Tuesday, June 3, 2025

చాటలో తౌడు పోసి కాడెడ్లను కుమ్ముకొమ్మన్నట్టు వ్యవహరించడం ఎంతమాత్రము విజ్ఞ్యులు హర్షించని వైఖరి....


1. తల్లితండ్రుల పట్ల బిడ్డలు ఎవ్విధమైన కర్తవ్యంతో ఉండవలెను.
2. బిడ్డల పట్ల తల్లితండ్రులు ఎవ్విధమైన కర్తవ్యంతో ఉండవలెను.
3. బిడ్డల పట్ల తల్లితండ్రుల సమధర్మ కర్తవ్యం ఎట్లు ఉండవలెను.
4. విజ్ఞ్యులైన బంధువులు అనే వారు ఎట్లు ఉండవలెను.
5. పాటించిన ధర్మం పట్ల ఉండవలసిన కర్తవ్యం ఏంటి.
6. పసిపిల్లలు పెరగవలసిన కండ్యూసివ్ ఎన్వైరమెంట్ ఎవ్విధంగా ఉండవలెను.
ఇత్యాదిగా ఎన్నో....ఎన్నెన్నో..

"నీ ధర్మప్రబోధాలు...భక్తిజీవనవచనాలు.... శ్రీహరిసంకీర్తనలు...ఇత్యాది దేవతాగుణసంబంధమైన ఉత్తమవిషయాలు ఆపరా ధూర్తుడా....
మనం రాక్షసులం....రాక్షస జీవనమే నువ్వు కూడా జీవించాలి...
భక్తిప్రపత్తి ధర్మంకర్తవ్యం ఇత్యాదివి వలదు....."
అని తండ్రి హిరణ్యకశిపుడు తన కొడుకైన భక్తప్రహ్లాదుణ్ణి ఎన్నో ఇబ్బందులకు గురిచేసినప్పుడు...
తన ఏ రాక్షసబంధువులు కూడా ప్రహ్లాదుడి తరపున మాట్లాడలేదు....
ప్రహ్లాదుడు నమ్ముకున్న ధర్మం / భక్తి మాత్రమే శ్రీహరిని 
స్తంభోద్భవఉగ్రనారసిమ్హుడిగా ప్రభవింపజేసి హిరణ్యకశిపుణ్ణి సమ్హరించిన వృత్తాంతం ఇప్పటికీ లోకం ఉత్తమమైన భాగవతకథనం గానే స్మరిస్తున్నది...

"కైకేయి...ధర్మసంతానమైన శ్రీరాముణ్ణి కాదని భరతుడికే సిమ్హాసనం దక్కాలి అని ఎంతటి హఠం నీది...ఇది పద్ధతి కాదు" 
అని దశరథుడు ఎంత చెప్పినాకూడా వినని కైకేయి అల్లరిని భరతుడు గౌరవించలేదు సరికద....
అన్నకు గౌరవింపబడని అట్టి సిమ్హాసనాన్ని నేను స్వీకరించను...
శ్రీరాముడు తిరిగివచ్చేంతవరకు నేను కేవలం నిమిత్తమాత్రుడిగా మాత్రమే ఉండి, తండ్రికి మరోరూపమైన అన్న శ్రీరాముడి పాదుకలను ఆ సిమ్హాసనంపై అలంకరించి వాటిని నా ఆరాధ్యదైవంగా భావించి కోసలమహాసామ్రాజ్యాన్ని పరిపాలించెదను...
14 వత్సరముల అరణ్యవాసం పూర్తైన మరుక్షణం, నా అన్న శ్రీరాముడు అయోధ్యకు ఏతెంచనిచో యోగాగ్నిని సృజించి అందులో నన్ను నేను ఆహుతి గావించుకొనెదను..."
అని పలికిన భరతుణ్ణి ఇప్పటికీ లోకం గౌరవిస్తూనే ఉన్నది...

"నా కొడుకువైనందుకు నిన్ను కాదని, సిమ్హసనారూఢుడైన తండ్రి ఉత్తానపాదుడు, నీ తమ్ముడు ఉత్తమున్ని తన ఊరువులపై కూర్చుండబెట్టి నిన్ను అవమానించినందుకు, ఎందుకు నాయనా
అంతగా చింతిస్తున్నావు...
వెళ్ళి ఆ శ్రీమన్నారాయణుడి గూర్చి తపమాచరించు....నీకు సర్వోన్నతమైన పదవిని అనుగ్రహించేది ఆ శ్రీమహావిష్ణువే...." అని పలికిన విజ్ఞ్యత గల తల్లి సునీతి యొక్క వచనాలకు తపమాచరరించిన బాలధృవుణ్ణి తన పాంచజన్యస్పర్షతో అనుగ్రహించి...
"నాయనా ధృవ...
నువ్వు ఎవరికోసమై ఇంతటి కఠోరమైన తపస్సును ఆచరిస్తున్నావో.....ఆ శ్రీమహావిష్ణువును నేనే వత్స...!
నీ రాజ్యానికి చక్రవర్తివై, మహదైశ్వర్యవంతమైన సకల భోగభాగ్యాలను గడించి, నీ అంత్యకాలమున ఇప్పటివరకు ఈ విశ్వంలో ఎవ్వరూపొందని నా అనుగ్రహంతో, ఏ సర్వోన్నతమైన మండలాన్ని ఆధారంగా గావించి 
భూనభోసూర్యచంద్రనక్షత్రజ్యోతిషకాలఖగోళ సర్వస్వం భ్రమణం గావించునో, అట్టి ధృవమండలాధీశుడవై చిరంతనకీర్తితో వర్ధిల్లెదవు....అస్తు...!"
అని పరమాత్ముడు పలికిన ఎంతో విశేషమైన శ్రీమద్భాగవతకథనం, ధృవోపాఖ్యానం ఇప్పటికీ ఎందరో విజ్ఞ్యులను ఎంతో ఘనంగా అనుగ్రహిస్తూ ఉన్నది...

ఎన్నో పురాణాలను "నైమిషారణ్యే సూత ఉవాచ...
అని సూతుడు చెప్పగా...
సర్వోన్నతమైన శ్రీమద్భాగవతకథాప్రచారం మాత్రం చిలుకవదనం గల శ్రీశుకమహర్షి వారికే అనుగ్రహింపబడడం.....
అట్టి శ్రీశుకమహర్షి వారి అనుగ్రహంతో 7 రోజుల్లో శ్రీమద్భాగవతకథాశ్రవణంతో మోక్షాన్ని అందుకున్న విష్ణురాతుడు అనే నామధేయుడైన పరీక్షిత్ మహారాజు గారి ఘట్టం ఇప్పటికీ లోకంలో బహుప్రసిద్ధినొందిన కథనమే కద.....

ఇత్యాదిగా ఎన్నో ఎన్నెన్నో కథనాలు శ్రీచాగంటి సద్గురువుల ప్రవచనాల్లో విజ్ఞ్యులు ఆలకించే ఉంటారు కద...

కాబట్టి....
వారెక్కువన...వీరెక్కువన....
వారు అలా ఉన్నారు....వీరు ఇలా ఉన్నారు...
వారికి అంతుంది...వీరికి ఇంతుంది....
నీకు ఇంత ఉంటే... వారికీ అంత ఉండాలి....
ఇటుదోచి అటు పెట్టనా....అటు దోచి ఇటు పెట్టనా....

ఇత్యాదిగా సాధారణమైన లోకరీతి గురించి వ్యర్ధప్రేలాపన గావిస్తూ జీవించే వారి కోసం కాదు ఈ లోకంలోని విజ్ఞ్యుల వచనాలు.....
ధర్మాన్ని ఆచరించే వారికోసం మాత్రమే విజ్ఞ్యుల వచనాల్లో పేర్కొనబడే గౌరవమరియాదలు....

దేశకాలానుగుణంగా నిత్యం మారుతూ ఉండే ధర్మావలంబనలో..,
ఎవరికి ఎప్పుడు ఏది ఎందుకు ఎట్ల ధర్మమో చెప్పవలసింది మీరు నేను కాదు....

ఒక టాబ్లెట్ గురించి సాధికారికంగా వచింపవలసింది
విజ్ఞ్యులైన ఒక మంచి డాక్టర్ గారు.....
ఒక సాఫ్ట్వేర్ గురించి సాధికారికంగా వచింపవలసింది
విజ్ఞ్యులైన ఒక మంచి సాఫ్ట్వేర్ ఎన్జినీర్ గారు....
ఒక యజ్ఞ్య క్రతువు యొక్క ఆచార / నిర్వహణ శైలి గురించి సాధికారికంగా వచింపవలసింది విజ్ఞ్యులైన ఒక మంచి ఆచార్యులు గారు....
ఒక వ్యక్తి గురించి సాధికారికంగా వచింపవలసింది విజ్ఞ్యులైన ఒక మంచి వ్యక్తిత్వనిపుణులైన కన్సల్టంట్ గారు....

అవ్విధముగనే....
 
సదరు వ్యక్తిత్వంగల మనుష్యులు వారు ఇచ్చిన / చేసిన ధర్మాన్ని కాదని, కావాలని సృష్టించే సమస్యల గురించి సాధికారికంగా సమగ్ర వివేచనతో సమాలోచన గావించి, శాంతిసామరస్యపూర్వక సమన్వయం దిశగా పరిష్కారాలను సూచించి, అవివేక, అధర్మ, అన్యాయ, అక్రమ, అనైతిక, అసంబద్ధ, ఆవేదనకారక అల్లర్లతో జెటిలపరచబడే వివాదాల గురించి సాధికారికంగా వచింపవలసింది విజ్ఞ్యులైన ఒక మంచి అడ్వోకేట్ గారు....

అప్పుడే తోమబడిన తడి పాత్రలను శుభ్రంచేయవలసింది చక్కని పొడి వస్త్రంతో...
ఎప్పుడో ఎండిపోయిన మరకలపాత్రలను శుభ్రంచేయవలసింది చక్కని తడి వస్త్రంతో...

కాబట్టి ఇక్కడ పాత్రల యొక్క శుభ్రతలోని గొప్పదనం తడివస్త్రానిదో పొడివస్త్రానిదో కాదు...
దేశకాలనుగుణంగా పాత్రలకు శుభ్రతను ఆపాదించే వివేకవంతుడి కార్యానిర్వాహక ప్రజ్ఞ్యది....

వయసులో చిన్నవారైనంత మాత్రాన, అట్టి విజ్ఞ్యుల ప్రజ్ఞ్యను గౌరవించని, గౌరవించలేని, గౌరవించదల్చుకోని మూర్ఖులు ఎవ్వరైనా సరే, ఎంతటి వారైనా సరే, ఏ పురాణంలో వెతికినా సరే గౌరవింపబడలేదు సరికదా గౌరవింపబడవలెనని లోకంలోని ఏ విజ్ఞ్యులు కూడా చెప్పరూ...
అలా చెప్తే వారు విజ్ఞ్యులు కారు...

"వినయ్, నీ లిరికల్ స్టైల్ అండ్ సెన్సిబిలిటి గురించి, నీ మంచితనమేంటో తెలిసిన చాలమంది విజ్ఞ్యులకు తెలుసు వినయ్....
కాని కొంచెం క్యాజువల్ గా మనం రెగ్యులర్ గా మాట్లాడుకునే వచనాల్లో చెప్తే బావుంటది కద వినయ్..." అని అనుకునే మితృలకి సింపుల్ గా చెప్పాలంటే....

భారత్/ఇండియ మరియు ఎంత మంచిగా చెప్పినా కూడా ధర్మం, పద్ధతి, మంచితనం, ఉండని సరిహద్దు దేశం ఒకటి సమస్యాత్మక కాశ్మీర ప్రదేశం గురించిన రభసలో ఉంటే... 
దుందుడుకు వైఖరిని ప్రదర్శించే మరో సరిహద్దుదేశం కలగజేసుకొని, సమస్యను మరింత జటిలపరుస్తూ, చాటలో తౌడు పోసి కాడెడ్లను కుమ్ముకొమ్మన్నట్టు వ్యవహరించడం ఎంతమాత్రము విజ్ఞ్యులు హర్షించని వైఖరి....

సర్వేసుజనాః సుఖినోభవంతు...💐


No comments:

Post a Comment