శ్రీ సత్యనారాయణస్వామి వారి వ్రతకల్పవైభవం గురించి, శ్రీరమాసమేతసత్యనారాయణ స్వామి వారి మహిమ్నత గురించి, సాక్షాత్తు శ్రీనారద మహర్షి వారిచే శ్రీమహావిష్ణువే ఈ లోకంలో పరివ్యాప్తి గావించిన కలియుగతారక వ్రతవైభవం గురించి ఎందరో మహానుభావులు, మాన్యులు, ఆధ్యాత్మిక వేత్తలు, సెలవిచ్చి ఉన్నారు...
ప్రత్యేకించి పరమేశ్వరుణ్ణి, పరమేశ్వరవైభవాన్ని ఎంతో హృద్యంగా, సరళంగా, ప్రాక్టికలి అప్ప్లికబుల్ స్పిరిట్చువల్ అప్ప్రోచ్ లో, సామాన్యమానవుడికి కూడా గ్రాహ్యమయ్యేలా అందించే శ్రీచాగంటి సద్గురువుల వివిధ ప్రవచనాల్లో కూడా శ్రీ సత్యనారాయణస్వామి వారి వ్రత వైభవం బహుధా శ్లాఘించబడినది....
ఈ కలియుగంలో మనిషి ఈతిబాధలతో, వివిధ మానసిక శారీరక రుగ్మతలతో, ఎన్నో రకాల దారిద్యంతో, ఎంతగా సతమౌతూ ఉంటాడంటే ఓ 15 సంవత్సరాల్లో ఒక్కసారి మాత్రమే శ్రీసత్యనారాయణ స్వామి వారి వ్రతం చేసుకోవడమే గగనమైన జీవితంతో కుస్తి పట్టడమే బ్రతుకుజట్కాబండి లా జీవితయానం ఉండడం...
చుట్టుప్రక్కన ఉండే వారు మరియు ఇతర బంధుజనం ప్రతిసంవత్సరం కూడా కార్తీక మాసంలోనో మరేదో సమయంలోనో శ్రీసత్యనారాయణస్వామి వారి వ్రతాన్ని ఆచరిస్తూ సుఖసంతోషాలతో కూడిన జీవితాన్ని అనుగ్రహంగా బడసి తరిస్తూ ఉన్నా కూడా కొందరికి, "మరి మనం కూడా శ్రీసత్యనారాయణస్వామి వారి వ్రతాన్ని ఆచరించి స్వామి వారి అనుగ్రహంతో చల్లగా ఉండి తరించవచ్చును కద...?"
అనే అలోచనకూడా రానంతటి మూర్ఖత్వంతో ఈతిబాధల్లో మునిగి ఉంటారు....
ఎందుకంటే....
వారంలో కనీసం ఒక్కరోజైనా నిష్ఠగా ఆలయానికి వెళ్ళి కనీసం 3 ప్రదక్షిణములు, దైవదర్శనం చేయడం అనేది జీవితంలో అంతర్భాగం కానప్పుడు....
సూర్యుడు అనుకూలించి ఆరోగ్యం ఎట్లు సమకూరును..?
చంద్రుడు అనుకూలించి మనోబలం ఎట్లు సమకూరును..?
కుజుడు అనుకూలించి రోగ/దోష/ఋణ బాధలు ఎట్లు సమసును..?
బుధుడు అనుకూలించి బుద్ధివైభవం ఎట్లు సమకూరును..?
గురుడు అనుకూలించి సంకల్పబలం ఎట్లు సమకూరును..?
శుక్రుడు అనుకూలించి సుఖసంతోషాలు ఎట్లు సమకూరును..?
శనైశ్చరుడు అనుకూలించి ఈతిబాధలు ఎట్లు సమసును..?
సూర్యేందు భౌమ బుధవాక్పతి కావ్యశౌరి
స్వర్భానుకేతు దివిశత్-పరిశత్-ప్రధానాః ।
త్వద్దాసదాస చరమావధి దాసదాసాః
శ్రీ వేంకటాచలపతే తవ సుప్రభాతమ్ ॥ 18 ॥
అని శ్రీవేంకటేశ్వరస్వామి వారి సుప్రభాతంలో మాన్యులచే తెలపబడినట్టుగా...
ఈ నవగ్రహాలు కూడా పరమాత్మకు కింకరులుగా వశవర్తులై ఉండడం వల్ల, స్వామి వారి ఒక్క క్రీగంటి చూపుకు సకలగ్రహమండలం కూడా స్వామివారి భక్తులపట్ల వాటి వాటి ప్రతికూల భ్రమణాన్ని కూడా అనూకూలంగా ఉండేలా సవరింపబడి నడుచుకోవడం అనేది ఆధ్యాత్మికతకు గల వైభవం.....
"చూపులు కలిసిన శుభవేళ...."
అనే సామెతను మన పెద్దలు కేవలం పెళ్ళి/కళ్యాణం లో వధూవరులు ఒక్కటవ్వడం అనే లౌకికతత్త్వం కోసం మాత్రమే సెలవివ్వలేదు......
మీనదృక్కులతో యావద్ విశ్వానికి కూడా పోషక, తోషక, రక్షక, శక్తిని అనుగ్రహించే ఆ పరమాత్మను,
సమూర్త్యారాధనలో భాగంగా సదరు దేవతా మూర్తి యొక్క ముఖమండలంలోకి ఆ వైశ్విక మీనశక్తి స్థిరీకరింపబడి, పరమాత్మ మూర్తిలో కొలువైఉండే
షోడషకళాత్మక శక్తిగా ప్రసరింపబడుతూ, నిత్యం భక్తులకు అందివ్వబడే హారతి/మంగళనీరాజనం రూపంలో ఆ దైవానుగ్రహశక్తి అనేది అందివ్వబడుతూ ఉంటుంది.....
అందుకే ఆలయానికి వెళ్ళొస్తే...
దేవుడి దర్శనం అయ్యిందా....?
(అనగా అక్కడ కొలువైన భగవంతుడిని
ఆపాదతలమస్తకం దర్శించావా..)
అని అడుగుతారే కాని...
ఆలయానికి వెళ్ళొచ్చావా...?
ఏమేం తీసుకెళ్ళావ్....?
ప్రసాదం ఎంత తిన్నావ్...?
పుళిహోరా తో పాటు ఇంకా ఏమేం ప్రసాదాలు పెట్టారు...?
ఎవరితో ఏమేం ముచ్చట్లు పెట్టావ్..?
ఇత్యాదిగా ప్రశ్నలు ఉండవు....
ఎందుకంటే దేవాలయ సందర్శనం అనునది ఈ లౌకిక ప్రపంచంలో ఉంటూనే అలౌకిక పరబ్రహ్మంతో
మౌనంగా సంభాషించే మహిమోపేతమైన ప్రాచీన ఆర్షవిజ్ఞ్యాన వ్యవస్థ....
అనగా 'ఈశ్వర మూర్తికి నమస్కరిస్తూ...
మన చూపులను...ఈశ్వర మూర్తి యొక్క చూపులతో అనుసంధానించి ఆ దైవిక తన్మయత్వంలో మన హృదయకోశంలోని పరమాత్మను జాగృతపరచి....
పర, వ్యూహ, విభవ, అర్చ, అంతర్యామి అనబడే 5 రకాల భగవద్ స్వరూపములను ఆంతరమున దర్శిస్తూ....
మన ప్రార్ధనలకు సమాధానాలు పొంది శాంతచిత్తులై తరించడం...'
అనే సర్వశ్రేయోదాయక వ్యవస్థలో భాగమై జీవితాన్ని తరింపజేసుకోవడం...
ఈ ఆధునిక మానవుడు ఎంతటి సంపన్న దరిద్రుడిగా బ్రతుకుతూ ఉంటాడంటే...
ఒక సీసాకు 100 రూపాయలు పెట్టి ఓ గ్లాసెడు దరిద్రాన్ని, నికోటిన్ అనే ఎంతో ప్రమాదకరమైన విషాన్ని నింపుకున్న దరిద్రపు పొగాకు కడ్డీల పెట్టెను మరియు ప్రమోదానికి
గుప్పుగుప్పుమంటూ వాటిని పీల్చడానికి/ వెలిగించుకోవడానికి ఒక అగ్గిపెట్టెను, కొనుక్కొని తాగుతూ అవి సంతోషం ఇస్తాయేమో అని అనుకొని నిత్యం దుఃఖభరితమైన దుర్భర జీవితంతో సతమౌతూ, అసహనంతో ఉంటాడేమో కాని...
ఒక ఆలయానికి వెళ్ళి ఒక పదిరూపాయలు సమర్పించి ఒక చెంచాడు తీర్థాన్ని / డొప్పెడు ప్రసాదాన్ని స్వీకరించి అది మన జీవితాన్ని ఎంతో గొప్పగా ఉద్ధరించగలదు... అనే విశ్వాసంతో జీవించడానికి మాత్రం యత్నించడు....
జీవుడు దేవుడి దెగ్గరకు వెళ్ళడానికి చాలా బిజీగా ఉన్నప్పుడు.....
ఆ దేవుడే జీవుడి దెగ్గరకు వచ్చి విశేషంగా అనుగ్రహించే ప్రక్రియకే నోము / వ్రతం అనే పేరు....
మన లౌకిక ప్రపంచంలో కూడా ఈ ఎగ్సాంపుల్ ని గమనించవచ్చు.....
మామూలు రోజుల్లో....గుంతలమయమైన రోడ్లను బాగుపరచండిరా బాబు...అని ఎంత మొత్తుకున్నా పట్టించుకోరు....
కాని ఒక మంత్రో / ఒక డిగ్నిటరి పర్సనాలిటో ఇటువైపుగా ఏదో శిలాఫలక /శంఖు స్థాపనకో మరేదో పనిమీద వేంచేస్తున్నారు అనగానే..
రాత్రికిరాత్రే రోడ్లన్నీ కూడా సింగపూర్ రోడ్లలా స్మూత్ గా రడీఅవుతాయి....
అచ్చం అదేవిధంగా, ఏదేని ఒక నోము/వ్రతం లో సదరు భక్తుడి విశ్వాసానికి / చిత్తశుద్ధుకి అనుగుణంగా తత్ ఆరాధ్యదైవం అనునది వారి జీవితబాటలను ఎంతో ఘనంగా తీర్చిదిద్దే అనుగ్రహాన్ని వర్షించడం అనేది ఆధ్యాత్మికత యొక్క వైభవం...
వ్రతం యొక్క ప్రసాదం తిరస్కరించినందుకు ఒక వర్తకుడి పడవని ముంచాడని కథలో ఉన్నందుకు, సత్యనారాయణస్వామిని సాడిస్ట్ అని అనడమా....
లేక
వ్రతం యొక్క ప్రసాదం స్వీకరించినందుకు ఒక సామాన్యుడిని భాగ్యవంతుడిగా అనుగ్రహించిన శ్రీసత్యనారాయణస్వామిని ఘన దైవతంగా శ్లాఘించడమా....
అనే భావాన్ని వ్యక్తపరుస్తూ శ్రీచాగంటి సద్గురువులు చమత్కరించడం కొంతమందికైనా గుర్తుండి ఉండాలి....
అది లౌకికంగా భగవద్ ప్రసాదం యొక్క వైభవాన్ని తెలుపుటకు, మరియు భగవద్ ప్రసాదంగా జీవితాన్ని స్వయంకృషితో తీర్చిదిద్దుకోవడంలో ఉండే వైభవాన్ని తెలిపే సాహిత్య ఛమక్కులే అయినా....వాటి ద్వారా మనిషికి భగవంతుడి పట్ల ఒక గౌరవభావం ఏర్పడి మనిషి తను తరించి, తన చుట్టూ ఉండే మంచివారు తరించడానికి, జీవితాన్ని ఒక ధర్మసాధనంగా మలచుకోవడమే అందలి ప్రతిపాదిత సాహిత్యం యొక్క నిజమైన సారాంశం.....
నా మాటల్లో సింపుల్ గా చెప్పాలంటే...
ఈ భూప్రపంచంలో మరెక్కడా కూడా లేని విధంగా....
శ్రీరత్నగిరి వాసుడిగా అన్నవరంలో పంపానదీ తీరాన,
త్రిమూర్త్యాత్మక పరమాత్మగా...,
శ్రీరమాసత్యవతి సమేత శ్రీవీరవేంకటసత్యనారాయణ స్వామి వారిగా వెలసిన స్వామి వారి వైభవం మరియు
శ్రీసత్యనారాయణ స్వామి యొక్క వ్రతవైభవం ఎంత గొప్పదంటే.....
బెల్లం గోధుమనూకతో అన్నవరం ఆలయంలో తయారుగావింపబడే అమృతతుల్యమైన ప్రసాదం అంతటి గొప్పది...
మరియు అన్నవరక్షేత్రావిర్భావ ఘట్టంలో
ప్రస్తావింపబడే అన్నవర ఆలయ స్థలవృక్షమైన అంకోల వృక్షం అంతటి గొప్పది....
(జీవుణ్ణి దేవుడు తనవైపునకు ఆకర్షించడం అనే ఆధ్యాత్మిక విశేషానికి తార్కాణంగా తెలుపబడేది అంకోల వృక్షం...)
( ఆ ప్రసాదమైతే అన్నవరం వెళ్ళినప్పుడు ఒక విస్తరి మొత్తం బాగా లాగించి ఉంటావ్ కాని...
మరి అంకోల వృక్షం ఎక్కడ చూసావ్ అని అడగకండి....
శ్రీ చాగంటి సద్గురువుల ప్రవచనాల్లో వినడమే తప్ప అంకోల వృక్షాన్ని నేనూ ఎప్పుడూ చూడలేదు...జస్ట్ చదివాను అంతే...
https://alphadevi7.aminus3.com/image/2012-11-11.html
ఈశ్వరానుగ్రహంతో ఎప్పుడైనా చూసే భాగ్యం వచ్చినప్పుడు నేను విన్నది, చదివింది బేరీజు వేసుకొని మరింత గొప్పగా వివరించే ప్రయత్నం చేస్తాను..... )
(అత్తారింట్లో ఒడిబియ్యం కార్యక్రమానికి అనుబంధంగా యథాశక్తి కల్పోక్తప్రకారేణ) శ్రీరమాసహితసత్యనారాయణ స్వామి వారి వ్రతంలో నా ధర్మపత్ని మరియు నేను....🙂💐🍕🍧🍇🥥🍒
No comments:
Post a Comment