ఈ సత్యం ఎన్నో ఉదంతాల్లో విజ్ఞ్యులకు బోధపడిన అంశమే...
కురుక్షేత్ర సంగ్రామానికి మూలకారణం దుర్యోధనుడి ఒళ్ళు బలుపు, మరియు కర్ణుడి కండకావరమే అనేది జగమెరిగిన సత్యం...
మాకు సామ్రాజ్యస్వాధీనకాంక్షలు ఏమి లేవు...మా భోజనానికి ఇబ్బంది లేకుండా 5 ఊర్లను దానంగా ఇవ్వమని అభ్యర్ధించిన పంచపాండవులను...
అవి కూడా ఎందుకు మీకు....
"మీకు అవసరమా...." అని అవమానించడం దుర్యోధనుడి ఒళ్ళు బలుపే కద....
ఎంతో గొప్ప దాతను అనే అహంతో,
ఏకంగా భూదేవి సంగ్రహించిన నెయ్యిని తన కండకావరంతో తిరిగితీసిన ఘనుణ్ణి అని విర్రవీగడమే, ఎంతో గొప్ప వీరుడైన కుంతీపుత్రుడైన సూర్యపుత్రుణ్ణి రణభూమిలో దిగజారిన తన రథచక్రాలనే పైకి లేపలేకపోయిన స్థితిలోకి జారేలా చేసింది...తద్వారా ఆ సూర్యవరప్రసాదిని భూదేవి తనలోకి లయించివేసింది...
ఇక్కడ మీరు గమనించండి...
అఖండ భారత మహాసామ్రాజ్యానికి చకవర్తిగా హస్తినాపురి సిమ్హాసనారూఢులై,
చూపుతో పాటు బుద్ధి కూడా లయించిన
ధృతరాష్ట్రుడికి మరియు విజ్ఞ్యుల పట్ల గౌరవమరియాదలతో పాటుగా సిగ్గుశరం కూడా లేని వాడి కొడుకు దుర్యోధనుడికి, సోదరుల అన్నపానీయములకు కనీస ధర్మంగా ఒక 5 ఊర్లను దానం ఇవ్వడం పెద్ద విషయమా...??
"ఇది క్షాత్ర పరీక్షయేకాని క్షత్రియ పరీక్ష కాదే..." అంటూ ఓ రేంజ్ లో డైలాగులు కొట్టి, దుర్యోధనుణ్ణి మెప్పించి అంగరాజ్య సిమ్హాసనారూఢుడైన కర్ణుడికి, భూమిలోకి శోషించుకుపోయిన నెయ్యికి బదులుగా గుప్పెడంత కొత్త నెయ్యి తెచ్చివ్వడం పెద్ద విషయమా...??
ఇప్పటి అఫ్ఘానిస్తాన్ కాపిటల్ సిటి అయిన కాంధహార్ / అప్పటి గాంధారదేశ యువరాణి గాంధారి, తన భర్త ధృతరాష్ట్రుడు చూడలేని ప్రపంచాన్ని తానెందుకు చూడడం అని కళ్ళకు గంతలు కట్టుకొని జీవించడాన్ని లోకం హర్షిస్తుందేమో కాని, తన భర్త యొక్క సోదరుని బిడ్డల పట్ల ఉండవలసిన కనీస ధర్మాన్ని కూడా దర్శించలేనంతగా కావాలని కళ్ళుమూసుకొని మరో అంతఃపుర రాచకాంత యొక్క జీవితం మంటకలుస్తున్నా కూడా పెద్దరికాన్ని నిలుపుకునేలా వ్యవహరించనందుకు అంతగొప్ప రాచరికపు బ్రతుకు బ్రతికినా కూడా చివరిరోజుల్లో బిడ్డలతో కొరివికి నోచుకోకుండా అడవిలో దావానలానికి ఆహుతై లయించారు.....
శ్రీ చాగంటి సద్గురువుల ప్రవచనాల్లో విన్నట్టుగా,
కుంతీదేవి అంతటి హైలి వోలటైల్ అండ్ ఆసిలేటింగ్ పర్సనాలిటి మహాభారతంలో మరొకరు లేరేమో....
ఇప్పటి స్పెయిన్ కాపిటల్ సిటి అయిన మ్యాడ్రిడ్ / అప్పటి మద్రదేశ యువరాణి మాద్రికి, తన సవతి అయినా సరే, కుంతీదేవి ఎంతో గొప్ప మనసుతో, దూర్వాసో మహర్షి యొక్క అనుగ్రహాన్ని ఉపదేశించి, అశ్వినీ దేవతల అనుగ్రహంతో నకులసహదేవులను అందించిన అంతటి హృదయవైశాల్యం గల రాచకాంత....,
సహజకవచకుండలాలతో సూర్యవరప్రసాదిగా
జన్మించిన అంతటి క్షత్రియవీరుడైన కర్ణుడు, మీకు స్వయానా తోడబుట్టిన అన్నే అవుతాడు అని తన బిడ్డలైన పాండవులకు చెప్పలేక యావద్ జీవితం మొత్తం సతమతమౌతూనే ఉండిపోయింది....
ఆఖరికి రణభూమిలో గతించినవారందరికి వారివారు తిలోదకాలు ఇచ్చే సమయంలో కర్ణుడి పేరు పిలవగా అటు పాండవులెవ్వరూ పలుకక, ఇటు కౌరవులెవ్వరూ పలుకక, అత్యంత దయనీయ స్థితిలో ఎవ్వరిచేతా కూడా కనీసం తిలోదకాలు అందుకోలేని స్థితిలో లయించిన కర్ణుడు కూడా అంతటి హైలి వోలటైల్ అండ్ ఆసిలేటింగ్ పర్సనాలిటి యే....
తనకు నూరిపోస్తున్న దుర్యోధనుడి దురాగతాలకు వత్తాసు పలుకుతూ ఎంతసేపు అర్జునుడి మీద కోపంతో ఊగిపోవడమే కాని, ధర్మం గురించి ఏమాత్రము కూడా అలోచించకుండా కేవలం అధర్మపరుడైన దుర్యోధనుడి కలనునెరవేర్చడమే
జీవితం అని అనుకొని బ్రతికినందుకు సూర్యపుత్రుడే అయినా సరే, అంతటి దయనీయమైన స్థితిలో లయించాడు...
అయినాసరే, దేవతలు గతించిన కర్ణుడికి ఎందుకు, ఏ పుణ్యం చేత భూమికి తిరిగివచ్చి, అన్నపానీయములు దానం గావించుకునే అవకాశం ఇచ్చారో తెలుసా...?
అడుగుతున్నది అర్జునుడి కోసం మారువేషంలో వచ్చిన సాక్షాత్తు దేవేంద్రుడే అని తెలిసినా కూడా,
అడగబడుతున్నవి సూర్యపరమాత్మ ప్రసాదిత తన సహజస్వర్ణకవచకర్ణకుండలాలు అని తెలిసినా కూడా,
దానం ఇవ్వడానికి ఏమాత్రం సంశయించని తన దాతృత్వ వైభవానికి అచ్చెరువొందిన దేవతలు అలా కర్ణుడికి మరలా భూమికి తిరిగివచ్చి పుణ్యం చేసుకునే అవకాశం ఇచ్చిన కారణంగా, ఈ భాద్రపద బహుళపక్షం మనకు మహాలయ పితృపక్షంగా, భాద్రపద అమావాస్య మహాలయపితృదేవతాప్రీతికరమైన అమావాస్య తిథి గా, ఖ్యాతి గడించింది....
ఈ బిజిబిజి ఉరుకుల పరుగుల ఆధునిక కలికాలంలో,
స్వాధ్యాయానికి,
దేవపితృకార్యాలకు,
దానధర్మకార్యాలకు,
వీలులేనంతగా ఉన్న మన జీవితాలకు, మహర్షులు దర్శించి అందించిన స్తోత్ర సారస్వతం మహిమాన్వితమైన
"పితృదేవతా స్తోత్రాలు..."
విశేషించి, భాద్రపద అమావాస్య నాడు సూర్యుడు ధగధగమని ప్రకాశించే మధ్యాహ్నం 12 గంటల సమయంలో, ఈ
పితృదేవతా స్తోత్రాలు ఇంటిసిమ్హద్వారం వద్ద పితృదేవతలకు శ్రద్ధతో నమస్కరించి, పఠించి, వారి అనుగ్రహన్ని బడసితరించడం ఎల్లరి విద్యుక్తధర్మం....
తల్లితండ్రులు గతించినవారు యథాశక్తిపూర్వకముగా వారివారి
పితృదేవతలను ఉద్దేశ్యించి, ఆబ్దిక, తిలోదక, దాన, ధర్మాది పుణ్యకార్యములను గావించి మీ బిడ్డలకు ఆ సంస్కారాన్ని అందిస్తే, ఆయురారోగ్యైశ్వర్యాలతో పాటుగా, మీరు గతించిన తదుపరి మీలా మిమ్మల్ని ఉద్దేశ్యించి మీ బిడ్డలు చేసే ఈ పితృదేవతా సంస్కారాలు మీకు ఉన్నతగతులను, ఉత్తమ ఉత్తరజన్మలను కలిగించి అనుగ్రహించును....
ఒక సంవత్సర సేద్యంతో వచ్చిన పంటదిగుబడిలో ఎంతోకొంత వచ్చే సంవత్సరం పంటకు కావలసిన విత్తనాలకోసం కూడా వెచ్చించని మూర్ఖుడు, ఇతర రైతుల వైభవాన్ని చూసి ఓర్వలేకపోవడంలో అర్ధంలేదు....
అవ్విధముగనే....
ఒక జీవిత సమయంలో ఆర్జింపబడిన సంపదలో ఎంతోకొంత వచ్చే జన్మకు కావలసిన పుణ్యంకోసం కూడా వెచ్చించని మూర్ఖుడు, ఇతర విజ్ఞ్యుల వైభవభరిత జీవితాలను చూసి ఓర్వలేకపోవడంలో అర్ధంలేదు....
గతించిన అస్మద్ మాతృవర్గ, పితృవర్గ పితృదేవతలందరికీ పేరుపేరునా నమస్కరిస్తూ...
ఓం స్వధాయై నమః...🙏
ముఖ్య గమనిక :
నమస్కారం / స్తోత్రపఠనం / నదీజలతర్పణం, మాత్రం ఎల్లరూ గావించవచ్చును కాని,
పితృదేవతలను ఉద్ద్యేశించి గావించే, ఆబ్దీకాలు, శ్రాద్ధాలు, తిలతర్పణాలు, ఇత్యాది పితృకార్యాలు కేవలం తల్లితండ్రులు గతించిన వారు మాత్రమే గావించవలెనని ఎందరో విజ్ఞ్యుల ఉవాచ...
https://stotranidhi.com/stotras-list-telugu/pitru-devata-stotras-in-telugu/
https://stotranidhi.com/brahma-kruta-pitru-stotram-in-telugu/
https://vignanam.org/telugu/pitru-stotram-garuda-puranam.html
No comments:
Post a Comment