Saturday, July 29, 2023

శ్రీ శోభకృత్ నామ 2023 సంవత్సరంలో అధిక శ్రావణ మాసం రావడంతో ఈ సారి 8 శ్రావణ సోమవారాలు, శుక్రవారాలు, శనివారాలు సంభవించడమనేది కాలాంతర్గరమైన విశేషం....

మాసం రావడంతో ఈ సారి 8 శ్రావణ సోమవారాలు, శుక్రవారాలు, శనివారాలు సంభవించడమనేది కాలాంతర్గరమైన విశేషం....

ఇలా మరలా అధిక శ్రావణమాసం సంభవించేది 2042 లో...
మిగతా ఇతర మాసాలకంటే శ్రావణ మాసం అధికమాసంగా రావడం చాలా విశేషమైన పుణ్యప్రదమైన అంశం....
ఎందుకంటే శ్రావణ పౌర్ణమినాటి చంద్రుడు శ్రవణా నక్షత్రం 
(శ్రీవేంకటేశ్వర స్వామివారి తిరునక్షత్రమైన శ్రవణ) తో కూడి ప్రకాశించే ఈ శ్రావణ మాసం కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీవేంకటేశ్వర స్వామి వారికి ఎంతో ప్రీతికరమైన కాలం అయిన కారణంగా....
కాబట్టి, శ్రీమహాలక్ష్మిదేవికి కూడా సహజంగానే ఎంతో ప్రీతికరమైన కాలం ఈ శ్రావణ మాసం...
శ్రావణ బహుళ అష్టమి నాడు శ్రీకృష్ణస్వామి దేవకీవసుదేవులకు పరిపూర్ణావతారంగా జన్మించిన విశేషమైన సమయం...,
చారుమతి స్వప్న వృత్తాంతం తో లోకంలో ప్రాచుర్యం పొందిన మహిమాన్వితమైన శ్రీవరలక్ష్మివ్రతం ఆచరింపబడే విశేషమైన సమయం....,
జంధ్యాలపౌర్ణమి గా విజ్ఞ్యులు, రాఖిపౌర్ణమి గా సామాన్యులు, 
ఈ శ్రావణపౌర్ణమిని ఒక గొప్ప పండగగా జరుపుకోవడం ఎల్లరికీ తెలిసిందే.....,
ఎంతో ప్రశస్తమైన శ్రీహయగ్రీవజయంతి యొక్క పర్వసమయం శ్రావణపౌర్ణమి...
ఇలా ఈ శ్రావణ మాసం అనాదిగా అస్తిక లోకానికి ఒక గొప్ప ఉత్సవ సమయంగా, విశేషమైన పర్వ సమయంగా భాసిల్లే శ్రావణశోభ ఎల్లరికీ విదితమే....

శ్రీమహాలక్ష్మి యొక్క విశేషమైన ఆరాధనకు పెట్టిందిపేరుగా ఈ శ్రావణమాసం బహుప్రాచుర్యం పొందిన సమయం......

" సిద్ధలక్ష్మీర్మోక్షలక్ష్మీర్జయలక్ష్మీర్సరస్వతి, శ్రీలక్ష్మీవరలక్ష్మీశ్చ ప్రసన్నా మమ సర్వదా...."
అని ఆ లక్ష్మీదేవిని కీర్తిస్తున్నది ఎంతో మహత్వపూర్ణమైన శ్రీసూక్తం....

ఈ విశేషమైన శ్రీలక్ష్మీ తత్త్వాన్ని,
"అలర్మేల్మంగా అలర్మేల్మంగా పాహి హరిప్రియే అలర్మేల్మంగా" 
అని భక్తులెల్లరిచే నిత్యం స్తుతింపబడుతూ ఉండే ఆ కలియుగప్రత్యక్ష శ్రీమహాలక్ష్మి యొక్క అనుగ్రహంతో కొంత వివరింప ప్రయత్నం గావిస్తాను....

ఒకానొక సందర్భంలో మిరుమిట్లుగొలుపే బంగారు కమలాసనస్థయై పదహారేళ్ళ నవయవ్వన పడతిగా పద్మసరోవరం (ఇప్పటి తిరుచానూరు ఆలయ కొలనులో)  నుండి శ్రీవేంకటేశ్వరస్వామి వారి పన్నెండేళ్ళ తపస్సుకు మెచ్చి
ఉద్భవించిన ఆ దేవాంగనను, ఆనాటి విజ్ఞ్యులు 
" అలర్ మేల్ మంగై " అనే ద్రావిడ సంబోధనతో స్తుతించిన కారణంగా, " అలర్మేల్మంగ " అనే పేరుతో జనబాహుళ్యంలో ప్రాచుర్యం పొందిన ఆ పద్మావతి అమ్మవారి వైభవం బహువిశేషమైనది...

సంప్రదాయం తెలిసిన విజ్ఞ్యులు,
తిరుచానూర్ లో పద్మావతి అమ్మవారి దర్శనం అయిన తరువాతే కొండపైకి అయ్యవారి దర్శనానికి వెళ్ళడం ఇప్పటికీ మనం గమనించవచ్చు....

నిత్యాన్నపాయినీం, నిరవద్యాం, దేవదేవదివ్యమహిషీం, అఖిలజగన్మాతరం, గా ఆ నిగామాగమవినుత స్తుతింపబడుతున్నది.....

మీరు వైదిక వాంజ్మయాన్ని గమనిస్తే, ఎన్నో రకాల లక్ష్మి గా ఆ శ్రీలక్ష్మి నిత్యం వివిధ మాన్యులచే స్తుతింపబడుతూ ఉంటుంది....

ఆదిలక్ష్మి, ధాన్యలక్ష్మి, ధైర్యలక్ష్మి, గజలక్ష్మి, 
సంతానలక్ష్మి, విజయలక్ష్మి, విద్యాలక్ష్మి, ధనలక్ష్మి
అనే పేర్లతో అష్టలక్ష్ములను స్తుతించే స్తోత్రం ఎల్లరికీ తెలిసినదే ...

శ్రీలక్ష్మి ఆపాదతలమస్తకం వసించి ఉండేలా,
అనగా...తిరుమల వేదపఠనంలో వివరింపబడినట్టుగా....

వదనాంబుజ స్థిత భాగ్యలక్ష్మిగా,
కరాంబుజ స్థిత దానలక్ష్మిగా,
భుజమండలాంబుజ స్థిత వీరలక్ష్మిగా,
హృదంబుజ స్థిత భూతకారుణ్యలక్ష్మిగా,
ఖడ్గాలంకృత శౌర్యలక్ష్మిగా,
సకలసద్గుణశోభిత కీర్తిలక్ష్మిగా,
దైవికదేహాంబుజస్థిత సౌమ్యలక్ష్మిగా,
భక్తులను అనుగ్రహించే సర్వసామ్రాజ్యలక్ష్మిగా....

అనునిత్యం స్వామివారిని ఆవహించి ఉండే వివిధ వైభవలక్ష్మి స్వరూపంగా స్వామివారు నిత్యం శ్రీ కి నివాసంగా శ్రీశ్రీనివాసుడిగా విరాజిల్లడం గురించి తిరుమలలో వైదికవిజ్ఞ్యుల వేదపఠనంలో వినే ఉంటారు.....

ఇక సర్వసాధారణంగా అరోగ్యాన్ని లక్ష్మి గా వర్ణిస్తూ అరోగ్యలక్ష్మి అని భావించడం దెగ్గరినుండి మనం భుజించే సస్యములను సస్యలక్ష్మి గా భావిస్తూ, ప్రపంచంలోని ప్రతీ ఉత్తమ విద్వత్తును, సంపత్తును, వస్తుసముదాయాన్ని, వ్యక్తిత్త్వాలను లక్ష్మీ స్వరూపంగా భావించడం అనేది భారతీయులకు సనాతనంగా గల ఒక గొప్ప సంప్రదాయ విశేషం....
" లక్ష్మ్యతే ఇతి లక్ష్మి " అనేది వ్యుత్పత్తి....
" ఒక తత్త్వంగా భాసించునదే లక్షి " అనేది అత్యంత సులభమైన పరిభాషలోని తాత్పర్యం.....

చాలా సింపుల్ గా కొన్ని ఎగ్సాంపుల్స్ తో ఆ శ్రీలక్ష్మి భాసతత్త్వాన్ని వివరించే ప్రయత్నం గావిస్తాను....

ఒకరు మన శ్రేయస్సును కాంక్షిస్తూ మనకు ఉపయుక్తమైన వస్తువులను, అరోగ్యకరమైన పదార్థాలను అందించే ప్రయత్నంలో మనకు సహాయసహకారం అందించడం అనే ప్రక్రియలో వారి ఔదార్యం ఒక శ్రేయోతత్త్వంగా భాసించడంలో సదరు వ్యక్తులు మనకు శ్రేయోభిలాషులు అని ప్రకటితమౌతుంది.....

మన అభివృద్ధిని, శ్రేయస్సును ఓర్వని కుళ్ళుబోతు మనస్తత్వాలు మనకు హానికరమైన వస్తువులను, అనారోగ్యకరమైన పదార్థాలను సూచించే ప్రయత్నంలో మనలను పెడత్రోవ పట్టించే ప్రక్రియలో వారి ఓర్వలేనితనం, వారి గుంటనక్క స్వభావం అనేది ఒక త్యజనీయమైన శల్యతత్త్వంగా భాసించడంలో సదరు వ్యక్తులు మనల్ని ఓర్వని ధూర్తులు అని ప్రకటితమౌతుంది....

ఫర్ ఎగ్సాంపుల్, ఒక ఆదివారం నాడు మనం దార్లో వెళ్తుంటే.....

మొదటి రకం వారు మనకు ఆరోగ్యాన్ని ప్రసాదించే తోటమామిడి పండ్లను మనం ప్రయాణించే దార్లో ఉండేలా చేసి వారి శ్రేయోతత్త్వాన్ని ప్రకటిస్తే....

రెండవ రకం వాడు 
" రేపు సోమవారం కద...వీడు శివాభిషేకంతో పుణ్యాన్ని ఆర్జిద్దామని శివాలయానికి వెళ్దామని అనుకుంటాడు కాబట్టి.....వీడి ఆరోగ్యం పాడయ్యేలా వీడికి పడని జామపండ్లను కొనుక్కునేలా చేద్దాం...."
అని అనుకొని మనం ప్రయాణించే దార్లో జామపండ్లను ఉండేలా చేసి వాడి తోడేలు స్వభావాన్ని ప్రకటిస్తుంటాడు...

అంతే కాని 

"నేను నీ శ్రేయోభిలాషిని..." అని మన మితృడు ఒక బోర్డ్ పెట్టుకొని మనకు కనిపించడమో....
లేక
"నేని నీ అభివృద్ధిని ఓర్వని శత్రువును...."
అని ధూర్తుడు ఒక బోర్డ్ పెట్టుకొని మనకు కనిపించడమో...
ఉండదు....

అత్యంత అల్పస్థాయిలోని ఈ సింపుల్ ఉదాహరణ దెగ్గరినుండి అత్యంత ఉన్నతమైన స్థాయిలోని సంఘటనలవరకు ఇవ్విధముగ, ఒక త్తత్వభాసగా ఆ శ్రీలక్ష్మి తత్త్వం ప్రకటింపబడుతూ ఉంటుంది....

ఆ తత్త్వభాసను అందుకొని ఆకళింపుజేసుకొని తరించాలంటే మనము కూడా శ్రీలక్ష్మి తత్త్వంతో అలరారే లక్ష్మిస్వరూపంగా వర్ధిల్లాలి....
అనగా శ్రీలక్ష్మీనారాయణ స్వరూపంగా అని అర్ధం.....
ఎందుకంటే కేవల లక్ష్మి లేక కేవల నారాయణ తత్త్వం అనేది అర్ధరహితమైనది.....

భోజనం అంటే.....
కేవలం అన్నం, లేక కేవలం కూర అనేది అర్ధరహితం...

కూర లేనినాడు అది అర్ధంలేని భోజనం....
అన్నం లేనినాడు అసలు అది భోజనమే కాదు....

అదే విధంగా లక్ష్మీ రహితమైన ఆరాధన అర్ధంలేని ఆరాధన..
నారాయణుడు లేని ఆరాధన అసలు ఆరాధనే కాదు....

కాబట్టి ఈ ప్రకృతిలోనే అంతర్నిహితమై ఉండే పరమాత్మతత్త్వాన్ని, ఎల్లప్పుడు ప్రస్ఫుటంగా భాసించే శ్రీలక్ష్మీనారాయణ తత్త్వంగా అందుకొని అనుగ్రహింపబడి తరించాలంటే, నిత్యం ఆ శ్రీలక్ష్మినారాయణ అరాధన అనేది జీవితంలో అంతర్భాగమై ఉండవలసిన తత్త్వం....

శ్రీచాగంటి సద్గురువుల ప్రవచనాలు శ్రద్ధగా ఆలకించిన వారికి గుర్తునట్టుగా.....

ఆంతరశాక్తం...
బాహ్యశైవం...
జనమధ్యేతువైష్ణవం...

అనే సిద్ధాంతాన్ని భారతదేశం యొక్క సర్వోన్నత పీఠములైన
శ్రీఆదిశంకర స్థాపిత చతురామ్నాయ పీఠములకు అధిపతులుగా ఉండే జగద్గురువులకు నియమముగా శ్రీఆదిశంకరులు ధర్మాచారణను సువ్యవస్థీకరించడం మనం ఇప్పటికీ గమనించవచ్చు......

జగద్గురువుల అనుగ్రహభాషణములు విన్నవారికి తెలిసినట్టుగా...
" నారాయణనామస్మరణతో మా ఆశీస్సులను మీకు అనుగ్రహిస్తున్నాము...."
అనే వచనాలతోనే జగద్గురువుల భాషణం సంపూర్ణమవ్వును....

శ్రీకంచికామాక్షి శక్తిపీఠంలో కూడా అరూపలక్ష్మికి సమర్పింపబడిన కుంకుమనే కామాక్షి అమ్మవారి ప్రసాదంగా భక్తులకు అందివ్వబడడం కూడా మనం గమనించవచ్చు....

సనాతన ధర్మానికి హరిద్రా కుంకుమ ధారణ అనేది ఒక లక్ష్మీతత్త్వ సూచికగా అందివ్వబడిన సత్సంప్రదాయం...

అది పునర్జన్మసిద్ధాంత విశ్వాసానికి ప్రతీకగా....
ఆజ్ఞ్యాచక్రాచ్ఛాదనకు ప్రతీకగా....
ఇలా పలువిధాలుగా మాన్యులచే నిర్వచింపబడే సంప్రదాయం....

ఇంకా సింపుల్ గా ఒక చిన్న ఎగ్సాంపుల్ తో శ్రీలక్ష్మి తత్త్వభాస గురించి చెప్పాలంటే....

" ఇదిగో...అక్కడ నిల్చున్న 30 మందిలో, మందిని ముంచే వాడేవడో.....మంచి మనసున్నవారెవరో చెప్పగలవా...?"

అని ఎవరైనా అడిగితే...

" అదిగో అక్కడ ఒకాయన బొట్టు పెద్దగా పెట్టుకొని నిల్చున్నాడు చూడు...వాడే మందిని ముంచే పాపిష్టివాడు...
అదిగో అక్కడ ఒకాయన బొట్టు ఫలాన విధంగా ధరించాడు చూడు...వారే మంచి మనసున్న వారు....
అదిగో అక్కడ ఒకాయన బొట్టు ఫలాన విధంగా ధరించాడు చూడు... వాడే అందరికి పంగనామాలు పెట్టే దొంగ....
అదిగో అక్కడ ఒకాయన బొట్టు కస్తూరి తిలకంగా ధరించాడు చూడు... ఆయన అందరి మంచి కోరే నారాయణుడి లాంటి మంచి మనిషి....
"

లేక

అదిగో అక్కడ ఒకాయన ఫలానా రంగు దుస్తులు ధరించి నిల్చున్నాడు చూడు...వాడే మందిని ముంచే పాపిష్టివాడు...
అదిగో అక్కడ ఒకాయన ఫలానా రంగు కండువ ధరించాడు చూడు ..వారే మంచి మనసున్న వారు....
అదిగో అక్కడ ఒకాయన ఫలానా రంగు పంచె ధరించాడు చూడు .. వాడే అందరికి పంగనామాలు పెట్టే దొంగ....
అదిగో అక్కడ ఒకాయన ఫలానా రంగు బ్యాగును వేస్కొని కూర్చున్నాడు చూడు... ఆయన అందరి మంచి కోరే నారాయణుడి లాంటి మంచి మనిషి....

అని ఎవరైనా సమాధానాలు చెప్తే, ధరింపబడిన బొట్టు, వస్త్రం, వస్తువు ఇత్యాదివాటిని ఆధారంగా చేసుకొని సదరు మనిషి గురించి వారికి అర్ధమైన విషయాన్ని కొందరు తెలుపుతున్నారు...అనేది ఇక్కడి లౌకికాంశం కద...

ఇవ్విధముగనే దేశకాలానుగుణంగా ఆ శ్రీలక్ష్మీనారాయణ తత్త్వం ఒక్కోభక్తుడికి ఒక్కో విధంగా భాసించి, ఆ తత్త్వమునందు జ్యోతకమయ్యే సత్యములు గ్రాహ్యమై ప్రకృతిలోనే పరమాత్మ యొక్క అనుగ్రహాన్ని అందుకొని తరించడం అనేది మన నిత్య శ్రీలక్ష్మీనారాయణ ఆరాధనలోని ఆంతర్యం....

అత్యంత శక్తివంతమైన శ్రీసూక్తంలోని 5వ పంక్తిలో ఉటంకింపబడేవిధంగా....
********
చన్ద్రాం ప్రభాసాం యశసా జ్వలన్తీం శ్రియం లోకే దేవజుష్టాముదారామ్ |
తాం పద్మినీమీం శరణమహం ప్రపద్యేఽలక్ష్మీర్మే నశ్యతాం త్వాం వృణే || 5 ||
********

నిత్యము సహజమైన ప్రకృతినియమానుసారముగా వ్యక్తమయ్యే అలక్ష్మితత్త్వం పరిహరింపబడుతూ, ప్రకృతియందే అంతర్నిహితమై ఉండే పరమాత్మ తత్త్వం లక్ష్మీ తత్త్వంగా నాయందు వృద్ధి చెందుగాక....

అనే తాత్పర్యంలో....,
అత్యంత అల్పస్థాయిలో....,మన నిత్యశరీరశోధన చే సంతరించుకునే శారీరకపరిశుభ్రత అనే బాహ్య లక్ష్మిసంపత్తి దెగ్గరినుండి....

ఈ క్రింది నారాయణసూక్తం లో ఉటంకింపబడే 
హృదయకోశగత పరమాత్మతత్త్వాన్ని .....
అది బ్రహ్మ, అది శివ, అది హరి, అది ఇంద్ర, అది అక్షరము, (అనగా క్షరము కాని శాశ్వతత్త్వము),

అని మనము ఏ నామారూపాత్మకముగా భావించినా సరే మనకు వివిధ స్థాయుల్లో నిత్యమూ గ్రాహ్యమౌతూ ఉండే పరతత్త్వాన్ని.....

నాయందు స్థిరమైన, గ్రాహ్యమైన,అనుభవైకవేద్యమైన
శ్రీలక్ష్మీనారాయణ తత్త్వముగా ప్రకాశింపజేయుము....
అని ఆ పరబ్రహ్మస్వరూపిణి ని ఆరాధించే అత్యున్నతమైన స్థాయి వరకు....

మనకు నిత్యము వివిధ రీతుల్లో భాసించే జ్ఞ్యానదీప్తియే నిజమైన శ్రీలక్ష్మీనారాయణ తత్త్వభాస.....

******** ******** ******** ******** ********
ఓం ॥ స॒హ॒స్ర॒శీర్॑షం దే॒వం॒ వి॒శ్వాక్షం॑ వి॒శ్వశం॑భువం ।
విశ్వం॑ నా॒రాయ॑ణం దే॒వ॒మ॒క్షరం॑ పర॒మం పదం ।

వి॒శ్వతః॒ పర॑మాన్ని॒త్యం॒ వి॒శ్వం నా॑రాయ॒ణగ్ం హ॑రిం ।
విశ్వ॑మే॒వేదం పురు॑ష॒-స్తద్విశ్వ-ముప॑జీవతి ।

పతిం॒ విశ్వ॑స్యా॒త్మేశ్వ॑ర॒గ్ం॒ శాశ్వ॑తగ్ం శి॒వ-మ॑చ్యుతం ।
నా॒రాయ॒ణం మ॑హాజ్ఞే॒యం॒ వి॒శ్వాత్మా॑నం ప॒రాయ॑ణం ।

నా॒రాయ॒ణప॑రో జ్యో॒తి॒రా॒త్మా నా॑రాయ॒ణః ప॑రః ।
నా॒రాయ॒ణపరం॑ బ్ర॒హ్మ॒ తత్త్వం నా॑రాయ॒ణః ప॑రః ।

నా॒రాయ॒ణప॑రో ధ్యా॒తా॒ ధ్యా॒నం నా॑రాయ॒ణః ప॑రః ।
యచ్చ॑ కిం॒చిజ్జగత్స॒ర్వం॒ దృ॒శ్యతే᳚ శ్రూయ॒తేఽపి॑ వా ॥

అంత॑ర్బ॒హిశ్చ॑ తత్స॒ర్వం॒ వ్యా॒ప్య నా॑రాయ॒ణః స్థి॑తః ।
అనంత॒మవ్యయం॑ క॒విగ్ం స॑ము॒ద్రేంఽతం॑ వి॒శ్వశం॑భువం ।

ప॒ద్మ॒కో॒శ-ప్ర॑తీకా॒శ॒గ్ం॒ హృ॒దయం॑ చాప్య॒ధోము॑ఖం ।
అధో॑ ని॒ష్ట్యా వి॑తస్యాం॒తే॒ నా॒భ్యాము॑పరి॒ తిష్ఠ॑తి ।

జ్వా॒ల॒మా॒లాకు॑లం భా॒తీ॒ వి॒శ్వస్యా॑యత॒నం మ॑హత్ ।
సంత॑తగ్ం శి॒లాభి॑స్తు॒ లంబ॑త్యాకోశ॒సన్ని॑భం ।

తస్యాంతే॑ సుషి॒రగ్ం సూ॒క్ష్మం తస్మిన్᳚ స॒ర్వం ప్రతి॑ష్ఠితం ।
తస్య॒ మధ్యే॑ మ॒హాన॑గ్ని-ర్వి॒శ్వార్చి॑-ర్వి॒శ్వతో॑ముఖః ।

సోఽగ్ర॑భు॒గ్విభ॑జంతి॒ష్ఠ॒-న్నాహా॑రమజ॒రః క॒విః ।
తి॒ర్య॒గూ॒ర్ధ్వమ॑ధశ్శా॒యీ॒ ర॒శ్మయ॑స్తస్య॒ సంత॑తా ।

సం॒తా॒పయ॑తి స్వం దే॒హమాపా॑దతల॒మస్త॑కః ।
తస్య॒ మధ్యే॒ వహ్ని॑శిఖా అ॒ణీయో᳚ర్ధ్వా వ్య॒వస్థి॑తః ।

నీ॒లతో॑-యద॑మధ్య॒స్థా॒-ద్వి॒ధ్యుల్లే॑ఖేవ॒ భాస్వ॑రా ।
నీ॒వార॒శూక॑వత్త॒న్వీ॒ పీ॒తా భా᳚స్వత్య॒ణూప॑మా ।

తస్యాః᳚ శిఖా॒యా మ॑ధ్యే ప॒రమా᳚త్మా వ్య॒వస్థి॑తః ।
స బ్రహ్మ॒ స శివః॒ స హరిః॒ సేంద్రః॒ సోఽక్ష॑రః పర॒మః స్వ॒రాట్ ॥

ఋతగ్ం స॒త్యం ప॑రం బ్ర॒హ్మ॒ పు॒రుషం॑ కృష్ణ॒పింగ॑లం ।
ఊ॒ర్ధ్వరే॑తం వి॑రూపా॒క్షం॒ వి॒శ్వరూ॑పాయ॒ వై నమో॒ నమః॑ ॥

ఓం నా॒రా॒య॒ణాయ॑ వి॒ద్మహే॑ వాసుదే॒వాయ॑ ధీమహి ।
తన్నో॑ విష్ణుః ప్రచో॒దయా᳚త్ ॥

ఓం శాంతిః॒ శాంతిః॒ శాంతిః॑ ॥
******** ******** ******** ******** ********

ఎంత చెట్టుకు అంత గాలి....
అన్నట్టుగా ఎంతటి ఆరాధనా స్థాయికి అంతటి అనుగ్రహం....
అనేది పరమాత్మయొక్క అనుగ్రహవిశేషం....

ఫలానా చెట్టుకు అత్యంత పైన ఉన్న కొమ్మపై మొలిచిన ఒక అత్యత్భుతమైన తీగకు జనించిన ఒక అరుదైన పుష్పం గురించి, ఆ పుష్పం చెట్టుపైనే ఉండగా అంతే గొప్పగా నిర్వచించాలంటే....

1. అంతటి పైస్థాయికి మనం వెళ్ళి ఆ అరుదైన పుష్పాన్ని మనము స్వయంగా దర్శించి నిర్వచించాలి....

2. లేనిచో అంతటి పైస్థాయిలో కొలువైన విజ్ఞ్యులు, ఆ అరుదైన పుష్పాన్ని దర్శిస్తూ మనకు తెలియజెప్తే తెలుసుకొని
మనముకూడా అంతటి పైస్థాయికి ఏదో ఒక రోజు స్వయంకృషితో చేరుకొని నిర్వచించాలి....

అవ్విధముగనే....ప్రకృతిలోనే ఉండే పరతత్వం గురించి చాలా సింపుల్ గా చెప్పాలంటే....

మన మానుషదేహంలోనే, అత్యంత గహనమైన స్థాయిలో కొలువైఉండే హృదయకోశం లో, మనం నిద్రలో ఉన్నాకూడా ఒక స్థిరమైన మంద్రస్థాయిలో కొనసాగే మన శ్వాసకు మూలం ఎక్కడ ఉన్నది...
అనే దిశగా మన అధ్యాత్మ పరిశోధన కొనసాగిన నాడు....

******** ******** ******** ******** ********
తస్య॒ మధ్యే॒ వహ్ని॑శిఖా అ॒ణీయో᳚ర్ధ్వా వ్య॒వస్థి॑తః ।

నీ॒లతో॑-యద॑మధ్య॒స్థా॒-ద్వి॒ధ్యుల్లే॑ఖేవ॒ భాస్వ॑రా ।
నీ॒వార॒శూక॑వత్త॒న్వీ॒ పీ॒తా భా᳚స్వత్య॒ణూప॑మా ।

తస్యాః᳚ శిఖా॒యా మ॑ధ్యే ప॒రమా᳚త్మా వ్య॒వస్థి॑తః ।
******** ******** ******** ******** ********

ఒక అపురూపమైన నీలతోయదంలా వికసించి మెరిసేటి అరుదైన పుష్పంలా...ఉండే ఆ హృత్కుహరస్థిత పరబ్రహ్మతత్త్వమే....
మనలోనే అత్యున్నతమైన స్థాయిలో భాసించే అసలైన శ్రీలక్ష్మి తత్త్వం అనగా శ్రీలక్ష్మీనారాయణ తత్త్వం అనేది...
మనకు ఆ భగవంతుడి అనుగ్రహంగా ఏదోఒకనాడు జ్యోతకమయ్యే పరతత్త్వవిశేషం.....
అంతటి ఆంతర అత్యున్నత స్థాయికి చేరుకోవాలంటే దానికి సోపానం మన నిత్య శ్రీలక్ష్మీనారాయణ ఆరాధన....

బియ్యాన్ని పెరుగుతో సమ్మిళితం గావిస్తే అది దధ్యోదనం అనే పేరుతో పిలువబడుతోంది.....

బియ్యాన్ని చింతపండుగుజ్జుతో సమ్మిళితం గావిస్తే అది పుళిహోర అనే పేరుతో పిలువబడుతోంది.....

బియ్యాన్ని బెల్లంపాకంతో సమ్మిళితం గావిస్తే అది పరమాన్నం / తీపిపొంగలి అనే పేరుతో పిలువబడుతోంది.....

ఈ ప్రసాదాలన్నిటికి కూడా ముడిపదార్ధము ఒక్కటే అయిన బియ్యము అని తెలిసిన విజ్ఞ్యుడు, వాటియందు భేదభావమును దర్శించడు....కేవలం వాటియందు గల ప్రత్యేకతను మాత్రమే దర్శిస్తాడు....అభినందిస్తాడు....
ఆస్వాదిస్తాడు....

అదేవిధంగా...

ఒకే పరతత్త్వం...
ఒకే ప్రకృతిపరమాత్మ తత్త్వం....

బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులుగా...
సరస్వతి, లక్ష్మి, పార్వతులుగా...

నామరూపాత్మకవైభవంతో పరిఢవిల్లే సత్యాన్ని దేశకాలానుగుణంగా ఆయా నామారూపాలతో సంభోధిస్తూ, ఆరాధిస్తూ, అభినందించి తరించడం అనేది విజ్ఞ్యుల ప్రత్యేకత.....
వాటిలో స్వయంకల్పిత భేదభావాన్ని దర్శిస్తూ అల్పస్థాయిలోనే ఉండడం అనేది మూర్ఖుల మౌఢ్యం....

క్లుప్తంగా, ఇదే ఆ
" నవదుర్గాం మహాకాళీం బ్రహ్మవిష్ణుశివాత్మికాం " గా నిత్యము విజ్ఞ్యులచే ఆరాధింపబడే శ్రీలక్ష్మి తత్త్వ వైభవం...అనగా శ్రీలక్ష్మీనారాయణ తత్త్వ విశేషం....

ఈశానాం జగతోఽస్య వేంకటపతే ర్విష్ణోః పరాం ప్రేయసీం
తద్వక్షఃస్థల నిత్యవాసరసికాం తత్-క్షాంతి సంవర్ధినీమ్ ।
పద్మాలంకృత పాణిపల్లవయుగాం పద్మాసనస్థాం శ్రియం
వాత్సల్యాది గుణోజ్జ్వలాం భగవతీం వందే జగన్మాతరమ్

శ్రీమదలర్మేల్మంగాపద్మావతి సమేత శ్రీశ్రీనివాస పరబ్రహ్మణేనమః.....
🙏🙏🙏🙏🙏
🙂💐🍕🍊🍎🍇🫐🌾🍿🍒🍧🍨🍑

No comments:

Post a Comment