Thursday, December 22, 2022

శ్రీగోదారంగనాథధనుర్మాసవైభవం....😊🍨🍇🍧🍎🍦💐🍓🎇🍕

🍨🍇🍧🍎🍦💐🍓🎇🍕

"శ్రీరామజయరామజయజయరామ"
అనే త్రయోదశాక్షరి (13) మహామంత్రం హనుమంతుల వారిచే నిత్యం జపింపబడే తీరుని, మరియు అందులో నిక్షిప్తమై ఉన్న 

శాక్తేయప్రణవమైన శ్రీం బీజాక్షరం
+
ర అనే అగ్నిబీజాక్షరం
+
మ అనే విష్ణుశక్తి సూచిత లక్ష్మీ బీజాక్షరం
+
జయ వాచకంతో సూచింపబడే 
పాంచభౌతిక జగత్తుకు సూచికయైన జ,య అనే బీజాక్షరముల సంఘాతం...
=
మహాశక్తివంతమైన త్రయోదశాక్షరి మహామంత్రం గా జగద్ప్రసిద్ధినొందిన వైనాన్ని నేను ఒక పాత పోస్టులో వివరించి ఉన్నాను...

అటువంటి త్రయోదశాక్షరి మహమంత్రాధిష్ఠాన దైవమైన శ్రీరాముడు ఈ పాంచభౌతిక జగత్తులో అర్చించిన పరదైవం శ్రీరంగనాథస్వామి....

శ్రీరాముడు యుద్ధంలో విజయం సాధించిన తదుపరి సీతా, లక్ష్మణ, సమేతంగా  కాంచనలంక నుండి  పుష్పకవిమానంలో ఏతెంచి 500 నదీజలములతో కోసలమహాసామ్రాజ్య చక్రవర్తిగా పట్టాభిషేకం గావింపబడిన శుభసందర్భంలో,
అందరికి వివిధ కానుకలు ఇచ్చే సమయంలో, విభీషణుడికి ఏకంగా తమ సూర్యవంశ చక్రవర్తులచే తరతరాలుగా ఆరాధింపబడే శ్రీరంగనాథుడి మూర్తిని కానుకగా ఇవ్వడం గురించి.....
మరియు అంతటి శక్తివంతమైన దేవతామూర్తి భారతదేశం/సముద్రం దాటి వెళ్ళడం ఇష్టం లేని గణపతి ఒక చిన్న నాటకం ఆడి ఆ మూర్తి దక్షిణ దిశగా ఇప్పుడు మనం దర్శించే శ్రీరంగం క్షేత్రంలో కొలువైయ్యేలా చేసిన వృత్తాంతం గురించి శ్రీచాగంటి సద్గురువులచే వివరింపబడినట్టుగా.... 

ఇప్పుడు భక్తులచే దర్శింపబడే శ్రీరంగనాథుడు  ఏనాటి దైవమో చెప్పలేనంతటి పురాతన దైవం....

ఆ రంగనాథుడినే శ్రీకృష్ణుడిగా భావించి, శ్రీవ్రతం అనే నోముతో మార్గశిర మాసంలో స్వామివారిని 30 పాశురాలతో సేవించి అర్చించి తుదకు భోగినాడు శ్రీరంగడిలో తననుతాను ఐక్యం గావించుకొని  జీవార్జిత అసలైన భోగభాగ్యాన్ని గడించి తరించిన భూగత దేవతాంశ అవతార మూర్తి పన్నిద్దరాళ్వారులలో ఒకరిగా ఆరాధింపబడే శ్రీఆండాళ్ అమ్మవారు.....

ద్రావిడ భాష చక్కగా పలికే ఒక బాలికతో ఒక్కొక్క పాశురము పఠియింపజేయిస్తూ, వాటి యొక్క సామాన్యార్ధము మరియు అందు నిక్షిప్తమై ఉండే వైశేషికపరతత్త్వసమన్వయమును 
" తిరుప్పావై " ప్రవచనాల్లో శ్రీచాగంటి సద్గురువులు బోధించడం చాలా మందికి గుర్తుండే ఉంటుంది.......

పరమాత్మను నాయకుడిగా భావిస్తూ, నాయికా భావంతో జీవుడు పరమాత్మను పొందే ఆధ్యాత్మిక తత్త్వసరళిని అనుసరిస్తూ సాగే శ్రీవ్రతం / తిరుప్పావై లోని పాశురాలను మనం గమనిస్తే....
అందులో ఆండాళ్ అమ్మవారి భావగాంభీర్య మధుర భక్తి యొక్క మహత్తు మన మనోనేత్రానికి గోచరమౌతుంది..... 

మొదటి పాశురంలో, 
నందగోపుడి కుమారుడిగా,
యశోదమ్మ గారాలపట్టిగా, కన్నయ్యను అభివర్ణిస్తూ....
నీలమేఘశ్యాముడైన ఆ నారాయణుడే ఈతడు అనే పరతత్వాన్ని రూఢపరుస్తూ....

రెండో పాశురంలో, ఈ ధనుర్మాసంలో నెయ్యిని, పాలను మనము స్వీకరించకుండా మొత్తం పరమాత్మకే సమర్పించవలే అనే భావనను వ్యక్తపరుస్తుంది.... 

అధ్యాత్మ చింతనా పరులకు ఇక్కడ ఒక సందేహం రావాలి...
నెయ్యిని, పాలను ఉటంకిస్తూ అవి పతమాత్మకే సమర్పణం అనే భావనలో వెన్న గురించిన ప్రస్తావన ఏది..?

మామూలుగా టక టకా చదివితే 
"నెయ్యుణ్ణోం పాలుణ్ణోం" అనగానే
లౌకికమైన నెయ్యిని, పాలను మనం ఆరగించకుండా పరమాత్మకు సమర్పించేద్దాం...
అనే అర్ధం స్ఫురించును.....

ఇక్కడ ఉటంకింపబడినది పరతత్త్వం అనే ఘృతం....
భక్తి అనే క్షీరం....
వీటిని అనుసంధానించే అధ్యాత్మజిగ్ఞ్యాస అనే నవనీతం గురించి భక్తులను అలోచింపజేయడమే ఇక్కడి పాశురంలో గోదమ్మ యొక్క సాహితీ చమత్కారం.....

ఆ భగవద్ప్రీతికరమైన అధ్యాత్మజిగ్ఞ్యాస అనే నవనీతం నుండి సృజనాత్మకమైన సాహితీ సరాలను అల్లుతూ, శ్రీరంగడినే శ్రీకృష్ణుడిగా భావిస్తూ పరిపరి విధాల స్తుతిస్తూ సాగిన 30 పాశురాల్లో, ఆఖరి రెండు ముఖ్యమైన పాశురాల్లో గోవింద నామంతో ఆనాటి ద్వాపరంలో నందవ్రజ వాసుల హృదయాల్లో,
మరియు ఈనాటి కలియుగంలో శ్రీవేంకటేశ్వరుడిగా పునః వ్యక్తమై గోవిందుడిగా పట్టాభిషిక్తుడై తిరుమలలో కొలువైన పరతత్త్వాన్ని ఇహపరాల్లోనూ సార్ధక్యాన్ని ప్రసాదించే పరమాత్మగా స్థిరీకరిస్తూ కీర్తించడం భక్తులకు విదితమే..... 

శ్రీతులసీవనంలో విష్ణుచిత్తులవారికి అయోనిజగా ప్రసాదింపబడి,
పెరియాళ్వారుల ప్రియసుతగా పేర్గాంచి....
12 ఆళ్వారుల్లో ఎకైక స్త్రీమూర్తిగా భక్తలోకంచే
ఆరాధింపబడే గోదమ్మవారు....,
సకల ఐహిక సంపదలను, భగవద్భక్తిని, విశేషంగా అనుగ్రహించే వరదైవంగా శ్రీవైష్ణవాచార్యులచే భక్తలోకానికి అందివ్వబడి, శ్రీవిళ్ళిపుత్తూరు వాసురాలిగా, 
( ఆనాడు తనచే అలంకృతమైన పుష్పమాలికను అద్దంలో చూసుకొని మురిసిపోయి, అదే మాలికను ఆలయంలోని స్వామివారి శ్రీపుష్పకైంకర్యానికి సమర్పించిన మధురభక్తి వృత్తాంతానికి సూచికగా.... )
భక్తుల్లెల్లరికి ఆరాధ్యదైవమై అలరారే ఆండాళ్ అమ్మవారి ఆలయము నుండి, నాటి నుండి నేటి వరకు కూడా  తిరుమల స్వామివారికి కొనసాగుతున్న పుష్పమాలికా సమర్పణ సంప్రదాయ మహత్తు ఈనాటికి కూడా భక్తులకు దర్శనీయమై ఉండడం మన భాగ్యవిశేషం.....

శ్రీవైష్ణవసంప్రదాయంలో  పెరియతిరువడి / సిరియతిరువడి గా శ్రీగరుడాళ్వార్, మరియు శ్రీహనుమంతులవారి ఆరాధనకు ఎంతటి ప్రాముఖ్యతో.....
12 ఆళ్వారుల ఆరాధనకు, ప్రత్యేకించి శ్రీఆండాళ్ / కోదై / గోద అమ్మవారి ఆరాధనకు అంతటి ప్రాముఖ్యత.....

ఇంకా గట్టిగా చెప్పాలంటే శ్రీఆండాళ్ అమ్మవారు  కొలువైఉంటేనే అది పరిపూర్ణమైన శ్రీవైష్ణవక్షేత్రం గా పెద్దలు, విజ్ఞ్యులు పరిగణిస్తారు.....

ఆండాళ్ అమ్మవారి ఆరాధనకు అంతటి ప్రాముఖ్యత కాబట్టే, తిరుమల అలిపిరి కాలిబాటలోని శ్రీవారి స్వయంవ్యక్త శ్రీపాదాలమండపానికి సమీపంలో ఉండే శ్రీలక్ష్మీనారాయణ ఆలయంలో ప్రత్యేకంగా కొలువైన శ్రీఆండాళ్ అమ్మవారి సన్నిధి మరియు తిరుపతిలోని శ్రీగోవిందరాజ ఆలయంలో ప్రత్యేకంగా కొలువైన శ్రీఆండాళ్ అమ్మవారి సన్నిధిని భక్తులు గమనించవచ్చు.....

(చాలామంది భక్తులు పెద్దగా పట్టించుకోరు కాని.....
తిరుమల అలిపిరి కాలిబాటలోని శ్రీవారి స్వయంవ్యక్త శ్రీపాదాలమండపానికి సమీపంలో ఉండే శ్రీలక్ష్మీనారాయణ ఆలయంలో కొలువైన శ్రీఆండాళ్ అమ్మవారి సన్నిధిలో భక్తులందరికి ప్రసాదింపబడే గంధం చాలా శక్తివంతమైన ప్రసాదం...)

ఆండాళ్ దివ్య తిరువడిఘళే శరణం.... 
ఆచార్య దివ్య తిరువడిఘళే శరణం.... 
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

No comments:

Post a Comment