Monday, January 23, 2023

శ్రీకరమైన కొన్ని కాదనలేని జీవితసత్యాలు....


1. కష్టాల్లో ఉనప్పుడు మనల్ని పట్టించుకోని వాడు,
బాధలో ఉన్నప్పుడు మనల్ని అవహేళన చేసేవాడు,
భ్రాంతిలో ఉన్నప్పుడు మనల్ని పక్కదారి పట్టించేవాడు, మన ఉన్నతిపై ఏడిచే వాడు....,
ఇతర సమయాల్లో వచ్చి వీళ్ళు ఎన్ని తీయని మాటలు చెప్పినా / ఎన్ని సో కాల్డ్ హితబోధలు చేసినా, వాటి వెనక ఉన్న మనుషులను / మతలబును బాగా వివేచన చేసి అందులో దాగి ఉండే వారి మోసపూరిత వైఖరిని అర్ధం చేసుకోవాలి....లేనిచో మన పడవ మనమే ముంచుకున్న వారిగా మిగిలిపోతాము..... 

2. మీ పరిధి ఏంటో తెలుసుకొని మీరు నా జోలికి రానే రావొద్దు అని ఎంత చెప్పినా కూడా అటువంటి ఓర్వని దుర్మార్గులు ఏదో ఒక వంకతో మన జీవితాల్లో కలగజేసుకుంటుంటే వారిని మనకు ఎంత దూరంలో ఉంచాలో అంత దూరంలో ఉంచాలి....అవసరమైతే మనమే వారికి దూరంగా వెళ్ళిపోవాలి... 
ఎందుకంటే...
ఒక నిప్పురవ్వ వచ్చి నేను చాలా మంచిదాన్ని...
ఇంతముకుముందులా నేను పెద్దగా మండడం లేదు....అది ఇది...అని ఎంత చెప్పినా కూడా...
నిప్పు యొక్క స్వాభావిక లక్షణాన్ని గుర్తించకుండా
చిన్న నిప్పురవ్వే కదా అని ఒక ఎండుగడ్డిమోపు నిప్పుకు ఆశ్రయమివ్వడం అత్యంత ప్రమాదకరం......

ఆ నిప్పురవ్వ ఎన్ని తీయని మాటలు చెప్పినా కూడా......
" ఓ గొప్ప నిప్పురవ్వ నీకు ఒక నమస్కారం.... 
నువ్వు నీలాంటి ఇతర గొప్ప గొప్ప నిప్పులతో కలిసిఉండడమే నీకు శోభనిస్తుంది....
లేదా వెళ్ళి నీటితో ఉండు...."
అని అంతే పద్ధతిగా సమాధానం ఇవ్వడమే విజ్ఞ్యులకు వివేకమనిపించుకుంటుంది....

3. ఒక దుర్మార్గుడి చేతిలో ఒకసారి మోసపోవడం మన దైన్యం అవ్వొచ్చు....కాని అది పునరావృతం అవ్వడం మన మూర్ఖత్వం అనిపించుకుంటుంది..... 

4. పాత్రులైన వారికి 10 రూపాయలు దానం చేసినా సరే దాని ఫలితం మిక్కుటమైనదిగా పరిణమిస్తుంది... 
100 రూపాయల అపాత్రదానం ఒక్క రూపాయి పుణ్యాన్ని కూడా ఇవ్వకపోవచ్చు.....
కాబట్టి ఎవరో ఏదో అనుకుంటారని దానధర్మాల విషయాల్లో వివేచన లుప్తమైతే అది మురుగుకాలువలో పోసిన గంగనీటిలా వ్యర్ధ ప్రయాసే అవుతుంది....

5. 100 మంది మూర్ఖుల మెప్పు కంటే, ఒక్క మహనీయుడైనా మెచ్చేలా ఉండేదే సార్ధకజీవితం
అనిపించుకుంటుంది.....

6. ఏనుగు తనదార్లో తను వెళ్తూఉంటుంది.... 
మొరిగేవారు మొరుగుతూనేఉంటారు.... 
కూసేవారు కూస్తూనేఉంటారు..... 
మేసేవారు మేస్తూనేఉంటారు....
ఏడిచేవారు ఏడుస్తూనేఉంటారు.....
అభిమానించేవారు చప్పట్లు కొడుతూనే ఉంటారు....
కాని ఏనుగు మాత్రం తన దారికి అడ్డురానంతవరకు ఎవ్వరినీ కూడా పెద్దగా పట్టించుకోదు....
అడ్డుపడి వేధిస్తే మాత్రం తొండంతో ఈడ్చి అవతలికి విసిరిపడేస్తుంది..... 

మనిషి కూడా జీవితంలో ఈ నడవడిని అలవర్చుకోవాలి... 
నాదశక్తిని సృజించే ఏనుగు తొండం వివేకానికి సంకేతం...
భక్తిజ్ఞ్యానములనే తెల్లని ఏనుగు దంతాలే ఆ వివేకానికి ఆభరణాలు.....

7. ఒక చెట్టుపై ఉన్న పండును మన చేతులతో మనమే సంగ్రహించలాంటే....మనం ఆ పండు ఉన్న స్థాయిలో లేదా అంతకంటే ఉన్నతమైన స్థాయిలో ఉన్నప్పుడే అది సమంజసం అనిపించుకుంటుంది..
అదే విధంగా ఒక విజ్ఞ్యుడికి ఏదైనా బోధించాలంటే...సదరు వ్యక్తి యొక్క జ్ఞ్యానస్థాయిలో లేదా అంతకంటే ఉన్నతమైన జ్ఞ్యానస్థాయిలో ఉన్నవారికే అది సమంజసం అనిపించుకుంటుంది....
అన్యులకు అది శోభించని శుష్కప్రయాస.... 

8. " గెలుపు" అనే పదానికి నిజమైన నిర్వచనం, మన జీవితం ఓ పది మంది జీవితాల్లోనైనా 
సంతోషానికి కారణం అవ్వడం....అంతే కాని మనవారి జీవితాల్లో నిప్పులుపోసే వారితో అంటకాగడం కాదు....

ఈ అష్టసూత్రదిగ్బంధనమే "జీవితం" అనే నౌకకు దృఢమైన చుక్కాని వంటి కట్టడి......💐

మూర్ఖుల జీవితం ఎప్పుడుచూసినా సరే పక్కవాడి ఉన్నతి పై ఏడుస్తూ బ్రతకడంలోనే గడిచిపోతూఉంటుంది... 
విజ్ఞ్యుల జీవితం వారినివారు ఉద్ధరించుకుంటూ వారిని ఆశ్రయించే / గౌరవించే వారి జీవితాలను కూడా ఉద్ధరించడంలో సార్ధక్యం చెందుతుంది.... 

ఎవరి జీవిత పయనం వారి వారి ఔన్నత్యానికి ప్రతిబింబం....ఆ ఔన్నత్యం స్వీయనిర్మితమై ఉండేదే కాని ఇతరులచే నిర్వచింపబడజాలనిది.....!

No comments:

Post a Comment