Tuesday, June 3, 2025

శ్రీకరమైన తెలంగాణ రాష్ట్రావిర్భావదినోత్సవ శుభాభినందనలు.....💐🙂

త్రిలింగదేశంగా అనాదిగా ఎంతో ఖ్యాతి గడించిన మన త్రికోణతలపీటభూమి భారతదేశవైభవానికి కలికీతురాయిగా భాసించే భవ్యభాగ్యనగరాల బంగారు భూమి...
శ్రీబమ్మెర పోతనామాత్యుల కలం నుండి జాలువారిన తెనుగు శ్రీమద్భాగవతకథాసుధామృతానికి ఆలవాలమైన ధన్యభూమి...
అరుదైన లలితకళలసమాహారంతో పరిఢవిల్లిన కాకతీయమహాసామ్రాజ్యవైభవానికి వన్నెతరగని సాక్షిత్వభూమి...

తేనేలొలుకు తెలుగు భాషకు పుట్టినిల్లైన తెలంగాణ మనది...
ధాన్యరాశులొసగు ధన్యభూమైన తెలంగాణ మనది...
భాగ్యరాశివెలగు భవ్యభూమైన తెలంగాణ మనది...
దేవతలకు నెలవైన దైవికభూమైన తెలంగాణ మనది...
అపురూప అలయాలు కొలువైన అమరభూమైన తెలంగాణ మనది...

జయహో తెలంగాణ జననీ నీకు అభివందనం...🙏💐😊
🪔🪔🪔🪔🪔🪔🪔🪔🪔🪔🪔

No comments:

Post a Comment