శ్రీ చాగంటి సద్గురువుల సద్బోధామృతం.....
గత దశాబ్ద కాలంగా కొన్ని కోట్ల మంది ఆస్తికజనుల జీవితాలకు వెలకట్టలేని ఆస్తిగా కొలువయ్యింది ఆ వాక్కు అనేది జగద్విదితమే...
గత దశాబ్ద కాలంగా కొన్ని కోట్ల మంది ఆస్తికజనుల జీవితాలకు వెలకట్టలేని ఆస్తిగా కొలువయ్యింది ఆ వాక్కు అనేది జగద్విదితమే...
దైహికంగా వారు ఒక సామాన్య శరీరం ఉన్న మానవులలా తిరుగాడుతున్నప్పటికీ, వారి సద్వాక్కులను ఉపాసన చేసే వారికి వారు ఎల్లప్పుడూ భగవత్ స్వరూపమై శిష్యులకు వాగ్దిక్సూచియై సహాయం చేయడం ఎందరెందరికో జీవితస్వానుభవము...
దేవ పారిజాతం లాంటి ఒక గొప్ప పువ్వు యొక్క వైభవం, ఆ పువ్వుకి సంబంధించిన విషయపరిజ్ఞ్యానం ఉన్నవారికి మాత్రమే తెలిసిఉండవచ్చు.కాని ఆ పువ్వులోని సౌరభం మాత్రం, అది కొలువైన చోట ఉన్నవారందరికి ఆనందాన్ని తన్మయత్వాన్ని ఆహ్లాదాన్ని కలిగిస్తుంది...
అది ఎవ్వరికైనా సరే.... ఆ పువ్వు గొప్పతనం గురించి ఏ మాత్రం అవగాహన లేని సామాన్యులకు సైతం..!
అది ఎవ్వరికైనా సరే.... ఆ పువ్వు గొప్పతనం గురించి ఏ మాత్రం అవగాహన లేని సామాన్యులకు సైతం..!
అదే విధంగా ఒక సద్గురువు యొక్క వాక్యం ఎక్కడ ఆలకించబడి ఆరాధించబడుతుందో అక్కడ సకల శుభాలకు ఆటపట్టైన సకల దేవతానుగ్రహం నిత్యం వర్షించబడుతుంది అన్నది అంతే సత్యం....!
కొందరికి ఇది ఒకింత ఆశ్చర్యంగా విడ్డూరంగా అనిపించవచ్చు... కాని ఒక చిన్న ఉదాహరణ చూస్తే బాగా అర్ధమవుతుంది...
శ్రీమద్రామాయణభారతభాగవతాది గ్రంధములు మనంకూడా కొనుక్కొని అందులోని శ్లోకాలు వల్లెవేసినంత మాత్రాన అది సద్గురువుల బోధకు సమానం అవుతుందా అంటే ఒక్కనాటికి కానేరదు.
శంఖం లో పోస్తేనే తీర్థమన్నట్టుగా....
ఒక సద్గురువుల ద్వార నుడువబడినప్పుడు మాత్రమే ఆ వాక్కుకి అమేయమైన వాగ్ శక్తి సమకూరి అది ఆలకించబడిన వ్యక్తికి, ప్రాంతానికి , పరిసరాలకి ఆ దైవ శక్తి యొక్క అనుగ్రహప్రసరణ జరిగి వారి వారి జీవితాలను సర్వతోముఖాభివృద్ధితో సుసంపన్నంగావించడం అనే యోగక్షేమములు సమకూరేది...
మన ఇంట్లోనే ఒక మాస్క్, లైట్, ఆప్రన్, సిసర్,
కాటన్, ఇట్లాంటి వైద్య పరికరాలు అన్నీ ఉన్నాయి కదా అని మన వారికి మనమే దంత చికిత్స చేయడానికి.....
కాటన్, ఇట్లాంటి వైద్య పరికరాలు అన్నీ ఉన్నాయి కదా అని మన వారికి మనమే దంత చికిత్స చేయడానికి.....
మరియు
ఒక నిష్ణాతుడైన వైద్యుడి దెగ్గరికి వెళ్ళి అవే పరికరాలతో దంతచికిత్స సరైనవిధంగా చేయించుకోడానికి ఎంత భేదం ఉందో...
మనకు తెలిసిన ఒ నాల్గు శ్లోకాలు స్తోత్రాలు చదివేసి దైవం యొక్క అనుగ్రహం వర్షించేయాలి అనుకోవడానికి....
మరియు
నిష్ణాతులైన సద్గురువుల దెగ్గర అవి విని పొందే దైవానుగ్రహానికి కూడా అంతే భేదం...!!
కొందరు అది కేవలం ఒక 3 రంగులతో ఉన్న బట్ట ముక్క అనుకొని సామాన్యంగా భావించడానికి,
ఇంకొందరు అది ఈ దేశ సార్వభౌమ అధికారానికి చిహ్నం గా ఉన్న జాతీయపతాకం అని భావించి నమస్కరించడానికి ఉన్న భేదం లా..
ఇంకొందరు అది ఈ దేశ సార్వభౌమ అధికారానికి చిహ్నం గా ఉన్న జాతీయపతాకం అని భావించి నమస్కరించడానికి ఉన్న భేదం లా..
సద్గురువులు చెప్పేది ఏవో నాలుగు శ్లోకాల అర్ధతాత్పర్యాలు అని సామాన్యంగా కొందరు భావించడానికి....
ఇంకొందరు, అది సాక్షాత్ పరతత్వ ప్రామాణ్యాన్ని మనలోనే స్థిరీకరించే బ్రహ్మవిద్యా వర్షితమైన సద్వాక్కు అని భావించి నమస్కరించడానికి కూడా అంతే భేదం...!!!
😊
ఇంకొందరు, అది సాక్షాత్ పరతత్వ ప్రామాణ్యాన్ని మనలోనే స్థిరీకరించే బ్రహ్మవిద్యా వర్షితమైన సద్వాక్కు అని భావించి నమస్కరించడానికి కూడా అంతే భేదం...!!!
![](https://static.xx.fbcdn.net/images/emoji.php/v9/f7f/1/16/1f60a.png)
యద్ భావం.... తద్ భవతి....!
😊
![](https://static.xx.fbcdn.net/images/emoji.php/v9/f7f/1/16/1f60a.png)
నగురోరధికం..... నగురోరధికం..!
నమో నమః శ్రీగురుపాదుకాభ్యాం...!!
🙏
నమో నమః శ్రీగురుపాదుకాభ్యాం...!!
![](https://static.xx.fbcdn.net/images/emoji.php/v9/f80/1/16/1f64f.png)
No comments:
Post a Comment