Tuesday, October 30, 2018

కల్పన గారి గాత్రము...

అది గానమా...? లేక సప్తస్వరసమ్మిళిత అప్రతిహత శారదా ప్రవాహమా ?
అది రాగాలాపనా..? లేక సకల శృతిశోభిత శంకరాన్విత అప్రమేయ నాదోపాసనా ?
అది ఈ జన్మలోని సరస్వతీ కటాక్షమా...? లేక జన్మపరంపరనందు
అనుగ్రహింపబడిన అపూర్వసారస్వతసౌరభమా ?
కళాభారతికి నిలయమైన ఈ భారతావనిలో జన్మించడమే ఒక వరం..
ఆ జన్మ సంగీత సాహిత్య మూలాకృతి అయిన శారదాంబ మ్రోలన సమర్పించడం ఒక అనిర్వచనీయ యోగం !
అందుకే పెద్దలు ఆనాడే అన్నారు కాబోలు...
"అద్వైత సిద్ధికి అమరత్వ లబ్ధికి గానమె సోపానము
సత్వ సాధనకు సత్య శోధనకు సంగీతమే ప్రాణమూ
త్యాగరాజ హృదయమై రాగరాజ నిలయమై
ముక్తి నొసగు భక్తియోగ మార్గము మృతియెలేని సూధాలాప స్వర్గము ..!"
Rajesh Sri to MUSIC WORLD
ఓ మై గాడ్ ...!! రోమాలు నిక్కబొడుచుకునేలా.. అసలేంటీ గాన ప్రతిభ.. ??
కల్పన గారిది గాత్రమా.. కొండాకోనల్లో శృతి చేస్తూ వడివడిగా పారవశ్యంతో మలుపులు తిరుగుతున్న పవిత్ర గంగా ప్రవాహమా.. !! ఔత్సాహిక గాయనీ గాయకులందరికీ మీరు ఆదర్శం అయ్యారు..
కల్పన గారి గాత్రానికి హాట్స్ ఆఫ్..!!! __/\__ - MUSIC WORLD
https://www.facebook.com/video.php?v=597714857003611

శ్రీనివాసుని తిరువాభరణాలు..!

శ్రీ వేంకటాచలాధీశం శ్రియాధ్యాసిత వక్షసం ..!
శ్రితచేతన మందారం శ్రీనివాసమహంభజే..!!

Friday, October 26, 2018

Big things often have small beginnings...! - Sadguruvula vaagvaibhavam..:)

" శ్రీ చాగంటి సద్గురువుల ప్రవచనాలు కొన్ని కూడా వినలేదా....! అయ్యొ రామా...ఎంత విచిత్రం..."
అనే వాక్యం ఇవ్వాళ సమాజం లో,
" మీ ఇంట్లో ఒక్క సెల్ ఫోన్ కూడా లేదా...! అయ్యొ రామా...ఎంత విచిత్రం..."
అనేంతగా స్థిరపడింది అనడం ఏమాత్రం అతిశయోక్తి కాదు అనేది ఆధ్యాత్మిక జగత్తులో ఒక భాగంగా ఆస్తికజీవనం సాగించే వారందరికి విదితమే....
బాగా మదించిన ఒక పెద్ద భద్రగజం మావటి అంకుశానికి ఒక్కోసారి లొంగకపోవచ్చు.... కాని అంతకంటే బలవంతమైన ఇంద్రియాలు సైతం ఆ సద్గురువుల రసన పై కొలువైన శారదోక్త వాగ్ఝరి లోని అక్షరాంకుశాలకు లొంగిపోతాయి.....!
కుటుంబసభ్యులందరు నెత్తి కొట్టుకొని చెప్పినా వినని మూర్ఖపు పెద్దలు, ఆ ప్రతి తెలుగింటి పెద్దగా ఉండే సద్గురువుల మాటకు సిగ్గుతో తలదించుకొని తమ మూర్ఖత్వాన్ని కుబుసం లాగా తామే వదిలివేసి కుటుంబానికి శాంతిని కలిగించగలరు...!
తమ సంపదలను, వయో పెద్దరికాన్ని, సాకుగా పెట్టుకొని నలుగురిలో ఇతరులను ఎప్పుడూ చిన్నచూపు చూస్తు ప్రవర్తించే వారు, ఆ సద్గురువుల వాక్కులకు తమలోని ఈర్ష్యా విషాన్ని తగ్గించుకొని సంస్కారంతో హోదాలకతీతంగా హుందాగా ఆలోచించి పరులలో కూడా ఎంతోకొంత గొప్పతనాన్ని చూసి గౌరవించగలరు....!
లోకంలో, కనిపించిన ప్రతివాడిని, ఆ వాడెంత...వీడెంత...అంటూ అందరిని హేళన చేస్తూ బ్రతికే వారు, చూడ్డానికి చిన్నవారైనా సరే మనకంటే విశాలహృదయంతో ఉండేవారు కూడా ఉంటారనే స్పృహతో మెలగగలరు...!
తమకంటే చిన్నవారిలో ఉన్న విద్వత్తుని చూసి ఓర్వలేక నానావిధాలుగా శల్యసారధ్యాన్ని చేస్తూ బ్రతికే వారికి, ఎప్పుడో ఒకప్పుడు, ఎందుకులే మరీ ఇంత హీనంగా ఇతరులను పనికట్టుకొని మరీ ఇబ్బందిపెడుతూ బ్రతికి, కోరి దుష్కర్మపాశాలను బిగించుకోవడం అనే సోయి కలిగించగలదు....!
ఇలా చెప్పడానికి ఎన్నెన్నో భవరోగాలకు భవ్యమైన ఔషధంలా అనుగ్రహించే ఆ సద్గురువుల జ్ఞ్యాన గంగా తీర్థసేవనం ఎందరెందరికో సుభిక్ష జీవనాన్ని ఒసగి, రాబోయే కొన్ని తరాల వరకు ' శ్రీ చాగంటి వారి నోటి మాట ' అనే పరసువేది(స్పర్శవేది) విద్యను అందరికి అందించిన శ్రీచాగంటి సద్గురువులపై కొందరికి కొన్ని అపోహలు ఉండి, వారు ఈ కాలానికి కాకుండా అప్పుడెప్పుడో వందలయేళ్ళ క్రితం నాటి కాలానికి చెప్పినట్టుగా ఉంటాయండి అని అనుకోవడం....
సద్గురువుల యొక్క విశాల హృదయాన్ని అర్ధం చేసుకోలేక అనే అలాంటి మాటలు పెద్దగా పట్టించుకోనవసరం లేకున్నా, వాటిని కొంతమేర నివృత్తి చేసే ప్రయత్నం చేస్తాను...
1. వారికి మహా చాదస్తం అండి. బొట్టు పెట్టుకోకుండ క్యాజువల్ గా ఉండి ఏ పూజ చేయనివ్వరు...
2. భుజాన ఉత్తరీయం లేకుండా వారితో క్యాజువల్ గా మాట్లాడదామంటే అంతగా ఇష్టపడరు....
3. ఈ జెనెరేషన్ పిల్లలకి వారి బోధనలు ఆచరించడం దుస్సాధ్యం అండి...
4. దేవుడు అందరి హృదయంలోనే ఉంటాడు అని అంటూనే, మళ్ళి ఆ దేవుడి కోసం ఇలా ప్రార్ధించాలి అలా స్తుతి చేయాలి, అని అందరిని ఆధ్యాత్మిక ఒరవడిలోనే ఉండాలని చెప్తారండి...
5. వారిని ఫాలో అయ్యి ఇన్స్పిరేషన్ గా తీసుకోవడం, చాల కొద్దిమందికే సాధ్యమయ్యే విషయం అండి...
ఇలా ఒక్కొక్కరు ఒక్కోలా వారు శాస్త్రానికి ఇచ్చే గౌరవాన్ని అపార్ధం చేసుకుంటూ, వారి బంగారు మాటను భావి తరాలకు భవ్యసంపదగా కాపాడి అందించడంలో అంతగా రానించకుండా అక్కడే ఉండిపోతుంటారు....
సరిగ్గ గమనిస్తే, శ్రీ చాగంటి గురువుగారు, తమ వందల వేల కొలది ప్రవచనాల్లో, ఋణాత్మకవైఖరిని ఎండగట్టేటప్పుడు ఎప్పుడు కూడా ఎవ్వరిని పేరు పెట్టి ఫలానా వారండి అని ఉటంకించడం ఉండదు...అది ఉద్దేశించబడిన ఆ వ్యక్తికి మాత్రమే అర్ధమయ్యి చక్కదిద్దబడేలా అత్యంత జాగ్రత్తతో ఉంటుంది వారి అక్షర కూర్పు...
వెలకట్టలేని తమ ఆధ్యాత్మిక విద్యాసంపదను ఉచితంగా ఆస్తికభక్తజనానికి అనుగ్రహించడనికి సద్గురువులు అలా నియమాలు ఎందుకు పెడతారు అంటే...
దాని వల్ల వారు ఒక్క పైసా కూడ ఆశించరు అనే విషయం అందరికి తెలిసిందే...శిష్యులచే ఘనసత్కారాలను గండపెండేరాలను అందుకోవడానికి వారు ఏనాడు తమ ప్రవచనాలను ఒక కారణంగా భావించరు... అతి కొద్ది సన్నిహితులైన శిష్యులు ఎంతో గౌరవంతో ప్రేమతో గురువాత్సల్యానికి చిరు గౌరవ వందనం అని చెప్పినప్పుడు మాత్రమే వారు సత్కారలు స్వీకరిస్తారు అన్నది జగద్విదితమే...అది కూడా సభా / వేదిక మరియాదకు కట్టుబడి ఉండడంకోసం మాత్రమే...
ఇక అసలైన విషయానికి వస్తే, వారు అందరిచేత ఇలా నియమాచరణ చేయించి తమ ప్రవచనామృతం ద్వారా పరతత్వాన్ని సన్నిహితం చేయడంలో ఆంతర్యం కేవలం మన సంపూర్ణ ఉన్నతిని, శుభాన్ని ఆశించడం మాత్రమే....
శాస్త్రబద్ధంగా ఉండేలా చేసి శిష్యులకు మొదట పాత్రత, పవిత్రతను ఆపాదించి అటుపై వారి అమూల్య అనుగ్రహానికి మన హృదయాలను శాశ్వత ఆవాసంగా చేయడమే అందులోని పరమార్ధం...
నా స్కూల్ డేస్ లో చిన్నప్పుడు మా బస్తీలో త్రాగునీటి సౌకర్యం లేనప్పుడు, మంజీరా నీళ్ళతో వారానికి 2 సార్లు వాటర్ టాంకర్ వచ్చి ప్రతి గల్లీవాసులకు మంచినీళ్ళు అందించేది....
అందరం మా బిందెలు, డబ్బాలు, క్యాన్లు, బకీట్లు, లైన్లో పెట్టి పట్టుకునేవాళ్ళం...
కొందరు ఓపికగా తమవంతు వచ్చే వరకు వేచి ఉండి, వృధా కాకుండా ఒక మంచి బిందె / పాత్ర నిండా పట్టుకొని ఇంట్లోకి వెళ్ళి పెద్ద డ్రమ్ములో నింపుకునే వాళ్ళం...
కొందరేమో ఒక పానిపట్ యుద్దంలాగా గోల గోల చేసి విరిగిన బకీట్లు, చిల్లుల సొట్టబిందెలు, అలా ఏది పడితే అది తెచ్చి నీళ్ళు పట్టుకొని వెళ్ళడం, మళ్ళీ అవే తీసుకొని పాని కేలియే పానిపట్ యుద్ద్ అన్నట్టుగా తిరిగిరావడం...ఇలా ఉండేది టాంకర్ దెగ్గర సీన్.... అమ్మ లైన్లో ఉండి నిండుగా పట్టించిన డబ్బాలను, బిందెలను నేను ఇంట్లో పెద్ద డ్రమ్ములో పోస్తూ, లెక్కపెట్టెవాడిని మేము ఎన్ని బిందెలు పట్టుకున్నామో, ఆ మధ్యలో తుఫాన్ లాగా వచ్చి లొల్లి చేసే వాళ్ళు ఎన్ని పట్టుకున్నారు అని...
టాంకర్ మొత్తం ఖాళి అయిపోయినతర్వాత చూస్తే, పాత్ర శుద్ది లేని ( అంటే చాలాసార్లు విరిగిన బకీట్లు, సొట్టబిందెలతో నీళ్ళు పట్టుకున్న ) వారికంటే,
కొన్ని సార్లైనా సరే మంచి పాత్రలతో నిండుగా పట్టుకొని దాచుకున్న వారి దెగ్గరే ఎక్కువ నీరు జమయ్యేది....
దీనివల్ల తెలిసింది ఏంటంటే, ఎన్ని సార్లు ఎంతో గొప్ప అల్లరితో ఢిషుం ఢిషుం అంటూ అందరిని నెట్టి తిట్టి పట్టుకున్న వారికంటే పద్దతిగా ఒద్దికగా పట్టుకున్న వారి దెగ్గరే జలసిరి అధికం...!
అదే విధంగా శాస్త్ర మరియాదను పాటిస్తూ గురు వాక్కులపై విశ్వాసం తో, బొట్టు పెట్టుకొని / పంచే-ధోతి-ఉత్తరీయం ధరించి / ఒద్దికగా చేసే కాస్తంత ఆధ్యాత్మిక ఆచరణ అయినాసరే అధికఫలవంతం అవుతుందనే సద్గురువులు మనకు ఆ విధంగా ఆచారంపై మక్కువ కలిగించి, మనకు మనో పాత్ర శుద్దిని, అధిక పాత్రతను చేకూర్చి అనుగ్రహించడం ......
ఒకప్పుడు మన తాతా అమ్మమ్మల నాటి కాలంలో పంచెకట్టుకోవడం/ఉత్తరీయం వేసుకోవడం ఒక సామాన్య దైనందిన విషయం... కాని ఇవ్వాళ మనకు అదే పంచెకట్టు ఒక విశేషం....ఏంటోయ్ పంచే కట్టావ్ ఏంటి విశేషం.....అన్నట్టుగా కాలం మారింది....
అట్లే మన తరువాతి తరాలు, దేవుడికి నమస్కారం చేయడం, గుడికి వెళ్ళడం, అసలు శ్రీహరిని తలుచుకోవడం కూడా ఒక పెద్ద విశేషం గా భావిస్తారేమో...!! 
ఎవరి విశ్వాసం వారిది....ఎవరి ఆచరణ వారిది...ఎవరి సంప్రదాయం వారిది....ఎవరి మార్గం వారిది.....! ఏది ఎక్కువ కాదు...తక్కువ కాదు...దేని ప్రత్యేకత దానిదే...
ఒకే కాలనిలో ఉన్నవారందరు కలిసిమెలిసి ఒకే రోడ్డు పై నడిచి తమ తమ ఇళ్ళకు చేరుకున్నట్టుగా, ఒకే సమాజం లో ఉన్నవారందరు కలిసి మెలిసి కలహించుకోకుండా ఒకే సుహృద్భావంతో జీవించి వారి వారి మార్గాలను అనుసరించి పరతత్వ తీరాలకు చేరుకోవడమే అసలైన ఆధ్యాత్మికత అని నా ఫీలింగ్ అన్నమాట .. 

Tuesday, October 23, 2018

శ్రీకరమైన సద్గురుబోధల సారసంగ్రహం...! :)

శ్రీకరమైన సద్గురుబోధల సారసంగ్రహం...! 
"లోకో భిన్నరుచిః.... పుర్రెకోబుద్ధి జిహ్వకోరుచి.... "
అని మన పెద్దలు చెప్పినట్టు గా, సత్యలోకంలో బ్రహ్మ గారిచే గతజన్మల పాపపుణ్యవిశేషం చేత సంచయమైన సంచిత కర్మఫలాలను, ప్రారబ్ధం గా అనుభవింప జేయడానికై ఒక్కో జీవుడికి, తన పూర్వపు పూర్ణజన్మ ( సంపూర్ణ కర్మ స్వతంత్రత ఇవ్వబడిన, అనగా వెన్నుపాము నిటారుగా ఉండే ద్విపదులైన నరాది ఉన్నతమైన జన్మల ) లోని ఆఖరి ఘడియల్లో పంచేంద్రియ సంఘాతంతో కూడుకొనిఉన్న తన మనసు దేనిపై తీవ్రంగా లగ్నమై ఉండిపోయిందో, తద్ అనుగుణంగా కర్మాచరణచేయడానికి వీలైనరీతిలో అత్యంత గహనమైన కర్మసిద్ధాంత సూత్రబద్ధమైన జీవితానికి కావలసిన బీజ / క్షేత్రాన్ని ఎన్నుకునేలా, భువరాది షడూర్ధ్వలోకాల క్రింద ఉండే మేఘమండలానికి సూక్ష్మ రూపంలో పంపించబడిన జీవుడు, తండూలాన్ (బియ్యము), గోధుమ, ఇత్యాది వివిధ ధాన్య రాశి లోకి వర్షపు నీటిని ఆధారంగా చేసుకొని భూమండలంలోకి ప్రవేశించి, అది స్వీకరించబడి పచనమైన పురుషుని యొక్క వీర్యంలో ఒక జీవకణంగా మారి, అది నిక్షేపించబడిన ఒక స్త్రీ యోనిక్షేత్రం లోని మావిని ఆధారంగా/కవచంగా చేసుకొని, రమారమి 9 నెలలపాటు గర్భవాసం చేసి ఒక సంపూర్ణ మనుష్య శిశువుగా రూపాంతరం చెంది భువిపైకి అడుగుపెట్టడం తో, మళ్ళీ అదే కర్మ స్వతంత్రత కలిగిన జీవచట్రం లో ఒదిగి, అటు మోసుకొచ్చిన ప్రారబ్ధాన్ని అనుభవిస్తూ, ఇటు ఆగామిని కూడబెడుతూ, తన పాత సంచిత సరంజామాను (దీపావళి కి మార్వాడి కొట్టులో పాత లెక్కలన్ని కలుపుకొని ఇంకొక కొత్త పుస్తకం లో ఖాతా లెక్కలు ప్రారంభించినట్టు గా ) సరికొత్తగా సరి చేసుకుంటూ, తన అసంఖ్యాక జీవ ప్రస్థానంలోని ఇంకొక నవ జీవిత ప్రస్థానాన్ని కొనసాగించే మనుష్యుల జీవనశైలి ఎంత ఆశ్చర్యకరమో అంతే విచిత్రకరమూనూ...!
ఒక్కో కాలంలో ఒక్కోరకం పండు, ఒక్కోరకం పువ్వు, లభించడం ప్రకృతి యొక్క ధర్మం గా మనం చూస్తూనే ఉంటాం....
అదేవిధంగా ఈ విశాల భూమండలంపై ఒక్కొక్క ప్రదేశానికి ఒక్కొక్క ప్రత్యేకత ఉండడం, యెవ్వరు అవునన్నా కాదన్న అదే ప్రకృతి యొక్క ధర్మం / నియమం...
ఆ రీతిగ, బంగాలాఖాతం,హిందూమహాసముద్రం,అరేబియన్ సముద్రం 3 కలిసి తమ దోసిట్లో ఒడిసిపట్టుకున్నట్టుగా ఉన్న భూభాగమైన భరత ఖండానిది మిగతా అన్ని దేశాల లోకెల్ల ఎంతో ఉన్నతమైన, విశేషమైన ప్రాభవం.
అన్య దేశాల లాగా, ఇది కేవలంగా భోగ భూమి మాత్రమే కాదు...
ఇది వేద భూమి...కర్మ భూమి..జ్ఞ్యాన భూమి...యొగ భూమి....ధర్మ భూమి....ఇది యుగ యుగాల నాటిది...
ఏ దేశం లో లేని విధంగా ఇక్కడే మహత్తరమైన ఆలయాలు ఎందుకు ఉంటాయి...ఇక్కడే ఎందుకు ఇన్ని శాస్త్రాలు ఉంటాయి...ఇక్కడే ఎందుకు ఇన్ని సంప్రదాయాలు ఉంటాయి.... ఇక్కడే ఎందుకు గంగా యమునా సరస్వతి యొక్క త్రివేణి సంగమం ఉంటుంది... ఇక్కడే ఎందుకు వేద ఋక్కులను / సద్ గురువుల వాక్కులను / ప్రామాణ్యం గా స్వీకరంచి ఆచరించబడిన కర్మలకు నిర్దిష్ట ఫలితాలు లభిస్తాయి...ఇట్లాంటి వెర్రి వెంగలప్ప ప్రశ్నలను అడగడం మనం డబ్బులు పోసి ఆర్జించుకున్న / కొనుకున్న డిగ్రీల యొక్క గొప్పతనం గా భావిస్తే,
మరి ఎన్నెన్నో దశాబ్దాలు తపస్సును ఆచరించి, గురువులను సేవించి, యుక్తాహార విహర యమనియమ దమశమాది సంపత్తితో మహర్షులు / మునులు / యోగులు / ఆచార్యులు / సిద్ధ పురుషులు, తమకు మరియు ఈ భారతదేశానికి సముపార్జించి పెట్టబడిన సారస్వత / ఔషధ / సంప్రదాయ / సదాచార / యోగ ఇత్యాది వివిధ అమూల్య అమేయ సంపదను, మనకున్న లౌకిక పరిజ్ఞ్యానానికి అతీతంగా, ఉన్నతంగా, సర్వమానవ శ్రేయోదాయకంగా సదాచార సంపన్నులైన పెద్దలచే బోధింపబడుతున్నప్పుడు,
ఆ విద్వత్తును ఏహ్య భావం తో తూలనాడడం, కుటిల భావం తో కలుషితం చేయడం, కావరం తో కించపరచడం, చేసినప్పుడు దానివల్ల ప్రత్యక్ష పరోక్ష నష్టం ఎంతో మంది సజ్జనులకు కలుగుతుంది కాబట్టి, ఆ మహనీయుల ఆవేదన, రోదన, శాపం, తగిలి ఆ పాపం కట్టికుడిపినప్పుడు కాని అర్ధం కాదు, తేనెపట్టును అనవసరంగా సరదాకోసం కదిపి పక్కనే నిల్చొని ఆనందించాలనుకోవడం ఏ విధంగా ఉంటుందో అన్నది...!

ఒక్కోసారి ఒక్కోలా ఉండడం కాలం యొక్క ధర్మం... నాకు చలికాలం బాలేదు... ఎండా కాలమే కావాలి అంటే...కాల చక్రం లో భాగంగా అది వచ్చే వరకు వేచి ఉండాల్సిందే... నాకు ఈ కలియుగం బాగాలేదు... పూర్వపు ద్వాపర / త్రేతా / సత్య యుగాలే కావాలి అంటే, తుది మొదలు లేని సువిశాల కాల చక్రం లో అంతర్భాగంగా అవి వచ్చేంతరవకు వేచి ఉండాల్సిందే....
అల వేచి ఉండడం కుదరదు కాబట్టి, ఆ కాలానికి తగ్గట్టుగా ఉన్ని దుస్తులు, శ్వెటర్, సాక్స్, వార్మర్స్, ఇన్ హేలర్స్, మొదలైన వాటితో చలికాలం మొత్తం శరీరాన్ని సమ్రక్షించుకొని, వసంత ఋతువు లోని లేలేత చిగురుల మధ్యన మామిడి పూత పై చైత్ర మాసపు కోకిలగానం కోసం ఎదురు చూసినట్టుగా....
ఈ కలి యుగ ధర్మానికి తగ్గట్టుగా, జీవితాన్ని సమ్రక్షించుకొని, సద్గురువుల / ఆచార్యుల / భాగవతుల
బోధనలను కరదీపికలుగా చేసుకొని ఎవరి జీవితాలను వారు ఉద్ధరించుకోవడమే ఈ యుగ ధర్మం...!
హరినామస్మరణం / హరిగుణగానం / భక్త భాగవత సేవనం / ఇత్యాదులతో, భగవత్ అనుగ్రహాన్ని మెండుగా పొంది సంచితాన్ని సమూలంగా తుడిచేసే దిశగా చిత్తశుద్దితో కర్మాచరణను చేసి ఫలితాన్ని భగవద్ అర్పితం చేసి, పుణ్యపాపాలాకు అతీతంగా శాశ్వత శివసాయుజ్య / పరమపదసోపానాధిరోహణ / కైవల్యతీరం / దిశగా జీవితాన్ని మలుచుకునేలా, అందరికి ఉపయుక్తంగా ఉండేలా చూస్తారు సద్గురువులు వారి సద్బోధలను.... అవి ఏ మేరకు మనం మన జీవితంలో ఆపాదించుకొని శుభాన్ని పొందుతాము అన్నది వారి వారి స్వవిషయం..
టీ.వీ స్క్రీన్లోనుండి ఆ సద్గురువులు మన ఇంట్లోకి వచ్చి బలవంతంగా మనతో ఏమి అవి పాటింపచేయట్లేదు కదా... ఇలా చేయడం మీకు హితకరం అని మాత్రమే చెప్తారు వారు....
అలాంటప్పుడు పనికట్టుకొని వివిధ మాధ్యమాల్లో రచ్చబండలకెక్కి, వారు అలా ఏంటి చెప్పేది...ఇలా ఏంటి చెప్పేది... నాకైతే ఇదంతా సిల్లి, మన ఆధునికత ఎక్కడ, ఆ పురాణపోకడలెక్కడ, అంటూ వందల మందిని ఉద్దేశిస్తూ తీర్పులు చెప్పేయడం ఏ పాటి గొప్పతనం ...? అది వారి వారి జ్ఞ్యానలేమికి పరాకాష్ఠ కాకపోతే ఇంకోటి అవుతుందా...? సమాజానికి హితవు చెప్పే పెద్ద స్థాయిలో కూర్చున్నాము అనే ఇంగితం కూడా లేకుండా చిన్నతనం తో చీప్ కామెంట్స్ వేయడం ఎంత విచిత్రమో ..! పేరులో ఇద్దరు దేవుళ్ళను పెట్టుకోవడం గొప్ప కాదు... తీరు లో ఒక పెద్ద మనిషిలా ఉండలేకపోయినా, కనీసం ఒక సజ్జనుడిగా ప్రవర్తించగలగడం మీడియాలో లో షొస్ కి చీఫ్ గెస్ట్ గా పిలిచినందుకు, వందల మందిని ప్రభావితం చెయ్యగల ఆ కుర్చీకి ఇచ్చే గౌరవం.....!!
అది తెలియని నాడు సద్గురువుల వచనాలపై నా యొక్క అభిప్రాయం అంటూ మీ యొక్క శుష్కచార్వాకం ప్రజలకు బోధించడం కోరి ' కర్మ కొరివి ' తో తల గోక్కోవడమే...!!!

Monday, October 22, 2018

Punyaarjanam - Panchavidhaaneana....!

ముఖపుస్తక మిత్రులందరికి దీపావళి శుభాకాంక్షలు ..!! - 2014

ముఖపుస్తక మిత్రులందరికి దీపావళి శుభాకాంక్షలు ..!!
Telugu Page-తెలుగువిజ్ఞానంవినోదం is with C Chandra Mouly Reddy and 9 others.
పండుగ... మెదటి రోజు త్రయోదశి ని ధనత్రయోదశి పేరుతో, రెండవరోజు చతుర్దశిని నరక చతుర్దశి పేరుతో , మూడవరోజు అమావాస్యను దీపావళి పేరుతో, నాలుగవ రోజు పాడ్యమిని బలి పాడ్యమి పేరుతో జరుపుకుంటాము. అయితే వీటిలో ధన త్రయోదశిని గుజరాత్-ఉత్తరాది రాష్ట్రాలలో... బలి పాడ్యమి కేరళలో బాగా జరుపుకుంటారు.. ఈ రెండు పండుగల గురించి మన తెలుగు రాష్ట్రాల వారికి పెద్దగా తెలియదు...
దీపావళి రోజులలో మనం వెలిగించే ఈ దీపాలు మన పూర్వీకులకు మార్గ దర్శకాలుగా నిలుస్తాయని.. ఒక నమ్మకం... మనకు జన్మనిచ్చి మనమున్న స్థితికి కారణమయిన మన పెద్దలకు సంవత్సరంలో ఒక రోజు దీపం పెట్టడం మన కర్తవ్యం...
దీపావళి లక్ష్మీదేవికి అత్యంత ఇష్టమైన రోజు ఆ రోజు ఇల్లంతా దీపాలు పెట్టటం వలన లక్ష్మీ దేవికి ప్రీతి కలుగుతుంది... అందుకే దీపాలతో ఇంటిని అలంకరిస్తారు...
కాంతి అంటే జ్యేష్టా(దరిద్ర దేవత-లక్ష్మీ దేవి అక్క)దేవికి ఇష్టం ఉండదు.. అందుకే ఇంటిలో దేదీప్యమానంగా అలంకరించడం వలన ఒకేసారి లక్ష్మీదేవికి ఆహ్వానం... పెద్దమ్మకు వీడ్కోలు చెప్పినట్లవుతుంది...ఇంట్లో ఉన్న జ్యేష్టాదేవికి వీడ్కోలుగా మతాబులు కాలుస్తారు... పూర్వ కాలం ఢమఢమ ధ్వనులు చేసేవారట.. అదే క్రమంగా మతాబులు కాల్చే అలవాటుకు దారి తీసిందని ఒక కథనం...
మన పూర్వీకులు ప్రతి పండుగ ఒక ఋతువు ప్రారంభంలో లేదా ముగింపులో వచ్చేవిధంగా ప్లాన్ చేసారు... ఇప్పుడు మనం కార్తీక మాసంలో అడుగు పెడుతున్నాం... శీతల వాయువులను కలిగి ఎక్కువ బ్యాక్టీరియా ఉన్న వాతావరణానికి ఈ మతాబుల నుండి వచ్చే పొగ దాదాపు దోమలను.. ఇతర క్రిమి కీటకాలను సంహరించేది.. మతాబుల కాల్పులకు ఇది కూడా ఒక కారణమని ఒక కథనం....
ఇక పురాణ వివరాలకు వస్తే...
ఈ రోజే శ్రీరాముల వారు రావణసంహారానంతరము అయోధ్యకు తిరిగి వచ్చి భరతునితో సమావేశ మయ్యే (భరత్ మిలాప్) సందర్భం...
శ్రీకృష్ణుడు నరకాసురిని వధించిన రోజు...
వామనుడు... బలిచక్రవర్తిని పాతాళానికి అణచిన రోజు...
విక్రమార్కచక్రవర్తి పట్టాభిషేకము జరిగిన రోజు
ఇన్ని విశేషాలున్నాయి కాబట్టి.. ఈ రోజు మనకు అత్యంత పవిత్రమైనది... ఈ రోజు ఇంట్లో దీపం పెట్టడం అత్యంత శ్రేయస్కరం... కనీసం ఒక్క మతాబు అయినా కాల్చటం.. మన దరిద్రానికి మనం చెప్పే వీడ్కోలు...
పైన తెలిపిన ఏ విషయాలు కూడా శాస్త్రీయ ఋజువులు-- ఆధారాలు చూపించనవసరం లేదు.... ఇష్టమైన వారు పాటించవచ్చు... కుహనా వాదుల విమర్శలతో పనిలేదు...
తక్కువ ఖర్చు పెట్టండి... చుట్టూ ఉన్న సమాజాన్ని ఆదరించండి... పండుగలూ జరుపుకోండి.. తప్పు లేదు... అనవసర ప్రచారాలను నమ్మి జీవితంలో వేటినీ కోల్పోకండి... కలర్ లెస్ హోళీ/విగ్రహాలు లేకుండా వినాయకచవితి/ మతాబులు లేకుండా దీపావళీ చేసుకోలేం...
మిత్రులు, శ్రేయోభిలాషులందరికీ దీపావళి శుభాకాంక్షలు!!

చక్రిచింత లేని జన్మంబు జన్మమే?

నాడు ప్రహ్లాదుడు తన తండ్రితో జరిపిన సంవాదం..! బమ్మెర పోతనామాత్యులు మనదైన తెలుగు లో అందించిన ఈ శ్రీమద్భాగవత పద్యరత్నాల్లో కనీసం ఒక్క పద్యం అయిన మన మదిలో ఉన్ననాడు , ఆ ఈశ్వరుడు సదా మన ఎదలోనే ఉన్నాడన్న నిజం ఎరుకలోకి వస్తుంది !
ఈ పద్యాలు వరుసగా కనీసం ఒకసారిచదివిన చాలు, అల నాడు రాయలవారు ఎందుకు ' దేశ భాషలందు తెలుగు లెస్స ' అన్నారో ఇట్టె అర్ధమవును...! తెలుగు జాతి మనది నిండుగ వెలుగు జాతి మనది..!! వీలైనంత వరకు తెలుగు వారము తెలుగులోనే మాట్లాడుదాం..
----------------------------------------------------------------------------------------
మానవ శరీరములోని వివిధ భాగాలు దైవభక్తి లేక ఎలా వృధా పోతున్నాయో చెపుతున్న వైనం:
కమలాక్షు నర్చించు కరములు కరములు శ్రీనాథు వర్ణించు జిహ్వ జిహ్వ
సురరక్షకుడు జూచు చూడ్కులు చూడ్కులు శేషశాయికి మ్రొక్కు శిరము శిరము
విష్ణు నాకర్ణించు వీనులు వీనులు మధువైరి దవిలిన మనము మనము
భగవంతు వలగొను పదములు పదములు పురుషోత్తముని మీది బుద్ధి బుద్ధి
దేవదేవుని జింతించు దినము దినము
చక్రహస్తుని బ్రకటించు చదువు చదువు
కుంభినీధవు జెప్పెడి గురుడు గురుడు
దండ్రి ! హరి జేరు మనియెడి తండ్రి తండ్రి.
కంజాక్షునకు గాని కాయంబు కాయమే? పవన గుంభిత చర్మభస్త్రి గాక
వైకుంఠు బొగడని వక్త్రంబు వక్త్రమే? ఢమఢమ ధనితోడి ఢక్క గాక
హరిపూజనము లేని హస్తంబు హస్తమే? తరుశాఖ నిర్మిత దర్వి గాక
కమలేశు జూడని కన్నులు కన్నులే? తను కుడ్య జాల రంధ్రములు గాక
చక్రిచింత లేని జన్మంబు జన్మమే?
తరళ సలిల బుద్భుదంబు గాక
విష్ణుభక్తి లేని విబుధుండు విబుధుడే?
పాదయుగము తోడి పశువు గాక.
చివరగా హరి ఎక్కడున్నాడని ప్రశ్నించినప్పుడు ప్రహ్లాదుడిచ్చిన సమాధానం:
కల డంభోధి గలండు గాలి గల డాకాశంబునం గుంభినిన్
గల డాగ్నిన్ దిశలం బగళ్ళ నిశలన్ ఖద్యోత చంద్రాత్మలన్
గల డోంకారమునం ద్రిమూర్తుల ద్రిలింగ వ్యక్తులం దంతటన్
గల డీశుండు గలండు దండ్రి ! వెదకంగా నేల యీ యా యెడన్.
ఇందు గల డందు లే డని, సమ్దేహము వలదు చక్రి సర్వోపగతుం
డెం దెందు వెదకి చూచిన, నం దందే గలడు దానవాగ్రణి! వింటే.