Wednesday, January 11, 2023

శ్రీ శుభకృత్ నామ 2023 సంవత్సర భౌమ్య వాసర ప్రయుక్త పుష్య బహుళ చతుర్ధి / సంకష్టహరచతుర్ధి / అంగారకచతుర్ధి శుభాభినందనలు.... 🍓😊🎇💐🍕🍎✨🍇🍨🍧


శ్రీమహాగణపతి తత్త్వాన్ని ఎంతో భావగాంభీర్యంతో వ్యక్తపరిచే శృతిమంజరి శ్రీ గణేషాథర్వషీర్షమ్.....

14 శక్తివంతమైన విభాగాలతో ఉండే గణపత్యథర్వశీర్షోపనిషత్ లోని ఈ 5వ విభాగంలో గణపతి యొక్క త్రిమూర్త్యాత్మక తత్త్వభరిత పరమేష్టి వైభవం బహురమ్యముగా శ్లాఘించబడుతున్నది.....

"సర్వం జగదిదం త్వ’త్తో జాయతే | సర్వం జగదిదం త్వ’త్తస్తిష్ఠతి | సర్వం జగదిదం త్వయి లయ’మేష్యతి | సర్వం జగదిదం త్వయి’ ప్రత్యేతి | త్వం భూమిరాపో‌உనలో‌உని’లో నభః | త్వం చత్వారి వా”క్పదాని || 5 ||  "

శ్రీచాగంటి సద్గురువులచే సవిస్తరముగా విశదీకరింపబడిన గణపతి వైభవంలో వివరింపబడినట్టుగా, ఒకే ప్రదేశంలో రెండు మూర్తులుగా కొలువై ఒకరు విఘ్నకర్తగా మరొకరు విఘ్నహర్తగా ఆరాధింపబడే విశేషమైన వైభవం కల వరదైవం శ్రీగణపతి.....!

ఆ శ్రేయస్కరమైన విఘ్నకర్త మరియు విఘ్నహర్త యొక్క ప్రాభవం మన పురాతన ఐతిహ్యాల్లో కూడా దర్శనీయమే.....

కావేరి నదీ జననం, శ్రీరంగం క్షేత్ర ఆవిర్భావం, గోకర్ణ క్షేత్ర ఆవిర్భావం, ఇత్యాది వృత్తాంతాలతో, ద్రవిడదేశంలో పిళ్ళయార్ గా పిలువబడే శ్రీగణపతి యొక్క మహత్తు ప్రతి వీధిలో ఉండే గణపతి కోవెలతో ఇప్పటికీ దర్శనీయమే అని కదా సద్గురువుల ఉవాచ.....

సకల సిరిసంపదలకు ఆలవాలమైన శ్రీవైష్ణవ సంప్రదాయంలో సర్వసైన్యాధ్యక్షుడిగా ఆరాధింపబడే శ్రీవిష్వక్సేనుల వారిగా, శ్రీమహావిష్ణు యొక్క అనిరుద్ధ వ్యూహంగా ఆరాధింపబడే శ్రీలక్ష్మీగణపతి స్వరూపంగా, శ్రీగణపతి యొక్క నామరూపాంతర వైభవం విజ్ఞ్యులకు విదితమే.... 

"కామేశముఖాలోక కల్పితశ్రీగణేశ్వర..." అంటూ అర్చింపబడే ఆదిశక్తి యొక్క ఆరాధనలో ఆదిమూలతత్త్వమైన శక్తిగణపతి యొక్క ప్రాభవం శాక్తేయులచే సదా స్తుతింపబడుతున్నది......

కలౌ వేంకటనాయకః....కలౌ కపికుంజరః....
కలౌ చండీ....
ఇత్యాది వాక్యాలతో ఈ కలియుగంలో కూడా గణపతి ఆరాధన యొక్క ప్రాముఖ్యత విదితమౌతున్నది......

కాణిపాకం, అయినవిల్లి, ఇత్యాది క్షేత్రాల్లో మనం ఇప్పటికీ దర్శించే ప్రత్యక్ష దినదినాభివృద్ధి భరిత సజీవగణపతి వైభవం ఎల్లరికీ విదితమే.....

"లంబోదర లకుమికరా.... అంబాసుత అమరవినుత....." అనే కృతి ఆలపించని కర్ణాటకశాస్త్రీయ సంగీత కళాకారులు ఉండరు.......
మరియు విశేషమైన మహత్తుగల భగవద్ నామసంకీర్తనం, భజనసంప్రదాయం లో
శ్రీగణపతి నామస్మరణతోనే భజనలు సదా ప్రారంభమయ్యేది....

అటువంటి శ్రీగణపతికి ఎంతో ప్రీతికరమైన  సంకష్టహరచతుర్ధి (బహుళ చతుర్ధి తిథి) మంగళవారం నాడు వస్తే అది ఎంతో మహత్తరమైనదిగా కొనియాడబడుతూ 
"అంగారక చతుర్ధి" గా పిలువబడడం ఆస్తికలోకానికి విదితమే......
(యోగపరిభాషలో గణపతి మూలాధారచక్రాధిష్టానదైవం....
పృథ్వీతత్త్వంతో సంకేతింపబడే ఆ మూలాధారచక్రానికి నవగ్రహసామ్యములో అంగారకుడు / కుజుడు / అధిపతి...అందుకే అంగారక చతుర్ధి అనే పేరు.....)

ఆంగ్లసంవత్సర కాలగణనప్రకారంగా, రేపు అనగా జనవరి 11 తారీకు నా 36 సంవత్సరాలు పూర్తయ్యే హ్యాపిబర్త్డే కావడం మరో విశేషం.....😊🍧🍨✨🍕🎇💐🍦🍎🍓

ఎంతో గహనమైన అధ్యాత్మ తత్త్వాన్ని, భగవద్ ఆరాధనా మహత్తును భక్తితత్త్పరుడైన ఒక సామాన్యుడికి ఏ విధంగా అందిస్తే అందుకొని తరించగలడో అవ్విధంగా, 2008 నుండి ఈనాటి వరకు కూడా వారి ప్రవచనాల్లో మహత్తరమైన భగవద్ తత్త్వాన్ని ప్రత్యక్షానుభవంగా అందుకొని తరించే సౌభాగ్యానికి కారకులైన శ్రీచాగంటి సద్గురువులను ఆదిమూలగణపతి పరమేష్టిగా భావిస్తూ, వారిలోనే 
తల్లీతండ్రీగురువుదైవందేవుడూఆలయంభక్తి
భాగవతులను సకల తీర్థాలను క్షేత్రాలను దర్శిస్తూ....
అపరశారదాస్వరూపులైన శ్రీచాగంటి సద్గురువుల శ్రీచరణాలకు నా సవినయ సాష్టాంగ ప్రణామములను ఈ చిరుకవనకుసుమాంజలితో సమర్పిస్తూ.....

వ్యక్తిగతంగా ఎన్నో బాధలను సహిస్తూ వాటన్నిటిని దిగమింగుకుంటూ ఉన్న రోజుల్లో, జీవితంలో నిలదొక్కుకొని నా కాళ్ళమీద నేను నిలబడేలా నాకు డిస్టింక్షన్లో ఇంజనీరింగ్ చదువు సంస్కారాలతో పాటుగా మంచి కొలువును అందించి నా జీవితానికి దృఢమైన ఆలంబనను అందించిన మా బి.వి.ఆర్.ఐ.టి, నర్సాపూర్ (మెదక్), కాలేజ్లోని శ్రీవిద్యాగణపతి ఆలయంలో కొలువైన గణపతికి మరియు మహాశక్తివంతమైన శ్రీఅయినవిల్లి మహాగణపతికి నమస్కరిస్తూ.... 
.
శ్రీసద్గురవేనమః.....
🙏😊🍓🍎🍦💐🍕🎇✨🍨🍧

No comments:

Post a Comment