శ్రీకరమైన 2023 శోభకృత్ నామ సంవత్సర ఆషాఢ బోనాల ఉత్సవం / జాతర మరియు
ఆషాఢ శుద్ధ ఏకాదశి / తోల్ ఏకాదశి / దేవశయన ఏకాదశి పర్వదిన శుభాభినందనలు....🙂🍧🍨🍑🍊😊💐🍎🍿
ఈ లోకంలో కొన్ని డైలాగ్స్ / పదాలను వినే ఉంటారు...
అంగబలం / అనుచరబలం,
అర్ధబలం,
అధికారబలం,
సాధారణంగా జనాలు వీటి చుట్టే పరుగులు పెట్టడం ఈ లోకరీతిగా గమనించే ఉంటారు.....
వీటికి తోడుగా బుద్ధిబలం / దైవబలం అనే పదాలను కూడా ఎప్పుడో ఎక్కడో వినే ఉంటారు కద....
"నాకెంత అంగబలం / అనుచరబలం ఉందో తెలుసా...
ఒక్క పిలుపు ఇస్తే కోనసీమ నుండి కోకాపేట్ వరకు మా వాళ్ళు నాకోసం రడీగా ఉంటారు...."
అని ఒకరు తమ అంగబలం / అనుచరబలం గురించి మాట్లాడగలరేమో....
"నాకెంత అర్ధబలం ఉందో తెలుసా...
రేపు మా తండ్రి గతిస్తే బంగారంతో సమాధి కట్టి, బంగారు విగ్రహం పెట్టి, రోజు బంగారుపూలతో అర్చన చేస్తూ అందరికీ ఆ బంగారుపూలను పంచేంతగా...."
అని ఒకరు తమ అర్థబలం గురించి మాట్లాడగలరేమో....
"నాకెంత అధికారబలం ఉందో తెలుసా....
సి.సి.టి.వి కెమెరాలను స్విచాఫ్ చేయించి , ఒక సామాన్య మధ్యతరగతి వ్యక్తిని బాధించి, సిగ్గుశరం లేకుండా తిరిగి వాడి సొమ్మే దోచుకొని, ఏదో ఘనకార్యం సాధించినట్టు అధికారదర్పాన్ని ప్రదర్శించేంతగా...."
అని ఒకరు తమ అధికారబలం గురించి మాట్లాడగలరేమో....
కాని బుద్ధిబలం / దైవబలం అనేవి అమేయమైనవి....
ఎందుకంటే అవి కేవలం భగవంతుడి అనుగ్రహంగా దేశకాలానుగుణంగా ఉద్భవించే దైవిక సద్గుణ సంపద....
శ్రీలలితాసహస్రనామ ప్రవచనాల్లో...
" అరుణాం కరుణాతరంగితాక్షీం " అంటూ
ఒకసారి అమ్మవారి క్రీగంటి చూపుల మహత్తును మరియు ఇంకోసారి అమ్మవారి విశాల దృక్కుల మహత్తును
(ఆకర్ణదీర్ఘనయనా...అంటూ భీమవరం మావుళ్ళమ్మ తల్లి విశాల నేత్రద్వయాన్ని) వర్నిస్తూ శ్రీచాగంటి సద్గురువులు అమ్మవారి అనుగ్రహవైభవాన్ని బహుధా కొనియాడిన ఆ మహిమాన్విత ప్రవచనాలసారం చాలామంది భక్తులకు గుర్తుండే ఉంటుంది......
మరియు అథాంగపూజలో " ఓం నేత్రేపూజయామి " అనేటప్పుడు మందగించవలసిన మంత్రోఛ్చారణ వేగం గురించి కూడా వివరించడం కొంతమందికైనా గుర్తుండే ఉంటుంది....
మరియు
" వక్త్రలక్ష్మీపరీవాహచలన్మీనాభలోచన... "
అనే నామవైభవంలోని మీనాక్షి తత్త్వ వైభవ వర్ణన కూడా చాలామంది భక్తులకు గుర్తుండే ఉంటుంది......
మరియు
" ఉన్మేషనిమిషోత్పన్నవిపన్నభువనావళిః..."
అనే నామవైభవంలో అమ్మవారు చూపులతోనే విశ్వాన్ని శాసించే వైభవాన్ని కూడా చాలామంది భక్తులు వినితరించి ఉంటారు.....
ఇన్నిన్ని తత్త్వాలతో...ఇంతటి వైభవంతో అలరారే దేవతానేత్రజనిత అనుగ్రహం అంతటి శక్తివంతమైనది కాబట్టే.....
జలాధివాసం....ధాన్యాధివాసం...
ఇత్యాది ముఖ్యమైన క్రతువులతో దేవతాశక్తిస్థిరీకరణ జరిగిన తదుపరి సదరు దేవతామూర్తి ప్రతిష్ఠాపన మహోత్సవంలో
" నేత్రనిమీలనం " అనే అతిముఖ్యమైన ప్రక్రియలో ఆ దేవతామూర్తి ఆయా వైదిక క్రతువులతో సంతరించుకున్న దైవికశక్తిసాంద్రతను కనుగొని తదనుగుణంగా ఆ దేవతానిత్యారాధనలో పాటించవలసిన నిత్య నివేదన ప్రక్రియల గురించి నిష్ణాతులైన ఋత్విక్కులు అక్కడి అర్చకబృందానికి తెలియజేసి ఆ దేవతామూర్తినేత్రమండల స్థిరీకృత దైవికపరారుణశక్తి అట్లే అశేషభక్తకోటిని అనుగ్రహిస్తూ ఉండేలా మన సనాతన ధర్మశాస్త్రం ఎంతో మహత్వపూర్ణమైన ఆచార వ్యవహారావైభవంతో పరిఢవిల్లే ఆలయ వ్యవస్థను మనకు అనుగ్రహించినది.....
ఇది నాణానికి ఒక పార్శ్వం....
పారదర్శక/నిస్వార్ధ ఆలయ పరిపాలక / ఆర్ధిక/కోశాగార వ్యవస్థ, సదాచారసంపన్నభరిత సద్బ్రాహ్మణ ఋత్విక్ / అర్చక వ్యవస్థ...అనగా " స్థల శుద్ధి & సంవృద్ధి + ద్రవ్య శుద్ధి & సంవృద్ధి + ఆచార శుద్ధి & సంవృద్ధి + మంత్ర శుద్ధి & సంవృద్ధి " కలిగిఉండడం అన్నిచోట్లా అందరికీ సాధ్యపడదు.... అన్నిచోట్లా ఘనంగా వ్యయప్రయాసలకు ఓర్చి గొప్పగొప్ప ఆలాయాలను నిర్మించి వాటి సమయాచారానుగుణంగా జరగవలసిన దైవిక వైదిక క్రతువుల వైభవంతో అలరారేలా పర్యవేక్షించడం అందరికీ కుదిరే పనికాదు....
అందుకే ఊరువాడాపల్లెపట్నం ఎల్లప్పుడూ క్షేమంగా ఉండేలా "గ్రామదేవతలు" అనే పదంతో పిలవబడుతూ వర్ధిల్లే "పొలిమేరదేవతలు" / వారిని ఉద్దేశ్యించి జరిగే జాతరలు / ఉత్సవాలు, మన పురాతన భారతం నుండి ఈనాటివరకు కూడా అనాదిగా కొనసాగుతున్న ఒక నైసర్గికాచార వైభవం.....
పురప్రజలు స్వయంగా వారే అమ్మవార్లకు నివేదన సమర్పించి, ఆయా గ్రామదేవతల ఆశీస్సులతో అంటురోగాలు, ఈతిబాధలు, దుష్టదిష్టిబాధలు ఇత్యాది వాటినుండి వారి
ఊరువాడాపల్లెపట్నం రక్షింపబడేలా వార్షిక భోగం / నివేదన సమర్పణను ఒక ఉత్సవం గా / జాతరగా ఆచరిస్తూ ఆ పరాశక్తి అనుగ్రహాన్ని అందుకొని తరిస్తున్నారు...
ఈ గ్రామదేవతల జాతర గురించి కూడా, సామాన్యులకు కూడా అర్ధమయ్యే పరిభాషలో వివరించిన బ్రహ్మజ్ఞ్యానఘనులుగా శ్రీచాగంటి గారి ప్రవచనాస్వరం ఎందరెందరికో నిత్యమననీయమైనది....
నూకాలమ్మ గా,
తలుపులమ్మ గా,
మరిడమ్మ గా,
పోచమ్మ గా,
ఎల్లమ్మ గా,
ఇత్యాది ఎన్నెనో పేర్లతో అలరారే ఆ పరాశక్తి వైభవం ఎంతో హృద్యంగా వివరింపబడడం చాలమందికి గుర్తుండేఉంటుంది....
ఆక్కడ ఆలయాల్లో ఆయా వేదమూర్తులు వారివారి ఉన్నతమైన సవైదిక జ్ఞ్యానస్థాయిలో గావించే భగవద్ నివేదన....
ఇక్కడ మందిరాల్లో సామన్యప్రజలు వారివారి సాధారణస్థాయిలో గావించే భగవతి నివేదన....
రెంటినీ కూడా సమంగా స్వీకరించి ఎల్లరినీ కూడా చల్లగా అనుగ్రహించే ఆ ఆదిపరాశక్తి గురించి హరిహరాదులే వర్నించలేక
" అంబికాఽనాదినిధనా హరిబ్రహ్మేంద్రసేవితా..."
" శివదూతీ శివారాధ్యా శివమూర్తిః శివంకరీ..."
ఇత్యాది లలితా నామాలతో వర్నింపబడే విధంగా....
ఆ పరాశక్తి తత్త్వం అమేయం, అగ్రాహ్యం, అగోచరం.....
సగటు సమాన్య భక్తుడు ఒక వేపచెట్టుకు పసుపుకుంకుమ రాసి పిలిచినా పలికే కారుణ్యమూర్తిగా ఉంటూనే....
" ఆబ్రహ్మకీటజననీ వర్ణాశ్రమవిధాయిని..." గా బ్రహ్మజ్ఞ్యానులచే ఆరాధింపబడే ఆదిపరాశక్తికి ఈ ఆషాఢమాసంలో మేలుకొలుపు జాతరగా / మహానివేదన జాతరగా వర్ధిల్లే " బోనాల ఉత్సవం " తెలంగాణ నైసర్గిక మహోత్సవంగా, మరీముఖ్యంగా హైదరాబాద్ మహానగరానికి మణికిరీటమైన మహోత్సవంగా వర్ధిల్లుతూ ఇక్కడ నివసించే పురప్రజలను చల్లగా అనుగ్రహించే వరదైవంగా నగరం నలువైపులా కొలువైన ప్రముఖ మందిరాల్లో / ఆలయాల్లో ఒక్కో ఆదివారం ఒక్కో ప్రదేశంలోని ఆలయాల్లో బోనం స్వీకరిస్తూ ఆషాఢ ఆదిశక్తిగా మేల్కొని, దక్షిణాయణకాలపగ్గాలను, తొలిఏకాదశి దేవశయన ఏకాదశి తో యోగనిద్రలోకి జారుకునే తన అన్న శ్రీమన్నారాయణుడి నుండి అందుకొని, విశ్వాన్ని పరిపాలించే ఆ పరాశక్తి ఒక్కోచోట ఒక్కో స్థలపురాణం / ఐతిహ్యం తో అలరారుతూ ఉండడం అనేది ఈ సనాతన భారతదేశం యొక్క విశేషం.....
ఒకవైపు ఆకాశాన్నంటే హర్మ్యాలతో, విశ్వనగరంగా భాగ్యనగరం ప్రపంచంలో ఒక అగ్రగామి నగరంగా దినదినాభివృద్ధి సాధిస్తూ శరవేగంతో మున్ముందుకు దూసుకుపోతూ...,
నాడు పదుల సంఖ్యలో, నేడు వందల సంఖ్యలో, రేపు వేలసంఖ్యలో ప్రపంచం నలుమూలలనుండి విమానాలు
భాగ్యనగరానికి Q కడుతూ ఉన్నా,
భారతదేశంలో శాంతిసౌఖ్యాలతో, మతసామరస్యంతో అలరారే నగరాల్లో ఒకటిగా హైదరాబాద్ అలరారుతున్నా...
దేశం నలుమూలలనుండి ఇక్కడికి వచ్చిన ప్రజలు ఆకలిదప్పికలతో అలమటించకుండా అందరికీ అన్నం దొరికి సుఖనిద్రలభించేలా జీవిస్తున్నా....,
అందుకు ముఖ్యకారణం ఇక్కడి విశేషమైన ఆదిపరాశక్తి ఆరాధన....భాగ్యనగరం నలువైపులా ఎన్నెన్నోపేర్లతో కొలువై ఉన్న నగరలక్ష్మిగా, నగరదేవతగా, ఆ భాగ్యలక్ష్మి ఆదిపరాశక్తి వైభవానికి దర్పణంపట్టే జనజాతరగా ఖ్యాతిగడించిన బోనాల ఉత్సవం అమ్మవారికి ఎంతో ప్రీతికరమైన ఉత్సవంగా వినుతికెక్కిన తెలంగాణ రాష్ట్ర ఉత్సవం........
ఎన్నో స్వయంభూ ఆలయాలతో పాటుగా నెలకొన్న..... మానుష ప్రతిష్ఠ ఆలయాలుగా...
అప్పటి బిర్లా మందిర్ నుండి...
ఇప్పటి జూబ్లీ హిల్స్ పెద్దమ్మ గుడివరకు...
వారివారి హృదయవైశాల్యానికి అనుగుణంగా ఆలయాలను కట్టి అజరామరమైన కీర్తికాయులుగా పేరుగడించిన మాన్యులెందరో ఈ భాగ్యనగర ఆధ్యాత్మిక కీర్తిసిగలో వారి పేర్లను శాశ్వతంగా లిఖించుకున్న ధన్యజీవులు....
అవ్విధంగా, సామాన్య మధ్యతరగతి ప్రజలుచే వారివారి ఊరూవాడాపల్లెపట్నం యొక్క యోగక్షేమములను నిర్వహించే గ్రామదేవత యొక్క గుడి / ఆలయం గా స్థాపింపబడి, సంవత్సరంలో ఒక్క ఆషాఢ మాసం లో ఘనంగా మహానివేదన అందుకుంటూ విలసిల్లే శక్తి ఆరాధనా సముదాయాలు దేశవ్యాప్తంగా అనేకం కలవు.....
పోచమ్మ, ఎలమ్మ, గంగమ్మ, పోలేరమ్మ, అంకాళమ్మ, మైసమ్మ, గంగమ్మ, ఉప్పలమ్మ, ఇలా చెప్పుకుంటూ పోతే అనేకానేక పేర్లతో అనాదిగా విలసిల్లే గ్రామదేవతలది ఎంతో గొప్ప వైభవం.....
శ్రీతాళ్ళపాక గంగమ్మ తల్లి అనుగ్రహంతో వర్ధిల్లిన, శ్రీ తాళ్ళపాక అన్నమాచార్యుల వారు త్రిమూర్త్యాత్మక శ్రీవేంకటేశ్వరస్వామి వారి శాక్తేయ వైభవాన్ని వర్నిస్తూ....
"ఎంతమాత్రమున ఎవ్వరు తలచిన అంతమాత్రమే నీవు..."
అనే వారి ఈక్రింది సంకీర్తనలో అందుకే అన్నారు........
సరినెన్నుదురు శాక్తేయులు, శక్తిరూపు నీవనుచు....
అని
*****
Audio link : MS Subbalakshmi
Audio link : G.BalaKrishnaPrasad
Archive link :
Ragamalika, Composer : K.Venkataraman
ఎంత మాత్రమున ఎవ్వరు తలచిన, అంతమాత్రమే నీవు
అంతరాంతరములెంచి చూడ, పిండంతేనిప్పటి అన్నట్లు
కొలుతురు మిము వైష్ణవులు, కూరిమితో విష్ణుడని
పలుకుదురు మిము వేదాంతులు, పరబ్రహ్మంబనుచు
తలతురు మిము శైవులు, తగిన భక్తులునూ శివుడనుచు
అలరి పొగడుదురు కాపాలికులు, ఆది భైరవుడనుచు
సరినెన్నుదురు శాక్తేయులు, శక్తిరూపు నీవనుచు
దరిశనములు మిము నానా విధులను, తలుపుల కొలదుల భజింతురు
సిరుల మిమునే అల్పబుద్ది, తలచినవారికి అల్పంబగుదవు
దరిమల మిమునే ఘనమని తలచిన, ఘనబుద్ధులకు ఘనుడవు
నీవలన కొరతే లేదు మరి నీరు కొలది తామరవు
ఆవల భాగీరధి దరి బావుల ఆ జలమే ఊరినయట్లు
శ్రీ వేంకటపతి నీవైతే మము చేకొని వున్న దైవ(ము)మని
ఈవలనే నీ శరణనిఎదను, ఇదియే పరతత్వము నాకు
http://annamacharya-lyrics.blogspot.com/2006/11/65entha-matramuna-evvaru-talachina.html?m=1
*****
మీరు గమనించి ఉంటే....
బాలగంగమ్మ,
బాటగంగమ్మ,
పాచికాలువగంగమ్మ,
ఎలమ్మ,
దుర్గమ్మ,
ఇలా ఎన్నో పేర్లతో ఏడుకొండలపై వెలసిన శ్రీవేంకటేశ్వరస్వామి వారి ఆలయ పరిసరాల్లో ఎన్నో శక్తిమందిరాలు కలవు....
ఎంతో శక్తివంతమైన తిరుమల బాటగంగమ్మ గుడిలో ఇప్పటికీ ప్రతీ శుక్రవారం గణపతి సహిత శివశక్తులకు ఎంతో గొప్ప అభిషేక ఉత్సవం నిర్వహించి భక్తులకు పసుప్పచ్చని రక్షాతోరములను ప్రసాదంగా ఇవ్వడం భక్తులెల్లరు గమనించవచ్చు...ఈ బాటగంగమ్మ అమ్మవారి అనుగ్రహం నేను జీవితంలో ప్రత్యక్షంగా దర్శించిన సందర్భాలు అనేకం...!
రేపు తొలిఏకాదశి సందర్భంగా, ఇవ్వాళ అనగా శ్రీ శోభకృత్ 2023 ఆషాఢ శుద్ధ దశమి రోజున....
కూకట్పల్లి వివేకానందనగర్ లో వెలసిన...
శ్రీమదలర్మేల్మంగాపద్మావతీ సమేత శ్రీవేంకటేశ్వరస్వామి వారి సన్నిధానంలో ఎంతో వైభవంగా
గో క్షీర దధి ఘృతములతో, వివిధ ఫలరసాలతో,
హరిద్రాచందనములతో...వార్షిక ఆషాఢమాస తొలిఏకాదశి పర్వదినానుబంధ అష్టోత్తరశతకలశాభిషేక ఉత్సవాంతర్గతంగా స్నపనతిరుమంజనం నిర్వహింపబడి
భక్తులెల్లరికి స్వామివారి దివ్యతిరుమేనిని అలంకరించిన ఆ పరిమళభరిత హరిద్రాచందనములను ప్రసాదంగా వితరణ గావించారు....
సంవత్సరంలో ఒక్కసారి మాత్రమే లభించే ఈ తొలిఏకాదశి పర్వదినానుబంధ మహా అభిషేక ఉత్సవ ప్రసాదమైన ఆ హరిద్రాచందనములను నేను కూడా ఇంటికి తెచ్చుకొని తరించాను...🙂💐
హైమోర్ధ్వపుండ్రమజహన్మకుటంసునాసం
మందస్మితం మకరకుండలచారుగండం
బింబాధరం బహుళదీర్ఘకృపాకటాక్షం శ్రీవేంకటేశముఖమాత్మనిసన్నిధత్తాం....."
శ్రీవేంకటాద్రినిలయః కమలాకాముకః పుమాన్...
అభంగురవిభూతిర్నస్తరంగతు యదుమంగళం....
సర్వం శ్రీమదలర్మేల్మంగాపద్మావతీ సమేత శ్రీవేంకటేశ్వరశ్రీచరణారవిందార్పణస్తు...🙏💐
సర్వమంగళమాంగళ్యే శివేసర్వార్ధసాధికే
శరణ్యేత్రయంబికేదేవి నారాయణినమోస్తుతే....
సర్వం బల్కంపేట శ్రీరేణుకాహేమలాంబ శ్రీచరణారవిందార్పణమస్తు.....🙏💐
[
My old posts on the magnanimity of Bonalu can be found in the hyperlinks mentioned in the post below...
https://m.facebook.com/story.php?story_fbid=10224663296743187&id=1033694038&mibextid=Nif5oz
]
🌼🌼🌼🌻🌻🌻
No comments:
Post a Comment