కొందరు చాలా అరుదుగా భువిపైకి ఏతెంచి, వారి సృజనాత్మక పరిశ్రమతో కొన్ని శతాబ్దాల పాటు కీర్తికాయులై ఉండే మహాత్ములుగా అలరారుతుంటారు...
వారు ఎన్నుకున్న మార్గమేదైనా, భూమిక ఏదైనా, తమదైన శైలిలో విలువలకు అగ్రతాంబూలం ఇచ్చి గొప్ప పేరును గడించి, తదనంతరకాలంలో వారి మార్గంలో నడిచే ఎందరికో ఆదర్శమై వర్ధిల్లే వ్యక్తిత్త్వాలు అరుదు....
అటువంటి కోవకుచెందిన దేశం మెచ్చిన అగ్రశ్రేణి నటులుగా, రాజనీతిజ్ఞ్యులుగా పేర్గాంచి అమరులైన ఎన్.టీ.ఆర్ గారు,
చిత్రసీమలో మరియు రాజనీతిలో, తెలుగుభాషకు మరియు తెలుగుజాతికి అంతర్జాతీయ వైభవాన్ని సంతరింపజేసిన మేటి వ్యక్తిత్వాల్లో ఒకరిగా తెలుగువారందరికీ కూడా వారి జీవితప్రస్థానం సదా స్మరణీయం....
ఎన్.టి.అర్ గారు నటించిన "నర్తనశాల" అనే చిత్రం, శ్రీచాగంటి సద్గురువుల వంటి మహనీయులకు ఇష్టమైనదిగా కొందరైనా ప్రవచనాల్లో వినే ఉంటారు...
మరియు
ఎన్.టి.అర్ గారు నటించిన
"శ్రీమద్విరాట్ వీరబ్రహ్మేంద్ర స్వామి చరిత్ర" అనే చిత్రం, వన్ ఆఫ్ మై ఆల్ టైం ఫేవరెట్ మూవీస్...🙂
ఎన్.టి.అర్ గారి స్పూర్తి తెలుగుజాతి యొక్క వైభవాన్ని దిగ్దిగంతములయందు సదా ప్రకాశింపజేయుగాక అని ప్రార్ధిస్తూ...
వారి జయంతి సందర్భంగా చిరు అక్షరనివాళి...💐
ఓం శాంతిః శాంతిః శాంతిః...💐
No comments:
Post a Comment