుపు గల ఒక బాడ్ఖావ్....
"నేనెందుకు చెప్పాలి..? నాకెమొస్తది చెప్తే....వేరే ఊరు వాళ్ళకు ఏమి చెప్పొద్దని మా ఊరోళ్ళు కొందరు చెప్పారు..." అంటూ ఏదో అలా వాగుతాడు.....

ఒక సామాన్యుడు....
మనకెందుకొచ్చిన తలనొప్పి అని అనుకొని మొహంచాటేసి వినివిననట్టుగా వాడిదార్లో వాడుపోతుంతాడు.... 

నోరు తెరిచి సమాధానం చెప్తే, 
ఆ ఊరు ఈ ఊరు అంటూ వ్యర్ధవాదాలతో ఊరిమీద పడితిరిగే దున్నపోతుల్లా ఉండే కొందరు మూర్ఖులతో ఒక తలనొప్పి....
చెప్పకపోతే, సాటి మనిషికి మాట సహాయం కూడా చేయకపోవడంతో మనఃసాక్షికి ద్రోహం చేసినట్టు అవుతుంది....
అని అలోచించే ఒక ఉత్తముడు.....

మాట సహాయం అర్ధించిన ఆ అపరిచితుడు మంచివాడు, విజ్ఞ్యుడే అయితే దిగ్భ్రాంతి తొలగడానికి శివాలయ దర్శనం చాలు కద......
అని అనుకొని 

ఆ అపరిచితుడితో ఏమి మాట్లాడకుండానే....
శివాలయాన్ని చూపిస్తూ 
ఓం నమఃశివాయ.....
ఓం నమఃశివాయ.....
అంటూ నమస్కరిస్తాడు.....

ఇవ్విధంగా ఒక్కొక్కరు ఒక్కోలా వారి వారి విచక్షణాత్మక వైఖరితో ఉండడం మనం గమనించవచ్చు.... 

అదే విధంగా......
ఒక వ్యక్తి తనను ఎంతగానో వేధిస్తున్న ప్రశ్నకు కచ్చితమైన సమాధానం కోసం ప్రయాస పడుతుంటే......

బాగా బలుపు గల ఒక బాడ్ఖావ్....
"నేనెందుకు చెప్పాలి..? నాకెమొస్తది చెప్తే....నీకు ఏమి చెప్పొద్దని కొందరు చెప్పారు..." అంటూ వాగుతాడు.....

సామాన్యులు....
మనకెందుకొచ్చిన తలనొప్పి అని అనుకొని మొహంచాటేసి చూసిచూడనట్టుగా వారిదార్లో వారుంటారు..... 

నోరు తెరిచి సమాధానం చెప్తే, 
"సరైన ప్రూఫ్స్ సాధించకుండానే మాపేర్లు ఎట్ల చెప్తవ్......?" 
అంటూ ఆ పొగరుబోతు ఫకర్ బాడ్ఖావ్లతో వ్యర్ధమైన వాదులాట......
చెప్పకపోతే, సాటి మితృడికి మాట సహాయం కూడా చేయకపోవడంతో మనఃసాక్షికి ద్రోహం చేసినట్టు అవుతుంది....
అని అలోచించే ఒక ఉత్తముడు.....

ఏమి మాట్లాడకుండానే......

గ్రీన్ కలర్ కోవా వేసి తయార్ గావింపబడిన 9 
బ్రౌన్ కలర్ గులాబ్ జామూన్లను ఎదుట పెట్టి ఇదే నువ్వు వెతుకున్న సమాధానం అన్నట్టుగా మౌనంగా విశదీకరిస్తాడు.....

మన మితృడు విజ్ఞ్యుడే అయితే, 
తన ప్రశ్నకు సమాధానంగా BCGJ అనే ఈ కోడ్ చాలు కద అనేది ఆ ఉత్తముడి అంతరంగం....

ఇవ్విధంగా ఈ లోకంలో ఒక్కొక్కరు ఒక్కోలా వారి వారి విచక్షణాత్మక వైఖరితో ఉండడం మనం గమనించవచ్చు....

Friday, December 2, 2022

పద్మశ్రీ, శ్రీ సిరివెన్నెల సీతారామశాస్త్రి గారి వర్ధంతి సంస్మరణార్ధం వారికి ఒక సాహిత్యాభిమాని యొక్క చిరు కవనకుసుమాంజలి ప్రయుక్త నమస్సుమాంజలి.....🙏💐


కొందరికి కొన్ని కలర్ పేపర్స్ అందిస్తే వాటితో ఔరా అనిపించే విధంగా వివిధ డిజైన్స్ తో కూడిఉండే కళాకృతులను నిమిషాల్లో తయారు గావించి ఎల్లరినీ అబ్బురపరుస్తారు.....

కొందరికి కొన్ని కలర్ కలర్ బట్టముక్కలను అందిస్తే వాటితో ఔరా అనిపించే విధంగా వివిధ డిజైన్స్ తో కూడిఉండే స్టైలిష్ ఫాషన్ దుస్తులు నిమిషాల్లో తయారు గావించి ఎల్లరినీ అబ్బురపరుస్తారు.....

కొందరికి కొన్ని కలర్ కలర్ పువ్వులను అందిస్తే వాటితో ఔరా అనిపించే విధంగా వివిధ రంగులకలబోతగా పరిమళవిరిమాలలను నిమిషాల్లో తయారు గావించి
ఎల్లరినీ అబ్బురపరుస్తారు.....

కొందరికి కొన్ని కలర్ కలర్ రంగులను అందిస్తే వాటితో ఔరా అనిపించే విధంగా వివిధ వర్ణచిత్రాలు నిమిషాల్లో తయారు గావించి ఎల్లరినీ అబ్బురపరుస్తారు.....

ఇలా ఈ లోకంలో వారివారికి సమకూరిన భగవద్ అనుగ్రహం కారణంగా ఒక్కొకరిది ఒక్కో ప్రత్యేకత... ఒక్కో విశేషం...ఒక్కో శైలి...ఒక్కో గుర్తింపు.....

కొందరు కొన్ని పదాలను అందుకొని వాటితో ఔరా అనిపించే విధంగా వివిధ సంధి సమాసాల కలబోతతో ఎంతో భావగంభీరమైన కవనాలను నిమిషాల్లో సృజించి ఎల్లరినీ అబ్బురపరుస్తారు....

ఇవ్విధంగా ఆ కళామతల్లి యొక్క అనుగ్రహం అక్షరమయి గా సమకూరి పరిపూర్ణమైన అక్షరబ్రహ్మలుగా జన్మించే సౌభాగ్యం చాలా తక్కువ మంది పుణ్యాత్ములకు మాత్రమే సమకూరే విశేషం.... 

ఎదుకంటే అది ఎన్నో జన్మల పుణ్యబలంతో మాత్రమే సమకూరే సర్వోత్కృష్టమైన అనుగ్రహం....

క్షరము కానిది అక్షరం.......

దాని యొక్క ప్రభావం కూడా అట్లే శాశ్వతమై పరిఢవిల్లుతుంది కాబట్టి అక్షరోపాసకులు వారి కవనాల రూపంలో ఈ లోకంలో ఎప్పటికీ చిరంజీవులే......

కొన్ని ప్రవచనాలు, కొన్ని న్యూస్ పేపర్ క్లిప్పింగ్స్, కొన్ని నవలలు, కొన్ని పుస్తకాలు, కొన్ని పద్య గద్య కవనాలు, కొన్ని పాటలు ఈ జగత్తులో ఎప్పటికీ ఎందరెందరినో ప్రభావితం గావించే విధంగా ఉండడం మనం గమనించవచ్చు.....

అది అక్షరం యొక్క సారస్వత శక్తి.....
ఆ అక్షరాన్ని నుడివే సరస్వతీ ఉపాసకుని శక్తి.....
ఆ అక్షరాన్ని అందుకొని ఆకళింపు గావించుకొని తరించగలిగే సరస్వతీ కటాక్షాన్ని లభింపజేసుకున్న వారి భక్తి యొక్క శక్తి....

ఇవ్విధంగా తెలుగు సినీసంగీత జగత్తులో వందలాది పాటలను సృజించి, తెలుగు అక్షరాలకు, పదాలకు, వాటితో అల్లబడిన సాహిత్య సరాలకు శాశ్వతత్త్వాన్ని సమకూర్చిన అగ్రగణ్యుల్లో వేటూరి గారి తరువాత సిరివెన్నెల సీతారామశాస్త్రి గారిది అందెవేసిన చెయ్యి..... 

సందర్భం ఏదైనా..... 
భావం ఏదైనా.....
రసం ఏదైనా.....
రాగం ఏదైనా.....
సాహిత్యంలో వాటన్నిటిని సరైన మోతాదులో మేళవించి ఒక చక్కని పాటగా రంగరించడం అనే ప్రక్రియలో సిరివెన్నెల గారు సృజించిన అద్భుతాలు ఎన్నో...ఎన్నెన్నో.....

అలతి అలతి పదాల్లోనే ఆకాశమంత గంభీరమైన భావుకతను ఒలికించిన వైనం ఈ క్రింది పాటల చరణాల్లో మనం గమనించవచ్చు......

1.
శివపూజకు చివురించిన సిరిసిరి మువ్వ... సిరిసిరి మువ్వ..సిరిసిరి మువ్వ
మృదుమంజుల పదమంజరి పూచిన పువ్వా... సిరిసిరి మువ్వ..సిరిసిరి మువ్వ
....
తూరుపు వేదికపై వేకువ నర్తకివై ధాత్రిని మురిపించె  కాంతులు చిందని
నీ కదలిక చైతన్యపు శ్రీకారం కానీ ..
నీ కదలిక చైతన్యపు శ్రీకారం కానీ .. నిదురించిన హృదయరవళి  ఓంకారం కానీ

2.
నీకోసం ఒక మధుమాసం
అందించిన ఈ జన్మ నీదేనే చెలి కొమ్మ
తనలో చిగురాశల గంధం
నీ శ్వాసకి పంచమని
చలిగాలికి చెరగని బంధం
నీ నవ్వుతో పెంచమని

3.
నా ఉఛ్ఛ్వాసం కవనం  నా నిశ్వాసం గానం (2)
సరసస్వర సురఝరీ గమనమౌ సామవేద సారమిది 
నే పాడిన జీవన గీతం ... ఈ గీతం 
విరించినై విరచించితిని ఈ కవనం... విపంచినై వినిపించితిని ఈ గీతం 

4.
నీటి ముల్లై.. నన్ను గిల్లీ.. వెళ్ళిపోకే.. మల్లె వానా
జంటనల్లే.. అందమల్లే.. ఉండిపోవే.. వెండి వానా
తేనెల చినుకులు.. చవి చూపించీ
కన్నుల దాహం.. ఇంకా పెంచీ
కమ్మని కలలేమొ.. అనిపించీ
కనుమరుగై.. కరిగావా.. సిరి వానా
నువ్వొస్తానంటే.. నేనొద్దంటానా

5.
ఏ శ్వాసలో చేరితే గాలి గాంధర్వమౌతున్నదో..
ఏ మోవిపై వాలితే మౌనమే మంత్రమౌతున్నదో..
....
మునులకు తెలియని జపములు జరిపినదా.. మురళీ సఖీ
వెనుకటి బ్రతుకున చేసిన పుణ్యమిదా...
తనువును నిలువున తొలిచిన గాయములే.. తన జన్మకీ
తరగని వరముల సిరులని తలచినదా..
కృష్ణా నిన్ను చేరింది..అష్టాక్షరిగ మారింది

ఇవ్విధమైన 3000 పైచిలుకు కవనాల అక్షరసేద్యంతో  పాటలపూదోటలో తెలుగుసినీసంగీత జగత్తును ఓలలాడించిన అపురూపమైన అరుదైన అనన్యసామాన్యమైన ఆరితేరిన సాహితీస్రష్టలు, పద్మశ్రీ, శ్రీ సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు......

వారి వర్ధంతి సంస్మరణార్ధం వారికి ఒక సాహిత్యాభిమాని యొక్క చిరు కవనకుసుమాంజలి ప్రయుక్త నమస్సుమాంజలి.....🙏💐