😊💐🍕🍧🍦🍓🍇🎂🎇🍎🍨
దాదాపుగా అన్ని పండగలు కూడా చాంద్రమాన పంచాంగాన్ని ఫాలో అవుతాయి....
కేవలం మకర సంక్రంతి పండగ మాత్రమే సూర్యుడి గమనాన్ని ఆధారంగా చేసుకొని జరుపుకునే పండగ.....
ధనూరాశి నుండి మకరరాశిలోకి సూర్య సంక్రమనాన్ని పురస్కరించుకొని మకర సంక్రాంతి పండగను జరుపుకుంటాము....
అరిసెలు...సకినాలు...ఇత్యాది చిరుతిండ్లను తయారు చేసుకొని / కొనుక్కొని పండగా స్పెషల్ గా ఆరగించడం....పతంగులు ఎగరవేయడం...
ఇత్యాదివన్నీ అందరికీ తెలిసిన లౌకికమైన సంక్రాంతి పండగ యొక్క విశేషాలు.....
ఈ సంక్రాంతి తో అలుముకున్న అలౌకికమైన విషయాలేంటో కొంత పరికిద్దాం....
సూర్యుడి మకర సంక్రమణం తో ఉత్తరం వైపుగా సాగే సూర్యగమనం తో ప్రారంభమయ్యే
పరమోత్కృష్టమైన ఉత్తరాయణపుణ్యకాలం కోసం
అష్టవసువుల్లో ఒకరైన ప్రభాసుడు కామధేను అపహరణ ఘట్టం తో శాపగ్రస్తుడై గంగాసుతుడిగా, శాంతనవుడిగా ఇహపరాల్లోను ఆరితేరిన యోద్ధుడిగా కురువృద్ధుడిగా శ్రీకృష్ణపరమాత్మ యొక్క విశ్వరూపసందర్శనాభాగ్యాన్ని పొందిన వారిగా పేర్గాంచిన భీష్మ పితామహులంతటి మహానుభావులే వేచి ఉండడం గురించి మహాభారత ఇతిహాసం ద్వారా తెలుసుకున్నప్పుడు ఒహో ఎంత మహిమోపేతమైనది కద ఈ ఉత్తరాయణ సంక్రమణకాలం అని మనకు తెలియవస్తుంది....
మామూలుగా అందరు యథాలాపంగా అనేసే ఈ "మకర సంక్రమణం" లో దాగి ఉన్న అలౌకిక విషయవిశేషాలేంటో కొంత పరికించే ప్రయత్నం కావిద్దాం.....
శ్రీచాగంటి సద్గురువుల గజేంద్రమోక్షం ప్రవచనాలు శ్రద్ధగా ఆలకించినవారికి గుర్తున్నట్టుగా......
శ్రీమహావిష్ణువు గజేంద్రుడి శరణాగతికి అలవైకుంఠపురమునుండి ఆఘమేఘాలమీద ఏతెంచి మొసలి పైకి తన సుదర్షనచక్రాన్ని సంధించే ఘట్టాన్ని వివరిస్తూ పోతనామాత్యుల వారు అనుగ్రహించిన ఈ క్రింది కంద పద్యంలో వినే ఉంటారు కద వివిధ మకరముల గురించి.. .
8-114-క.
మకర మొకటి రవిఁ జొచ్చెను;
మకరము మఱియొకటి ధనదు మాటున దాగెన్;
మకరాలయమునఁ దిరిగెఁడు
మకరంబులు కూర్మరాజు మఱువున కరిగెన్.
భావము:
ద్వాదశరాశులలో ఉండే మకరం సూర్యుని చాటున నక్కింది. నవనిధులలో ఉండే మకరం కుబేరుని చాటున దాక్కుంది. సముద్రంలో ఉన్న మకరాలు ఆదికూర్మం చాటుకి చేరాయి.
(మకరం అంటే మొసలి. ఇలా మొసళ్ళు అన్నీ బెదిరిపోవడానికి కారణం భూలోకంలో ఒక మడుగులో ఉన్న గజేంద్రుని హరించ సిద్ధపడ్డ మకరం ఖండింపబడటం. విష్ణుమూర్తి సుదర్శనచక్రం అంటే ఉన్న విశ్వవ్యాప్త భీతిని స్ఫురింపజేసినట్టి కవి చమత్కారం యిది.
(1)ఆకాశంలో ఉన్న మకరం అంటే ఆకాశంలో (1.మేషము 2.వృషభము 3.మిథునము 4.కర్కాటకము 5.సింహము 6.కన్య 7.తుల 8.వృశ్చికము 9.ధనుస్సు 10.మకరము 11.కుంభము 12.మీనము అనబడే ద్వాదశ రాసులు ఉన్నాయి కదా వాటిలోని మకరం) (2) పాతాళంలో ఉన్న మకరం అంటే కుబేరుని వద్ద (1.మహాపద్మము 2.పద్మము 3.శంఖము 4.మకరము 5.కచ్ఛపము 6.ముకుందము 7.కుందము 8.నీలము 9.వరము అనబడే నవనిధులలోని మకరం. (3) సముద్రంలోని మకరాలు అంటే మొసళ్ళకి అదే కదా నివాసం. ఆ మకరాలన్నీ. ఇంకా సముద్ర మథన సమయంలో ఆది కూర్మం సముద్రంలోనే కదా అవతరించింది.)
[ referred from : http://telugubhagavatam.org/?tebha&Skanda=8&Ghatta=15&Padyam=114.0 ]
మరియు శ్రీచాగంటి సద్గురువులు వివరించినట్టుగా......
పూర్తిగా పొడి భూమిపై ఉంటే, మొసలిని తన బలిష్టమైన పాదాలతో తొక్కి తొండంతో ఈడ్చి అవతలికి విసిరిపారేయడం ఏనుగుకు కొద్ది నిమిషాల పని......
పూర్తిగా నీటిలో ఉంటే, ఏనుగును తన బలిష్టమైన దవడలతో గ్రసించి నీటిలోకి ఈడ్చుకుపోవడం మొసలికి కొద్ది నిమిషాల పని......
ఎందుకంటే....
ఏనుగుకు భూమిపై పట్టు అధికం.....
మొసలికి నీటిలో పట్టు అధికం.....
అందుకే పోతనామాత్యుల వారు వాటి వాటి పట్టును నిలుపుకునే ప్రయాసను ఇవ్విధముగా వర్నించినారు....
8-54-క.
కరిఁ దిగుచు మకరి సరసికిఁ
గరి దరికిని మకరిఁ దిగుచు గరకరి బెరయన్
గరికి మకరి మకరికిఁ గరి
భర మనుచును నతల కుతల భటు లరుదు పడన్.
భావము:
మొసలి ఏనుగును మడుగులోకి లాగింది. ఏనుగు మొసలిని గట్టు పైకి ఈడ్చింది. రెండూ ద్వేషం, పట్టుదలలు పెంచుకొన్నాయి. “మొసలిని ఏనుగు తట్టుకోలేదు, ఏనుగుని మొసలి తట్టుకోలేదు” అనుకుంటూ పాతాళ, భూలోకాల శూరులు ఆశ్చర్యపోయారు.
ఇక ధనస్సు విషయానికి వస్తే......
ఎంతో దూరంలో ఉండే వాటిని కూడా గురిచూసి భేదించేందుకు బాణాన్ని సంధించే ఆయుధం గా అందరికి తెలిసిందే...
రాబిన్హుడ్, బాహుబలి, RRR ఇత్యాది సినిమాల్లో చూసే ఉంటారు కద ఒక క్షత్రియుడి భుజస్కందాల నుండి వినిర్ముక్తమయ్యే శరప్రహారాలు ఎంత ఆశ్చర్యకరంగా గాల్లోకి గమ్యంవైపుగా దూసుకుపోతాయో.....
"సుక్షత్రియుడైన శ్రీరాముడు తన కోదండాన్ని ఉపయోగించడం మొదలుపెట్టాడంటే ఎంతటి కండలుతిరిగిన వీరుడైనా సరే నేలకూలవలసిందే....." అని హనుమంతుల వారు శ్రీరాముడి విలువిద్యాకౌశలాన్ని కొనియాడడం గురించి శ్రీమద్రామాయణంలో వినేఉంటారు కద.....
కాబట్టి వినిర్ముక్తపరచడానికి ధనస్సు పెట్టిందిపేరు.....
పట్టుకి / గ్రసించడానికి మకరం పెట్టిందిపేరు.....
ఈ లౌకికవాదాన్ని ఇప్పుడు మనం అలౌకిక / జ్యోతిష శాస్త్రానికి ఆపాదించి ఈ మకరసంక్రమణంలో ఉన్న విశేషాలేంటో చర్చిద్దాం....
సూర్యుడు ధనూ రాశిలో ఉన్నప్పటివరకు సాగే పయనం భూమికి అత్యంత దూరంగా ఖగోళం అనే ఒక భావనాత్మక ధనస్సు నుండి వినిర్ముక్తమైన బాణంలా సాగే పయనం.....
సూర్యుడు ధనూరాశి నుండి మకరరాశిలోకి ప్రవేశించిన మకరసంక్రమణం తదుపరి సాగే పయనం ఖగోళం అనే ఒక భావనాత్మక సరస్సులో కొలువైన ఒక మకరం యొక్క స్థిరమైన దృఢమైన పట్టులా భూమికి అత్యంత సమీపంగా సాగేలా ఉంటుంది.....(నిజానికి అది భూమి సూర్యుడికి కొంచెం కొంచెంగా దెగ్గరవ్వడం) అనగా సూర్యుడినుండి ఉద్భవించే శక్తిలో అధికభాగం మొత్తం భూమికి అందేలా సూర్యుడిపై ఖగోళం యొక్క పట్టును మనం దర్శించవచ్చు.....
కాబట్టి ఈ మకరసంక్రమణం అనే సమయం మనం క్యాజువల్గా మాట్లాడుకునే పరిభాషలో చెప్పాలంటే.....
కొన్ని కోట్ల కిలోమీటర్ల వరకు సూర్యుడికి దూరంగా సాగిన భూమియొక్క పయనం ఇప్పుడు భూమికి దెగ్గరగా సాగెలా సువ్యవస్థీకరింపబడే సమయం....
ఫిజిక్స్ లోని "లా ఆఫ్ ఇనర్షియా" పై అవగాహన కలిగిన వారికి తెలిసినట్టుగా....
సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ ఒక్కసారిగా సెంట్రిపెటల్ ఫోర్స్ గా మారినప్పుడు ఆ ఇనర్షియేటిక్ ఫోర్స్ యొక్క ప్రభావం వల్ల తద్ పరిణామప్రభావిత పరిసరాల్లో కొద్దిసమయం వరకు ఒక విధమైన సస్టేయిండ్ వైబ్రేషనల్ ఫోర్స్ సృజింపబడుతుంది......
మామూలుగా మన లౌకిక ప్రపంచం లో ఉత్పన్నమయ్యే ఈ వైబ్రేషనల్ ఫోర్స్ ఎలిమెంట్స్ చాలా తక్కువ మ్యాగ్నిట్యూడ్స్ లో ఉంటాయ్ కాబట్టి స్థూలస్థాయిలో వాటిద్వారా జనించే ఎఫ్ఫెక్ట్స్ పెద్దగా ఏమి ఉండవు......
కాని ఖగోళంలో జనించే ఈ సోలార్ కాస్మిక్ వైబ్రేషనల్ ఫోర్స్ ఎలిమెంట్స్ చాలా ఎక్కువ మ్యాగ్నిట్యూడ్స్ లో ఉంటాయ్ కాబట్టి స్థూలస్థాయిలో మరియు సూక్ష్మస్థాయిలో కూడా వాటిద్వారా జనించే ఎఫ్ఫెక్ట్స్ చాలానే ఉంటాయ్.....
వాటిని మన సనాతన ధర్మాంతర్గతమైన జ్యోతిష శాస్త్ర కోవిదులు "రాశిఫలాలు" అనే పేరుతో "27 నక్షత్రాలు × 4 పాదాలు = మొత్తం 108" పాదాల్లోనే జన్మించే సకల జీవకోటి పై సూర్య చంద్ర గ్రహ నక్షత్ర గమనాల ప్రభావం గా అభివర్నించారు......
ఇవ్విధమైన ప్రాబబుల్ స్టొకాస్టిక్ సెలెస్టియల్ ప్రెడిక్షన్స్ ని ఒక వైజ్ఞ్యానిక అంశంగా స్వీకరించి విశ్వసించడం విశ్వసించకపోవడం అనేది వారి వారి వ్యక్తిగతమైన అంశం....
మనం పీల్చే గాలిలోనే ప్రాణవాయువు(O2), బొగ్గుపులుసువాయువు(Co2),
నత్రజని(N), హీలియం(He), ఇత్యాది ఎన్నో వాయువులన్నీ కూడా కలగలిసి ఉన్నా సరే కేవలం ప్రాణవాయువును(O2) మాత్రమే స్వీకరించి మన శరీరానికి స్వస్థతను సమకూర్చడం గుండె అనే పరమేశ్వర ప్రసాదిత అవయవం యొక్క గొప్పదనంగా ఒక కార్డియాలజిస్ట్ చెబితే, డాక్టర్ గారు చెప్పారు కాబట్టి అదే మావిశ్వాసం కూడా.....
అని అనే ఈ ఆధునిక మనిషికి.....
ఇదే విధమైన విశ్వాసం సనాతన ధర్మ ప్రతిపాదిత ఆధ్యాత్మిక అంశాల్లో కూడా సౌరసంబంధమైన విశ్వాసంగా ఖగోళ శాస్త్ర నిపుణులు చెబితే నమ్మగల భావవైశాల్యం, మేధోప్రజ్ఞ్య, ఈ ఆధునిక మానవుడికి అంతగా లేకపోవడం అనేది ఈ కలియుగ వైచిత్రి......
ఈ పరమ పవిత్రమైన సూర్య మకరసంక్రమణ సమయాన్ని 'మకర సంక్రాతి' అనే పేరుతో ఒక పండగగా చెప్పి, సూర్యమండలాంతర్గతమైన
ఆదిపరాశక్తి యొక్క అనుగ్రహాన్ని తమలోకి బాగా ఒడిసిపట్టే వివిధ వస్తువులు అనగా....
భోగిపళ్ళలోని బదరిఫలాలు (రేగుపళ్ళు), అరిసెలు/సకినాలు ఇత్యాదివాటిల్లోని నువ్వులు, వివిధ మధురపదార్ధాల్లోని చెరుకు/బెల్లం, లోగిళ్ళలోని రంగురంగుల రంగవల్లికల మధ్యలో అలకరింపబడే గొబ్బెమ్మల్లోని గోమయం, (పంచగవ్యాలు),
ప్రత్యక్షంగా ఆకాశంలోని సూర్యుణ్ణి చూస్తు ఎగరవేసే పతంగులు, ఇత్యాది వాటిద్వారా సామాన్య ప్రజలకు ఈ సూర్యమకరసంక్రమణ సమయం అనేది లౌకికంగా కూడా ఉపయుక్తమైన ఒక గొప్ప పండగగా సెలవిస్తే చక్కగా అందుకొని తరిస్తారనేది సత్య ద్రష్టలైన మన సనాతన మహర్షుల యొక్క వ్యవస్థీకృత పరంపరాగతమైన విశ్వాసం.....
శ్రీతాళ్ళపాక అన్నమాచార్యుల వారు శ్రీవేంకటగిరిని సూర్యమండలం లాంటి ఒక పెద్ద వెండికొండగా అభివర్నిస్తూ, సూర్యమండలమధ్యగతుడై కొలువైన ప్రత్యక్ష పరమాత్మను
"వెండిపైడి యగు వేంకట గిరిపై కొండలయ్యకును గొబ్బిళ్ళో " అంటూ జానపద శైలిలో
" కొలని దోపరికి గొబ్బిళ్ళో యదు కుల స్వామికిని గొబ్బిళ్ళో " అంటూ కీర్తించారు......
కొలని దోపరికి గొబ్బిళ్ళో యదు కుల స్వామికిని గొబ్బిళ్ళో
కొండ గొడుగుగా గోవుల గాచిన కొండొక శిశువునకు గొబ్బిళ్ళో
దండగంపు దైత్యుల కెల్లను తల గుండు గండనికి గొబ్బిళ్ళో
పాప విధుల శిశుపాలుని తిట్టుల కోపగానికిని గొబ్బిళ్ళో
యేపున కంసుని యిడుమల బెట్టిన గోప బాలునికి గొబ్బిళ్ళో
దండి వైరులను తరిమిన దనుజుల గుండె దిగులునకు గొబ్బిళ్ళో
వెండిపైడి యగు వేంకట గిరిపై కొండలయ్యకును గొబ్బిళ్ళో
kolani dOpariki gobbiLLO yadu kula svaamikini gobbiLLO
koMDa goDugugaa gOvula gaachina koMDoka SiSuvunaku gobbiLLO daMDagaMpu daityula kellanu tala guMDu gaMDaniki gobbiLLO
paapa vidhula SiSupaaluni tiTTula kOpagaanikini gobbiLLO
yaepuna kaMsuni yiDumala beTTina gOpa baaluniki gobbiLLO
daMDi vairulanu tarimina danujula guMDe digulunaku gobbiLLO
veMDipaiDi yagu vaeMkaTa giripai koMDalayyakunu gobbiLLO
http://annamacharya-lyrics.blogspot.com/2006/11/85kolanidopariki-gobbillo.html?m=1
ఎల్లరికీ మకర సంక్రాంతి పండగా శుభాభినందనలు..... 😊🍕🍧🍦🍓🍇🎂🎇🍎🍨💐✨😊
No comments:
Post a Comment