శ్రీ సుబ్రహ్మణ్య షష్టి / స్కంద షష్టి / కుమార వైభవం... ![](https://static.xx.fbcdn.net/images/emoji.php/v9/t4c/1/16/1f642.png)
![](https://static.xx.fbcdn.net/images/emoji.php/v9/t4c/1/16/1f642.png)
కుమారస్వామి, సుబ్రహ్మణ్యుడు, షణ్ముఖుడు, శరవణుడు, మురుగన్, కార్తికేయుడు, ఇత్యాది ఎన్నెన్నో నామాలతో లోకమంతా, మరీ ముఖ్యంగా దక్షిణభారతదేశం లో ఎందరో భక్తులచేత ఆరాధించబడే అపురూప దైవం శ్రీ సుబ్రహ్మణ్య స్వామి.
బ్రహ్మశ్రీ చాగంటి సద్గురువుల వివిధ ప్రవచనాంతర్భాగంగా అందరూ స్వామి వారి వైభవం గురించి ఎన్నెన్నో విషయాలు వినే ఉంటారు. నిన్న స్కంద షష్టి నైమిత్తిక తిథి కావడం చేత, స్కందగిరి లోని శ్రీకంచికామకోటి పీఠం వారి ఆధ్వర్యంలోని స్వామి వారి ఆలయానికి వెళ్ళగా, అక్కడున్న టీ.వీ స్క్రీన్ పై గురువుగారి ప్రవచనం కనపడేసరికి నమస్కరిద్దామని తలవంచేసరికి ఆశ్చరంగా ఆ వెనకే గురువుగారు వేదికపై స్వామి పక్కనే ఉండడం చూసి, ఆహా ఇది కదా సౌభాగ్యం అంటే, మార్గశిర స్కంద షష్టి నాటి గురువారపు రోజు స్వామి దర్శనానికి వెళ్ళగా అక్కడే ప్రత్యక్షంగా గురుదర్శనం కూడా సంప్రాప్తించడం, అని సంతసించడంతో ఇక అనందానికి అవధెక్కడుంటుంది...![](https://static.xx.fbcdn.net/images/emoji.php/v9/t4c/1/16/1f642.png)
![](https://static.xx.fbcdn.net/images/emoji.php/v9/t4c/1/16/1f642.png)
ఒక వైపు గుడిలో విభూతిలేపనంతో ఎంతో రమణీయంగా అలంకరించబడిన వల్లీ దేవసేనా సమేత కుమార స్వామి ధృవమూర్తి, మరో వైపు జయదుర్గా అమ్మవారి సన్నిధి దెగ్గర ఏర్పాటు చేసిన అభిషేక/హోమ వేదికపై తన ఇరుదేవేరులతో స్వామివారు ఉత్సవమూర్తిగా కొలువై ఉండడం. ఈ ఇద్దరి మధ్యలో ప్రత్యక్షంగా ఆసీనులై ఉన్న, పోతపోసుకున్న కౌమారసదాచార సంపన్నులు, రాశీభూతమైన సుబ్రహ్మణ్యస్వరూపులే శ్రీ చాగంటి సద్గురువులు.
ఎందరో ఆధ్యాత్మ సద్గురువులున్నపటికీ, శ్రీ చాగంటి సద్గురువులను మాత్రమే ఇలా అభివర్ణించడానికి నాకు కొన్ని ప్రత్యేక కారణాలు ఉన్నాయి.
కొన్ని వేలమంది అభ్యసించింది అదే MBBS / FRCS వైద్యవిద్య అయినప్పటికీ మనం గమనించగలిగితే, నిరంతరం జనప్రవాహం తో ఉండే ఒక్కొక్క ఆరితేరిన వైద్యుడి దెగ్గరికి వచ్చిన ఎటువంటి రోగికైనా, ఎంతటి తీవ్రరోగమైనా, ఎంతో కఠినమైన శస్త్రచికిత్స అయినా, అది సంపూర్ణంగా ఫలించి, "ఫలానా వైద్యుడి/వైద్యురాలి గారి దెగ్గరికెళ్తే ఇక ఆ మనిషికి తిరుగులేని ఆరోగ్యం సమకూరడం ఖచ్చితమండి....వారి హస్తవాసి అటువంటిది మరి...ఎన్ని జన్మల పుణ్యమో ఆ మహానుభావులది... మానససేవే మాధవ సేవగా భావించి, అధిక లాభానికి ఆశపడకుండా, వృత్తిని దైవానుగ్రహంగా, దైవకార్యంగా భావించి, ' వైద్యో నారాయణో హరిః ' అనే నానుడిని 100 కి 100 పాళ్ళు నిజం చేసే వ్యక్తి వారు.... " అని అనడం అప్పుడప్పుడు చూస్తుంటాం...
ఇది ఏ సైన్స్ కి అందని అంశం...., భగవంతుని సంపూర్ణ అనుగ్రహం, జన్మజన్మల పుణ్యబలం, హృదయంలోని స్వచ్ఛత, పరిశుద్ధ జీవితం, సర్వేజనాః సుఖినోభవంతు లోకాసమస్తాః సన్మంగళానిభవంతు....అనే రీతిలో ఉండే వారి జీవితమే ఆ ప్రత్యేక దైవానుగ్రహానికి కారణమై వారి జీవితాలు అలా నిరంతరం అందరికి సుఖశాంతిపరిమళాలు వెదజల్లే దైవపారిజతాలై పరిఢవిల్లుతాయి....!
అదేవిధంగా, అన్ని విద్యలకు ఆదివిద్య/మూలవిద్య అయిన అధ్యాత్మవిద్య / ఆత్మవిద్య, అలాంటి పరిశుద్ధ జ్ఞ్యానబలం/ఆత్మబలం గల సద్గురువుల రసాంకురములందు అమేయశారదానుగ్రహంగా కొలువై వాగ్ సురగంగలా నిరంతరం ప్రవహిస్తూ, సకల శుభాలను వారి అనుగ్రహంగా ప్రభవించేలా చేస్తుంది... అది కేవల పుస్తకాలకు, పద్యగద్యస్తోత్రాది పఠనకు, ఇత్యాది లౌకిక అక్షరసంచయమైన సారస్వతానికి మాత్రమే సంబంధించినది కాకుండా, ' గురు శిష్యులు ' అనే ఇరు జీవుల మధ్య పెనవేసుకున్న ఆత్మసంబంధం గా సాగే ఒక అలౌకిక సంభాషణ.
ఈ మధ్య ఒకరోజు ఆంధ్రజ్యోతి పేపర్ లోని ఒక ఆర్టికల్ లో చదివా, రిమోట్లి ఆపరేటెడ్ రోబోటిక్ ఆర్మ్ తో ఒక వెటెరన్ కార్డియాలజిస్ట్ ఎక్కడో కిలోమీటర్ల దూరంలో ఉన్న వైద్యశాలలోని ఒక గుండెజబ్బున్న పేషెంట్ కి అత్యంత గహనమైన సర్జికల్ ప్రొసీజర్ విజయవంతంగా పూర్తి చేసి స్వస్థత కలిగించి వైద్యశాస్త్రంలో సరికొత్త పుంతలుతొక్కేలా అడ్వాన్సెడ్ మెడికల్ ఇంజినీరింగ్ ని వాడుకలోకి తీసుకురావడాన్ని....
లౌకికం గానే శరీర పోషణ విద్యలో ఇంత అభివృద్ధి సాధించగలిగితే, మరి సనాతనంగా ఎందరో మహర్షులు, యోగులు, మనకు అందించిన ఆధ్యాత్మవిద్యా లోతుపాతులను అందుకొని ఆరితేరిన సద్గురువులు అలా శిష్యులు ఎంత దూరంలో ఉన్నాసరే వారికి మనోసంకల్పంతోనే సకల ఈప్సితములు ఈడేర్చి శుభములను అనుగ్రహించగలరు, అని నమ్మడం కూడా అంతే సహజం కదా...
ఒకనాడు కేవలం తండ్రికి మాత్రమే ప్రణవరహస్యాన్ని ఉపదేశించి ' శివగురు ' గా పేర్గాంచింది స్కందుడైతె,
ఆ తరువాత కేరళ రాజ్యంలో శ్రీ శివగురు / ఆర్యాంబలకు శ్రీ శంకరులుగా అవతరించిన ఆ భోళాశంకరుడే, ఆసేతుహిమాచలపర్యంతం భారతదేశమంతా శ్రీ ఆది శంకరాచార్యులుగా పర్యటించి, వైదిక ధర్మాన్ని దృఢంగా పునర్ వ్యవస్థీకరించి, ప్రత్యక్ష శిష్యులుగా శ్రీ సురేశ్వర, హస్తామలక, పద్మపాద, గౌడపాదులతో కలిసి ఎందరెందరికో ఆ ప్రణవరహస్యాన్ని తమ ఆధ్యాత్మ బోధాంతర్గతంగా ఉపదేశించి తరింపజేస్తే,
ఆ తరువాత కేరళ రాజ్యంలో శ్రీ శివగురు / ఆర్యాంబలకు శ్రీ శంకరులుగా అవతరించిన ఆ భోళాశంకరుడే, ఆసేతుహిమాచలపర్యంతం భారతదేశమంతా శ్రీ ఆది శంకరాచార్యులుగా పర్యటించి, వైదిక ధర్మాన్ని దృఢంగా పునర్ వ్యవస్థీకరించి, ప్రత్యక్ష శిష్యులుగా శ్రీ సురేశ్వర, హస్తామలక, పద్మపాద, గౌడపాదులతో కలిసి ఎందరెందరికో ఆ ప్రణవరహస్యాన్ని తమ ఆధ్యాత్మ బోధాంతర్గతంగా ఉపదేశించి తరింపజేస్తే,
ఈనాడు ఆర్తితో, భక్తితో, నమస్కరించిన కోట్లమంది శిష్యులకు ఆ ప్రణవరహస్యాన్ని తమ ఆధ్యాత్మ ప్రవచనాంతర్గత అనుగ్రహంగా శిష్యుల పంచకోశాల ఆంతరమునందు శాశ్వతంగా కొలువయ్యే విధంగా బోధించే శ్రీ చాగంటి సద్గురువులు కూడా ఈ నవయుగపు శివగురువులే కదా...! ![](https://static.xx.fbcdn.net/images/emoji.php/v9/t4c/1/16/1f642.png)
![](https://static.xx.fbcdn.net/images/emoji.php/v9/t4c/1/16/1f642.png)
కుక్కే లోని కుమారధార నదీ జలాలకు / మరియు తిరుమల పై కొలువైన కుమారధార తీర్థ జలాలకు, సుబ్రహ్మణ్య స్వామి వారి వేలాయుధంలోని శక్తి ప్రత్యక్షంగా నిక్షిప్తం గావించబడిందని పెద్దల ఉవాచ..అందుకే ఆ రెండూ తీర్థజలరాశులు కూడా చర్మ సంబంధమైన సమస్యలను హరించడంలో చాలా మహిమోపేతమైనవని అంటారు...
మరీ ముఖ్యంగా కుక్కే లోని కుమారధార నదీ జలాలు ఎంత స్వఛ్ఛమైనవి / దివ్యౌషధగుణపూరితమైనవంటే, అసలు ఆ నీటి అడుగున చిన్న గుండుసూది ఉన్నా సరే ఎంతో సుస్పష్టంగా కనిపిస్తుంది. అక్కడ భక్తులు వేసే పేలాలు/పంచకజ్జాయం ఇత్యాది వాటిని తినడానికి గుంపులుగుంపులుగా తుళ్ళిపడే మీనములు ఎన్నో ఉన్నాసరే, ఆ జలప్రవాహం అంత స్వఛ్ఛంగా ఎలా ఉంటుందో ఏమో, ఆ అడవిలో తారకాసురున్ని సంహరించి పశ్చిమకనుమల కొండలపై విశ్రాంతి తీసుకుంటున్న ఆ కుమారస్వామికి, ఆ నీటి పరిసరాల్లో ఆ అడివిలో మాత్రమే లభించే విచిత్ర ( హెగ్సాగోనల్ స్టోన్స్ ) షట్కోణాకార రాళ్ళకే ఎరుక మరి...!
తిరుమల కొండపైగల కుమారధార తీర్థం దెగ్గర స్కందుని తపస్సుకు మెచ్చిన శ్రీవేంకటేశ్వర స్వామివారిని కీర్తిస్తు, అన్నమార్యులవారు ఒక కీర్తనలో, " కేకివాహనవరదా కేశవ..." అని స్వామివారిని సంబోధించడం ముదావహం... ![](https://static.xx.fbcdn.net/images/emoji.php/v9/t4c/1/16/1f642.png)
![](https://static.xx.fbcdn.net/images/emoji.php/v9/t4c/1/16/1f642.png)
( కర్ణాటక లోని కుక్కే, కృష్ణా జిల్లాలోని మోపిదేవి క్షేత్రాల్లో స్వామి ప్రసాదించిన దర్శనం మరియు కొన్ని సంవత్సరాల క్రితం శ్రీనగర్ కాలనిలోని సత్యసాయి నిగమాగమం లో గురువుగారి ఆధ్వర్యంలో జరిగిన శ్రీ వల్లీ-దేవసేనా కుమారస్వామి కళ్యాణం తరువాత, మళ్ళీ ఇన్ని రోజులకు, స్థలవైశిష్ట్యం , వేదస్వరశుద్ధి, ఆచారశుద్ధి, పూజాకైంకర్య ద్రవ్యశుద్ధి, పర్వ తిథి ప్రత్యేకత, ఇన్నిటి శుభ కలయికలతో కూడిన అమోఘమైన మహాన్యాసపూర్వక అభిషేక/హోమ/అలంకారం తర్వాత, స్కందగిరి లోని శ్రీ వల్లీ దేవసేనా సమేత, వేలాయుధ/శక్త్యాయుధ - కుక్కుటధ్వజ ధర కుమారస్వామి వారి శోభాయమానమైన ఉత్సవ మూర్తి యొక్క పిక్.
)
![](https://static.xx.fbcdn.net/images/emoji.php/v9/t4c/1/16/1f642.png)
No comments:
Post a Comment