వసంతోత్సవమండపంలో నిర్వహింపబడే
దైనందినవసంతోత్సవాంతర్గత అభిషేకకైంకర్యం...
ప్రతి సోమవారం నాడు సంపంగిప్రాకారంలో నిర్వహింపబడే విశేషసేవాంతర్గత అభిషేకకైంకర్యం...
ఇవ్విధంగా...
శ్రీభూసమేతమలయప్పస్వామి వారికి నిత్యం అభిషేకకైంకర్యాలు గావింపబడుతూ ఉండగా...
ప్రతిసంవత్సరమూ కూడా జ్యేష్ట నక్షత్రంతో చంద్రుడు కూడి ఉండే పౌర్ణమి కలిగిన జ్యేష్టమాసంలోని జ్యేష్ట నక్షత్రం నాడు నిర్వహింపబడే విశేషమైన స్నపనతిరుమంజనకైంకర్యం,
అభిద్యేయక అభిషేకం / జ్యేష్టాభిషేకం అనే పేర్లతో తిరుమల ఆచార సంప్రదాయానుగుణంగా శ్రీశ్రీనివాస కైంకర్య పట్టీలో ఎంతో ప్రాచుర్యం పొందిన విశేషమైన సంవత్సరోత్సవం...
సంవత్సరపర్యంతమూ శ్రీభూసమేతమలయప్పస్వామి వారిచే ధరింపబడిఉండే స్వర్ణకవచం సడలింపుగావింపబడి,
విశేషమైన వజ్రకవచం మరియు ముత్యపుకవచం ధరించి స్వామివారు వేదమంత్రోఛ్ఛారణపురస్సరంగా
స్వీకరించే అభిషేకమే తిరుమల అభిద్యేయక అభిషేకం / జ్యేష్టాభిషేకం...
సూర్యుడిగమనం భూమికి దెగ్గరగా మరియు దూరంగా సాగుతూ ఉండే ఉత్తరాయణ మరియు దక్షిణాయణ పుణ్యకాలముల సంధిసమయమే ఈ జ్యేష్టమాసం...
ఇట్టి కాలాంతర్గత విశేషమైన సంధిసమయంలో సంభవించే కొన్ని అగోచర ప్రాకృతికమార్పుల ప్రభావం ఈ భూలోకవాసులపై ఉపయుక్తకరంగా గావింపబడేలా స్వామివారు గత సంవత్సరం మొత్తం ధరించిన స్వర్ణకవచాన్ని సడలింపజేసి, వజ్రకవచాన్ని ధరించి, అత్యంతదుర్భేద్యమైన వజ్రం యొక్క స్వాభావిక లక్షణ తత్త్వ సమన్వయంతో ఎన్నో ప్రాకృతికమార్పుల ప్రభావాలను తన వజ్రమూర్తిదర్శనంలోకి లయింపజేసి, ఆనాడు క్షీరసాగరమధనంలో జనించిన హాలాహలం అనే గరళాన్ని స్వీకరించి గళాభరణంగా దాల్చి నీలకంఠుడిగా పేర్గాంచిన ఈశ్వరుడిలా....
ఈ కలియుగ ప్రత్యక్ష పరమాత్మ కూడా వజ్రకవచధారణానంతరం ఎంతో చలువతత్త్వంతో అలరారే ముత్యపుకవచాన్ని ధరించి తాను శాంతించి, లోకానికి ప్రశాంతతను అందిస్తూ అలరారే అపురూపమైన సంవత్సరోత్సవమే తిరుమల అభిద్యేయక అభిషేకం / జ్యేష్టాభిషేకం...
ఏ ఖగోళవిశేషాలవల్ల సంభవించే ప్రాకృతికమార్పుల వల్ల ఏఏ ప్రభావాలు కలుగును...ఇత్యాది సౌరమండల విశేషాలు తెలియాలంటే....
అసలు...
సౌరమండలం అంటే ఏంటి...?
ఉదయాద్రి అనగా ఏంటి...?
అస్తాద్రి అనగా ఏంటి...?
సూర్యరధసారధి అయిన అనూరుడు (గరుత్మంతులవారి అన్నగారు) ఎంతటి అప్రతిహతవేగంతో ఏకచక్రరథంపై కొలువుదీరిన సూర్యపరమాత్మను వినువీధిలో విహరింపజేస్తూ ఉంటారు..?
విజ్ఞ్యుల త్రికాల గాయత్రి / అర్ఘ్య ధారలతో ఎవ్విధంగా ఈ భూలోకంలో సూర్యపరమాత్మ యొక్క భైరవిశక్తితో ప్రకృతి సకలప్రాణులకు హితకరమైన రీతిలో పరిఢవిల్లును...?
సూర్యపరమాత్మ యొక్క పరావర్తన శక్తితో శుక్లపక్షం లో ప్రౌఢచంద్రుడిగా వృద్ధిచెందుతూ, కృష్ణపక్షంలో క్షీణచంద్రుడిగా
లయిస్తూ ఉండే చంద్రమండల శక్తి యొక్క ప్రభావం ఈ భూలోకవాసులపై ఎవ్విధంగా ఉండును...?
ఈ క్రింది 7 రకాల సూర్యమండలజనితకిరణాల్లో,
ఏ కిరణాలు ఎప్పుడు భూలోకవాసులపై ఎట్టి ప్రభావాన్ని కలిగించును..?
గాయత్రి (Gayatri):
గాయత్రి మంత్రాన్ని సూచిస్తుంది, ఇది సూర్యుడి శక్తి మరియు జ్ఞానానికి ఒక ప్రతీక.
బృహతి (Brihati):
బృహతి అనేది పెద్ద మరియు విశాలమైనదానిని సూచిస్తుంది, ఇది సూర్యుడి గొప్పతనాన్ని సూచిస్తుంది.
ఉష్ణిక్ (Ushnih):
ఉష్ణిక్ అనేది వేగవంతమైనదానిని సూచిస్తుంది, ఇది సూర్యుడి వేగాన్ని సూచిస్తుంది.
జగతి (Jagati):
జగతి అనేది స్థిరమైనదానిని సూచిస్తుంది, ఇది సూర్యుడి స్థిరత్వాన్ని సూచిస్తుంది.
త్రిష్టుబ్ (Trishtubha):
త్రిష్టుబ్ అనేది ఒక మంత్రం, ఇది సూర్యుడి శక్తి మరియు సామర్థ్యాన్ని సూచిస్తుంది.
అనుష్టుబ్ (Anushtubha):
అనుష్టుబ్ అనేది మరో మంత్రం, ఇది సూర్యుడి జ్ఞానాన్ని సూచిస్తుంది.
పన్క్తి (Pankti):
పన్క్తి అనేది సూర్యుడి యొక్క క్రియలను సూచిస్తుంది.
ఈ 7 రకాల సూర్యకిరణాల శక్తిని వేదశాస్త్రం 7 రకాల ఛందస్సుగా స్వీకరించి ఎవ్విధంగా మనుజులకు సారస్వతాంతర్గత ఉపాసనా శక్తిగా అనుగ్రహాన్ని కలిగిస్తున్నది...?
VIBGYOR,
Violet, Indigo, Blue, Green, Yellow, Orange, Red
అనే ఏడు రంగుల హరివిల్లును సృజించే సూర్యమండల విశేషంలోని అధ్యాత్మ ఆంతర్యమేమి...?
సూర్యమండలమధ్యస్థ శక్తులుగా విరాజిల్లే
భైరవి (శబ్దశక్తి),
భగమాలిని (ద్యుతిశక్తి),
అనే ఆదిపరాశక్తి అంశలు ఎవ్విధంగా ఊర్ధ్వలోక దివిజులకు మరియు ఈ భూలోకవాసులకు కూడా వారివారి ప్రార్ధనలకు అనుగుణంగా అప్రతిహత తేజస్సును, శక్తిని, సిద్ధిని, అనుగ్రహిస్తూ ఉంటారు...?
ఇత్యాదిగా ఎన్నో ఎన్నెన్నో గహమైన అధ్యాత్మ అంశాలపై ఎనలేని పట్టుకలిగిన విజ్ఞ్యులకు మాత్రమే అర్ధమయ్యే తత్త్వసమన్వయాలెన్నో తిరుమల అభిద్యేయక అభిషేకం / జ్యేష్టాభిషేకంలో అంతర్భగామై ఉండే గహనమైన అధ్యాత్మ అంశాలు...
ఇవన్నీ తన భక్తులకు, తెలిసినా, తెలియకున్నా, త్రికరణశుద్ధిగా తనకు నమస్కరించిన పుణ్యఫలంతో వాటన్నిటీ ఉపాసన ఫలితాలను అనుగ్రహించే శ్రీభూసమేతశ్రీమలయప్పస్వామి వారి జ్యేష్టాభిషేకానుగ్రహం ఎంతో విశేషమైనది....
ఇట్టి పర్వసమయంలో శ్రీశ్రీనివాసుణ్ణి స్మరించి నమస్కరించి తరించడం కూడా ఎంతో విశేషమైన పుణ్యఫలదాయకం..
శ్రీచాగంటి సద్గురువుల "శ్రీవేంకటాచలవైభవం" ప్రవచనాలు విన్నవారికి తెలిసినట్టుగా...,
ఏ భక్తుడు ఎందుకు ఎప్పుడు ఎక్కడ ఎట్ల తనను స్మరించినా వెంటనే తన భక్తుల మొరలను ఆలకించేందుకు సిద్ధంగా ఉండేలా వీరస్థానకధృవమూర్తిగా ఆనందనిలయ అష్టదలపద్మపీఠంపై వరద కటి హస్తాలతో కొలువై ఉన్న ఈ కలియుగప్రత్యక్ష పతమాత్మకు ప్రతిరూపంగా,
ఆనందనిలయ గర్భాలయం నుండి వెలుపలికి వచ్చిమరీ తిరువీధుల్లో విహరిస్తూ అనుగ్రహించే పరమాత్మవైభవాన్ని
"ఊరెరిగింపు" అని వచించెదరు.....
తిరుమల పరిభాషలో ఉత్సవబేరంగా ఖ్యాతిగాంచిన శ్రీభూసమేతశ్రీమలయప్పస్వామివారి విశేషమైన జ్యేష్టాభిషేకానుగ్రహం భక్తులందరినీ ఘనంగా అనుగ్రహించాలని ఆకాంక్షిస్తూ...
లక్ష్మీ మహీ తదనురూప నిజానుభావ
నీళాది దివ్య మహిషీ కరపల్లవానామ్ ।
ఆరుణ్య సంక్రమణతః కిల సాంద్రరాగౌ
శ్రీవేంకటేశ చరణౌ శరణం ప్రపద్యే ॥
శ్రీభూసమేతశ్రీశ్రీనివాసపరబ్రహ్మణేనమః.... 💐🙂🙏
No comments:
Post a Comment