Saturday, June 1, 2024

శ్రీక్రోధినామ 2024 సంవత్సర వైశాఖ శుద్ధ చతుర్దశి,శ్రీతాళ్ళపాక అన్నమాచార్యుల 616వ జయంత్యుత్సవ శుభాభినందనానమస్సులు..🍿🙂🎉💐🙏

శ్రీతాళ్ళపాక అన్నమాచార్యుల 616వ జయంత్యుత్సవ శుభాభినందనానమస్సులు..🍿🙂🎉💐🙏

కల్పాలు, మన్వంతరాలు, మహాయుగాలు, యుగాలు....
అనే బృహత్ కాలచక్రంలో నిరంతరం పునవావృతమయ్యేవి నాలుగు యుగాలు.....
కృతయుగం, త్రేతాయిగం, ద్వాపరయుగం, కలియుగం అనే నాలుగు యుగాల కాలచక్రంలో ప్రస్తుతం మనమున్నది
28వ మహాయుగం లో,
ప్రభవాది 60 సంవత్సరాలు 7200 సార్లు పునరావృతమయ్యే 432000 సంవత్సరాల కాలప్రమాణ నిడివి గల కలియుగ ప్రథమపాదం లోని శ్రీక్రోధి నామ 5125 సంవత్సరంలోని ఉత్తరాయణంలోని వైశాఖ మాసంలో ఇప్పుడు మనమున్నది....

అనగా

వశిష్ఠ మహర్షి --> 
శక్తి మహర్షి --> 
పరాశర మహర్షి -->
వేదవ్యాస మహర్షి --> 
అంబా, అంబిక, అంబాలిక --> 
పాండురాజు, దృతరాష్ట్రుడు, విదురుడు, --> 
మహాభారత కురుక్షేత్ర సంగ్రామం
అర్జునుడు --> 
అభిమన్యుడు --> 
పరీక్షిత్ మహారాజు (అసలైన పేరు విష్ణురాతుడు) -->
జనమేజయుడు....

అనే భరతఖండ చంద్రవంశ మహారాజుల పరంపరలో,
పరీక్షిత్ మహారాజు గారి కాలంలో మొదలైనది కలియుగం. అనగా ద్వాపరయుగం నాటి శ్రీకృష్ణ నిర్యాణం జరిగి ఇప్పటికి 5124 సంవత్సరాలు గడచినవి అని అర్ధం....

ఫాల్గుణ, చైత్ర, వైశాఖ, జ్యేష్ఠ మాసాలు ఎండాకాలం గా...
ఆషాఢ, శ్రావణ, భాద్రపద, ఆశ్వయుజ మాసాలు వర్షాకాలం గా,
కార్తీక, మార్గశిర, పుష్య, మాఘ మాసాలు చలికాలం గా
పరిగణింపబడి....
12 మాసముల ఒక సంవత్సరంలో, ఎండాకాలం, వర్షాకాలం, చలికాలం అనే 3 విభిన్నమైన వాతావరణాలు ఉండడం, అందుకు తగ్గట్టుగా భారతదేశంలో ఉండే ప్రతివ్యక్తి తన దైనందిన ఆచార ఆహార వ్యవహారాల్లో ఆవశ్యకమైన మార్పులను తగురీతిలో స్వాగతిస్తూ జీవించడం ఎల్లరికీ తెలిసిందే...

ఎండాకాలం వేడియొక్క తీవ్రతకు తగ్గట్టుగా...
కుండలోని నీళ్ళను తాగడం,
చలువపందిళ్ళు వేసుకోవడం,
ఏర్ కూలర్లను నీళ్ళతో నింపి చల్లగాలి వీచి వడదెబ్బ తగలకుండా ఉండేలా సేదతీరడం,
గాలిప్రసరించేందుకు ప్రతిబంధకం కాకుండా ఉండే లైట్ వేయ్ట్ కాటన్ దుస్తులను ధరించడం,
ఇత్యాదిగా మన దైనందిన జీవనశైలిలో తగురీతిలో జాగ్రత్తలతో జీవించడం అనివార్యమైనట్టుగా...

ఈ కలియుగ లక్షణం రీత్యా.....
భరించలేనంత అశౌచ, అనాచరా, దురాచార, సంకర, భరితమైన ఆధునిక సమాజంలో ప్రశాంతత, శౌచము, నియమనిష్టలు, సదాచారవైభవము, భగవద్ భక్తి, భక్తభాగవతుల పట్ల గౌరవమరియాదలు, అనే పదాలకు కూడా తావులేనంత అసహనభరితమైన కాలం ఈ కలియుగం.....

ఎందుకంటే నాలుగు పాదాలా నడయాడవలసిన ధర్మం, సత్యం అనే ఒకే ఒక్క పాదం పై నడయాడే యుగం ఈ కలియుగం కాబట్టి...
కల్యతీతికలి అనే వ్యుత్పత్తి రీత్యా నిత్యం ఏవో కలహాలతో సతమతమయ్యే అశాంతిభరిత వాతావరణంలో ఉండే ప్రజలజీవితాల్లో, ధనార్జనే అత్యంతముఖ్యమైన లక్ష్యంగా ఉండి ధనం చుట్టూ పరిభ్రమించే జీవితాల్లో నిత్యం బిజి బిజి గా ఉండడమే ఈ కలియుగవాసుల లక్షణం....
కూటి కోసమే కోటి విద్యలు అన్న చందంగా ఎక్కువమంది మనుష్యులు వారివారి విద్వత్తును కేవలం కూటి కోసం మాత్రమే అనగా ధనార్జన కోసమే వినియోగిస్తూ బ్రతికే కాలం ఈ కలికాలం...

ఈ కలియుగంలో భగవద్ నామస్మరణ, మనన, నిధిధ్యాసనమే సర్వోన్నతమైన తపస్సు కాబట్టి....
ఈ కలియుగ సౌలభ్యం రీత్యా, భక్తజనోద్ధరణకై పరమాత్మ ప్రత్యక్ష దైవంగా శ్రీవేంకటేశ్వరుడిగా, తిరుమలగిరుల్లో వెలసి, తన నందక ఖడ్గాంశలో శ్రీ తాళ్ళపాక అన్నమాచార్యులను ప్రభవింపజేసి, వారిచే అనితరాసాధ్యమైన సంకీర్తనాయజ్ఞ్యాన్ని నిర్వహింపజేసి ఈ కలియుగ వాసులకు శ్రీవేంకటహరి సంకీర్తనం అనే భవరోగహర భవ్యౌషధాన్ని అందించి, సంకీర్తనా శ్రవణం, కీర్తనం ద్వార అమేయ పుణ్యాన్ని ఆపాదించి, పాపాన్ని క్షయింపజేసి, ప్రశాంతమైన సుఖసంతోషభరిత ఆనందజీవితాన్ని అనుగ్రహించే వరదైవంగా విరాజిల్లుతున్నాడు అనేది అనాదిగా విజ్ఞ్యులైన పెద్దల మాట....

ఈ కలియుగంలో యుగలక్షణం రీత్యా, 
త్రికరణశుద్ధిగ భావించిన పుణ్యకర్మలచే అమేయమైన
పుణ్యం సముపార్జింపబడును అనే విశేషాన్ని శ్రీచాగంటి సద్గురువుల వంటి మహనీయుల ప్రవచనాల్లో ఆలకించే ఉంటారు....
కాబట్టి యజ్ఞ్య యాగాది క్రతువులను నిర్వహిస్తే లభించే పుణ్యం, భగవద్ సంకీర్తనం తో సంప్రాప్తింపబడడం అనేది ఈ కలియుగవాసులకు గల గొప్ప సౌలభ్యం.....

ఈ కలియుగ వాసులు ధనాన్ని వెచ్చించి....
వారానికి వంద నికోటిన్ కడ్డీలను పీల్చి, 
వంద విషపొట్లాలు నమిలి, పదిసీసాల దరిద్రాన్ని తాగి,
ఆరోగ్యం గుల్ల చేసుకునే దుఃఖభరిత జీవితమే జీవనం గా ఉంటారే కాని.....
వారానికి ఒక్కసారైనా ఒక ఆలయానికి వెళ్ళి ఈశ్వరుడికి నమస్కారం గావించి భగవద్ దర్శనాన్ని, తీర్థాన్ని, ప్రసాదాన్ని స్వీకరించి అరోగ్యాన్ని గడించి, ఆనందమయ జీవితమే జీవనం అని తెలుసుకోవడానికి కూడా ప్రయత్నించరు....
కారణం మనసుకి గల బలీయమైన 
జాఢ్యం...బుద్ధికి గల బలీయమైన మౌఢ్యం...
మంచి మాటలు చెప్పేవారు ఎక్కువగా లేకపోవడం,
మంచి మాటలు చెప్పేవారు కొందరు ఉన్నా, వినే భాగ్యం 
తీరిక, జిజ్ఞ్యాస లేకపోవడం..

కాబట్టి ఎవరికి వారే వారివారి జీవితాలను ఉద్ధరించుకునే మార్గం ఏది అని అంటే అది అనాదిగా ప్రశస్తిగాంచిన శ్రీహరిభక్తి...!

సకల వేదాశాస్త్రపురాణైతిహ్య సారాన్ని పదకవితలుగా మలిచి రాగరంజితమైన రవళులలోకి ఒదిగేలా యతిప్రాసలతో అందంగా తీర్చిదిద్ది, శ్రీవేంకటహరిభక్తి రసగుళికలుగా మహిమోపేతమైన మహాద్భుత సంకీర్తనలను ఈ కలియుగవాసుల భాగ్యపరిపాకంగా అందించి తాము తరించి, భక్తిలెల్లరినీ తరింపజేసిన మహామహనీయులు 
శ్రీతాళ్ళపాక అన్నమాచార్యుల వారు.....!

లౌకిక ధనం ఎప్పుడైనా ఎవ్విధంగానైనా రాగలదు....పోగలదు....
కాని శ్రీహరిభక్తి అనే అలౌకిక మూలధనం అంత సామాన్యంగా సంప్రాప్తించే సిరి కాదు..ఎందుకంటే అది జన్మజన్మల పుణ్య భక్తి ప్రపత్తికి ఫలితంగా ప్రభవించే అమరసిరి...
శ్రీహరిభక్తి అనే దైవికసిరి కరతల ఆమలకంగా కొలువై ఉన్న వారికి కైవసం కాని లౌకిక సిరులుండవు...

అందుకే అన్నారు అన్నమాచార్యుల వారు...
" ఏ వేల్పు నిజదాసులీపుణ్యులు..." అని,
వారి "నిత్యాత్ముడై ఉండి నిత్యుడై తానుండు..." అనే సంకీర్తనలో...

అందుకే అన్నారు అన్నమాచార్యుల వారు...
" సకలశాంతికరము సర్వేశా నీపై భక్తి..."
అని వారి ఇంకో సంకీర్తనలో...

అందుకే అన్నారు అన్నమాచార్యుల వారు...
" ఇహము పరము తానే ఇయ్యజాలిన మంత్రము..." అని, వారి "ఉన్నమంత్రాలిందు సదా ఒగివిచారించుకుంటే..." అనే ఇంకో సంకీర్తనలో...

అందుకే అన్నారు అన్నమాచార్యుల వారు...
" దినకరసోమగ్రహణకాలముల తీర్థాచరణలు సేసినఫలములు.తనుదానే సిద్ధించును వూరకే దవ్వులు దిరుగగ మరి యేలా ..." అని,
వారి "త్రికరణ శుద్ధిగ జేసిన పనులకు దేవుడు మెచ్చును..." అనే ఇంకో సంకీర్తనలో...

అందుకే అన్నారు అన్నమాచార్యుల వారు...
" శ్రీవేంకటేశ్వరుని జింతించి పరతత్త్వ భావంబు నిజముగాబట్టి జెలియాత్మ |.." అని, వారి "ఇదిగాక సౌభాగ్యమిదిగాక తపము మరి యిదిగాక వైభవం బికనొకటి కలదా.." అనే ఇంకో సంకీర్తనలో...

అందుకే అన్నారు అన్నమాచార్యుల వారు...
" సామీప్య మిందరికి సంకీర్తనం | సామాన్యమా విష్ణు సంకీర్తనం " ,
"సరవి సంపదలిచ్చు సంకీర్తనం | సరిలేని దిదియపో సంకీర్తనం 
సరుస వేంకట విభుని సంకీర్తనం | సరుగనను దలచుడీ సంకీర్తనం" అని, వారి 
"చాలదా బ్రహ్మమిది సంకీర్తనం మీకు | జాలెల్ల నడగించు సంకీర్తనం " అనే ఇంకో సంకీర్తనలో...

అట్టి శ్రీహరి స్వరూపులైన శ్రీతాళ్ళపాక అన్నమాచార్యుల వారిని నేటి వారి 616 వ జయంతి సందర్భంగా విధిగా స్మరించి నమస్కరించి తరించడం మన భాగ్యవిశేషం...
🙂🙏💐🎉🍿🇮🇳

https://annamacharya-lyrics.blogspot.com/2007/05/200hari-yavatara-mitadu.html?m=1

ప|| హరి యవతార మీతడు అన్నమయ్య |
అరయ మా గురుడీతడు అన్నమయ్య |

చ|| వైకుంఠ నాథుని వద్ద వడి పడు చున్న వాడు |
ఆకరమై తాళ్ళపాక అన్నమయ్య |
ఆకసపు విష్ణు పాదమందు నిత్యమై ఉన్న వాడు |
ఆకడీకడ తాళ్ళపాక అన్నమయ్య ||

చ|| ఈవల సంసార లీల ఇందిరేశుతో నున్న వాడు |
ఆవటించి తాళ్ళపాక అన్నమయ్య |
భావింప శ్రీ వేంకటేశు పదములందే యున్నవాడు |
హావ భావమై తాళ్ళపాక అన్నమయ్య ||

చ|| క్షీరాబ్ధిశాయి బట్టి సేవింపుచు నున్నవాడు |
ఆరితేరి తాళ్ళపాక అన్నమయ్య |
ధీరుడై సూర్యమణ్డల తేజము వద్ద నున్నవాడు |
ఆరీతుల తాళ్ళపాక అన్నమయ్య ||

శ్రీ తాళ్ళపాక అన్నమగురవే నమః...🙏💐

https://annamacharya-lyrics.blogspot.com/2007/05/200hari-yavatara-mitadu.html?m=1


No comments:

Post a Comment