శ్రీకరమైన 2023 శోభకృత్ ఆషాఢ పౌర్ణమి / వ్యాసపౌర్ణమి / గురుపౌర్ణమి / శుభాభినందనలు....🙂💐🍨🍧
శ్రీగురుపౌర్ణమి వైభవం గురించి నేను పలువిధాలుగా నా పాత పోస్టుల్లో వివరించి ఉన్నాను....
ఈసారి గురువు, లేక గురువాక్కు యొక్క
మాహాత్మ్యమును కొంత వివరించే ప్రయత్నం గావిస్తాను....
నిజానికి ఈ రెండు అభేదమే అయినా,
గురువుగారు ఎల్లవేళలా భౌతికంగా మనకు దెగ్గరగా ఉండడం కుదరకపోవచ్చు....కాని గురువాక్కు మరియు గురువాక్కు అని అవథరింపబడి విశ్వసింపబడే ఆర్షసారస్వత ప్రోక్త శృతి, స్మృతి, పురాణ, ఇతిహాస, కావ్యాల హితవచనాలు అనేవి ఎల్లప్పుడూ మనిషిని తన జీవిత ప్రయాణంలో ధర్మం అనే శ్రేయోమార్గంలోని గమనం గతితప్పకుండా సువ్యవస్థీకరిస్తూ, ఒక చెక్ పాయింట్ లా మనకు సహకరించే జ్ఞ్యానదివిటీలు.....
మిట్టమధ్యాహ్నం సూర్యరష్మి బాగా ఉంది కదా అని....
ఒక హైవేపై తనకు తెలియకుండానే 100 కిలోమీటర్ల వేగంతో దూసుకుపోవడం గొప్ప కాదు....
"ముందు U టర్న్ ఉన్నది......మెల్లగా వెళ్ళవలెను...", అని దెగ్గర్లో ఒక సైన్ బోర్డ్ మరియు దూరంలో ఒక ఆరెంజ్ కలర్ ఎల్.ఈ.డి ఫ్లాష్ ఇండికేటర్ ని చూసిన వెంటనే...,
ఆ వేగాన్ని 100 నుండి 90 కి, 90 నుండి 60 కి, 60 నుండి 20 కి, క్షణాల్లో తగ్గించి 20 కిలోమీటర్ల వేగంతో ఆ మలుపును దాటి వెళ్ళేలా బండిని కంట్రోల్ చేయగలగడంలోనే ఆ ప్రయాణానికి ఒక అర్ధమున్నది....
100 కిలోమీటర్ల వేగంతో వెళ్ళే బండి పై అలాంటి కంట్రోల్ ఉండాలంటే ఆ బైక్ డ్రైవర్ ఎంతటి శార్ప్ అండ్ విజిలెంట్ డ్రైవర్ అయ్యుండాలి...?
ఆ బైక్ ఎంతటి స్ట్రాంగ్ బిల్డ్ ది అయ్యుండాలి....?
అదే విధంగా, ఈనాటి ఆధునిక జీవితంలో విపరీతమైన భౌతికలాలసత అనే వేగంతో దూసుకుపోతున్న ఈ కలియుగ మనిషి జీవితానికి, భౌతికనిమగ్నత అనే అనివార్యమైన జీవిత వేగాన్ని జీవితంలో ఎప్పుడు ఎక్కడ ఎందుకు ఎంత ఏమేర ఉండాలో అలా ఉండేలా మన ఆధునిక భౌతిక జీవితానికి ఒక కళ్ళెం లా సహకరించేదే గురువాక్కు....
ఆ "an immaculate control on almost everything...."
ని ప్రసాదించేదే విశ్వసింపబడే గురువాక్కు...
ఫర్ ఎగ్సాంపుల్,
ఒక ఫంక్షన్ కి వెళ్ళినప్పుడు అక్కడ ఒక 20 రకాల ఫుడ్ ఐటెంస్ ఉండడం సహజం.....
వాటిని చూడగానే..
"వేరే వాళ్ళు ప్లేట్స్ లో వేసేసుకుంటారేమో....
నోటితో త్వరగా వాటన్నిటిని విస్తరి / ప్లేట్లోకి వేసుకొని బొజ్జలోకి తోసెయ్..."
అని జిహ్వేంద్రియాన్ని ప్రేరేపిస్తుంది మన మనసు....
అప్పుడు మన బుద్ధి వెంటనే....
ఏఏ పదార్ధాలు హానికరమో...,
మనకు ఏఏ పదార్ధాలు పడవో...,
మనకు ఏఏ పదార్ధాలు అనవసరమో...,
ఇత్యాది సూచనలను వెంటనే వెలువరించి...
మనసు యొక్క ...
"విస్తరి నిండుగా నింపుకొని అన్నిటిని లోపలికి తోసెయ్...."
అనే సద్యో సంకల్పాన్ని...
"విస్తరిని డీసెంట్ గా కొన్ని శ్రేయస్కరమైన పదార్ధాలతోనే నింపుకొని లోపలికి తొయ్...."
అని మన బుద్ధి సవరించకపోతే అవి భుజించిన తదుపరి మన ఆరోగ్యం గోవింద గోవిందా...
ఫర్ ఎగ్సాంపుల్, మనం దక్షారామం ఆలయంలో ఒక రవ్వలడ్డు మరియు ఒక బూందిలడ్డు ప్రసాదం కోసం టోకెన్స్ కొనుక్కొని అవి ప్రసాదం కౌంటర్ లో ఇవ్వగా....,
మన ఐసైట్ సరిగ్గా ఉందా లేదా అని తెలుసుకోవడానికి ఒక పరీక్షలా..అక్కడ...లడ్డూల బుట్టలో కేవలం ఒకే ఒక్క వైట్ రవ్వలడ్డుని లెస్ ట్రాన్స్పరెంట్ వైట్ కవర్లో ఒక మూలకు పెట్టి, అవే లెస్ ట్రాన్స్పరెంట్ కవర్స్ లో మిగతవన్నీ బూంది లడ్డూలతో నింపగా...,
అన్ని యెల్లో లడ్ల మధ్యలో ఉన్న ఆ ఒకే ఒక్క వైట్ రవ్వలడ్డును ఆ భక్తుడు చూసి రవ్వ లడ్డు ఉందికద అని అడుగుతాడా...
లేక "అన్నీ బూంది లడ్లే ఉన్నాయ్....కాబట్టి 2 బూందిలడ్లే తీసుకో...." అని అక్కడి వ్యక్తి చెప్పే మాటను వినేసి ఆ ఒకే ఒక్క రవ్వ లడ్డును అడగకుండా వెళ్ళిపోతాడా...
అనే అలోచనతో ఎవరో ఒక వ్యక్తి మనకు ఆలయంలో ఒక పరీక్ష పెట్టినప్పుడు.....
"ఏదో ఒక లడ్డును కొనుక్కొని బొజ్జలోకి తోసెయ్..." అని మనసు అన్ని యెల్లో లడ్లనే చూస్తున్నా..
మన బుద్ధి మాత్రం మన నయనేంద్రియం చూసే ఆ కనిపించి కనిపించని ఒకేఒక్క తెల్ల రవ్వలడ్డును కూడా చూసి అది ఇవ్వమని చెప్పగా ఆ వ్యక్తి "ఓహ్ బుట్టలో రవ్వలడ్డు కూడా ఉన్నదా..." అని ఏమి తెలియనట్టు అని....అప్పుడు అది తీసివ్వగా ఒక రవ్వలడ్డు మరియు ఒక బూంది లడ్డు తీసుకొని ప్రసాదం కౌంటర్ నుండి నిష్క్రమిస్తామా...
అనేది మన బుద్ధికి అప్పటికప్పుడు ప్రచోదనమయ్యే వస్తువర్ణవిభాగ తత్త్వం.....
ఇవి అత్యంత అల్పస్థాయిలోని ఎగ్సాంపుల్స్......
ఇదే విధంగా యావద్ జీవితంపై ప్రభావాన్ని చూపే ఏదేని ఒక సంఘటనలో మన బుద్ధి మనసు యొక్క సంకల్పాన్ని సవరించడంలో అంత ఫాస్ట్ గా consciously calibrated refined intellectual decisions filled with wisdom and prudence ని వెలువరించాలంటే....అది అప్పటికప్పుడు ఏ సూపర్ / హైపర్ మార్కెట్ లోనో, ఏ సంతలోనో విక్రయింపబడే మేధో సంపత్తి కాదుకద.....
అది కేవలం ఆ భగవతి అనుగ్రహంగా...
పరమేశ్వరానుగ్రహంగా...భాసించే బుద్ధి వైభవం....
" విమలపటికమలకుటిపుస్తకరుద్రాక్షశస్త్రహస్తపుటి
కామాక్షిపక్ష్మలాక్షికలితవిపంచివిభాసివైరించి "
అని అనునిత్యం అర్చింపబడే ఆ కామాక్షి ఎక్కడో కంచిలో మాత్రమే ఉందనుకుంటే ఇక ఆ ఆరాధనకు అర్ధమేముంది...
మన కంటికొలుకుల్లోనే ఆ కామాక్షి కొలువైఉంటుంది అని విశ్వసించినప్పుడే మన ఆరాధనకు పరిపూర్ణత్వం ఉన్నదని అర్ధం...
అంతటి ఉన్నతమైన స్థాయిలో మన బుద్ధివైభవం నిత్యవికసనతో పరిఢవిల్లాలంటే అది కేవలం
అప్రతిహత బృహస్పతి అనుగ్రహంగా మాత్రమే సంభవమయ్యే ఈశ్వరానుగ్రహ విశేషం....
శ్రవణంతో గ్రహింపబడి...
స్మరణంతో న్యాసం గావింపబడి,
మననంతో నిత్యానుసంధీకృతమై ఉండే గురువాక్కు మాత్రమే అంతటి శక్తిని అనుగ్రహించే సాధనమై ఒప్పారుతుంది.....
నిత్య మననీయమైన ఆ గురుబోధ /
గురువాక్కే, "మననాత్ త్రాయతే ఇతి మంత్రం"
" గాయంత్రం త్రాయతే ఇతి గాయత్రి "...
అనే గాయత్రి శక్తిగా పరిణమించి నిత్యం సదరు ఉపాసకుడిని పరివేష్టించి ఉంటుంది....
ముక్తా, హేమ, విద్రుమ, నీల, ధవళ
ఛాయల్లో భాసించే ఆ పంచముఖ గాయత్రి దేవి ఎక్కడో సవితృమండలంలోనే ఉంటుంది అని అనుకుంటే ఇక ఆ గాయత్రి ఉపాసనకు పరిపూర్ణత ఎట్లు సిద్ధించును....?
అన్నమయ, ప్రాణమయ, మనోమయ, విజ్ఞ్యానమయ, ఆనందమయ, మనబడే మన పంచకోశాల ఆంతరమున వసిస్తూ.....
మనలో ప్రభవించే
సృష్టి, స్థితి, లయ, తిరోధానం, అనుగ్రహం,
అనే పంచతత్త్వ భరిత సంకల్పవికల్ప సమూహాల మనసుకు ఒక కళ్ళెంలా ఉండే ప్రతీకాత్మక బుద్ధివైభవాన్ని నిరంతరం సమకూర్చే చిత్తవృత్తులే మనలోనే ఉండే ఆ చింతామణి గృహ మహాసామ్రాజ్యం....
సోహం అనే ఆ స్వస్వరూపానుసంధాన స్థితియే మన జీవాత్మ.....
ఆ స్వస్వరూపానుసంధాన తత్త్వమే మనలో కొలువై ఉన్న పరమాత్మ....
సంధ్యల యందు సావిత్రి భాసించుట అనగా....
ఎల్లప్పుడూ ఆకాశంలో ద్యులోక గత తైజసిక జ్యోతిస్వరూపం భాసించుట అని కాదు...
మన హృదయాంతరాళములోనే కొలువైఉండే
కంజదళాయతాక్షి కామాక్షి యొక్క సహస్ర (అనగా అసంఖ్యాక) తైజసిక తత్త్వాలు నిత్యమూ భాసించుటయే సంధ్యలయందు సావిత్రి భాసించుట....
అంతటి గాయత్రి శక్తిభరిత ఉపాసకులుగా నిత్యము వర్ధిల్లాలంటే అందుకు మూలకారణం ఆ "గురుమండలరూపిణి" మనలో ఆ బృహస్పతి వైభవాన్ని నిత్యము ప్రేరేపిస్తూ ఉండడం....
అందుకే కదా....
" కాత్యాయనాయ విద్మహే కన్యకుమారి ధీమహి తన్నః దుర్గిః ప్రచోదయాత్...."
ఇలా ఏ వైదిక దేవతా స్వరూప గాయత్రి శ్లోకాన్ని విన్నా...
అంత్యమున " ప్రచోదయాత్..." అనే చెప్పబడును....
ఒక ఉపాసకుడికి ఇంతటి వైభవం సిద్ధించడానికి మూలకారణం " గురుమూర్తి " గా ఆరాధింపబడే
ఆ ఆదిపరాశక్తి....
ఈ ఆషాఢమాస పౌర్ణమికి
సదాశివ సమారంభాం
వ్యాసశంకర మధ్యమాం
అస్మదాచార్యపర్యంతాం
వందేగురుపరంపరాం...
గా ఆరాధింపబడే ఆ యావద్ గురుమండల అనుగ్రహాన్ని శిష్యులకు విశేషంగా అనుగ్రహించే పౌర్ణమి గా...
ఆ వ్యాసవాల్మీకి వాగ్దాయిని " గురుమండలరూపిణి " గా అర్చింపబడుతూ....,
" వ్యాసపీఠమే " మానవులకు అందుబాటులో ఉండే సర్వోత్కృష్ఠమైన గురుస్థాయి కాబట్టి " వ్యాస పౌర్ణమి" గా,
" గురుపౌర్ణమి " గా, ఈ ఆషాఢ పౌర్ణమి ప్రసిద్ధినొంది
విశేషమైన గురువానుగ్రహాన్ని శిష్యులకు సమకూర్చే ఉత్సవంగా ఖ్యాతిగడించి వర్ధిల్లుతున్నది....
ఏ మహోన్నతమైన వ్యక్తిత్త్వాన్ని ఒక స్ఫూర్తిగా, ఒక విశ్వసనీయమైన బృహస్పతి తత్త్వంగా,
సామాన్య పరిభాషలో చెప్పాలంటే, ఒక సద్గురు స్వరూపంగా..... భావించి ఆరాధిస్తుంటారో....
ఆయా ఆరాధ్యవ్యక్తిత్త్వాలను ప్రత్యక్ష గురువులుగా దర్శించి నమస్కరించి తరించడం అనే ఒక సత్సంప్రదాయం ఈ గురుపౌర్ణమి యొక్క విశేషం....
అస్మద్ అధ్యాత్మ ప్రపంచ గురుదేవులు, శ్రీచాగంటి గారిని ప్రత్యక్షంగా దర్శించి, నమస్కరించి....,
బిల్వం, మహాబిల్వం, శమీ, కదలీ, ధాత్రి(ఉశిరి), తులసీ, ఇత్యాది దేవతావృక్షాలతో,
వివిధ దేవతాపుష్పాల మొక్కలతో, అలరారే...,
సకల దేవతలకు ఆవాసమైన గోశాల ప్రాంగణంలోని మండపంలో.....
వారి పర్యవేక్షణలో నిర్వహింపబడే అత్యంత సశాస్త్రీయ గురుమండల ఆరాధనను దర్శించి, ప్రదక్షిణ నమస్కారమొనరించి....,
ఆ తదుపరి ఎప్పటిలానే....
[[
1. దక్షారామ శ్రీమాణిక్యాంబా సహిత శ్రీభీమేశ్వర స్వామివారి సన్నిధి
[ శ్రీశైల భ్రమరాంబ, శ్రీకాళహస్తి జ్ఞ్యానప్రసూనాంబ, దక్షారామ మాణిక్యాంబ అనే అంబాత్రయ క్షేత్రాల్లో ఒకటి మరియు అష్టాదశ శక్తిపీఠాల్లో 12 వదైన మాణిక్యాంబ శక్తిపీఠం ]....,
2. కోటిఫలి / శ్రీరాజరాజేశ్వరి సహిత సోమేశ్వర / కోటిఫలీశ్వర స్వామివారి సన్నిధి,
(బహు అరుదైన కోటిఫలీశ్వర లింగ స్థిత క్షేత్రం)...,
3. లోవ తడుపులమ్మ / తలుపులమ్మ వారి బాలాలయ సన్నిధి..,
4. అన్నవరం శ్రీసత్యనారాయణస్వామి వారి సన్నిధి...,
5. పిఠాపుర శ్రీక్షేత్రశ్రీపాదశ్రీవల్లభ సన్నిధి..,
6. పిఠాపుర శ్రీకుక్కుటేశ్వర స్వామివారు / శ్రీ పురుహూతిక అమ్మవారి సన్నిధి
[ శిరోగయ, నాభిగయ, పాదగయ, అనే గయాత్రయ క్షేత్రాల్లో 3వదైన పాదగయా క్షేత్రం మరియు అష్టాదశ శక్తిపీఠాల్లో 10 వదైన పురుహూతికా శక్తిపీఠం ]....,
7. సర్పవరం శ్రీభావనారాయణ స్వామివారి సన్నిధి,
(27 నక్షత్రాధిదేవత సంబంధిత దేవతా వృక్షాలతో అలరారే మహిమాన్వితమైన నక్షత్రవనంలో కొలువైన బహు అరుదైన, ఎంతటి వారికైననూ దుర్లభమైన 108 శ్రీవైష్ణవ క్షేత్రాల / దివ్యదేశాల దర్శన ఫలితాన్ని అనుగ్రహించే ప్రాచీన శ్రీమహావిష్ణు స్వయంభూ ఆలయం)...,
8. సామర్లకోట, ప్రాచీన శ్రీమాండవ్యనారాయాణ స్వామివారి సన్నిధి....,
9. సామర్లకోట శ్రీకుమారారామ భీమేశ్వర స్వామివారి సన్నిధి,
(కుమారస్వామి వారిచే ప్రతిష్ఠితమైన పంచారామ క్షేత్రం)...,
]]
దర్శనాలతో ఆ ఆదిపరాశక్తి యొక్క మరింత మెండైన అనుగ్రహసంచయంతో తరించిన 2023 శోభకృత్ ఆషాఢ పౌర్ణమి పర్వ ప్రయుక్త కోకనదా పట్టణ యాత్రా స్మృతుల ఈ లేఖిక మరొక జీవితకాల మధురానుభూతి....🙂🍨💐🍿🍊🍎🍇🫐🍕
No comments:
Post a Comment