శ్రీకూర్మనారాయణ జయంతి శుభాభినందనలు...
🙂💐🍕🍿🇮🇳
శ్రీ తాళ్ళపాక అన్నమాచార్యులు సంకీర్తించిన,
మత్స్యకూర్మవరాహమనుష్యసింహవామనా
యిచ్చరామరామరామహితబుధ్ధకల్కి
అనే దశావతరవైభవంలో, శ్రీచగాంటి సద్గురువుల శ్రీమద్భాగవతప్రవచనాల్లోని క్షీరసాగరమధన ఘట్టం గురించి విన్నవారికి గుర్తున్నట్టుగా, దేవదానవులిరువురికి కూడా ఉపయుక్తమైన అత్యంత అరుదైన అవతారం గా
మహాకూర్మావతారాన్ని ధరించిన శ్రీమన్నారాయణుడి వైభవం అనన్యసామాన్యమైనది....
ఎందుకంటే సాధారణంగా కేవలం భక్తసమ్రక్షణకు మరియు అందుకు అవసరమైన రాక్షససమ్హారానికి, మాత్రమే అవతారాలు స్వీకరించే శ్రీమహావిష్ణువు, దానవులకు కూడా ఉపకారం చేయడం కోసం అవతారం స్వీకరించడం ఒకింత ఆశ్చర్యకరమైన అంశమే.....
"విశ్వేతివ్యాప్తః ఇతి విష్ణుః" కాబట్టి....
ఈ విశ్వంలో మందరపర్వతాన్ని కవ్వంగా నిలపగల శక్తి శ్రీమన్నారాయణుడికే కలదు...
ఈశ్వరుడి కంఠాభరణమైన వాసుకిని ఆ మహాపర్వతకవ్వానికి అల్లెత్రాడు గా గావించి దేవదానవులు కలిసి క్షీరసాగరాన్ని మధించగా...
మొదట హాలాహలం ఉద్భవించగా, లోకసమ్రక్షణార్ధం హరుడు సేవించి గరళకంఠుడవ్వగా, ఆ తదుపరి...
అందునుండి, ఐరావతం, కల్పవృక్షం, కామధేనువు, (స్వీయలయంలో దాగిన) చంద్రుడు, శ్రీమహాలక్ష్మి, అమృతకలశం, ఇత్యాది ఆశ్చర్యకరమైనవన్నీ ఉద్భవించడం.....
వారివారి వైభవానికి తగ్గట్టుగా ఆ విలువైన వాటిని వారివారికి ఇవ్వగా,
క్షీరసాగరతనయ గా, చంద్రసహోదరి గా, ప్రభవించిన శ్రీమహాలక్ష్మి అక్కడున్నవారందరినీ పరికించి,
శ్రీమన్నారాయణుడే తనకు తగిన నాథుడు అని భావించి వరించగా,
చివరికి లభించిన అమృతం కోసం దేవదానవులిరువురు ఘర్షణ సాగించగా...
ఇంద్రుడి అగ్నిదుర్గం లోకి ప్రవేశించి,
(సామాన్యులకు దుర్భేద్యమైన రీతిలో ఉండే దైవిక మంత్రాగ్నివలయాల మధ్యన వస్తువులను సమ్రక్షింపబడే ఒక వ్యవస్థ. మన ఇప్పటి కలియుగ మాడర్న్ టైంస్ యొక్క పరిభాషలో చెప్పాలంటే, హ్రితిక్ రోషన్ ధూం2 మూవిలో ఒక లేసర్ ప్రొటెక్టెడ్ సెక్యూర్ సిస్టెం నుండి రోబోటిక్ ఆర్మ్ తో ఒక డైమండ్ ని తస్కరించిన విధంగా...) ఇంద్రుణ్ణి ఓడించి అమృతకలశాన్ని తస్కరించి, దేవకార్యనిమిత్తమై మరలా అది దేవేంద్రుడికే చెందేలా ఇరువురు పరస్పరం సంభాషించుకొని ఒకానొక ప్రణాళిక ప్రకారంగా కద్రువనుండి మాతృదాస్యవిముక్తి కల్పించి, మరలా అమృతకలశం దేవేంద్రుడికే చెందేలా చేసిన తదుపరి, శ్రీమహావిష్ణువు యొక్క మోహినీ అవతార వైభవంతో అసురులను సమ్మోహంలో మైమరపించి, నిజమైన అమృతం కేవలం దేవతా ఉపాధిలో ఉన్నవారికి మాత్రమే చెందేలా లోకకళ్యాణ కర్తవ్యాన్ని నిర్వర్తించి దేవతలు అమరులవ్వడానికి మూలకారణం ఎవరు ...??
శ్రీకూర్మనారాయణుడే కదా...!
వందల కిలోమీటర్ల దూరం నుండి కూడా టార్గెట్ ని ఫోకస్ చేయగల గరుడపక్షి యొక్క ఉడుంపట్టు గురించి చాలామందికి తెలిసినదే...
అటువంటి పక్షీంద్రుడే దేవేంద్రుడి నుండి అమృతకలశాన్ని గైకొని దేవలోకం నుండి భువికి తిరిగివస్తున్న సుపర్ణుడి వేగానికి గరుత్మంతులవారి చేతిలోని అమృతకలశం నుండి ఒలికిన ఓ నాలుగు చుక్కల అమృతం కురిసిన ప్రదేశాలే భూలోకంలో ఇప్పటికీ యావద్ ప్రపంచం మొత్తం అచ్చెరువొందే రీతిలో ఉండే కుంభమేళా జరిగే పుణ్యతీర్థ / క్షేత్రాలు గా వినుతికెక్కిన వైభవానికి మూలకారణం ఎవరు ...??
శ్రీకూర్మనారాయణుడే కదా...!
ప్రపంచంలో ఉన్న ఏకైక అరుదైన ఆలయంలో,
భూమిలో లభ్యమైన స్వయంవ్యక్త అర్చామూర్తి గా,
అతిలోకసౌందర్యం ఉట్టిపడే శిల్పకళావైభవంతో కొలువైన దేవాతామూర్తి,
(అంతటి సమ్మోహనభరిత శిల్పకళను సృజించడం కేవలం దేవశిల్పి విశ్వకర్మకు మాత్రమే సాధ్యం),
శ్రీ ర్యాలి జగన్మోహినీకేశవస్వామి వారి ఆలయాన్ని, ఒకానొక సందర్భంలో శ్రీచాగంటి సద్గురువుల ప్రవచనాల్లో విని, వెళ్ళి, దర్శించి, స్వామివారి పాదాల వద్ద ఉద్భవించే గంగాజలం అక్కడి అర్చకులచే సంప్రోక్షింపబడి, తరించడం నా జన్మాంతరసౌభాగ్యం....
శ్రీకూర్మనారాయణుడి వైభవం చాలా అరుదైనది. అవ్విధముగనే వారి ఆలయాలు కూడా చాలా అరుదు...
ఈశ్వరానుగ్రహంగా శ్రీకాకుళం లోని శ్రీకూర్మనాథాలయ సందర్శనాభాగ్యం నాకు లభించుగాక అని ఆ శ్రీకూర్మనారాయణున్ని ప్రార్ధిస్తూ....
భక్తుల్లెల్లరికీ శ్రీకూర్మజయంతి శుభాభినందనలు...
💐🍕🍿🎉🙂
No comments:
Post a Comment