శ్రీశోభకృత్ నామ 2023 సంవత్సర ఆశ్వయుజ శరన్నవరాత్రి మహోత్సవాంతర్గత దుర్గా ఆరాధనోత్సవ / దసరా పండగా శుభాభినందనలు....🙂💐🫐🍇🌾🍑🍒🍧🌷🍨🌿🍿🥧🇮🇳
ఫలానా అప్పటినుండి అని స్పష్టంగా ఎవ్వరూ కూడా చెప్పలేనప్పటినుండి ఉన్నది మన భారతీయ సనాతన సవైదిక శాస్త్ర సంప్రదాయ వైభవం.
అనాదిగా విలసిల్లుతున్న ఆ ఆర్షవైభవానికి ఉనికిపట్టుగా అలరారే ప్రతీ శక్తి ఆలయంలోనూ శరన్నవరాత్రోత్సవ దుర్గారాధన అనేది ఎంతో ప్రత్యేకమైన, ప్రహృష్టమైన, ప్రాభవభరితమైన ఉత్సవం.....
ఒక సామాన్యుడు కూడా బంతిపూలదండలతో అలంకరింపబడిన తన ఇంట్లోని సైకిల్, బైక్, ఫ్యాన్, మిక్సి, టీ.వి, మరియు ఇతర వస్తువులకు ప్రత్యేకంగా పూజ నిర్వహించే ఒక రోజుఏదైనా ఉందంటే అది ఆ యేటి దసరా పండగ...
ఎందుకంటే శక్తి ఆరాధన అనేది మన భారతదేశ సంస్కృతి యొక్క జీవగర్ర...మరియు ఆ శక్తిని ప్రతి వస్తువులోనూ కూడా దర్శించి ఆరాధించడం మన ప్రత్యేకత...ఎందుకంటే జడానికి కూడా శక్తి ఉంటుంది అని నమ్మే ఒక గొప్ప సంస్కృతి మన భారతీయ సంస్కృతి...
అందుకే " జడశక్తిర్జడాత్మిక " అనే పేరుతో కూడా ఆ పరాశక్తి వాగ్దేవతలు నుడివిన శ్రీలలితాసహస్రనామాల్లో స్తుతింపబడుతున్నది.....
యా దేవీ సర్వభూతేషు శక్తిరూపేణ సంస్థితా |
నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమో నమః || 12 ||
అందరియందు శక్తి రూపంలో కొలువైన ఆదిపరాశక్తికి నమస్కారం అని అంటుంది శక్తివంతమైన అపరాజితాస్తోత్రం..
శరీరానికి శక్తి
మనస్సుకు శక్తి
బుద్ధికి శక్తి
జీవాత్మకు శక్తి
పరామాత్మకు శక్తి
ఇలా అనేక విధాలుగా శక్తి యొక్క ఉనికిని మనం నిత్యం మనకు తెలియకుండానే ఉపాసించడం అనేది సత్యం....
కళ్ళముందు కాశ్మీర యాపిల్ తోట ఉన్నా, మనిషి ఒక్క యాపిల్ కూడా తినలేని స్థితిలో ఉంటే ఆ శరీరానికి శక్తి క్షీణించిందని అర్ధం....
కళ్ళముందు కాశ్మీర యాపిల్ తోట ఉన్నా, మనిషి మాత్రం ఏదో పరధ్యానంలో ఉంటే ఆ మనసుకు శక్తి క్షీణించిందని అర్ధం....
కళ్ళముందు కాశ్మీర యాపిల్ తోట ఉన్నా, మనిషికి అవి కశ్మీర్ యాపిల్స్ అని తెలియకపోతే ఆ బుద్ధికి శక్తి క్షీణించిందని అర్ధం....
ఇది లౌకిక శక్తి గురించిన ఉపమానములు.....
ప్రభుత్వం ఇచ్చే 2000 రూపాయల పెన్షన్ తో,
నికోటిన్ అనే ఎంతో ప్రమాదకరమైన విషాన్ని నింపుకున్న దరిద్రపు పొగాకు కడ్డీలను రోజు పీల్చుతూ,
దరిద్రపు సీసాలను కొనుక్కొని తాగుతూ,
అనారోగ్యాన్ని, అసహనాన్ని, కొనితెచ్చుకునే ఒక నిత్యదరిద్రుడికి....,
ఆ పైసతో చిన్నసైజ్ కాశ్మీర్ యాపిల్స్ కొనుక్కొని తింటూ నిండునూరేళ్ళు ఆరోగ్యంతో నిజమైన ఆనందంతో బ్రతకొచ్చనే స్పృహకూడా లేకుండా బ్రతికే దరుద్రుడికి, బుద్ధిశక్తితో పాటుగా, జీవశక్తి కూడా క్షీణించిందని అర్ధం...
ఊరిమీదపడి అడ్డమైన అనవసరమైన తిరుగుళ్ళు తిరిగే వారికి, మరియు అదే తిరుగుడు నిత్యం ఒక ఆలయంలో ప్రదక్షిణగా తిరిగే వారికి గల అలౌకిక శక్తిభేదమే పరమాత్మశక్తి...
ఇవి సగటు మనిషి జీవితం చుట్టూ ఉండే వివిధ రకాల శక్తి స్వరూపాలు ....
.
ఇక ఈ లోకంలో వివిధ వస్తువుల్లో వ్యాప్తమై / వస్తువుల ద్వారా ప్రకటితమయ్యే శక్తి ఎన్నో రకాలు...
రిసర్వాయర్ వాటర్ పొటెన్షియల్ అనే స్థితిశక్తి నుండి హైడ్రోఎలెక్ట్రిక్ కరెంట్ అనే గతిశక్తి గా నిత్యం రూపాంతరం చెందుతూ వివిధ వస్తువుల ద్వారా (ఫ్యాన్, లైట్, etc), ప్రకటనమయ్యే విద్యుత్శక్తి,
సోలార్ స్ట్రీట్ లైట్స్, సోలార్ వాటర్ హీటర్స్, ఇత్యాది వస్తువుల ద్వారా సౌరశక్తి నుండి విద్యుత్శక్తి గా రూపాంతరం చెందే శక్తి,
విండ్ మిల్స్ ద్వారా వాయుశక్తి నుండి విద్యుత్శక్తి గా రూపాంతరం చెందే శక్తి,
ఇత్యాదిగా స్థూల స్థాయిలో లోకాన్ని నడిపించే విద్యుత్ శక్తి మొదలుకొని,
ఎంతో సూక్ష్మ స్థాయిలో యోగశక్తిగా సంతరింపబడి ఉండే అధ్యాత్మశక్తి వరకు....
ఈ లోకంలో ఎన్నో రకాలుగా శక్తి ప్రకటన, శక్తి ఆరాధన, అనేది మనం దర్శించే దైనందిన నిత్యజీవిత అనుభవైక సత్యాలు....
"కనిపిస్తున్న తిరుగుతున్న ఫ్యాన్ కి ఆధారం కనిపించకుండా ఆ ఫ్యాన్ అనే వ్యవస్థలోకి ప్రసరింపబడే విద్యుత్ శక్తి..."
అని ఆ ఫ్యాన్ క్రింద సేదతీరే వ్యక్తి చెప్పే సత్యం ఎంత సత్యమో...
అదే విధంగా....
కనిపించే సూర్యుడి చుట్టూ రోజు తిరుగుతున్న భూగోళానికి కూడా, సాధారణంగా కనిపించని, అందరికీ కనిపించవలసిన అవసరం లేని, ప్రార్ధించే వారికి వారి వారి ప్రార్ధనలకు అనుగుణంగా కనిపించే శక్తి ఆధారంగా ఉన్నది అనేది కూడా
అంతే సత్యం.....
ఆ శక్తినే వివిధ నామరూపాల్లో, వివిధ సత్సంప్రదాయ వైభవంతో వివిధ విజ్ఞ్యులు దైవం గా ఆరాధించడం అనేది ఈ భారతదేశం యొక్క గొప్పదనం....
ఫ్యాన్ లో ఎన్ని బ్రాండ్లున్నా, అన్ని ఫ్యాన్లు కూడా ఇచ్చేది ఒకేవిధమైన గాలిని....
అన్ని ఫ్యాన్లను నడిపించేది కూడా ఒకేవిధమైన విద్యుత్శక్తి....
నీ ఫ్యాన్ ఫలానా కంపెని, ఫలానా మాడల్, నా ఫ్యాన్ ఫలానా కంపెని, ఫలానా మాడల్, కాబట్టి వీచే గాలిలో భేదం ఉంటుంది అని అంటే అది ఎంత హాస్యాస్పదమో...
ఫలానా వ్యక్తి ఆరాధించే ఫలానా నామరూపాత్మక దైవమే దేవుడు...అని అనడం కూడా అంతే హాస్యాస్పదం....
అన్ని ఫ్యాన్లకు కూడా ఆపరేటింగ్ వోల్టేజ్ లెవెల్ 230 v ఏ...
కాని రెగ్యులేటర్ ద్వారా మార్పుచెందే ఇంటర్నల్ రెసిస్టర్ వాల్యుకి అనుగుణంగా కరెంట్ సప్లై లోని భేదం వల్ల ఫ్యాన్ యొక్క స్పీడ్, తద్వారా గాలి యొక్క తీవ్రత లో భేదం ఉంటుంది...
అదే విధంగా ఎల్లరు దేవుళ్ళు కూడా ఒకానొక మహర్షి యొక్క తపస్సుకు ప్రసన్నమై అనుగ్రహించిన తత్ దేవతాసంబంధిత సత్సంప్రదాయ దైవారాధనావ్యవస్థ లో భాగంగా ఆరాధింపబడే దేవతాస్వరూపాలే...
మన యొక్క ఆరాధనా స్థాయికి / తీవ్రతకు అనుగుణంగా తత్ ఆరాధిత దైవం యొక్క అనుగ్రహ ప్రసరణలోనే భేదం ఉంటుంది కాని....
వివిధ దేవతా తత్త్వాల మధ్య ఎటువంటి భేదాలు ఉండవు.....
ఫర్ ఎగ్సాంపుల్,
"దేవుడా...నేను డిస్టింక్షన్ లో ఉత్తీర్ణుడనై...అనుకున్న లక్ష్యం సాధించేలా అనుగ్రహించవా..."
అనేది ఒక విద్యార్థి యొక్క కోరిక అని అనుకుంటే....
హంసవాహనం పై కొలువైన సరస్వతీదేవిని తత్ సంబంధిత
స్తోత్రాలతో ఆరాధించినా లభించే అనుగ్రహం ఆ భక్తుడికి తను ప్రార్ధించిన ఆ కోరిక నెరవేరడమే...
మూషిక వాహనం పై కొలువైన గణపతిని తత్ సంబంధిత
స్తోత్రాలతో ఆరాధించినా లభించే అనుగ్రహం ఆ భక్తుడికి తను ప్రార్ధించిన ఆ కోరిక నెరవేరడమే...
అభయాంజనేయస్వామివారిని తత్ సంబంధిత
స్తోత్రాలతో ఆరాధించినా లభించే అనుగ్రహం ఆ భక్తుడికి తను ప్రార్ధించిన ఆ కోరిక నెరవేరడమే...
తిరుమలపై వెలసిన కలియుగ ప్రత్యక్షదైవమైన సకలదేవతా స్వరూపుడైన శ్రీవేంకటేశ్వరుణ్ణి దర్శించి తత్ సంబంధిత
స్తోత్రాలతో ఆరాధించినా లభించే అనుగ్రహం ఆ భక్తుడికి తను ప్రార్ధించిన ఆ కోరిక నెరవేరడమే...
బెజవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన ఆ అమ్మలగన్నయమ్మ కనక దుర్గమ్మను దర్శించి తత్ సంబంధిత స్తోత్రాలతో ఆరాధించినా లభించే అనుగ్రహం ఆ భక్తుడికి తను ప్రార్ధించిన ఆ కోరిక నెరవేరడమే..
పరమేశ్వరుడి శివలింగస్వరూపాన్ని అభిషేకించి తత్ సంబంధిత స్తోత్రాలతో ఆరాధించినా లభించే అనుగ్రహం ఆ భక్తుడికి తను ప్రార్ధించిన ఆ కోరిక నెరవేరడమే..
సొ ఇక్కడ ప్రార్ధనలకు అనుగుణంగా కోరిక నెరవేరడం అనేది కామన్ రిసల్ట్...
కాని దానికి మాధ్యమం అనేది దేశకలానుగుణంగా
ఎవరికి ఏ నామరూపంపై గురికుదిరిందో ఆయా దేవతాస్వరూప ఆరాధన అనేది ఇక్కడి అధ్యాత్మ సత్యం...
అంతే కాని ఒకరు ఎక్కువ...ఒకరు తక్కువ....అనే భేదాలకు ఇక్కడ తావులేదు.....
ఒక హ్యాపిబర్త్డే పార్టికి వెళ్ళిన మనకు అక్కడ నెలకొన్న అద్భుతమైన డెకరేషన్ లో భాగమైన వివిధరకాల బలూన్స్ లో కనిపించేది...వాటిలోని వైవిధ్యం మరియు ప్రత్యేకత...అంతే కాని ఎక్కువ తక్కువ అనే భేదాలు కావు....
అదేవిధంగా, ఎందరో దేవీదేవతా స్వరూపాలతో అలరారే సనాతన సంప్రదాయ అధ్యాత్మ వ్యవస్థలో ఉండేది వైవిధ్యం మరియు ప్రత్యేకతే కాని ఎక్కువ తక్కువ అనే తారతమ్యాలు కావు.....
అటువంటి అత్యుత్తమ స్థాయికి సదరు భక్తుడి బౌద్ధికబలాన్ని ఉద్దీపనం గావించే ప్రత్యేకతతో అలరారే వ్యవస్థే శాక్తేయ ఆరాధనా సత్సంప్రదాయం....
మీరు శ్రీలలితాసహస్రనామావళిని గమనిస్తే....
శాక్తేయం అనే పంచాయతారాధనాంతర్గత
వ్యవస్థలో....
మిగతా వ్యవస్థలన్నీ కూడా ఎంతో వైభవంగా ఇమిడిఉంటాయి..
అనగా...
గాణాపత్యం
శైవం
వైష్ణవం
సౌరం
కౌమారం
యొక్క సమ్మిళిత సమారాధన వ్యవస్థగా అనాదిగా శాక్తేయారాధన మాన్యులైన ఎందరో శ్రీవిద్యోపాసకులచే కొనియాడబడుతున్నది.....
కామేశముఖాలోకకల్పితశ్రీగణేశ్వర
.
శివమూర్తి శివారాధ్యా శివంకరి
.
గోప్త్రీగోవిందరూపిణి
హరిభక్తిప్రదాయిని
నారాయణి
వైష్ణవి విష్ణురూపిణి
.
భానుమండలమధ్యస్థా భైరవి భగమాలిని
.
కుమారగణనాథాంబ
స్కందమాత
.
ఇత్యాదిగా ఆ ఆదిపరాశక్తి అన్ని సంప్రదాయాలను, అన్ని సిద్ధాంతాలను, అన్ని శాస్త్రాలను, అన్ని విశ్వాసాలను, అన్ని తత్త్వాలను, తనలో అంతర్భాగం గావించి అలరారుతున్నది అని మనకు శ్రీహయగ్రీవ అగస్త్య మహర్షి సంవాదమైన వాగ్దేవతల అనుగ్రహమైన మహిమోపేతమైన శ్రీలలితాసహస్రనామావళి ద్వార రూఢమౌతున్నది.....
కాబట్టి సర్వదేవతానుగ్రహదాయకమై వర్ధిల్లుతూ,
భక్తులపాలిటి చింతామణిగా అలరారే శాక్తేయారాధన,
ఉపాసనాపరంగా సంవత్సరారంభ మాసమైన ఈ ఆశ్వయుజ మాసంలోని శుక్లపక్ష పాడ్యమి మొదలు నవమి వరకు దేవిశరన్నవరాత్రులుగా, అనాదిగ ఎంతో వైభవాన్ని గడించిన పుణ్యప్రదమైన కాలం...
ఈ శక్తి ఆరాధనా సంప్రదాయంలో, శ్రీవిద్యోపాసకులకు సర్వోత్కృష్టమైనది మూలా నక్షత్రం నాడు గావించే శ్రీసరస్వతీ ఆరాధన....
ఎందుకంటే ఈ లోకంలో అన్నిశక్తుల్లోకెల్లా ఏ శక్తి ఎల్లప్పుడూ సర్వోత్కృష్టమైనది, ఉత్తమమైనది, ఎల్లరిచే సర్వకాలసర్వావస్థల్లోనూ ఆరాధింపబడేది, ప్రార్ధింపబడేది...
అని ఎవ్వరూ ప్రశ్నించినా సరే...
" బుద్ధి శక్తి " అనేదే ఎల్లరి సమాధానమై ఉంటుంది.....
ఆ బుద్ధిశక్తినే..,
సౌరం లో బృహస్పతి శక్తి గా.....
గాణాపత్యం లో గణపతి శక్తి గా.....
వైష్ణవంలో హయగ్రీవ శక్తి గా.....
శాక్తేయంలో సరస్వతి శక్తి గా.....
శైవంలో మేథాదక్షిణామూర్తి శక్తి గా......
కౌమారంలో సుబ్రహ్మణ్య శక్తి గా...
విజ్ఞ్యులు, ఉపాసకులు, మాన్యులు ఆరాధింతురు....
కాబట్టి ఇవ్వాళ్టి శరన్నవరాత్రాంతర్గత ఆశ్వయుజ మాస మూలానక్షత్ర శ్రీసరస్వతీ ఆరాధనా అనేది భక్తుల్లెలరికీ ఎంతో ముఖ్యమైన పర్వసమయం....
శ్రీశైల శ్రీభ్రమరాంబిక శక్తిపీఠంలో అమ్మవారి ఆలయానికి కుడివైపున, అనగా మనం అమ్మవారి ఆలయానికి అభిముఖంగా ఉండి నమస్కరిస్తున్నప్పుడు మనకు ఎడమవైపున దూరంగా ఉండే ప్రాకారంపై కొలువైన కుడ్యచిత్రాల్లో ప్రతిపాదింపబడే " శ్రీమహాసరస్వతి " కళతో భక్తులకు దర్శనం ప్రసాదించే ఆ బెజవాడ ఇంద్రకీలాద్రి పై కొలువైన శ్రీదుర్గామల్లేశ్వరి అమ్మవారు తనను స్మరించే భక్తుల్లెల్లరికి శ్రీమహాసరస్వతి గా చక్కని బుద్ధిశక్తిని ప్రసాదించి అనుగ్రహించుగాక.....
శ్రీచాగంటి సద్గురువులు వారి ప్రవచనాల్లో,
ఈ క్రింది శ్రీమద్భాగవతపద్యరత్నాల్లో శ్రీపోతనామాత్యుల వారు నిక్షిప్తం గావించిన శ్రీవిద్యారహస్యాల గురించి ఎంతో గొప్పగా వివరించడం శ్రద్ధగా ఆలకించిన చాలా మంది భక్తులకు, అధ్యాత్మవేత్తలకు, గుర్తుండే ఉంటుంది.....
***** ***** ***** ***** ***** ***** ***** ***** *****
క్షోణితలంబునన్ నుదురు సోఁకఁగ మ్రొక్కి నుతింతు సైకత
శ్రోణికిఁ, జంచరీక చయ సుందరవేణికి, రక్షితామర
శ్రేణికిఁ, దోయజాతభవ చిత్త వశీకరణైక వాణికిన్,
వాణికి. నక్షదామ శుక వారిజ పుస్తక రమ్య పాణికిన్.
పుట్టం బుట్ట, శరంబునన్ మొలవ, నంభోయానపాత్రంబునన్
నెట్టం గల్గను, గాళిఁ గొల్వను, బురాణింపన్ దొరంకొంటి, మీఁ
దెట్టే వెంటఁ జరింతుఁ దత్సరణి నా కీవమ్మ యో! యమ్మ! మేల్
పట్టున్ నా కగుమమ్మ, నమ్మితిఁ జుమీ బ్రాహ్మీ! దయాంభోనిధీ!
శారదనీరదేందు, ఘనసార, పటీర, మరాళ, మల్లికా
హార, తుషార, ఫేన, రజతాచల, కాశ, ఫణీశ, కుంద, మం
దార, సుధాపయోధి, సితతామర, సామరవాహినీ శుభా
కారత నొప్పు నిన్ను మదిఁ గానఁగ నెన్నఁడు గల్గు, భారతీ!
అంబ, నవాంబుజోజ్జ్వలకరాంబుజ, శారదచంద్రచంద్రికా
డంబర చారుమూర్తి, ప్రకటస్ఫుట భూషణ రత్నదీపికా
చుంబిత దిగ్విభాగ, శ్రుతిసూక్తి వివిక్త నిజప్రభావ, భా
వాంబరవీధి విశ్రుతవిహారిణి, నన్ గృపఁ జూడు భారతీ!
అమ్మలఁ గన్నయమ్మ, ముగురమ్మలమూలపుటమ్మ, చాలఁ బె
ద్దమ్మ, సురారులమ్మ కడు పాఱడి పుచ్చిన యమ్మ, తన్ను లో
నమ్మిన వేల్పుటమ్మల మనమ్ముల నుండెడి యమ్మ, దుర్గ, మా
యమ్మ, కృపాబ్ధి యిచ్చుత మహత్త్వ కవిత్వ పటుత్వ సంపదల్.
***** ***** ***** ***** ***** ***** ***** ***** *****
సర్వం శ్రీమహాసరస్వతి శ్రీచరణారవిందార్పణమస్తు.....💐🙂
🙏🙏🙏🙏🙏
🦢🦢🦢🦢🦢
No comments:
Post a Comment